ఏలియన్స్‌ ఉన్నట్లా? లేనట్లా?.. ఇంతకీ మస్క్‌ ఏమన్నారంటే? | Elon Musk claims aliens have never visited Earth | Sakshi
Sakshi News home page

ఏలియన్స్‌ ఉన్నట్లా? లేనట్లా?.. ఇంతకీ మస్క్‌ ఏమన్నారంటే?

Published Fri, May 17 2024 3:36 PM | Last Updated on Fri, May 17 2024 4:33 PM

Elon Musk claims aliens have never visited Earth

ఏలియన్స్‌.. ఎప్పుడైనా.. ఎవరికైనా ఇంట్రెస్ట్‌ కలిగించే టాపిక్‌. ఎలియన్స్‌ ఉన్నాయా..? లేవా అనేది ఎప్పటికీ తేలని ప్రశ్నే..! అయితే.. ఇప్పుడు ఇదే విషయంపై స్పందించారు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌. ఎలియన్స్‌ లేవని తేల్చేశారు. 



ఏలియన్స్‌ నిజంగానే ఉన్నాయా..? అవి భూమ్మిదకు వచ్చాయా..? అప్పుడప్పుడు ఆకాశంలో కనిపించే UFOలు ఏలియన్స్‌వేనా..? ఇవి ప్రశ్నలు కాదు..! కొన్ని దశాబ్దాలుగా అందరినీ వేధిస్తున్న అనుమానాలు..! ఏలియన్స్‌ ఉన్నాయని.. మనుషులతో కాంటాక్ట్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయని.. ఏదో ఒక సమయంలో కచ్చితంగా భూమిపైకి వస్తాయని నమ్మేవారు కొందరైతే.. అసలు ఏలియన్సే లేవని ఈజీగా కొట్టిపారేసేవారు మరికొందరు. ఇప్పుడు ఈ సెకండ్‌ లిస్ట్‌లోకి యాడ్‌ అయ్యారు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌. ఏలియన్స్‌ ఉన్నాయనేందుకు అసలు ఆధారాలే లేవని తేల్చిపారేశారు.



ఎలాన్‌ మస్క్‌..! ఈ జనరేషన్‌కు పరిచయం అవసరం లేని పేరు..! తన మాటలు.. తన చేతలు.. తన ప్రయోగాలు.. అన్ని సెన్సేషనే..! ఎప్పుడూ వార్తల్లో ఉండే ఎలాన్‌ మస్క్‌.. కొత్త ప్రయోగాలు చేస్తూ.. కొత్త కొత్త టెక్నాలజీలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్టును చేపడుతూనే ఉంటారు. ఈ టెక్నాలజీలో కచ్చితంగా తన మార్క్‌ను చూపించిన ఘనత ఎలాన్‌ మస్క్‌కే దక్కింది. టెస్లా పేరుతో తయారు చేసిన కార్లు ఎంత పెద్ద హిట్టో.. మనిషి బ్రెయిన్‌లో చిప్‌ పెట్టేందుకు చేసిన ప్రయోగమూ అంతే సెన్సేషన్‌గా నిలిచింది. ఇదొక్కటే కాదు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..! స్పేస్‌ ఎక్స్‌ పేరుతో శాటిలైట్‌లు లాంచ్‌ చేసినా.. సోషల్‌ మీడియా సెన్సేషన్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేసి ఎక్స్‌ అని పేరు మార్చినా అది.. ఎలాన్‌ మస్క్‌కే సాధ్యం.



అలాంటి ఇలాన్‌ మస్క్‌.. ఏలియన్స్‌ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతున్నాయి.. ఏలియన్స్‌ లేవని మస్క్‌ తేల్చిపారేశారు. ఏలియన్స్‌ ఉనికిపై తనకు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. HOW TO SAVE THE HUMANS పేరుతో జరిగిన డిబేట్‌లో పాల్గొన్న మస్క్‌.. ఏలియన్స్‌ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏలియన్స్‌ అనే జీవులు ఏవీ భూమిపై కాలు పెట్టలేదని తేల్చేశారు. కక్షలో స్పేస్‌ ఎక్స్‌కు చెందిన వేలాది బ్రాడ్‌ బ్యాండ్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌లు ఉన్నాయని.. కానీ ఎప్పుడూ ఏలియన్స్‌ ఉనికి కనిపించలేదని తన వాదనలు వినిపించారు. అయితే.. ఎవరైనా ఆధారాలు చూపిస్తే మాత్రం ఏలియన్స్‌పై ప్రయోగాలు చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. అయితే.. ఆషామాషీగా కాకుండా.. సీరియస్‌ ఆధారాలతోనే రావాలని చెప్పారు. కానీ.. ఎవరూ అలాంటి ఆధారాలు తీసుకురాలేరని.. ఏలియన్స్‌ ఉనికే లేదని చెప్పేశారు.

మరి నిజంగానే ఏలియన్స్‌ లేవా..? లేక మనషులకు దూరంగా ఉన్నాయా..? ఏలియన్స్‌ ఉంటే.. ఎప్పటికైనా భూమిపైకి వచ్చి మనుషులకు కనిపిస్తాయా..? ఎలన్‌ మస్క్‌ అవన్నీ ఉత్తమాటలే అని కొట్టిపారేసినా మిలియన్‌ డాలర్‌ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement