దిస్‌పూర్: నిత్యం తన స్టేట్‌మెంట్లతో, దూకుడు నిర్ణయాలతో వార్తల్లో నిలిచే అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ.. హుషారుగా జానపద నృత్యంతో ఆకట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం తన నివాసంలో జరిగిన ఓ ఈవెంట్‌లో ఆయన సందడి చేశాడు. అంతేకాదు.. ఆ వీడియోను స్వయంగా ఆయనే ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
ఝుమూర్ ప్రదర్శనను చూస్తూ ఉండలేకపోయా అంటూ తన ఉత్సాహాన్ని చెప్పకనే చెప్పారాయన. హతింగా టీఈ మోడల్ స్కూల్ విద్యార్థులు.. సీఎం స్వగృహంలో ఆదివారం సాయంత్రం పలు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ముందుగా అస్సాం టీ తోటల్లో పని చేసే వాళ్ల సంప్రదాయ నృత్యం ‘ఝూమూర్’ ప్రదర్శన ఇచ్చారు. అందులో ఆయన సైతం వాళ్లతో కలిసి డ్యాన్స్‌లు చేశారు. ఈ సందర్భంగా..
వాళ్లను ఉత్సాహపరిచే ఉద్దేశంతో స్టేజ్ ఎక్కిన సీఎం హిమంత శర్మ.. స్టెప్పులేశారు. ఆయన్ని చూసి మరికొందరు విద్యార్థినిలు స్టేజ్ ఎక్కారు. ఇక శర్మ భార్య రింకీ భూయాన్ శర్మ కూడా వాళ్లతో కలిశారు. ఈ కార్యక్రమానికి జానపద సంగీత వాయిద్యకారులు పద్మశ్రీ దులాల్ మాన్‌కీ, ప్రముఖ సింగర్ గీతాంజలి దాస్ సైతం హాజరై ప్రదర్శన ఇచ్చారు. కార్యక్రమం తర్వాత సీఎం హిమంత శర్మ.. విద్యార్థులతో కలిసి డిన్నర్ చేశారు.
An evening to cherish!
— Himanta Biswa Sarma (@himantabiswa) January 9, 2023
Couldn't help but join the students of Hatinga TE Model School of Biswanath performing jhumur at my residence. pic.twitter.com/rsZXzhB1vK
Comments
Please login to add a commentAdd a comment