
మన మనోశక్తి ముందు ఎంత పెద్ద సమస్య లేదా అడ్డంకైన పక్కకు వెళ్లిపోవాల్సిందే. అందుకే అంటారు పెద్దలు సంకల్ప శక్తికి మించిన ఆయుధం ఇంకొకటి లేదని. విల్‌పవర్ ఉన్నోడికి దునియానే తలవంచి సలాం కొడుతుంది. అలాంటి సంఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది.
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ రిషికేశ్‌లో తన కంపెనీ ఉద్యోగి వీల్‌చైర్ తోపాటు బంగీ జంప్ చేస్తున్న వీడియోని పంచుకున్నారు. ఆయన సోషల్ మీడియా ఎక్స్‌లో ఈ వీడియోని జత చేస్తూ ఇలా రాశారు. "చాలామంది దీనిని థ్రిల్ కోసం చేస్తారు. కానీ మన మెహతా సంకల్ప శక్తి పవర్ చూపించడానికే ఈ సాహసం చేశారు. అయినా సంకల్ప శక్తి ముందు ఏ భయం, వైకల్యం అయినా పరార్ అయిపోవాల్సింది.
దానిముందు ఏ అడ్డంకి నిలువలేవు అని రాసుకొచ్చారు పోస్ట్‌లో గౌతమ్ అదానీ. కాగా, గత నెల పిబ్రవరిలో అదానీ కుమారుడు జీత్ అదానీ దివాషాల వివాహంలో సామాజిక కార్యక్రమల కోసం దాదాపు రూ. 10 కోట్లు ఖర్చు చేస్తానని అన్నారు గౌతమ్ అదానీ.
అలాగే ఆ కొత్త జంట కూడా ప్రతి ఏడాది సుమారు 500 మంది మహిళా వికలాంగులకు ఒక్కొక్కరం రూ. 10 లక్షలు చొప్పున విరాళంగా ఇస్తామని వాగ్దానం చేశారు. అంతేగాదు గౌతమ్ అదానీ హిందీ బుల్లితెర స్టార్ ప్లస్‌లో వచ్చే షార్క్ ట్యాంక్ ఇండియాలో సైతం ప్రముఖ టీవీ షోలో వికలాంగులు, వారి కోసం పాటుపడేవారి కోసం ఏదైనా చేయొచ్చేగా అని ఒక ఎపిసోడ్‌లో సూచించారు కూడా.
Most people do it for the thrill. Kay Mehta, our own Adanian, did it to make a statement. From the heights of Rishikesh, strapped in his wheelchair, Kay took a leap that told the world: no odds, no fear, can stop willpower.
Kay, you don’t just inspire us - you redefine what it… pic.twitter.com/n1CTvFKtsQ— Gautam Adani (@gautam_adani) March 27, 2025
(చదవండి: బాబోయ్ మరీ ఇంతలానా..! వైరల్‌గా ఫిట్‌నెస్ ఇన్ఫ్లుయెన్సర్ జీవనశైలి)