విశ్వమంతా ఒకే పటంలో: హాకింగ్ యత్నం
లండన్: ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఓ అద్భుతానికి తెర తీయబోతున్నారు. ఇప్పటి దాకా మనం చూసిన విశ్వాన్నంతా ఒకే మ్యాప్ మీదికి తీసుకురాబోతున్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఆయన ప్రత్యేక సూపర్ కంప్యూటింగ్ సెక్షన్‌లో ఈ పనికి శ్రీకారం చుట్టనున్నారు. వందల కోట్ల సంఖ్యలో ఉన్న నక్షత్ర వీధులు, కృష్ణబిలాలు అన్నిటినీ ఇందులో చూపించనున్నారు.
ఇందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారు చేసిన మహావిస్ఫోటన నమూనాను వారు ఉపయోగించనున్నారు. డార్క్ ఎనర్జీ సర్వే వారి నుంచి తీసుకున్న ఛాయాచిత్రాలను కూడా పరిశీలిస్తారు. ఈ ఫొటోలు చిలీలోని 13 అడుగుల వ్యాసంతో ఉన్న టెలిస్కోప్ నుంచి తీసుకున్నారు.