ఎయిర్‌పోర్టులో వృద్ధ మహిళకు చేదు అనుభవం | Elderly Woman Had to Wait for 3 Hours for Wheelchair | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో వృద్ధ మహిళకు చేదు అనుభవం

Published Tue, Jul 9 2024 11:06 AM | Last Updated on Tue, Jul 9 2024 12:03 PM

Elderly Woman Had to Wait for 3 Hours for Wheelchair

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వృద్ధురాలికి చేదు అనుభవం ఎదురయ్యింది. ఆమె వీల్ చైర్ కోసం మూడు గంటలకు పైగా సమయం నిరీక్షిస్తూ పలు ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది.

పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ఆ 84 ఏళ్ల వృద్ధురాలు అలయన్స్ ఎయిర్ విమానంలో జైపూర్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చింది. అక్కడ వీల్ చైర్ కోసం ఆమె మూడు గంటలకు పైగా వేచి ఉండాల్సి వచ్చింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్టున్నట్ల ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు. తమ విమానయాన సంస్థ ఆ వృద్ధ మహిళకు, ఆమె కుటుంబ సభ్యులకు ఇప్పటికే క్షమాపణలు చెప్పిందని పేర్కొన్నారు.

అలయన్స్ ఎయిర్ కస్టమర్ కేర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మనోహర్ తుఫ్చి మీడియాతో మాట్లాడుతూ ‘పొరపాటు జరిగింది. మేము ఈ సంఘటనను అనేక కోణాల్లో పరిశీలిస్తున్నాం. గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీ  ఏఐ- సాట్స్‌తో కూడా ఈ ఉదంతంపై చర్చించాం. ఈ ఏజెన్సీ ప్రయాణికులకు వీల్‌చైర్‌లను  అందిస్తుంది. తాము వృద్ధురాలి కుమారునితో ఫోన్‌లో మాట్లాడాం. అతనికి క్షమాపణలు చెప్పాం’ అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement