
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పసిడి ధర పరుగులు తీస్తున్న నేపథ్యంలో హోమ్ లాకర్లకు కూడా గణనీయంగా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన సెక్యూరిటీ సొల్యూషన్స్ విభాగం సరికొత్త సెక్యూరిటీ సొల్యూషన్స్‌ను ఆవిష్కరించింది. గృహ, వ్యాపార అవసరాల కోసం ఉపయోగపడే 7 ఉత్పత్తులు ఉన్నాయి.
వీటిలో డిజిటల్.. బయోమెట్రిక్ యాక్సెస్, ఇంటెలిజెంట్ ఐబజ్ అలారం సిస్టం వంటి ఫీచర్లు ఉన్నట్లు సెక్యూరిటీ సొల్యూషన్స్ బిజినెస్ హెడ్ పుష్కర్ గోఖలే వివరించారు. ఇళ్లలో వినియోగించే ఉత్పత్తుల ధర శ్రేణి రూ. 9,000 నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఏపీ, తెలంగాణలో 500 పైచిలుకు అవుట్‌లెట్స్ ఉండగా, సుమారు రూ. 130 కోట్ల ఆదాయం ఉంటోందని జోనల్ హెడ్ శరత్ మోహన్ పేర్కొన్నారు.