
న్యూఢిల్లీ: దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ వీల్‌చైర్ వెహికల్‌ను తయారు చేసినట్లు ఐఐటీ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నా లజీ) మద్రాస్ పరిశోధకులు ప్రక టించారు. ఈ వాహనం రోడ్లపైనే కాదు, ఇతర అనను కూల ప్రాంతాల్లోనూ ఉపయో గపడు తుందని చెప్పారు. ‘నియోబోల్ట్ అనే పేరు న్న ఈ వాహనంలో వాడే లిథియం– అయాన్ బేటరీని ఒక్కసారి ఛార్జి చేస్తే 25 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. వీల్‌చైర్ వాడే వారికి ఇది ఎంతో సౌకర్యం, సురక్షితం. ఆటో, స్కూటర్, కారు కంటే దీనికయ్యే ఖర్చు తక్కువ’అని వారన్నారు.
ఐఐటీ మద్రాస్ లోని సెంటర్ ఫర్ రిహాబిలిటేషన్ రీసెర్చ్ అండ్ డివైజ్ డెవలప్‌మెంట్ విభాగం ‘నియో మోషన్’ అనే స్టార్టప్‌తో వాణిజ్య స్థాయిలో ఉత్పత్తికి సన్నాహాలు ప్రారంభిం చిందన్నారు. ఈ వీల్ చైర్ సుమారుగా రూ.55 వేలకే అందుబాటులోకి వచ్చే అవకా శం ఉందని ఐఐటీ మద్రాస్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన సుజాతా శ్రీనివాసన్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో నియోబోల్ట్ మాదిరి విశిష్టలతో కూడిన వాహనాల ధరలు మూడు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. దేశంలో ఏటా అమ్ముడయ్యే దాదాపు 3 లక్షల వీల్ చైర్లలో 2.5 లక్షల వీల్ చైర్లు విదేశాల్లో తయారైనవేనని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment