Wheelchair
-
నడవలేని స్థితిలో శ్రీవల్లి
-
వీల్‌చెయిర్ మోటార్బైక్గా మారిపోతే..!
ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లేదా డిఫరెంట్లీ ఏబుల్డ్... ఎలా పిలిచినా అంగవైకల్యం అనేది జీవితంలో ఎంతో పెద్ద లోటు. శరీరంలో ఏ అవయవం లేకపోయినా కష్టమే. వైకల్యాన్ని జయించేందుకు ఎంతో మనోస్థయిర్యం అవసరం. వికలాంగుల కోసం ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. అలాంటి వాటిలో మద్రాస్ ఐఐటీ పూర్వ విద్యార్థులు చేసిన ఈ ప్రయోగం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. వికలాంగుల వీల్ చెయిర్‌ను మోటార్బైక్గా మార్చే ఈ టెక్నాలజీ ఓ కొత్త స్టార్టప్‌గా మారిపోయింది. ఇప్పటి వరకు 5,200 బైకులు కొనుగోలు చేశారని సమాచారం.‘నియోమోషన్’ మోటర్బైక్కొద్ది రోజుల క్రితం జొమాటో డెలివరీ పార్ట్నర్ సయ్యద్ షహజాద్ అలీ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మోటార్బైక్గా మారిపోయిన ఓ వీల్‌చెయిర్‌లో అలీ దిలాసాగా కూర్చుని ఉన్నాడు. ‘‘వైకల్యమనేదే లేదు.. మనం చేయాలనుకుంటే ఏదీ అసాధ్యం కాదు. అయితే మనం అంకితభావంతో కృషిచేయాలంతే’’ అని అలీ అంటున్నాడు. ఈ కొత్త వీల్చెయిర్బైక్ కి ఆయన ‘నియోమోషన్’ అని పేరుపెట్టాడు. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థుల సృజనాత్మకతకు ఇది నిదర్శనమి అలీ చెప్పాడు. ఈ వినూత్న సృష్టి.. వికలాంగులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అంటున్నాడు.వైకల్యం ఓ పెద్ద సవాలు.. ఈ వాహనాన్ని తయారుచేసిన ఫౌండర్లలో ఒకరైన సిద్ధార్ధ్ డాగా మాట్లాడుతూ ‘‘నియోమోషన్ వికలాంగుల జీవితాలను సమూలంగా మార్చివేయబోతోంది’’ అన్నారు. నియోమోషన్ ప్రయాణం ఐఐటీ మద్రాస్‌లో ప్రారంభమైంది. ఫైనల్ ఇయర్లో ఉండగా డాగా, ఇంకా ఆయన స్నేహితులను వారి ప్రొఫెసర్ డాక్టర్ సుజాతా శ్రీనివాసన్ చాలా ప్రభావితం చేశారు. డాక్టర్ సుజాతా శ్రీనివాసన్ టిటికె సెంటర్ ఫర్ రిహాబిలిటేషన్ రీసెర్చ్ అండ్ డివైస్ డెవలప్మెంట్ విభాగం చూసేవారు. వైకల్యాన్ని అధిగమించే పరికరాలపై వారు చాలా పరిశోధనలు చేసేవారు. ముందు డాగా మిత్రబృందానికి అప్పగించిన పనేమిటంటే... స్విమ్మింగ్‌పూల్‌లో వికలాంగులు సురక్షితంగా దిగడం, బైటకు రావడం, వ్యాయామంగా ఈతను ఉపయోగించుకోవడం ఎలా అనే అంశాలను పరిశీలించమన్నారు. వికలాంగులు ఎదుర్కొనే అనేక సవాళ్లను ఇది వారి కళ్లకు కట్టింది.సౌకర్యవంతంగా.. దృఢంగా..ఆ అనుభవం నుంచే ఈ నియోమోషన్ (వీల్‌చెయిర్ వాహనం) ఐడియా వారికి వచ్చింది. ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ డిజైన్. మార్కెట్లో దొరికే వీల్చెయిర్లు అన్నీ ఒకే డిజైన్‌లో ఉంటాయి. వైకల్యం ఉన్నవారికి అందరికీ ఒకే రకమైన వీల్‌చెయిర్ పనిచేయదు. కానీ ఈ నియోమోషన్ వీల్‌చెయిర్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. చాలా దృఢంగా కూడా ఉంటుంది. ఎక్కువసేపు కూర్చున్నా ఎలాంటి ఇబ్బందీ ఉండదు.గంటకు 50 కి.మీ ప్రయాణంనియోమోషన్ నిజానికి నియోఫ్లై అనే వీల్ చెయిర్, నియోబోల్ట్ అనే మోటార్బైక్గా ఉపయోగపడే పరికరం రెండింటి సమ్మేళనం. నియోబోల్ట్ అనేది లిథియం–అయాన్ బ్యాటరీతో నడిచే విద్యుత్ పరికరం. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 25 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అలాగే 50 కిలోమీటర్లు ప్రయాణించే వేరియంట్ కూడా ఉంది.నాణ్యత ఎక్కువ..ధర తక్కువ..అయితే ఎన్ని సౌకర్యాలు, సౌలభ్యాలు ఉన్నా వికలాంగులకు అందుబాటు ధరలో ఉంటేనే ఉపయోగం. ఎక్కువమంది ఉపయోగించుకోగలుగుతారు. ఈ విషయాన్ని గమనంలో ఉంచుకునే సాధ్యమైనంత తక్కువ ధరకు లభించేలా.. అదే సమయంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా నియోమోషన్ను తయారు చేసినట్టు డాగా వివరించారు. ప్రస్తుతం నియోమోషన్ రూ.1,10,000కు లభిస్తోంది. అంతర్జాతీయంగా ఇలాంటి పరికరాలతో పోలిస్తే ఇందులో సౌకర్యాలు ఎక్కువ అని, ధర చాలా తక్కువని డాగా వివరించారు. -
రోజంతా ఆ తల్లి నరకయాతన!
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం) : పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది.. నొప్పులతో నరక యాతన అనుభవిస్తున్నా.. పాపం ఆ తల్లికి కనీసం ఆస్పత్రిలో వీల్ చైర్ కూడా ఇవ్వలేదు. ఉదయం నుంచి ఆస్పత్రి బయటే ఉంచేశారు. అర్ధరాత్రి వరకూ అదే పరిస్థితి.. ఆ తర్వాత నొప్పులు తీవ్ర మయ్యాయి. ఓ వైపు రక్త స్రావం.. మరో వైపు బిడ్డ తల కూడా బయటికి వచ్చింది.. అయినా సరే ఆస్పత్రి సిబ్బంది కరగలేదు. ఇక చేసేది లేక బయటికి వచ్చిన బిడ్డ తలతోనే ఆ గర్భిణిని తల్లి ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఏరియా ఆస్పత్రిలో జరిగిన అమానవీయ ఘటన ఇది. సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చిం ది. ప్రాధేయపడ్డా ఫలితం లేదుఅనపర్తికి చెందిన నిండు గర్భిణి వినీత సుఖ ప్రసవం కోసం సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం అనపర్తి ఏరియా ఆస్పత్రికి వెళ్లింది. ప్రసవ వేదనతో బాధపడుతున్న ఆమెకు కనీసం వీల్ చైర్ కూడా సిబ్బంది ఏర్పాటు చేయలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆస్పత్రి బయటే ఉంచేశారు. ప్రసూతి వేదన అనుభవిస్తున్న కూతురి బాధను తట్టుకోలేని ఆమె తల్లి.. ఎంత ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. ఆ రోజు అర్ధరాత్రి వరకూ ఆ గర్భిణి వైద్య సాయం కోసం ఎదురుచూసింది. అదే రోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆమెకు నొప్పులొచ్చాయి.నొప్పుల సంగతి ఆస్పత్రి సిబ్బందికి తెలియపరచగా.. మత్తు ఇచ్చే డాక్టర్లు లేరంటూ సమాధానం చెప్పారు. అప్పటికే రక్తస్రావం అధికంగా అవడంతో పాటు శిశువు తల బయటికొచ్చి నరకయాతన అనుభవిస్తున్నా.. ఆమె బాధను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆస్పత్రికి వచ్చిన జనం ఈ ఘటన చూసి చలించిపోయారు. దీంతో బయటికి వచ్చిన శిశువు తలతో ఉన్న తన కూతురిని బాధితురాలి తల్లి ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించింది. ఈ విషయం తెలుసుకున్న బొమ్మూరుకు చెందిన సామాజిక కార్యకర్త దివిలి ప్రభాకరరావు డీసీహెచ్ఎస్ పద్మశ్రీరాణికి సోమవారం ఫిర్యాదు చేశారు. -
ఎయిర్‌పోర్టులో వృద్ధ మహిళకు చేదు అనుభవం
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వృద్ధురాలికి చేదు అనుభవం ఎదురయ్యింది. ఆమె వీల్ చైర్ కోసం మూడు గంటలకు పైగా సమయం నిరీక్షిస్తూ పలు ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది.పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ఆ 84 ఏళ్ల వృద్ధురాలు అలయన్స్ ఎయిర్ విమానంలో జైపూర్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చింది. అక్కడ వీల్ చైర్ కోసం ఆమె మూడు గంటలకు పైగా వేచి ఉండాల్సి వచ్చింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్టున్నట్ల ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు. తమ విమానయాన సంస్థ ఆ వృద్ధ మహిళకు, ఆమె కుటుంబ సభ్యులకు ఇప్పటికే క్షమాపణలు చెప్పిందని పేర్కొన్నారు.అలయన్స్ ఎయిర్ కస్టమర్ కేర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మనోహర్ తుఫ్చి మీడియాతో మాట్లాడుతూ ‘పొరపాటు జరిగింది. మేము ఈ సంఘటనను అనేక కోణాల్లో పరిశీలిస్తున్నాం. గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీ ఏఐ- సాట్స్‌తో కూడా ఈ ఉదంతంపై చర్చించాం. ఈ ఏజెన్సీ ప్రయాణికులకు వీల్చైర్లను అందిస్తుంది. తాము వృద్ధురాలి కుమారునితో ఫోన్లో మాట్లాడాం. అతనికి క్షమాపణలు చెప్పాం’ అని తెలిపారు. -
వీల్‌చైర్‌లో వచ్చాడు... విల్‌పవర్ చూపాడు
వీల్‌చైర్‌కు పరిమితమైన ఈ యువకుడు విల్ పవర్ మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. స్నేహితుల సహాయంతో వీల్‌చైర్‌లో నుంచి రిషికేష్‌లో బంగీ జంప్ చేశాడు. ఈ వీడియోతో ప్రపంచవ్యాప్తంగా నెటిజనుల మనసు దోచుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్ చేసిన ఈ వీడియో 24 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ యూ డేర్’ ‘మోర్ పవర్ టు యూ, బాయ్’లాంటి కామెంట్స్ కనిపించాయి. చాలామంది హార్ట్ ఇమోజీలతో రియాక్ట్ అయ్యారు. గతంలో లెఫ్టినెంట్ కల్నల్ అవనీష్ బాజ్‌పాయ్ ఆర్టిఫిషియల్ లింబ్‌తో భటిండాలో 14,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. -
ఇండిగో, కోల్‌కతా ఎయిర్ పోర్ట్ నిర్వాకం: మహిళా పారా అథ్లెట్ ఆగ్రహం
బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ఇండిగోకు సంబంధించి మరో అనుచిత ఘటన వివాదాన్ని రేపింది. అలాగే కోల్‌కతా విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది దివ్యాంగ మహిళ పట్ల అమానుషంగా వ్యవరించారు. దీనికి సంబంధించిన ఘటనను ఆమె ట్విటర్ షేర్ చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. సెక్యూరిటీ క్లియరెన్స్ సమయంలో వికలాంగురాలైన (వీల్‌చైర్ యూజర్ కూడా) తనను మూడుసార్లు లేచి నిలబడాలంటూ కోరారని న్యాయ విద్యార్థిని ఆరూషి సింగ్ ట్వీట్ చేశారు. మొదట ఆమె నన్ను లేచి కియోస్క్‌లోకి రెండు అడుగులు వేయమని చెప్పింది. పుట్టుకతోనే తనకు వైక్యల్యంఉందని తన వల్ల కాదని చెప్పినా. వినిపించుకోకుండా రెండు నిమిషాలే అయిపోతుంది అంటూ వేధించారని ఆమె ఆరోపించారు. దీంతో తాను భయంతో వణికి పోయానంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తనకు 20 నిమిషాలు లేటైందని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి జరిగినా, ఇండిగోకు ఇంకా బుద్ధి రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కోల్‌కతా ఎయిర్‌పోర్టు అధికారులు వైకల్యం ఉన్న ప్రయాణీకుల పట్ల వ్యవహరించాల్సిన తీరును పునరాలోచించాల్సిన అవసరం ఉందని సింగ్ కోరారు. ఈ ఘటనపై సిఐఎస్ఎఫ్, కోల్‌కతా విమానాశ్రయం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయ లేదు. Yesterday evening during the security clearance at Kolkata airport, the officer asked me (a wheelchair user) to stand up, not once but thrice. First she asked me to get up and walk two steps into the kiosk. (1/1) — Arushi Singh (@singhharushi) February 1, 2024 ఇది ఇలా ఉంటే ఇండిగోకు సంబంధించి తాజా సంఘటన కలకలం రేపింది. వీల్ చెయిర్ విషయంలో ఇండిగో సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారంటూ ఆసియా పారా గేమ్స్ పతక విజేత , పారా అథ్లెట్ సువర్ణ రాజ్ ఆరోపణలు గుప్పించారు. దివ్యాంగురాలైన తనకు విమానం డోర్ దగ్గర తన వీల్ చెయిర్ ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేశారని మండి పడుతూ తన అనుభవాన్ని ఏఎన్ఐతో షేర్ చేశారు. #WATCH | Chennai, Tamil Nadu: Indian para-athlete Suvarna Raj alleges that she was mistreated by IndiGo Airlines crew members while taking a flight from New Delhi to Chennai yesterday. "...I told them 10 times that I want my personal wheelchair at the aircraft door, but no… pic.twitter.com/avResgXHJ0 — ANI (@ANI) February 3, 2024 విమానం డోర్ వద్ద తనకు వ్యక్తిగత వీల్‌చైర్ గురించి సిబ్బంది స్పందించలేదని ఆరోపించారు. న్యూఢిల్లీనుంచి చెన్నైకి వెళ్తుండగా ఇండిగో సిబ్బంది తన పట్ల దారుణంగా ప్రవర్తించారని సువర్ణ తెలిపారు. ఇండిగో నిర్ల్యక్షం మూలంగా తన వ్యక్తిగత వీల్‌చైర్ పాడైందని, దాని రిపేర్‌కు రూ. 3 లక్షలు ఖర్చయ్యాయని పేర్కొన్నారు. ఈ నష్టాన్ని ఇండిగోనే భరించాలన్నారు. వికలాంగులకు వీల్చైర్లు ప్రోటోకాల్ ఉల్లంఘనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సువర్ణ డిమాండ్ చేశారు. అంతేకాదు సింగ్ వ్యవహారంపై కూడా ఆమె స్పందించారు. వికలాంగుల సమస్యను అర్థం చేసుకొని వారి పట్ల సున్నితంగా వ్యవహరించాలని రాజ్ కోరారు. -
వీల్‌ఛైర్ యూజర్లకు సరికొత్త కారు డిజైన్.. ఆనంద్ మహీంద్రా ట్విట్ వైరల్
వీల్‌ఛైర్ వినియోగదారులు కారును ఉపయోగించడం ఇబ్బందితో కూడుకుని ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కార్లు వారికోసం ప్రత్యేకంగా డిజైన్ చేయలేదు కాబట్టి.. మరొకరి సహాయం అవసరమవుతుంది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో వీల్ ఛైర్ వినియోగదారులు కారు ఉపయోగించే సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ వీడియో వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను అమితంగా ఆకర్షించింది. Super smart & super useful design. Would fill me with pride if our vehicles could offer these fitments. But it’s hard for an auto OEM engaged in mass production to do. Need a startup engaged in customisation. I would willingly invest in such a startup https://t.co/uoasAKjaZd — anand mahindra (@anandmahindra) November 10, 2023 "సూపర్ స్మార్ట్. ఉపయోగకరమైన డిజైన్. మా వాహనాలు ఈ ఫిట్మెంట్లను అందించగలిగితే నేను ఎంతో గర్వంగా భావిస్తాను. కానీ భారీ ఉత్పత్తిలో నిమగ్నమైన సంస్థలకు అలా చేయడం కష్టం. ఇందుకు స్టార్టప్ అవసరం. అలాంటి స్టార్టప్‌లకు నేను తప్పకుండా పెట్టుబడి పెడతాను." అని ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను షేర్ చేశారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వీల్‌ఛైర్ వాడేవారికి కూడా కొత్త డిజైన్లను తీసుకురావాలనే ఆలోచనపై హర్షం వ్యక్తం చేశారు. వీడియోలో చూపిన కారు డిజైన్‌ను ప్రశంసించారు. అలాంటి స్టార్టప్‌లు ముందుకు రావాలని కోరారు. వీల్‌ఛైర్ వినియోగదారులు కూడా ఎవరి సహాయం లేకుండా కారులో ప్రయాణించాలని ఆకాంక్షించారు. ఇదీ చదవండి: ఇదేందయ్యా ఇది.. రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొన్న విమానం.. వీడియో వైరల్ -
విమానంలో వికలాంగుడి పట్ల అమానుషం: కన్నీటి పర్యంతమైన జంట
న్యూఢిల్లీ: వికాలాంగుడన్న కనీస కనికరం లేకుండా విమానంలో దారుణంగా వ్యవహరించిన ఘటన కలకలం రేపింది. తమకు జరిగిన అవమానాన్ని తడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎంతో ఆనందంగా జరుపుకోవాలనుకున్న వివాహ వార్షికోత్సవ వేడుకల్లో తీరని మానసిక వేదనకు గురయ్యమాంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో చివరకు ఎయిర్ కెనడా క్షమాపణ చెప్పింది. బ్రిటిష్ కొలంబియాకు చెందిన హార్డ్‌వేర్ సేల్స్‌మ్యాన్ రోడ్నీ హాడ్జిన్స్ స్పాస్టిక్ సెరిబ్రల్ పాల్సీ బాధితుడు. వీల్ చెయిర్ లేనిదే కదలలేని స్థితి. అయితే ఆగస్టులో వివాహ వార్షికోత్సవ వేడుకుల కోసం ఎయిర్ కెనడాలో భార్య డీనాతో కలిసి లాస్ వెగాస్‌కు వెళ్లాడు. ఈ సందర్భంగా విమానం ల్యాండ్ అయినప్పుడు మోటరైజ్డ్ వీల్‌చైర్ కావాలని అడిగాడు. అయితే విమానం మళ్లీ టేకాఫ్‌కు సిద్ధం కావడానికి ముందు వీల్‌చైర్‌ను ఎక్కించుకోవడానికి సమయం లేదని ఫ్లైట్ అటెండెంట్ దంపతులకు ఖరాఖండీగా చెప్పేశారు. పైగా దిగాలంటూ తొందరపెట్టారు. దీంతో రోడ్నీ భార్య అతడిని బలవంతంగా రెండు కాళ్లు పట్టి ఈడ్చుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. రోడ్నీ హాడ్జిన్స్ దంపతులు(ఫైల్ ఫోటో) ఈ విషయాన్ని డీన్నా హాడ్జిన్స్ ఇటీవలి ఫేస్బుక్ పోస్ట్ చేశారు. అందరూ చూస్తూ ఉండగానే దాదాపు 12 లైన్లకు వరకూ భర్త వీపుమీద జరుగుతూ ఉంటే, తాను రెండు కాళ్లు పట్టుకుని ఈడ్చుకుంటా వెళ్లాల్సి వచ్చిందని, దీంతో అతనికి వీపుపైన, కాళ్లకు గాయాలని చెప్పుకొచ్చారు. తనకూ వెన్నులో నొప్పి వచ్చిందని తెలిపారు. ఈ ఘటనలో శారీరక బాధలతో పోలిస్తే.. తన భర్త హక్కులకు భంగం కలగడమే కాకుండా, తమకు తీరని మానసిక వ్యధను మిగిల్చిందంటూ కన్నీంటి పర్యంతమయ్యారు. ఎనిమిదినెలలకు ప్లాన్ చేస్తున్న టూర్ అవమానకరంగా సాగిందని పేర్కొన్నారు. ఈ అమానుష ఘటనపై సోషల్ మీడియాలోఆగ్రహం వ్యక్త మైంది. దీంతో వెంటనే స్పందించిన ఎయిర్ కెనడా వారు హాడ్గిన్స్ దంపతులు క్షమాపణలు చెప్పి, తగిన నష్టపరిహారాన్ని కూడా అందించారు. పరిహారంతో సరా...?: రోడ్నీ హాడ్జిన్స్ పరిహారంతో సమస్య పరిష్కారం కాదంటూ వికలాంగ ప్రయాణికుల పట్ల విమానయాన సంస్థ వ్యవహరించిన తీరుపై రోడ్నీ ఆగ్రహం వ్యక్తంచేశారు. తన లాంటి పరిస్థితి మరొకరికి రాకూడదనేదే తన తాపత్రయమని చెప్పారు. -
వీల్ ఛైర్లో మన్మోహన్సింగ్.. బీజేపీ ఫైర్
ఢిల్లీ: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి, రాజ్యసభ సభ్యులు మన్మోహన్ సింగ్ వీల్ ఛైర్లో పార్లమెంట్‌కి తీసుకువచ్చారు. ఈ అంశం అధికార విపక్షాల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. మన్మోహన్‌కు రాజ్యంగం పట్ల ఉన్న విధేయతపై ప్రతిపక్షాలు కొనియాడాయి. అదే తరుణంలో ఆరోగ్యం బాగులేకున్నా.. కేవలం ఢిల్లీ బిల్లును వ్యతిరేకించాలనే చెడు సంకల్పంతో ఆయన్ను సభలోకి తీసుకురావడంపై బీజేపీ మండిపడింది. ఈ చర్యను సిగ్గు చేటుగా అభివర్ణించింది. ఢిల్లీ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి వచ్చిన మన్మోహన్ సింగ్‌కు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగ విలువల పట్ల ఆయనకు ఉన్న విదేయత ఎంతో గొప్పది అంటూ కొనియాడారు. బ్లాక్ ఆర్డినెన్స్‌పై స్పందించడానికి వచ్చినందుకు ఆయనకు రుణపడి ఉంటామని అన్నారు. మన్మోహన్‌ను రాజ్యసభలోకి తీసుకువచ్చిన తీరు దేశం గుర్తుంచుకుంటుందని బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ పిచ్చి ఎంతటిదో అర్థమవుతుందని ఆరోపణలు చేశారు. రాత్రిపూట ఆరోగ్యం బాగులేని మన్మోహన్‌ను వీల్ ఛైర్లో తీసుకురావాల్సినంత అవసమేంటని కాంగ్రెస్‌ను నిందించింది. నిజాయితీ లేని తమ కూటమిని నిలుపుకోవాలనే కాంగ్రెస్ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని దుయ్యబట్టింది. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు మొత్తానికి పార్లమెంట్లో ఆమోదం పొందింది. 131 సీట్లు బిల్లుకు ఆమోదం తెలుపగా.. 101 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. ఈ బిల్లు ఢిల్లీలో ఆప్, కేంద్రానికి మధ్య విమర్శలకు దారితీసింది. ఇదీ చదవండి: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం.. కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. -
రోబోటిక్ వీల్‌చైర్..శరీరాన్ని వంచితే చాలు..దానంతట అదే వెళ్తుంది!
నడవలేని స్థితి ఎదురైనప్పుడు ఎవరైనా వీల్‌చైర్‌ను ఆశ్రయించక తప్పదు. వీల్‌చైర్‌లో కూర్చుంటే, వెనుక నుంచి ఎవరో ఒకరు ముందుకు నెడితే తప్ప కదలడం సాధ్యం కాదు. వీల్చైర్ల తయారీలోనూ ఇటీవల అధునాతన మార్పులు వస్తున్నాయి. తాజాగా, జపాన్‌కు చెందిన బహుళజాతి వాహనాల తయారీ సంస్థ ‘హోండా’ ఈ రోబోటిక్ వీల్‌చైర్‌ను రూపొందించింది. మోటార్‌తో రూపొందించిన కొన్ని వీల్చైర్లను చేతులతో కోరుకున్న దిశకు నడపాల్సి ఉంటుంది. హోండా తయారుచేసిన ఈ వీల్‌చైర్ మాత్రం చేతులకు శ్రమపెట్టదు. ఇది పూర్తిగా రోబోటిక్ సాంకేతికతతో పనిచేస్తుంది. ఇందులో కూర్చున్న వ్యక్తి ఎటువైపుగా వెళ్లాలనుకుంటే, అటువైపుగా కాస్త శరీరాన్ని వంచితే చాలు. ఇది దానంతట అదే ఆ దిశగా ముందుకు సాగుతుంది. దీనిని స్టార్ట్ చేయాలన్నా, స్థిరంగా నిలపాలన్నా కావలసిన బటన్లు చేతికి అందుబాటులో ఉంటాయి. ‘యూని–వన్’ పేరిట రూపొందించిన ఈ రోబోటిక్ వీల్‌చైర్ ఇంకా మార్కెట్లోకి విడుదల కావాల్సి ఉంది. -
మనసు మాట వినే చక్రాల కుర్చీ!
వాషింగ్టన్: దివ్యాంగులకు చక్కగా ఉపయోగపడే చక్రాల కుర్చీని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ కుర్చీని కదిపేందుకు బటన్స్ నొక్కాల్సిన పనిలేదు. మనిషిలోని ఆలోచనలను బట్టి నడుచుకుంటుంది. అంటే మనస్సుతో∙కుర్చీని కంట్రోల్ చేయొచ్చు. కుర్చీలో కూర్చున్న తర్వాత కుడి వైపునకు మళ్లాలంటే రెండు చేతులను కుడి వైపునకు కదిలించినట్లు మనసులో ఊహించుకుంటే చాలు. ఎడమ వైపునకు వెళ్లాలంటే రెండు కాళ్లను అదే దిశలో కదిలించినట్లు ఊహించుకోవాలి. మెదడులోని సంకేతాలను వీల్ చైర్ కదలికలతో అనుసంధానించారు. ఇందుకోసం హెల్మెట్ (స్కల్ క్యాప్) లాంటిది ధరించాలి. ఇందులో 31 ఎలక్ట్రోడ్లు ఉంటాయి. ఇవి మెదడు అందించే సంకేతాలను పసిగడతాయి. చైర్ వెనుక ల్యాప్‌ట్యాప్ ఫిక్స్ చేసి ఉంటుంది. కృత్రిమ మేధ(ఏఐ)తో మెదడు సంకేతాలు కుర్చీ కదలికలుగా మారుతాయి. దివ్యాంగులు, నడవలేని బాధితులు చేయాల్సిందల్లా కుర్చీలో కూర్చొని కాళ్లు, చేతులు ఆడించినట్లు మనసులో ఊహించుకోవడమే. మనసు మాట వినే ఈ చక్రాల కుర్చీ 80 శాతం కచ్చితత్వంతో పని చేసినట్లు అధ్యయనంలో తేలింది. కుర్చీలను వాణిజ్యపరంగా మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. -
వీల్ చైర్ మీద గడప గడప కి వెళ్తున్న మంత్రి సురేష్
-
Wheelchair Cricket: వైకల్యాన్ని జయించారు
కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలిరా.. అన్నట్టు హుషారుగా బ్యాట్ ఝుళిపించారు. పరుగుల వరద పారించారు. భళా అనిపించారు.. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో ఆంధ్రప్రదేశ్ వీల్‌చైర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వర్సెస్ తెలంగాణ జట్ల మధ్య జరిగిన క్రికెట్ పోటీల్లో దివ్యాంగుల క్రీడోత్సాహ దృశ్యాలివి. రాజమహేంద్రవరం రూరల్: చిన్న ఓటమి, అపజయానికే తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురవుతున్న నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దివ్యాంగ క్రీడాకారులు. అంగ వైకల్యంతో కుంగిపోకుండా, పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తమకు ఇష్టమైన క్రికెట్లో సత్తా చాటుతున్నారు. ఆర్థికంగా కష్టమైనా, సౌకర్యాలు తక్కువగా ఉన్నా వీల్ చైర్ క్రికెట్లో సాధన చేసి అనుకున్నది సాధించారు. గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి చేరారు. త్వరలో ఐడబ్ల్యూపీఎల్ (ఇండియన్ వీల్‌చైర్ ప్రీమియర్ లీగ్)లో ఆడనున్నట్లు సంతోషంగా చెబుతున్నారు ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాకు చెందిన వీల్‌చైర్ క్రికెట్ క్రీడాకారులు. సాధారణ క్రికెట్ మాదిరిగానే వీల్‌చైర్ క్రికెట్ కూడా ఉంటుంది. జట్టులో 11 మంది క్రీడాకారులు ఉంటారు. బౌలింగ్, బ్యాటింగ్, కీపింగ్, ఫీల్డింగ్ అంతా వీల్‌చైర్‌లో ఉంటూనే చేస్తారు. సాధారణ క్రికెటర్లు పరిగెత్తినట్టుగా మైదానంలో వీల్ చైర్లో తిరుగుతూ ఆడతారు. ఇప్పటికే పలు రాష్ట్రాలలో జరుగుతున్న వీల్‌చైర్ క్రికెట్ పోటీలలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బాలుర హైస్కూల్ క్రీడాప్రాంగణంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ వీల్‌చైర్ క్రికెట్ టోర్నమెంట్లో తలపడుతున్నారు. శుక్రవారం నుంచి మూడురోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయి. ధృడ సంకల్పం ధృడ సంకల్పం ఉంటే ఎంత కష్టమైన పనిలోనైనా విజయం సాధించవచ్చని వీల్‌చైర్ క్రికెట్ క్రీడాకారులు నిరూపిస్తున్నారు. వీల్‌చైర్‌లోనే క్రికెట్ ఆడుతూ క్రీడలపై తమకు ఉన్న మక్కువను చూపుతున్నారు. బంతిని అందుకునే సమయంలో క్రీడాకారులు అదుపుతప్పి పడిపోయినట్లే ఒక్కోసారి వీరుకూడా వీల్‌చైర్ నుంచి కింద పడిపోతారు. అయినా మొక్కవోని దీక్షతో తమ సత్తా చాటుతున్నారు. సత్తా చాటుతాం జాతీయస్థాయి వీల్‌చైర్ క్రికెట్లో సైతం సత్తా చాటుతాం. రెండేళ్లుగా ముమ్మర సాధన చేస్తున్నాం. త్వరలో జరిగే ఇండియన్ వీల్‌చైర్ క్రికెట్ ప్రీమియర్ లీగ్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు పాల్గొంటున్నారు. పిడింగొయ్యి పంచాయతీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నా. ఖాళీ సమయంలో వీల్‌చైర్ క్రికెట్ సాధన చేస్తున్నాను. హైదరాబాద్‌లో జరిగిన టోర్నమెంట్లో ఆంధ్రా జట్టు రన్నర్‌గా నిలిచింది. – మానుపాటి ప్రవీణ్ కుమార్, ఏపీ వీల్‌చైర్ క్రికెట్ టీమ్ కెప్టెన్ క్రికెట్‌పై మక్కువ అంగవైకల్యం ఉన్నా ఏరోజూ కుంగిపోలేదు. ఆటపై ఉన్న మక్కువతో వీల్ చైర్ క్రికెట్లో సాధన చేశాం. పలువురు అందించిన ప్రోత్సాహంతో అనేక రాష్ట్రాలలో క్రికెట్ ఆడాను. బ్యాటింగ్‌లో మంచి స్కోర్‌ను సాధించగలిగాను. టీమ్ సమష్టి కృషితో ముంబైలో జరిగిన టోర్నమెంట్లో రన్నర్‌గా నిలిచాం. మరింత సాధన చేసి జాతీయ టీమ్‌లో స్థానం సంపాదించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాను. – ఎస్కే సమీయుద్దీన్, తెలంగాణ వీల్‌చైర్ క్రికెట్ టీమ్ కెప్టెన్ ప్రోత్సాహం బాగుంది వీల్‌చైర్ క్రికెట్లో రాణిస్తున్నాం. క్రికెట్ ఆడేందుకు మాకు వైకల్యం అడ్డుకాలేదు. ఆత్మవిశ్వాసంతో క్రమశిక్షణ తో సాధన చేస్తూ ముందుకు సాగుతున్నాం. ఒడిశాను ఉత్తమ జట్టుగా నిలిపేందుకు కృషి చేస్తున్నాం. ఆంధ్రాలో జరుగుతున్న మ్యాచ్‌లో విజయం సాధించే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. వీల్‌చైర్ క్రికెట్‌కు వస్తున్న ప్రోత్సాహంతోనే ఇతర రాష్ట్రాలకు సైతం వెళ్లి ఆడుతున్నాం. – అభయ్, ఒడిశా వీల్‌చైర్ క్రికెట్ టీమ్ కెప్టెన్ -
శభాష్ తహసీల్దార్
మునుగోడు: వైకల్యం శరీరానికి తప్ప మనసుకు కాదని నల్లగొండ జిల్లా మునుగోడు తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు నిరూపిస్తున్నారు. ఆయన వీల్ చైర్లోనే విధులు నిర్వహిస్తున్నారు. పుట్టుకతోనే దివ్యాంగుడైన ఆయన గతంలో మునుగోడు డీటీగా పనిచేశారు. ఆరు నెలల క్రితం తహసీల్దార్‌గా పదో న్నతి పొంది ఇక్కడే పనిచేస్తున్నారు. సోమవారం మండలంలోని చొల్లేడు గ్రామంలో బృహత్ ప్రకృతివనం ఏర్పాటుకు అధికారులు చేపట్టిన భూ పరిశీలనకు ఆయన వీల్ చైర్లో హాజరయ్యారు. -
హీనా శర్మ.. శాపాన్ని వరంగా మార్చుకుంది
కొందరికి పుట్టుకతోనే వైకల్యం ప్రాప్తిస్తుంది. కొందరు ప్రమాదవశాత్తు వైకల్యం బారిన పడతారు. వీరిలో చాలామంది ఈ జీవనం ‘శాపం’ అంటూ భారంగా రోజులు గడిపేస్తుంటారు. అతి కొద్ది మంది మాత్రమే అత్యంత అరుదుగా శాపాన్ని కూడా వరంగా మార్చుకుంటారు. అలాంటి అరుదైన వారిలో ఒకరు 28 ఏళ్ల హీనా శర్మ. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉంటున్న హీనా శర్మ అనారోగ్యం కారణంగా చిన్నప్పుడే వీల్‌చెయిర్‌కి పరిమితమైంది. కానీ, పడి లేచిన కెరటంలా తన జీవితాన్ని తనే మలుచుకుంది. వీల్‌చెయిర్‌లో కూర్చొని డ్యాన్స్ చేస్తుంది. పాటలు పాడుతుంది. వేదికల మీద ప్రదర్శనలు ఇస్తుంది. మోడల్‌గా ర్యాంప్‌వాక్ చేస్తుంది. కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వీటితో పాటు మిస్ వీల్‌చెయిర్ ఇండియా 2022 ఫైనల్‌కి కూడా చేరింది. ‘వీల్ చెయిర్‌పై ఉండటమనేది విచారకరం కాదు. నిస్సహాయతతో కాకుండా సరదాగా జీవితాన్ని గడపడం నేర్చుకున్నాను’ అంటోంది. ఇతరులపై ఆధారపడకుండా, మిమ్మల్ని మీరు నమ్ముకోండి అని చెబుతున్న హీనా శర్మ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. తన జీవితంలోని ఆటుపోట్లను ఈ విధంగా వివరిస్తోంది.. పాటలు పాడుతూ.. కండరాల క్షీణత ‘‘అందరు పిల్లల్లాగే తొమ్మిది నెలల వయసులోనే తొలి అడుగులు వేశానట. కానీ, అనుకోకుండా ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్చారు అమ్మానాన్న. ఆరునెలలు ఆసుపత్రిలోనే ఉంచారు. ‘వెన్నెముక బలహీనంగా ఉంది. కండరాల క్షీణత వల్ల నిటారుగా నిలబడలేదు’ అని చెప్పారు డాక్టర్లు. అప్పటినుంచి నా కాళ్లలో కదలిక లేదు. వెన్నెముక ‘సి’ ఆకారంలోకి మారిపోయింది. అయినా, ఆశచావక అమ్మానాన్నలు చికిత్స కోసం నన్ను దేశమంతా తిప్పారు. డాక్టర్ల సలహా మేరకు పదే పదే ఆపరేషన్లు చేయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నా పాదాలకు శస్త్ర చికిత్స చేశారు. అటునుంచి గోరఖ్‌పూర్‌లో ఫిజియోథెరపీ చేయించారు. మరోసారి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది కానీ, ప్రాణానికి హామీ ఇవ్వలేమన్నారు డాక్టర్లు. అమ్మ భయపడి తిరిగి ఇంటికి తీసుకొచ్చేసింది. దీంతో ఆగిపోయిన చదువు మళ్లీ మొదలుపెట్టాను. స్కూల్లో అందరూ ఇష్టపడేవారు. అందరూ సాయంగా ఉండేవారు. పదవ తరగతిలో ఆటోమేటిక్ వీల్‌చైర్ వచ్చింది. అప్పటినుంచి నా జీవితం చాలా సరళంగా మారిపోయింది. ఎక్కడకు వెళ్లాలనుకున్నా ఒంటరిగానే వెళ్లేదాన్ని. సంగీతం క్లాసులు ఆరో తరగతిలో ఉన్నప్పుడు సంగీతం నేర్చుకోవాలనే ఆశ బలంగా మారింది. దీంతో స్కూల్ టైమ్ అయ్యాక, మా అక్కను తీసుకొని సంగీతం క్లాసులకు వెళ్లేదాన్ని. పై అంతస్తు లో క్లాస్ ఉంటే ఎత్తుకునే తీసుకు వెళ్లేది. అలా నాలుగేళ్లు సంగీతం నేర్చుకున్నాను. అక్క పెళ్లవడంతో సంగీతం నేర్చుకోవడం మధ్యలోనే ఆగిపోయింది. కానీ, నాకు వచ్చినంతవరకు నేనే ఇంటి వద్ద సంగీతం క్లాసులు తీసుకోవడం మొదలుపెట్టాను. కాలేజీ చదువు పూర్తయ్యాక ట్యూషన్లు చెప్పడం కూడా ఆరంభించాను. పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయం, వీల్‌చెయిర్.. అన్నింటి వల్ల చదువు అంతా సవ్యంగానే సాగింది. ఆ తర్వాతనే నిజమైన పోరాటం అంటే ఏంటో తెలిసొచ్చింది. ఉద్యోగం ఓ సవాల్... ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా నిరాశే ఎదురయ్యింది. వెళ్లిన ప్రతిచోటా ‘ఎలా పనిచేస్తారు, ఎలా వస్తారు, ఎలా వెళతారు..’ ఇవే ప్రశ్నలు. చాలా నిరాశగా అనిపించేది. వికలాంగులకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు ఇప్పించే స్వచ్ఛంద సంస్థ ఉందని తెలిసి వారిని కలిసి, శిక్షణకు వెళ్లేదాన్ని. రోజూ ఘజియాబాద్ నుంచి నజాఫ్‌గడ్‌కు మూడు గంటలపాటు ఒంటరిగానే ప్రయాణించే దాన్ని. శిక్షణ సమయంలో రోజంతా సెంటర్లో కూర్చుంటే బాత్రూమ్కు తీసుకెళ్లేవాళ్లు లేక యూరిన్ బ్యాగ్ కూడా వీల్‌చెయిర్‌కు సెట్ చేసుకునేదాన్ని. రెండు నెలల శిక్షణ పెద్ద పోరాటమే అని చెప్పాలి. అయినా ఉద్యోగం రాలేదు. పోస్టుగ్రాడ్యుయేషన్ చేసినా పదవ తరగతి చదివేవారికి ఇచ్చే ఉద్యోగం కూడా ఇవ్వలేమన్నట్లే మాట్లాడేవారు. నన్ను నేను నమ్ముకున్నాను.. మళ్లీ ఆరు నెలల శిక్షణ తీసుకున్నాను. ఈసారి ఉద్యోగం కోసం పోరాటం కొనసాగించాను. వివిధ ఆన్లైన్ పోర్టళ్లలో నా పేరు నమోదు చేసుకున్నాను. దీంతో కొన్ని ఎన్జీవోలకు నా పూర్తి సమాచారం చేరింది. టెక్ మహీంద్రా కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇంటినుండి పని చేసుకునే పర్మనెంట్ అవకాశం గల ఉద్యోగం కావడంతో సులభంగా చేయగలుగుతున్నాను. సంగీత పరిజ్ఞానం ఉండటంతో వేదికల మీద ప్రదర్శనలు ఇస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో మార్కెటింగ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాను. ‘రైజింగ్ స్టార్’ టీవీ షోస్‌లో పాల్గొన్నాను. ఆస్మాన్ ఫౌండేషన్ వారి కార్యక్రమంలో ఇళయరాజా పాట పాడటం నా జీవితంలో అతి ముఖ్యమైనది. అమితాబ్ బచ్చన్‌తోపాటు చాలా మంది ప్రముఖులు ఆ పాటను రీట్వీట్ చేయడంతో దేశవ్యాప్తంగా పేరు పొందాను. ఈ యేడాది ‘మిస్ వీల్ చెయిర్ ఇండియా’ పోటీల్లో ఫైనల్స్‌కి చేరాను. కూర్చొని డ్యాన్స్ చేస్తాను. పాడతాను. రోజంతా హుషారుగా గడుపుతాను. నా జీవితంలో నేను జాలిపడేది ఏమీ లేదని నాకు అర్థమైంది. చాలామంది వికలాంగులతో నాకు పరిచయం ఉంది. జీవితం పట్ల వారిలో భయాందోళనలను గమనించాను. సానుభూతిని కోరుకోవడం చూశాను. బతికినంత కాలం నా మనసులో ఏముందో అదంతా చేసేస్తాను. ఎవరైనా తమను తాము ఉన్నట్లుగా అంగీకరించాలి. అప్పుడు మన జీవితాన్ని నిస్సహాయతతో కాకుండా సరదాగా గడపగలుగుతాం’’ అని చెబుతున్న హీనా శర్మ మాటలే కాదు చేతలు కూడా నేటి యువతకు స్ఫూర్తిని కలిగిస్తాయి. -
వీల్‌చైర్ ట్రావెలర్
‘నా వీల్‌చైరే నా రెక్కల గుర్రం’ అంటుంది పర్విందర్ చావ్లా. ప్రపంచంలో 196 దేశాలు ఉంటే ఇప్పటికి వీల్‌చైర్ మీదే 59 చుట్టేసింది. 15 ఏళ్ల వయసులో ఆర్థ్రయిటీస్ వల్ల వీల్‌చైర్‌కి పరిమితం అయిన చావ్లా జీవితాన్ని ఉత్సాహంగా ఉంచడానికి పర్యటనలను మార్గం చేసింది. తిరగాలన్న పురుగు కుట్టనే కూడదు... ఒక్కసారి కుట్టాక ఎన్ని అడ్డంకులొచ్చినా ఆగరు అంటున్న చావ్లా అన్నీ సక్రమంగా ఉన్నా లోకాన్ని చూడక కుదేలై ఉండేవారికి చాలా స్ఫూర్తినిస్తోంది. ఆమెకు 15 ఏళ్లు ఉన్నప్పుడు జరిగింది అది. ఏదో పెళ్లి ఫంక్షన్. భోజనానికి కూచున్న పర్విందర్ చావ్లా తినడానికి దవడ తెరవలేకపోయింది. ఆ తర్వాత పెళ్లి వాళ్లందరూ డాన్స్ చేస్తుంటే తానూ డాన్స్ చేయబోయి నడుము వంచలేక కింద పడిపోయింది. డాక్టర్ దగ్గరకు తీసుకెళితే తీవ్రమైన రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్ అన్నారు. ఆ తర్వాత పర్విందర్ చావ్లా జీవితం రెండేళ్ల పాటు నరకంగా మారింది. మంచం మీద పడుకునే ఉండిపోయింది. ఇటు నుంచి అటు కదలాలన్నా విపరీతమైన నొప్పి.ఆ తర్వాత మెల్ల మెల్లగా కోలుకుంది. కాని చేతి వేళ్లతో సహా చాలా శరీర భాగాల్లోని జాయింట్లు దెబ్బతిన్నాయి. 21 ఏట వచ్చే సరికి వీల్ చైర్‌కు పరిమితం కాక తప్పలేదు. కొద్దిగా లేవగలదు. నాలుగు అడుగులు వేయగలదు. కాని మిగిలినదంతా వీల్‌చైర్ పైనే. శరీరాన్ని కదల్చే వీలు లేకుండా చేసి జీవితం తనను ఆపగలిగింది... కాని కదలకుండా ఉండిపోయి జీవితాన్ని గెలవనీకూడదు. దానిని ఓడించాలి అని పర్విందర్ నిశ్చయించుకుంది. వైష్ణోదేవి యాత్ర మొదలు పర్విందర్ చావ్లాది లూధియానా. తండ్రికి హోటల్ బిజినెస్ ఉంది. తల్లి గృహిణి. కూతురి అవస్థ చూసి తండ్రి నీ ఇష్టమైన పని చేసి సంతోషంగా ఉండు అని ప్రోత్సహించాడు. ఆ సమయంలోనే కాలేజీ ఫ్రెండ్స్ కొందరు వైష్ణోదేవిని దర్శించుకోవడానికి జమ్ము కశ్మీర్ వెళుతుంటే పర్విందర్ కూడా వాళ్లతో వెళ్లాలనుకుంది. కాని వీల్‌చైర్‌తో ఆ ప్రయాణం ఏ మాత్రం అనువుగా ఉంటుందో తెలియదు. పర్విందర్ ధైర్యం చేసింది. వైష్ణోదేవి మందిరం చేరుకుంది. లోపలికి వెళ్లడానికి ర్యాంప్ లేదు. నలుగురు భక్తులు కుర్చీతో సహా లేపి ఆమెను లోపలికి తీసుకెళ్లారు. అందాక ఇంట్లో, పరిమిత వీధుల్లో తిరిగిన పర్విందర్కు ఆ హిమాలయాల చెంత, ఆ ప్రకృతి మధ్యన, ఆ ఆధ్యాత్మిక ప్రదేశంలో అమితమైన ఆనందం కలిగింది. ఏమిటి... ప్రయాణాలు చేస్తే ఇంత బాగుంటుందా? అనుకుంది. ‘అప్పుడే నన్ను తిరిగే పురుగు కుట్టింది’ అంటుంది పర్విందర్ నవ్వుతూ. ఒంటరిగానే తిరగాలని... పర్విందర్ ఇప్పుడు ముంబైకి షిఫ్ట్ అయ్యింది. అక్కడి నుంచే ప్రపంచ దేశాలన్నీ తిరగాలని నిశ్చయించుకుంది. ఆమె అప్పటికే దాదాపు లక్షన్నర రూపాయల విలువైన మంచి నాణ్యత కలిగిన లైట్ వెయిట్ వీల్‌చైర్‌ను ఏర్పాటు చేసుకుంది. దాని మీద కూచుని రోడ్ల మీద హాయిగా తిరగొచ్చు. దానిని సెకన్లలో మడిచి ట్యాక్సీలో ఎక్కించి ఎయిర్పోర్ట్ వెళ్లొచ్చు. సెకన్లలో తెరిచి కూచోవచ్చు. ఎవరో ఒకరు తోడు వస్తే బాగుంటుంది కానీ వారి కదలికలకి తన కదలికలకి చాలా తేడా ఉంటుంది. అందుకే తాను ఒక్కర్తే తిరగాలని నిశ్చయించుకుంది. దుబాయ్‌తో మొదలు ప్రపంచ దేశాలన్నింటిలోకి వీల్‌చైర్ ఫ్రెండ్లీ దేశం దుబాయ్ అని పర్విందర్ తెలుసుకుంది. అందుకే మొదట ఆ దేశానికే ఒంటరిగా ప్రయాణం కట్టింది. ప్రయాణం చేసే ముందు తాను దిగబోయే హోటల్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటుంది పర్విందర్. అక్కడ ఉన్న మెట్ల గురించి, ర్యాంప్‌ల గురించి, గదిలో టాయిలెట్ల సౌకర్యం గురించి దివ్యాంగులను సపోర్ట్ చేసేలా అక్కడ వ్యవస్థ ఉందో లేదో చూసుకుని వెళుతుంది. ‘మీరు భాష రాని దేశానికి వెళుతున్నట్టయితే గూగుల్ ట్రాన్స్‌లేటర్ డౌన్లోడ్ చేసుకుని ఉండాలి’ అంటుంది పర్విందర్. ఆ తర్వాత ఆమె బాలీ వెళ్లింది. ఆ తర్వాత రోమ్. ఆ తర్వాత అలా అలా ఆమె ప్రయాణాలు సాగిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు 53 ఏళ్లు ఆమెకు. 59 దేశాలు చూసింది. ‘ఒక వంతు ప్రపంచం చూశాను. ఇంకా మూడు వంతులు చూడాలి’ అంటుందామె. ఈ ప్రయాణాల వల్లే కాబోలు ఆమె నైరాశ్యం దరి చేరకుండా ఉత్సాహంగా ఉంటుంది. మనుషులే తోడు ఏ దేశం వెళ్లినా మనుషులే తోడుగా సాయం చేయడం ఆమె గమనించింది. ‘మనం మంచిని చూస్తే మంచి చెడును చూస్తే చెడు ఈ లోకంలో కనిపిస్తాయి. ఎందరో ముక్కూ మొహం తెలియని వ్యక్తులు ఈ పర్యటనల్లో నాకు సాయం చేశారు. కొందరు బస్సు ఎక్కిస్తే మరి కొందరు నేను దిగాల్సిన హోటల్ వరకూ వచ్చి దిగబెట్టి వెళ్లారు. ‘మీరు ప్రకృతిని చూడాలంటే ఆస్ట్రేలియా వెళ్లాలి. నేను అక్కడకు వెళ్లి నెలల తరబడి ఉంటాను’ అంటుందామె. అమెరికాలో కొన్ని నగరాలు, లండన్ వీల్‌చైర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. మన దేశంలో ఆగ్రా పూర్తిగా వీల్‌చైర్ ఫ్రెండ్లీ. ఆ తర్వాత మన దేశంలో ఢిల్లీ అంటుందామె. కాని చైనాలో ఆమెకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ‘వాళ్లు మనం ఏం చెబుతున్నామో అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు’ అంటుంది పర్విందర్. ఆమె ప్రయాణాలు ఆమెకు స్వస్థత కలిగిస్తూనే ఉంటాయి. దోహాలో..., ఆస్క్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్లో... -
స్వర్ణలత ఈ స్థాయికి ఎదగడం చిన్న విషయం కాదు!
చెవులు వినపడవు. ‘పాపం ఈ పిల్లను ఎవరు చేసుకుంటారు?’ కళ్లు కనిపించవు. ‘అయ్యో. ఎలా బతుకుతుంది’ నడవలేదు. ‘జన్మంతా అవస్థే’ దివ్యాంగులపై జాలి, సానుభూతి రోజులు పోయాయి. వాటిని ఉచితంగా పడేస్తే అదే పదివేలు అని మహిళా దివ్యాంగులు అనుకోవడం లేదు. మేము సాధిస్తాం.. మేము జీవిస్తాం... ఈ జగత్తు మాది కూడా అని ముందుకు సాగుతున్నారు. స్వర్ణలత ఒక ఉదాహరణ. మస్క్యులర్ డిజార్డర్ వల్ల వీల్‌చైర్‌కు పరిమితమైనా గాయనిగా, రచయితగా, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలిగా, మోటివేషనల్ స్పీకర్‌గా గుర్తింపు పొందింది. ఆమె స్ఫూర్తిదాయక పరిచయం ఇది. జీవితం ఒక్కోసారి అడుగు ముందుకు పడనివ్వదు. మరోసారి శరీరం కదలిక కోల్పోయి ముందుకు అడుగు పడనివ్వదు. కాని జీవితంలో కాని, శరీరం మొరాయించినప్పుడు కాని మొండి పట్టుదలతో ముందుకు సాగితే దారి కనిపిస్తుంది. గమ్యం కనిపిస్తుంది. గమనంలో తోడు నిలిచేవాళ్లుంటారని తెలిసి వస్తుంది. అచలనంలో జీవితానికి సార్థకత లేదని చలనంలోనే పరమార్థం ఉందని అర్థమవుతుంది. దివ్యాంగులు గతంలో న్యూనతతో ఇంటికి పరిమితమయ్యేవారు. నలుగురిలో వచ్చేవారు కాదు. ఇక ఆ దివ్యాంగులు స్త్రీలైతే మానసిక కుంగుబాటుతో ముడుచుకుపోయేవారు. కాని ఆ రోజులు పోయాయి. ‘మనల్ని మనలాగే మన శారీరక పరిమితులతోనే గౌరవించేలా ఈ సమాజంలో మార్పు తేవాలి. ఒకరిపై ఆధారపడకుండా మన జీవితాన్ని జీవించాలి. నలుగురికీ స్ఫూర్తినివ్వాలి’ అని మహిళా దివ్యాంగులు ముందుకు సాగుతున్నారు. జాలి చూపులు, సానుభూతి మాటలు... ఇవి అక్కర్లేదు... ఈ సమాజంలో దివ్యాంగులు ఒక భాగమని గుర్తించి... ఈ జగత్తులో తమ వాటా చోటును మాకు వదిలిపెట్టి... అందరూ తిరుగాడే చోటుల్లో తాము కూడా అడుగుపెట్టేలా సౌకర్యాలు ఉంచితే చాలు అని అంటున్నారు. పెద్ద ఉద్యోగాలు, డాక్టర్ చదువులు, ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారు. వీల్‌చైర్‌కు పరిమితమైనా ఆలోచనలకు రెక్కలు ఇస్తున్నారు. స్వర్ణలత– మల్టిపుల్ స్ల్కెర్లోసిస్ స్వర్ణలత వేదిక మీదకు వస్తే చాలు కరతాళధ్వనులు వినిపిస్తాయి. ఎందుకు? ఆమె మోటివేషనల్ స్పీకర్. ‘చూడండి... నేను వీల్‌చైర్‌లో ఉన్నాను. 80 శాతం నా శరీరంలో కదలిక లేదు. మీరు నూరు శాతం కదల వీలైన శరీరంతో ఆరోగ్యంగా ఉన్నారు. నేను నా పరిమిత కదలికల్లోనే సమాజం కోసం ఇంత చేస్తుంటే మీరు ఎంత చేయాలి?’ అని ఆమె ప్రశ్నిస్తే వింటున్నవారు చప్పట్లు కొడుతూ ఇన్స్పైర్ అవుతారు. కాని స్వర్ణలత ఈ స్థాయికి ఎదగడం చిన్న విషయం కాదు. బెంగళూరులో జన్మించిన స్వర్ణలత చిన్నప్పుడు ఆరోగ్యంగా ఉండేది. బాగా చదువుకుందామనుకుంది. కాని దిగువ మధ్యతరగతి కుటుంబం ఆమెను అడుగు పడనివ్వక కంప్యూటర్స్‌లో డిప్లమా చాల్లే అని ఆపేసింది. ఆ తర్వాత ఆమె ప్రేమించిన కుర్రాణ్ణి పెళ్లి చేసుకుంటే వెలి వేసి ఇంటికి రాకుండా ఆపేసింది. జీవితం ఇలా నిరోధిస్తుంటే పెళ్లయ్యి పాప పుట్టాక 2009లో ఆమెకు హటాత్తుగా మెడ దిగువల పక్షవాతం వచ్చింది. డాక్టర్లు పరీక్షించి దాని పేరు ‘మల్టిపుల్ స్ల్కెర్లోసిస్ అన్నారు. అంటే మెడ కింద వెన్ను ప్రాంతంలో కండరాల ఇబ్బంది వచ్చి శరీరం చచ్చుబడుతుంది. చిన్న పాప, ఏం చేయాలో తోచని భర్త. కాని స్వర్ణలత ధైర్యం చెప్పింది. ‘ఏం కాదు... పోరాడదాం’ అంది. తనకు ధైర్యం రావాలంటే తనలాంటి వారికి మేలు చేయాలని అనుకుంది. తనలాంటి వారిని గుర్తించి వెంటనే మల్టిపుల్ స్ల్కెర్లోసిస్ వచ్చిన తనలాంటి వారిని గుర్తించేలా ‘స్వర్గ ఫౌండేషన్’ స్థాపించింది స్వర్ణలత. కర్నాటక, తమిళనాడుల్లో ఈ వ్యాధితో బాధ పడేవారి గురించి పని చేయసాగింది. వారికి అందాల్సిన వైద్యం, ఉండవలసిన అవగాహన, కుటుంబ సభ్యులు ఎలా చూసుకోవాలి, వీల్‌చైర్‌లో ఉంటూనే జీవితంపై ఆశ కలిగి బతికే ఉపాధి ఎలా పొందాలి... ఇలాంటి విషయాలన్నీ ఈ స్వర్గ ఫౌండేషన్ చూస్తుంది. అంతే కాదు పబ్లిక్ ప్లేసులలో దివ్యాంగుల రాకపోకలకు అనువుగా ఉండేలా ర్యాంప్‌ల నిర్మాణం చేపట్టేలా సమాజాన్ని, పాలనా వ్యవస్థని అని సెన్సిటైజ్ చేస్తుంది. ‘కోయంబత్తూరులో దాదాపుగా అన్ని పబ్లిక్ ప్లేసుల్లో ర్యాంప్‌లు వచ్చేలా చూశాం. బడి కాని ఆస్పత్రి కాని దివ్యాంగులు సౌకర్యంగా వెళ్లి రావచ్చు’ అంటుంది స్వర్ణలత. కాని దివ్యాంగుల పట్ల సమాజం ఎంతో మారాల్సి ఉంది. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, రెస్టరెంట్లు, థియేటర్లు.. ఎన్నో వారి రాకపోకలకు వీలుగా లేవు. ఈ జగత్తు వారిది కూడా. వారు అందరిలానే అన్ని సౌకర్యాలు పొందుతూ జీవించేలా చూసే బాధ్యత మనది కూడా. ఆ విధంగా ఆలోచిద్దాం. ‘సారథి’లాంటి వాహనం స్వర్ణలత తన ఫౌండేషన్ తరఫున చేసిన మరో మంచి పని ‘సారథి’ పేర ఒక వాహనాన్ని తయారు చేయడం. ఇందులో దివ్యాంగులు తమ వీల్‌చైర్‌తో చాలా వీలుగా ప్రవేశించవచ్చు. లోపల సోఫా, బెడ్ ఉంటాయి. అంతేకాదు వేడి నీళ్ల బాత్రూమ్, టాయిలెట్ ఉంటాయి. ఇబ్బంది పడకుండా ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు. ‘ఈ సారథిని ఉపయోగించుకుని ఒక దివ్యాంగుడు మూడేళ్ల తర్వాత తన తల్లిని చూడటానికి వెళ్లాడు. ఒక 90 ఏళ్ల ఆమె ఎన్నేళ్లగానో చూడాలనుకున్న పుణ్యక్షేత్రానికి వెళ్లి వచ్చింది. నిజానికి ఇలాంటి వాహనాలు ప్రతి ఊళ్లో ఉండాలి. ప్రభుత్వాలు ప్రవేశ పెట్టాలి. వీటిని ఫీజుతో, పేదలకు తక్కువ చార్జీలతో ఉపయోగించవచ్చు’ అంటుంది స్వర్ణలత. -
ఇంట్లో వీల్‌చైర్‌లా... బయట స్కూటీలా
IIT Madras Created: దివ్యాంగులు ఎక్కడికైనా వెళ్లాలంటే ఎవరో ఒకరి తోడు ఉండాల్సిందే. అలాంటి వారి కోసం ఐఐటీ మద్రాస్ తయారు చేసిన బ్యాటరీ వాహనం ఎంతో ఉపయోగపడుతోంది. దానిని ఇంట్లో వీల్ చైర్‌లా..బయటకు వెళ్తే స్కూటీలాగా వాడొచ్చు. ఎవరి సహాయం లేకుండా ఒక్కరే ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఒక్కరే దానిని అటాచ్ చేసుకునేలా, తొలగించుకునేలా తయారు చేశారు. (చదవండి: హ్యాట్సాఫ్ సార్!... హీరోలా రక్షించారు!) నాలుగు గంటలు చార్జ్ చేస్తే ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా నగర్‌కు చెందిన శ్రావణ్ పద్నాలుగు సంవత్సరాల క్రితం ప్రమాదంలో నడవలేని స్థితికి చేరుకున్నాడు. అప్పటినుంచి ఎవరైనా తోడుంటేనే బయటకు వచ్చాడు. కానీ ఈ వెహికిల్ సహాయంతో ఒక్కడే బయటకు రాగలుగుతున్నాడు. కాగా, దీని ఖరీదు రూ.95,000. దీన్ని శ్రావణ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్టు చెబుతున్నాడు. – బి.శివ ప్రసాద్, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
అవని ఆనందం ఆకాశమంత...
పదకొండేళ్ల వయసు... ఆడుతూ పాడుతూ అన్నింటా తానే అయి అవని కనిపించేది. చురుకుదనానికి చిరునామాలా ఉండే ఆ అమ్మాయి జీవితంలో ఒక్కసారిగా చీకటి అలముకుంది. అయితే అనూహ్యంగా ఎదురైన కారు ప్రమాదం ఆమెను ఒక్కసారిగా అగాధంలోకి పడేసింది. జీవితం పట్ల ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకోని, ఎలా ముందుకు వెళ్లాలో తెలీని వయసు! లేడి పిల్లలా సాగే పరుగు ఆగిపోయి చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సి రావడం అవనికి తీవ్ర ఆవేదనను మిగిల్చింది. దాంతో సహజంగానే తన బాధను, అసహనాన్ని, ఆగ్రహాన్ని తల్లిదండ్రుల మీద చూపించేది. అలాంటి స్థితి నుంచి ఆమెను బయటకు తీసుకొచ్చిన ప్రయత్నం ఒక ఒలింపిక్ చాంపియన్‌ను తయారు చేసింది. రాజస్తాన్ రాజధాని జైపూర్ అవనీ లేఖరా స్వస్థలం. 2012లో జరిగిన కారు ప్రమాదంలో ఆమె వెన్నుపూస విరిగిపోయింది. నడుము కింది భాగం మొత్తం చచ్చుబడిపోవడంతో ఇక చేసేందుకు ఏమీ లేక వీల్‌చైర్‌లోనే ఆమె జీవితం కొత్తగా మొదలైంది. సుమారు మూడేళ్లపాటు అవని తీవ్ర క్షోభ అనుభవించింది. అప్పుడప్పుడు కొన్ని పుస్తకాలు చదవడం మినహాయిస్తే మరో వ్యాపకం లేకపోయింది. ఒకరోజు ఆమెను ఈ జ్ఞాపకాల నుంచి కాస్త దూరంగా, బయటి ప్రపంచంలోకి అడుగు పెడితే బాగుంటుందని భావించిన తండ్రి ప్రవీణ్ సమీపంలోని షూటింగ్ రేంజ్‌కు తీసుకుపోయాడు. నగరంలోని జగత్‌పుర వద్ద ఉన్న షూటింగ్ రేంజ్ మొదటి సారే ఆమెను ఆకట్టుకుంది. అయితే అది సరదాగా మాత్రమే. పూర్తి స్థాయిలో ప్లేయర్ కావాలనే ఆలోచన రానేలేదు. ఇలాంటి స్థితిలో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా ఆటోబయోగ్రఫీ ‘ఎ షాట్ ఎట్ గ్లోరీ’ని చదివే అవకాశం కలిగింది. అంతే... ఆ విజయ ప్రస్థానం ఒక్కసారిగా అవనిలో స్ఫూర్తి నింపింది. దాంతో మెల్లగా షూటింగ్‌పై ఆసక్తిని పెంచుకుంది. కూతురిలో వచ్చిన మార్పును గమనించిన తండ్రి ఆమెకు సరైన దిశానిర్దేశం చేసేందుకు ఇదే తగిన సమయమని భావించాడు. అవని పూర్తి స్థాయిలో షూటింగ్ క్రీడపై దృష్టి పెట్టే అవకాశం కల్పించాడు. కోచింగ్ సౌకర్యం, ఎక్విప్మెంట్ అందించే విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అవనికి థెరపీ చేయాల్సిన ఫిజియో కరోనా సమయంలో చాలా దూరం నుంచి రావాల్సి ఉండటంతో ఇబ్బంది లేకుండా ఆ బాధ్యతలు కూడా తల్లిదండ్రులే తీసుకున్నారు. ఈ ఆరేళ్ల శ్రమ ఇప్పుడు అవనిని ఒలింపిక్ విజయం శిఖరంపై నిలబెట్టింది. బింద్రా ప్రేరణగా ముందంజ వేసిన ఆ అమ్మాయి ఇప్పుడు ఒలింపిక్ స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా తనకంటూ కొత్త చరిత్రను లిఖించుకుంది. వరుస విజయాలతో... ఒలింపిక్ పతకంతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్నా... గత నాలుగేళ్లుగా అవని నిలకడగా విజయాలు సాధిస్తూనే వచ్చింది. 2017లో ఆమె అంతర్జాతీయ అరంగేట్రం జరగ్గా, జూనియర్ స్థాయిలో ప్రపంచ రికార్డుతో సత్తా చాటింది. అదే ఏడాది బ్యాంకాక్‌లో జరిగిన ప్రపంచకప్‌లో కాంస్యంతో తొలిసారి అవని వెలుగులోకి వచ్చింది. తర్వాతి ప్రపంచకప్ (క్రొయేషియా)లో అంతకంటే మెరుగైన ప్రదర్శనతో రజతం సాధించిన ఆమె... 2019లోనూ దానిని నిలబెట్టుకుంది. భారత మాజీ షూటర్ సుమా శిరూర్ ఈ ప్రస్థానంలో అవనికి కోచ్‌గా వ్యవహరించింది. గత రెండేళ్లుగా ఒలింపిక్స్ కోసమే ప్రత్యేక ప్రణాళికతో వీరు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న అవని రాజస్తాన్ రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖలో అసిస్టెంట్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ హోదాలో విధులు నిర్వహిస్తోంది. మరోవైపు జైపూర్ యూనివర్సిటీ నుంచి ‘లా’ కూడా చదువుతోంది. నా సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను. ప్రపంచాన్ని గెలిచినట్లుగా అనిపిస్తోంది. నా పతకాన్ని భారతీయులందరికీ అంకితమిస్తున్నా. ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు మరిన్ని పతకాలు సాధిస్తాననే నమ్మకముంది. గతం గురించి, భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం లేదు. నేను వర్తమానంలోనే జీవించడాన్ని ఇష్టపడతాను. ఫైనల్లో బరిలోకి దిగినప్పుడు కూడా పతకం లక్ష్యంగా పెట్టుకోలేదు. ఒక్కో షాట్ సమయంలో ఆ ఒక్క షాట్ గురించి మాత్రమే ఆలోచించేదాన్ని. తొలిసారి రైఫిల్ పట్టుకున్నప్పుడు ఎంతో ఆనందం కలిగింది. ఇక దాంతో పెనవేసుకుపోయిన నా అనుబంధం ఇక్కడి వరకు తీసుకొచ్చింది. –అవనీ లేఖరా -
మొట్టమొదటి స్వదేశీ వీల్‌చైర్ వెహికల్
న్యూఢిల్లీ: దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ వీల్‌చైర్ వెహికల్‌ను తయారు చేసినట్లు ఐఐటీ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నా లజీ) మద్రాస్ పరిశోధకులు ప్రక టించారు. ఈ వాహనం రోడ్లపైనే కాదు, ఇతర అనను కూల ప్రాంతాల్లోనూ ఉపయో గపడు తుందని చెప్పారు. ‘నియోబోల్ట్ అనే పేరు న్న ఈ వాహనంలో వాడే లిథియం– అయాన్ బేటరీని ఒక్కసారి ఛార్జి చేస్తే 25 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. వీల్‌చైర్ వాడే వారికి ఇది ఎంతో సౌకర్యం, సురక్షితం. ఆటో, స్కూటర్, కారు కంటే దీనికయ్యే ఖర్చు తక్కువ’అని వారన్నారు. ఐఐటీ మద్రాస్ లోని సెంటర్ ఫర్ రిహాబిలిటేషన్ రీసెర్చ్ అండ్ డివైజ్ డెవలప్మెంట్ విభాగం ‘నియో మోషన్’ అనే స్టార్టప్‌తో వాణిజ్య స్థాయిలో ఉత్పత్తికి సన్నాహాలు ప్రారంభిం చిందన్నారు. ఈ వీల్ చైర్ సుమారుగా రూ.55 వేలకే అందుబాటులోకి వచ్చే అవకా శం ఉందని ఐఐటీ మద్రాస్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన సుజాతా శ్రీనివాసన్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో నియోబోల్ట్ మాదిరి విశిష్టలతో కూడిన వాహనాల ధరలు మూడు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. దేశంలో ఏటా అమ్ముడయ్యే దాదాపు 3 లక్షల వీల్ చైర్లలో 2.5 లక్షల వీల్ చైర్లు విదేశాల్లో తయారైనవేనని చెప్పారు. -
ఆమె అలా తప్పించుకుంది
పారిపోవాలి. బతకాలి. తాలిబన్ల చేతికి చిక్కకూడదు. లక్షల మంది ఆకాంక్ష అఫ్గానిస్తాన్‌లో ఇప్పుడు. కాని అందరికీ వీలవుతుందా? సాధ్యమవుతుందా? తుపాకీ గొట్టాన్ని తప్పించుకోగలరా? అఫ్గానిస్తాన్ వీల్చైల్ బాస్కెట్‌బాల్ కెప్టెన్ నీలోఫర్ బయత్ అక్కడి నుంచి భర్తతో సహా స్పెయిన్‌కు తప్పించుకోగలిగింది. కాని దాని వెనుక ఒక సినిమా అంత కథ ఉంది. ఏమిటి అది? ఆగస్టు 14న కాబూల్ తాలిబన్ల హస్తగతం అయ్యింది. ఆగస్టు 20న నీలోఫర్ బయత్ స్పెయిన్‌కు చేరుకోగలిగింది. ఈ మధ్యలోని 5 రోజులే ఆమె పారిపోవడానికి సంబంధించిన ఒక ఉత్కంఠ కథ. స్పెయిన్‌లోని బిల్బావ్ నగరానికి చేరుకుని ఆమె తెరిపినపడి కాఫీ తాగుతూ కూచుంది కాని ఆమె చేతులు ఇంకా ఒణుకుతున్నాయి. గుండె అదురుతూనే ఉంది. కళ్లు ఉండి ఉండి కన్నీరు కారుస్తూనే ఉన్నాయి. ఆమె తన భర్తతో పాటు తప్పించుకోగలిగింది. కాని తన బంధువులు, అయినవారు కాబుల్‌లోనే ఉన్నారు. వారి గతి ఏమిటి? భర్తతో కలిసి స్పెయిన్ విమానాశ్రయంలో ... ఆమె చేసిన పని కాబూల్ తాలిబన్ల హస్తగతం అయిన వెంటనే నీలోఫర్ బయత్ తీసుకున్న నిర్ణయం ఏమిటంటే దేశాన్ని విడిచి పెట్టడం. ఆమె అఫ్గానిస్తాన్‌లోని వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ టీమ్ కెప్టెన్. అంతేకాదు మహిళల హక్కుల గురించి, దివ్యాంగుల అవసరాల గురించి కూడా మాట్లాడుతుంది. కాబూల్‌లో ఆమె ఒక సెలబ్రిటీ. ఆమె భర్త రమేష్ కూడా దివ్యాంగుల బాస్కెట్‌బాల్ టీమ్‌లో ఆడతాడు. ఇద్దరూ ఎన్నో కలలు కన్నారు. గత దశాబ్ద కాలంలో కాబూల్‌లో దివ్యాంగుల క్రీడల ఉన్నతికి పని చేస్తున్నారు. ఇంకా చేయాలనుకున్నారు. ఇంతలోనే తాలిబన్లు వచ్చేశారు. ‘వాళ్లు కచ్చితంగా నా కోసం వెతుకుతారని నాకు తెలుసు. అప్పటికే నాలాంటి వారి కోసం ఇల్లిల్లు వెతుకుతున్నారు’ అని నీలోఫర్ బయత్ అంది. ‘వెంటనే మనం దేశం విడిచిపెట్టాలి అని నా భర్తతో చెప్పాను’ అందామె. ఆమె అంత భయపడటానికి కారణం ఆమె చిన్నప్పుడు తాలిబన్ల మొదటి పాలనలో ఒక మిస్సైల్ ఆమె ఇంటి మీద కూలింది. ఒక సోదరుడు మరణించాడు. ఆమె వీపు కాలిపోయి వెన్నుకు గాయమైంది. దాంతో దివ్యాంగురాలైంది. అలాగే భర్త కూడా ల్యాండ్‌మైన్ పేలడంతో దివ్యాంగుడయ్యాడు. ఆ అనుభవాలు చాలు అనుకుందామె. జర్నలిస్ట్ ప్రమేయంతో... నీలోఫర్ వెంటనే చాలా ఏళ్లుగా తనకు తెలిసిన స్పానిష్ జర్నలిస్టు ఆంటోనియో పంప్లెగాతో తన బాధ మొరపెట్టుకుంది. ఆ జర్నలిస్టు ఆమె గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. స్పెయిన్ పౌరులు ఆ పోస్టుకు స్పందించారు. స్పెయిన్ ప్రభుత్వం కాబూల్ కేంద్రంగా యూరోపియన్ యూనియన్ ఇన్స్టిట్యూషన్స్లో పని చేసిన తన దేశీయులను, అఫ్గాన్ పౌరులను తరలించే కార్యక్రమాలు చేస్తోంది. ఆ విమానాల్లోనే నీలోఫర్‌ను భర్తతో పాటు తీసుకురావడానికి అంగీకరించింది. స్పెయిన్‌లో భర్తతో నీలోఫర్ బయత్ ‘అది తెలిసిన వెంటనే నేనూ నా భర్త కాబూల్ ఎయిర్పోర్ట్ వైపు కదిలాం. కాని సులభమా ఆ పని? అప్పటికే తాలిబన్లు ఎయిర్‌పోర్ట్‌ను చుట్టుముట్టారు. వాళ్ల తుపాకులు గాల్లో కాల్పులు చేస్తున్నాయి. మరోవైపు ఇతర పౌరులు కూడా వెర్రెత్తి ఎయిర్‌పోర్ట్‌లో చొరబడాలని చూస్తున్నారు. అసలు ఎయిర్‌పోర్ట్‌లో ప్రవేశించగలమా? అనుకున్నాను. ఎయిర్పోర్ట్ బయట ఏ క్షణమైనా మేము చనిపోవచ్చు. ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టడానికి బయట మేము 9 సుదీర్ఘ గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా తాలిబన్లు మా లగేజ్‌ను మాతో తీసుకెళ్లనివ్వలేదు. కట్టుబట్టలతో లోపలికి వెళ్లాం’ అందామె. వొంటి మీద బట్టలతో ఐదు రోజులు ఒంటి మీద బట్టలతో కాబుల్ ఎయిర్‌పోర్ట్‌లోకి చేరుకున్న నీలోఫర్ ఆమె భర్త రమేశ్ తమకు విమానంలో చోటు దక్కడం కోసం దాదాపు ఐదు రోజులు ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయారు. ‘దేశం విడిచిపెట్టడమే ఒక విషాదం. కట్టుబట్టలతో పరాయి దేశంలో దిగడం అంటే మళ్లీ జీవితాలను జీరో నుంచి మొదలెట్టడమే’ అందామె. ఎయిర్‌పోర్ట్‌లో అనుక్షణం ఆశనిరాశల భీతావహ క్షణాల తర్వాత వారికి స్పెయిన్ విమానం చోటు ఇచ్చింది. మొత్తం 105 పాసింజర్లతో అఫ్గాన్ శరణార్థుల కోసం స్పెయిన్ తన దక్షిణ భాగాన తెరిచిన మిలటరీ బేస్‌కు సురక్షితంగా చేరుకుంది. అక్కడి నుంచి ఆ దంపతులు బిల్బావ్ నగరానికి చేరుకున్నారు. ఊపిరి పోసిన ఆదరణ నీలోఫర్ బయత్ అదృష్టవంతురాలు. స్పెయిన్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ వెంటనే ఆమెకు బిల్బావ్ బాస్కెట్‌బాల్ టీమ్‌లో ఆడటానికి ఆహ్వానం పలికింది. భర్త రమేశ్‌కు కూడా పురుషుల టీమ్‌లో ఆడమని కోరింది. వారికి ఉపాధి దొరికినట్టే. కాని శరణార్థులుగా వారి జీవితం ఏం కానుంది? అఫ్గానిస్తాన్‌లో ఉండిపోయిన వాళ్ల బంధువుల జీవితాలు ఏం కానున్నాయి. ఇవన్నీ కాలమే తేల్చనుంది. మనిషి ఎంత ఆధునికుడైనా సాటి మనిషిని వేధించడంలో మృగ స్వభావం ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఆ మృగాన్ని మొదటే గుర్తించి ఆపకపోతే ఇవాళ అఫ్గానిస్తాన్ రేపు ఏదేశమో? -
ప్రేమ్ ఇల్లమ్.. వీల్చెయిర్తోనే నడిపిస్తోంది
వైకల్యంతో వీల్ చెయిర్‌కు పరిమితమైన ఇందిర ను చైల్డ్‌కేర్ హోమ్‌లో చేర్చారు తల్లిదండ్రులు. వారానికి ఒకసారి మాత్రమే ఇంటి నుంచి ఎవరో ఒకరు వచ్చి ఇందిరను కలిసేవారు. ఇందిరకేమో వాళ్లను పదేపదే చూడాలనిపించేది. ఎంతో ఇష్టమైన తన వాళ్లకు దూరంగా ఉన్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యక్షం గా అనుభవించిన ఇందిర తనలాంటి వాళ్లకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ‘ప్రేమ్ ఇల్లమ్’ పేరుతో షెల్టర్ హోమ్ ను నడుపుతూ.. 30 మంది పిల్లలను అమ్మలా ఆదరిస్తున్నారు. ఇందిరకు ఐదేళ్లు ఉన్నప్పుడు పోలియో వచ్చి తొంభైశాతం వైకల్యానికి గురైంది. నడవడానికి రెండు కాళ్లు సహకరించనప్పటికీ ‘ఏదోఒకరోజు నేను నడవగలుగుతాను’ అన్న ధైర్యంతో ఉండేది. తల్లిదండ్రులు చెన్నైలోని ఓ షెల్టర్ హోంలో ఇందిరను చేర్చారు. హోమ్‌లో ఉన్న పిల్లలంతా బొమ్మలతో ఆడుకోవడానికి ఇష్టపడితే ఇందిర మాత్రం చదువుకునేందుకు ఆసక్తి చూపించేది. అన్నయ్య ప్రోత్సాహంతో.. షెల్టర్ హోమ్‌లో సైకాలజిస్టుగా పనిచేస్తోన్న అన్నయ్య సెల్విన్ ఇందిర ఆసక్తిని గమనించి తల్లిదండ్రులతో మాట్లాడి ఇందిర డైలీ స్కూలుకు వెళ్లి చదువుకునేందుకు ప్రోత్సహించాడు. ఇందిర ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందోనని తల్లిదండ్రులు భయపడ్డప్పటికీ, అన్న అండతో‡ధైర్యం గా ముందుకు సాగింది. కానీ చాలా స్కూళ్లు ఇందిర వైకల్యాన్ని సాకుగా చూపించి అడ్మిషన్ ఇవ్వడానికి వెనకాడాయి. ఎట్టకేలకు ఒక స్కూలు ఇందిరకు ఎనిమిదో తరగతిలో చేరేందుకు అడ్మిషన్ ఇచ్చింది. స్కూల్లో చేరిన ఇందిర అనేక భయాలు, ఆత్మనూన్యతకు లోనైనప్పటికీ అంకిత భావంతో ఎంతో కష్టపడి చదివి ఎస్ఎస్ఎల్సీ మంచి మార్కులతో పాసైంది. అలాగే డిగ్రీ, ఎంసీఏ కూడా పూర్తి చేసింది. ప్రేమ్ ఇల్లమ్.. ఇందిర లాంటి వాళ్లను మరింత మందిని ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో సెల్విన్ 1999లో ‘ప్రేమ్ ఇల్లమ్’ను స్థాపించి వైకల్యం గలిగిన పిల్లలకు ఆసరాగా నిలుస్తున్నాడు. ఇందిర ఎంసీఏ అయ్యాక ఉద్యోగం చేసే అవకాశం వచ్చినప్పటికీ ప్రేమ్ ఇల్లమ్‌లో చేరి సేవ చేయాలని నిర్ణయించుకుంది. 2017 నుంచి ప్రేమ్ ఇల్లమ్ సంస్థకు సేవలందిస్తోంది. ప్రస్తుతం ప్రేమ్ ఇల్లమ్‌లో 30 మంది అమ్మాయిలు ఉన్నారు. వీరిలో ఐదుగురు స్కూలుకెళ్తుండగా మిగతా వారంతా హోమ్‌లోనే ఉంటున్నారు. ఈ పిల్లలకు చదువు చెప్పడం కోసం ఇందిర స్పెషల్ ఎడ్యుకేషన్‌లో బిఈడీ చేసి వారికి పాఠాలు చెబుతోంది. అంతేగాక 2019 నుంచి సేంద్రియ పద్ధతిలో పంటలు పండిస్తూ, ఆ పంటలతోనే షెల్టర్ హోమ్ పిల్లలకు భోజనం పెడుతుండడం విశేషం. కరోనా కష్టకాలంలో గ్రామంలోని పాజిటివ్ పేషంట్లకు భోజనాన్ని పంపిణీ చేసింది. ‘‘నా చిన్నప్పటినుంచి పన్నెండేళ్ల వరకు షెల్టర్ హోంలో గడిపాను. దీంతో బయట సమాజంలో ఎలా ఉంటుందో తెలిసేది కాదు. శారీరక, మానసిక వైకల్యం లేని పిల్లల్ని ఎప్పుడూ కలవలేదు. ఎనిమిదో తరగతిలో చేరి కొత్తకొత్త పాఠ్యాంశాలను నేర్చుకోవడం, తోటి విద్యార్థులతో కలవడం కష్టంగా ఉండేది. రోజూ స్కూలు అవగానే అన్నయ్య దగ్గర బాధపడేదాన్ని. ‘‘నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు నిన్ను నువ్వు గట్టిగా నమ్ము’’ అని వెన్ను తట్టి చెప్పేవారు. అ ప్రోత్సాహంతోనే ఎంసీఏ వరకు చదివాను. నాకు ఒకరు ఏవిధంగా చెయ్యందించారో అలానే నేను నాలాంటి వాళ్లకు సాయం చేయాలని ప్రేమ్ ఇల్లమ్‌లో పని చేస్తున్నాను. మేము సేంద్రియ పద్ధతిలో ఒక్కో పంటకు 25 బస్తాల ధాన్యాన్ని పండిస్తాము. అవి హోమ్‌లో ఉన్న పిల్లలకు సరిపోతాయి. కూరగాయలు, పండ్ల చెట్లు కూడా పెంచి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం’’ అని ఇందిర చెప్పింది. పట్టుదలకు వైకల్యం అడ్డురాదని, ఎంతటి పనినైనా సాధించవచ్చని ఇందిర ‘ప్రేమ్ ఇల్లమ్’ నిరూపిస్తుంది. -
పిరికిపందలకు తలొగ్గేది లేదు: వీల్‌చైర్‌లోనే రోడ్‌షో
సాక్షి, కోలకతా: తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ (66) చెప్పినట్టుగానే వీల్ చెయిర్లో ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ఆపేది లేదనీ వీల్ చైర్లోనే ప్రజలను కలుస్తానని ప్రకటించిన మమత ఆదివారం కోల్‌కతాలో భారీ రోడ్‌షోకు హాజరయ్యారు.నందిగ్రామ్‌లో ప్రచారం సందర్భంగా గాయపడిన మమతా నాలుగు రోజుల తరువాత, తొలి బహిరంగ కార్యక్రమానికి హాజరయ్యి కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ధైర్యంగా పోరాటం కొనసాగిస్తామంటూ ఆమె ట్వీట్ చేశారు. ఇంకా చాలా పెయిన్ ఉంది. కానీ ప్రజల బాధలు ఇంకా ఎక్కువగా భావిస్తున్నారు. తన పవిత్ర భూమిని రక్షించుకునే ఈ పోరులో చాలా బాధలు పడ్డాం. ఇంకా పడతాం.. కానీ పిరికిపందలకు తలొగ్గేది లేదని దీదీ ప్రకటించారు. దాడి జరగలేదు : ఈసీ మరోవైపు సీఎం మమతా బెనర్జీపై దాడి జరిగిందన్న వాదనను ఈసీ తోసిపుచ్చింది. ఆమె సెక్యూరిటీ సిబ్బంది వైఫల్యంగా కారణంగానే ఆమె గాయపడ్డారని ఈసీ వర్గాలు తాజాగా వెల్లడించాయి. -
విరాళి మోది.. కూర్చుని ఎగిరింది!
పులిని ఎదిరించిన మేకపిల్ల కథ ప్రేరణ. కరువున కురిసిన వాన కథ ప్రేరణ. పేగు అడ్డుపడినా జన్మించి కేర్మనడం ప్రేరణ. ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు జవాబుగా మారడం ప్రేరణ. ప్రేరణ అందరూ కలిగించలేరు. అందుకు అర్హత కలిగిన వారు పలికిన మాట నుంచే అది జనిస్తుంది. విరాళి మోది డిజెబిలిటి యాక్టివిస్ట్. మోటివేషనల్ స్పీకర్. ప్రయోజనకరమైన చలనం మనిషికి అవసరం అని ఆమె చెబుతుంది. ఆమె తన వీల్‌చైర్‌లో నుంచి లేచి నిలబడలేదు. కూర్చుని నేను ఎగర గలుగుతున్నప్పుడు మీకేం తక్కువ? అని సూటిగా అడిగి దమ్మునింపుతుంది. ఆమె పరిచయం... విరాళి మోది వయసు ఇప్పుడు 30 ఏళ్లు. 2006 లో ఆమె తన కాళ్లలో చలనం పోగొట్టుకుంది. అప్పటి నుంచి ఆమె వీల్‌చైర్‌కే పరిమితం అయ్యింది. అయితే ఆ తర్వాతి నుంచి ఆమె ఎలా ఎగిరిందో చూద్దాం. ► 2014లో ‘మిస్ వీల్‌చైర్ ఇండియా’ టైటిల్ గెలుచుకుంది. ► భారతీయ రైల్వేలలో దివ్యాంగుల సౌకర్యాలు కల్పించేలా ఉద్యమం లేవదీసి గెలిచింది. ► 2017లో ‘ప్రభావవంతమైన 100 మంది స్త్రీలు’ బిబిసి జాబితాలో నిలిచింది. ► ఆమె చేసిన ‘మై ట్రైన్ టూ’ ప్రచారం ప్రాముఖ్యం పొందింది. ► ‘ర్యాంప్ మై రెస్టరెంట్’ కాంపెయిన్ రెస్టరెంట్లలో దివ్యాంగుల ప్రవేశపు వీలును గుర్తించేలా చేసింది. ► గొప్ప మోటివేషనల్ స్పీకర్‌గా గుర్తింపు పొందింది. ► వీల్ చైర్ మీద కూచునే ఫ్యాషన్ షోలలో పాల్గొంది. ► స్కూబా డైవింగ్ చేసింది. నిజానికి విరాళి మోదికి ‘దివ్యాంగులు’, ‘డిఫరెంట్లీ ఏబుల్డ్’ అనే మాటలు నచ్చవు. ‘మనందరం ఒకటే. మాకు ఏవేవో పేర్లు పెట్టి బుజ్జగించే పనులు చేయకండి. మీరు కాళ్ల మీద ఆధారపడతారు. మేము వీల్‌చైర్ మీద ఆధారపడతాం. మిగిలిన అన్ని పనుల్లో మేము సమానమే కదా’ అంటుందామె. విరాళి మోది ముంబై లో ఉంటుంది. దివ్యాంగుల హక్కుల సాధన విషయంలో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇవాళ ఆమె మోటివేషనల్ స్పీచెస్ వినడానికి వందలాదిగా తరలి వస్తారు. ఆమె కథ ఎందుకు అంత ప్రేరణ కలిగిస్తోంది? అమెరికా అమ్మాయి విరాళి మోది ఇండియాలో జన్మించినా హైస్కూలు వయసు వరకూ అమెరికాలోనే పెరిగింది. ఆమె తల్లిదండ్రులు పల్లవి, జితేష్ మోదీలు ‘మజూరి’లో స్థిరపడ్డారు. 2006లో విరాళికి పదహారు పదిహేడు సంవత్సరాలున్నప్పుడు ఆమె ఇండియా పర్యటనకు వచ్చి తిరిగి అమెరికా వెళ్లింది. వెళ్లినప్పటి నుంచి ఆమెకు తలనొప్పి పట్టుకుంది. ఆ తర్వాత తీవ్రమైన జ్వరం. డాక్టర్లు పరీక్ష చేస్తే టెస్టుల్లో ఏమీ తేలలేదు. విరాళి ఇండియా వచ్చింది వానాకాలం కనుక మలేరియా వచ్చి ఉంటుందని తల్లిదండ్రులు చెప్పినా టెస్టుల్లో తేల్లేదు కనుక మందులు ఇవ్వం అని డాక్టర్లు చెప్పారు. ఆ జ్వరంలోనే ఒక ఉదయం ఆమె కాళ్లు చచ్చుబడ్డాయి. ఆ తర్వాత ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చింది. 7 నిమిషాలు ఆమెలో చలనం లేదు. డాక్టర్లు చనిపోయిందనే అన్నారు. కాని ఆమె గుండె తిరిగి కొట్టుకుంది. ఆ తర్వాత కోమాలోకి వెళ్లిపోయింది. వెంటిలేటర్ మీద ఉన్న విరాళిని తల్లి మరికొన్ని రోజుల్లో రానున్న విరాళి పుట్టినరోజు వరకూ బతికించమని, ఆ తర్వాత వెంటిలేటర్ తీసేద్దామని కోరింది. డాక్టర్లు తల్లికోరిక కదా అని మన్నించారు. పుట్టినరోజు అందరూ చివరి చూపులకు వచ్చారు. కేక్ కోశారు. ఐసియులో సందడి చేశారు. ఆ సందడిలోనే విరాళి కోమా నుంచి బయటపడి కళ్లు తెరిచింది. అచలనం నుంచి చలనానికి విరాళి బతికింది కాని మెడ కింద నుంచి పూర్తి శరీరం చచ్చుబడింది. చేతులు కాళ్లు ఏవీ కదల్చలేని స్థితి. తల్లి కొన్నిరోజులు సేవ చేసింది. కాని ఇలాగే ఉంటే అమ్మాయి ఏం కాను? ఒకరోజు విరాళికి చాలా ఆకలి వేసింది. తల్లిని భోజనం అడిగితే ఎదురుగా తెచ్చి పెట్టి ‘నీకు కావాలంటే తిను. నేను నీ పనిమనిషిని కాను’ అని కావాలని విసుక్కుంది. విరాళికి పట్టుదల వచ్చింది. నా తిండి నేను తినగలను అనుకుంది. పట్టుదలగా ముందు వేళ్లు కదిలించింది. తర్వాత చేతులు కదిలించింది. ఆ తర్వాత చేయి సాచి ఆహారాన్ని తినగలింది. ‘ఆ రోజు నా జీవితం మారింది. నేను అనుకున్నది గట్టిగా అనుకుంటే సాధించగలను అని అర్థమైంది. అంతా మన మైండ్‌లో ఉంటుంది. దానికి బలం ఇవ్వాలి అని తెలుసుకున్నాను’ అని చెప్పింది. ఆ తర్వాత ఆమె చేతులు ఆమె స్వాధీనానికి వచ్చాయి. కాళ్ల సమస్య? వీల్‌చైర్ ఉందిగా అనుకుంది. ఎందుకు చేయరు? ‘ఈ పని నా వల్ల కాదు.. ఆ పని నేను చేయలేను అని అందరూ అనుకుంటూ ఉంటారు. బద్దకిస్తుంటారు. భయపడుతుంటారు. కాని ఇందుకా మనం పుట్టింది. చేయాలి. సాధించాలి. ముందుకు వెళ్లాలి. జన్మను సార్థకం చేసుకోవాలి’ అంటుంది విరాళి. ఆమె తన సమూహానికే కాదు ప్రతి ఒక్కరికీ ‘లే.. నడు.. పరిగెత్తు.. ఎగురు’ అని ప్రేరణనిస్తుంది. నిరాశ చుట్టుముట్టినవారికి తన జీవితాన్నే అద్దంలా చూపి మనిషికి సమస్యలను దాటే శక్తి ఉంటుందని చెప్పింది. అదే కాదు... న్యాయమైన హక్కులను సాధించుకోలేకపోవడం కూడా ‘అచేతన చైతన్యాన్ని’ కలిగి ఉండటమే అని చెబుతుంది. పోరాడాలి.. సాధించాలి... జీవించాలి... జీవితాన్ని ఇవ్వాలి... ఇదే విరాళి ఇస్తున్న సందేశం. – సాక్షి ఫ్యామిలీ -
ఆట ఆడుతూ ఉండు
విధి మన ఆటను సడన్‌గా మారుస్తుంది. మనం ఏదో గోల్ అనుకుని వెళుతూ ఉంటాం. అది గేమ్‌ను తిరగేసేస్తుంది. పరిగెత్తేవారిని కూచుండి పోయేట్టు... కూచున్నవారిని పాకుతూ వెళ్లేట్టు చేస్తుంది విధి. అయితే మనం ఓడిపోతామా? కొత్త ఆట మొదలెడతాం. కొత్త గోల్‌ను సెట్ చేసుకుంటాం. బంతి ఎప్పుడూ విధి చేతిలోనే ఉండదు. మన దగ్గరికీ వస్తుంది. అప్పుడు లాగి పెట్టి కొట్టడమే. కశ్మీర్‌కు చెందిన ఇష్రత్ అఖ్తర్ చేస్తుంది అదే. అల్లర్ల వల్ల కాళ్లు పోగొట్టుకున్నా వీల్ చైర్ బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా స్ఫూర్తినిస్తోందా అమ్మాయి. ఈ సంవత్సరం అంతా సజావుగా జరిగి ఆగస్ట్‌లో ‘పారలింపిక్స్’ (దివ్యాంగుల ఒలింపిక్స్) టోక్యోలో జరిగితే మనం ఇష్రత్ అఖ్తర్ పేరు తప్పక వింటాం. ఆ అమ్మాయి భారతదేశం తరుఫున ఆ పోటీలలో వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ టీమ్‌లో ఆడనుంది. ఇప్పటికే థాయ్‌లాండ్‌లో జరిగిన ఆసియా–ఓషెనియా వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో దేశం తరఫున ఆడిన ఇష్రత్ గొప్ప ప్రతిభను ప్రదర్శించింది. కోవిడ్ వల్ల 2020లో జరగాల్సిన పారలింపిక్స్ 2021కు జరపబడ్డాయి. అయినా సరే ఉత్సాహం నీరుగారిపోకుండా బారాముల్లాలోని తన ఇంటి వద్దే రేయింబవళ్లు ప్రాక్టీస్ చేస్తోంది ఇష్రత్. అయితే ఇంత ప్రావీణ్యం ఉన్న అమ్మాయి నిజంగా బాస్కెట్‌బాల్ ప్లేయర్ కాదు. విధి విసిరిన సవాలుకు ఆమె అలా స్పందించింది. మేడ మీద నుంచి దూకేసి ఇష్రత్ అఖ్తర్‌ది బారాముల్లాలోని బంగ్దారా అనే గ్రామం. 2016లో ఆమెకు 19 ఏళ్లు. చదువుకుంటోంది. కాని ఆ సంవత్సరం కశ్మీర్లో అతి పెద్ద ఉగ్రవాది అయిన బర్హాన్ వని ఎన్కౌంటర్ జరిగింది. జూలైలో ఈ ఎన్కౌంటర్ జరిగితే అప్పటి నుంచి జమ్ము కాశ్మీర్ అంతా నిరసనలు అల్లర్లు పెరిగిపోయాయి. ఆగస్టు 24న కొందరు కుర్రాళ్లు భద్రతా దళాల మీద రాళ్లు విసురుతూ ఇష్రత్ ఇంట్లోకి వచ్చి దాక్కున్నారు. వారిని వెంటాడుతూ వచ్చిన భద్రతా దళాలు ఇష్రత్ ఇంటిని చుట్టుముట్టాయి. ఇష్రత్ ఈ గొడవకి గందరగోళానికి బాగా భయపడిపోయి తన ఇంటి రెండో అంతస్తుకు చేరుకుంది. కుర్రాళ్ల వల్ల లేదంటే లోపలికి వచ్చిన భద్రతాదళాల వల్ల ఏం జరుగుతుందోనని కంగారులో పై నుంచి దూకేసింది. అంతే ఆమెకు ఆ తర్వాత ఏమీ తెలియదు. కళ్లు తెరిచే సరికి రెండు కాళ్లూ చలనం కోల్పోయాయి. ఆమె వెన్నుముకకు సర్జరీ చేసినా పెద్దగా ఉపయోగం లేకపోయింది. 6 నెలలు మంచాన ఉండి.. ‘హాస్పిటల్ నుంచి నన్ను ఇంటికి తెస్తే అందరూ శవం వచ్చినట్టుగానే శోకం ప్రకటించారు. చలనం లేని నా దేహం శవమే కదా. ఆరునెలలు మంచాన ఉన్నాను. చాలా డిప్రెషన్ వచ్చింది. అప్పుడు మా నాన్న అబ్దుల్ రషీద్ దగ్గరలో ఉన్న ఒక స్వచ్ఛంద సంస్థకు తీసుకెళ్లడం మొదలెట్టాడు. అక్కడంతా నాలాంటి వాళ్లే. అవయవాలు కోల్పోయిన వాళ్ళు’ అంది ఇష్రత్. ‘ఆమె తనలాంటి వాళ్లను చూసి ధైర్యం తెచ్చుకోవాలని ఆ పని చేశాను’ అంటాడు అబ్దుల్ రషీద్. అక్కడే కొందరు దివ్యాంగులు వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ ఆడుతుంటే ఇష్రత్‌కు కూడా ఆసక్తి కలిగింది. వెళ్లి వాళ్లతో ఆడటం మొదలెట్టింది. అప్పటి వరకూ ఆమెకు ఆ ఆట గురించి ఏమీ తెలియకపోయినా ఆమె ఆడుతున్న పద్ధతి చూసి అందరూ నోరెళ్లబెట్టారు. ఆ సమయంలోనే శ్రీనగర్‌లో జరుగుతున్న వీల్‌చైర్ బాస్కెట్ బాల్ ప్లేయర్ల క్యాంప్ గురించి ఇష్రత్‌కు తెలిసింది. తండ్రితో అక్కడకు వెళితే సెలెక్టర్లు ఆమె ప్రతిభను చూసి నేషనల్ టీమ్‌కు సెలెక్ట్ చేశారు. మొత్తం జమ్ము కశ్మీర్ నుంచి ఒక్క ఇష్రతే ఇందుకు సెలెక్ట్ అయ్యింది. చెన్నైకు వెళ్లి 2020లో టోక్యోలో జరగనున్న పారాలింపిక్స్‌లో పాల్గొనడానికి చెన్నైలో ‘వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (డబ్లు్యబిఎఫ్ఐ) నేషనల్ క్యాంప్ ఏర్పాటు చేసింది. అది ఆగస్టు 2019. సరిగ్గా ఆ సమయంలోనే జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుతో కమ్యూనికేషన్ వ్యవస్థ స్తంభించింది. నేషనల్ టీమ్ మెంబర్‌గా ట్రయినింగ్ తీసుకోవాల్సిన ఇష్రత్‌కు అసలు సమాచారమే అందలేదు. కాని ఆగస్టు 25న కోచ్ లూయిస్ జార్జ్ ఒక రిటైర్డ్ ఇంటెలిజన్స్ అధికారితో యధాలాపంగా ఈ ప్రస్తావన చేస్తే ఆ అధికారి తన సోర్స్ ద్వారా సైన్యానికి ఈ సంగతి చేరవేసి హుటాహుటిన ఇష్రత్‌ను చెన్నై వచ్చేలా చేశారు. భారత సైన్యం ఇందుకు సహకరించింది. చెన్నైకు చేరిన ఇష్రత్ ఆ తర్వాత థాయ్‌లాండ్‌లో విశేష ప్రతిభ కనిపించడంతో ఆమె జీవితమే మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఆమెను ప్రశంసించింది. ప్రోత్సహించింది. ‘నన్ను నా వంటి వారిని స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు ఇమ్మని పిలుస్తున్నారు’ అంటోంది ఇష్రత్. ఇష్రత్ నిజంగానే స్ఫూర్తి ఇస్తోంది. కాళ్లు లేకపోతే ఏమి. రెక్కల్లో బలం ఉంది. ఆమె ఎగురుతూనే ఉంటుంది. గోల్స్ కొడుతూనే ఉంటుంది. – సాక్షి ఫ్యామిలీ -
తండ్రి ఇబ్బందులను అధిగమించే ఆలోచన
సాక్షి, నల్లగొండ : ఆ విద్యార్థిని తన తండ్రి పడుతున్న ఇబ్బంది తొలగించేందుకు హైడ్రాలిక్ లిఫ్టింగ్ వీల్‌చైర్ ఆలోచన చేసింది. ఈ ఆలోచనను రాష్ట్రస్థాయికి పంపగా.. నచ్చడంతో దానికి సంబంధించి ప్రాజెక్టు తయారు చేసేందుకు ఇంక్విలాబ్ ఫౌండేషన్.. తమ ప్రతినిధులు అశోక్, షమీర్‌ను నల్లగొండకు పంపింది. వారి సూచనల మేరకు జిల్లా సైన్స్ అధికారి, గైడ్ టీచర్ ఆధ్వర్యంలో ప్రాజెక్టును తయారు చేయిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు రాష్ట్రస్థాయి స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్‌కు ఎంపికైంది. రాష్ట్రంనుంచి మొత్తం 25 ప్రాజెక్టులను ఎంపిక చేయగా.. అందులో నల్లగొండ బాలికల పాఠశాల విద్యార్థిని తయారు చేసిన హైడ్రాలిక్ లిఫ్టింగ్ వీల్‌చైర్ ప్రాజెక్టు ఒకటి. ఆ ప్రాజెక్టు ఖర్చు ఇంక్విలాబ్ ఫౌండేషనే భరించనుంది. ఈ ప్రాజెక్టును 19వ తేదీన వీడియో క్లిప్ ద్వారా ఆన్లైన్లో ప్రదర్శించాల్సి ఉంటుంది. జిల్లానుంచి 370 ఆలోచనలు తెలంగాణ ప్రభుత్వం స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ పేరుతో విద్యార్థుల్లో కలిగే ఆలోచనల మేరకు ప్రాజెక్టుల తయారీకి ఏటా ప్రతిపాదనలు కోరుతోంది. యూనిసెఫ్, ఇంక్విలాబ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పాఠశాల స్థాయిలో 9వ తరగతి నుంచి విద్యార్థులు వారి ప్రాంతంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి సంబంధించిన ఆలోచనను మాత్రమే స్వీకరిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కొత్తగా వచ్చే ఆలోచనలు పంపించాలని కోరగా నల్లగొండ నుంచి 280 పాఠశాల నుంచి 370 ఆలోచనలను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పంపించారు. తండ్రి పడుతున్న సమస్యతో వచ్చిన ఆలోచన.. నల్లగొండ ప్రభుత్వ బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బషీరా తన తండ్రి పక్షవాతం కారణంగా కాలు చేయి పని చేయని పరిస్థితి. దానివల్ల తండ్రి ఇంట్లో ఏమీ తన సొంతంగా చేసుకోలేకపోయేవాడు. దీని పరిష్కారానికి ఆ బాలికకు ఓ ఆలోచన వచ్చింది. హైడ్రాలిక్ లిఫ్టింగ్ చైర్ వీల్ చైర్‌తో బటన్ నొక్కితే చైర్ ఎత్తులోకి లేవడం పైన ఉన్న వస్తువులను అందుకోవడం, వీల్‌చైర్‌తో ఇంట్లో సొంతంగా తిరగ గలగడం, తన పనులు తానే చేసుకోగలుగుతాడని ఆ బాలిక భావించి తన ఆలోచనను పాఠశాలలోని గైడ్ టీచర్ పూర్ణిమకు చెప్పింది. ఆమె వెంటనే ముగ్గురిని టీమ్‌గా ఏర్పాటు చేసి ఆ ప్రాజెక్టు ఎలా ఉంటుందో తయారు చేసి ఆ ఆలోచన వీడియో రూపంలో రాష్ట్రస్థాయికి పంపారు. అయితే రాష్ట్రంలో 7,093 ఐడియాలు వివిధ సమస్యలపై వచ్చాయి. రౌండ్ల వారీగా ఎంపిక చేయగా.. చివరకు 25 ప్రాజెక్టులను మూడో రౌండ్లో ఎంపిక చేశారు. ఈ 25లో నల్లగొండ విద్యార్థిని ప్రాజెక్టు ఉండడంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 19న హైదరాబాద్‌లో ఈ ప్రాజెక్టును ప్రదర్శిస్తారు. 25 ప్రాజెక్టుల్లో 10 ప్రాజెక్టులను గ్రాండ్ ఫినాలేకు ఎంపిక చేయనున్నారు. హైడ్రాలిక్ లిఫ్టింగ్ వీల్‌చైర్ నమూనా రాష్ట్రస్థాయికి ఎంపిక సంతోషకరం నల్లగొండ ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థినికి వచ్చిన హైడ్రాలిక్ లిఫ్టింగ్ వీల్ చైర్ ఆలోచన ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. రాష్ట్రస్థాయికి 7 వేల పైచిలకు ప్రాజెక్టులు పంపితే అందులో 25 ఎంపిక చేస్తే అందులో జిల్లా ప్రాజెక్టు ఉంది. ప్రాజెక్టు తయారు చేసిన విద్యార్థిని, సైన్స్ అధికారి, గైడ్ టీచర్‌కు అభినందనలు. – భిక్షపతి, డీఈఓ -
ఏ మాత్రం జాలి, దయ లేకుండా..
చెన్నై: ప్రభుత్వ ఆస్పత్రి ఉద్యోగి ఒకరు ఓ రోగిని వీల్ చైర్లోంచి కిందపడేసిన సంఘటనపై తమిళనాడు రాష్ట్ర మానవహక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. ఈ మేరకు సోమవారం వైద్య, గ్రామీణ ఆరోగ్య సేవల డైరెక్టర్‌కు నోటీసు పంపింది. కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రిలోని ఇన్-పేషెంట్ వార్డులో ఈ సంఘటన జరిగింది. వీడియోలో ఓ పేషెంట్.. హాస్పిటల్ ఉద్యోగి బాస్కరన్(40)ను, తన మంచం మీదకు వెళ్లడానికి సహాయం చేయమని కోరతాడు. కానీ బాస్కరన్ స్పందించడు. పేషెంట్ పదే పదే ప్రాధేయపడటంతో సదరు ఉద్యోగిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటిది. ఏ మాత్రం జాలి, దయ లేకుండా ఆ పేషెంట్‌ను వీల్ చైర్లో నుంచి కిందకు పడేస్తాడు. పాపం ఆ వ్యక్తి మంచం మీదకు ఎక్కడానికి నానా అవస్థలు పడతాడు. అంతేకాక బాస్కరన్ అతడిని తిట్టడం వీడియలో చూడవచ్చు. ఈ తతంగాన్ని మరో పేషెంట్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సదరు ఉద్యోగితో పాటు ఆస్పత్రి యాజమాన్యం మీద ఆగ్రహం వ్యక్తం అవుతోంది. (5 రూపాయల డాక్టర్ ఇకలేరు) Watch | Tamil Nadu government hospital employee pushes patient from wheel-chair, viral video leads to action. pic.twitter.com/Y3d5yRbbBb — The Indian Express (@IndianExpress) August 18, 2020 అంతేకాక దీని గురించి ఓ తమిళపత్రికలో వార్తా కథనం ప్రచురితమయ్యింది. ఈ క్రమంలో ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించి.. నోటిసులు జారీ చేసింది. దీనికి సంబంధించి మూడు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆలస్యం చేస్తే.. చర్యలు తప్పవని హెచ్చరించింది. దీనిపై ఉన్నతాధికారి ఒకరు స్పందించారు. ఈ ఘటనకు బాధ్యుడైన ఉద్యోగిని తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. -
వికలాంగుడికి తోడుగా.. వీల్‌చైర్ నెట్టుతూ
మెక్సికో: ఓ పోలీసు చేతులేని కోతికి అరటి పండు తినిపించడం, బావిలో చిక్కుకున్న జీవాలను బయటకు తీసి రక్షించడం, ఆకలిగా ఉన్నవాటికి ఆహారం పెట్టడం.. ఇలా ఎన్నో రకాలుగా మనుషులు జంతువులకు సాయం చేయడం చూశాం. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ ఓ మూగ జీవి దివ్యాంగుడికి సాయం చేస్తూ అండగా నిలిచింది. మెక్సికోకు చెందిన వికలాంగ బాలుడు నడవలేడు. దీంతో అతను వీల్‌చైర్‌లో కూర్చుండగా శునకం దాన్ని నెట్టుకుంటూ ముందుకు సాగింది. ముందు కాళ్లతో వీల్‌చైర్‌ను నెట్టుతూ వెనక కాళ్లతో మాత్రమే నడిచింది. ఈ క్రమంలో ఎక్కడా వీల్‌చైర్ కింద పడిపోకుండా, ఎక్కడా దారి తప్పకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్లింది. (వైరల్.. ఆకతాయిలపై గేదె ప్రతీకారం!) దీంతో దారివెంట వెళుతున్న జనాలు ఈ అద్భుత దృశ్యాలను కెమెరాలో బంధించారు. ఈ వీడియోను భారత అటవీ అధికారి సుశాంత్ నంద సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఓ దివ్యాంగుడిని శునకం ఎంతో శునకం బాధ్యతగా చూసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 'మనిషికి శునకాన్ని మించిన మిత్రువు లేదం'టూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇది పాత వీడియోనే అయినప్పటికీ నెట్టింట మరోసారి చక్కర్లు కొడుతోంది. అయితే జంతువులు మనుషులకు సాయం చేయడం కొత్తేమీ కాదు. క్వీన్స్‌లాండ్‌లో జెర్మన్ షెఫర్డ్ జాతి శునకం తన యజమాని పడవ నీట మునిగినప్పుడు అతన్ని ప్రాణాలకు తెగించి కాపాడిన విషయం తెలిసిందే. (మూడు నెలలుగా ఆస్పత్రి ఎదుట శునకం నిరీక్షణ) -
వీల్ చెయిర్ కాదు.. విల్ చెయిర్!
