బీజింగ్: భూగోళం 600 ఏళ్లలోపే అగ్నిగోళంలా, నిప్పుల బంతిగా మారుతుందని ప్రముఖ భౌతికశాస్ర్తవేత స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. పెరుగుతున్న జనాభా, విచ్చలవిడి విద్యుత్ వినియోగంతో మానవజాతి భూమిమీద అంతరించిపోతుందని చెప్పారు. మానవ జాతి సజీవంగా మిగలాలంటే జనం మరో గ్రహానికి వెళ్లక తప్పదని స్పష్టం చేశారు. బీజింగ్‌లో జరుగతున్న టెన్సెంట్ ప్రపంచ ఇంధన సదస్సులో వీడియా కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సౌర వ్యవస్థకు వెలుపలి మండలానికి దగ్గరగా ఉన్న నక్షత్రానికి జీవజాతులు తరలేలా ఇన్వెస్టర్లు చొరవ చూపాలని హాకింగ్ కోరినట్టు ది సన్ పత్రిక వెల్లడించింది. అల్ఫా సెంటారి అనే నక్షత్రంలో భూమి మాదిరిగానే జీవజాలం మనుగడ సాగించవచ్చని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. రెండు దశాబ్ధాల్లో చిన్న ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా కాంతి వేగంతో ఈ వ్యవస్థలోకి వెళ్లవచ్చని హాకింగ్ చెబుతున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మానవ జాతిని మింగేస్తుందని హాకింగ్ ఇప్పటికే మానవాళిని హెచ్చరించారు. కృత్రిమ మేథతో మానవ మనుగడ ప్రమాదంలో పడుతుందని ఆయన వివిధ వేదికలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment