ఢిల్లీ: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి, రాజ్యసభ సభ్యులు మన్మోహన్ సింగ్ వీల్ ఛైర్‌లో పార్లమెంట్‌కి తీసుకువచ్చారు. ఈ అంశం అధికార విపక్షాల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. మన్మోహన్‌కు రాజ్యంగం పట్ల ఉన్న విధేయతపై ప్రతిపక్షాలు కొనియాడాయి. అదే తరుణంలో ఆరోగ్యం బాగులేకున్నా.. కేవలం ఢిల్లీ బిల్లును వ్యతిరేకించాలనే చెడు సంకల్పంతో ఆయన్ను సభలోకి తీసుకురావడంపై బీజేపీ మండిపడింది. ఈ చర్యను సిగ్గు చేటుగా అభివర్ణించింది.
ఢిల్లీ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి వచ్చిన మన్‌మోహన్ సింగ్‌కు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగ విలువల పట్ల ఆయనకు ఉన్న విదేయత ఎంతో గొప్పది అంటూ కొనియాడారు. బ్లాక్ ఆర్డినెన్స్‌పై స్పందించడానికి వచ్చినందుకు ఆయనకు రుణపడి ఉంటామని అన్నారు.
మన్మోహన్‌ను రాజ్యసభలోకి తీసుకువచ్చిన తీరు దేశం గుర్తుంచుకుంటుందని బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ పిచ్చి ఎంతటిదో అర్థమవుతుందని ఆరోపణలు చేశారు. రాత్రిపూట ఆరోగ్యం బాగులేని మన్‌మోహన్‌ను వీల్ ఛైర్‌లో తీసుకురావాల్సినంత అవసమేంటని కాంగ్రెస్‌ను నిందించింది. నిజాయితీ లేని తమ కూటమిని నిలుపుకోవాలనే కాంగ్రెస్ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని దుయ్యబట్టింది.
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు మొత్తానికి పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. 131 సీట్లు బిల్లుకు ఆమోదం తెలుపగా.. 101 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. ఈ బిల్లు ఢిల్లీలో ఆప్, కేంద్రానికి మధ్య విమర్శలకు దారితీసింది.
ఇదీ చదవండి: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం.. కేజ్రీవాల్ కీలక నిర్ణయం..
Comments
Please login to add a commentAdd a comment