
స్టీఫెన్ హాకింగ్
న్యూయార్క్: ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ సోషల్ మీడియా ఫేస్బుక్ అకౌంట్కు అద్వితీయ స్పందన లభించింది. ఆయన ఇటీవలే ఫేస్బుక్లో తన ఖాతా తెరిచారు. ఈ సందర్భంగా తన అభిమానులంతా ఆసక్తితో, ఉత్సాహంతో ఉండాలని హాకింగ్ సూచించారు.
''విశ్వం ఎలా ఏర్పడిందనే విషయం నన్ను మొదటి నుంచీ అమితాశ్చర్యానికి గురి చేస్తోంది. కాలం, అంతరిక్షం అనేవి ఎప్పటికీ మిస్టరీగానే ఉండొచ్చు. అయితే ఇవేవీ నా పనిని ఆపలేవు''అని తొలి పోస్ట్‌లో ఆయన వ్యాఖ్యానించారు.
ఈ నెల 24న హాకింగ్ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఈ వ్యాఖ్యకు ఒక్క రోజులో 8 లక్షల 39వేలకుపైగా లైక్స్ వచ్చాయి.
**