‘‘వీల్‌చైర్‌ని డిజేబిలిటీకి సింబల్‌గా కాదు ఎబిలిటీకి చిహ్నంగా మార్చాలనుకున్నాను. మా పిల్లల్ని డిజేబుల్డ్ అనొద్దు డిఫరెంట్లీ ఏబుల్డ్ అనండి’’ అంటారు సయ్యద్ సలావుద్దీన్ పాషా. విభిన్న రకాల శారీరక, మానసిక సమస్యలున్న యువతీ యువకులను ఒకచోట చేర్చి ఓ గొప్ప కళాకారుల బృందంగా తీర్చిదిద్దారు ఈ ఢిల్లీవాసి, నృత్యనిపుణులు పాషా. ఈ బృందం పలుమార్లు హైదరాబాద్‌లో సైతం తమ వీల్‌చైర్ విన్యాసాలను ప్రదర్శించింది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో పాషా మాట్లాడారు.