
లండన్: ఇటీవల కన్నుమూసిన ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్‌కు చెందిన చక్రాల కుర్చీని, ఆయన సంభాషించేందుకు వాడిన ప్రత్యేక కంప్యూటర్‌ను ప్రజా సందర్శనకు ఉంచే అవకాశముందని బ్రిటన్‌కు చెందిన ‘ది సండే టైమ్స్’ పత్రిక తెలిపింది.
హాకింగ్ స్మృతుల్ని సజీవంగా ఉంచేందుకు వీలుగా ఈ రెండింటిని ఏదైనా మ్యూజియానికి ఇచ్చే అంశాన్ని ఆయన కుటుంబ సభ్యులు పరిశీలిస్తున్నారని వెల్లడించింది. లండన్‌లోని సైన్స్ మ్యూజియంలో హాకింగ్ జీవితచరిత్ర, ఉపన్యాసాల వీడియోలతో పాటు చక్రాల కుర్చీ, కంప్యూటర్‌ను ప్రదర్శనకు ఉంచే అవకాశముందని పేర్కొంది. హాకింగ్ వాడిన చక్రాల కుర్చీ స్వీడన్‌లో తయారైందనీ, ఓసారి చార్జింగ్ పెడితే ఇది గంటకు 13 కి.మీ వేగంతో 32 కి.మీ దూరం ప్రయాణిస్తుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment