మెల్‌బోర్న్: మన సౌరవ్యవస్థలో జీవజాలాన్ని మోస్తున్న గ్రహం ఏదైనా ఉందంటే అది భూమి ఒక్కటే. అయితే ఈ జీవజాలమే భూ భవిష్యత్తుకు పెను ప్రమాదంగా మారిందని.. భూమిని రక్షించడానికి గల సమయం కూడా తరిగిపోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 25 ఏళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నోబెల్ గ్రహీతలు భూమికి మొదటిసారి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తూ ఒక లేఖ విడుదల చేశారు.
ప్రస్తుతం ప్రపంచంలోని 184 దేశాలకు చెందిన 15 వేల మందికిపైగా శాస్త్రవేత్తలు మానవులను హెచ్చరిస్తూ.. భూమికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తూ రాసిన లేఖపై సంతకాలు చేశారు. భూమికి సంబంధించి మొత్తం తొమ్మిది అంశాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయగా.. కేవలం ఒక్క ఓజోన్ పొర అంశంలో మాత్రమే మెరుగైన స్థాయిలో ఉందని గుర్తించారు. ఇప్పటికైనా భూమిని రక్షించాలంటే మాంసాహారం లేని ఆహార నియమాలు పాటించటం, జనాభా నియంత్రణ, పునరుత్పాదక ఇంధన వాడకం వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment