ముగిసిన మన్మోహన్‌ అంత్యక్రియలు | Former PM Manmohan Singh Death Last Rites Updates, Top News Headlines And Videos Inside | Sakshi
Sakshi News home page

Manmohan Singh Last Rites: ముగిసిన మన్మోహన్‌ అంత్యక్రియలు

Published Sat, Dec 28 2024 7:28 AM | Last Updated on Sat, Dec 28 2024 1:35 PM

Former Pm Manmohan Singh Last Rites Updates

ముగిసిన మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు

  • సిక్కు సంప్రదాయం ప్రకారం జరిగిన మన్మోహన్‌ అంత్యక్రియలు
  • సిక్కు పెద్దల సమక్షంలో అంత్యక్రియలు
  • మన్మోహన్‌ పార్థివదేహం వద్ద చివరిసారిగా ప్రార్థనలు చేసిన కుటుంబసభ్యులు
  • రెండవ ప్రపంచ యుద్ధంలో వాడిన తుపాకులను గాల్లోకి పేల్చి మాజీ ప్రధానికి సైనికుల గౌరవ వందనం

సైనిక లాంఛనాలతో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు

  • ఢిల్లీ నిగమ్‌బోధ్‌ స్మశానవాటికలో జరిగిన మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు
  • సైనిక లాంఛనాలతో మన్మోహన్‌ అంత్యక్రియలు
  • అంత్యక్రియలకు హాజరైన రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌, ప్రధాని మోదీ, ఎల్‌ఓపీ రాహుల్‌గాంధీ, భూటాన్‌ రాజు కేసర్‌ నామ్‌గేల్‌ వాంగ్‌చుక్‌, సోనియాగాంధీ, ఖర్గే, అమిత్‌ షా, ఇతర నేతలు
  • మన్మోహన్‌ పాడె మోసిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ

సిక్కు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు

  • సిక్కు మతపెద్దల సమక్షంలో సిక్కు సంప్రదాయం ప్రకారం జరిగిన మన్మోహన్‌ అంత్యక్రియలు
  • పార్థివదేహం వద్ద ప్రార్థనలు నిర్వహించిన కుటుంబ సభ్యులు

చివరిసారిగా నివాళులర్పించిన ప్రధాని, రాష్ట్రపతి

  • చివరిసారిగా మన్మోహన్‌కు నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని
  • ఆర్థిక సంస్కర్తకు నివాళులర్పించిన త్రివిధ దళాలు

 

   మన్మోహన్‌ సింగ్‌ అంతిమ యాత్ర ప్రారంభం..

  •  మన్మోహన్‌ సింగ్‌ అంతిమ యాత్ర ప్రారంభమైంది. 
  • ఏఐసీసీ ఆఫీసు నుంచి నిగమ్‌బోధ్‌ ఘాట్‌ వరకు అ‍ంతిమ యాత్ర కొనసాగనుంది. 
  • మన్మోహన్‌ అంతిమయాత్ర వాహనంలోనే కూర్చున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ
  • కాసేపట్లో నిగమ్‌బోథ్‌ ఘాట్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. 

మన్మోహన్‌కు వైట్‌హౌజ్‌ సంతాపం

  • మన్మోహన్‌సింగ్‌ మృతిపట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతాపం
  • ప్రకటన విడుదల చేసిన వైట్‌హౌజ్‌ 

 

 కాంగ్రెస్‌ ఆఫీసుకు మన్మోహన్‌సింగ్‌ పార్థివ దేహం 

  • ఇంటి నుంచి కాంగ్రెస్‌ ఆఫీసుకు చేరుకున్న  మన్మోహన్‌సింగ్‌ అంతిమయాత్ర 
  • మన్మోహన్‌ పార్థివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్‌‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఖర్గే

  • ఏఐసీసీ ఆఫీసులో ప్రజల సందర్శన కోసం పార్థివ దేహం
  • ఇక్కడి నుంచి 9.30కు అంతిమయాత్ర ప్రారంభం
  • 11.45కు నిగంబోధ్‌ ఘాట్‌లో అంత్యక్రియలు

కాంగ్రెస్‌ కార్యాలయం నుంచి మన్మోహన్‌ అంతిమయాత్ర

  • ఏఐసీసీ ఆఫీసు నుంచి ప్రారంభం కానున్న మన్మోహన్‌ అంతిమయాత్ర
  • పార్టీ ఆఫీసుకు చేరుకున్న ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, జైరాంరమేష్‌, పవన్‌ ఖేరా
  • 9.30కు అంతిమయాత్ర ప్రారంభం 

  • 11.45కు నిగంబోధ్‌ ఘాట్‌ స్మశానవాటికలో అంత్యక్రియలు

కాసేపట్లో మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు

  • మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి
  • ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్‌సింగ్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నారు
  • ఉదయం 8 గంటల నుంచి ప్రజల సందర్శనార్థం మన్మోహన్‌సింగ్‌ పార్థివ దేహాన్ని కాంగ్రెస్‌ ఆఫీసులో ఉంచుతారు
  • కాంగ్రెస్‌ ఆఫీసు నుంచి 9.30కు మన్మోహన్‌ అంతిమయాత్ర ప్రారంభం కానుంది
  • 11.45కు నిగంబోధ్‌ ఘాట్‌ స్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి

  • మన్మోహన్‌ స్మృతి వనం నిర్మించేందుకు స్థలం కేటాయించాల్సిందిగా కాంగ్రెస్‌ నేతలు ప్రభుత్వాన్ని కోరారు
  • దీనికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది
  • ఇప్పటికే ఏడు రోజులు సంతాపదినాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది
  • శుక్రవారం మన్మోహన్‌ పార్థివ దేహానికి ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము సహా పలువురు నేతలు నివాళి అర్పించారు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement