ఏలియన్స్తో జాగ్రత్త!
లండన్: గ్రహాంతర వాసులతో జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. భూమిపై మనం ఉన్న సంగతి వారికి తెలియజెప్పడం ప్రమాదకరమని ఆయన అన్నారు. గ్రహాంతరవాసులు సాంకేతికత పరంగా మన కన్నా ఎంతో ముందుండొచ్చని అభిప్రాయపడ్డారు.
1490ల్లో క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికాను కనుగొన్నప్పుడు, అక్కడి స్థానిక ప్రజలకు ఏం జరిగిందో.. అలాంటి పరిస్థితే మనకూ రావచ్చన్నారు. ఈ విషయాన్ని ‘స్టీఫెన్ హాకింగ్స్ ఫేవరెట్ ప్లేసెస్’ అనే ఆన్‌లైన్ చిత్రంలో వివరించారు. గ్రహాంతర వాసులు సాంకేతికతలో మనకన్నా వందల కోట్ల సంవత్సరాల ముందు ఉండి... మనం సూక్ష్మజీవులకు ఇచ్చినంత ప్రాధాన్యం కూడా వారు మనకు ఇవ్వకపోవచ్చని పేర్కొన్నారు.