పర్వీందర్ చావ్లా వయసు 48 ఏళ్లు. వీల్ చెయిర్‌పై ఇప్పటికి ఆరు ఖండాలను చుట్టేశారు. 23 దేశాలను çసందర్శించారు. ఒక్కో దేశానికి ఒక్కసారి మాత్రమే కాదు, రెండు–మూడుసార్లు కూడా వెళ్లారు. ఆమె టూర్లలో జస్ట్.. అలా చూసి వచ్చేవి మాత్రమే కాదు, ఏదో ఒక సాహసం చేసేవే ఎక్కువగా ఉంటాయి. తైవాన్‌లో పారాగ్లైడింగ్ నుంచి ఈక్వెడార్‌లో జిప్‌లైనింగ్ చావ్లా చేసి వచ్చిన సాహసాలెన్నో! సవాళ్లతో పోరాడటమెలాగో జీవితాన్నుంచి నేర్చుకున్నానని అంటున్న చావ్లాను నిజానికి నడిపించింది వీల్ చెయిర్ కాదు.. ఆమెలోని విల్ పవర్ అనే చెయిర్. ఏడాదిలో ఎన్ని నెలలు పర్యటనల్లో గడిపితే, యాభై ఏళ్ల లోపు ఇన్ని దేశాలు తిరగడం సాధ్యమవుతుంది? ఈవిడేమైనా కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నారా అనిపిస్తుంది. అవును చావ్లా చక్రాలు కట్టుకుని దేశాలు పర్యటిస్తున్న మాట అక్షరాలా నిజం. నడవడానికి కాళ్లు సహకరించని స్థితిలో చక్రాల కుర్చీలోనే ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. చిన్న జీవితానికి ఇంతటి సాహసం అవసరమా అని అడిగిన వాళ్లతో ‘ఎప్పుడో ఓ రోజు చనిపోవాల్సిందే కదా? చనిపోతామేమోనని భయపడుతూ ఆసక్తులను చంపుకోవడం ఎందుకు? ప్రపంచంలోని సౌందర్యాన్ని వీక్షిస్తూ, పోయేలోపు ఎన్ని చూడటం సాధ్యమైతే అన్నింటిని చూడవచ్చు’’ అంటున్నారు. పదిహేనేళ్ల వయసులో..! ముంబయిలోని బాంద్రాలో నివసిస్తున్న పర్వీందర్ చావ్లా పుట్టింది లూధియానాలో. తండ్రి హోటల్ నడిపేవారు, తల్లి గృహిణి. నలుగురు పిల్లల్లో చిన్నమ్మాయి పర్వీందర్. పదిహేనేళ్ల వరకు ఆమె అందరిలాంటి అమ్మాయే. అప్పుడు బయటపడింది రుమటాయిడ్ ఆర్రై్థటిస్. అప్పటికే వారి కుటుంబం లూధి యానా నుంచి ముంబయికి మారిపోయింది. చావ్లా అల్లోపతి, హోమియోపతి... రకరకాల వైద్య విధానాలను పాటించారు. స్కూలు చదువు పూర్తయింది, కాలేజ్‌లో చేరింది కూడా. పన్నెండవ తరగతిలో ఫైనల్ పరీక్షలు. చేతి మణికట్టుని కదిలించలేకపోయింది. అప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్తే ఒక ఇంజక్షన్ వేశారు. అది స్టిరాయిడ్స్ అని అప్పట్లో తెలియదు. మళ్లీ.. అక్క పెళ్లిలో! పెళ్లి వేడుక కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారంతా. పర్వీందర్కి కూడా డ్యాన్స్ చేయాలనే ఉత్సాహం కలిగింది. ఓ వారం ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తున్నారు యుక్తవయసు పిల్లలంతా. ఓ రోజు ఉన్నట్లుండి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ నేల మీద చతికిలపడిపోయారు పర్వీందర్. ఒక మూల వీల్ చైర్లో కూర్చుని పెళ్లి వేడుకను గమనించిన పర్వీందర్కి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా కనిపించింది. వీల్ చెయిర్ నుంచి రానురాను మంచానికే పరిమితమైతే... తల్లి మాత్రం ఎంతకాలమని చూస్తుంది? వాష్‌రూమ్ కెళ్లాలన్నా తల్లి సహాయం లేనిదే కదల్లేకపోతోంది. ఈ క్రమంలో ఓ రోజు ఒకరి మీద ఆధారపడి జీవించే స్థితి నుంచి తన కాళ్ల మీద తాను నిలబడి తీరాలని గట్టిగా నిర్ణయించుకున్నారు చావ్లా. ఆక్యుపంక్చర్, ఫిజియోథెరపీతోపాటు ప్రత్యామ్నాయ వైద్యవిధానాలన్నీ పాటించి తన పనులు తాను చేసుకోగలిగినట్లు దేహాన్ని నియంత్రణలోకి తెచ్చుకున్నారు. తర్వాత కాల్ సెంటర్లో పనిచేశారు. కొంతకాలం ‘బేబీ సిట్టింగ్’ (చంటిబిడ్డ తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్లినప్పుడు తిరిగి వాళ్లు వచ్చే వరకు బిడ్డకు తోడుగా ఉండటం) ఉద్యోగం కూడా చేశారు. ఆ తర్వాత సొంతంగా వ్యాపారం చేయాలనుకున్నారు. తండ్రి హోటల్ నడుపుతున్నాడు కాబట్టి తనకు అంతో ఇంతో పరిచయమున్న రంగం అదొక్కటే. అందుకే చావ్లా సొంతంగా కేటరింగ్ సర్వీస్ నడిపారు. అన్నింటికంటే ముందు ఏ విషయానికీ భావోద్వేగాలకు లోనుకాకుండా ఉండగలగడం అలవాటు చేసుకున్నారు. తన మీద తనకు నమ్మకం కలిగింది. తాను ఎవరి మీద ఆధారపడి జీవించాల్సిన స్థితిలో లేదనే సంతోషం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అప్పుడే మరో మలుపు! కశ్మీర్‌కు టీమ్ టూర్ పర్వీందర్ స్నేహితులు కశ్మీర్‌లోని గుల్మార్గ్ పర్యటనకు వెళ్తున్నప్పుడు ఆమెను కూడా రమ్మని పిలిచారు. నిజానికి పర్వీందర్కు కూడా ఉన్న చోటనే ఉండిపోకుండా ఎక్కడికైనా వెళ్లాలని మనసులో ఉండేది. స్నేహితుల ఆహ్వానంతో సంతోషంగా ఆ టూర్ టీమ్‌తో కలిసిపోయింది. వెళ్లిన చోట స్నేహితులకు తన కారణంగా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తన వీల్ చైర్‌ను నడిపించడానికి ఒక సహాయకుడిని కూడా ఏర్పాటు చేసుకున్నారామె. మెత్తని పొడి లాంటి మంచు గడ్డకట్టిపోయి రాయిలా పేరుకుపోయిన గుల్మార్గ్లో ఎల్తైన పాయింట్‌కు చేరడం పర్వీందర్ దృష్టి కోణాన్ని మార్చేసింది. అప్పటి నుంచి పర్యటిస్తూనే ఉన్నారు. అన్నీ సోలో టూర్లే పర్వీందర్ తొలి పర్యటన స్నేహితులతో కలిసి వెళ్లినా కానీ, ఆ తర్వాత ఒంటరిగానే పర్యటిస్తున్నారు. ‘నాకైతే కుటుంబం లేదు. వాళ్లకు కుటుంబం, పిల్లలు ఉంటారు. నేను చేసినన్ని పర్యటనలు చేయడం వాళ్లకు సాధ్యం కాదు కదా’ అంటారు నవ్వేస్తూ. ట్రావెల్ కంపెనీల టూర్ ప్యాకేజ్‌లలో చావ్లాను తీసుకెళ్లడానికి చాలా కంపెనీలు ససేమిరా అన్నాయి. ‘మీతోపాటు ఒక సహాయకుడిని తెచ్చుకోవాలి, మీరు ఆ ఖర్చు కూడా భరిస్తేనే సాధ్యమవుతుంది’ అని ఖండితంగా చెప్పేశారు. దాంతో టూర్ ప్యాకేజ్‌ల జోలికి వెళ్లకుండా ఒంటరిగానే పర్యటిస్తున్నారు. ‘సోలో ట్రావెల్ చేయాలనుకున్న తర్వాత మలేసియా పర్యటన మాత్రం స్నేహితులతో వెళ్లాను. ఆ ట్రిప్‌లోనే రెండు రోజులు మా ఫ్రెండ్స్ టీమ్‌తో కాకుండా ఒక్కదాన్నే కొన్ని ప్రదేశాలను ఎంపిక చేసుకుని వెళ్లాను. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఆ తర్వాత అన్నీ సోలో పర్యటనలే’ అన్నారు పర్వీందర్. ‘‘గుల్మార్గ్లో ఎల్తైన శిఖరాన్ని చేరినప్పటి అనుభూతిని మాటల్లో చెప్పలేను. స్వర్గం అంటే ఇదేనేమో అనిపించింది. ఇలాంటి అద్భుతాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి, అందమైన ప్రపంచం మొత్తాన్ని చూసి తీరాలనిపించింది. అదే (గుల్మార్గ్)నా పర్యటనలకు ఆది. అప్పటి నుంచి అలా ప్రయాణిస్తూనే ఉన్నాను’’ అని చెప్పారు. బుక్ చేసుకుని వెళితే.. అక్కడ హోటలే లేదు! పర్వీందర్ తన ప్లాన్లను వివరిస్తూ తనకు ఎదురైన క్లిష్టమైన పరిస్థితిని కూడా గుర్తుచేసుకున్నారు. ‘‘తక్కువ లగేజ్‌తో టూర్ ప్లాన్ చేసుకుంటాను. తక్కువ బడ్జెట్ హోటళ్లలో దిగుతాను. చాలా సందర్భాల్లో ప్రత్యేకంగా గది తీసుకోకుండా డార్మెటరీల్లో కూడా బస చేస్తాను. ఒకసారైతే ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్లిన చోట.. ఉండాల్సిన హోటల్ లేనేలేదు! దానిని పడగొట్టేశారట. ఎయిర్‌పోర్టు నుంచి క్యాబ్‌లో హోటల్‌కి చేరుకునే సరికి అదీ పరిస్థితి. అప్పుడు టైమ్ రాత్రి పదకొండు. క్షణం సేపు ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఒకాయన దేవుడిలా కనిపించాడు. దగ్గరలో నా బడ్జెట్‌కు సరిపోయే హోటల్ ఎంత దూరంలో ఉందో, ఎలా చేరుకోవాలో వివరించి సహాయం చేశాడు’’ అని చెప్పారు.ఇంకా పర్యటన దాహం తీరలేదా అంటే చిరునవ్వుతో ‘‘నా పాస్‌పోర్టు పేజీలు ప్రపంచ పటంలోని అన్ని దేశాల స్టాంపులతో నిండిపోవాలి. అదే నా కల’’ అంటారు చావ్లా. పర్యటనలతో ప్రపంచదేశాల సంస్కృతితోపాటు అనేక విషయాలను తెలుసుకున్న పర్వీందర్ వాటన్నింటినీ తన బ్లాగ్‌లో పొందుపరుస్తున్నారు కూడా. – పర్వీందర్ చావ్లా – మంజీర -
వికలాంగుల కోసం ‘ఈజీ మూవ్’
అనారోగ్యం వల్లో లేదా రోడ్డు ప్రమాదం కారణంగానో కొందరు వీల్‌చైర్‌కే పరిమితం అయిపోతుంటారు. అలాంటి వారిని బయటకు తీసుకెళ్లాలంటే చాలా శ్రమతో కూడుకున్న పని. మిగతా వాళ్లలాగా తాము అన్నిచోట్లకూ వెళ్లలేకపోతున్నామని, నాలుగు గోడల మధ్య బందీలుగా మారిపోయామని మానసికంగానూ వారు కుంగిపోతుంటారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపుతోంది ‘ఈజీ మూవ్’. వీల్‌చైర్‌కే పరిమితమైన రోగులను అవసరమైన చోటుకు సులభంగా తీసుకెళ్లేందుకు వీల్‌చైర్ ట్యాక్సీలను ఈ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ముంబైలో ఇప్పటికే ఈ ట్యాక్సీలు సేవలందిస్తున్నాయి. ఇప్పటివరకు 7 వేల మంది ఈ సేవలను ఉపయోగించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎలా మొదలైంది...? ఢిల్లీలో 2015లో జరిగిన వికలాంగుల 15వ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొన్న వారికి వీల్‌చైర్ లిఫ్ట్‌లు, ర్యాంపులు అందుబాటులో లేవు. నిర్వాహకులు మెట్లపై ప్లైవుడ్‌ను మాత్రమే పరిచారు. ఇది ఈజీ మూవ్ సంస్థ కో–ఫౌండర్ రోమియో రవ్వను కదిలించింది. వీల్‌చైర్‌కే పరిమితమైన తన స్నేహితుడి చెల్లెలు ఇతరులకు ఇబ్బంది లేకుండా, ఎవరిపైనా ఆధారపడకుండా కాలేజీకి వెళ్లిరావడం చూశారు. మిగతా వాళ్లకూ ఇలాంటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో మరో ఇద్దరితో కలసి ‘ఈజీ మూవ్’ను నెలకొల్పారు. కదలలేని స్థితిలో ఉన్న వాళ్లు గౌరవంగా, హుందాగా అనుకున్న చోటుకు వెళ్లేలా సేవలందించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు. ఎలాంటి సేవలందిస్తారు...? వీల్‌చైర్‌కే పరిమితమైన రోగులను తరలించేందుకు కార్లలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా వీల్‌చైర్‌తో సహా కారులోకి వెళ్లిపోవచ్చు. భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కారులో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. డ్రైవర్‌కు ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారు. రోగిని కారులోకి భద్రంగా చేర్చడంతోపాటు అవసరమైన సేవలు అందిస్తారు. ఆసుపత్రి, ఎయిర్‌పోర్టుకు వెళ్లి రావడం, ఆలయాలు, పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు తీసుకెళ్తారు. సరదాగా గడిపేందుకు విహారయాత్రకు వెళ్లాలన్నా ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ముంబైలో అందుబాటులో ఉన్న వీల్‌చైర్ ట్యాక్సీ సర్వీసును త్వరలో గోవాలోనూ ప్రారంభించనున్నారు. 2019 నాటికి దేశంలోని అన్ని మెట్రో నగరాలకు ఈ సర్వీసును విస్తరింపజేయాలని సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. చార్జీ ఎంత...? ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు బేసిక్ చార్జీ (4 కి.మీ వరకు) రూ. 250గా ఉంది. ప్రతి అదనపు కిలోమీటర్‌కు రూ. 30 వసూలు చేస్తారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు రూ. 350 బేసిక్ చార్జీ, ప్రతి కిలోమీటర్‌కు అదనంగా రూ. 40 చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు, ఎనిమిది గంటల అద్దెకు కూడా లభిస్తాయి. సొంతకారు ఉన్న వారు తమ కారులో కూడా మార్పులు చేసుకోవాలంటే ఆ సదుపాయమూ ఇక్కడ అందుబాటులో ఉంది. వృద్ధులు, ప్రత్యేక అవసరాలుగల వారు సులభంగా ప్రయాణించేలా కారులో మార్పులు చేస్తారు. -
వీల్ చైర్ ట్యాక్సీ
అనారోగ్యం వల్లో లేదా రోడ్డు ప్రమాదం కారణంగానో కొంతమంది వీల్ చైర్‌కే పరిమితం అయిపోతుంటారు. అలాంటి వారిని ఆసుపత్రికో, ఏదైనా శుభకార్యానికో లేదా మరో చోటుకో తీసుకెళ్లాలంటే చాలా శ్రమతో కూడుకున్న పని. మరోవైపు మిగతా వాళ్లలాగా తాము అన్నిచోట్లకీ వెళ్లలేకపోతున్నామని, నాలుగు గోడల మధ్య బందీలుగా మారిపోయామని, ఎక్కడికెళ్లాలన్నా మరొకరిపై ఆధారపడాల్సి వస్తుందని మానసికంగానూ వీరు కుంగిపోతుంటారు. అయితే ఈ సమస్యలకు పరిష్కారం చూపుతోంది ‘ఈజీ మూవ్’. వీల్‌చైర్‌కే పరిమితమైన రోగులను అవసరమైన చోటుకి సులభంగా తీసుకెళ్లేందుకు వీల్‌చైర్ ట్యాక్సీలను ఈ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ముంబైలో ఇప్పటికే ఈ ట్యాక్సీలు సేవలందిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏడువేల మంది ఈ సేవలు ఉపయోగించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎలా మొదలైంది ఢిల్లీలో 2015లో దివ్యాంగుల 15వ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. అయితే అక్కడ వారికి అవసరమైన వీల్‌చైర్ లిఫ్ట్‌లు, ర్యాంపులు అందుబాటులో లేవు. నిర్వాహకులు మెట్లపై ప్లేవుడ్ను మాత్రమే పరిచారు. ఇది ఈ సంస్థ కో ఫౌండర్ రోమియో రవ్వను కదిలించింది. వీల్‌చైర్‌కే పరిమితమైన తన స్నేహితుడి చెల్లెలు ఇతరులకు ఇబ్బంది లేకుండా, ఎవరిపై ఆధారపడకుండా వీల్‌చైర్‌పై కాలేజీకి వెళ్లి రావడం చూశారు. చాలా మందికి ఇలాంటి అవకాశం ఉండదు. మిగతావాళ్లకు కూడా ఇలాంటి సౌకర్యం కల్పిస్తే ఎలా ఉంటుందనే మరో ఇద్దరి ఆలోచనలు తోడయ్యాయి. ..దీంతో ‘ఈజీ మూవ్’ కు అంకురార్పణ జరిగింది. కదలలేని స్థితిలో ఉన్న వాళ్లు గౌరవంగా, హుందాగా అనుకున్న చోటుకి వెళ్లేలా సేవలందించడమే తమ లక్ష్యమని నిర్వహకులు పేర్కొంటున్నారు. ఎలాంటి సేవలందిస్తారు వీల్‌చైర్‌కే పరిమితమైన రోగులను తరలించేందుకు కార్లలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా వీల్‌చైర్‌తో సహా కారులోకి వెళ్లిపోవచ్చు. భద్రతాపరంగాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా కారులో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. డ్రైవర్‌కు ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం ద్వారా రోగిని కారులోకి భద్రంగా చేర్చడంతో పాటు అవసరమైన సేవలు అందిస్తారు. ఆసుపత్రి, ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లడం.. తీసుకురావడం, దేవాలయాలు, పెళ్లిళ్లు ఇతర ఫంక్షన్లకు తీసుకెళతారు. అంతేకాదు సర దాగా గడిపేందుకు విహారయాత్రకు వెళ్లాలన్నా ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ముంబాయిలో అందుబాటులో ఉన్న వీల్ చైర్ టాక్సీ సర్వీసును త్వరలో గోవాలోనూ ప్రారంభించనున్నారు. 2019 నాటికి దేశంలోని అన్ని మెట్రో నగరాలకు విస్తరింపచేయాలని సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎంత చార్జీ చేస్తారు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు బేసిక్ చార్జి రూ. 250 గా ఉంది. ప్రతీ నాలుగు కి.మీ కు అదనంగా రూ. 30 వసూలు చేస్తారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు రూ. 350 బేసిక్ చార్జి, ప్రతీ నాలుగు కి.మి. కు అదనంగా రూ. 40 చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు, ఎనిమిది గంటల అద్దెకు కూడా లభిస్తాయి. అంతేకాదు సొంతకారు ఉన్న వారు తమ కారులో కూడా మార్పులు చేసుకోవాలంటే ఆ సదుపాయమూ ఇక్కడ అందుబాటులో ఉంది. వృద్ధులు, ప్రత్యేక అవసరాలు కల్గిన వారు సులభంగా ప్రయాణించే విధంగా కారులో మార్పులు చేస్తారు. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ప్రజా సందర్శనకు హాకింగ్ కుర్చీ, కంప్యూటర్
లండన్: ఇటీవల కన్నుమూసిన ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్‌కు చెందిన చక్రాల కుర్చీని, ఆయన సంభాషించేందుకు వాడిన ప్రత్యేక కంప్యూటర్ను ప్రజా సందర్శనకు ఉంచే అవకాశముందని బ్రిటన్‌కు చెందిన ‘ది సండే టైమ్స్’ పత్రిక తెలిపింది. హాకింగ్ స్మృతుల్ని సజీవంగా ఉంచేందుకు వీలుగా ఈ రెండింటిని ఏదైనా మ్యూజియానికి ఇచ్చే అంశాన్ని ఆయన కుటుంబ సభ్యులు పరిశీలిస్తున్నారని వెల్లడించింది. లండన్‌లోని సైన్స్ మ్యూజియంలో హాకింగ్ జీవితచరిత్ర, ఉపన్యాసాల వీడియోలతో పాటు చక్రాల కుర్చీ, కంప్యూటర్ను ప్రదర్శనకు ఉంచే అవకాశముందని పేర్కొంది. హాకింగ్ వాడిన చక్రాల కుర్చీ స్వీడన్లో తయారైందనీ, ఓసారి చార్జింగ్ పెడితే ఇది గంటకు 13 కి.మీ వేగంతో 32 కి.మీ దూరం ప్రయాణిస్తుందని వెల్లడించారు. -
సాక్షి ఎఫెక్ట్ : గాంధీ ఆస్పత్రి ఘటనపై విచారణ
-
కాసుల రోగం పైసల పైత్యం
-
ఆ పేషెంట్ ఘటనపై స్పందించిన కేటీఆర్
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన పేషేంట్లపై సిబ్బంది నిర్లక్ష్యంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. బొమ్మకారుతో పేషెంట్ పడిన బాధలను మీడియా ప్రతినిధులు వీడియో తీసి సిబ్బంది నిర్లక్ష్యాన్ని బయటపెట్టడంతో అది కాస్తా వైరల్ అయింది. గాంధీ ఆస్పత్రిలో సంచలనం రేపిన ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు. ‘గాంధీ ఆస్పత్రి సూపరిటెండెంట్‌తో ఈ ఘటనపై చర్చించాను. బాధితుడి వివరాలు అడిగి తెలుసుకున్నాను. బాధితుడు రాజుకు తన వంతు సాయం చేయడానికి సిద్ధం’ అని ట్వీట్లో పేర్కొన్నారు. బేగంపేటకు చెందిన చెందిన రాజు (40) ప్రైవేటు ఎలక్ట్రీషియన్. కొద్దిరోజుల క్రితం విద్యుతాఘాతానికి గురై రెండు కాళ్లు చచ్చుబడి నడవలేని స్థితికి చేరుకున్నాడు. నగరంలోని గాంధీ ఆస్పత్రికి వచ్చిన అతడికి చక్రాల కుర్చీ కావాలని కోరగా.. సిబ్బంది రూ.150 లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. తమ వద్ద డబ్బులు లేవని మనీ ఇచ్చుకోలేమని చెప్పడంతో సిబ్బంది నిరాకరించారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పేషెంట్ ను పిల్లులు ఆడుకునే బొమ్మకారుపై డాక్టర్ వార్డుకు తీసుకెళ్లారు. ఆస్పత్రికి వచ్చిన ప్రతిసారి చక్రాల కుర్చీ కోసం డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో.. గురువారం ఆస్పత్రికి వచ్చిన పేషెంట్ రాజు తనతో పాటుగా చిన్నారులు ఆడుకునే బొమ్మకారు తీసుకురావడంతో సమస్యను స్పెషల్ ఫోకస్ చేశారు. Spoke to the superintendent of Gandhi hospital. Can you please send me the contact details of patient? https://t.co/jdpuHDWbfw — KTR (@KTRTRS) 17 March 2017 My office contacted the family & will ensure they are helped https://t.co/9P2D6vuP1y — KTR (@KTRTRS) 17 March 2017 -
హేరాం.. ఎంతటి దైన్యం
పేదల వైద్యానికి పెద్దపీట వేసామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వానికి తెలంగాణ వైద్యప్రదాయిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు మాత్రం తెలియడం లేదు. ఇక్కడకు వైద్యం కోసం వచ్చేవారంతా నిరుపేదలే. కానీ సిబ్బంది మాత్రం ప్రతి పనికీ ‘ఖరీదు’ కడుతున్నారు. బేగంపేటకు చెందిన చెందిన రాజు (40) ప్రైవేటు ఎలక్ట్రీషియన్. కొద్దిరోజుల క్రితం విద్యుతాఘాతానికి గురై రెండు కాళ్లు చచ్చుబడి నడవలేని స్థితికి చేరుకున్నాడు. గాంధీ ఆస్పత్రి అత్యవసర విభాగంలో చికిత్స చేయించుకున్న తర్వాత ప్రతివారం పాస్టిక్సర్జరీ ఓపీ సేవలు పొందాలని వైద్యులు సూచించారు. ఈ విభాగం మొదటి అంతస్తులో ఉంది. ఆస్పత్రిలో లిఫ్ట్ పనిచేయడం లేదు. గతంలో వచ్చినప్పుడు వీల్‌చైర్ కోసం సిబ్బందిని అడిగినా చేయి తడపందే ఇవ్వనన్నారు. దీంతో అతడు గురువారం ఉదయం ఆస్పత్రికి వచ్చేటప్పుడు ఇంట్లోని పిల్లల సైకిల్‌ను తెచ్చుకున్నాడు. భ్యార తోడుతో దానిపై వెళుతున్న పరిస్థితిని తోటి రోగులు చూసి అవాక్కయ్యారు. – గాంధీ ఆస్పత్రి -
రుయాలో రోగుల ఫీట్లు!
