'Congress, China bhai bhai': BJP lashes out at Rahul Gandhi over Cambridge lecture - Sakshi
Sakshi News home page

రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్‌.. కాంగ్రెస్‌, చైనాలు భాయ్‌ భాయ్‌ అంటూ..

Published Sat, Mar 4 2023 8:36 AM | Last Updated on Sat, Mar 4 2023 9:44 AM

BJP Lashes Out At Rahul Gandhi Over Cambridge Lecture - Sakshi

కేంద్ర ప్రభుత్వంపై రాహుల్‌ గాంధీ చేసిన విమర్శలు రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి, ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పై నిఘా పెట్టార‌ని ఆరోపించారు.  ఇక, రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్‌, రాహుల్‌ గాంధీపై ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌, చైనా భాయ్‌ భాయ్‌ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

కాగా, కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ ప్రసంగిస్తూ రాహుల్‌ గాంధీ.. కేంద్ర ప్రభుత్వంపై సంచలన కామెంట్స్‌ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి, పెగాసెస్‌ స్పైవేర్‌ దేశంలోని రాజకీయ నాయకుడి ఫోన్‌లలో ఉందంటూ కామెంట్స్‌ చేశారు. కాగా, రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ రాహుల్ గాంధీ వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. విదేశీ గ‌డ్డ‌పై ఇండియాను కించ‌ప‌రిచే  ప్ర‌య‌త్న‌మంటూ మండిప‌డ్డారు. ఇదివ‌ర‌కు విదేశీయులు దాడి చేస్తే.. ఇప్పుడు స్వదేశీయులు సైతం భార‌త్‌ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంబ్రిడ్జ్‌లో రాహుల్ చేసిన ప్రసంగం ఆదరణీయ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునే ముసుగులో విదేశీ గడ్డపై మన దేశాన్ని కించపరిచే ధృడమైన ప్రయత్నం తప్ప మరొకటి కాదు అంటూ విమ‌ర్శించారు.

ఇదే సమయంలో రాహుల్‌ ప్రస్తావించిన ప్రజాస్వామ్యంపై దాడి అనే వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వం అందించిన రక్షణలోనే రాహుల్‌ భార‌త్ జోడో యాత్ర ముగిసిందన్నారు. జోడో యాత్ర‌లో 4,000 కిలో మీట‌ర్లు ఏ ప్రమాదం లేకుండా ప్రయాణించార‌ని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ నేతలు తలపెట్టిన యాత్రలను ఎలా విధ్వంసం చేశారో ఆయనకు గుర్తు చేయాల్సిన అవసరం ఉందా? అంటూ మండిప‌డ్డారు. మరోవైపు.. రాహుల్‌ ఫోన్‌ పెగాసెస్‌ ఉందన్న వ్యాఖ్యలపై కౌంటర్‌ ఇచ్చారు. దీనిపై విచార‌ణ‌కు రాహుల్ త‌న ఫోన్ ఎందుకు అందించ‌లేద‌ని ప్ర‌శ్నించారు. 

ఇక, రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్‌ స్పందిస్తూ.. విదేశాలకు వెళ్లిన ప్రతీసారి రాహుల్‌ భారత్‌ను అవమానపరుస్తున్నాడు. చైనాకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు. దేశ ప్రజలు ఆయన నిజస్వరూపాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. రాహుల్‌ మాటలు చిన్న పిల్లాడు మాట్లాడినట్టుగా ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నాము అంటూ కామెంట్స్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement