himanta biswa sarma
-
గౌరవ్ గొగొయ్ భార్యపై ఆరోపణలు..అస్సాం సీఎంపై కాంగ్రెస్ ఫైర్
న్యూఢిల్లీ:అస్సాం సీం హిమంత బిశ్వశర్మపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత,లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గౌరవ్ గొగొయ్ భార్య ఎలిజబెత్‌పై హిమంత చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ నేత రషీద్ అల్వీ తీవ్రంగా స్పందించారు. గొగొయ్ భార్యకు పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నాయని ఏ ఆధారాలతో మాట్లాడారని రషీద్ అల్వీ ప్రశ్నించారు. ఒకవేళ ఇదే నిజమైతే ఎలిజబెత్‌పై ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదో చెప్పాలన్నారు. హిమంత సీఎంగా ఉండి ఇంత దిగజారడమేంటన్నారు.ప్రతిపక్షనేతలపై ఆరోపణలు చేయడానికి ఓ పరిమితి ఉండాలని హితవు పలికారు. కాగా,పాకిస్తాన్ జాతీయుడు అలీ షేక్‌పై కేసు నమోదు చేయాలని అస్సాం క్యాబినెట్ ఆదివారం డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.అయితే అలీషేక్ కాంగ్రెస్ నేత గౌరవ్‌గొగొయ్ భార్య,బ్రిటన్ జాతీయురాలు ఎలిజబెత్‌తో సంబంధాలు కలిగి ఉన్నారని, ఇది దేశ భద్రతకు ఏదైనా ముప్పు తెస్తుందా అన్నదానిపై విచారణ చేయాలని కూడా డీజీపీకి సూచించారు. దీనిపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. -
అసోం: ఇంకా బొగ్గు గనిలోనే కార్మికులు!
దిస్పూర్: అసోంలోని బొగ్గుగని ప్రమాదంలో రెండు రోజులు గడిచినా.. ఇంకా కార్మికుల జాడ కానరావడం లేదు. ఈ క్రమంలో ఈ ఉదయం గని నుంచి ఓ మృతదేహాన్ని గజ ఈతగాళ్లు బయటకు తెచ్చాయి. దీంతో.. మిగిలిన కార్మికుల ఆచూకీపై కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. అయితే అధికారులు మాత్రం గాలింపు చర్యలను ముమ్మరం చేయించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం (జనవరి 7) అసోం దిమాహసావో జిల్లాలోని ఓ బొగ్గుగనిలోకి సోమరాత్రి ఒక్కసారికి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరింది. సుమారు 100 ఫీట్ల నీరు గనిలోపల ముంచెత్తింది. దీంతో గనిలో ఉన్న వారిలో ముగ్గురు జలసమాధై కనిపించారు. మరికొంత మంది లోపలే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.నేవీ, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లు సహాయక చర్యల్లో(Rescue Operations) పాల్గొంటున్నాయి. మరోవైపు.. విశాఖపట్నం నుంచి వచ్చిన డైవర్స్ బృందం మైన్ వద్ద రెక్కీ నిర్వహించి, ఆపై రంగంలోకి దిగింది. అయితే గనిలో ప్రతికూల పరిస్థితులు ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఒకానొక టైంలో తొలుగు గుర్తించిన మూడు మృతదేహాలను బయటకు తీయడం కూడా కష్టమైంది. గని నుంచి నీటిని బయటకు పంపి.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.అయితే ప్రమాద సమయంలో లోపల 15 మంది కార్మికులు ఉండొచ్చనే ప్రచారం నడుస్తోంది. అయితే అధికారులు మాత్రం తొమ్మిది మంది పేర్లను మాత్రమే ప్రకటించారు. వీళ్లులో ఒకరు ఈ ఉదయం మృతదేహాంగా బయటకు వచ్చారు. మిగిలినవాళ్ల ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ కార్మికులు అసోం, పశ్చిమ బెంగాల్, నేపాల్‌కు చెందిన వాళ్లుగా గుర్తించారు. గనిలో సుమారు 340 ఫీట్ల లోపల వాళ్లు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.సదరు గనికి అనుమతులు లేవని తెలుస్తోంది. ఈ విషయాన్ని సీఎం హిమంత బిస్వ శర్మ(Himanta Biswa sharma) స్వయంగా ప్రకటించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేయడంతో పాటు ఒకరిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారాయన. అలాగే రెస్క్యూ ఆపరేషన్‌లో కోల్‌మైన్ సహకారం కోసం కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి కిషన్‌రెడ్డి తోనూ మాట్లాడినట్లు తెలిపారాయన. ఇదీ చదవండి: ముగ్గురు పోరాడినా.. పోటీ ఇద్దరి మధ్యే! -
అస్సాంలో రూ. 22 వేల కోట్ల భారీ మోసం.. సీఎం హెచ్చరిక
రోజురోజుకు ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు, అధికారులు ఎంత అవగాహన కల్పించినా, మోసపోయే వాళ్లు పోతూనే ఉన్నారు. తక్కువ సమయంలో అధిక లాభాలంటూ ఆశచూపి లక్షలాది రూపాయలను ముంచేసి మోసం చేస్తున్న కేటుగాళ్ల ఆగడాలు ఇంకా మితిమీరిపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ భారీ ఆన్లైన్ స్కామ్ అస్సాంలో వెలుగుచూసిందిరాష్ట్ర పోలీసులు రూ. 22 వేల కోట్ల భారీ ఆర్థిక కుంభకోణాన్ని గుట్టురట్టు చేశారు. ప్రజల సొమ్మును రెట్టింపు చేస్తామంటూ ఆన్లైన్ స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరిట మోసగాళ్లు ఈ సొమ్మును సేకరించారు.ఈ కేసులో దిబ్రూఘఢ్‌కు చెందిన 22 ఏళ్ల ఆన్లైన్ వ్యాపారి విశాల్ ఫుకాన్, గౌహతికి చెందిన స్వప్నిల్ దాస్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ కుంభకోణంలో మరికొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.వ్యాపారవేత్త అయిన విశాల్ ఫుకాన్ తన పరపతిని ఉపయోగించి పెట్టుబడిదారులకు 60 రోజుల్లో వారి పెట్టుబడులపై 30 శాతం అధిక లాభాన్ని అందిస్తామని హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు నాలుగు నకిలీ కంపెనీలను స్థాపించి అస్సామీ చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెట్టి పలు ఆస్తులు సంపాదించినట్లు పేర్కొన్నారు.దిబ్రూగఢ్‌లోని ఆయన ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించి అనేక కోట్ల కుంభకోణానికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఫుకాన్ నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయిన అస్సామీ కొరియోగ్రాఫర్ సుమీ బోరా కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు మోసపూరిత ఆన్లైన్ స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రజలను హెచ్చరించారు. తక్కువ సమయంలో డబ్బును రెట్టింపు చేస్తామనే మాటలు అబద్దమని పేర్కొన్నారు. -
బీజేపీలో చేరిన చంపయ్ సోరెన్
రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్(67) బీజేపీలో చేరారు. జేఎంఎం ప్రస్తుత పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు పార్టీలో తనను అవమానించారని ఆరోపిస్తూ రెండు రోజుల క్రితం ఆయన ఆ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం రాంచీలోలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చంపయ్ సోరెన్‌కు కండువా కప్పి, బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంపయ్ సోరెన్‌ను ‘టైగర్ జిందా హై’అంటూ చౌహాన్ అభివర్ణించారు. జార్ఖండ్ ఉద్యమంలో కొల్హన్ ప్రాంతంలో కీలకంగా ఉన్న చంపయ్‌ను అక్కడి వారు ‘కొల్హన్ టైగర్’గా పిలుచుకుంటారు. చంపయ్ మాట్లాడుతూ..ఢిల్లీ, కోల్‌కతాలలో ఉన్న సమయంలో తనపై హేమంత్ సోరెన్ ప్రభుత్వం నిఘా పెట్టిందని, దీన్ని జీర్ణించుకోలేకే ఆ పార్టీని వీడి బీజేపీలో చేరాల్సి వచ్చిందన్నారు. -
మమ్మల్నే బెదిరిస్తారా.. మీకు ఎంత ధైర్యం? దీదీపై హిమంత శర్మ ఫైర్
డిస్పూర్ : ‘మా రాష్ట్రాన్నే అంటారా? మీకు ఎంత ధైర్యం?’ అంటూ అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (దీదీ)పై నిప్పులు చెరిగారు.సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. మంగళవారం అభయ ఘటన నేపథ్యంలో దీదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘నబన్న అభిజన్’ ర్యాలీ పేరుతో పశ్చిమ్ బంగా ఛాత్ర సమాజ్ అనే విద్యార్థి సంఘం చేపట్టిన సచివాలయ ముట్టడి కార్యక్రమం హింసాత్మకంగా మారింది.బంగ్లాదేశ్ తరహాలో పశ్చిమ బెంగాల్లో సైతంఈ ఘటన గురించి బుధవారం కోల్‌కతాలో జరిగిన తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో దీదీ ప్రస్తావించారు. ఆమె మాట్లాడుతూ..రాష్ట్ర సచివాలయానికి బంద్ (సమ్మె), నబన్న అభిజన్ నిరసన మార్చ్ సందర్భంగా జరిగిన హింస జరిగింది. ఆ హింసా ఘటనలు బీజేపీ నేతృత్వంలోనే జరిగాయి. దీనికి తోడు ఆర్జీ కార్ ఘటనపై వెల్లువెత్తుతున్న విమర్శలు.. వెరసీ బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం తరహాలో తమ ప్రభుత్వం పతనానికి అల్లర్లు జరుగుతున్నాయని అర్ధం వచ్చేలా పరోక్షంగా వ్యాఖ్యానించారు. दीदी, आपकी हिम्मत कैसे हुई असम को धमकाने की? हमें लाल आंखें मत दिखाइए। आपकी असफलता की राजनीति से भारत को जलाने की कोशिश भी मत कीजिए। आपको विभाजनकारी भाषा बोलना शोभा नहीं देता।দিদি, আপনার এতো সাহস কীভাবে হলো যে আপনি অসমকে ধমকি দিচ্ছেন? আমাদের রক্তচক্ষু দেখাবেন না। আপনার অসফলতার… pic.twitter.com/k194lajS8s— Himanta Biswa Sarma (@himantabiswa) August 28, 2024‘ఇది (ఆందోళన) బంగ్లాదేశ్‌లోని నిరసనల మాదిరిగానే ఉందని కొందరు అనుకుంటున్నారు. నేను బంగ్లాదేశ్‌ను ప్రేమిస్తున్నాను. వారు మా (బెంగాలి) లాగా మాట్లాడతారు. మా సంస్కృతి కూడా ఒకటే. అయితే, బంగ్లాదేశ్ వేరే దేశం’అని బెనర్జీ అన్నారు. మోదీ జీ.. మీరు మా రాష్ట్రాన్ని తగులబెడితేఅంతేకాదు ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ.. ‘మోదీ జీ, మీ ప్రజల ద్వారా మా రాష్ట్రంలో అశాంతి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు మా రాష్ట్రాన్ని తగులబెడితే అస్సాం, ఈశాన్యం, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ కూడా తగులబడతాయని గుర్తుంచుకోండి’ అని అన్నారు.దీదీ.. మీకెంతా ధైర్యంఈ వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘దీదీ అస్సాంను బెదిరించడానికి మీకు ఎంత ధైర్యం? మీ రక్తపు కళ్ళు మాకు చూపించవద్దు. మీ వైఫల్య రాజకీయాలతో భారతదేశానికి నిప్పు పెట్టడానికి ప్రయత్నించవద్దు. విభజన భాష మాట్లాడటం మీకు సరిపోదు’ అని విమర్శించారు. అదే సమయంలో దీదీ వ్యాఖ్యానించినట్లుగా అస్సాంలో అల్లర్లు జరగవు. అందుకు నేను హామీ’ అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. -
అస్సాంలో బాలికపై సామూహిక అత్యాచారం
గౌహతి: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో దారుణం జరిగింది. నాగావ్ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రజలు ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. మహిళలకు రక్షణ కలి్పంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ బాలికపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షిస్తామని, మహిళలకు రక్షణ కలి్పస్తామని హామీ ఇచ్చారు. నాగావ్ జిల్లాలోని ధింగ్ ప్రాంతంలో గురువారం రాత్రి 8 గంటల సమయంలో బాలిక ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ వచి్చ, ఆమెను బంధించి అత్యాచారానికి పాల్పడి, రోడ్డు పక్కన విసిరేసి వెళ్లిపోయినట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలు పదో తరగతి చదువుతోందని, దుండగుల దుశ్చర్య వల్ల గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకుందని తెలిపారు. స్థానికులు గమనించి, తమకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. బాధితురాలిని అసుపత్రికి తరలించామని, చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. నిందితుల్లో ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, పరారీలో ఉన్న మరొకడి కోసం గాలింపు ముమ్మరం చేశామని అస్సాం డీజీపీ జి.పి.సింగ్ చెప్పారు. ముష్కరుల ఆగడాలను అడ్డుకుంటాం బాలికపై అత్యాచారం గురించి తెలియగానే శుక్రవారం అస్సాం అట్టుడికిపోయింది. జనం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని మండిçపడ్డారు. బాధితురాలికి న్యాయం చేయాలని, దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాలు శుక్రవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో దుకాణాలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. మైనర్ బాలికపై అత్యాచార ఘటన ఘటన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హిందూ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత అస్సాంలో ఓ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఇష్టారాజ్యంగా రెచి్చపోతున్నారని, వారి ఆగడాలను కచి్చతంగా అడ్డుకుంటామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో గత రెండు నెలల్లో 23 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కొనసాగుతున్న వలసల వల్ల స్థానికులు మైనార్టీలుగా మారిపోతున్నారని చెప్పారు. -
ముస్లింల జనాభా పెరుగుదల జీవన్మరణ సమస్యగా మారింది: హిమంత
రాంచీ: జనాభా సమీకరణాల్లో మార్పు అస్సాంలో అతిపెద్ద సమస్యగా మారిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. ‘అస్సాంలో 1951లో ముస్లింల జనాభా 12 శాతం మాత్రమే. కానీ ఇప్పుడది 40 శాతానికి చేరుకుంది. నాకిది రాజకీయ సమస్య కాదు. జీవన్మరణ సమస్య. మనం ఎన్నో జిల్లాలను కోల్పోయాం’ అని హిమంత వ్యాఖ్యానించారు. 2021 జూన్‌లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక హిమంత మాట్లాడుతూ.. ‘జనాభా విస్పోటం అస్సాం ముస్లింలలో పేదరికానికి, ఆర్థిక అసమానతలకు మూలకారణం’ అని అన్నారు. రాంచీలో బుధవారం బీజేపీ సమావేశంలో మాట్లాడుతూ జార్ఖండ్ గిరిజన ప్రాంతాల్లో బంగ్లా చొరబాటుదారుల సంఖ్య పెరుగుతోందన్నారు. జార్ఖండ్‌ను సీఎం హేమంత్ మినీ బంగ్లాదేశ్‌గా మార్చేశారన్నారు. -
అస్సాంలో గాంధీ విగ్రహం తొలగింపు.. తనకు తెలియదన్న సీఎం
గువాహతి: అస్సాంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించారు. టిన్సుకియా జిల్లా దూమ్‌దూమా లోని గాంధీ చౌక్‌లో ఉంచిన 5.5 అడుగుల మహాత్మా గాంధీ విగ్రహాన్ని తవ్వి అక్కడి నుంచి తొలగించడం వివాదానికి దారి తీసింది. మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించడంపై విద్యార్థి సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశాయి. ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ (ఏఏఎస్‌యూ) నిరసనలు చేపట్టింది.అయితే, విగ్రహం తొలగింపు నిర్ణయం గురించి తనకు తెలియదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వెల్లడించారు. ‘జిల్లా యంత్రాంగం తీసుకున్న ఈ నిర్ణయం గురించి నాకు తెలియదు. వాస్తవం ఏంటో తెలుసుకుంటా. అస్సాం మహాత్మా గాంధీకి చాలా రుణపడి ఉంది. నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అస్సాంను పాకిస్తాన్లో చేర్చాలని కోరినప్పుడు ఆయన భారతరత్న గోపీనాథ్ బోర్డోలోయ్‌కు గాంధీ అండగా నిలిచారు’ అని పేర్కొన్నారు.మరోవైపు గాంధీ మనవడు తుషార్ గాంధీ కూడా విగ్రహం తొలగింపుపై మండిపడ్డారు. ‘అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం దిబ్రూగఢ్‌లో బాపు విగ్రహం స్థానంలో క్లాక్ టవర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడంలో ఆశ్చర్యం లేదు’ అని విమర్శించారు. కాంగ్రెస్ కూడా ప్రభుత్వం చర్యను తప్పుబట్టింది.తాము నగర సుందరీకరణ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించడం లేదని, కానీ అందుకు గాంధీ విగ్రహాన్ని తొలగించడం సరికాదని అన్నారు మాజీ ఎమ్మెల్యే దుర్గ భూమిజ్. విగ్రహాన్ని తొలగించడాన్ని అంగీకరించమని.. విగ్రహాన్ని అలాగే ఉంచి, క్లాక్ టవర్‌ను నిర్మించాలని సూచించారు. -
రాహుల్ నా సలహాలు పాటిస్తారు! : అస్సాం సీఎం హిమంత
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మరోసారి విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ తాను పెంచుకునే గడ్డం విషయంలో తన సలహాలు పాటిస్తాడని ఎద్దేవా చేశారు. సీఎం హిమంత ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.‘2022లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన సమయంలో భారీ గడ్డంతో ఉన్నారు. అప్పుడు అచ్చం ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్‌లా కనిపిస్తున్నారని అన్నాను. అనంతరం రాహుల్ తన గడ్డం మొత్తం తీసివేశారు. ఇప్పుడు ‘‘అమూల్ బాయ్’’లా ఉన్నారని అన్నాను. నేను రాహుల్ గాంధీని సద్దాం హుస్సేన్‌తో పోల్చితే గడ్డం మొత్తం తీసివేశారు... మళ్లీ నేను ‘అమూల్ బాయ్’ గా ఉన్నారని అనేసరికి చిన్నగా గడ్డం పెంచారు. రాహుల్ గాంధీ నా సలహాలు పాటిస్తారు. రాహుల్ గాంధీ టీ షర్ట్ ధరించడాన్ని చాలా గొప్ప విషయంగా భావిస్తున్నారు. కానీ ప్రతిపక్షానికి నేృత్వత్వం వహించే వ్యక్తి.. ఒక కుర్రాడిలా టీ షర్ట్ వేసుకోవటం మన దేశ దురదృష్టం’’ అని సీఎం హిమంత సెటైర్లు వేశారు.ఇక.. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ర్యాలీలు, బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ భారత రాజ్యాంగం బుక్ చూపించిన విషయం తెలిసిందే. అయితే ఆయన పట్టుకున్న బుక్ ఎరుపులో రంగులో ఉండటంతో అది భారత్ రాజ్యాంగం కాదని.. చైనా రాజ్యాంగం అంటూ హిమంత విమర్శలు గుప్పించారు. భారత రాజ్యాంగం బుక్ నీలం రంగులో ఉంటుందని తెలిపారు. అయితే హిమంత మాటలకు కాంగ్రెస్ నాయకులు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. -
నవీన్ పట్నాయక్‌పై అస్సాం సీఎం హిమంత సంచలన ట్వీట్
భువనేశ్వర్: ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌పై అస్సాం సీఎం, బీజేపీ ఫైర్ బ్రాండ్ హిమంత బిశ్వశర్మ ఎక్స్(ట్విటర్)లో సంచలన పోస్టు పెట్టారు. సీఎం నవీన్ చేతుల కదలికలను కూడా ఆయన అనుయాయుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పాండియన్ నియంత్రిస్తున్నారని హిమంత ఆరోపించారు. దీన్ని బట్టి పాండియన్ చేతిలో నవీన్ ఎంతగా బంధీగా మారారో తెలుస్తోందన్నారు. ప్రజలతో నవీన్ స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్నారు. కాగా, తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా నవీన్ పట్నాయక్ ఒక పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడుతుండగా ఆయన చేతులు వణికాయి. ఇంతలో నవీన్‌కు మైక్ పట్టుకున్న పాండియన్ వెంటనే నవీన్ పట్నాయక్ వణుకుతున్న చేయి కనిపించకుండా పక్కకు పెట్టిన వీడియోను హిమంత తన ఎక్స్(ట్విటర్)ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియో ఒడిషాలో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. This is a deeply distressing video. Shri VK Pandian ji is even controlling the hand movements of Shri Naveen Babu. I shudder to imagine the level of control a retired ex bureaucrat from Tamil Nadu is currently exercising over the future of Odisha! BJP is determined is give back… pic.twitter.com/6PEAt7F9iM— Himanta Biswa Sarma (Modi Ka Parivar) (@himantabiswa) May 28, 2024 -
రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
గువహటి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ పాకిస్తాన్లో పోటీచేస్తే ఖచ్చితంగా గెలుస్తారని ఎద్దేవా చేశారు.‘పాకిస్తాన్లో రాహుల్‌గాంధీ చాలా పాపులర్. ఒకవేళ పాకిస్తాన్లో ఎన్నికలు జరిగితే అక్కడ రాహుల్‌గాంధీ భారీ మెజారిటీతో గెలుస్తారు. రాహుల్‌ను పాకిస్థాన్‌లో మేం ఓడించలేం. అయితే పాకిస్తాన్లో ఏం జరుగుతుందో దానికి వ్యతిరేకంగా భారత్‌లో జరుగుతుంది’అని హిమంత సెటైర్లు వేశారు. రాహుల్‌గాంధీ శుక్రవారం(మే3) తన పాత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి కాకుండా రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసిన వేళ హిమంత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
రాహుల్ గాంధీపై అస్సాం సీఎం కీలక వ్యాఖ్యలు
ఇండియా కూటమి కలిసి ఉన్నట్లు మన కంటికి కనిపించదని కామెంట్ చేసిన అస్సాం సీఎం 'హిమంత బిస్వా శర్మ' (Himanta Biswa Sarma) మరో మారు రాహుల్ గాంధీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భవిష్యత్తు అంధకారం అవుతుందని.. 2026 నాటికి ఈశాన్య రాష్ట్రాలలో పాత పార్టీ (కాంగ్రెస్) ఉండబోదని విలేకరుల సమావేశంలో హిమంత బిస్వా అన్నారు. గత ఒకటిన్నర నెలల్లో చాలామంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ వీడారు. ఇదే కాంగ్రెస్ క్షీణతకు ఉదాహరణ అని అన్నారు. 2026 నాటికి అస్సాంలో కాంగ్రెస్ పార్టీ ఉండదని నేను నమ్ముతున్నాను. 2024 లోక్‌సభ ఎన్నికల తరువాత కూడా కాంగ్రెస్ నుంచి చాలా మంది నాయకులు బీజేపీలో చేరే అవకాశం ఉందని ఆయన అన్నారు. అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా 2025 ప్రథమార్థంలో బీజేపీలో చేరతారని శర్మ చెప్పారు. నేను భూపేన్ కుమార్ బోరా కోసం రెండు సీట్లు సిద్ధం చేసాను. కాంగ్రెస్‌లోని తృణమూల్ సభ్యులందరూ మాతో చేరతారు. నేను సోనిత్పూర్ అభ్యర్థికి ఫోన్ చేస్తే.. తప్పకుండా బీజేపీలోకి చేరుతారు. కానీ అది వద్దు. ఇప్పుడు అస్సాం మన చేతుల్లో ఉంది. ఇది ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది, అవసరమైనప్పుడు తీసుకోవచ్చని అన్నారు. -
జైరాం రమేష్ వ్యాఖ్యలపై అస్సాం సీఎం కామెంట్స్
ఇండియా కూటమి చెక్కు చెదరలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి 'జైరామ్ రమేశ్' ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని, ఇండియా కూటమి 272కి పైగా సీట్లు సాధిస్తాయని తెలిపారు. ఈ వ్యాఖ్యలపైన అస్సాం ముఖ్యమంత్రి 'హిమంత బిస్వా శర్మ' కామెంట్ చేశారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమికి దూరంగా ఉన్నాయి. అయినా కూటమి చెక్కు చెదరలేదని చెబుతున్నారు. ఇండియా కూటమి కలిసి ఉండటం బహుశా భూమిపైన కాదు. చంద్రుడు, సూర్యుడిలో ఉందని అన్నారు. అవి మన సాధారణ దృష్టికి కనిపించవని ఎద్దేవా చేశారు. దేశ ప్రజల విశ్వాసం, స్పష్టమైన గుర్తింపుతో పోరాడతామని హిమంత బిస్వా అన్నారు. అస్సామీ ప్రజలు తప్పకుండా విజయం చేకూర్చుతారని పేర్కొన్నారు. ఈశాన్య భారతదేశంలో ముఖ్యమైన రాష్ట్రాల్లో ఒకటైన అస్సాం 14 లోక్‌సభ నియోజకవర్గాలను కలిగి ఉంది. ఈసారి లోక్‌సభ ఎన్నికలు మూడు దశల్లో.. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7 తేదీలలో పోలింగ్ జరుగుతుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అస్సాంలోని 14 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 7 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) రెండూ ఒక్కొక్కటి మూడు స్థానాలను సొంతం చేసుకున్నాయి. 2019 ఎన్నికల సమయంలో, BJP తన సీట్ల సంఖ్యను 9కి పెంచుకుంది. కాంగ్రెస్ తన మూడు స్థానాలను కొనసాగించింది మరియు AIUDF ఒక్క సీటును గెలుచుకుంది. -
కేజ్రీవాల్ ‘సింపతీ’ రాజకీయం.. సీఎం హిమంత బిస్వా శర్మ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,డిస్పూర్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయలేదని, తనంతట తానుగానే అరెస్ట్ అయ్యారంటూ అసోం సీఎం హిమంత బిస్వా శర్మ ఆరోపించారు. లిక్కర్ స్కాం వ్యవహారంలో ఈడీ పంపి తొమ్మిది సమన్లకు ఆయన స్పందిచకపోవడమే కారణమని అన్నారు. కాబట్టే కేజ్రీవాల్ అరెస్ట్‌కు దారి తీసిందని తెలిపారు. ఇదంతా రాజకీయ సానుభూతిని పొందే వ్యూహంలో భాగమేనన్న అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల సన్నాహక సమావేశం తర్వాత విలేకరులతో అసోం సీఎం మాట్లాడుతూ.. ‘ఈడీ ఎవరికైనా తొమ్మిది సమన్లు అందజేసి, సదరు వ్యక్తి హాజరుకాకపోతే, అతను తన అరెస్టును ఆహ్వానించినట్లే కదా. ఢిల్లీ సీఎం విషయంలోనూ ఇదే జరిగింది. ఈడీ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయలేదు. తనని అదుపులోకి తీసుకోమని ఈడీనే ఆహ్వానించారు. ఈ సందర్భంగా సమన్లకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వంటి నేతలే ఈడీ ముందు హాజరయ్యారని ఉదహరించారు. కానీ కేజ్రీవాల్ తీరు అందుకు భిన్నంగా ఉందని అన్నారు. అంతేకాదు, ఈడీ నుండి వచ్చిన తొమ్మిది సమన్లకు స్పందించకుండా ఉంటే అది అరెస్టుకు ఉద్దేశపూర్వక ఆహ్వానించినట్లే అవుతుందని హిమంత బిస్వా శర్మ నొక్కిచెప్పారు. ఒకవేళ కేజ్రీవాల్ సమన్లతో ఈడీ ఎదుట హాజరై ఉంటే, అతని అరెస్ట్ తప్పించుకునే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. సమన్లపై స్పందించకపోవడానికి ప్రజల నుండి సానుభూతిని పొందేలా కేజ్రీవాల్ వ్యూహమన్న హిమంత బిస్వా.. రాజకీయంగా లబ్ధి చేకూరే ప్రయత్నమేనని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. #WATCH | On the arrest of Delhi CM Arvind Kejriwal, Assam CM Himanta Biswa Sarma says, "When someone is summoned 8 to 9 times & the person does not respect the summon, it only means that the person is inviting his arrest. If he had gone (to ED) the first time he was summoned, he… pic.twitter.com/FdcHksvonr — ANI (@ANI) March 23, 2024 -
ఎలక్టోరల్ బాండ్లపై కాంగ్రెస్ విమర్శలు.. చట్టపరమైన చర్యలకు సీఎం ఆదేశం
సాక్షి, గౌహతి : ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ అవినీతికి పాల్పడిందంటూ సోషల్ మీడియా పోస్ట్‌లపై అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి విరాళం ఇచ్చిన సంస్థతో అస్సాం ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంఒయు)పై సంతకం చేసిందని పేర్కొంటూ నాగోన్ కాంగ్రెస్ ఎంపీ బోర్డోలోయ్ ఎక్స్.కామ్‌లో పోస్ట్ చేశారు. ఎలక్టోరల్ బాండ్లతో బీజేపీ అవినీతి ఏ స్థాయిలో ఉందో చూడండి అంటూ ఓ యాష్ ట్యాగ్‌ను జోడించారు. దీనిపై అస్సోం సీఎం హిమంత బిస్వా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పోస్ట్‌లు పెట్టిన కాంగ్రెస్ ఎంపీ ప్రద్యుత్ బోర్దోలోయ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, పూర్తిగా నిరాధారమైనవి అంటూ కొట్టి పారేశారు. ‘అస్సాం ప్రభుత్వం ఎంఎస్ బ్రైట్ స్టార్ ఇన్వెస్ట్మెంట్స్ మధ్య క్విడ్ ప్రోకో జరిగిందంటూ చేస్తున్న ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అస్సాం ప్రభుత్వానికి ఈ సంస్థతో ఎటువంటి వ్యాపార ఒప్పందాలు లేవు. ప్రగ్జ్యోతిష్‌పూర్ మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పేర్కొన్న ఎంఓయు దాతృత్వ విరాళం మాత్రమేనని, దీని పనులు వేగంగా జరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో ప్రజలకు అంకితం చేస్తామని సీఎం బిస్వా శర్మ చెప్పారు. -
లోక్‌సభ ఎన్నికలపై అస్సాం సీఎం కీలకవ్యాఖ్యలు
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 14 లోక్‌సభ స్థానాల్లో 13 స్థానాలను భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షాలు గెలుచుకుంటాయి. ఈ విషయాన్ని గౌహతిలోని లోక్ సేవా భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అస్సాం ముఖ్యమంత్రి 'హిమంత బిస్వా శర్మ' ప్రకటించారు. కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఈ సారి తప్పకుండా 13 సీట్లు గెలుస్తామనే నమ్మకం వచ్చిందని హిమంత బిస్వా అన్నారు. అంతే కాకుండా డిబ్రూగఢ్ (Dibrugarh)లో సర్బానంద సోనోవాల్ మూడు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని అన్నారు. అయితే ధుబ్రి (Dhubri) సీటును గెలవలేమని ప్రస్తావించారు. అస్సాంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా చూసి చాలా సంతోషించాను. ఈ ఏట కాంగ్రెస్ పరాభవం తప్పదని.. మొత్తం ఈశాన్య ప్రాంతంలో కాంగ్రెస్ ఒక్క లోక్‌సభ సీటును కూడా గెలుచుకోలేకపోవచ్చని అస్సాం డిప్యూటీ స్పీకర్ నుమాల్ మోమిన్ అన్నారు. అస్సాంలో బీజేపీ 11 స్థానాల్లో పోటీ చేస్తుండగా, దాని మిత్రపక్షం అసోం గణ పరిషత్ (AGP) బార్పేట, ధుబ్రీ స్థానాల్లో, యూపీపీఎల్ కోక్రాఝర్ స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అయితే జోర్హాట్లో గౌరవ్ గొగోయ్, నాగావ్‌లో ప్రద్యుత్ బోరోడోలోయ్, గౌహతిలో మీరా బర్తకూర్ గోస్వామి, ధుబ్రిలో రకీబుల్ హుస్సేన్, దీపూలో జైరామ్ ఇంగ్లెంగ్ సహా అస్సాంలోని 12 పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. -
‘అలా జరిగితే.. నేను రాజీనామా చేస్తాను’.. అస్సాం సీఎం హిమంత
దిస్పూర్: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేస్తూ విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం నోటీఫై చేసిన విషయం తెలిసిందే. అయితే లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నవేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీఏఏను అమలు చేస్తూ మళ్లీ తెరపైకి తీసుకురావటాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. అస్సాం రాష్ట్రంలో కూడా సీఏఏ అమలుపై వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్వ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్ఆర్సీ) జాబితాలో నమోదు చేసుకోనివారికి ఒక్కరికైనా కేంద్రం తీసుకువచ్చిన సీఏఏ కింద పౌరసత్వం కల్పిస్తే.. తన సీఎం పదవి రాజీనామ చేస్తామని తెలిపారు. ‘నేను అస్సాం పుత్రుడను. ఒక్క వ్యక్తి అయినా ఎన్ఆర్సీలో నమోదు కాకుండా సీఏఏ ద్వారా పౌరసత్వం పొందితే మొదట నేనే నా పదవికి రాజీనామా చేస్తా. సీఏఏ అనేది కొత్త చట్టం కాదు. గతంలో కూడా ఇలాంటి చట్టం ఉంది. పారదర్శంగా ప్రజలు నమోదు చేసుకునేందుకు పోర్టల్ కూడా అందుబాటులోకి తెచ్చాం. అయినా ప్రజలు విధుల్లో నిరసన తెలపటంలో అర్థం లేదు. ఈ చట్టం సరైందో? కాదో? అని విషయాన్ని.. సమాచారంతో కూడిన పోర్టల్ తెలియజేస్తుంది’ అని శివసాగరల్లోని ఓ కార్యక్రమంలో సీఎం హిమంత అన్నారు. సీఏఏ అమలుపై నిరసన తెలుపుతున్న పలు సంఘాలపై పోలీసుల నోటీసులు పంపారు. అయినప్పటికీ నిరసనలు ఆపకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. 16 పార్టీల యునైటెట్ అపోజిషన్ పోరం అస్సాం( యూఓఎఫ్‌ఏ) సీఏఏ అమలుపై నిరసన చేపడతామని ప్రకటన విడదల చేసిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ నేత రాహుల్, అసోం సిఎం హిమంత మధ్య ముదురుతున్న మాటల యుద్ధం
-
Assam Clash: సంచలన ఆరోపణలకు దిగిన రాహుల్ గాంధీ
గువాహటి: రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర దూకుడుతో.. అస్సాం(అసోం) రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి. తాజాగా రాహుల్ మరోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విమర్శలు సంధించారు. ఈ క్రమంలో మరోమారు సంచలన ఆరోపణలే చేశారాయన. అసోంలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ కీలక నేతలపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయినా ఆయన వెనక్కి తగ్గడం లేదు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు హిమంత శర్మ అని బుధవారం ఉదయం రాహుల్ గాంధీ మరోసారి వ్యాఖ్యానించారు. అంతేకాదు అమిత్ షా గుప్పిట్లో శర్మ ఉండిపోయారని.. షానే ఆయన్ని వెనకుండి నడిపిస్తున్నారంటూ ఆరోపించారు. ఇదీ చదవండి: రాహుల్‌కు ప్రమాదం పొంచి ఉంది.. షాకు ఖర్గే లేఖ బుధవారం ఉదయం బారాపేటలో భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ‘‘ఆయన దేశంలో అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి. ఈ విషయాన్నే నేను అన్నట్లు ఆయనకు మీరు(మీడియాను ఉద్దేశించి..) తెలియజేయండి. అసోం ముఖ్యమంత్రి అమిత్ షా నియంత్రణలో ఉన్నారు. షాకు గనుక వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే ఆయన్ని పార్టీలో నుంచి గెంటేస్తారు’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఎవరెన్ని ఆటంకాలు కలిగించినా.. అనుకున్న మార్గంలోనే జోడో న్యాయ్ యాత్ర ముందుకు సాగుతుందని స్పస్టం చేశారాయన. -
తగ్గేదేలే.. రాహుల్ గాంధీపై కేసు నమోదు
గువాహటి: అస్సాం(అసోం)లో సాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర జాతీయ రాజకీయాల్ని వేడెక్కిస్తోంది. తాజాగా.. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలపై అసోంలో పోలీస్ కేసు నమోదు అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్వయంగా వెల్లడించారు. యాత్ర పేరుతో హింస, రెచ్చగొట్టడం, దాడి చేసినందుకు ఈ కేసు నమోదు చేసినట్లు తెలిపారాయన. మంగళవారం తెల్లవారుజామున మేఘాలయా నుంచి తిరిగి అసోం గువాహటిలోకి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతుండగా పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారు.దీంతో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే.. అసోంలో ఘర్షణలు సృష్టించినందుకుగానూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు నేతలపై పోలీసు కేసులు నమోదు అయ్యిందని సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో హింస, రెచ్చగొట్టడం, దాడి చేసినందుకు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్, ఇతర పార్టీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారాయన. ‘‘కాంగ్రెస్ సభ్యులు ఈ రోజు హింసాత్మక చర్యలు, రెచ్చగొట్టడం, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడం, పోలీసులపై దాడి చేయడం వంటి చర్యలను ప్రస్తావిస్తూ.. రాహుల్ గాంధీ, కెసి వేణుగోపాల్, కన్హయ్య కుమార్, ఇతర వ్యక్తులపై PDPP చట్టంలోని సెక్షన్ 120(B)143/147/188/283/353/332/333/427 IPC R/W సెక్షన్ 3 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది’’ అని ఎక్స్ ఖాతాలో సీఎం శర్మ పేర్కొన్నారు. With reference to wanton acts of violence, provocation , damage to public property and assault on police personnel today by Cong members , a FIR has been registered against Rahul Gandhi, KC Venugopal , Kanhaiya Kumar and other individuals under section… — Himanta Biswa Sarma (@himantabiswa) January 23, 2024 బారికేడ్లను బద్దలు కొట్టేందుకు "జనసమూహాన్ని రెచ్చగొట్టినందుకు" రాహుల్‌పై కేసు నమోదు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని ముఖ్యమంత్రి ఆదేశించిన కొన్ని గంటల తర్వాత ఈ కేసు నమోదైంది. 'జనసమూహాన్ని రెచ్చగొట్టినందుకు మీ నాయకుడు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని నేను డీజీపీని ఆదేశించాను' అని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ బీవీ ట్విట్టర్ పోస్ట్‌కు సీఎం హిమంత శర్మ స్పందించడం గమనార్హం. These are not part of Assamese culture. We are a peaceful state. Such “naxalite tactics” are completely alien to our culture. I have instructed @DGPAssamPolice to register a case against your leader @RahulGandhi for provoking the crowd & use the footage you have posted on your… https://t.co/G84Qhjpd8h — Himanta Biswa Sarma (@himantabiswa) January 23, 2024 మరోవైపు రాహుల్ గాంధీపై రాష్ట్ర పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేస్తారని, లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆయనను అరెస్టు చేస్తామని అస్సాం ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం ప్రకటించారు. ఖానాపరా ప్రాంతంలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ ఘటన తరువాత.. రాహుల్ గాంధీ సుమారు 3000 మంది వ్యక్తులు, 200 వాహనాలతో గువాహటిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని సీఎం ఆరోపించారు. అడ్డుకుంటేనే మంచిది: రాహుల్ తాను కేసులకు భయపడనని, ప్రపంచమంతా వ్యతిరేకంగా నిలబడినా సత్యం కోసం పోరాడతానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అసోంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర కు ఆటంకాలు ఏర్పడుతోన్న నేపథ్యంలో ఆయన స్పందించారు. తమకు పబ్లిసిటీ కల్పిస్తున్నందున.. యాత్రకు బీజేపీ ఇంకా ఇంకా అడ్డంకులు సృష్టించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. న్యాయ యాత్రను గువాహటి నగరంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడంతోపాటు రాహుల్‌పై కేసు నమోదు చేయాలని సీఎం హిమంత బిశ్వ శర్మ పోలీసులను ఆదేశించిన వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘గతంలో కన్యాకుమారి నుంచి యాత్ర మొదలుపెట్టిన సమయంలో.. ప్రజలపై దాని ప్రభావం లేదని భాజపా నేతలు వాదించారు. కానీ, జమ్మూ-కశ్మీర్ చేరేనాటికి పరిస్థితులు మారిపోయాయి. దీంతో ఇప్పుడు మొదట్లోనే అడ్డుకోవాలనేది వారి ఆలోచన. కానీ, ఇలా చేయడం ద్వారా మాకే మేలు కలుగుతుంది. కాబట్టి.. యాత్రకు ఆటంకం కలిగించాలని నేనూ కోరుకుంటున్నా. తద్వారా దేశమంతా గమనిస్తుంది. అసోం సీఎం, కేంద్ర హోంమంత్రి చేస్తున్న పనుల వల్ల కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరుతోంది. రాష్ట్రంలో ‘జోడో యాత్ర’ ప్రధాన అంశంగా మారింది. ఈ విషయంలో సంతోషంగా ఉన్నాను’’ అని రాహుల్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: రాహుల్‌కు షాక్.. ఆలయంలోకి అనుమతి నిరాకరణ.. కారణం ఏంటంటే.. -
రాహుల్ యాత్రను అడ్డుకున్న పోలీసులు.. అస్సాంలో ఉద్రిక్తత
గువాహటి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ను అస్సాం పోలీసులు అడ్డుకోవడంతో రాష్ట్ర రాజధాని గువాహటి ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 500 మంది కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి రాహుల్ మంగళవారం ఉదయం గువాహటి సిటీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే కాంగ్రెస్ ర్యాలీ గువాహటి రోడ్లపైకి రాకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్డుపై బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయినా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకొని కార్యకర్తలు దూసుకురావడంతో వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మద్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో రాహుల్ గాంధీ అక్కడే ఉన్నారు. రూట్ చేంజ్ చేసుకోండి: సీఎం అంతకుముందు గువాహటి రోడ్లపై రాహుల్ యాత్రకు సీఎం హిమంత బిస్వా శర్మ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. వర్కింగ్ డే రోజు కావడంతో కీలక నగరమైన రహదారులపై యాత్రను అనుమతించడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలిపింది. ఈ మార్గానికి బదులుగా ర్యాలీని దిగువ అస్సాం దిశగా జాతీయ రహదారి మార్గంలో చేపట్టాలని సూచించింది. నగరం చుట్టూ రింగ్ రోడ్డుపై ఉన్న 27వ నెంబరు జాతీయ రహదారిపై కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లాలని కోరింది. చట్టాన్ని ఉల్లంఘించలేదు:రాహుల్ దీనిపై రాహుల్ ఘాటుగా స్పందించారు. గతంలో భజరంగ్ దళ్ ఇదే మార్గంలో నడిచిందని, అంతేగాక బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడ ఇదే రూట్లోర్యాలీ చేపట్టారని గుర్తు చేశారు. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాలేదా అని ప్రవ్నించారు. అయితే పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్లను దాటుకొని వచ్చామన్న రాహుల్.. తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని తెలిపారు. తామను బలహీనులుగా భావించవద్దని హెచ్చరించారు. ఇది కాంగ్రెస్ కార్యకర్తల శక్తికి నిదర్శనమన్నారు. రాహుల్‌పై కేసు నమోదుకు సీఎం ఆదేశం గువాహటి సరిహద్దుల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ కార్యకర్తల ప్రవర్తనపై అస్సాం సీఎం హిమంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఘర్షణలు జరిగేలా కార్యకర్తలను రెచ్చగొట్టినందుకు గానూ కేసు ఫైల్ చేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ తమ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వీడియోలనే సాక్ష్యాలుగా పరిగణించాలని చెప్పినట్లు తెలిపారు. #BigBreaking Assam Chief Minister Himanta Biswa Sarma is trying hard to cause trouble for Rahul Gandhi and the Bharat Jodo Nyay Yatra in Assam by using brute force. Himanta Biswa Sarma has crossed all limits by using his administration. Himanta sent Assam police to detain… pic.twitter.com/cYQmKLzhoA — Sohom Banerjee (@Sohom03) January 23, 2024 అస్సాం ప్రజలను ప్రభుత్వం అణచివేస్తోందని రాహుల్ ఆరోపించారు. మేఘాలయాలో విద్యార్ధులతో తన ఇంటరాక్ట్ను రద్దు చేశారని ప్రస్తావించారు. విద్యార్ధులు నన్ను కలిసేందుకు అధికారులు అనుమతి ఇవ్వలేదన్న కాంగ్రెస్ నేత.. అయినప్పటికీ వారు తనను కలవడానికి బయటికి వచ్చినట్లు తెలిపారు. ఇకర అస్సాంలోని 17 జిల్లాల మీదుగా 833 కి.మీ. మేర జనవరి 25 వరకు రాహుల్ యాత్ర కొనసాగనుంది. -
గాంధీలను మించిన అవినీతి పరులు ఎవరైనా ఉంటారా?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అస్సాం సీఎ హిమంత బిస్వా శర్మ మధ్య మాటల యుద్ధం నడుసతోంది. రాహుల్ చేపట్టిన‘భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రస్తుతం అస్సాం రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాష్ట బీజేపీ ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై రాహుల్ విమర్శలు ఎక్కుపెట్టారు. దేశంలోనే అత్యంత అవినీతి సీఎం అని ఆరోపించారు. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం కూడా అస్సాం సర్కారే అని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలోనే ప్రజా ధనం ఎక్కువ లూటీ అవుతున్నదని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు.. ఇక్కడి ప్రజల్లో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టుతున్నారని ఆరోపించారు. అస్సాం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తాము పోరాటం చేస్తామన్నారు. తాజాగా రాహుల్ విమర్శలపై అస్సాం సీఎం స్పందించారు. అవినీతి సీఎం అంటూ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలకు బిస్వా శర్మ కౌంటర్ ఇచ్చారు. గాంధీ కుటుంబం కంటే ఎక్కువ అవినీతి పరులు ఎవరైనా ఉంటారా అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబం నుంచి వచ్చిన ఏ విమర్శలైనా అవి తనకు ఆశీర్వాదంగా భావిస్తానని తెలిపారు. ఇది తమను తాము అత్యంత శక్తివంతమైన వారిగా భావించే (గాంధీ కుటుంబం) వారితో పోరాడేందుకు శక్తినిస్తుందని తెలిపారు. అయితే తానే ఒక్కటి మాత్రమే అడగాలనుకుంటున్నాని.. గాంధీల కంటే అవినీతిపరులు ఎవరైనా ఉండగలరా అని ఎద్దేవా చేశారు. బోఫోర్స్ కుంభకోణం, నేషనల్ హెరాల్డ్ స్కామ్, భోపాల్ గ్యాస్ ఘటన, 2G స్కామ్, బొగ్గు కుంభకోణం మొదలైనవి కాగా మణిపూర్‌లో ప్రారంభమైన రాహుల్ యాత్ర నాగాలాండ్ ఆ తరువాత అస్సాంలో సాగుతోంది. జనవరి 25 వరకు రాష్ట్రంలోనే పర్యటించనున్నారు. అస్సాంలో 833 కిలోమీటర్లు, 17 జిల్లాల మీదుగా ప్రయాణించనున్నారు. తరువాత మేఘాలయాలో అడుగుపెట్టనున్నారు. మరోవైపు రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్రపై అస్సాంలో కేసు నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి యాత్ర రూట్లో మార్పులు చేయడంతో పోలీసులు.. తాము ముందుగా నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలోకి యాత్రను మళ్లించినట్లు అస్సాం పోలీసులు తెలిపారు. -
క్షమాపణ చెప్పిన అస్సాం సీఎం.. శ్లోకంపై క్లారిటీ..
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా క్షమాపణలు తెలిపారు. ఇటీవల ఆయన పోస్ట్ చేసిన ఓ భగవద్గీత శ్లోకం భావం వివాదంగా మారింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ.. రాష్ట్రంలో కులాల మధ్య అంతరాలను సృష్టిస్తున్నారని హిమంత బిశ్వశర్మపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఈయన స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ‘తాను రోజు భగవద్గీత శ్లోకాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. ఇప్పటి వరకు సుమారు 668 శ్లోకాలు పోస్ట్ చేశాను. అయితే ఇటీవల నా సోషల్ మీడియా టీం.. భగవద్గీతలోని చాప్టర్ 18లో ఉన్న 44వ శ్లోకాన్ని పోస్ట్ చేసింది. ఆ శ్లోకం అనువాద అర్థాన్ని తప్పుగా పోస్ట్ చేసింది. ఆ తప్పు నా దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్‌ను నేను వెంటనే డిలీట్ చేశాను. అస్సాం ఎప్పుడూ కులాలకు అతీతమైన సమాజాన్ని ప్రతిబింబిస్తూ ఉంటంది. దానికి మహాపురుష్ శ్రీమంత శంకరదేవకు నా కృతజ్ఞతలు. నేను డిలీట్ చేసిన పోస్ట్ వల్ల ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే.. వారికి ఇవే నా క్షమాపణలు’ అని సీఎం హిమంత బిశ్వశర్మ (ఎక్స్)ట్వీటర్ వేదికగా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. As a routine I upload one sloka of Bhagavad Gita every morning on my social media handles. Till date, I have posted 668 slokas. Recently one of my team members posted a sloka from Chapter 18 verse 44 with an incorrect translation. As soon as I noticed the mistake, I promptly… — Himanta Biswa Sarma (@himantabiswa) December 28, 2023 అయితే సీఎం హిమంత ట్వీటర్ టీం మొదటగా పోస్ట్ చేసిన భగవద్గీత శ్లోకం.. ‘బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకు సేవ చేయడమే శూద్రుల విధి’ అనే అర్థం వచ్చేలా ఉండటంతో ప్రతి పక్షాలు తీవ్రంగా ఖండిస్తూ విమర్శలు గుప్పించాయి. -
‘చరిత్ర తెలియకపోతే మాట్లాడొద్దు.. అస్సాం సీఎం ఫైర్’
గౌహాతి: అస్సాంకు సంబంధించి సీనియర్ నాయ్యవాది కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ తీవ్రస్థాయిలో విమర్శించారు. అస్సాం రాష్ట్ర చరిత్ర గురించి తెలియకపోతే అసలు మాట్లాడొద్దని మండిపడ్డారు. 1955 పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6A చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై బుధవారం వాదిస్తూ.. అస్సాంకు సంబంధించి కపిల్ సిబల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో అస్సాం రాష్ట్రం.. మయన్మార్(బర్మా)లో భాగంగా ఉండేదని పేర్కొన్నారు. అయితే సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్పై సీఎం హిమంత్ బిశ్వ శర్మ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అస్సాం చరిత్రపై అవగాహన లేనివారు మాట్లాడొద్దని ఘాటుగా విమర్శించారు. అస్సాం ఎప్పుడూ మయన్మార్‌లో భాగంగా లేదని అన్నారు. కేవలం ఒక సమయంలో ఇరువురికి ఘర్షణలు జరిగినట్లు తెలిపారు. అది ఒక్కటి మాత్రమే ఆ దేశానికి.. అస్సాంకి ఉన్న ఒక సంబంధమని పేర్కొన్నారు. అంతేకానీ, అస్సాం మయన్మార్‌లో భాగంగా ఉన్నట్లు ఎక్కడా చరిత్రలో రాసినట్లు ఉన్నట్లు తాను చూడలేదని మండిపడ్డారు. ఇక మణిపూర్‌లో అల్లర్లు జరగటానికి మయన్మార్ నుంచి వచ్చిన వలసదారులు కూడా ఓ కారణమని అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిందే. ఇది చదవండి: ‘నేను సంతకం చేయలేదు.. కేంద్రమంత్రి క్లారిటీ’ -
సెమీ కండక్టర్ తయారీలో టాటా గ్రూప్.. 40వేల కోట్ల పెట్టుబడులతో
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. సెమీ కండక్టర్ విభాగంలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఇందులో భాగంగా అస్సాంలో దాదాపు రూ. 40వేల కోట్ల పెట్టుబడితో అస్సాంలో సెమీకండక్టర్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని టాటా గ్రూప్ యోచిస్తోందని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. ఈ సందర్భంగా హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. ‘‘ఇది మాకు శుభపరిణామం. టాటా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ జాగీరోడ్‌లో ఎలక్ట్రానిక్ సెంటర్ ఏర్పాటు కోసం దరఖాస్తును సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత తుది ఆమోదం కోసం కేంద్రాన్ని సంప్రదించాం. త్వరలో ముందుకు వెళ్లే అవకాశం ఉంది’’ అని శర్మ చెప్పారు. ‘‘టాటా కంపెనీ అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో సుమారు రూ.40 వేల కోట్లతో చిప్ కంపెనీని ఏర్పాటు చేసేలా కేంద్రానికి ప్రతిపాదనను పంపించింది.సెమీకండక్టర్ అసెంబ్లీ, ప్యాకేజింగ్ ప్లాంట్‌పై టాటా గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో ప్రాథమిక చర్చలు జరిపిందని, ఇక్కడ చర్చల అనంతరం కేంద్రాన్ని సంప్రదించాం. అన్నీ సవ్యంగా సాగితే రాష్ట్రంలో భారీ పెట్టుబడులు వచ్చేలా చూస్తామని, పారిశ్రామికీకరణకు సానుకూల వాతావరణం ఏర్పడుతుందని, ఒకట్రెండు నెలల్లో తుది ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నామని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ చెప్పారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు షాక్: రెండో పెళ్లి కుదరదంతే! షరతులు వర్తిస్తాయి
Assam అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జీవిత భాగస్వామి జీవించి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా రెండో వివాహం చేసుకోవడానికి వీల్లేదని ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ కీలక ఆదేశాలు చేసింది. వారి వారి వ్యక్తిగత మతాల అనుమతి ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేనిదే రెండో పెళ్లి చేసుకోవడం కుదరదని తెగేసి చెప్పింది. అలాగే ఏ మహిళా ప్రభుత్వ ఉద్యోగి కూడా తమ భర్త బతికి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా పెళ్లి చేసుకోకూడదని అసోం ప్రభుత్వం స్పష్టం చేసింది. ముస్లింల ప్రస్తావన లేకుండా, వ్యక్తిగత చట్టం ద్వారా పలు వివాహాలు చేసుకోవడానికి అనుమతి ఉన్న పురుషులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని సర్క్యులర్‌లో పేర్కొంది, ఈ మేరకు అసోం సర్కార్ అక్టోబర్ 20న ఆఫీసు మెమోలో ఈ సూచనలను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి రావడం విశేషం. (19 ఏళ్లకే గ్యాంగ్‌స్టర్‌గా, ఎన్ఐఏకి చుక్కలు: ఇపుడు ఇంటర్ పోల్ రంగంలోకి) ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా బహు భార్యత్వం కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని బీజేపీ నేత, అసోం ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగి మరణానంతరం భర్త పెన్షన్ కోసం ఇద్దరు భార్యలు గొడవపడే సందర్భాలని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే నిర్ణయం తీసుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. (2014లోనే కాలం చెల్లిన ఫోన్లను వదిలేశారు: ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు) కాగా ఈ ఏడాది ప్రారంభంలో, అసోం బహుభార్యత్వాన్ని తక్షణమే నిషేధించాలనుకుంటున్నామనే అభిప్రాయాన్ని సీఎం ప్రకటించారు. సెప్టెంబర్‌లో జరిగే తదుపరి అసెంబ్లీ సెషన్లో బిల్లును ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నామని, అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాకపోతే జనవరి సెషన్లో ప్రవేశపెడతామని శర్మ హింటిచ్చారు. అలాగే ప్రతిపాదిత చట్టంపై ఆగస్టులో ముఖ్యమంత్రి ప్రజాభిప్రాయాన్ని కోరారు. దీంతోపాటు బహుభార్యత్వాన్ని నిషేధించే చట్టం అమలుకు సంబంధించి రాష్ట్ర శాసనసభకున్న అర్హత విషయంలో అసోం ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయగా, దీనికి కమిటీ నివేదిక ఆమోదం లభించినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇది ఇలా ఉంటే ఈనెల 18వ తేదీన జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముస్లిం మంత్రికి వ్యతిరేకంగా హిమాంత శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. -
అసోం సీఎం భార్య పై ఆరోపణలు..పరువు నష్టం దావా
ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌పై.. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్ శర్మ ఏకంగా రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్‌లో అవకతవకలు జరిగాయంటూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఆమె గొగోయ్‌కు నోటీసులు పంపారు. కామ్రూప్ మెట్రోపాలిటన్‌లోని సివిల్ జడ్జి కోర్టులో శుక్రవారం కేసు దాఖలు చేశామని, ఇది సెప్టెంబర్ 26న విచారణకు రానుందని భుయాన్ తరఫు న్యాయవాది దేవజిత్ సైకియా చెబుతున్నారు. సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ ద్వారా పలు ట్వీట్ల ద్వారా గౌరవ్ గొగోయ్ తన క్లయింట్ రినికి భుయాన్ శర్మకు నష్టం కలిగించారని, అందుకే రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశామని తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ గొగోయ్ తన క్లయింట్ రినికికి చెందిన కంపెనీ ప్రైడ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్స్ గురించి సోషల్ మీడియా వేదికగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. కాగా, ఓ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందడం కోసం అవకతవకలకు పాల్పడ్డారని గొగోయ్ ఆరోపించారు. అయితే.. తన భార్యపై వస్తున్న ఆరోపణలపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పొందినట్లు ఆధారాలు చూపిస్తే ప్రజా జీవితం నుంచి విరమణ పొందుతానని సవాల్ విసిరారు. అంతేగాక ఎలాంటి శిక్షనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో పోస్టు పెట్టారు. The reply itself clarifies the fact that the Government of India has not released any funds to the mentioned company. I want to emphasize once again that neither my wife nor the company she is associated with has received or claimed any amount from the Government of India. If… https://t.co/70zQ1DGHTe — Himanta Biswa Sarma (@himantabiswa) September 14, 2023 -
భార్యపై ఆరోపణలు.. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: అస్సాం సీఎం
గువాహతి: తన భార్యపై వస్తున్న ఆరోపణలపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పొందినట్లు ఆధారాలు చూపిస్తే ప్రజా జీవితం నుంచి విరమణ పొందుతానని సవాల్ విసిరారు. అంతేగాక ఎలాంటి శిక్షనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో పోస్టు పెట్టారు. ‘నా భార్య కానీ, ఆమెతో అనుబంధం ఉన్న కంపెనీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి డబ్బు పొందలేదని నేను మరోసారి స్పష్టం చేస్తున్నాను. ఎవరైనా సాక్ష్యాలను చూపిస్తే, రాజకీయాల నుంచి తప్పుకుంటా ఏ శిక్షనైనా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అంటూ కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ చేసిన పోస్ట్‌కు సమాధానంగా ట్వీట్ చేశారు. The reply itself clarifies the fact that the Government of India has not released any funds to the mentioned company. I want to emphasize once again that neither my wife nor the company she is associated with has received or claimed any amount from the Government of India. If… https://t.co/70zQ1DGHTe — Himanta Biswa Sarma (@himantabiswa) September 14, 2023 అయితే లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్, హిమంత బిస్వాశర్మ మధ్య ట్విటర్లో మాటల యుద్ధం నడుస్తోంది. అస్సాం బీజేపీ ఎంపీ పల్లబ్ లోచన్ దాస్ ప్రశ్నకు లోక్‌సభలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇచ్చిన సమాధానాన్ని గొగోయ్ ట్వీట్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. Please do not lecture me on what to do. Whether I decide to go to the assembly or a court of law against you, I will make that decision myself. https://t.co/38OAG2xy6T — Himanta Biswa Sarma (@himantabiswa) September 14, 2023 ముఖ్యమంత్రి శర్మ తన పరపతిని ఉపయోగించి ఆయన భార్య నడుపుతున్న సంస్థకు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ కింద రూ.10 కోట్లు ఇప్పించారంటూ గొగోయ్ సంచలన ఆరోపణ చేయడంతో ఈ ఇద్దరు అసోం నేతల మధ్య వివాదం రాజుకుంది. పీఎం కిసాన్ యోజన కింద అస్సాం సీఎం భార్యకు రూ.10 కోట్ల రాయితీ అందినట్లు గొగోయ్ ఆరోపణలు చేశారు.సంపద యోజన పథకం కింద సబ్సిడీతో కూడిన రుణం రూ.10 కోట్లు రినికి భూయాన్ శర్మకు చెందిన ‘ప్రైడ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి’ కంపెనీ అందుకున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో దయచేసి అస్సాం అసెంబ్లీకి హాజరై దీనిపై వివరణ ఇవ్వాలని గొగోయ్ కోరారు. KMSY గురించి చర్చించడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానాన్ని సమర్పించారని కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదని తెలిపారు. గొగోయ్ ఆరోపణలను శర్మ ఖండించారు. ఏం చేయాలో తనకు ఉపన్యాయం ఇవ్వాల్సిన అవసరం లేదని, దీనిపై అసెంబ్లీకి, న్యాయస్థానానికి వెళ్లాలో తానే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. Please do not change the goal post now. Yes, all family members of BJP politicians have the right to run their own companies and seek government subsidies if they are entitled to them. This is true for everyone. However, I would like to clarify that in this particular case, my… https://t.co/4GW6NonRSN — Himanta Biswa Sarma (@himantabiswa) September 14, 2023 శర్మ ట్వీట్‌కు గొగోయ్ వెంటనే స్పందించారు. ''మరీ అంత ఉద్రేకం తెచ్చుకోకండి. అసెంబ్లీకి మీరు రావాలని విపక్ష ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన లింక్‌ను మీకు పంపుతున్నాను. కోర్టుకు మీరు వెళ్తే నేను సంతోషిస్తాను. అప్పుడు అన్ని డాక్యుమెంట్లు వెలుగులోకి వస్తాయి'' అని గౌరవ్ గొగోయ్ ట్వీట్ చేశారు. Yes, I am agitated. There have been numerous reasons for my anger against your family since 2010. I am confident that we will meet in court, and once again, I will be able to prove my point. I have successfully done so in 2016 and 2021, and I am determined to do it again, both… https://t.co/pM0Kz8Eqw1 — Himanta Biswa Sarma (@himantabiswa) September 14, 2023 దీనిపై హిమంత శర్మ స్పందిస్తూ.. "అవును, నేను చాలా ఆగ్రహంతో ఉన్నాను. 2010 నుంచి మీ కుటుంబంపై అనేక కారణాల వల్ల ఆగ్రహంతో ఉన్నాను. మనం కోర్టులోనే మరోసారి కలవబోతున్నాం. నా వాదనను నేను నిరూపించుకుంటాను. 2016, 2021లో కూడా విజయవంతంగా నా వాదన వినిపించాను. మరోసారి అదే దృఢ సంకల్పంతో ఉన్నాను. ఇద్దరం ఇటు ప్రజాకోర్టులోనూ, అటు న్యాయస్థానంలోనూ కలుద్దాం'' అని శర్మ ట్వీట్ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ఫిర్యాదు చేస్తున్నారా? గోయల్ శర్మ తన భార్యకు మంజూరు చేయడాన్ని ఆమోదించారు. కానీ నిధులు విడుదల చేయలేదని కేంద్ర మంత్రి చెబుతున్నారు. ఇంకా ఎంత మంది బీజేపీ రాజకీయ నాయకులు తమ కుటుంబాలను సుసంపన్నం చేసేందుకు పీఎంకేఎస్‌వై పథకాన్ని ఉపయోగించుకున్నారు? అని గౌరవ్ గొగోయ్ అన్నారు. వెబ్సైట్ పేర్కొన్నది. ఈ వ్యవహారం అస్సాంలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నది. -
సంఘమిత్ర కుటుంబానికి అసోం సీఎం పరామర్శ
తీవ్ర చర్చగా మారిన అసోం ట్రిపుల్ మర్డర్ కేసులో బాధిత కుటుంబాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పరామర్శించారు. ఈ క్రమంలో లవ్ జిహాదీ అంశం ప్రస్తావించిన ఆయన.. నిందితుడు నజిబుర్ పైనా సంచలన ఆరోపణలు చేశారు. ఇది మొత్తంగా లవ్ జిహాద్ పరిణామమే. బాధిత కుటుంబం హిందూ.. అలాగే నిందితుడు ముస్లిం కమ్యూనిటీకి చెందినవాడు. ఫేస్బుక్లో హిందూ పేరుతో పరిచయం పెంచుకుని.. ఆమెను ట్రాప్ చేశాడు. కోల్‌కతాలో ఆ ఇద్దరూ ఉన్నప్పుడు ఆమెపై డ్రగ్స్ ప్రయోగించినట్లూ తేలింది అని తెలిపారాయన. నిందితుడు నజిబుర్ రెహమాన్ బోరా తన మతం మార్చేసి.. ఆమెను మోసం చేశాడు. అతను డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తి. ఆమెకూ డ్రగ్స్ ఇచ్చి లోబర్చుకున్నాడు. ఆ సమయంలోనే ఆమె గర్భం దాల్చింది. ఆపై ఆమెను హింసించడంతో.. భరించలేకే పుట్టింటికి వచ్చేసింది అని సీఎం హిమంత వెల్లడించారు. కరోనా సమయంలో బాధితురాలి సోదరి అంకిత ఈ లవ్ జిహాదీ అంశంపై తనకు లేఖ రాసిందని.. కానీ, ఆ టైంలో ఆ లేఖ తన దాకా రాకపోవడం వల్ల ఇవాళ ఇంత ఘోరం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మహిళ గతంలో తన భర్తను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదు చేసింది. కరోనా ఫస్ట్ వేవ్ లాక్డౌన్ టైంలో ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన సంఘమిత్ర, నజిబూర్లు.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి పారిపోయారు. ఆపై ఆమెపై దొంగతనం కేసు పెట్టించి నెలపాటు జైలు పాలు చేసింది ఆమె కుటుంబం. తిరిగి మళ్లీ పారిపోయిన జంట.. ఈసారి వివాహం చేసుకుని కాపురం పెట్టింది. ఓ బాబు కూడా పుట్టాడు. అయితే మనస్పర్థలతో ఆమె తిరిగి పుట్టింటికి చేరుకుని నజిబూర్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జైలుపాలైన నజిబూర్.. కోపంతో రగిలిపోయి సోమవారం ఆమె ఇంటికి వెళ్లాడు. భార్య సంఘమిత్రను, ఆమె తల్లిదండ్రులు సంజీవ్ ఘోష్, జునూ ఘోష్‌లను పదునైన ఆయుధంతో హతమార్చాడు నిందితుడు నజిబూర్ రెహమాన్ బోరా(25). ఆపై తొమ్మిది నెలల బిడ్డను చంకనెక్కించుకుని గోలాఘాట్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ కేసులో నిందితులను ఎవరినీ ఉపేక్షించం. 15 రోజుల్లో ఛార్జిషీటు నమోదుచేసి నిందితుణ్ని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో నిలబెడతామని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. అసోం హోం మంత్రిత్వ శాఖను కూడా ఆయనే పర్యవేక్షిస్తుండడంతో.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని నియమించి బాధిత కుటుంబానికి వీలైనంత త్వరగా న్యాయం చేకూరుస్తానని చెబుతున్నారాయన. -
అసోం సీఎం 'హుస్సేన్ ఒబామా' వ్యాఖ్యలపై రాజకీయ రగడ..
గువాహటి: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఉద్దేశించి అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో అనేకమంది హుస్సేన్ ఒబామాలు ఉన్నారని వ్యంగ్యంగా ట్విట్టర్ వేదికగా అన్నారు. అలాంటి వారిని ఎదుర్కోవడమే మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. భారత్‌లో మైనార్టీల దుస్థితిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన ఒబామాను అరెస్టు చేసేందుకు రాష్ట్ర పోలీసులు వాషింగ్టన్ వెళ్తారా అంటూ ట్విటర్లో వచ్చిన ఓ ప్రశ్నకు ఆయన ఈ మేరకు స్పందించారు. There are many Hussain Obama in India itself. We should prioritize taking care of them before considering going to Washington. The Assam police will act according to our own priorities. https://t.co/flGy2VY1eC — Himanta Biswa Sarma (@himantabiswa) June 23, 2023 అసోం పోలీసులు స్వీయ ప్రాధామ్యాల ప్రకారం నడుచుకుంటారని బిశ్వశర్మ తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విపక్ష నేతలపై పోలీసులు ఎఫ్ఐఆర్లు దాఖలు చేయడాన్ని ప్రస్తావిస్తూ ఒక పాత్రికేయుడు ట్విటర్లో ప్రశ్న అడిగారు. ఒబామాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? అని ఆయన అడిగారు. దీనిపై అసోం సీఎం వివాదస్పదంగా బదులివ్వడం రాజకీయంగా రగడకు దారితీసింది. సీఎం వ్యాఖ్యలపై నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి క్లైడ్ క్రాస్టో ఫైరయ్యారు. భారత్‌లో మతం ఆధారంగా వివక్ష లేదంటూ అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగానికి పూర్తి వ్యతిరేకంగా అసోం సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. దీనిపై హిమంత బిశ్వ శర్మ క్షమాపణ చెప్పాలన్నారు. సీఎం ఈ అంశంలో క్షమాపణలు చెప్పకపోతే ప్రధాని మోదీని ప్రపంచం ఎలా విశ్వసిస్తుందని ప్రశ్నించారు. ఇదీ చదవండి: మణిపూర్: అమిత్ షా అఖిలపక్ష భేటీ.. ఏపీ, టీఎస్ నుంచి వెళ్లింది వీరే.. -
మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని
గువాహటి: గువాహటి(అస్సాం)–న్యూజల్పాయ్గురి(పశ్చిమబెంగాల్) వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం ప్రధాని మోదీ వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాల్లోనే మొట్టమొదటి ఈ వందేభారత్ రైలుతో ఈ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ వారంతో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న ఎన్డీఏ ప్రభుత్వంలో దేశం అభివృద్ధి దిశగా అద్భుతమైన ప్రయాణం సాగించిందన్నారు. 2014కు పూర్వం ఊహించని అనేక విజయాలను ప్రభుత్వం సాధించిందని తెలిపారు. గువాహటిలో ఈ రైలు ప్రారంభ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, సీఎం హిమాంత బిశ్వ శర్మ పాల్గొన్నారు. గువాహటి– న్యూజల్పాయ్గురి మధ్య రైలు ప్రయాణ సమయం ప్రస్తుతమున్న 6.30 గంటల నుంచి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రాకతో 5.30 గంటలకు తగ్గనుంది. -
ఈ రజాకార్ల రాజ్యాన్ని పాతరేస్తాం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో రజాకార్ల పాలన సాగుతోందని, మరో ఐదు నెలల్లో ఈ పాలనను పాతరేసి రామరాజ్యాన్ని స్థాపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కర్ణాటక ఫలితాలతో హిందుత్వంపై కొన్ని శక్తులు విష ప్రచారం చేస్తున్నా యని మండిపడ్డారు. హిందూ ఏక్తాయాత్ర సందర్భంగా ఆదివారం సాయంత్రం కరీంనగర్‌లోని వైశ్యభవన్ వద్ద మొదలైన ర్యాలీలో అసోం సీఎం హిమంత బిశ్వశర్మతో కలసి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు. తాను ఎవరికీ వ్యతిరేకంగా హిందూ ఏక్తాయాత్ర చేయడం లేదని, హిందూ సమాజాన్ని సంఘటిత పర్చేందుకు, ఐక్యంగా ఉంచేందుకే చేపట్టానని తెలిపారు. కుహానా లౌకికవాదుల నుంచి హిందూ సమాజాన్ని జాగృతం చేయాల్సి ఉందన్నారు. ఈ యాత్రతో రాష్ట్రమంతా హిందూ సమాజాన్ని జాగృతపరుస్తానని చెప్పారు. పావు గంటపాటు పోలీసులు తప్పుకుంటే తామేంటో చూపిస్తామన్న వారిని పరుగులు పెట్టించే రోజులు ఎంతో దూరంలో లేవని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో బీజేపీ ఓటమి చెందగానే.. హిందూత్వానికి మనుగడ లేదని కొన్ని పార్టీలు ప్రచారం మొదలుపెట్టాయని.. అలాంటి వారంతా ఒక్కసారి కరీంనగర్ గడ్డ వైపు చూస్తే సమాధానం దొరుకుతుందన్నారు. దేశంలో హిందుత్వం లేకపోతే ఎప్పుడో పాకిస్తాన్ అయ్యేదన్నారు. నిజాం రజకార్ల సమా ధుల వద్ద మోకరిల్లిన వారికి గుణపాఠం చెప్పాలన్నారు. ఎగిరేది కాషాయ జెండానే.. జగిత్యాల ఎస్సై భార్యకు, బురఖా వేసుకున్న మహిళకు మధ్య జరిగిన వాగ్వాదంలో ఎంఐఎం నేతలు అకారణంగా జోక్యం చేసుకుని సదరు ఎస్సైని సస్పెండ్ చేయించారని సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎగిరేది కాషాయం జెండానే అని చెప్పారు. కేరళ స్టోరీ సినిమాలో హిందూ మహిళలపై జరుగుతున్న లవ్ జిహాద్ దాడులను కళ్లకు కట్టారని పేర్కొన్నారు. త్వరలోనే ఉమ్మడి పౌరస్మృతి: హిమంత బిశ్వశర్మ రాష్ట్రంలో రజాకార్ల ప్రభుత్వం పోయి, త్వరలోనే రామరాజ్యం వస్తుందని తనకు నమ్మకంగా ఉందని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యానించారు. సూర్యచంద్రులు ఉన్నంత కాలం దేశంలో సనాతన ధర్మం బతికే ఉంటుందన్నారు. పదేళ్ల క్రితం దేశంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం, కశ్మీర్లో ఆర్టీకల్ 370 రద్దును ఎవరూ ఊహించలేదని.. కానీ అవన్నీ సాకారం అయ్యాయని చెప్పారు. కొందరు నాలుగు పెళ్లిళ్లు చేసుకుందామని కలలు కంటున్నారని.. కానీ త్వరలోనే ఉమ్మడి పౌరస్మృతితో వాటికి ప్రధాని మోదీ అడ్డుకట్ట వేస్తారన్నారు. అసోంలో డీజిల్ ధర రూ.97 ఉంటే తెలంగాణలో మాత్రం రూ.106గా ఉందన్నారు. తెలంగాణ సర్కారు ఉద్యోగాలను కూడా సరిగా భర్తీ చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణ నేతల పేర్లు ఢిల్లీ లిక్కర్ స్కాంలో వినిపిస్తున్నాయన్నారు. బండి సంజయ్ హనుమంతుడిలా యుద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు. తాను సీఎం అయ్యాక అసోంలో పలు మదర్సాలను రద్దు చేశానని, మరికొన్నింటిని రద్దు చేసేందుకు సిద్ధమని చెప్పారు. ఐదు నెలలు శక్తివంచన లేకుండా కృషి చేస్తే.. తెలంగాణలో అధికారం మనదేనని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. -
హిందూ ఏక్తా ర్యాలీలో అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: కరీంనగర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్ర నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆదివారం నిర్వహించిన ఈ ర్యాలీలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పాల్గొన్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, ఓవైసీపై అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్యుడు ఉన్నంత వరకు హిందుత్వం, సనాతన ధర్మం ఉంటుందన్నారు. పదేళ్ళ క్రితం అయోధ్యలో రామ మందిరం అవుతుందని ఎవరూ అనుకోలేదని, కానీ ఈ ఏడాది ఆలయ నిర్మాణం పూర్తైందన్నారు. భారతదేశం నిజమైన సెక్యులర్ దేశం కాబోతుందని, తెలంగాణలో రామరాజ్యం రాబోతుందని పేర్కొన్నారు. ఓవైసీ బెదిరింపులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేస్తామని తెలిపారు. హిందూత్వం లేకుండా భారత దేశం లేదన్నారు. అసోంలో 98 రూపాయలకే పెట్రోల్ వస్తుందని.. తెలంగాణలో పెట్రోల్ ధర 108 రూపాయలు ఉందని విమర్శించారు. ‘అసోంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతం 1వ తేదీన వస్తుంది. తెలంగాణలో ఒకటో తేదీన జీతాలు రావు. రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం పేరు ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఢిల్లీలో ప్రభుత్వ పెద్దలు మద్యం వ్యాపారం చేస్తున్నారు. బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటే. బీఆర్ఎస్ వీఆర్ఎస్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది. భారతదేశం విశ్వగురు స్థానంలో నిలుస్తుంది. ఈ రోజు పాకిస్థాన్ పరిస్థితి చూడండి. హిందూ దేవుళ్ళను నమ్మని వారి పరిస్థితిని చూడండి. వారి దుస్థితి చూడండి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ నెంబర్ వన్ కాబోతుంది. చదవండి: కర్ణాటక కొత్త కేబినెట్‌కు ముహూర్తం ఖరారు.. సీఎం డిసైడయ్యేది ఆ రోజేనా! మీరు ఒక్కసారి కేరళ స్టోరీ చూడాలి. హిందూ యువతులను ఉగ్రవాదులుగా ఎలా తయారు చేస్తారో చూపించారు. లవ్ జిహాద్ అరికట్టేందుకు నేను ప్రయత్నం చేస్తున్నాను. ఓవైసీ నన్ను చూసుకుంటా అని బెదిరించారు. వచ్చే ఏడాది మరో వెయ్యి మదర్సాలనూ మూసివేస్తా. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తాను. ఓవైసీ ఇంట్లోకి కూడా వస్తా ఏం చేస్తాడో చూడాలి. రజాకార్ రాజ్యం పోవాల్సిన అవసరం ఉంది. బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. తెలంగాణలో మార్పు వస్తుంది. రామరాజ్యం వస్తుంది అని అసోంలో చెప్తాను.’ అని హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యానించారు. హిందూ ఏక్తా యాత్రలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాజాకార్ల రాజ్యాన్ని పాతరేస్తామని బండి సంజయ్ ధ్వజమెత్తారు. తెలంగాణలో హిందూ వ్యతిరేక శక్తులకు గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చారు. అందుకోసమే హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. హిందూత్వం లేకుంటే దేశం పాకిస్థాన్ అయ్యేదని అన్నారు. తెలంగాణ మొత్తం హిందుత్వ వాతావరణాన్ని తీసుకొస్తానని చెప్పారు. -
Assam: బహుభార్యత్వంపై సీఎం కీలక ప్రకటన!
బహుభార్యత్వాన్ని నిషేధించాలని ప్లాన్ చేస్తున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మంగళవారం ప్రకటించారు. ఆ అధికారం రాష్ట్ర శాసనసభకు ఉందో లేదో అనే విషయాన్ని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కమిటీ భారత రాజ్యగంలోని ఆర్టికల్ 25 ముస్లిం పర్సనల్ లా చట్టానికి సంబంధించిన 1937 లోని నిబంధనను పరిశీలిస్తోందన్నారు. ఈ మేరకు బిస్వా శర్మ తన ప్రభుత్వ రెండో వార్షికోత్సవం పురస్కరించుకుని.. ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేగాదు ఈ కమిటీ అన్ని న్యాయ నిపుణులతో విస్తృతమైన చర్చలు జరిపి మంచి ఇన్ఫర్మేషన్తో కూడిన ఒక నిర్ణయానికి వస్తుందని చెప్పారు. జాతీయ ఏకాభిప్రాయానికి సంబంధించిన యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) వైపు తాము వెళ్లమని, దానిపై కేంద్రమే చొరవ తీసుకుంటుందని బిస్వా శర్మ చెప్పారు. యూసీసీలో ఒక భాగంగా అస్సాం రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని నిషేధించాలన్న తమ ఉద్దేశాన్ని ప్రకటిస్తున్నట్లు బిస్వాశర్మ పేర్కొన్నారు. ఈ సమస్యపై ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసకుంటామని, బలవంతంగా లేదా దూకుడుగా వ్యవహరించమని చెప్పారు. కాగా, అస్సాం రాష్ట్రంలో బాల్య వివాహాల అణిచివేత సమయంలో చాలామంది వృద్ధులు అనేకసార్లు వివాహాం చేసుకున్నారని, వారి భార్యల్లో చాలామంది పేద వర్గానికి చెందని యువతులని ముఖ్యమంత్రి చెప్పారు. బహు భార్యత్వం నిషేధం తోపాటు బాల్య వివాహాలకు పాల్పడేవారిపై మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని అస్సాం సీఎం బిస్వా శర్మ అన్నారు. (చదవండి: ఢిల్లీ యూనివర్సిటీలో రాహుల్ ఆకస్మిక పర్యటన! నోటీసులు పంపుతామని వార్నింగ్) -
'కాపీ పేస్ట్ సీఎం' అంటూ సెటైర్లు..హుందాగా బదులిచ్చిన హిమంత శర్మ
అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మని ట్రోల్ చేస్తూ ఓ వీడియ్ నెట్టింట్ హల్ చల్ చేస్తోంది. దీంతో ఆయన దానికి స్పందించి..హుందాగా బదులిచ్చారు. అసలేం జరిగిందంటే..అస్సాం ముఖ్యమంత్రి బిస్వా శర్మ ఒక రోజు ప్రభుత్వ స్కూల్‌ని సందర్శించారు. అక్కడ విజిటర్స్ బుక్‌లో రాయడానికి ఆయన.. వేరొక పుస్తకంలో చూసి రాస్తూ కనిపించారు. దీంతో రోషన్ శర్మ అనే వ్యక్తి అందుకు సంబంధించిన వీడియో తోపాటు.. కాపీ చేయకుండా విజటర్స్ బుక్‌లో ఒక్క పేరా కూడా రాయలేని అస్సాం సీఎం అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. ఈ విషయం నెట్టింట వైరల్ కావడంతో సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై గంటల వ్యవధిలోనే స్పందించిన ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ తనకు ఇంగ్లీష్, హిందీ భాషలు సరిగా రావని, దాన్ని అంగీకరించేందుకు తనకు ఎలాంటి సంకోచం లేదన్నారు. పైగా తాను ఆ భాషాలను నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నానని ట్వీట్ చేశారు. దీనికి రాయ్ బదులిస్తూ..అస్సామీ ఒక అందమైన భాష, సందర్శకుల పుస్తకంలో అస్సామీ భాషలో రాసి ఉంటే మరింత మెరుగ్గా కనిపించేది. ఇక్కడ భాష కాదు సమస్య . అతను వచనాన్ని కాపీ చేయడం గురించి మాత్రమే విమర్శించాను. అయినా విజిటర్స్ బుక్‌లో హిందీ లేదా ఇంగ్లీష్‌లోనే రాయాలని రూల్ లేదు . కాపీ చేయడం అనేది మీ స్థాయి నాయకుడికి తగదు. నాయకుడు తన విభిన్నమైన ఉన్నతాశయ ఆలోచనలతో అందరికీ ఆదర్శంగా ఉండేలా కానీ ఇలా కాపీ చేయకూడదూ అని సూచిస్తూ ట్వీట్ చేశాడు. Presenting the CM of Assam who can't even write a paragraph in a visitor's book without copying 🤣🤣🤣 pic.twitter.com/MHvoRAGDH1 — Roshan Rai (@RoshanKrRaii) April 4, 2023 (చదవండి: ప్రధాని డిగ్రీని చూసే ప్రజలు ఓటేశారా? ఎన్సీపీ నేత ఫైర్) -
తీవ్ర హెచ్చరిక.. జాగ్రత్తగా వినండి సీఎం.. మధ్యలో వచ్చి బలికావొద్దు!
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు బెదిరింపులు ఎదురయ్యాయి. ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్ సంఘం నేత గురుపత్వాన్ సింగ్ పన్నూ సీఎంపై బెదిరింపులకు పాల్పడ్డాడు. అస్సాం జర్నలిస్టులకు కాల్ చేసి ముఖ్యమంత్రిని బెదిరించాడు. పంజాబ్‌లో ఖలిస్తాన్ వేర్పాటు వాది, అమృత్‌పాల్ సింగ్ కోసం గాలింపు కొనసాగుతున్న వేళ అస్సాం సీఎంకు బెదిరింపులు రావడం చర్చనీయాంశంగా మారింది. ‘ఖలిస్తాన్ అనుకూల మద్దతుదారులను అస్సాంలో నిర్భంధించి హింసిస్తున్నారు. జాగ్రత్తగా వినండి సీఎం శర్మ.. ఇక్కడ పోరాటం ఖలిస్తాన్ అనుకూల సిక్కులకు.. భారత ప్రభుత్వానికి మధ్య జరుగుతోంది. అనవసరంగా ఈ హింసలో మీరు బలికావద్దు’ అని హెచ్చరించాడు. అలాగే ‘మేము ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణ మేరకు శాంతియుత ప్రజాస్వామ్య పద్దతిలో భారత ఆక్రమణ నుంచి పంజాబ్‌ను విముక్తి చేయాలని కోరుతున్నాం. మీ ప్రభుత్వం దిబ్రూగఢ్ సెంట్రల్ జైలులో ఉన్న అమృతపాల్ మద్దతురాలైన ఆరుగురుని ఖైదీలుగా మార్చి వేధింపులకు గురిచేస్తోంది. మీరు దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని పన్నూ ఫోన్లో బెదిరించాడు. కాగా వారిస్ పంజాద్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు మార్చి 18 నుంచి ముమ్మరంగా గాలిస్తున్నారు. పోలీసులకు చిక్కిన్నట్లే చిక్కి వేషాలు, వాహనాలు మార్చుకుంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇప్పటి వరకు వందలాది ఖలిస్తాన్ మద్దతుదారులు, అమృత్‌పాల్ సహాయకులను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అయితే భద్రతా కారణాల రీత్యా అతడి ఆరుగురు సహాకులను అస్సాంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలించారు. చదవండి: అఫ్తాబ్ పూనావాలాపై దాడి.. జైలులో చితకబాదిన తోటి ఖైదీలు..! -
అస్సాంలోని మదర్సాలన్నిటినీ మూసేస్తాం
బెళగావి: అస్సాంలోని అన్ని మదర్సా (ముస్లిం మత పాఠశాల)లను మూసి వేస్తామని ఆ రాష్ట్ర సీఎం హిమాంత బిశ్వ శర్మ తెలిపారు. ఆధునిక భారతదేశంలో మదర్సాల అవసరం అవసరం లేదని చెప్పారు. ‘దేశానికి, అస్సాం రాష్ట్రానికి సేవలు చేసేందుకు అవసరమైన డాక్టర్లు, ఇంజినీర్లు, ఇతర వృత్తి నిపుణులను తయారు చేసే స్కూళ్లు, కాలేజీలతో మాత్రమే అవసరం ఉంది. మదర్సాలతో కాదు’అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 600 మదర్సాలను మూసివేశాం, మిగతా వాటినీ మూసేస్తామని అన్నారు. కర్ణాటకలోని బెళగావిలో గురువారం రాత్రి జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిత్యం బంగ్లాదేశ్ నుంచి వస్తున్న జనంతో మన సంస్కృతి, ఆచారాలకు ముప్పు ఏర్పడిందన్నారు. ‘మన దేశంలో ముస్లింలు, క్రిస్టియన్లమని గర్వంగా చెప్పుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ, హిందువును అని గర్వంగా చెప్పుకునే వారు కావాలి’అని హిమాంత చెప్పారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చరిత్రను వక్రీకరించాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ను నయా మొఘలుల పార్టీగా అభివర్ణించారు. ఒకప్పుడు మొఘలులు భారత్‌ను బలహీనం చేసేందుకు ప్రయత్నించారు..కాంగ్రెస్ ఇప్పుడదే చేస్తోందన్నారు. -
ఆదివాసీల హక్కులపై బీజేపీతో చర్చకు సిద్ధం
అగర్తలా: తిప్రాసా ప్రజల సమస్యలపై రాజ్యాంగబద్ధ పరిష్కారం కనుగొనేందుకు బీజేపీతో ముఖాముఖి చర్చలకు సిద్ధమని తిప్రా మోథా చీఫ్ ప్రద్యోత్ దేవ్ వర్మన్ చెప్పారు. తిప్రా మోథా డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కరిస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ శనివారం చేసిన ప్రకటనపై దేవ్ స్పందించారు. ‘ఆర్థికంగా, రాజకీయంగా, భాషాపరంగా మాకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన వాటిపై గౌరవప్రదంగా చర్చలకు పిలిస్తే వెళ్తాం. స్థానిక ఆదివాసీల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించడానికి మేం సిద్ధం. అయితే, ఈ చర్చలు కేబినెట్ పోస్టు కోసమో, వ్యక్తిగత లబ్ధి కోసమో మాత్రం కాదు’ అని స్పష్టంచేశారు. ఇటీవలి ఎన్నికల్లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన తిప్రా మోథా మొత్తం 13 ఎస్టీ రిజర్వుడు స్థానాలనూ గెలుచుకుంది. -
రాహుల్‌పై బీజేపీ ఫైర్.. కాంగ్రెస్, చైనాలు భాయ్ భాయ్ అంటూ..
కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలు రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి, ప్రతిపక్ష నాయకులపై నిఘా పెట్టారని ఆరోపించారు. ఇక, రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్, రాహుల్ గాంధీపై ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో కాంగ్రెస్, చైనా భాయ్ భాయ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రసంగిస్తూ రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి, పెగాసెస్ స్పైవేర్ దేశంలోని రాజకీయ నాయకుడి ఫోన్లలో ఉందంటూ కామెంట్స్ చేశారు. కాగా, రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు. విదేశీ గడ్డపై ఇండియాను కించపరిచే ప్రయత్నమంటూ మండిపడ్డారు. ఇదివరకు విదేశీయులు దాడి చేస్తే.. ఇప్పుడు స్వదేశీయులు సైతం భారత్‌ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంబ్రిడ్జ్‌లో రాహుల్ చేసిన ప్రసంగం ఆదరణీయ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునే ముసుగులో విదేశీ గడ్డపై మన దేశాన్ని కించపరిచే ధృడమైన ప్రయత్నం తప్ప మరొకటి కాదు అంటూ విమర్శించారు. ఇదే సమయంలో రాహుల్ ప్రస్తావించిన ప్రజాస్వామ్యంపై దాడి అనే వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వం అందించిన రక్షణలోనే రాహుల్ భారత్ జోడో యాత్ర ముగిసిందన్నారు. జోడో యాత్రలో 4,000 కిలో మీటర్లు ఏ ప్రమాదం లేకుండా ప్రయాణించారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ నేతలు తలపెట్టిన యాత్రలను ఎలా విధ్వంసం చేశారో ఆయనకు గుర్తు చేయాల్సిన అవసరం ఉందా? అంటూ మండిపడ్డారు. మరోవైపు.. రాహుల్ ఫోన్ పెగాసెస్ ఉందన్న వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. దీనిపై విచారణకు రాహుల్ తన ఫోన్ ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. First foreign agents target us! Then our own targets us on a foreign land! Rahul Gandhi’s speech at Cambridge was nothing but a brazen attempt to denigrate our country on foreign soil in the guise of targeting Adarniya PM Shri @narendramodi ji. Thread — Himanta Biswa Sarma (@himantabiswa) March 3, 2023 ఇక, రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ.. విదేశాలకు వెళ్లిన ప్రతీసారి రాహుల్ భారత్‌ను అవమానపరుస్తున్నాడు. చైనాకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు. దేశ ప్రజలు ఆయన నిజస్వరూపాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. రాహుల్ మాటలు చిన్న పిల్లాడు మాట్లాడినట్టుగా ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నాము అంటూ కామెంట్స్ చేశారు. #WATCH |This is Rahul Gandhi-whenever he goes abroad,he insults India...He does this whenever he goes abroad&calls China the symbol of goodwill. Country should see his true face...We condemn his childish statment..:BJP's RS Prasad on Rahul Gandhi's address at Cambridge University pic.twitter.com/aMEtS3nJJR — ANI (@ANI) March 3, 2023 -
అరెస్టులతో జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తున్నారు: గువాహతి హైకోర్టు
గువాహతి: బాల్య వివాహాలపై ఉక్కుపాదం మోపే క్రమంలో పోక్సో యాక్ట్‌ను ప్రధాన ఆయుధంగా ప్రయోగిస్తూ.. టీనేజ్ భర్తలను కటకటాల వెనక్కి నెడుతోంది అసోం ప్రభుత్వం. ఒకవేళ నేరం గనుక రుజువైతే వాళ్లంతా జీవిత ఖైదు ఎదుర్కోవాల్సి ఉంటుంది!. అయితే.. మైనర్లను లైంగిక నేరాల నుంచి రక్షించే ఉద్దేశంతోనే ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతోంది. ఈ తరుణంలో.. అసోం ప్రభుత్వ చర్యపై అక్కడి హైకోర్టు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం అసోంలో అమలు అవుతున్న చట్టం ప్రకారం.. బాల్య వివాహాలకు పాల్పడితే పోక్సో చట్టం ప్రకారం 20 ఏళ్లైనా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో.. అభియోగాలు నమోదు అయిన తొమ్మిది మంది ముందస్తు బెయిల్ కోసం గువాహతి (గౌహతి) హైకోర్టును ఆశ్రయించారు. వాళ్లకు ఊరట ఇస్తూ బెయిల్ ఇచ్చింది కోర్టు. అయితే ఈ బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా బెంచ్ స్పందిస్తూ.. ‘‘బాల్య వివాహం అనేది ముమ్మాటికీ చెడు ఆలోచనే. అలాగని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. అరెస్టుల పర్వంతో ప్రజల జీవితాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. వాళ్ల వ్యక్తిగత జీవితాల్లో అలజడి రేగుతోంది. వాళ్లపై ఆధారపడి పిల్లలు, వృద్ధులు, ఇతర కుటుంబ సభ్యులు బతుకుతున్నారు . ఈ అంశంపై మా అభిప్రాయాలను తెలియజేస్తాము. కానీ, ప్రస్తుతానికి వాళ్లందరినీ అరెస్టు చేసి జైల్లో పెట్టాలా అనేదే సమస్య!. అని హైకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. పోక్సో చట్టంలో మీరు ఏదైనా జత చేయొచ్చు. కానీ, ఇక్కడ పోక్సో అటే ఏమిటసలు?. న్యాయమూర్తులు అక్కడ ఏముందో చూడలేరు అనుకుంటున్నారా?. పోక్సో యాక్ట్‌ను ఎలా వర్తింపజేస్తారు?. అలాగని మేము ఇక్కడ ఎవరినీ నిర్దోషులుగా ప్రకటించడం లేదు. మిమ్మల్ని(అసోం పోలీసులను ఉద్దేశిస్తూ..) విచారించుకోవడానికి కూడా అడ్డుకోవట్లేదు.ఎవరైనా దోషి అని తేలితే.. ఛార్జ్‌షీట్ ఫైల్ చేయండి. అంతేగానీ కస్టోడియల్ విచారణ చేపట్టాల్సిన అవసరం ఏముంది? అని జస్టిస్ సుమన్ శ్యామ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే అసోం వ్యాప్తంగా.. 3 వేల మందిని బాల్య వివాహాల కట్టడి చట్టం పేరుతో అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. దీంతో వాళ్ల కుటుంబ సభ్యులు రోడ్డెక్కి నిరసనలకు దిగుతున్నారు. కుటుంబాలను పోషించే మగతోడును బంధించడంపై వాళ్ల భార్యలూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాత్రం బాల్య వివాహం అనేది సంఘానికి పట్టిన చెడు అని, దీని నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజల మద్దతు అవసరమని విజ్ఞప్తి చేస్తున్నారు. అసోంలో ప్రజారోగ్య జీవనవిధాన గణాంకాలు దారుణంగా ఉన్నాయి. ఈ తరుణంలోనే పరిస్థితికి మూలకారణమైన బాల్య వివాహాలను నిర్మూలించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే బాల్య వివాహాల నిర్మూలన డ్రైవ్‌ను చేపట్టగా.. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వేల మందిపై పోలీస్ కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే.. ఈ డ్రైవ్‌ను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.పోలీస్ చర్యలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసం చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని విరుచుకుపడుతున్నాయి. -
‘సంపూర్ణ యుద్ధం’ వికటిస్తుందా?
ప్రభుత్వాలు ఎంత ప్రయత్నిస్తున్నా బడి ఈడు పిల్లలను పెళ్లి పీటలెక్కించే సామాజిక దురాచారం దేశంలో పెద్దగా తగ్గలేదని తరచు వెలుగులోకొస్తున్న ఉదంతాలు చెబుతున్నాయి. బాల్యవివాహాలపై అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం సరిగ్గా వారం క్రితం ప్రకటించిన ‘సంపూర్ణ యుద్ధం’ ఈ సమస్యను మరోసారి ఎజెండాలోకి తెచ్చింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దీనిపై ప్రకటన చేసిందే తడవుగా ఆ రాష్ట్రంలో పోలీసులు విరుచుకుపడటం మొదలెట్టారు. ఇంతవరకూ దాదాపు మూడువేలమందిని అరెస్టు చేశారంటున్నారు. వీరిలో పెళ్లిళ్లు జరిపించిన పురోహితులు, కాజీలు కూడా ఉన్నారు. అరెస్టయినవారిలో అత్యధికులపై భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ) కింద వేర్వేరు సెక్షన్లు నమోదు చేయటంతోపాటు పిల్లలపై లైంగిక నేరాలను అరికట్టేందుకు ఉద్దేశించిన పోక్సో చట్టాన్ని కూడా ప్రయోగించారు. వాస్తవానికి దాదాపు పదివేలమందిపై ఎఫ్ఐఆర్లు నమోదైనా వారిలో చాలామంది పరారయ్యారు. ఈ పోలీసు చర్యకు ప్రభుత్వం చెబుతున్న కారణాలు గమనించదగ్గవి. 2019–20 మధ్య జరిపిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం అస్సాంలో 20–24 ఏళ్ల మధ్య ఉన్న వివాహితల్లో 31.8 శాతంమంది చట్టవిరుద్ధంగా 18 ఏళ్ల వయసులోపు పెళ్లిళ్లు చేసు కున్నవారే. జాతీయ స్థాయి సగటు 23.3 శాతంతో పోలిస్తే ఇది ఎక్కువే. హిమంత బిశ్వ శర్మ చేసిన ట్వీట్లో అస్సాంలోని ఏయే జిల్లాల్లో ఈ బాల్యవివాహాల దురాచారం ఎక్కువుందో, దానివల్ల ఆ ప్రాంతాల్లో చిన్న వయసులోనే గర్భిణులవుతున్నవారి శాతం ఎంతో వివరించారు. టీనేజ్ తల్లుల, గర్భిణుల జాతీయ స్థాయి సగటు 6.8 శాతం ఉంటే, అస్సాంలో అది 11.7 శాతం. ఇది కూడా ఆందోళనకరమైనదే. ఎడాపెడా సాగుతున్న ఈ అరెస్టుల వల్ల తాత్కాలికంగా అలాంటి పెళ్లిళ్లకు బ్రేక్ పడొచ్చు. కానీ వీటికి దారితీస్తున్న మూలకారణాలను పరిష్కరించనంతవరకూ అవి పూర్తిగా సమసిపోవటం సాధ్యం కాదని పాలకులు గుర్తించటం అవసరం. విద్యాగంధం అంటని మారుమూల పల్లెలు అస్సాంలో కోకొల్లలు. నామమాత్రంగానైనా పాఠశాలలున్నచోట చదువుకునే బాలికల శాతం తక్కువ. ఆడపిల్లలకు చిన్నవయసులో పెళ్లి చేస్తే అది వారికి రక్షణగా ఉంటుందని భావించే కుటుంబాలకు కొదవలేదు. దశాబ్దాల నిర్లక్ష్యం పుణ్యమా అని మన దేశంలో గ్రామీణ మహిళల్లో చదువు కున్నవారి సంఖ్య స్వల్పం. గ్రామీణ అస్సాంలో 74 శాతంమంది మహిళలు పట్టుమని పదేళ్లు కూడా బడి చదువులకు పోలేదంటే ఏమనుకోవాలి? ఆడపిల్లకు చదువు చెప్పిస్తే ఆమెకు ఉజ్వల భవిష్యత్తుంటుందన్న అవగాహన కలుగుతుందా? నిరక్షరాస్యతతోపాటు పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, బాలి కల రక్షణ, భద్రతలపై ఉండే దిగులు, ఇతర సామాజిక దురాచారాలు బాల్యవివాహాలకు కారణమవుతున్నాయి. ఈ సమస్యల్లో ఏ ఒక్కదాన్నీ పరిష్కరించే ప్రయత్నం చేయకుండా కేవలం పోలీసుల సాయంతో బాల్య వివాహాలను అరికట్టాలనుకోవటం మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా బాలికల విద్యకు ప్రోత్సాహాలనందిస్తే బడికొచ్చే ఆడపిల్లల సంఖ్య పెరుగుతుంది. అలాగే పాఠశాలల్లో మరుగుదొడ్లు మొదలుకొని ఉపాధ్యాయుల నియామకం వరకూ శ్రద్ధ తీసుకుంటే నాణ్యమైన విద్య అందటంతోపాటు ఆడపిల్లలు సురక్షితంగా చదువుకోవటం వీలవుతుందన్న భరోసా కుటుంబాలకు కలుగు తుంది. కానీ నీతి ఆయోగ్ ‘హేతుబద్ధీకరణ’ సూచనతో నిరుడు సెప్టెంబర్‌లో అస్సాంలో 1,700 స్కూళ్లు మూసివేయటమో, సమీప పాఠశాలలతో విలీనం చేయ టమో చేశారు. ఈ స్థితిలో ఆడపిల్లలను ఎక్కడో దూరంలో ఉన్న బడికి పంపటానికి తల్లిదండ్రులు సిద్ధపడతారా? ఇక ఉన్నత పాఠశాలల విషయానికొస్తే అస్సాంలో మారుమూల ప్రాంతాల్లో అవి చాలా తక్కువ. ఎన్నో కిలోమీటర్లు నడిచి వెళ్తే తప్ప చదువుకోవటం సాధ్యంకాదు. ఈ పరిస్థితుల్లో ఆడపిల్లకు ప్రమాదం ఎదురుకావొచ్చన్న భయంతో సహజంగానే కుటుంబాలు ఇక వారి చదువుకు స్వస్తిచెబుతాయి. ఇలా బడి మానేసిన పిల్లలకు ఇక పెళ్లే ప్రత్యామ్నాయంగా మారుతోంది. చిన్న వయసులో పెళ్లిళ్లయి గర్భందాల్చిన కారణంగా ఆడపిల్లలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. గర్భస్రావాలు తప్పడం లేదు. గర్భం నిలబడినా తక్కువ బరువుతో జన్మించటం, మృత శిశు జన నాలు, పుట్టిన శిశువులు కొన్ని వారాలలోపే మరణించటం వంటివి అధికంగా ఉంటున్నాయి. ఇరవై య్యేళ్ల వయసు తర్వాత పెళ్లయ్యే బాలికలకు జన్మించే శిశువులకంటే, అంతకన్నా తక్కువ వయసు వారికి పుట్టిన శిశువుల్లో మరణాలు 50 శాతం ఎక్కువని యునిసెఫ్ నివేదిక చెబుతోంది. బాల్యవివాహాలను తక్షణం అరికట్టవలసిన సామాజిక సమస్యగా గుర్తించటం బాగున్నా,అందుకోసం అస్సాం ప్రభుత్వం ఎంచుకున్న మార్గం ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇందువల్ల ఆ సమస్య మరింత జటిలమవుతుందే తప్ప తగ్గదు. ఇప్పుడు వేలాదిమంది అరెస్టయిన పర్యవసానంగా మగదిక్కులేక, రోజు గడవటం ఎలాగో, తిండితిప్పలకు ఏంచేయాలో తెలియక మహిళలు అవస్థలు పడుతున్నారు. బాల్యవివాహాలను అరికట్టడానికి ఆల్ అస్సాం మైనారిటీ స్టూడెంట్స్ యూనియన్ వంటివి చాన్నాళ్లుగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో దాడులు జరుగుతున్నా వెనక్కి తగ్గటంలేదు. అలాంటి సంస్థలకు చేయూతనందించటం... పేదిరిక నిర్మూలనకూ, విద్యారంగం పటిష్టతకూ అవసరమైన పథకాలు అమలు చేయటం ముఖ్యమని అస్సాం ప్రభుత్వం గుర్తించాలి. ఒక సామాజిక సమస్యను నేరపూరితం చేయటం వల్ల జైళ్లు నిండుతాయి తప్ప ఫలితం శూన్యం. -
Child Marriages: ఏకంగా 18 వందల మంది అరెస్టు!
బాల్యవివాహాలపై ఉక్కుపాదం మోపింది అస్సాం ప్రభుత్వం. ఈ బాల్యవివాహాలను పూర్తిగా అణిచివేయాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పిలుపునిచ్చారు. ఈ విషయంలో పోలీసులు ఓపికతో వ్యవహరించొద్దని చెప్పారు. జీరో టోలరెన్సే లక్ష్యంగా ఈ బాల్యవివాహాలకు చెక్‌పెట్టేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అలాగే బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు ఈ విషయమై అస్సాం వ్యాప్తంగా సుమారు 1800 మందిని అరెస్లు చేసినట్లు తెలిపారు., ఈ మేరకు ముఖ్యమంత్రి బిస్వా ట్విట్టర్లో.."బాల్య వివాహాలను అంతం చేయాలనే సంకల్పంలో అస్సాం ప్రభుత్వం చాలా దృఢంగా ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని అందుకు అందరూ సహకిరించాల్సిందిగా కోరుతున్నా. ఈ పక్షం రోజుల్లోనే అస్సాంలో దాదాపు 4 వేల కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 3 నుంచి ఆ కేసులపై చర్యలు తీసుకుంటాం" అని చెప్పారు. ఈ బాల్య వివాహాల విషయంలో నిందితుల పట్ల దయాదాక్షిణ్యాలు చూపించవద్దని నొక్కి చెప్పారు. దీనిపై యుద్ధం సెక్యులర్‌గా ఉంటుందని, ఏ ఒక్క వర్గాన్ని లక్ష్యంగా చేసుకోబోమని వెల్లడించారు. అంతేగాదు ఈ విషయాలను ప్రోత్సహించే మత పెద్దలు, పురోహితులపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదీగాక అస్సాం మత్రి వర్గం 14 ఏళ్ల లోపు పిలల్లను పెళ్లి చేసుకున్న వ్యక్తులపై పోస్కో చట్టం, బాల్యవివాహాల చట్టం కింద అబియోగాలు మోపి అరెస్టు చేయాలని అస్సాం మంత్రి వర్గం గట్టిగా నిర్ణయించింది ఈ నేపథ్యంలోనే ముఖ్యమంతి ఈ చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వాస్తవానికి అస్సాంలో మాతా, శిశు మరణాల రేటు ఎక్కువగా ఉంది. దీనికి బాల్యవివాహాలు ప్రధాన కారణం. అదీగాక రాష్ట్రంలో సగటున 31 శాతం మందికి చిన్న వయసులోనే వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం. (చదవండి: రన్నింగ్ ఎయిర్ ఇండియా విమాన ఇంజిన్‌లో మంటలు.. అలర్ట్ అయిన పైలట్) -
మాతృత్వానికి తగిన వయస్సు ఉండాల్సిందే!: అసోం సీఎం
గువాహతి: అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాల్య వివాహాల కట్టడికి తమ రాష్ట్రంలో కఠిన చట్టం తేబోతున్నట్లు ప్రకటించిన ఆయన.. మాతృత్వానికి తగిన వయసు ఉండాల్సిందేనని, లేకుంటే సమస్యలు తప్పవని మహిళలకు సూచించారు. అసోంలో ప్రతీ వందలో 31 పెళ్లిళ్లు.. నిషేధించిన వయసు వాళ్ల వివాహాలే కావడం గమనార్హం. ఈ తరుణంలో.. శనివారం ప్రభుత్వం తరపున నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాలు, చిన్నవయసులోనే మాతృత్వంలాంటి అంశాల కట్టడికి కఠిన చట్టాలు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైందని ప్రకటించారాయన. మాతృత్వానికి తగిన వయసు ఉండాల్సిందేనన్న ఆయన.. లేకుంటే ఆరోగ్యపరమైన సమస్యలు తప్పవని మహిళలకు సూచించారు. ‘‘మహిళలు మాతృత్వం కోసం మరీ ఎక్కువ కాలం ఎదురు చూడడం సరికాదు. దానివల్ల సమస్యలు వస్తాయి. మాతృత్వానికి తగిన వయసు 22 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపే’’ అని తెలిపారాయన. ఇంకా పెళ్లికాని వారుంటే ఇది తప్పక పాటించండి అని చిరునవ్వుతో సూచించారు. ఇక బాల్యవివాహాల కట్టడికి తీసుకోబోయే చర్యల గురించి స్పందిస్తూ.. ‘‘రాబోయే ఐదారు నెలల్లో.. వేల మంది పురుషులు కటకటాల పాలు కాకతప్పదు. ఎందుకంటే పద్నాలుగేళ్లలోపు బాలికలతో శారీరకంగా కలవడం నేరం కాబట్టి. వాళ్లు తాము భర్తలమని నిరూపించుకున్నా సరే!. చట్ట ప్రకారం.. వివాహ వయసు 18 ఏళ్లు. కాదని అంతకన్నా తక్కువ వయసులో ఉన్నవాళ్లను వివాహాలు చేసుకుంటే జీవిత ఖైదు తప్పదు అని అసోం సీఎం హెచ్చరించారు. చిన్నవయసులో మాతృత్వం కట్టడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ, అదే సమయంలో మహిళలు తల్లి కావడానికి ఎక్కువ ఏండ్లు తీసుకోవద్దు. ఎందుకంటే.. దేవుడు మన శరీరాలను తగిన వయసులో తగిన పనుల కోసమే సృష్టించాడు కాబట్టి అని సీఎం బిస్వా శర్మ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. పద్నాలుగేళ్లలోపు బాలికలను వివాహం చేసుకుంటే గనుక.. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని అసోం కేబినెట్ సోమవారం ఓ నిర్ణయం తీసుకుంది. అలాగే.. 14 నుంచి 18 ఏళ్లలోపు వాళ్లను వివాహం గనుక చేసుకుంటే బాల్యవివాహ నిర్మూలన చట్టం 2006 ప్రకారం కేసు నమోదు చేస్తారు. -
సాక్షి కార్టూన్ 23-01-2023
ఊర్కోండి సార్! రాత్రి మీకు కలొచ్చినట్లుంది అంతే! లైట్ తీస్కోండీ!! -
షారుఖ్ ఖానా? అతనెవరు?: అసోం సీఎం
గువహతి: షారూఖ్ ఖానా? అసలు అతనెవరు? అతని గురించి నాకేం తెలియదు. అతని సినిమా పఠాన్ గురించి కూడా నాకేం తెలియదు.. ఈ కామెంట్లు చేసింది ఎవరో కాదు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ. శనివారం గువాహతిలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాకు ఈ సమాధానాలు ఇచ్చారు. పఠాన్ సినిమాను అడ్డుకుంటామని బజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. అక్కడి మీడియా అసోం సీఎంను స్పందించాలని కోరింది. దీనికి ఆయన బదులిస్తూ.. షారూఖ్ ఖాన్ ఎవరని, ఆ సినిమా గురించి కూడా తనకు తెలియదని సమాధానం ఇచ్చారు. ‘‘బాలీవుడ్ నుండి చాలా మంది తమ సమస్యల గురించి ఫోన్ చేశారు. కానీ, ఆ ఖాన్ ఎవరో నాకు ఫోన్ చేయలేదు. ఒకవేళ అతను గనుక చేస్తే.. విషయాన్ని పరిశీలిస్తా’’ అని సీఎం హిమంత మీడియాకు తెలిపారు. నరెంగిలో శుక్రవారం సాయంత్రం పఠాన్‌ను ప్రదర్శించబోయే ఓ థియేటర్‌పై బజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేసి.. పోస్టర్లను చించేసి దహనం చేశారు. ఈ పరిణామంపై స్పందించిన సీఎం.. శాంతి భద్రతలకు ఎవరు భంగం కలిగించినా ఊరుకునేది లేదని, ఘటనకు సంబంధించి కేసు నమోదు అయ్యిందని.. చర్యలుంటాయని సమాధానం ఇచ్చారు. ఇక షారూఖ్ ఖాన్ అంటే.. బాలీవుడ్ సూపర్ స్టార్ అని విలేకరులు చెప్పగా.. రాష్ట్ర ప్రజలు అస్సామీ చిత్రాల గురించి ఆలోచించాలే తప్ప.. హిందీ చిత్రాల గురించి కాదని చెప్పారు. దివంగత నిపోన్ గోస్వామి దర్శకత్వం వహించిన డాక్టర్ బెచ్బరౌవా-పార్ట్2(అస్సామీ చిత్రం) త్వరలో విడుదల కాబోతోందని, ప్రజలంతా ఆ సినిమా చూడాలని ఆయన అసోం ప్రజలకు పిలుపు ఇచ్చారు. యాక్షన్ చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో షారూఖ్ ఖాన్, జాన్ అబ్రహం, దీపికా పదుకునే ప్రధాన పాత్రల్లో తెరకెక్కింది పఠాన్. ఈ చిత్రం జనవరి 25వ తేదీన దేశవ్యాప్తంగా రిలీజ్ కానుంది. బేషరమ్ రంగ్ అనే పాటలో కాషాయం రంగు బికినీ ధరించిందని, అది హిందుత్వాన్ని కించపరిచినట్లేనని చెబుతూ వీహెచ్‌పీ సహా హిందూ అనుబంధ సంఘాలు ఈ చిత్రాన్ని నిషేధించాలని పట్టుబడుతున్నాయి. -
Viral Video: చిన్నారులతో హుషారుగా డ్యాన్స్ వేసిన అసోం సీఎం హిమంత బిస్వా శర్మ
-
చిన్నారులతో కలిసి హుషారుగా గంతులేసిన సీఎం
దిస్పూర్: నిత్యం తన స్టేట్మెంట్లతో, దూకుడు నిర్ణయాలతో వార్తల్లో నిలిచే అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ.. హుషారుగా జానపద నృత్యంతో ఆకట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం తన నివాసంలో జరిగిన ఓ ఈవెంట్లో ఆయన సందడి చేశాడు. అంతేకాదు.. ఆ వీడియోను స్వయంగా ఆయనే ట్విటర్లో పోస్ట్ చేశారు. ఝుమూర్ ప్రదర్శనను చూస్తూ ఉండలేకపోయా అంటూ తన ఉత్సాహాన్ని చెప్పకనే చెప్పారాయన. హతింగా టీఈ మోడల్ స్కూల్ విద్యార్థులు.. సీఎం స్వగృహంలో ఆదివారం సాయంత్రం పలు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ముందుగా అస్సాం టీ తోటల్లో పని చేసే వాళ్ల సంప్రదాయ నృత్యం ‘ఝూమూర్’ ప్రదర్శన ఇచ్చారు. అందులో ఆయన సైతం వాళ్లతో కలిసి డ్యాన్స్‌లు చేశారు. ఈ సందర్భంగా.. వాళ్లను ఉత్సాహపరిచే ఉద్దేశంతో స్టేజ్ ఎక్కిన సీఎం హిమంత శర్మ.. స్టెప్పులేశారు. ఆయన్ని చూసి మరికొందరు విద్యార్థినిలు స్టేజ్ ఎక్కారు. ఇక శర్మ భార్య రింకీ భూయాన్ శర్మ కూడా వాళ్లతో కలిశారు. ఈ కార్యక్రమానికి జానపద సంగీత వాయిద్యకారులు పద్మశ్రీ దులాల్ మాన్‌కీ, ప్రముఖ సింగర్ గీతాంజలి దాస్ సైతం హాజరై ప్రదర్శన ఇచ్చారు. కార్యక్రమం తర్వాత సీఎం హిమంత శర్మ.. విద్యార్థులతో కలిసి డిన్నర్ చేశారు. An evening to cherish! Couldn't help but join the students of Hatinga TE Model School of Biswanath performing jhumur at my residence. pic.twitter.com/rsZXzhB1vK — Himanta Biswa Sarma (@himantabiswa) January 9, 2023 -
అదొక్కటే ప్రమాణం కాదు! డీలిమిటేషన్‌పై అస్సాం సీఎం కీలక వ్యాఖ్యలు
డీలిమిటేషన్‌పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన నియోజకవర్గాల విభజనకు జనాభా మాత్రమే ప్రాతిపదిక కాకూడదని హిమంత బిస్వాశర్మ అన్నారు. కొత్తగా రూపొందించిన నాలుగు జిల్లాల విలీనానికి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించిన ఒకరోజు తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి డీలిమిటేషన్ కోసం జిల్లాల విలీనానికి మంత్రి వర్గం ఆమోదం తెలపలేదని, కేవలం పరిపాలనపరమైన చర్యల కోసమే అలా చేశామని తేల్చి చెప్పారు. ఐతే ఈ డీలిమిటేషన్ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఈ విషయమై తాము పార్లమెంటు చేసిన చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలని చెప్పారు. అలాగే జనాభాను నియంత్రించమని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను కోరిందని, కానీ కొన్ని ప్రాంతాల్లో దీన్ని పాటించలేదని ముఖ్యమంతి హిమంత బిస్వా శర్మ అన్నారు. అంతేగాదు తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతానికి ప్రస్తుత చట్టం ప్రీమియం ఇస్తుంది కాబట్టి పార్లమెంటులో ఈ విషయంపై చర్చ జరగాలన్నారు. ఈ డీలిమిటేషన్ అనేది దేశంలో లేదా శాసన సభ ఉన్న రాష్ట్రంలో ప్రాదేశిక నియోజకవర్గాల పరిమితులు లేదా సరిహద్దులను నిర్ణయించే ప్రక్రియ. కానీ ఇది స్వదేశీయుల హక్కులను, భవిష్యత్తును రక్షించలేకపోయిందని అన్నారు. ఈ డీలిమిటేషన్ కసరత్తు మన సమాజాన్ని కాపాడుతుందని, అలాగే అసెంబ్లీ లోపల జనాభా మార్పును కాపాడుతుందని అన్నారు. దీన్ని రాజకీయేతర రాజ్యంగ కసరత్తుగా అభివర్ణించారు. కాగా విలీన ప్రణాళిక ప్రకారం..బిస్వనాథ్ జిల్లాను సోనిత్‌పూర్‌లో, హోజాయ్ను నాగావ్‌లో, తముల్పూర్ జిల్లాను బక్సాలో, బజలి జిల్లాను బార్పేట జిల్లాలో విలీనం చేశారు. ప్రస్తుతం అస్సాంలో డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతున్నందున జనవరి 1, 2023 నుంచి అస్సాం ప్రభుత్వం ఏ జిల్లాలు లేదా పరిపాలన విభాగాలలో ఎటువంటి మార్పులు చేయకూడదని నిర్దేశిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: ఘోర అగ్నిప్రమాదం..పలువురికి తీవ్ర గాయాలు) -
పరువు నష్టం కేసు.. సిసోడియాకు సుప్రీం హెచ్చరికలు
న్యూఢిల్లీ: ఆప్ ముఖ్య నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సుప్రీం కోర్టు తీవ్రంగా మందలించింది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ దాఖలు చేసిన పరువు నష్టం కేసును కొట్టేయాలంటూ గువాహతి హైకోర్టును సిసోడియా ఆశ్రయించారు. అయితే కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎస్కే కౌల్, ఏఎస్ ఓకా నేతృత్వంలోని బెంచ్ సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. వాదనల సమయంలో ‘‘బహిరంగ చర్చను ఈ స్థాయికి తగ్గిస్తే పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అంటూ ఈ సందర్భంగా సిసోడియా న్యాయవాది ఏఎం సింఘ్వీని ఉద్దేశించి బెంచ్ వ్యాఖ్యానించింది. కరోనా లాంటి కష్టకాలంలో.. దేశం ఎదుర్కొన్న పరిస్థితులను చూసి కూడా, పిటిషనర్(మనీశ్ సిసోడియాను ఉద్దేశించి..) తీవ్ర ఆరోపణలు చేశాడంటూ బెంచ్ అభిప్రాయపడింది. దీంతో సింఘ్వీ తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. అయినప్పటికీ పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండడంటూ బెంచ్ హెచ్చరించింది. కరోనా మొదటి వేవ్ సమయంలో.. మార్కెట్ రేట్ల కంటే ఎక్కువ ధరకు పీపీఈ కిట్స్‌ను నేషనల్ హెల్త్ మిషన్‌కు సరఫరా చేయడం ద్వారా భారీ కుంభకోణానికి పాల్పడ్డారంటూ హిమంత బిస్వా శర్మపై సిసోడియా ఆరోపణలు గుప్పించారు. ఆ సమయంలో శర్మ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారని, ఆయన భార్యకు చెందిన కంపెనీకి ఆర్డర్లు కట్టబెట్టారంటూ సిసోడియా ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలను కొట్టిపారేసిన శర్మ.. స్థానిక కోర్టులో(అసోం) క్రిమినల్ పరువు నష్టం దావా కేసు వేశారు. ఆ కేసును కొట్టేయాలంటూ గువాహతి హైకోర్టులో సిసోడియా ఒక పిటిషన్ దాఖలు చేయగా.. నవంబర్ 4వ తేదీన కోర్టు సిసోడియా పిటిషన్‌ను తిరస్కరించింది. ఆప్ నేత ఎక్కడా కూడా డబ్బులు తీసుకున్నట్లు పేర్కొనలేదని సుప్రీంలో సీనియర్ న్యాయవాది సింఘ్వీ పేర్కొన్నారు. అయితే చర్చను ఈ స్థాయికి తగ్గిస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కోర్టు మందలించడంతో పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారాయన. -
‘రాహుల్ గాంధీ.. ఇరాక్ సద్దాం హుస్సేన్‌లా ఉన్నారు’
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేల పొలిటికల్ లీడర్ల మధ్య మాటల యుద్ధం పెరిగింది. అధికార బీజేపీ మరోసారి అధికారం కోసం సరికొత్త ప్రచారంతో ముందుకు సాగుతోంది. అటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా ఓటర్లను తమ వైపు ఆకర్షించుకునేందుకు ప్లాన్స్ రచిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం హిమంత.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై స్పందించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌తో పోల్చారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం సద్దాం హుస్సేన్‌లా కనిపిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకుల పద్ధతులు భారతీయ సంస్కృతికి దూరంగా ఉంటాయి. వారు ఎల్లప్పుడూ ఇతరుల సంస్కృతులను స్వీకరించడానికి ప్రయత్నిస్తారు అని వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చేరడానికి బాలీవుడ్ తారలకు కాంగ్రెస్ డబ్బు చెల్లించిందని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇక, అంతుకుముందు కూడా హిమంత.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్‌కు ఓటు వేసిన వ్యక్తులు త్వరలో బీజేపీలో చేరుతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక, బీజేపీ సీఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్ అటాక్ ఇచ్చింది. ప్రధాని మోదీ కూడా గడ్డం పెంచుకున్నప్పుడు ఆయనపై మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అలాగే, మేము నిజమైన సమస్యల గురించి మాత్రమే మాట్లాడుతాము. అసలు విషయాలను పక్కదారి పట్టించడం బీజేపీ నేతలకు మాములే అంటూ ఎద్దేవా చేశారు. భారత్ జోడో యాత్రకు వస్తున్న ఆదరణ చూసి బీజేపీ ఉలిక్కిపడుతోందని అన్నారు. Rahul Gandhi looks like Saddam Hussein, says Assam CM Himanta Sarma#RahulGandhi #SaddamHussein #HimantaBiswaSarma #Congress #BJP #Gujarat #BharatJodoYatra https://t.co/u0Of4sOXXn — NewsDrum (@thenewsdrum) November 23, 2022 -
అస్సాం-మేఘాలయ బార్డర్ చిచ్చు.. ఆరుగురి మృతి.. ఇంటర్నెట్ బంద్
సరిహద్దులో కాల్పుల ఘటన ఉద్రిక్తతలతో మేఘాలయ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఏడు జిల్లాల్లో 48 గంటలపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అసోం(పూర్వ అస్సాం)-మేఘాలయ సరిహద్దు వెంట జరిగిన కాల్పుల్లో రాష్ట్రానికి చెందిన ఐదుగురు మరణించారు. దీంతో.. సోషల్ మీడియాలో వందతులు వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇరు రాష్ట్రాల సరిహద్దులో పశ్చిమ జైంటియా హిల్స్ వద్ద అక్రమ కలప రవాణాను అడ్డుకునే క్రమంలో ఘర్షణలు తలెత్తినట్లు తెలుస్తోంది. అస్సాం పోలీసులు-ఫారెస్ట్ అధికారులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మేఘాలయకు చెందిన వ్యక్తులతో పాటు ఘర్షణల్లో అస్సాంకు చెందిన ఓ ఫారెస్ట్ గార్డు చనిపోయినట్లు మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా మంగళవారం వెల్లడించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. ఈ ఉదయం(మంగళవారం) 10.30 నుంచి 48 గంటలపాటు ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపిన మేఘాలయ పోలీసులు.. ఎఫ్ఐఆర్ నమోదు అయినట్లు వెల్లడించారు. మరోవైపు అసోం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో మాత్రం ఉద్రిక్తతలు చల్లారడం లేదు. మంగళవారం ఉదయం అక్రమ కలప రవాణా చేస్తున్న ట్రక్కును అడ్డగించడంతో అస్సాం-మేఘాలయ సరిహద్దులో హింస చెలరేగింది. అసోం పరిధిలోని పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని ముక్రు ప్రాంతంలో అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో.. మేఘాలయలోని పశ్చిమ జైంటియా హిల్స్ జిల్లా ముఖో వైపు అక్రమంగా కలప తరలిస్తున్న టింబర్‌ను అసోం అటవీ శాఖ బృందం అడ్డుకుంది. ఈ క్రమంలో వాళ్లు పారిపోయే క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఈ ఘటన తర్వాత ఫారెస్ట్ సిబ్బంది జిరికెండింగ్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని భద్రతను పెంచారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న తర్వాత.. మేఘాలయ నుంచి ఆయుధాలతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉదయం ప్రాంతంలో అక్కడకు వచ్చారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ఫారెస్ట్ గార్డులు, పోలీసు సిబ్బందిపై దాడి చేశారని తెలిపారు. ఈ క్రమంలోనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కాల్పులు జరపాల్సి వచ్చిందని అస్సాం పోలీసులు వివరణ ఇచ్చుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉండగా.. మేఘాలయ సరిహద్దు పంచుకుంటున్న జిల్లాల్లో అసోం పోలీసులు భద్రతను పెంచారు. ఐదుగురు కూడా బుల్లెట్ గాయాలతో మరణించారా లేదా మరేదైనా ఆయుధం తగలడంతో మృతిచెందారా? అసోం ఫారెస్ట్ మరణానికి కారణం ఏంటన్న దానిపై అసోం పోలీసుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. అస్సాం గార్డులే మొదటగా టింబర్ల టైర్లను కాల్చారని చెప్తున్నారు. నలుగురు ఘటనా స్థలంలోనే మరణించగా.. మరొకరు చికిత్స పొందుతూ చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో ఫారెస్ట్ గార్డు గాయపడి మరణించినట్లు సమాచారం. 1972లో మేఘాలయ అస్సాం నుండి వేరు అయ్యింది. అప్పటి నుంచి అస్సాం పునర్వ్యవస్థీకరణ చట్టంపై చర్చ నడుస్తూనే వస్తోంది. ఇరు రాష్ట్రాలు గతేడాది ఆగస్టులో మూడు ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని ఈ సమస్య పరిష్కారానికి సిద్ధం అయ్యాయి. ఇరు రాష్ట్రాల సీఎంలు.. ఓ డ్రాఫ్ట్ రెజల్యూషన్‌ను హోం మంత్రి అమిత్ షాకు జనవరి 31వ తేదీన సమర్పించాయి. ఒప్పందాల నడుమే ఉద్రిక్తతలు ఇరు రాష్ట్రాలకు సంబంధించి 884.9 కిలోమీటర్ల సరిహద్దు వెంట 12 వివాదాస్పద ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో ఆరింటికి సంబంధించి పరిష్కారం కోసం మార్చి నెలలో.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా ఒక ఒప్పందం చేసుకున్నారు. దీంతో.. ఐదు దశాబ్దాల నాటి వివాదాన్ని ఓ కొలిక్కి వస్తుందని అంతా అనుకున్నారు. ఇక.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఈ ఒప్పందం చారిత్రాత్మకమని, సంతకంతో 70% వివాదం పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. ఆగస్టులో మిగిలిన ప్రాంతాల్లో వివాదాన్ని పరిష్కరించేందుకు శర్మ, సంగ్మా చర్చలు జరిపారు. అవి ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఈలోపు.. అస్సాం 18.51 స్క్వేర్ కిలోమీటర్లు, మేఠాలయా 18.21 స్క్వేర్ కిలోమీటర్లు ఉంచేసుకోవాలని ప్రతిపాదించాయి. తొలిదశలో 36 గ్రామాలకు సంబంధించి ఒప్పందం కుదిరింది కూడా. ఇదిలా ఉంటే.. మిజోరాంతోనూ గతంలో ఇలాగే సరిహద్దు విషయంలో ఘర్షణలు తలెత్తాయి. 2021లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు అస్సాం పోలీసులు దుర్మరణం పాలయ్యారు. -
ఆ ఖడ్గమృగం ఇప్పుడు ఎలా ఉంది?.. వీడియో షేర్ చేసిన సీఎం
డిస్పూర్: రోడ్డుపై వేగంగా వెళ్తున్న భారీ ట్రక్కును ఓ ఖడ్గమృగం ఢీకొట్టిన వీడియో ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. లారీని ఢీకొట్టిన ఆ రైనో పడుతూ లేస్తూ అడవిలోకి వెళ్లింది. ఈ సంఘటన అస్సాంలోని కజిరంగలో హల్దీబారీ రహదారి వద్ద జరిగింది. అయితే, ఇప్పుడు ఆ ఖడ్గమృగం ఎలా ఉంది? గాయాలై ఇబ్బందులు పడుతోందా? అనే విషయంపై ఆందోళనలు నెలకొన్నాయి. లారీని ఢీకొట్టిన ఖడ్గమృగం పరిస్థితిపై వీడియోను ట్విటర్లో షేర్ చేశారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. ‘అర్జెంట్ అప్డేట్.. హల్దీబారీలో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన మన రైనో ఫ్రెండ్ ఆరోగ్యంగానే ఉంది. ఈ ఉదయం డ్రోన్ ద్వారా తీసిన వీడియోను షేర్ చేస్తున్నా. జంతువుల పట్ల ప్రతి ఒక్కరు ప్రేమగా ఉండాలని కోరుతున్నా. జంతువులు రోడ్డు దాటే కారిడార్ల వద్ద కాస్త నెమ్మెదిగా వెళ్లండి’ అని పేర్కొన్నారు సీఎం హిమంత బిశ్వ శర్మ. అంతకు ముందు జాతీయ రహదారి 37పై జరిగిన ఈ ప్రమాదం వీడియోను షేర్ చేస్తూ.. ఇలాంటి ప్రమాదలు నివారించేందుకు కారిడార్లను విస్తరిస్తున్నట్లు చెప్పారు. An urgent update: Our Rhino friend, who met with an accident in Haldibari recently, is found to be doing good. I am sharing a drone video taken this morning. Urge all to be kind to our animals. Go slow while passing through corridors, where you know some animals might cross. pic.twitter.com/utgKwhUPXh — Himanta Biswa Sarma (@himantabiswa) October 11, 2022 ఇదీ చదవండి: భారీ ట్రక్కుని ఢీ కొట్టిన ఖడ్గమృగం.... డ్రైవర్‌కి ఊహించని షాక్ -
అసోం సీఎం హిమంత, సద్గురుపై కేసు
దిస్పూర్: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌పై కేసు నమోదైంది. ఆదివారం కాజీరంగ జాతీయ పార్కులో సూర్యాస్తమయం తర్వాత వీరు జీపులో సఫారీ యాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇది వన్యప్రాణుల పరిరక్షణ చట్టం నిబంధనలకు విరుద్దమని పార్కు సమీపంలోని గ్రామస్థులు బోకాఖాట్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు నమోదైంది వాస్తవమేనని పోలీసులు తెలిపారు. అయితే ఆ పార్కు అటవీ శాఖ కిందకు వస్తుందని, అందుకే ఆ అధికారులను స్టేటస్ రిపోర్టు కోరినట్లు చెప్పారు. దీనిపై అటవీ అధికారులు స్పందిస్తూ.. కేసు పెట్టే హక్కు ప్రజలకు ఉందని చెప్పారు. అయితే సీఎం అధికారిక కార్యక్రమంలో భాగంగానే సఫారీ యాత్రకు వెళ్లారని, ఇది నిబంధనలను అతిక్రమించినట్లు కాదని తాము భావిస్తున్నట్లు చెప్పారు. కొన్నిసార్లు సీఎం కార్యక్రమాలు ఆలస్యం అవుతాయని గుర్తుచేశారు. ఈ ఘటనపై సీఎం హిమంత స్పందించారు. జాతీయ పార్కులోకి సూర్యాస్తమయం తర్వాత వెళ్లవద్దని చట్టంలో ఎక్కడా నిబంధన లేదని చెప్పారు. అధికారుల అనుమతితోనే తాను సఫారీ యాత్రలో పాల్గొన్నట్లు స్పష్టం చేశారు. అనుమతి ఉంటే ఉదయం 2గంటలకు కూడా పార్కులోకి వెళ్లొచ్చని పేర్కొన్నారు. సీఎం, సద్గురుతో పాటు వారితో వెళ్లిన మంత్రి, ఇతరులపైనా కేసు పెట్టారు గ్రామస్థులు. చట్టాన్ని ఉల్లంఘించినందుకు వీరందరినీ వెంటనే అరెస్టు చేయాలన్నారు. లేకపోతే అందరూ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి: నా చేతుల్లో ఏం లేదు.. అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు! -
భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అస్సోం సీఎం
చార్మినార్: తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒకే కుటుంబం మాత్రమే బాగుపడుతోందని..ఇది సరైన పద్ధతి కాదని అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా అన్నారు. శుక్రవారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించిన ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి సామూహిక హారతిలో పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని కుటుంబాలు బాగుపడితేనే ఆర్థిక అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రస్తుతం ఇక్కడ కేవలం ఒక కుటుంబం మాత్రమే బాగుపడుతోందని....ఇది సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. -
స్టేజ్ ఎక్కి.. మైక్ లాక్కొని.. అస్సాం సీఎంను నిలదీసే యత్నం!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు శుక్రవారం వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనడానికి వచ్చిన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టమైంది. మొజంజాహి (ఎంజే) మార్కెట్ వద్ద హిమంత ఉన్న వేదిక పైకి టీఆర్ఎస్ నేత నంద కిషోర్ వ్యాస్ దూసుకువెళ్లారు. ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు ప్రసంగిస్తుండగా అడ్డుకుని మైక్ లాగా రు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఎంజే మార్కెట్ ప్రాంతానికి చేరుకోవడానికి ముందు హిమంత చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. అక్కడి నుంచి ఎంజే మార్కెట్ వద్దకు చేరుకున్న హిమంత ఉత్సవ సమితి వేదిక పైకి ఎక్కారు. ఆ సమయంలో భగవంతరావు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అప్పుడు వేదిక పైకి దూసుకెళ్లిన నంద కిషోర్.. భగవంతరావు మైకును పక్కకు లాగారు. పక్కనున్న హిమంతను నిలదీసేందుకు ప్రయత్నించారు. వేదికపై ఉన్న సమితి నేతలు అప్రమత్తమై నంద కిషోర్‌ను బలవంతంగా స్టేజ్ కిందకు తీసుకుపోయారు. అక్కడే ఉన్న మహిళా భక్తులు నంద కిషోర్‌పై అసహనం వ్యక్తం చేయడంతోపాటు ఆయనపై దాడికి ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గులాబీ కండువా ధరించిన నంద కిషోర్ ముఖ్యమంత్రి ఉన్న వేదికపైకి వెళ్తున్నా పోలీసులు అడ్డుకోలేదంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు మార్కెట్ దగ్గర ఫ్లెక్సీ వివాదం చెలరేగింది. టీఆర్ఎస్ నేతలు, హిమంతకు పోటీగా మంత్రి తలసాని ఫ్లెక్సీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఉత్సవ సమితి సభ్యులు, టీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. బండి సంజయ్, డీకే అరుణ ఖండన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మను మాట్లాడనీయకుండా టీఆర్ఎస్ నేత మైక్ లాక్కోవడం హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే ఆరుణ వేర్వేరు ప్రకటనల్లో మండిపడ్డారు. హిమంతపై దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ నేతను అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు పెట్టాలని, ఈ దాడికి పురిగొల్పిన రాష్ట్ర మంత్రులపైనా కేసు నమోదు చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసింగ్ గురించి గొప్పలు చెప్పుకునే కేసీఆర్, అస్సాం సీఎంకు సరైన భద్రత కల్పించలేక పోవడం సిగ్గుచేటని అరుణ విమర్శించారు. కుటుంబ పార్టీలు దేశం కోసం ఆలోచించవు: హిమంత తెలంగాణలో ఒక్క కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందుతోందని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ విమ ర్శించారు. ప్రభుత్వం అనేది ప్రజలందరి కోసం పనిచేయాలి గానీ, ఒక కుటుంబం కోసం కాదన్నారు. కుటుంబ పార్టీలు కొడుకు, కూతురు గురించి తప్ప దేశం కోసం ఆలోచించవని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు మంచి జరగాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని, గణపతిని కోరుకున్నట్లు చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశ ప్రజల్ని ఏకం చేయడానికి కేసీఆర్‌కు మరో 50 ఏళ్లు పడుతుందేమోనని ఎద్దేవాచేశారు. రాహుల్‌గాంధీకి నిజంగా దేశ భక్తి ఉంటే 1947లో ఎక్కడైతే విభజన జరిగిందో అక్కడ భారత్ జోడో యాత్ర చేయాలని వ్యాఖ్యానించారు. ఎక్కడైతే జోడించాలో అక్కడ ఆ పనిచేయాలి తప్ప పటిష్టంగా ఉన్న దేశంలో ‘భారత్ జోడోలు’ ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో వినాయక శోభాయాత్రను చూడటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కేసీఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదు అబిడ్స్: సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదని టీఆర్ఎస్ నాయకుడు నందకిశోర్ వ్యాస్ (నందుబిలాల్) పేర్కొన్నారు. కేసీఆర్‌ను విమర్శించినందుకే తాను మైకు లాక్కున్నానని చెప్పారు. అబిడ్స్ పోలీస్‌స్టేషన్ దగ్గర నందకిశోర్ మీడియాతో మాట్లాడుతూ.. గణేశ్ ఉత్సవాలకు వచ్చిన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ఆధ్యాత్మిక భావంతో, దేవుడిపైనే ప్రసంగించాలన్నారు. సీఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను విమర్శిస్తూ హైదరాబాద్‌లో అలజడి సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఇదీ చదవండి: పాన్ ఇండియా పార్టీ.. దరసరాకు విడుదల! -
‘ఇదేనా మీ రాజకీయం.. అతిథి మర్యాదలు గుర్తుపెట్టుకోండి’
సాక్షి, హైదరాబాద్: నగరంలో గణనాథుడి నిమజ్జనం సందర్భంగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలంగాణకు విచ్చేసిన విషయం తెలిసిందే. కాగా, పర్యటనలో భాగంగా హిమంత బిశ్వ శర్మ ఎంజే మార్కెట్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా అసోం సీఎం.. కేసీఆర్ సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణలో బీజేపీదే గెలుపు. ప్రతిపక్షాలు కలిసే ఉన్నాయి. కేసీఆర్ ఏకం చేయాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో ప్రభుత్వం నిజాం పాలనని కొనసాగిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు. కుటుంబ పాలన నుండి విముక్తి కలిగాలని భాగ్యలక్ష్మీ అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. దీంతో, టీఆర్ఎస్ కార్యకర్త స్టేజీ మీదకు వచ్చి.. మైక్ లాక్కున్నాడు. దీంతో.. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య తోపులాట చేసుకుంది. తాజాగా ఈ ఘటనపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలను చూసి టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు. ఇతర రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి వచ్చిన అతిథికి ఇచ్చే మర్యాద ఇదేనా అని ప్రశ్నించారు. అసోం సీఎంను అడ్డుకుని ఏంచేయగలిగారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఇది కూడా చదవండి: ప్రజలను ప్రశాంతంగా ఉండనివ్వరా.. బీజేపీ నేతలకు మంత్రి తలసాని కౌంటర్ -
హైదరాబాద్‌ను ప్రశాంతంగా ఉండనివ్వరా?: తలసాని
-
ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు.. అసోం సీఎంకు తలసాని కౌంటర్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎంజే మార్కెట్లో ఉద్రిక్తత నెలకొంది. గణేష్ శోభాయాత్ర సందర్బంగా నగరానికి విచ్చేసిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. ఎంజే మార్కెట్లో సభా వేదికపై ఆయన ప్రసంగిస్తూ టీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్‌పై వ్యాఖ్యలు చేశారు. దీంతో స్థానిక టీఆర్ఎస్ నేతలు అసోం సీఎం స్పీచ్‌ను అడ్డుకున్నారు. మైక్ లాక్కున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తలసాని మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రజలను రెచ్చగొట్టడానికే అసోం సీఎంను ఇక్కడికి రప్పించారు. అసోం సీఎం భాష సరిగా లేదు. అందుకే స్థానికులు అడ్డుకున్నారు. ఆయన గణేష్ నిమజ్జనం సందర్భంగా ఇక్కడికి వచ్చారు. అలాంటప్పుడు గణేషుడి గురించి లేదా శోభాయాత్ర గురించి మాట్లాడాలి కానీ.. రాజకీయాలు మాట్లాడటం కరెక్ట్ కాదు. బీజేపీ నేతలు హైదరాబాద్‌ను ప్రశాంతంగా ఉండనివ్వరా అంటూ మంత్రి తలసాని ప్రశ్నించారు. అనంతరం హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి తలసాని.. గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. -
గణేష్ శోభాయాత్రలో టెన్షన్: ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్తత!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గణేష్ నిమజ్జనం సందర్భంగా అసోం సీఎం హిమంత బిశ్వంత శర్మ నగరానికి వచ్చారు. ఈ క్రమంలో ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది. అసోం సీఎం ప్రసంగాన్ని టీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీఎం బిశ్వంత శర్మ ప్రసంగిస్తుండగా.. టీఆర్ఎస్ నేత నందు బిలాల్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. సీఎం తన ప్రసంగంలో టీఆర్ఎస్, కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో సభా వేదిక మీదకు ఎక్కిన బిలాల్ మైక్ లాక్కున్నాడు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. వెంటనే బిలాల్‌ను పోలీసులు అక్కడి నుంచి తరిలించారు. దీంతో, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా అక్కడికి తరలివచ్చారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నేతలకు సంస్కారం లేదు. అసోం సీఎంను అడ్డుకోవడం సిగ్గుచేటు. ఇది పిరికిపంద చర్య. ఇది పెద్ద సాహసోపేత చర్య కాదు. పోలీసుల కనుసన్నాల్లోనే ఇదంతా జరిగిందని తాను భావిస్తున్నట్టు తెలిపారు. -
నిమజ్జనానికి హాజరు కానున్న అసోం సీఎం
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో శుక్రవారం(నేడు) నిర్వహిస్తున్న వినాయక నిమజ్జన ఉత్సవాలకు అసోం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వశర్మ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి(బీజీయూఎస్) ఆహ్వానం మేరకు గురువారంరాత్రి ఆయన నగరానికి చేరుకున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకోవాల్సి ఉండగా, వేరే కార్యక్రమంలో గవర్నర్ ఉన్న కారణంగా ఈ భేటీ జరగలేదు. ఆయన ట్రిడెంట్ హోటల్లో బసచేస్తున్నారు. శుక్రవారం ఉదయం విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ), బీజీయూఎస్ నేతలు, ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేసి వచ్చిన తెలుగు ఉన్నతాధికారులతో కలిసి ఆయన అల్పాహా రం స్వీకరిస్తారు. ఉదయం 11 గంటలకు రాడిసన్ హోటల్లో మీడియాతో మాట్లాడే అవకాశాలున్నాయి. అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శిస్తారు. మొజంజాహి మార్కెట్ వద్ద ప్రధాన వినాయక విగ్రహాల ఊరేగింపును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి ట్యాంక్‌బండ్‌కు చేరుకుని వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని తిలకిస్తారు. -
‘చేతనైతే మళ్లీ అఖండ భారతావనిని సృష్టించు’
గౌహతి: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో పర్యటిస్తున్న వేళ.. కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను విమర్శించే క్రమంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చే క్రమంలో సంచలన వ్యాఖ్యలే చేశారాయన. ‘‘భారత దేశం ఏకతాటిపైనే ఉంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా.. సిల్చార్ నుంచి సౌరాష్ట్ర దాకా ప్రజలంతా ఒక్కటిగానే ఉన్నాం. అలాంటప్పుడు కాంగ్రెస్ యాత్రతో ప్రయోజనం ఏముంటుంది?. కాబట్టి, రాహుల్ ఇలాంటి యాత్రను పాకిస్తాన్లో నిర్వహించుకుంటే మంచిదని హిమంత ఎద్దేశా చేశారు. వాస్తవానికి దేశాన్ని విభజించింది కాంగ్రెస్సే. ఒకవేళ తన ముత్తాత(నెహ్రూను ఉద్దేశించి) చేసిన పనికి(విజభనను ఉద్దేశించి..) రాహుల్ గాంధీ గనుక పశ్చాత్తపం చెంది ఉంటే గనుక.. భారత్‌జోడో యాత్ర చేయాల్సిన అవసరమే లేదు. కావాలనుకుంటే పాక్, బంగ్లాదేశ్‌లను తిరిగి ఐక్యం చేసి అఖండ భారతాన్ని సృష్టించొచ్చు అని అస్సాం సీఎం వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. అస్సాం సీఎం విలీనం వ్యాఖ్యలపై పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేకించి.. బంగ్లా ప్రధాని షేక్ హసీనా భారత్‌లో నాలుగు రోజుల పర్యటనలో ఉండగానే.. ఆయన బంగ్లాదేశ్ విలీనం వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక పర్యటనలో ఉన్న ఆమె ఇప్పటికే ప్రధాని మోదీతో భేటీ అయ్యారు కూడా. అంతేకాదు ఇరు దేశాల మధ్య ఏడు ఎంవోయూలపై సంతకాలు కూడా జరిగాయి. అఖండ భారతావని అనేది ఆరెస్సెస్ వాదన. పాక్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్, అఫ్గనిస్తాన్, టిబెట్, మయన్మార్లు సంఘటితంగా ఉంటేనే.. అది అఖండ భారతం అని చెప్తుంటుంది.గతంలో కాంగ్రెస్‌లో ఉన్న హిమంత.. 2015లో బీజేపీలో చేరారు. ఇదిలా ఉంటే.. ఇవాళ సాయంత్రం భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది. #WATCH | "India is intact. We're one nation. Congress disintegrated India in 1947. If Rahul Gandhi has any regret that his grandfather made a mistake, there's no use of Bharat Jodo Yatra in India. Try to integrate Pakistan, Bangladesh & work for Akhand Bharat..," says Assam CM. pic.twitter.com/W1ZbWV4rOG — ANI (@ANI) September 7, 2022 ఇదీ చదవండి: తొలిసారి తండ్రి స్మారకం వద్ద రాహుల్ -
అలాంటి మదర్సాలను కూల్చేయడం పక్కా: అస్సాం సీఎం వార్నింగ్
గౌహతి: అస్సాంలో మదరసాల కూల్చివేత వ్యవహారం ఇటు రాజకీయంగా, అటు మతపరంగా పెను దుమారం రేపుతోంది. అయినా సరే ‘తగ్గేదేలే’ అంటున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు నెలవైన ఏ ఒక్క మదరసాను కూల్చేయకుండా వదిలే ప్రసక్తే లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారాయన. మదరసాలను కూల్చేయాలన్నది మా అభిమతం, ఉద్దేశం కాదు. జిహాదీ శక్తులు వాటిని ఉపయోగిస్తున్నాయా? లేదా? అని పరిశీలించడమే మా పని. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వాటిని ఉపయోగిస్తున్నారని, సంబంధాలు ఉన్నాయని తేలితే చాలూ.. వాటిని కూల్చివేసి తీరతాం. ఈ విషయంలో బుల్డోజర్లు వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు అని ఆయన గురువారం మరోసారి సీఎం హిమంత బిస్వా శర్మ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. అనుమానిత, ఉగ్రసంస్థలతో సంబంధాలున్న మదర్సాలపై అస్సాం సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రత్యేక డ్రైవ్‌లతో వాటిని కూల్చేస్తోంది. తాజాగా బొంగైగావ్ జిల్లా కబితరీ గ్రామంలోని మార్క్‌జుల్ మా-ఆరిఫ్ క్వారియానా మదర్సాను బుధవారం కూల్చివేసింది. అల్ ఖైదాతో సంబంధాలున్న కారణంగానే ఈ కూల్చివేత జరిగినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా కట్టినందుకే కూల్చినట్లు.. ముందస్తు నోటీసుల తర్వాతే కూల్చివేసినట్లు ప్రకటించారు. 🚨 3rd Madrassa demolished by @himantabiswa govt in Assam for having alleged links with Al Qaeda Video courtesy - ANI pic.twitter.com/vt8x9se3sQ — Kreately.in (@KreatelyMedia) August 31, 2022 ఇక ఈ వారంలో ఇది రెండో మదర్సా కూల్చివేత. నెల వ్యవధిలో మూడో కూల్చివేత. అంతకు ముందు బార్పేటలో ఇద్దరు బంగ్లాదేశీ ఉగ్రవాదులకు నాలుగేళ్లుగా ఆశ్రయం ఇచ్చారని సోమవారం ఓ మదర్సాను కూల్చేశారు. ఢక్లియాపరా ప్రాంతంలోని ఉన్నషేఖుల్ హింద్ మహ్మదుల్ హసన్ జామియుల్ హుదా అనే మదర్సాను బుల్డోజర్తో నేలమట్టం చేశారు. అంతకు ముందు మదర్సాలో తనిఖీలు చేపట్టగా.. నిషేధిత రాడికల్ గ్రూపులకు సంబంధించిన పలు పత్రాలు, ప్రచార ప్రతులు దొరికాయి. ఈ నేపథ్యంలో కట్టడానికి అనుమతులు లేవంటూ కూల్చేశారు. అలాగే.. అల్ ఖైదాతో సంబంధం ఉన్న ఇమామ్‌లు. మదర్సా ఉపాధ్యాయులతో సహా 37 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మదర్సా కూల్చివేతకు ముందు.. అందులోని నుంచి విద్యార్థులను ఖాళీ చేయించి.. ఇతర విద్యాసంస్థలకు పంపించారు. అల్-ఖైదా, బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ అన్సరుల్ బంగ్లా టీమ్ (ABT) సభ్యులు మదర్సాలలో తలదాచుకుంటున్న ఘటనలు ఇప్పుడు పెరిగిపోతున్నాయ్. జిహాదీ కార్యకలాపాలకు అస్సాం హాట్‌బెడ్‌గా మారిందంటూ తాజాగా సంచలన వ్యాఖ్యలే చేశారు సీఎం హిమంత బిస్వా శర్మ. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటిదాకా 40 మంది బంగ్లాదేశీ ఉగ్రవాదులను అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ముస్లిం మతపెద్దలు, మదర్సాల నిర్వాహకులు సీఎం హిమంతను ‘బుల్డోజర్ రాజా’గా అభివర్ణిస్తూ.. చర్యలు ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదీ చదవండి: ఆరెస్సెస్‌కు సపోర్టుగా దీదీ కామెంట్లు -
మరో రాష్ట్రంలో ‘ఆపరేషన్ ఆకర్ష్’.. కాంగ్రెస్‌లో గుబులు
మహారాష్ట్రలో మహా అఘాడీ సంకీర్ణ సర్కారును కూలదోసిన కాషాయ పార్టీ ఇప్పుడు మరో రాష్ట్రాన్ని ‘టార్గెట్’ చేసినట్టు కనబడుతోంది. హేమంత్ సోరేన్ నేతృత్వంలోని జేఎంఎం- కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టుందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డబ్బు కట్టలతో బెంగాల్లో పట్టుబడడంతో ఈ వాదనకు బలం చేకూరింది. కాంగ్రెస్ అలర్ట్ ‘ఆపరేషన్ ఆకర్ష్’తో సోరేన్ సర్కారుకు ఎసరు పెట్టుందుకు కమలనాథులు సిద్ధమయ్యారన్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. డబ్బుతో అడ్డంగా దొరికిపోయిన ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సోరేన్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని, పూర్తికాలం కొనసాగుతుందని ఏఐసీసీ రాష్ట్ర బాధ్యుడు అవినాష్ పాండే భరోసాయిచ్చారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగస్వాములైన వారి పట్ల అప్రమత్తంగా ఉన్నామని, సరైన సమయంలో కుట్రదారులపై వేటు వేస్తామని హెచ్చరించారు. ఫిరాయింపుదారులకు వార్నింగ్ ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నకాంగ్రెస్ మాజీ నాయకుడు ఒకరు.. సోరేన్ ప్రభుత్వాన్ని బలహీనపరచడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కఠినవైఖరి అవలంభించాలని నిర్ణయించింది. అందుకే కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఎమ్మెల్యేలపై వెంటనే సస్పెన్షన్ వేటు చేసి ఫిరాయింపుదారులకు గట్టి హెచ్చరికలు పంపింది. అంతేకాదు జార్ఖండ్ కాంగ్రెస్ విభాగం 18 జిల్లాల్లో ఆందోళనలు కూడా చేపట్టింది. సస్పెండ్ అయిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు మరో శాసనసభ్యుడు బెంగాల్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇది రెండోసారి.. నాకేం తెలియదు హేమంత్ సోరేన్ సర్కారును కూల్చడానికి బీజేపీ ప్రయత్నించడం ఇది రెండోసారని అవినాష్ పాండే తెలిపారు. ప్రస్తుత కుట్ర వెనుక అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఉన్నారని ఆయన పేరు ప్రస్తావించకుండా ఆరోపించారు. సోరేన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తాను ప్రయత్నించడం లేదని హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. 22 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో కొనసాగినందున ఆ పార్టీ నాయకులతో సంబంధాలు ఉన్నాయని, సీనియర్ నేతలు టచ్‌లో ఉన్నారని చెప్పుకొచ్చారు. తనపై కాంగ్రెస్ ఎందుకు కేసు పెట్టిందో తెలియదన్నారు. హిమంత ప్రోద్బలంతోనే.. సస్పెండ్ అయిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. హిమంత బిశ్వ శర్మ ప్రోద్బలంతో తనకు 10 కోట్ల రూపాయలు, కొత్త ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రి పదవి ఆశచూపారని ఆరోపిస్తూ బెర్మో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమార్ జయమంగళ్.. రాంచిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల కారులో డబ్బు పట్టుబడిన తర్వాతే ఎందుకు ఫిర్యాదు చేశారన్న ప్రశ్నకు జయమంగళ్ వద్ద సమాధానం లేదు. మరోవైపు సీఎం సోరేన్ మీడియా సలహాదారు అభిషేక్ ప్రసాద్ తమ ఎదుట హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో జార్ఖండ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అధికార పక్షంలో గుబులు మొదలైంది. (క్లిక్: రౌత్ అరెస్ట్: థాక్రే నోట పుష్ప డైలాగ్) -
వరద ప్రభావిత ప్రాంతంలో సీఎం బైక్ రైడ్.. వీడియో వైరల్
డిస్పూర్: దేశంలో భారీ వర్షాలతో పలు రాష్ట్రాలు నీటమునిగాయి. గ్రామాలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. తముల్పూర్ జిల్లా సందర్శనకు వెళ్లిన క్రమంలో బైక్‌పై చక్కర్లు కొట్టారు. పింక్ రంగు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంపై పలు ప్రాంతాలను సందర్శించారు. జిల్లాలోని బగరిబారి ప్రాంతంలో బైక్ రైడ్ చేశానంటూ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశారు సీఎం. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. Took a motor-bike ride to Bagaribari embankment breach site during my visit to Tamulpur. pic.twitter.com/uE4z8TgqV0 — Himanta Biswa Sarma (@himantabiswa) July 14, 2022 బైక్ రైడ్ తర్వాత బోట్లో ఎక్కి వరద ప్రభావిత ప్రాంతాలను చుట్టి వచ్చారు సీఎం. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అస్సాంలోని కచార్, చిరాంగ్, మోరిగావ్, నగావ్, తముల్పూర్ జిల్లాలు నీట మునిగాయి. సుమారు 2,50,300 మందిపై వరద ప్రభావం పడింది. ఆయా జిల్లాల్లో 76 ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది అస్సాం ప్రభుత్వం. ఇప్పటి వరకు 17,014 మందిని సురక్షిత శిబిరాలకు తరలించారు. బొంగాయ్‌గావ్, ధుబ్రీ, కమ్రూప్, లఖింపుర్, మంజులీ, మోరిగావ్, దక్షిణ సల్మారా, టింసుకియా జిల్లాల్లో వరదల కారణంగా భూములు కోతకు గురయ్యయి. ఇదీ చూడండి: అమర్నాథ్ యాత్రికుల బస్సుకు ప్రమాదం.. 15 మంది మృతి! -
సారీ! నేనింతలా ఎప్పడూ సిగ్గుపడలేదు
గౌహతి: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాఫియా బెదిరింపులతో ఆత్మహత్యకు పాల్పడిన బాధిత కుటుంబానికి క్షమాపణలు చెబుతూ...ఉద్వేగానికి గురయ్యారు. సదరు బాధిత కుటుంబానికి 'సారీ' అని క్షమాపణ చెబుతూ...తానెప్పుడూ ఇంతలా సిగ్గుపడలేదన్నారు. పోలీస్ యంత్రాంగం ఉన్నప్పటికీ మాఫియా గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడే సాహసం చేసిందంటే...నిజంగా ఇది చాలా సిగ్గుచేటని అన్నారు. ఈ మేరకు దిబ్రూఘర్‌లో 32 ఏళ్ల వినిత్ బగారియా అనే యువ వ్యాపారవేత్త మాఫియా బెదిరింపులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కుటుంబానికి చెందిన ఓ షాపులోని వ్యక్తితో సహా ముగ్గురు తననను బెదిరిస్తున్నారని, ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నానంటూ..ఓ సెల్ఫీ వీడియో రికార్డు చేసి మరీ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. సదరు వ్యక్తి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసిన వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని కూడా ఆ వీడియోలో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు బాధితుడు తెలిపిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మీడియా సమావేశంలో ఆ ఘటన గురించి మాట్లాడుతూ... ప్రజలతో పోలీసులు స్నేహ పూర్వకంగా మెలగాలని పదేపదే చెబుతున్నప్పటికీ.. నిర్లక్ష్యంగా వ్యవహరించి వారి గోడుని పట్టించుకోని పోలీసుల పై తగిన చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. (చదవండి: కాంగ్రెస్‌లో కలవరం.. బీజేపీతో టచ్‌లో కీలక నేతలు!) -
30-40 ఏళ్లు బీజేపీదే అధికారం: అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కుటుంబ రాజకీయాలు, జాతి, కుల, మత ప్రాంతీయవాదాలను నిరోధించాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. వచ్చే 30–40 ఏళ్లపాటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్‌ను విశ్వగురుగా తీర్చిదిద్దడం తమ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా రెండోరోజు అమిత్ షా రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టగా, కార్యవర్గం చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ వివరాలను హిమంత బిశ్వ శర్మ మీడియాకు వివరించారు. ‘‘దేశంలో కుటుంబపాలన, రాష్ట్రాలలో జరుగుతున్న అరాచకాలపై కూడా చర్చ జరిగింది. త్వరలో తెలంగాణలో కూడా కుటుంబపాలన అంతమవుతుందని అమిత్ షా తన తీర్మానంలో ప్రస్తావించారు. పనితీరు ఆధారిత పాలన, అభివృద్ధితో కూడిన పాలనపైనే బీజేపీ తన రాజకీయ తీర్మానంలో చర్చించింది’’అని పేర్కొన్నారు. రాజకీయ తీర్మానంపై చర్చలో ప్రధాని మోదీ సైతం పాల్గొని పలు మార్పులు, చేర్పులు సూచించారని తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము జీవితంపై ఓ దృశ్యచిత్రాన్ని కూడా తయారు చేయాలని సూచించారని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఒకసారి దళిత నేతను, రెండోసారి ఆదివాసీ మహిళకు అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. ‘సబ్ కే సాత్ సబ్ కా వికాస్’అన్నదే తమ పార్టీ నినాదమని, అందుకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయని అస్సాం సీఎం వివరించారు. దేశంలో ప్రతిపక్షాలను ప్రజలు విశ్వసించడం మానేశారని, ఇప్పటికే వారిని మూలన కూర్చోబెట్టిన విషయాన్ని అమిత్ షా పేర్కొన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి మోదీ ఫోబియా పట్టుకుందని ఎద్దేవా చేశారు. పనితీరు ఆధారిత పాలన, అభివృద్ధితో కూడిన పాలనపై మాట్లాడినట్లు బిశ్వశర్మ తెలిపారు. అన్ని రాష్ట్రాలకు బీజేపీని విస్తరిస్తాం: హిమంత హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో రాజకీయ కోణం ఉందని వస్తున్న విమర్శలను హిమంత తిప్పికొట్టారు. పార్టీలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని కాంగ్రెస్ సభ్యులు పోరాడుతున్నారని, పార్టీ అధ్యక్షుడిని కూడా ఎన్నుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. గుజరాత్ అల్లర్లపై సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమని అభివర్ణించారు. ఎనిమిదేళ్ల మోదీ పాలనలో దేశంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు బీజేపీ విస్తరిస్తుందని అన్నారు. తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ పాగా వేయనుందని, ఆ అవకాశాలపై చర్చించామని తెలిపారు. దేశం ఇన్నాళ్లు వెనుకబడటానికి గల కారణాలను అమిత్‌షా రాజకీయ తీర్మానం సందర్భంగా వివరించినట్లు బిశ్వశర్మ తెలిపారు. -
‘మహా’పతనం: అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు
గువహటి: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. అసోంలో వరదలపై దృష్టి పెట్టకుండా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు గౌహతి హోటల్లో ఆతిథ్యమిచ్చారనే ఆరోపణలపై ఆయన స్పందించారు. మహారాష్ట్ర రెబల్ ఎమ్మెల్యేలకు బీజేపీ మద్దతు ఉందని పేర్కొన్నారు. ‘మహా’ సంక్షోభంలో జోక్యం చేసుకోనని చెప్పారు. అసోంకు వచ్చే అతిథులు ఎవరైనా వారికి రక్షణ కల్పించడం మా బాధ్యత అన్నారు. చదవండి: తెర మీదకు శివసేన కొత్త పార్టీ!.. అగ్గి రాజుకుంటుందని హెచ్చరికలు మరో వైపు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కీలక దశకు చేరుకుంది. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు రంగం సిద్ధమైంది. 16 మందికి ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు గ్రూప్ లీడర్ ఏక్నాథ్ షిండే ప్రకటించారు. ఈ మేరకు డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాసే యోచనలో ఉన్నారు షిండే. అయితే కొత్త పార్టీ పేరు శివసేన(బాలాసాహెచ్)గా ఉండొచ్చని షిండే వర్గీయులు చెప్తున్నారు. బాల్‌థాక్రే సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ ఉండబోతున్నట్లు సమాచారం. -
వాళ్లంతా హోటల్లో ఉన్నారని తెలియదు!: అస్సాం సీఎం
Maharashtra Political Crisis: ముంబై/గువాహతి: శివ సేన రెబల్ ఎమ్మెల్యేలను ఏకతాటిపై తెచ్చిన ఆ పార్టీ తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే.. వాళ్లను నిలువరించేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. గువాహతి(అసోం) రాడిసన్ బ్లూ హోటల్లో బస చేసి.. వాళ్లతో గంట గంటకు సమావేశం అవుతున్నారు. ఈ క్రమంలో.. అస్సాం (అసోం) ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అస్సాంలో ఎన్నో మంచి హోటల్స్ ఉన్నాయి. ఎవరైనా రావొచ్చు.. ఉండొచ్చు. అందులో ఎలాంటి సమస్యా లేదు. మహారాష్ట్ర ఎమ్మెల్యేలు అస్సాంలో ఉంటున్నారో లేదో నాకు తెలియదు. అయ్యి ఉండొచ్చు. ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఇక్కడి హోటల్స్‌లో ఉండొచ్చు. అందులో అభ్యంతరాలు ఏం లేవు.. అంటూ దాటవేత ధోరణి ప్రదర్శించారాయన. ‘‘మన బాధలు.. సంతోషం ఒక్కటే. అంతా ఒక్కటిగా ఉంటే విజయం మనదే. ఓ జాతీయ పార్టీ.. పాకిస్థాన్‌ను దెబ్బ కొట్టే సత్తా ఉన్న ‘మహాశక్తి’ మనకు అండగా ఉంటామని మాట ఇచ్చింది. అవసరమైన సాయం చెప్పింది’’ అంటూ ఏక్నాథ్ షిండే చేసిన వ్యాఖ్యల తాలుకా వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అస్సాం మంత్రి అశోఖ్ సింఘాల్ గురువారం ఉదయం స్వయంగా రాడిసన్ బ్లూ హోటల్‌కు వెళ్లి.. ఏక్నాథ్ షిండేతో భేటీ అయ్యారు. దీంతో ఆ పార్టీ బీజేపీనేనా? అని అస్సాం సీఎం హిమంతకు ప్రశ్న మీడియా నుంచి ఎదురుకాగా.. ఆయన పైవ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. షిండే వర్గంలో మొత్తం 37 మంది శివ సేన ఎమ్మెల్యేలు(అనర్హత నుంచి గట్టెక్కే మ్యాజిక్ ఫిగర్)తో పాటు మరో 9 మంది ఇతర ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకోవైపు ‘అనర్హత వేటు’ మంత్రం ద్వారా రెబల్ గ్రూప్‌ను వెనక్కి రప్పించే ప్రయత్నంలో ఉన్న శివ సేన.. వాళ్లంతా ముంబైకి చేరితేగనుక పరిస్థితి సర్దుమణగవచ్చన్న ఆశాభావంలో ఉంది. చదవండి: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ప్రకటన -
మోదీ జీ.. సీఎం సతీమణి అవినీతి మీకు కనిపించదా..?
సాక్షి, న్యూఢ్లిలీ: ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతున్న బీజేపీకి సొంత పార్టీ నేతల అవినీతి కనిపించడం లేదా అని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా శనివారం ప్రశ్నించారు. బీజేపీ నేతల అవినీతిని బయట పెడతానంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేసిన కాసేపటికే ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీకి చెందిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన భార్యకు చెందిన కంపెనీలకు అక్రమంగా పీపీఈ కిట్ల కాంట్రాక్ట్ కట్టబెట్టారని ఆరోపించారు. ‘‘పైగా ఒక్కో కిట్‌ను అసోం ప్రభుత్వం రూ.600కి కొంటుంటే భార్య కంపెనీకి రూ.990 చొప్పున చెల్లించేలా కాంట్రాక్ట్ ఇచ్చారు. తర్వాత దాన్ని రద్దు చేసి, కుమారుడు భాగస్వామిగా ఉన్న మరో కంపెనీకి ఒక్కో కిట్‌కు రూ.1,680 చెల్లించేలా కాంట్రాక్ట్ అప్పగించారు. ఇది అవినీతి కాదా?’’ అని ప్రశ్నించారు. వీటిపై హిమంత స్పందించారు. సిసోడియాపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ఎప్పుడో ఏడేండ్ల కిందటి కేసును తిరగదోడి ఆప్ మంత్రి సత్యేందర్ జైన్‌ను ఆగమేఘాలపై ఇటీవల ఈడీ అరెస్టు చేసింది. ఇక ‘పీపీఈ కిట్ల’ స్కామ్‌లో బిశ్వశర్మపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని విపక్ష పార్టీలు మండిపడ్డాయి. పీపీఈ కిట్ల స్కామ్‌పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇక, 2020లో జరిగిన ఈ స్కామ్ సమాచార హక్కు చట్టం ద్వారా ఇటీవల వెలుగుచూసింది. అప్పుడు బిశ్వశర్మ ఆరోగ్యమంత్రిగా కొనసాగారు. ఇది కూడా చదవండి: ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది.. జై షా చక్రం తిప్పాడు..: బీజేపీ నేత కామెంట్స్ -
Beef Row: లంచ్‌లోకి బీఫ్.. ప్రధానోపాధ్యాయురాలి అరెస్ట్
దిస్పూర్: తిండి విషయంలో ఎవరి అలవాట్లు వాళ్లవి. పని చేసే చోట నలుగురూ కలిసి భోజనం చేయడం సహజం. అలా లంచ్ చేస్తున్న టైంలో.. తాను ఇంటి నుంచి తెచ్చిన వంటకాన్ని నలుగురికి పంచాలనుకుంది ఓ ప్రధానోపాధ్యాయురాలు. అదే ఆమె చేసిన తప్పు అయ్యింది..కటకటాల వెనక్కి నెట్టింది. అస్సాం గోల్పరా జిల్లా లఖిపూర్‌లోని ముర్కాచుంగి మిడిల్ ఇంగ్లీష్ మీడియం ప్రధానోపాధ్యాయురాలు దలిమా నెస్సా(56).. గొడ్డుకూరను లంచ్ బాక్స్‌లో తీసుకెళ్లింది. అయితే తాను తెచ్చిన వంటకాన్ని తోటి ఉపాధ్యాయులకు పంచాలనుకుంది ఆమె. ఇది కొందరికి నచ్చలేదు. అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మే 14న స్కూల్లో జరిగిన ఓ పంక్షన్ సందర్భంగా ఇది జరిగింది. బీఫ్‌ను పంచాలనుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కొందరు టీచర్లు ఆమెపై స్కూల్ కమిటీకి ఫిర్యాదు చేశారు. అటుపై ఈ వ్యవహారం పోలీసులకు చేరడంతో ఆ ప్రధానోపాధ్యాయురాలిని అరెస్ట్ చేశారు. మంగళవారం ఆమెను అరెస్ట్ చేసి..ఆ మరుసటి రోజు కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో ఆమెకు జ్యూడిషియల్ కస్టడీ విధించారు. ఐపీసీ 153ఏ(విద్వేషాలు రగిల్చే ప్రయత్నం), 295ఏ (మత మనోభావాలు దెబ్బతీయడం) కింద.. ఆమెను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. బీఫ్ తినొచ్చు, కానీ.. ఈశాన్య రాష్ట్రం, పైగా బీజేపీ పాలిత రాష్ట్రమైన అస్సాంలో గొడ్డు మాంసం క్రయవిక్రయాలు, తినడంపై ఎలాంటి అభ్యంతరాలు లేవు. కాకపోతే కిందటి ఏడాది ప్రభుత్వం ‘అస్సాం క్యాటల్ ప్రిజర్వేషన్ యాక్ట్’ తీసుకొచ్చింది. దీని ప్రకారం.. హిందువులు, జైనులు, గొడ్డు మాంసానికి దూరంగా ఉండే కమ్యూనిటీలు ఉన్న ఏరియాలకు, హిందూ ఆలయాలకు ఐదు కిలోమీటర్ల అవతల.. బీఫ్ సెంటర్లను నిర్వహించకోవచ్చు. ఆవు అందరికీ అమ్మ. గోమాతను పూజించే గడ్డపై.. గొడ్డు మాంసం తినకపోవడమే ఉత్తమం. అదే సమయంలో తిండి అలవాట్లను ఎవరూ మార్చుకోవాల్సిన అవసరమూ లేదు: అస్సాం సీఎం హిమంత గతంలో చేసిన కామెంట్లు చదవండి: జాతరలో బీఫ్, పంది బిర్యానీకి నో.. కలెక్టర్‌కు నోటీసులు -
Assam Floods: కొనసాగుతోన్న వరదల బీభత్సం.. 9 మంది మృతి
దిస్పూర్: ఎడతెరిపి లేని వర్షాలు అస్సాంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. శనివారం మొదలైన భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. కొండ చరియలు విరిగిపడి వరద నీరు పోటెత్తడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 27 జిల్లాల్లో సుమారు 1,089 గ్రామలు నీటమునిగాయి. సుమారు 6 లక్షల మంది వరదల ప్రభావానికి గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. #India Moment the bamboo bridge was washed away in #Assam due to heavy rains and flooding. 20 districts of Assam were affected by #floods on Monday. 2 people died.#indiafloods 💬 @GaiaNewsIntl 🌎 pic.twitter.com/kzaDPpQrUS — ★ GNI ★ GAIA NEWS INTERNATIONAL (@GaiaNewsIntl) May 17, 2022 ఆర్మీ, పారామిలిటరీ బలగాలు, జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, పోలీసులు రంగంలోకి దిగి ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు వరద చేరిన ఇళ్లల్లో చిక్కుకున్న 3,427 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.142 పునరావాస శిబిరాలు, 115 సహాయ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి మొత్తం 48,000 మంది బాధితులకు ఆశ్రయం కల్పించారు. వాన బీభత్సంతో పాటు కొండచరియలు విరిగిపడుతుండటంతో రైల్వే ట్రాక్‌లు, వంతెనలు, రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో పలుచోట్ల రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. దిమా హసావో జిల్లాలో రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వరదల ప్రభావంతో ఇప్పటి వరకు 9 మంది మృత్యువాతపడ్డారు. కాచర్‌లో ఇద్దరు, ఉదల్గురిలో ఒకరు మరణించగా.. కొండ చరియలు విరిగిపడి దిమా హసావోలో నలుగురు, లఖింపూర్‌లో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. మరో అయిదుగురు కనిపించకుండా పోయారు. #WATCH | Assam: Efforts to airdrop relief material were initiated in Haflong amidst the #AssamFloods on May 18; will continue today, May 19. pic.twitter.com/jEnaQFGBlj — ANI (@ANI) May 18, 2022 వరద బాధిత జిల్లాలకు అస్సాం ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల చేసిందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. వరద సహాయక చర్యల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్రం రూ. 1,000 కోట్లు మంజూరు చేసిందన్నారు.వరద బాధిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల సరఫరాను కొనసాగించేందుకు, కమ్యూనికేషన్ మార్గాలను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. రైల్వే లింక్ పునరుద్ధరించడానికి దాదాపు 45 రోజులు పడుతుందని, రెండు-మూడు రోజుల్లో రోడ్డు కనెక్టివిటీని పునరుద్దరిస్తామని సీఎం తెలిపారు. ప్రస్తుతం కంపూర్, ధర్మతుల్ వద్ద కోపిలి నది, నంగ్లమురఘాట్ వద్ద దిసాంగ్ నది, ఏపీ ఘాట్ వద్ద బరాక్ నది, కరీంనగర్ వద్ద కుషియారా నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. అయితే రానున్నఈ ప్రాంతంలో విస్తృతంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని గౌహతి ఆధారిత ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని, రానున్న రెండు రోజుల పాటు వర్షాలు మరింత కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా శుక్రవారం నుంచి ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు కొద్దిగా మెరుగుపడవచ్చని తెలిపింది. తిరగబడ్డ రైలు బోగీలు వరదనీరు పోటేత్తడంతో దిమా హసావ్ ప్రాంతంలోని హాఫ్లాంగ్ రైల్వే స్టేషన్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. స్టేషన్‌లోని రెండు రైళ్లు పూర్తిగా నీళ్లలో మునిగిపోయాయి. గౌహతి-సిల్చార్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన కొన్ని బోగీలు తిరగబడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ముందే ప్రమాద తీవ్రతను అంచనా వేసిన అధికారులు ప్రయాణికులను సురక్షితంగా తరలించడంతో ప్రాణ నష్టం తప్పింది. రైల్వే అధికారులు 29 రైళ్లను నిలిపివేశారు. ప్యాసింజర్ రైళ్లలోని ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
Sakshi Cartoon: అబ్బే! అదేం లేద్సార్.. మీరు సభలో ఉన్నారని అంతే!
అబ్బే! అదేం లేద్సార్.. మీరు సభలో ఉన్నారని అంతే! -
దేశానికి తదుపరి ప్రధాని అమిత్ షా..?
బీజేపీ సీఎం హిమంత శర్మ అనుకోకుండా తప్పులో కాలేశారు. బహిరంగ సభలో టంగ్ స్లిప్ అవడంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు. దీంతో కాంగ్రెస్ నేతలు సీఎంను టార్గెట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..? సీఎం హిమంత శర్మ అసోంలో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను భారత ప్రధానిగా, ప్రధాని నరేంద్ర మోదీని హోం మంత్రిగా సంభోదించారు. ఆయన వ్యాఖ్యలు విన్న సభలోని బీజేపీ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే, సీఎం అనుకోకుండా నోరుజారారని, ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని బీజేపీకి చెందిన ఓ సీనియర్ నేత సమర్ధించే ప్రయత్నం చేశారు. కానీ, కాంగ్రెస్ మాత్రం ఈ వీడియోలను ట్రోల్ చేస్తూ అధికార బీజేపీ తదుపరి ప్రధాని అభ్యర్థిగా అమిత్ షానే ఎంచుకుందని, ఆయన ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ట్విట్టర్లో కామెంట్స్ చేసింది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ అంతకుముందు చోటుచేసుకున్న ఆసక్తికర వ్యాఖ్యలను కూడా జోడించింది. హిమంత శర్మ అసోం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నప్పుడు బీజేపీ ఎంపీ పల్లబ్ లోచన్ దాస్.. శర్మను పదే పదే సీఎం అంటూ సంభోదించారు. కానీ, ఆ సమయంలో అసోం సీఎంగా శర్బానంద సోనోవాల్ కొనసాగుతుండటం విశేషం. అయితే, ఎంపీ పల్లబ్ వ్యాఖ్యలకు ఆజ్యంపోస్తూ.. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడంతో హిమంత శర్మ సీఎం అయ్యారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో అమిత్ షానే ప్రధాని అభ్యర్థి అవుతారని కాంగ్రెస్ పరోక్షంగా కామెంట్స్ చేసింది. When @sarbanandsonwal Ji was the CM, MP @pallablochandas on several occasions referred to cabinet minister @himantabiswa ji as the CM in public! Has #BJP decided its next @PMOIndia replacing @narendramodi Ji? Or a campaign has been launched to promote @AmitShah ji as the PM? pic.twitter.com/BgqgbbajXC — Assam Congress (@INCAssam) May 10, 2022 ఇది కూడా చదవండి: రాజద్రోహంపై సుప్రీం ఆదేశం: లక్ష్మణ రేఖను గౌరవించాలన్న కేంద్ర మంత్రి -
హైడ్రామా.. కాంగ్రెస్ కొంప ముంచిన ఎమ్మెల్యేలు
అస్సాంలో రాజ్యసభ ఎన్నికల్లో అసలైన రాజకీయం కనిపించింది. ఉన్న రెండు రాజ్యసభ సీటులను బీజేపీ, దాని మిత్రపక్షాలు కైవసం చేసుకున్నాయి. ఓ ఎమ్మెల్యే చేసిన పనితో కాంగ్రెస్ కొంప నిండా మునిగింది. దీంతో ఆ ఎమ్మెల్యేపై తక్షణ చర్యలు తీసుకుంది పార్టీ. ఇంతకీ ఆయన ఏం చేశాడో తెలుసా? గురువారం అస్సాం శాసనసభలో.. రెండు రాజ్యసభ సీట్ల కోసం ఓటింగ్ జరిగింది. ఒక సీటును బీజేపీ అభ్యర్థి పవిత్ర మార్గేరీటా ఏకపక్షంగా దక్కించుకోగా.. రెండో సీటు రసవత్తరమైన రాజకీయం నడిచింది. రూపిన్ బోరా(కాంగ్రెస్ తరపున), బీజేపీ అభ్యర్థి నర్జారీ(యూపీపీఎల్ అభ్యర్థి) రెండో సీటు కోసం పోటీ పడ్డారు. ఈ పోటీలో ఏఐయూడీఎఫ్(ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్) బోరాకు మద్ధతు ఇచ్చింది. ఈ సీటు గెలవాలంటే.. అభ్యర్థికి 43 సీట్లు వస్తే సరిపోతుంది. మొత్తం ఓట్లలో.. అధికార బీజేపీ దాని మిత్రపక్షాల కూటమికి 83 ఓట్లు ఉన్నాయి. ఇందులో పవిత్ర మార్గరీటా కోసం సరిపడా ఓట్లు బీజేపీకి అప్పటికే ఉన్నాయి. అయితే నర్జారీ కోసం మాత్రం మూడు ఓట్లు తక్కువ అయ్యాయి. ఇక ప్రత్యర్థి కూటమికి 44 ఓట్లు ఉన్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తన ఓటును వేస్ట్ చేశాడు. ఓటు వేయడానికి క్యూలో నిల్చున్న సీఎం హిమంత బిస్వా శర్మ(కుడి నుంచి నాలుగో వ్యక్తి) ఓటింగ్ టైంలో బ్యాలెట్ పేపర్ మీద One అని రాయకుండా 1 అని నెంబర్ వేశాడు. దీంతో ఆ ఓటు పనికి రాకుండా పోయింది. ఈ చర్యకు ప్రతిగా విప్ ఉల్లంఘించినందుకు కాంగ్రెస్ పార్టీ అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తానేమీ ద్రోహం చేయలేదని, ఈ విషయంపై హైకమాండ్‌ను కలిసి వివరణ ఇస్తానని అంటున్నారు సదరు ఎమ్మెల్యే. ఆయన ఎవరో కాదు.. మాజీ మంత్రి, కరీమ్గంజ్(సౌత్) ఎమ్మెల్యే సిద్ధిఖీ అహ్మద్. Assam has reposed its faith in PM Sri @narendramodi ji by electing two NDA candidates to the Rajya Sabha by huge margins - BJP's Sri Pabitra Margherita (won by 11 votes) & UPPL's Sri Rwngwra Narzary (won by 9 votes). My compliments to winners @AmitShah @JPNadda @blsanthosh pic.twitter.com/Lozn8hkNGg — Himanta Biswa Sarma (@himantabiswa) March 31, 2022 మరోవైపు ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడడంతో నర్జారీ గెలపు నల్లేరు మీద నడకే అయ్యింది. నర్జారీకి 44 ఓట్లురాగా, బోరాకు 35 ఓట్లు వచ్చాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ.. గతంలో కాంగ్రెస్ నేత. 2015లో ఆయన బీజేపీలో చేరారు. ఈ కారణంగా.. పాత పరిచయాలను ఆసరాగా చేసుకుని ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు ప్రతిపక్ష కూటమి ఆరోపిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు వేసింది కాంగ్రెస్. -
‘ఈశాన్యం’లో సామరస్యం
సరిహద్దుల విషయంలో తరచు సంఘర్షించుకుంటున్న ఈశాన్య రాష్ట్రాలన్నిటికీ ఆదర్శంగా అస్సాం, మేఘాలయ మంగళవారం ఒక ఒప్పందానికొచ్చాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వా శర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా మంగళవారం ఈ ఒప్పందంపై సంతకాలు చేయడం ద్వారా అర్ధ శతాబ్దిగా ఇరు రాష్ట్రాల మధ్యా సాగుతున్న సుదీర్ఘ వివాదానికి తెరదించారు. రాష్ట్రాల మధ్య సరిహద్దులపై వివాదా లుండటం ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైన సమస్య కాదు. కానీ ఈశాన్య రాష్ట్రాల్లో అవి తరచు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఏళ్ల తరబడి సహాయ శిబిరాల్లో సాధారణ పౌరులు తలదాచు కోవడం అక్కడ కనబడుతుంది. అస్సాం–నాగాలాండ్ మధ్య 2014 ఆగస్టులో దాదాపు పక్షం రోజులపాటు ఘర్షణలు చెలరేగి 14 మంది చనిపోగా, అనేకమంది ఆచూకీ లేకుండా పోయారు. గృహదహనాలు సైతం చోటుచేసుకున్నాయి. 1985లో అయితే ఆ రెండు రాష్ట్రాల పోలీసులూ పరస్పరం కాల్పులు జరుపుకోవడంతో వందమంది వరకూ మరణించారు. ఉద్రిక్తతలున్నప్పుడు సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంప్రదింపులు జరుపుకోవడం, పరిస్థితులు అదుపు తప్ప కుండా చూడటంలాంటివి చేయకపోవడం వల్ల సమస్యలు మరింత జటిలమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అస్సాం, మేఘాలయ ఒక అవగాహనకు రావడం హర్షించదగ్గ పరిణామం. అస్సాం నుంచి కొన్ని ఇతర రాష్ట్రాల మాదిరే మేఘాలయ కూడా 1972లో విడివడి కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. రెండింటిమధ్యా 885 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అయితే అప్పర్ తారాబరి, గజంగ్ రిజర్వ్ ఫారెస్టు, బోక్లాపారా, లాంగ్‌పీ, నాంగ్వా తదితర 12 ప్రాంతాల్లో నిర్ణ యించిన సరిహద్దులు వివాదాస్పదమయ్యాయి. తమకు న్యాయబద్ధంగా చెందాల్సిన ప్రాంతాలను అస్సాంలోనే ఉంచారన్నది మేఘాలయ ఆరోపణ. ఈ కారణంగానే అది అస్సాం పునర్విభజన చట్టం 1972ని సవాల్ చేస్తూ న్యాయస్థానానికి ఎక్కింది. అటు అస్సాం సైతం మేఘాలయ కోరు తున్న స్థానాలు బ్రిటిష్ కాలంనుంచే తమ ప్రాంత అధీనంలో ఉండేవని వాదిస్తూ వస్తోంది. అస్సాంకు కేవలం మేఘాలయతో మాత్రమే కాదు... నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం లతో కూడా సరిహద్దు వివాదాలున్నాయి. ఆ వివాదాలు అనేకసార్లు హింసకు దారితీశాయి. ఇంత క్రితం ఈశాన్య రాష్ట్రాలను ఏలే ముఖ్యమంత్రుల్లో చాలామంది కాంగ్రెస్ వారే అయినా, కేంద్రంలో ఆ పార్టీ నేతృత్వంలోనే చాన్నాళ్లు కేంద్ర ప్రభుత్వాలు కొనసాగినా వివాదాల పరిష్కారానికి అవి ఏమాత్రం తోడ్పడలేదు. పరిస్థితులు అదుపు తప్పినప్పుడు ఉద్రిక్త ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ బలగా లను దించడం, ఉద్యమించే పౌరులపై అణచివేత చర్యలు ప్రయోగించడం మినహా చేసిందేమీ లేదు. అందువల్లే గత యాభైయ్యేళ్లుగా సరిహద్దు సమస్యలు సజీవంగా ఉంటున్నాయి. చొరవ, పట్టుదల, చిత్తశుద్ధి, ఓపిక ఉండాలేగానీ పరిష్కారం కాని సమస్యలంటూ ఉండవు. ఎక్కడో ఒకచోట ప్రారంభిస్తే వివాదాలపై అన్ని పక్షాలకూ అవగాహన ఏర్పడుతుంది. ఇచ్చిపుచ్చు కునే విశాల దృక్ప థాన్ని ప్రదర్శిస్తే, స్వరాష్ట్రంలో ఆందోళన చెందుతున్నవారిని ఒప్పించగలిగితే సమస్యలు పటాపంచ లవుతాయి. కానీ ఆ చొరవేది? ఈశాన్య రాష్ట్రాలు భౌగోళికంగా చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ వంటి దేశాలతో సరిహద్దులను పంచుకుంటాయి. మిలిటెంట్ సంస్థలు ఆ దేశాల సరిహద్దుల వద్ద ఆశ్రయం పొందుతూ ఈశాన్య రాష్ట్రాల్లో తరచూ దాడులకు దిగడం రివాజు. ప్రభుత్వాలు తమ సమ యాన్నంతా శాంతిభద్రతలకే వెచ్చించే పరిస్థితులుండటం మంచిది కాదు. అందుకే ఆలస్యంగానైనా అస్సాం, మేఘాలయ రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదరడం సంతోషించదగ్గది. అయితే ఇప్పుడు కుదిరిన ఒప్పందంతోనే అస్సాం, మేఘాలయ మధ్య ఉన్న వివాదాలన్నీ సమసిపోతాయని భావించలేం. మొత్తం 12 అంశాలకు సంబంధించి వివాదాలుంటే ఇప్పుడు ఆరింటి విషయంలో ఒప్పందం కుదిరింది. రాజీ కుదిరిన ప్రాంతాలు మొత్తం సరిహద్దులో 70 శాతం. మిగిలిన 30 శాతంలో 36 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఉంది. అయితే ఈ విషయమై అస్సాంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించినప్పుడు దాదాపు అన్ని పార్టీలూ ప్రభుత్వ ముసా యిదాపై వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ‘ఇచ్చిపుచ్చుకునే’ పేరుతో మేఘాలయకు ఉదారంగా ఇస్తున్నదే ఎక్కువనీ, ఆ రాష్ట్రం మాత్రం బెట్టు చేస్తున్నదనీ ఆ పార్టీలు విమర్శించాయి. అయితే అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలు ఒకటి గుర్తుంచుకోవాలి. సమస్యను నాన్చుతూ పోవడం వల్ల అవి మరింత జటిలమవుతాయి. ఏళ్లు గడిచేకొద్దీ కొరకరాని కొయ్యలుగా మారతాయి. ఒకపక్క బ్రహ్మపుత్ర నది ఏటా ఉగ్రరూపం దాలుస్తూ జనావాసాలను ముంచెత్తుతుంటుంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఈనాటికీ మౌలిక సదుపాయాలు అంతంతమాత్రమే. అక్కడ తగినన్ని పరిశ్రమలు లేవు. యువకులకు ఉపాధి అవకాశాలు కూడా తక్కువ. ఆ ప్రాంత అభివృద్ధికంటూ చేసే వ్యయంలో సామాన్యులకు దక్కేది స్వల్పమే. ఈ పరిస్థితులు ఎల్లకాలం ఇలాగే ఉండటం మంచిది కాదు. ఇప్పుడు కుదిరిన ఒప్పందం ఎలాంటి అడ్డంకులూ లేకుండా సవ్యంగా సాగిపోవాలనీ, ఇతర అంశాలపై కూడా సాధ్యమైనంత త్వరగా రెండు రాష్ట్రాలూ అంగీకారానికి రావాలనీ ఆశించాలి. నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, మిజోరం సైతం సరిహద్దు వివాదాల పరిష్కారానికి ఇదే మార్గంలో కృషి చేస్తే ఈశాన్యం ప్రశాంతంగా మనుగడ సాగించగలదు. -
50 ఏళ్ల వివాదానికి చరమగీతం
న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలంగా అపరిష్కరితంగా ఉన్న సరిహద్దు వివాదానికి అసోం, మేఘాలయ రాష్ట్రాలు చరమ గీతం పాడాయి. 50 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న తమ సరిహద్దు వివాదాల పరిష్కారానికి సంబంధించిన చారిత్రక ఒప్పందంపై రెండు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి. అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖతో పాటు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 70 శాతం సరిహద్దు వివాదం పరిష్కారం ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ఒప్పందంపై ఇరువురు ముఖ్యమంత్రులు సంతకాలు చేయడాన్ని ‘చరిత్రాత్మక రోజు’గా వర్ణించారు. ఈ ఒప్పందం ద్వారా ఇరు రాష్ట్రాల మధ్య 70 శాతం సరిహద్దు వివాదం పరిష్కారమైందని వెల్లడించారు. ఈశాన్య ప్రాంతంలో శాంతి, సంస్కృతి పరిరక్షణ, అభివృద్ధిపై దృష్టి సారించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. సామరస్య పరిష్కారం ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న 884.9 కిలోమీటర్ల సరిహద్దులో ఆరు చోట్ల సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న వివాదాన్ని ఈ ఒప్పందం పరిష్కరించనుంది. ఈ ఆరు ప్రాంతాల్లో 36 గ్రామాలు ఉండగా.. 36.79 చదరపు కిలోమీటర్ల వివాదానికి సంబంధించి ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం అసోం 18.51 చదరపు కి.మీ. ప్రాంతాన్ని తమ అధీనంలో ఉంచుకుని మిగిలిన 18.28 చదరపు కి.మీ. ప్రాంతాన్ని మేఘాలయకు ఇస్తుంది. (క్లిక్: గూర్ఖాల్యాండ్ డిమాండ్‌ను వదిలిన మోర్చా) 50 ఏళ్ల వివాదం 1972లో అస్సాం నుంచి మేఘాలయను విభజించినప్పటి నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాదం కొనసాగుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం చొరవతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు రావడంతో సమస్య పరిష్కారమైంది. కాగా, అసోం సీఎంతో పాటు ప్రధాని మోదీ, అమిత్ షాలకు మేఘాలయ ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. (క్లిక్: యోగి ఆదిత్యనాథ్ వద్దే హోంశాఖ) -
కశ్మీర్ ఫైల్స్.. కేజ్రీవాల్‌కు స్ట్రాంగ్ కౌంటర్
ది కశ్మీర్ ఫైల్స్ చిత్ర విషయంలో బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కౌంటర్ పడింది. ఇంతకీ ఢిల్లీ ప్రభుత్వం తరపున ట్యాక్స్ ఫ్రీ ఉందా? లేదా? అని నిలదీశారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ. ‘మమ్మల్ని అవమానించడమో, కించపర్చడమో చేసే హక్కు మీకు లేదు. ఇంతకీ మీ రాష్ట్రం తరపున కశ్మీర్ ఫైల్స్ సినిమాకు ట్యాక్స్ మినహాయింపులు ఇస్తున్నారా? లేదా? అని ప్రశ్నించారు సీఎం హిమంత. ‘‘ఏం చేయాలనుకుంటున్నారో చేయండి.. అంతేకానీ హిందూ వ్యతిరేకిగా మారకండి’’ అంటూ కేజ్రీవాల్‌కు హితవు పలికారు హిమంత. మన హిందూ సమాజం (సమాజం) ఈ స్థితిలో ఉందంటే.. హిందూ కుటుంబంలో ఎక్కువ హిందూ వ్యతిరేకులుగా ఉండడమే కారణం. లేకుంటే.. ఒకప్పటిలా హిందూ నాగరికత.. ప్రపంచానికి మార్గాన్ని చూపేదే అంటూ పేర్కొన్నారు హిమంత. గతంలో కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా ఎన్నో సినిమాలకు ట్యాక్స్ ఫ్రీ ప్రకటించింది. ఆ టైంలో మరి ఆయన ఆ సినిమాలను యూట్యూబ్‌లో ఎందుకు అప్లోడ్ చేయమని అడగలేదు? కేవలం కశ్మీర్ ఫైల్స్ విషయంలోనే ఆయన అక్కసు ఎందుకు? అంటూ నిలదీశారు అస్సాం సీఎం హిమంత. సంబంధిత వార్త: కశ్మీర్ ఫైల్స్‌ను యూట్యూబ్‌లో పెట్టండి -
భారత బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడిగా పుల్లెల గోపీచంద్
జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ‘బాయ్’ సాధారణ సర్వ సభ్య సమావేశంలో హిమంత బిశ్వశర్మను మరోసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 2026 వరకు కొనసాగనున్న ఈ నూతన కార్యవర్గంలో 11 మంది ఉపాధ్యక్షులు, ఎనిమిది మంది సంయుక్త కార్యదర్శలు, ఎనిమిది మంది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఉన్నారు. జనరల్ సెక్రటరీగా సంజయ్ మిశ్రా, కోశాధికారిగా హనుమాన్‌దాస్ లఖాని ఎన్నికయ్యారు. చదవండి: IPL 2022: ఐపీఎల్లో ఆడుతున్న తెలుగు ఆటగాళ్లు ఎవరో తెలుసా? -
ఈ విజయం ఎలా సాధ్యమైంది?
నవభారతంలో అభివృద్ధి మాత్రమే చిట్టచివరి డెలివరీగా ఉంటుందని ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు నిరూపించాయి. కేంద్ర పాలనా నమూనా దేశవ్యాప్తంగా బీజేపీ విజయానికి బాటలేసిందనడానికి ఈ ఎన్నికల ఫలితాలే గీటురాయి. ఈ ఫలితాలు సాంప్రదాయిక రాజకీయ వివేచనను ప్రశ్నించాయి. ఈ విజయానికి కారణమైన ప్రభుత్వ నమూనా ఏమిటి? ప్రధానిపై ప్రజలు పెట్టుకున్న అసాధారణ విశ్వాసం, అభిమానంలో ఈ నమూనా పాదుకుని ఉంది. ఇది సహకారాత్మక సమాఖ్య వ్యవస్థ సూత్రాలతో ప్రభావితమైంది. నూతన భారత్ వైపుగా సాగే ప్రయాణంలో అత్యంత వెనుకబడిన ప్రజానీకాన్ని కలుపుకొని పోవడమే లక్ష్యంగా కేంద్ర పథకాలు అమలవుతూ వచ్చాయి. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంతో సరిపెట్టుకోకుండా, భారతీయ పౌరులతో ప్రత్యక్షంగా సంబంధం పెట్టుకోవడమే ఈ పాలనా నమూనాకు ఆత్మ. ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన అఖండ విజయానికిగానూ, నా తోటి కార్యకర్తలకూ, పార్టీ నేతలకూ, తోటి ముఖ్యమంత్రులకూ అభినందనలు తెలుపుతున్నాను. ఈ చారిత్రక విజయం వైపు మనల్ని ఏది నడిపించింది అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ వచ్చాను. భారత రాజకీయ చరిత్రలో 2014 సంవత్సరం మూల మలుపును తీసుకొచ్చింది. ప్రజలను హృదయంలో నిలుపుకొన్న సరికొత్త పాలనా వ్యవస్థ, పరిపాలన ఆ సంవత్సరమే ఉనికిలోకి వచ్చింది. నరేంద్ర మోదీ పాలనా నమూనా దేశవ్యాప్తంగా బీజేపీ విజయానికి బాటలేసిందనడానికి ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే గీటురాయి అని చెప్పాలి. మోదీ ప్రభావం లోక్‌సభ ఎన్నికల్లో మాత్రమే శక్తిమంతంగా పనిచేస్తుందనీ, రాష్ట్రాల ఎన్నికల్లో అది పెద్దగా ప్రభావం చూపదనీ రాజకీయ పండితులు చెబుతూ రావడంతో ప్రతిపక్ష పార్టీలు దాని ఆధారంగా అనేక తప్పులెక్కలు వేసుకున్నాయి. అయితే ప్రభుత్వ వ్యతిరేకత, కులపరమైన ప్రయోగాలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వారికి అనుకూలంగా పనిచేయలేదు. ఈ ఫలితాలు సాంప్రదాయిక రాజ కీయ వివేచనను ప్రశ్నించాయి. సత్పరిపాలనను కీలకంగా తీసుకోని అల్పరాజకీయాలను అవి తుంగలో తొక్కాయి. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఉత్తరప్రదేశ్‌లోనూ (37 సంవత్సరాలు), ఉత్తరా ఖండ్‌లోనూ ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీనే మళ్లీ అధికారంలోకి వచ్చింది. ప్రజాతీర్పు ఇంత అద్భుతంగా ఉంటుందని కొన్ని సంవత్స రాల క్రితం అయితే ఏ రాజకీయ పండితుడూ, వ్యూహకర్తా ఊహించ లేదు. ఈ అభివృద్ధి నమూనా ఏమిటి? మరి, మోదీ ప్రభుత్వ నమూనా అంటే ఏమిటి? గత పదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న నేను చాలా సన్నిహితంగా ఈ నమూనాను పరిశీలుస్తూ అసోంలో విజయం కోసం ప్రయత్నిస్తూ వచ్చాను. ప్రధానిపై ప్రజలు పెట్టుకున్న అసాధారణ విశ్వాసం, అభిమానంలో ఈ నమూనా పాదుకుని ఉంది. ఇది సహకారాత్మక సమాఖ్య వ్యవస్థ సూత్రాలతో ప్రభావితమైంది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి కార్యాలయంతో, ఇతర కేంద్ర మంత్రివర్గ కార్యాలయాలతో సంపూర్ణంగా మిళితం అయ్యాయి కాబట్టే ప్రధాని ప్రారంభించిన కీలక పథకాలను కూడా అత్యంత నిర్దిష్టంగా చివరివరకూ అమలు చేయగలుగుతున్నారు. ఈ డబుల్ ఇంజిన్ పాలనా నమూనా వల్లే పథకాలను అమలు చేయగలుగుతున్నామని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని ప్రశంసిస్తున్నాయి. ఇదే గేమ్ చేంజర్ అయింది. ఉత్తరప్రదేశ్ ఉదంతమే తీసుకోండి. ప్రధానమంత్రి కిసాన్ యోజన వల్ల 2.5 కోట్లమంది రైతులు ప్రయోజనం పొందారు. ఇక ప్రధానమంత్రి ఉజ్వల పథకం కిద 1.5 కోట్ల సిలిండర్లను ఉత్తరప్రదేశ్ మహిళలు పొందగలిగారు. అంటే ఆఖిల భారత స్థాయిలో ఇది 17 శాతం అన్నమాట. ప్రధాని ఆవాస్ యోజన పథకం కింద పది లక్షల గృహాలు నిర్మించి ఇచ్చారు. 1.3 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డులను యూపీలో పంపిణీ చేశారు. మరో 15 కోట్లమంది ప్రజలు ప్రధాని గరీబ్ కల్యాణ్ యోజన కింద ఉచిత రేషన్ కార్డులు పొందారు. మణిపూర్‌లో ఈ పథకం కింద 22 లక్షలమంది ప్రజలు ఉచిత రేషన్ కార్డులు పొందారు. మరో 60 వేల గృహాలను పీఎం ఆవాస్ యోజన కింద నిర్మించి ఇచ్చారు. ఇవన్నీ విజయవంతమైన పాలనకు సాక్ష్యాధారాలు. అలాగే ఈశాన్య భారత రాష్ట్రాలు, తీర ప్రాంత రాష్ట్రాలపై ప్రధాని ప్రత్యేక దృష్టి పెట్టినందువల్లే గోవా, మణిపూర్ ప్రజలు బీజేపీ ప్రభుత్వాలపై తమ విశ్వాసాన్ని మళ్లీ ప్రకటించారు. నేరుగా అందించే తరహా సంక్షేమం 2014 నుంచి ప్రధాని నరేంద్రమోదీ కొన్ని పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టినందువల్లనే కుటుంబం ఒక యూనిట్‌గా అసలైన అభివృద్ధినీ, దారిద్య్ర నిర్మూలననూ సాధించడానికి వీలుపడింది. జిల్లాల అభి వృద్ధితో మొదలై బ్లాక్ అభివృద్ధి వరకు పథకాలు సాధించిన విజయం గానీ, జల్ జీవన్ మిషన్ గానీ, దేశవ్యాప్తంగా టాయిలెట్ల నిర్మాణం గానీ ఏది తీసుకున్నా సరే... నూతన భారత్ వైపుగా సాగే ప్రయా ణంలో అత్యంత వెనుకబడిన ప్రజానీకాన్ని కలుపుకొని పోవడమే లక్ష్యంగా కేంద్ర పథకాలు అమలవుతూ వచ్చాయి. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంతో సరిపెట్టుకోకుండా, భారతీయ పౌరులతో ప్రత్యక్షంగా సంబంధం పెట్టుకోవడమే ఈ పాలనా నమూనాకు ఆత్మగా నిలుస్తుంది. జన్‌ధన్, ఆధార్, మొబైల్ త్రయం వంటి టెక్నాలజీని విస్తృతంగా వినియోగించడం ద్వారా పేదల్లోని నిరు పేదలకు ప్రయోజనాలను నేరుగా అందించే తరహా సంక్షేమ నమూనాకు ఈ పాలనా నమూనా అత్యంత సన్నిహితంగా ఉంటుంది. టెక్నాలజీ ప్రాతిపదికన సాగే ఈ వైఖరి ఉచిత సరఫరా యంత్రాంగానికి సరైన నిర్వచనం ఇచ్చింది. ‘యూపీఏ’ ప్రభుత్వ హయాంలో ఇలాంటి వైఖరి ఉండేది కాదు. వాస్తవానికి మోదీ ప్రభుత్వ నమూనా ఆయన రేడియో షో ‘మన్ కీ బాత్’కు విస్తృత రూపమే అని చెప్పాలి. ఈ షోలో ఆయన తన ప్రజలతో నేరుగా కనెక్ట్ అవుతారన్నది తెలిసిందే. దీన్ని మరింతగా వివరించాలంటే, ఈ నమూనా నుంచి పుట్టుకొచ్చిన అన్ని పథకాలూ అంటే పీఎం ఉజ్వల, పీఎం కిసాన్, జన్ ధన్, ఎన్ఆర్ఈజీఏ, పీఎం ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం గరీబ్ కళ్యాణ్... ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధించిన అన్ని రాష్ట్రాల్లోనూ విజయవంతంగా అమలవుతూ వచ్చాయి. ఈ పథకాలకు చాలావరకు కేంద్రమే నిధులిచ్చింది గానీ రాష్ట్రస్థాయిలో అమలయ్యాయి. ప్రధానమంత్రి కార్యాలయంతో ముఖ్యమంత్రి కార్యాలయం సన్నిహితంగా సమన్వయంతో పనిచేసింది కాబట్టే ఈ విజయం సాధించగలిగాము. ప్రధాని నిర్దేశించిన అన్ని పథకాలూ లబ్ధిదారులకు అందేలాగా అమలు చేయాల్సిన బాధ్యతను ముఖ్యమంత్రిగా నేను తీసుుకున్నాను. పథకాలే గెలిపించాయి ఇటీవలే ముగిసిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ప్రధాని గరీబ్ కళ్యాణ్ యోజన, పీఎమ్ కిసాన్, పీఎమ్ ఉజ్వల, జన్‌ధన్, ఆయుష్మాన్ భారత్ పథకాలను అత్యంత సమర్థవంతమైన ప్రభుత్వ పథకాలుగా భావించారని 2022 సీఎస్డీఎస్ పోస్ట్ పోల్ సర్వే నివేదించింది. ప్రత్యేకంగా ఈ పథకాల లబ్ధిదారులు, ముఖ్యంగా పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా లబ్ధి పొందినవారే బీజేపీకి ఎక్కువగా ఓటేశారని సర్వేలు చెప్పాయి. ఈ వివరాలు బీజేపీ కార్యకర్తలను ఆశ్చర్యంలో ముంచెత్తలేదు గానీ... ఇతరులకు మాత్రం ఈ నమూనా ప్రభుత్వ వ్యతిరేకతనూ, వ్యతిరేక ప్రచారాన్నీ తటస్థం చేసిందని బోధపడేలా చేసింది. ప్రధానమంత్రి కార్యాలయంతో అవాంఛిత ఘర్షణలకు దిగే వారికీ, కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉద్దేశపూర్వకంగా వంచించే వారికీ ఎన్నికల్లో విజయాలు సిద్ధించవని రాజకీయ పరిశీలకులకు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గుణపాఠం నేర్పాయి. పంజాబ్ దీనికి చక్కటి ఉదాహరణ. నూతన భారత ఓటర్లు అభివృద్ధిని డిమాండ్ చేస్తున్నారు గానీ డ్రామాలను కాదు. నవభారతంలో అభివృద్ధి మాత్రమే చిట్టచివరి డెలివరీగా ఉంటుంది. దీనికోసం రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా శ్రమించాల్సి ఉంటుంది. భారతదేశాన్ని మరోసారి విశ్వగురుగా మార్చాలనే దార్శనికతతో మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను జరుపుకొంటున్నాం. మనం కలిసి పనిచేయడం ద్వారానే ఈ లక్ష్యాన్ని సాధించగలం. మోదీ నమూనా ఈ లక్ష్యాన్ని సాధించేలా కనబడుతోంది. హిమంతా బిశ్వ శర్మ వ్యాసకర్త అస్సాం ముఖ్యమంత్రి (‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో...) -
అస్సాంని మరో కశ్మీర్‌గా మార్చకండి!...కీలక వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం
Ten Years Back Muslims Are Not Minority: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అస్సాం జనాభాలో 35 శాతం ముస్లింలు ఉన్నారని అన్నారు. ఈశాన్య రాష్ట్రంలో ఇకపై వారిని మైనారిటీలుగా పరిగణించలేరని కూడా స్పష్టం చేశారు. 1990లో కాశ్మీరీ హిందువుల వలసలను గురించి కూడా ప్రస్తావించాడు. అంతేగాదు బాలీవుడ్ చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'లో చూపిన విధంగా అస్సాం మారుతుందేమో అని ఇతర వర్గాల్లో రేకెత్తుతున్న భయాలను తొలగించడం రాష్ట్రంలోని ముస్లింల కర్తవ్యం అని చెప్పారు. అస్సాం అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా శర్మ మాట్లాడుతూ, “ఈ రోజు ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలు, సమాన అవకాశాలు, అధికారాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి దానిని నిర్ధారించడం వారి కర్తవ్యం. గిరిజనుల హక్కులు పరిరక్షించబడతాయని వారి భూములు ఆక్రమించబడవు అని భరోసా ఇచ్చారు. ఆరో షెడ్యూల్ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల భూములను ఆక్రమించాల్సిన అవసరం లేదు. బోరా, కలిత (అస్సామీ ఇంటిపేర్లు) ఈ భూమిలో స్థిరపడకపోతే ఇస్లాం, రెహమాన్ (ముస్లిం ఇంటిపేర్లు) కూడా ఆ భూముల్లో స్థిరపడవు. అధికారం బాధ్యతతో వస్తుంది. అస్సాం జనాభాలో ముస్లింలు 35 శాతం ఉన్నందున ఇక్కడ మైనారిటీలను రక్షించడం వారి కర్తవ్యం" అని ముఖ్యమంత్రి అన్నారు. అస్సామీ ప్రజలు భయాందోళనలో ఉన్నారు, సంస్కృతి, నాగరికత రక్షింపబడతుందో లేదో అనే భయంతో ఉన్నారని చెప్పారు . సామరస్యం అంటే టూ-వే ట్రాఫిక్ అని చెప్పారు. ముస్లింలు శంకరి సంస్కృతి, సత్త్రియ సంస్కృతి రక్షణ గురించి మాట్లాడనివ్వండి.. అప్పుడే సామరస్యం ఉంటుందని నొక్కి చెప్పారు. పదేళ్ల క్రితం ముస్లీంలు మైనారిటీలు కాదు కానీ ఇప్పుడు మైనారిటీలుగా ఉన్నారని తెలిపారు. ఇతర వర్గాల్లో మెదులుతున్న భయాల్ని ముస్లీంలు పోగొట్టాలి. ఇక్కడ మరో కశ్మీర్ పునరావృతం కాదని మాకు భరోసా ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. (చదవండి: రెండోసారి సీఎంలుగా ప్రమోద్ సావంత్, బీరేన్ సింగ్)