మహిళా వార్డుకెళ్లాలంటే నరకం రోగిని వీల్‌చైర్‌లో కూర్చోబెట్టుకుని మెట్లపై తోసుకెళ్లాల్సిందే ర్యాంప్ ఏర్పాటు చేయడంలో అధికారుల అలసత్వం ఈ ఫొటోలో కనిపిస్తున్న రోగి పేరు అనురాధ. పెద్దమండ్యానికి చెందిన ఈమె తీవ్ర జ్వరంతో మంచం పట్టింది. నడవలేని స్థితికి చేరడంతో బంధువులు ఇటీవల రుయా ఆస్పత్రిలోని మహిళల వార్డులో చేర్చారు. అక్కడ మొదటి అంతస్తుకెళ్లాలంటే ఒంకరటింకరగా ఉన్న 50 మెట్లపై వీల్‌చైర్‌లో కూర్చోబెట్టుకుని ఆమెను తోసుకెళ్లాల్సి వచ్చింది. మళ్లీ డిశ్చార్జ్ అయ్యేటప్పుడూ అదే పరిస్థితి. రోగి పట్టుతప్పితే అంతే..! ..ఇది ఒక్క అనురాధ పరిస్థితే కాదు.. ఆ వార్డులో ఉన్న 210 మంది రోగుల పరిస్థితీ అంతే. మొదటి అంతస్తుకు వెళ్లేందుకు ర్యాంప్ ఏర్పాటు చేయాల్సిన పాలకులు, అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం రోగులు, వారి సహాయకుల పాలిట శాపంగా మారింది. తిరుపతి మెడికల్: రుయా ఆస్పత్రిలోని మహిళా వార్డు రోగులు సర్కస్ ఫీట్లు పడాల్సి వస్తోంది. ఆస్పత్రి ప్రధాన భవనంలో ఉన్న మెడిసిన్ వార్డు శిథిలావస్థకు చేరింది. ఆ వార్డులోని పేషెంట్లను పాత క్యాజువాలిటీకి ఎదురుగా టీటీడీ క్యాంటీన్ కోసం నిర్మించిన భవనంలోకి మార్చారు. ప్రస్తుతం ఈ కొత్త మెడిసిన్ విభాగంలో 210 బెడ్లు ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే కొత్త మంచాలు, కొత్త పరుపులు, రోగుల సౌకర్యార్థం ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ఈ వార్డుకు ఎవరెవరు వస్తారంటే! ఈ మహిళా వార్డుకు సాధారణ, విషజ్వరాల రోగులు, కిడ్నీ డయాలసిస్, బీపీ, షుగర్ పేషెంట్లు రోజుకు 10 నుంచి 15మంది వరకు అడ్మిట్ అవుతుంటారు. ప్రస్తుతం ఈ వార్డులో మొత్తం 150 మంది అడ్మిట్ అయ్యారు. వీరిలో చాలామంది నడవలేరు. బంధువులే రోగిని వీల్‌చైర్‌లో కూర్చోబెట్టుకుని మెట్లపై నుంచి మొదటి అంతస్తుకు తీసుకెళ్లాల్సి వస్తోంది. నరకం ఈ కొత్త భవనం పైన పటారం..అన్నట్టు మారింది. గ్రౌండ్ ఫ్లోర్‌లోని విభాగంలో అంతా బాగున్నప్పటికీ మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన ఫిమేల్ వార్డులో మహిళా రోగులు పడే కష్టాలు అన్నీఇన్నీకావు. మెడిసిన్ వార్డులో ఎవరైనా రోగిని అడ్మిట్ చేయాలన్నా.. డిశ్చార్జ్ చేయాలన్నా మొదటి అంతస్తులో ఏర్పాటుచేసిన మెట్లపై నుంచే వెళ్లాలి. సాధారణంగా రోగుల కోసం ర్యాంపు ఏర్పాటు చేసి, దానిపై వీల్ చైర్, స్టెక్చర్లపై రోగులను తీసుకెళ్లాల్సి ఉంది. అయితే ఈ భవనానికి ఎలాంటి ర్యాంపు సౌకర్యం లేదు. రోగులను తీసుకొచ్చే సమయంలో నరకం అనుభవిస్తున్నారు. పైగా వీల్‌చైర్‌లో రోగిని తీసుకొచ్చేందుకు సిబ్బంది ఎవరూ ఉడరు. రోగి సహాయకులే మెట్లపై నుంచి వీల్ చైర్లో కూర్చోబెట్టుకుని అతికష్టం మీద కిందకు దించుతున్నారు. మెట్లపై ఎలా తీసుకెళ్లేది? ఏం సార్..! టీటీడీకి, రుయాకు డ బ్బులు ఏమైనా కొదవా..? పైకి లేవలేని రోగిని మెట్లపై నుంచి ఎలా తీసుకెళ్లాలి. వీల్ చైర్‌పై తెచ్చే కిందికి దించే సమయంలో చెయ్యి జారి పడితే రోగి పరిస్థితి ఏమవ్వాలి. ర్యాంపు ఏర్పాటు చేయక పోవడం వల్ల రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు దీనిపై దృష్టిసారించాలి. - నర్సింహారెడ్డి, రోగి బంధువు, పెద్దమండ్యం ర్యాంపు ఏర్పాటు చేస్తాం మెడిసిన్ వార్డుకు ముందు ఇక్కడ టీటీడీ క్యాంటీన్ ఉండేది. ప్రస్తుతం దీన్ని రోగుల కోసం మెడిసిన్ వా ర్డుగా ఉపయోగిస్తున్నాం. ఫిమేల్ వార్డులో రోగుల సౌకర్యార్థం ర్యాం పు ఏర్పాటు చేసేందుకు నిధులు కూడా మంజూరు చేసాం. త్వరలోనే ర్యాంపును అందుబాటులోకి తీసుకొస్తాం. -డాక్టర్ యు.శ్రీహరి, అసిస్టెంట్ సివిల్ సర్జన్, ఆర్ఎంవో, రుయా ఆస్పత్రి -
'అమానవీయంగా ప్రవర్తించారు'
న్యూఢిల్లీ: నడవలేని స్థితిలో ఉన్న 70 ఏళ్ల వృద్ధురాలి పట్ల ఎయిర్ ఇండియా సిబ్బంది అమానవీయంగా ప్రవర్తించారు. వీల్ చైర్ లో వచ్చిన ఆమెను విమానం ఎక్కనీయకుండా అడ్డుకున్నారు. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ముంబై నుంచి ఢిల్లీ మీదుగా న్యూయార్క్ వెళ్లే విమానం ఎక్కేందుకు వచ్చిన వృద్ధురాలిని 'ఓవర్ బుకింగ్' కారణంగా ఎయిర్ ఇండియా సిబ్బంది అడ్డుకున్నారు. ఆమె కుమార్తె ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. తన తల్లికి సాయం చేయాలని ఎయిర్ ఇండియాకు ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన అధికారులు వృద్ధురాలిని ఢిల్లీ-లండన్ విమానంలో పంపించారు. అక్కడి నుంచి కనెక్టింగ్ విమానం ద్వారా శనివారం న్యూయార్క్ కు చేర్చారు. ముందు రోజు విమానం రద్దు కావడంతో తన తల్లికి ముంబై-న్యూయార్క్ విమానంలో ప్రవేశం నిరాకరించారని వృద్ధురాలి కుమార్తె తెలిపారు. తన తల్లి పట్ల అమానవీయంగా వ్యవహరించారని, వీల్ చైర్ కూడా ఎప్పటికో ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాతే ఎయిర్ ఇండియా సిబ్బంది స్పందించారని చెప్పారు. -
వీలుంటే చైర్ ఇవ్వండి
► ‘ అనంత’ ఆస్పత్రిలో వీల్చైర్ల కరువు ► 15 కుర్చీలతోనే నెట్టుకొస్తున్న అధికారులు ► తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు అనంతపురం మెడికల్ : ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ‘వీల్‌చైర్’ కష్టాలు అన్నీఇన్నీ కావు. రోజూ 800 మందికి పైగా ఇన్‌పేషెంట్స్.. వెయ్యి మందికి పైగా ఔట్‌పేషెంట్స్ వచ్చే ఈ ఆస్పత్రిలో వీల్‌చైర్ దొరకాలంటే గగనమవుతోంది. ప్రభుత్వాస్పత్రిలో కేవలం 15 వీల్ చైర్లే ఉన్నాయి. వీటిలో కూడా అత్యధికం ఆయా వార్డులకు కేటాయించారు. దీంతో రోగుల బంధువులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. గురువారం ధర్మవరం నుంచి మైలసముద్రానికి వెళ్తుండగా వెల్దుర్తి వద్ద ఆటోలోంచి కిందపడిపోవడంతో మైలసముద్రానికి చెందిన అక్కమ్మ (58) గాయపడింది. దీంతో ఆమెను అనంతపురం ఆస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్స చేసిన వైద్యులు స్కానింగ్ చేయించారు. ఈ రిపోర్టులు గురువారం వస్తాయని చెప్పారు. దీంతో అప్పటికే నడవలేని స్థితిలో ఉన్న ఆమెను వీల్‌చైర్‌లో అలాగే ఉంచారు. అంతలో ఆమెకు ఆకలేస్తుండడంతో కుటుంబ సభ్యులు ఆహారాన్ని తెచ్చివ్వడంతో వీల్‌చైర్‌లోనే కూర్చుని తింటోంది. అదే సమయంలో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యురాలిని ఆస్పత్రికి తెచ్చారు. వారి పరిస్థితి కూడా నడవడానికి వీల్లేకుండా ఉండడంతో అక్కమ్మ వద్దకు వచ్చి వీల్‌చైర్ కోసం వేచిచూశాడు. అప్పటికే ఓపీ సమయం ముగుస్తుండడంతో కోపగించుకున్నాడు. అంతలో అక్కమ్మ కుటుంబ సభ్యులు ఆమెను వీల్‌చైర్‌లోంచి లేపి ఆరుబయట కూర్చోబెట్టడంతో ఆమె భోంచేసి వెళ్లిపోయింది. ఇలా ప్రతి రోజు రోగులు ఇలాంటి ఇబ్బందులే పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఎక్కువ సంఖ్యలో వీల్చైర్లు అందుబాటులో ఉంచితే రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. -
వికలాంగుల కోసం మైండ్ కంట్రోల్ వీల్ ఛైర్
అమెరికా శాస్త్రవేత్తలు ఓ కొత్త రోబోటిక్ వీల్ ఛైర్ ను అభివృద్ధి చేశారు. ముందుగా వీల్ ఛైర్ పనిచేసే విధానాన్ని కనుగొనేందుకు కోతులపై ప్రయోగించారు. అవి దాన్ని నడిపే తీరును పరిశీలించారు. కోతుల మెదడులోని ఆలోచనలను బట్టి ఆ ఛైర్ కదలడాన్నిగమనించారు. భవిష్యత్తులో అలాంటి వీల్ ఛైర్లు కండరాల నియంత్రణ, చైతన్యం కోల్పోయిన వ్యక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త, ఆయన బృందం పరిశోధనలు చేస్తోంది. మెదడు సంకేతాలను డిజిటల్ మోటార్ కమాండ్స్‌గా మార్చే ఓ కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను తయారుచేసిన సైంటిస్టులు.. అవి వీల్ ఛైర్ కదలికలను నియంత్రించేలా రూపొందించారు. కోతుల్లో కూడా అచ్చం మానవచేష్టలే ఉంటాయని ఇంతకుముందే ఎన్నోసార్లు నిర్ధారించారు. అందుకే ఈ వీల్ ఛైర్‌ను ముందుగా కోతులతో ప్రయోగించి చూశారు. వాటి మెదడులో కదలికలు, స్పర్శను తెలిపే న్యూరాల్ల పనితీరును ఇంటర్ ఫేస్ సంకేతాల ద్వారా రికార్డు చేశారు. ఆలోచనలను బట్టి కోతులు వాటి లక్ష్యం దిశగా కదలడాన్ని తెలుసుకునేందుకు ఓ ద్రాక్షపళ్ల గిన్నెను వాటి ముందుంచారు. వీల్ ఛైర్ కదిలే విధానం, వాటి మెదడు చర్యలు ఒకేలా ఉండటాన్ని కంప్యూటర్ ద్వారా పరిశీలించారు. కోతుల్లో మెదడు పనిచేస్తున్న తీరు, వీల్ ఛైర్ కదిలే విధానం ఒకేలా ఉందని తేలింది. దీంతో భవిష్యత్తులో పక్షవాతం, వెన్నుకు సంబంధించిన వైకల్యాలతో బాధపడేవారికి, కండరాల నియంత్రణ, చైతన్యం కోల్పోయినవారికి ఈ మనో నియంత్రిత వీల్ ఛైర్ సహకరిస్తుందని అమెరికా డ్యూక్ విశ్వవిద్యాలయం న్యూరో ఇంజనీరింగ్ సెంటర్‌కు చెందిన మిగ్యూల్ నికోలస్ తెలిపారు. అయితే కనీస కదలికలు కూడా లేనివారికి మాత్రం ఇది పెద్దగా పనికొచ్చే అవకాశం ఉండదన్నారు. -
నేను రె‘ఢీ’
‘అసెంబ్లీకి వచ్చేందుకు నేను రెడీ..ధైర్యముంటే నా కోసం ప్రత్యేకంగా సీటు వేయించు’ అంటూ ముఖ్యమంత్రికి డీఎంకే అధినేత కరుణానిధి సవాల్ విసిరారు. పెద్ద పెద్ద నాయకుల్నే చూశానని, తన గుండె ధైర్యం చూస్తే తట్టుకోలేవని, దిగజారుడు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. * ధైర్యముంటే సీటు వేరుుంచు * పన్నీరుకు కరుణ సవాల్ * దిగజారొద్దని హితవు సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధి వయోభారంతో వీల్‌ఛైర్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. అత్యాధునిక టెక్నాలజీతో సిద్ధం చేసిన వీల్ ఛైర్లో కూర్చునే ఆయన ఎక్కడికైనా వెళతారు. అలాంటి కరుణానిధికి అసెంబ్లీలో సమస్య ఎదురైంది. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక జార్జ్‌కోటను అసెంబ్లీగా ఎంపిక చేసుకుంది. అక్కడ కరుణ వీల్ ఛైర్ వెళ్లే విధంగా ఏర్పాట్లు లేదు. ఆ ఛైర్లో అసెంబ్లీలో కూర్చునేంతగా స్థలం లేదు. ప్రధాన ప్రతిపక్షం డీఎండీకేకు వెనుక డీఎంకే సభ్యులకు సీట్లు కేటాయించారు. తాను అసెంబ్లీకి వచ్చేందుకు ప్రత్యేక సీటు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని పలుమార్లు కరుణానిధి కోరారు. అయితే స్పందన లేదు. దీంతో అసెంబ్లీ సమా వేశాలు జరిగేటప్పుడు ఏదో ఒక రోజు వచ్చి సంతకం పెట్టి వెనుదిరగడం కరుణానిధికి పరిపాటిగా మారింది. అయితే పన్నీరు సెల్వాన్ని ఉద్దేశించి కరుణానిధి వ్యాఖ్యలు చేయడం, ఇందుకు దీటుగా పన్నీరు బదులివ్వడం ఇటీవల చోటు చేసుకుంది. ధైర్యముంటే అసెంబ్లీలో అడుగు పెట్టు అని పన్నీరు సెల్వం విసిరిన సవాలును తిప్పికొట్టే విధంగా శుక్రవారం కరుణానిధి స్పందించారు. సీటు వేయించు: అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు తాను సిద్ధమని కరుణానిధి స్పష్టం చేశారు. అయితే తనకు ప్రత్యేక సీటును ముందు వరుసలో వేయించాలని, అందుకు తగ్గ ధైర్యం ఉందా..? అని సీఎం పన్నీరు సెల్వానికి సవాల్ విసిరారు. ప్రజా సమస్యల్ని ఎత్తి చూపే బాధ్యత ప్రతి పక్షానికి ఉందన్నారు. లోపాలను సరిదిద్దుకోవాల్సిన పన్నీరు సెల్వం తనకే నీతులు చెప్పేంతగా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు హెచ్చరించారు. అసెంబ్లీలో తాను సంధించే ప్రశ్నలకు మహా మహులే సమాధానాలు ఇవ్వలేక తడపడ్డ సందర్భాల ఉన్నాయని, ఇక తమరు ఎంత అని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి ఎంజీ.రామచంద్రన్ మరుసటి రోజు వచ్చి తనకు సమాధానాలు ఇచ్చేవారని, తాను మహామహుల్ని చూశానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు బాధ్యతతో, హుందాగా వ్యవహరించడం అలవాటు చేసుకోవాలని, దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే సహించబోనని హెచ్చరించారు. -
వీల్ చైర్లో కెప్టెన్
సాక్షి, చెన్నై: లోక్ సభ ఎన్నికల అనంతరం డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్యం బారిన పడ్డట్టున్నారు. ఓ వైపు పార్టీ డిపాజిట్లు గల్లంతు కావడం, మరో వైపు జంప్ జిలానీకి ఎమ్మెల్యేలు రెడీ అవుతున్న సంకేతాలు వెరసి ఆయనలో కలవరాన్ని సృష్టించాయి. ఎన్నికల ముందుగా సింగపూర్‌కు పరుగులు తీసిన విజయకాంత్, ఎన్నికల అనంతరం కూడా ఉరకలు తీశారు. సింగపూర్ పర్యటనకు ముందుగా ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో ఒక రోజు చికిత్స పొందడం ఆ పార్టీ వర్గాలను కలవరంలో పడేసింది. అయితే, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారన్న భరోసాను ఇచ్చారు. ఆస్పత్రి నుంచి వచ్చిన విజయకాంత్ ఈనెల 13న తన సతీమణి ప్రేమలతతో కలసి సింగపూర్ వెళ్లారు. అయితే, ఆయన పర్యటన వివరాలను అత్యంత రహస్యంగా ఉంచారు. రెండు వారాల పాటుగా సింగపూర్‌లో ఉన్న విజయకాంత్ చెన్నైకు తిరుగు పయనం అవుతున్నట్టు శనివారం సమాచారం అందింది. అదే రోజు రాత్రి చెన్నైకు చేరుకోవాల్సి ఉన్నా, ఆ పర్యటన వాయిదా వేసుకున్నారు. ఆదివారం ఉదయాన్నే ఆయన చెన్నైకు వస్తున్నారన్న సమాచారంతో మీడియా మీనంబాక్కం విమానాశ్రయానికి చేరుకుంది .ముందు ప్రేమలత : విజయకాంత్ ఏదేని కొత్త విషయాలు చెబుతారన్న ఆసక్తితో మీడియా మీనంబాక్కంకు పరుగులు తీసింది. సింగపూర్ నుంచి ఉదయం 10.10 గంటలకు సిల్క్ ఎయిర్ వేస్ చెన్నైలో ల్యాండ్ అయింది. ఆ విమానం నుంచి ప్రేమలత మాత్రం దిగి బయటకు వచ్చారు. అయితే, విజయకాంత్ రాలేదన్న సంకేతం ఇవ్వడానికే ఆమె తొలుత బయటకు వచ్చినట్టుంది. విమానం నుంచి ప్రయాణికులందరూ కిందకు దిగిన కాసేపటికి విజయకాంత్‌ను వీల్ చైర్లో సిబ్బంది తీసుకొచ్చారు. శరీరంపై దుప్పటి కప్పి ఉన్నట్టుగా వీల్ చైర్లో బయటకు వచ్చిన విజయకాంత్‌ను మీడియా కంట పడకుండా జాగ్రత్తగా కారులో ఎక్కించారు. అక్కడి నుంచి ఆ కారు విజయకాంత్ ఇంటి వైపుగా దూసుకెళ్లింది. అయితే, విజయకాంత్‌కు ఏమయ్యిందోనన్న వివరాలను ఆ పార్టీవర్గాలే చెప్పలేని పరిస్థితి. అనారోగ్యం బారిన పడ్డ విజయకాంత్‌కు సింగపూర్‌లో ఏదైనా శస్త్ర చికిత్స జరిగిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నారయి. అయితే, తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తనకు ఎలాంటి వ్యాధులు లేవంటూ విజయకాంత్ ఇది వరకు స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఆయన వీల్ చైర్లో రావడంతో ఏమయ్యిందోనన్న విషయాన్ని ఆరా తీయడానికి తమిళ మీడియా శాయశక్తులా ప్రయత్నిస్తోంది. -
ఆశ్రయమిచ్చే అమ్మ
అంగవైకల్యం.. ఎదుటివారిపై ఆధారపడేలా చేస్తుంది. కానీ, ఇక్కడ పిల్లలందరి మధ్యలో వీల్‌చైర్‌లో కూర్చున్న పావని... ఎదుటివారికి... అదీ అన్ని అవయవాలు బాగున్నవారికి అండగా నిలవాలనుకుంది. బతికున్నంతకాలం తల్లిదండ్రులకు చంటిపాపలా ఉండాల్సిన పావని తల్లిదండ్రులను పోగొట్టుకున్న అనాథపిల్లలకు తల్లిగా మారింది. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలానికెళ్లి ‘అమ్మ ఆశ్రమం’ గురించి అడిగితే అందరూ ముందు పావని గురించే చెబుతారు. ఒకరోజు వార్తాపత్రికలో.. ‘తల్లిదండ్రులు లేని ఈ అనాథపిల్లలకు ఆర్థిక సాయం చేయగలరు’ అనే ప్రకటన చదివింది పావని. తన స్నేహితులకు విషయం చెప్పి వారి సాయంతో కోటగిరికి పదికిలోమీటర్ల దూరంలో ఉన్న బొమ్మన్‌దేవ్‌పల్లికి వెళ్లింది. తొమ్మిదేళ్ల వయసున్న భారతి, ఏడేళ్ల శోభను కలిసి వారిని తనకిమ్మని పెద్దలతో మాట్లాడింది. తన గురించి పూర్తిగా చెప్పి పెద్దల్ని ఒప్పించి ఆ అనాథలిద్దర్ని ఇంటికి తీసుకొచ్చింది. అప్పటికే తల్లితో తన ఆశ గురించి, ఆశయం గురించి వివరంగా చెప్పింది పావని. బిడ్డ మనసెరిగిన వెంకటరమణ అలా వచ్చిన అనాథ పిల్లలందరికీ అమ్మమ్మ అయ్యింది. ఆశే.. ఆశయమైంది కొన్నిసార్లు ఏదో ఆలోచనతో మొదలుపెట్టిన పని...రకరకాలు మలుపులు తిరుగుతూ సరికొత్త ఫలితాలను అందజేస్తుంది. పావని తనకు తోడు కావాలనుకుని మొదలుపెట్టినా... అనాథపిల్లల జీవితాలు చూసి ఓ క్షణం వారి గురించి ఆలోచించి వారందరికీ తోడుగా నిలవాలనుకుంది. ‘‘భారతి, శోభ మా ఇంటికొచ్చి నాలుగేళ్లు దాటింది. అన్నయ్య పెళ్లయ్యాక ఉద్యోగరీత్యా విజయవాడ వెళ్లిపోయాడు. ఇక ఇంట్లో అమ్మా, నాన్న, నేను. అమ్మ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నభోజన పథకం కింద వంటచేసే పని చేస్తుంది. నాన్న ఏ పనీ చేయకపోయినా కాలక్షేపానికి ఊళ్లోకి వెళ్లిపోతాడు. అమ్మానాన్న ఉన్నప్పుడే ఇలా ఉందంటే.. వారి తర్వాత నా పరిస్థితి ఏంటని బాగా ఆలోచించాను. నావాళ్లంటూ ఓ నలుగురు ఉండాలని అనుకున్నాను. ఒకరో ఇద్దరో అనాథల్ని పెంచుకుంటే వారి నీడనే జీవితం గడిపేయొచ్చుకదా! అన్న ఆశతో మొదలుపెట్టాను. విచిత్రం ఏమిటంటే..అది అక్కడితో ఆగకుండా...నా చుట్టుపక్కలున్న అనాథపిల్లలందరికీ నన్ను అమ్మగా మార్చేసింది. మనకు తెలియకుండానే మన జీవితం మలుపు తిరుగుతుందని ఎవరో అంటే నాకు అర్థం కాలేదు. నా ఇంట్లో అనాథపిల్లల సంఖ్య పెరుగుతున్నప్పుడల్లా నా మనసులో కలిగింది ఆశ కాదు, ఆశయమని అర్థమవుతుంటుంది’’ అంటూ చెప్పే పావని వయసు ప్రస్తుతం 36 ఏళ్లు. శరీర బరువు కారణంతో ఓ ఇద్దరు సాయం ఉంటేగాని కదల్లేదు. వీల్‌చైర్ ఎక్కిందంటే మాత్రం అన్ని పనులూ చకచకా చేసేస్తుంది. ఓ పక్క కుట్లు, అల్లికల పనిచేస్తూనే పదో తరగతి పరీక్ష రాసి పాసైంది పావని. తర్వాత ఇంట్లో నుంచి ఇంటర్, డిగ్రీ కూడా పూర్తి చేసింది. అమ్మ సాయంతోనే... పిల్లలకు ఆస్తులివ్వకపోయినా వారి ఆశయాలు నెరవేరితే చాలంటుంది పావని తల్లి వెంకట రమణ. పల్లెల్లో పనుల్లేక కన్నబిడ్డల్ని పెంచడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఇంతమంది అనాథ పిల్లల్ని ఇంట్లో పెట్టుకోవడం అంటే మాటలు కాదు. అదెలా సాధ్యం అంటే... ‘‘పావని మొదట్లో చెబితే నాకు అర్థం కాలేదు. ఓ ఇద్దరు పిల్లలు ఇంట్లో అడుగుపెట్టగానే పావని ముఖంలో తెలియని ధైర్యం చూశాను. ఆ అనాథపిల్లలకోసం ఏదైనా చేయాలనే పావని పట్టుదలను గమనించాక అప్పటివరకూ పావని గురించి ఉన్న బెంగ పోయింది నాకు. పిల్లలందరినీ నేను పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించింది. మధ్యాహ్నం భోజనం అక్కడే తినేస్తారు. సాయంత్రం భోజనం కోసం ఆమె కుట్లు, అల్లికల డబ్బును ఉపయోగిస్తుంది. దాతల సాయం కూడా ఉంది’’ అని చెప్పింది వెంకటరమణ. పెరుగుతున్న పిల్లల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని పావని ఆ ప్రాంత పెద్దల సలహాలతో ఆశ్రమం నడుపుతోంది. రెండు గదుల ఇరుకింట్లో ఇరవైమంది ఉండడాన్ని చూసి స్పందించిన ప్రభుత్వ అధికారులు ఈ మధ్యనే ఆశ్రమం నిర్మాణం కోసం మూడు లక్షల నగదు సాయం చేశారు. దానికి మిగతా దాతలు తోడు కావడంతో కొత్తగా మరో భవనం నిర్మాణానికి పూనుకుంది పావని. ఒక్క తల్లి బిడ్డల్లా... పదిహేడు మంది పిల్లల్లో ఎనిమిదిమంది ఆడపిల్లలు, తొమ్మిదిమంది మగపిల్లలూ ఉన్నారు. రోజు పొద్దునే వారి పనులు వారు చేసుకుని బడికి వెళ్లిపోవడం సాయంత్రం వచ్చాక కాసేపు టీవీ చూడ్డం, చదువుకోవడం... అన్నీ సొంతింట్లో ఎలా ఉంటారో అలాగే ఉంటారు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి పూర్తిచేసిన భారతి తన గురించి చెప్పినపుడు ‘నేను పావనిగారి పెద్దమ్మాయి’ని అంటూ పరిచయం చేసుకుంది. అలాగే రమేష్ అనే అబ్బాయి మాట్లాడుతూ... ‘ఇంతమంది అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు ఎవరికి ఉంటారు? అమ్మ గురించి చెప్పాలంటే... మా ప్రోగ్రెస్ రిపోర్టులు చూసుకుని తెగ మురిసిపోతుంటుంది. మార్కులు తక్కువొచ్చాయా... ఇక వారితో మాట్లాడదు. మేమంతా బాగా చదవాలన్నది ఆమె కోరిక’’ అని చెప్పాడు. తోటివారికి చేతనైనంత సాయం చేయడం మానవధర్మమైతే...చేయగలిగినదానికంటే ఎక్కువగా చేయడం సేవాధర్మం. ఆ ధర్మానికి కట్టుబడే తన దృష్టికి వచ్చిన ప్రతి అనాథపట్ల స్పందిస్తోంది పావని. ఎంతమందికైనా ఆశ్రయం ఇవ్వగలనన్న ఆమె మనోధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. ‘‘ఎవరడిగినా ఇది మా ఇల్లనే చెబుతాం. ఆశ్రమం అనే మాట ఎవరో బయటి నుంచి వచ్చినవాళ్లే అంటారు. అమ్మ, అమ్మమ్మ మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. ‘నాకంటే కాళ్లు లేవు... మీరలా కాదు... జీవితంలో ఏదైనా సాధించగలరు’ అని మాటిమాటికీ అమ్మ చెప్పే మాటలు మేం ఎప్పటికీ మరచిపోలేం’’ అని చెప్పింది భారతి అనే అమ్మాయి. -
వైకల్యానికి కొత్త అర్థం...సంకల్పబలం!
‘‘వీల్‌చైర్‌ని డిజేబిలిటీకి సింబల్‌గా కాదు ఎబిలిటీకి చిహ్నంగా మార్చాలనుకున్నాను. మా పిల్లల్ని డిజేబుల్డ్ అనొద్దు డిఫరెంట్లీ ఏబుల్డ్ అనండి’’ అంటారు సయ్యద్ సలావుద్దీన్ పాషా. విభిన్న రకాల శారీరక, మానసిక సమస్యలున్న యువతీ యువకులను ఒకచోట చేర్చి ఓ గొప్ప కళాకారుల బృందంగా తీర్చిదిద్దారు ఈ ఢిల్లీవాసి, నృత్యనిపుణులు పాషా. ఈ బృందం పలుమార్లు హైదరాబాద్‌లో సైతం తమ వీల్‌చైర్ విన్యాసాలను ప్రదర్శించింది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో పాషా మాట్లాడారు. -
వైకల్యానికి కొత్త అర్థం...సంకల్పబలం!
వైకల్యం అంటే ఏమిటి? చూపు లేకపోవడమా? చూడలేకపోవడమా? చూడలేకపోవడమే కదా? అలాగైతే, అంధులు వికలాంగులు కారు. మనోనేత్రంతో వారు అన్నీ చూడగలరు. వైకల్యం అంటే ఏమిటి? కాళ్లూచేతులూ లేకపోవడమా? లేనట్లు ఉండిపోవడమా? లేనట్లు ఉండిపోవడమే కదా! అలాగైతే అవిటివాళ్లు వికలాంగులు కారు. కార్యదీక్షతో వారు పరుగులు తీయగలరు. ఈ ‘స్పెషల్ ఎబిలిటీ’స్ ఇక్కడితో పూర్తి కాలేదు. వీరిలో కొందరు చక్కగా పాడుతున్నారు. అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు. సృజనాత్మకంగా బొమ్మలు గీస్తున్నారు. ఇలా రకరకాల నైపుణ్యాలను వెలికితీసి, వైకల్యం అంటే సంకల్పబలం తప్ప మరొకటి కాదని రుజువు చేసేందుకు కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు చేస్తున్న కృషి... పడుతున్న ప్రయాసే... ఈరోజు ప్రజాంశం! ‘‘వీల్‌చైర్‌ని డిజేబిలిటీకి సింబల్‌గా కాదు ఎబిలిటీకి చిహ్నంగా మార్చాలనుకున్నాను. మా పిల్లల్ని డిజేబుల్డ్ అనొద్దు డిఫరెంట్లీ ఏబుల్డ్ అనండి’’ అంటారు సయ్యద్ సలావుద్దీన్ పాషా. విభిన్న రకాల శారీరక, మానసిక సమస్యలున్న యువతీ యువకులను ఒకచోట చేర్చి ఓ గొప్ప కళాకారుల బృందంగా తీర్చిదిద్దారు ఈ ఢిల్లీవాసి, నృత్యనిపుణులు పాషా. ఈ బృందం పలుమార్లు హైదరాబాద్‌లో సైతం తమ వీల్‌చైర్ విన్యాసాలను ప్రదర్శించింది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో పాషా మాట్లాడారు. తాను ముస్లిం కాబట్టి హిందూ సంప్రదాయ నృత్యాన్ని నేర్పడానికి మొదట్లో ఓ గురువు నిరాకరించారని, అయితే ఆ తర్వాత ఎందరో నృత్యగురువులు తనను వారి ప్రియశిష్యుడిగా భావించారని గుర్తు చేసుకున్నారు. సంప్రదాయ నృత్యాల్లో అందెవేసిన చేయి అయిన పాషా ఆ నైపుణ్యాన్ని వికలాంగులను తీర్చిదిద్దడానికి వినియోగిస్తున్న తీరు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. లోపాలే ఇంటిపేర్లా... ‘‘దేశంలో ఏడు కోట్లమంది శారీరక, మానసిక లోపాలున్నవారు ఉన్నారు. గ్రామాల్లో ఈ లోపాల్ని శాపాలుగా, గత జన్మ పాపఫలితంగా భావిస్తారు. విధివశాత్తు లేదా ప్రమాదవశాత్తూ ఏర్పడ్డ బాధల్ని ఇంటిపేర్లుగా మార్చేసి గుడ్డిరమేష్, కుంటి దానయ్య, పిచ్చిపుల్లయ్య... అంటూ అవమానకరంగా పిలుస్తారు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పాషా... 30 సంవత్సరాలుగా వికలాంగుల సేవలో ఉన్నారు. వైకల్యబాధితులను విజయ వంతమైన కళాకారులుగా తీర్చిదిద్దాలనే ఆయన కసిలో నుంచి రూపుదిద్దుకున్నదే‘ఎబిలిటీ అన్లిమిటెడ్’ సంస్థ. ఈ బృందంలో అంధులు, మూగ, చెవిటి, పోలియో, డిజ్లెక్సియా, సెరిబ్రల్ పాల్సీ, ఆటిజం బాధితులు ఎందరెందరో ఉన్నారు. క్రచ్‌లు, వీల్చైర్లతోనే అనితరసాధ్యమైన ప్రదర్శనల ద్వారా గిన్నిస్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్లను ఈ బృందం స్వంతం చేసుకుంది. అమెరికా, కెనడా, వెస్ట్ ఇండీస్ సహా బ్రిటన్ పార్లమెంట్ హౌజ్ ఆఫ్ కామన్స్లోనూ ప్రదర్శన ఇచ్చింది. ‘‘ప్రారంభంలో ఈ సంస్థ మనుగడను ఎవరూ విశ్వసించలేదు. ‘వికలాంగుల నృత్యరూపకమా? ఇదెలా సాధ్యం?’ అన్నారు. దీనిని సాకారం చేయడం కోసం స్వయంగా రోజుకి 10 గంటల పాటు వీల్‌చైర్ మీద సాధన చేసి మరీ, సాధ్యం చేశాను. మా బృందం ఇప్పటికే వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చింది. ఇప్పుడు నా బృందంలో 160 మంది డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉన్నారు’’ అంటూ సగర్వంగా చెప్పారాయన. వైకల్యం నుంచి విజయాల బాట... ‘‘అచ్చం ఆ కృష్ణభగవానుడిలాంటి గురూజీ సారథ్యంలో నన్ను నేను అర్జునుడిలా భావిస్తున్నాను’’ అంటాడు మనోజ్. వీల్‌చైర్‌తో కాలం వెళ్లదీయాల్సిందేనని భావించిన మనోజ్‌ని భారతదేశపు తొలి డిజేబుల్డ్ డ్యాన్స్ట్రూప్లో సభ్యత్వం... తన కాళ్లమీద తాను నిలబడి విజయవంతమైన వ్యక్తిగా నిలిచేలా చేసింది. ‘‘నృత్యం నాకు సరికొత్త జీవితాన్నిచ్చింది’’ అంటున్న పోలియో బాధితుడు గుల్షన్‌కుమార్ ఒక నిమిషంలో 63 స్పిన్స్ (మెలికలు) తిరగడం ద్వారా వ్యక్తిగత గిన్నిస్ రికార్డ్ సృష్టించాడు. ఈ బృందంలో ఐదేళ్ల నుంచి 30 ఏళ్ల దాకా విభిన్న వయసుల వికలాంగ కళాకారులున్నారు. మార్షల్ ఆర్ట్స్ ఆన్ వీల్స్, రామాయణ ఆన్ వీల్స్, ఫ్రీడమ్ ఆన్ వీల్స్, దుర్గావతారాలు, భగవద్గీత, పంచతంత్ర కథలు, భరతనాట్యం, యోగా, సూఫీ, క రవాల నృత్యం... వీల్‌చైర్ మీదే ప్రదర్శిస్తారు. ‘‘అంగవికలురకు సంబంధించి విద్య, ఉద్యోగాల పరంగా ఉన్న వ్యతిరేక ఆలోచనాధోరణులను, సందేహాలను పటాపంచలు చేయాలనే ఉద్దేశ్యంతో మేం కృషి చేస్తున్నాం’’ అన్నారు పాషా. క్లాసికల్ డ్యాన్స్, మూవ్మెంట్ థెరపీ, స్టేజ్ లైటింగ్, ఫొటోగ్రఫీ, ఫిల్మ్ మేకింగ్, ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్, పిడబ్ల్యుడిలకు యానిమేషన్ వంటి వాటిలో వికలాంగులకు ఈ సంస్థ శిక్షణ అందిస్తోంది. ప్రసిద్ధ నృత్యగురువులు, కొరియోగ్రాఫర్స్, మ్యూజిక్ కంపోజర్స్ ఈ సంస్థ నిర్వహించే శిక్షణ కార్యక్రమాల్లో తరగతులు నిర్వహిస్తుంటారు. వాయిస్ మాడ్యులేషన్, స్పీచ్ థెరపీ, స్పెషల్ కొరియోగ్రాఫిక్ మూవ్‌మెంట్స్‌లో శిక్షణ అనంతరం ట్రూప్‌లోకి తీసుకుంటారు. ఇదో థెరపీ... ‘‘డిజేబిలిటీ ఉన్నవారికి డ్యాన్స్ సైడ్ ఎఫెక్ట్స్‌లేని మాత్ర వంటిది’’ అంటారు పాషా. ప్రదర్శనలనే సవాళ్లను ఎదుర్కోవడం ద్వారా శారీరక, మానసిక, భావోద్వేగపరమైన సామర్థ్యం ఒనగూరుతుందని విశ్లేషిస్తారాయన. లైటింగ్ నుంచి కాస్ట్యూమ్, స్టేజ్సెట్టింగ్ సహా అన్నీ చేయగల సామర్థ్యం మా బృందం సభ్యుల స్వంతం. ‘‘హ్యాండీక్యాప్డ్‌కు చాలా తక్కువ విద్యావసతులు, ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. వికలాంగులకు సానుభూతి అక్కర్లేదు. నిరూపించుకునేందుకు అవకాశం కావాలి’’ అంటారు పాషా. - ఎస్.సత్యబాబు ఆద్యంతం... అద్భుతం... శీర్షాసన, మయూరాసన వంటి యోగాసనాలతో మిళితం చేసిన భరతనాట్యం కళ్ల ముందు మెరుపులు మెరిపిస్తుంది. బీట్‌కు, రిథమ్‌కు అనుగుణంగా వీల్‌చైర్ కదిలే తీరు చూసి తీరాల్సిందే. మంత్రముగ్ధుల్ని చేసే వీరి ప్రదర్శనలను చూసి తీరాలనుకునే వారెందరో ఉన్నారు. -
కిషన్ సార్... అక్షరదీపాలను వెలిగిస్తున్న లక్ష్యసాధకుడు
హోరున వర్షం కురుస్తుంటే... కామేపల్లి మండలంలోని ప్రభుత్వపాఠశాలలన్నీ మూసేస్తారు. కాని ఒక ఉపాధ్యాయుడు మాత్రం స్కూల్‌కు వెళతారు. వెళుతూ వెళుతూ దారిలో కనపడిన పిల్లల్లో కొందరిని బుజ్జగించో, మరికొందరిని మందలించో... స్కూలుకు తీసుకుపోతారు. వానలోనే స్కూలు తెరిచి పాఠాలు మొదలుపెడతారు. ఆయన పాఠాలు చెప్పడం ప్రారంభించగానే వర్షం (విన)పడడం ఆగిపోతుంది. పిల్లలకు ఆయన పాఠం తప్ప మరేదీ వినపడదు. ఆయన కేవలం పాఠాలు చెప్పే మాస్టారు మాత్రమేనా... నడిచే... కాదు కాదు... ‘నడవలేని’ నిజజీవిత పాఠం కూడా. ఖమ్మం నుంచి దాదాపు 25 కి.మీ దూరంలో కామేపల్లి మండలంలో ఉంది ఆ ఊరు. పేరు టేకుల తండా. పూర్తిగా గిరిజన గ్రామం అది. వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత మంది చదువుకున్నవారు లేని ఆ ఊరిలో ప్రస్తుతం రెండు పాఠశాలలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రైమరీ పాఠశాల. ఆ స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పే మాస్టారి పేరు సపావట్ కిషన్ (40). ఆ ఊర్లోనే తొలి డిగ్రీ విద్యార్థిగా... బి.ఏ. బి.ఇడి పూర్తి చేసి వీల్‌చైర్ మీద కూర్చునే... పిల్లలకు పాఠాలు బోధిస్తారు. నడవలేని ఆ మాస్టారు ఎందరో గిరిజన విద్యార్థుల భవితను ముందుకు నడిపిస్తున్నారు. వైద్యుడు కాబోయి... రోగిగా... ‘‘మా అమ్మ పేరు జాంకిలి. నాన్న గోప్యా. నలుగురం అన్నదమ్ములం. మిగిలినవారిని వ్యవసాయానికి పరిమితం చేసినా కాస్త చదువుతున్నానని నన్ను మాత్రం నాన్న స్కూలుకు పంపాడు’’ అంటూ బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు కిషన్. తమ ఊరికి దాదాపు 5 కి.మీ దూరంలో ఉన్న పింజరమడుగు తండాకు చిన్నప్పుడు నడుచుకుంటూనే వెళ్లొచ్చేవాడు. దాదాపు 30కి.మీ దూరంలో ఉన్న మూల పోచారం, కిన్నెరసానిలలో హాస్టల్స్‌లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేశాడు. ఆ తర్వాత కృష్ణసాగర్‌లోని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్లో... ఆడుతూ ఆడుతూ పడిపోయినప్పుడు తెలిసింది తనకు కండరాల క్షీణత (మస్క్యులర్ డిస్ట్రొఫీ) జబ్బుందని. అది అప్పటికే తన కాళ్లను చాలా బలహీనంగా మార్చిందని, స్వల్పకాలంలోనే తను పూర్తి అవిటివాడిని కానున్నానని కూడా తెలిసింది. ‘‘పెద్ద పెద్ద చదువులు చదవాలనే ఆశ, ఆధునిక వైద్యం అంటే తెలియని మా ఊరి వాళ్లకు డాక్టర్‌గా సేవలు అందించాలనే ఆశయం సిద్ధించే అవకాశం లేదని తెలిసినప్పుడు ఎంతగా కుమిలిపోయానో’’ అంటూ పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు కిషన్. కాళ్లు కదలకున్నా... నడుస్తూనే ఉన్నా... కదలనని మొరాయిస్తున్న కాళ్లను కదిలించాలని చేసిన వైద్యపరమైన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో కిషన్... డాక్టర్ కావాలనే ఆశల్ని వదిలేసుకున్నాడు. ఇంటి నుంచే డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ కట్టాడు. మరోవైపు తనలా చదువుకోవాలనే తపన ఉన్నవారికి కాస్తయినా సాయపడదామనే ఆలోచనతో ఇంటినే స్కూలుగా మార్చాడు. అలా 1994లో కేవలం నలుగురి తో ప్రారంభమైన ‘అక్షర నిలయం’ 140 మంది విద్యార్థులను అక్కున చేర్చుకునే స్థాయికి చేరింది. సోదరులు, తండ్రి, తెలిసినవారి సహకారంతో ఎటువంటి ఫీజులు లేకుండానే దాన్ని నిర్వహిస్తుంటే... 2000 సంవత్సరంలో ఆ గ్రామానికి వచ్చిన కలెక్టర్ ఎలాంటి ప్రభుత్వ సాయం లేకుండానే గ్రామంలో ఉచిత పాఠశాల నడుస్తున్న వైనం చూసి ఆశ్చర్యపోయారు. అనంతరం కిషన్‌ను అభినందన పూర్వకంగా కలిసి, ఏవైనా సాయం కావాలా అని అడిగినప్పుడు... ‘‘వ్యక్తిగతంగా నాకేమీ వద్దు సార్... అవసరమైతే నాకున్న స్థలంలో 1000 గజాలను ఊరి కోసమే ఇచ్చేస్తాను. ఇక్కడో పాఠశాల మంజూరు చేయండి సార్’’ అంటూ కిషన్ ప్రాధేయపడ్డాడు. ఆ వినతికి కలెక్టర్ స్పందించారు. అలా కిషన్ చలవ వల్ల ఆ ఊరికి కేవలం విద్యాబుద్ధులే కాదు శాశ్వత ప్రభుత్వ పాఠశాల కూడా వచ్చింది. ఆ తర్వాత అదే స్కూల్‌కి కిషన్‌కి టీచర్ పోస్ట్ కూడా వచ్చింది. ఆ తర్వాత ఈ ఉపాధ్యాయుడు ఇక వెనుకడుగు వేయలేదు. ఊరివాళ్లని చదువూసంధ్యా లేకుండా ఊరికే ఉండనివ్వలేదు. వీల్‌చైర్ అయితేనేం... విల్ ఉంటే... అడుగు తీసి అడుగు వేయలేకపోయినా... ఆశించిన గమ్యం వైపు నడుస్తూనే ఉన్నారు కిషన్. పేరుకే ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కాని... ఆ ఊరిలో విద్యాదీప్తికి, ఊరిబాగుకు అవసరమైనవన్నీ చేస్తారు. దాదాపు ఏడేళ్లపాటు అనియత విద్యాకేంద్రం, నిరంతర విద్యాకేంద్ర వాలంటీర్‌గా సూపర్వైజర్గా పనిచేశారు. టేకులతండా, సూర్యాతండా, తాళ్ళగూడెం, గోపాలపురం గ్రామాలకు వెళ్లి సుమారు 800 మంది వయోజనులను అక్షర దీపం, అక్షర సంక్రాంతి కార్యక్రమాల ద్వారా నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధన కోసం కృషి చేశారు. గ్రామ యువకులతో కలిసి సారా నిర్మూలన కార్యక్రమం, పరిశుభ్రత, ఆరోగ్యంపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వ్యవసాయ పనుల్లో పాలేర్లుగా ఉన్న 17 మంది బాలకార్మికులను బలవంతంగా జిల్లా కలెక్టర్ దగ్గరకు తీసుకెళ్లి హాస్టల్లో చేర్పించారు. వీరిలో పలువురు ప్రస్తుతం హాయిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. 2008 లో నిర్మల్ పురస్కార్ గ్రామం కింద ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పాటు, స్వంతంగా కొన్ని నిధులు జమ చేసి గ్రామంలో 54 మరుగుదొడ్లు నిర్మించారు. క్రైస్తవ మిషన్ సహకారంతో గ్రామంలో చేతి బోరు ఏర్పాటు చేయించారు. గ్రంథాలయ నిర్మాణం కోసం తన ఒక నెల వేతనాన్ని అందజేశారు. సాక్షర భారత్‌లో 14 మంది మహిళలకు అక్షరజ్ఞానం కలిగిస్తున్నారు. ఇక నిరుపేద విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేస్తారు. ఇలా చేతనైనంతలో ఊరికోసం చేయగలిగినంతా చేస్తూ... కన్న ఊరుకు కాంతికిరణమయ్యారు. ‘‘నాకొచ్చే జీతంలో నుంచి ఏడాదికి రూ.25వేలు పూర్తిగా ఊరి మేలు కోసం చేసే సేవాకార్యక్రమాలకే వెచ్చిస్తాను. అంతమాత్రాన ఇదంతా నా గొప్పతనం మాత్రమే కాదు... ఎందరిదో సహాయం తోడ్పడుతోంది’’ అనే కిషన్... ‘‘కొత్తలో స్కూలు, చదువులు అంటూ బలవంతపెడుతున్నానని, బాలకార్మికులను పని మాన్పిస్తున్నానని మా ఇంటి మీదకి గొడవలకు కూడా వచ్చేవారు. అయితే అలాంటివారంతా ఇప్పుడు నాతో పాటు నేను చేసే కార్యక్రమాల్లో భాగం పంచుకుంటున్నారు’’ అని సంతోషం వ్యక్తం చేస్తారు. మనం ఒక మంచిపనిని మనస్ఫూర్తిగా తలపెడితే... ప్రపంచం తప్పనిసరిగా మనకు తోడవుతుంది. తలవంచుతుంది. మారుమూల ప్రాంతాలకు సనాపట్ కిషన్ లాంటి టీచర్లు... కేవలం చదువు చెప్పే గురువులు మాత్రమే కాదు చేయూతగా మారే స్ఫూర్తిప్రదాతలు కూడా. - ఎస్.సత్యబాబు పురస్కారాలెన్నో... 2000 సంవత్సరంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అక్షర దీపం ఉత్తమ వాలంటీర్‌గా కిషన్ అవార్డు తీసుకున్నారు. 1995లో వికలాంగుల సంక్షేమ శాఖ నుంచి ఉత్తమ వికలాంగ సేవా అవార్డు పొందాడు. మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు (2004), జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును వరుసగా (2010 -13) మూడేళ్ల పాటు.. అందుకున్నారు. ఐటిడిఎ బెస్ట్ టీచర్ అవార్డునూ సొంతం చేసుకున్నారు. చదువు కేవలం విద్య, ఉద్యోగాలకు మాత్రమే కాదు లోకజ్ఞానానికి కూడా. చదువులేక, పోషకాహారం మీద అవగాహన లేక... నేను కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ సరైన ఆహారం తీసుకోలేదు. దాని ఫలితంగానే నా జీవితం ఇలా చక్రాల కుర్చీకి పరిమితమైంది. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదు. సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే అన్ని సమస్యలకూ పరిష్కారం అనే నమ్మకంతో నేను ముందడుగు వేస్తున్నాను. మా ఊరిని నడిపిస్తున్నాను. - సనాపట్ కిషన్, ఉపాధ్యాయుడు