జాతీయ కంప్యూటర్ భద్రతా దినోత్సవాన్ని ప్రతి ఏటా నవంబర్ 30న జరుపుకుంటారు. దీనిని ‘అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ డే’ అని కూడా అంటారు. సైబర్ బెదిరింపుల నుండి తమ కంప్యూటర్‌లు, వ్యక్తిగత డేటాను రక్షించుకోవడంపై అవగాహన కల్పించడమే కంప్యూటర్ భద్రతా దినోత్సవ లక్ష్యం. కంప్యూటర్ డే ఎందుకు జరుపుకుంటారు? దీని ప్రాముఖ్యత, చరిత్రకు సంబంధించిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటర్నెట్, కంప్యూటర్ నెట్‌వర్క్‌లు అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన 1988లో కంప్యూటర్ సెక్యూరిటీ డే ప్రారంభమైంది. అదేసమయంలో సైబర్ దాడులు, డేటా చోరీ కేసులు వెలుగు చూశాయి. 1988, నవంబర్ 2న కార్నెల్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు కంప్యూటర్ సిస్టమ్‌లను ప్రభావితం చేసే రహస్య వైరస్‌ను గమనించారు. ఇది నాలుగు గంటల్లోనే పలు విశ్వవిద్యాలయ కంప్యూటర్ వ్యవస్థలను ప్రభావితం చేసింది. దీనికి 'మోరిస్ వార్మ్' అని పేరు పెట్టారు. అదే ఏడాది నవంబర్ 14న కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్‌ఈఐ) కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ)ని ఏర్పాటు చేసింది. అలాగే కంప్యూటర్ భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నవంబర్ 30ని నేషనల్ కంప్యూటర్ సెక్యూరిటీ డేగా జరుపుకోవాలని నిర్ణయించారు.
కంప్యూటర్ సెక్యూరిటీ డే మనకు సైబర్ భద్రతను సీరియస్‌గా పరిగణించాలని గుర్తు చేస్తుంది. ఆన్‌లైన్ డేటాను సురక్షితంగా ఉంచడం ప్రతి వ్యక్తి , సంస్థ బాధ్యత. కంప్యూటర్ సెక్యూరిటీ కోసం గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు
సురక్షిత పాస్‌వర్డ్‌లు: బలమైన, అసాధారణమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలి
వైరస్, మాల్వేర్ నుంచి రక్షణ: ఉత్తమ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలి. దానిని క్రమం తప్పకుండా నవీకరించాలి.
డేటా బ్యాకప్: ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేయడం తప్పనిసరి.
నెట్‌వర్క్ భద్రత: సురక్షిత నెట్‌వర్క్ కనెక్షన్, ఫైర్‌వాల్‌ని ఉపయోగించాలి.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్: తాజా భద్రతా ప్యాచ్‌లతో అన్ని సాఫ్ట్‌వేర్‌లను అప్‌డేట్ చేస్తుండాలి.
ఇది కూడా చదవండి: మహా కుంభమేళాకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ఏర్పాట్లు.. టిక్కెట్ల బుకింగ్ షురూ
Comments
Please login to add a commentAdd a comment