Folk dance
-
లోకల్ టాలెంట్ కాదు అమెరికాస్ గాట్ టాలెంట్
కాళ్ల కింద రెండు గ్లాసులు, తల మీద గ్లాస్‌పై గ్లాస్ పద్దెనిమిది గ్లాస్లు పెట్టుకొని వాటిపై కుండ పెట్టుకొని రెండడుగులు వేయడమే కష్టం. అలాంటిది డ్యాన్స్ చేయడం అంటే మాటలు కాదు కదా! రాజస్థాన్‌కు చెందిన ప్రవీణ్ ప్రజాపత్ నిన్న మొన్నటి వరకు లోకల్ టాలెంట్. ఇప్పుడు మాత్రం అమెరికాస్ గాట్ టాలెంట్. ఫోక్ డ్యాన్సర్ అయిన ప్రవీణ్‌కు అమెరికాస్ గాట్ టాలెంట్ (ఏజీటి)లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకొని ‘స్టాండింగ్ ఒవేషన్’ అందుకున్నాడు. కాళ్ల కింద 2 గ్లాసులు(డ్యాన్స్ ప్రారంభంలో) తల మీద 18 గ్లాస్లు వాటిపై ఒక కుండతో ప్రవీణ్ చేసిన ‘మట్కా భవ’ డ్యాన్స్ ఆడిటోరియంను ఉర్రూతలూగించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. -
చిన్నారులతో కలిసి హుషారుగా గంతులేసిన సీఎం
దిస్పూర్: నిత్యం తన స్టేట్మెంట్లతో, దూకుడు నిర్ణయాలతో వార్తల్లో నిలిచే అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ.. హుషారుగా జానపద నృత్యంతో ఆకట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం తన నివాసంలో జరిగిన ఓ ఈవెంట్లో ఆయన సందడి చేశాడు. అంతేకాదు.. ఆ వీడియోను స్వయంగా ఆయనే ట్విటర్లో పోస్ట్ చేశారు. ఝుమూర్ ప్రదర్శనను చూస్తూ ఉండలేకపోయా అంటూ తన ఉత్సాహాన్ని చెప్పకనే చెప్పారాయన. హతింగా టీఈ మోడల్ స్కూల్ విద్యార్థులు.. సీఎం స్వగృహంలో ఆదివారం సాయంత్రం పలు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ముందుగా అస్సాం టీ తోటల్లో పని చేసే వాళ్ల సంప్రదాయ నృత్యం ‘ఝూమూర్’ ప్రదర్శన ఇచ్చారు. అందులో ఆయన సైతం వాళ్లతో కలిసి డ్యాన్స్‌లు చేశారు. ఈ సందర్భంగా.. వాళ్లను ఉత్సాహపరిచే ఉద్దేశంతో స్టేజ్ ఎక్కిన సీఎం హిమంత శర్మ.. స్టెప్పులేశారు. ఆయన్ని చూసి మరికొందరు విద్యార్థినిలు స్టేజ్ ఎక్కారు. ఇక శర్మ భార్య రింకీ భూయాన్ శర్మ కూడా వాళ్లతో కలిశారు. ఈ కార్యక్రమానికి జానపద సంగీత వాయిద్యకారులు పద్మశ్రీ దులాల్ మాన్‌కీ, ప్రముఖ సింగర్ గీతాంజలి దాస్ సైతం హాజరై ప్రదర్శన ఇచ్చారు. కార్యక్రమం తర్వాత సీఎం హిమంత శర్మ.. విద్యార్థులతో కలిసి డిన్నర్ చేశారు. An evening to cherish! Couldn't help but join the students of Hatinga TE Model School of Biswanath performing jhumur at my residence. pic.twitter.com/rsZXzhB1vK — Himanta Biswa Sarma (@himantabiswa) January 9, 2023 -
Jogati Manjamma Story: చచ్చిపోదామని విషం తాగాను
-
వారినలా విసిరివేయకండి: చచ్చిపోదామని విషం తాగాను
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న జానపద నృత్యకారిణి మంజమ్మ జోగతి. పద్మశ్రీ పొందిన తొలి ట్రాన్స్‌విమెన్. కేవలం జోగప్పలకు పరిమితమైన జోగతి నృత్యాన్ని మరింత విస్తరించాలనేది ఆమె కల. ఈ నేపథ్యంలో ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగానే ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంగా ఇండియా టుడేకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు మంజమ్మ. పదిహేనేళ్లు ఉన్నప్పుడు ట్రాన్స్‌జెండర్‌గా కుటుంబానికి దూరమయ్యారు. ఇంటినుంచి బైటపడి బతుకుదెరువు కోసం వీధుల్లో భిక్షాటన చేయడమే కాదు, ఆమె పలుమార్లు లైంగిక వేధింపులకు గురయ్యారు. ఒకానొక దశలో విషం తాగి చచ్చిపోవాలకుని ఆత్మహత్యాయత్నం చేశారు. కానీ ప్రాణాలతో బయటపడ్డారు. అయినా 20 మంది తోబుట్టువులతో సహా ఆమె కుటుంబ సభ్యులెవరూ తనను పలకరించేందుకు ఆసుపత్రికి రాలేదని ఆమె వాపోయారు. ఈ అవార్డు ద్వారా, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ హక్కులను గుర్తించి వారికి విద్య, ఉద్యోగాలు అందించేలా ప్రభుత్వాలు పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. నిర్లక్ష్యం చేయకుండా, మూలకు విసిరి వేయకుండా తనలాంటి ట్రాన్స్‌జెండర్ పిల్లలను ఆదరించాలని ఆమె ఉద్వేగ భరితంగా చెప్పుకొచ్చారు. మంజమ్మ అసలు పేరు మంజునాథ్ శెట్టి. 1964 ఏప్రిల్ 18న బళ్లారి, కల్లుకాంబ గ్రామంలో హనుమంతయ్య, జయలక్ష్మి దంపతులకు జన్మించిన మంజునాథ్ అలియాస్ మాత మంజమ్మ జోగతి జీవిత విశేషాలపై ఆసక్తికర వీడియో మీకోసం.. -
జానపద చంద్రిక
జానపద నృత్యాలు చేయడంలో తనకు తానే సాటి అనిపించుకుంటోంది చిన్నారి శతాక్షి. ఐదవ తరగతిలో చేరే నాటికే దాదాపు 500ల ప్రదర్శనలు ఇచ్చింది. అవధేశ్శర్మ, సీతాశర్మల కుమార్తె శతాక్షి. వీరిది ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరం. ప్రస్తుతం నల్గొండజిల్లా చిట్యాలలో ఉంటున్నారు. శతాక్షి తండ్రి స్థానికంగా మార్బుల్స్ గ్రానైట్ కంపెనీ మేనేజర్‌గా, తల్లి బ్యుటీషియన్ పనిచేస్తున్నారు. నార్కెట్‌పల్లిలోని శ్రీవిద్యాపీఠంలో ఐదవ తరగతి చదువుతున్న శతాక్షి చిన్నప్పటి నుంచి టీవీల్లో వచ్చే నృత్య ప్రదర్శనలు ఆసక్తిగా తిలకించడమే కాదు, అందుకు అనుగుణంగా నృత్యం చేసేది. అప్పుడు ఆలవాటైన ఆ నృత్య కదలికలు ఇప్పుడు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి. ఫస్ట్ క్లాసులో ఉన్నప్పుడు పాఠశాల వార్షికోత్సవంలో జానపద నృత్యం చేసి అందరినీ ఆకట్టుకుంది. మొదటి బహుమతి కూడా గెలుచుకుంది. ఈ నృత్యం ఎంత గుర్తింపు తెచ్చిందంటే ఆ చుట్టుపక్కల ఎక్కడ సాంస్కృతిక కార్యక్రమం జరిగినా శతాక్షి ‘జానపద నృత్యం’ తప్పనిసరిగా ఉండేది. ఇటీవల రవీంద్రభారతి వేదికపై ‘ కైకలూరి సిన్నదాన్ని’ అనే జానపద పాటకు అనుగుణంగా రయ్ రయ్ అంటూ నృత్యం చేస్తుంటే ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. చప్పట్ల హోరుతో హాలు మార్మోగిపోయింది. ‘‘అమ్మో... చిన్నారి కాదు... పిడుగు... జింక పిల్లలా నృత్యం చేస్తుంటే చూడడానికి అందంగా... ఆనందంగా ఉంది’’ అని రాష్ట్ర సాంస్కృతికశాఖ సంచాలకులు రాళ్లబండి కవితాప్రసాద్ ఆనందంతో ఆశ్చర్యపోతే, ‘‘జానపద నృత్యకారిణిగా శతాక్షి భవిష్యత్తులో ఉన్నతస్థాయికి చేరుకుంటుంది’’ అని దూరదర్శన్ డెరైక్టర్ శైలజా సుమన్ కితాబు ఇచ్చారు. 2011లో కొత్తగూడెంలో బాలల దినోత్సవం సందర్భంగా జరిగిన రాష్ట్ర స్థాయి జానపద నృత్య పోటీల్లో ప్రథమ బహుమతి సొంతం చేసుకున్న శతాక్షి కేవలం జానపద నృత్యాల్లోనే కాకుండా సినిమా పాటలు, వెస్ట్రన్ మ్యూజిక్‌కి అనుగుణంగా నృత్య ప్రదర్శన చేయటంలో ప్రావీణ్యత సాధించింది. చదువుకు ఆటంకం రాకుండా సెలవు రోజుల్లో నాట్యగురువు వీరునాయుడు దగ్గర మెలకువలు నేర్చుకుంటున్న శతాక్షి ‘‘అంతర్జాతీయ ఫోక్ డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకోవాలని ఉంది, నృత్య ప్రదర్శనల ద్వారా వచ్చిన డబ్బుతో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తాను’’ అంటోంది. చిన్నారి శతాక్షి కోరిక నెరవేరాలని కోరుకుందాం. - కోన సుధాకర్‌రెడ్డి