సాక్షి, గౌహతి : ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ అవినీతికి పాల్పడిందంటూ సోషల్ మీడియా పోస్ట్‌లపై అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీకి విరాళం ఇచ్చిన సంస్థతో అస్సాం ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంఒయు)పై సంతకం చేసిందని పేర్కొంటూ నాగోన్ కాంగ్రెస్ ఎంపీ బోర్డోలోయ్ ఎక్స్.కామ్‌లో పోస్ట్ చేశారు. ఎలక్టోరల్ బాండ్లతో బీజేపీ అవినీతి ఏ స్థాయిలో ఉందో చూడండి అంటూ ఓ యాష్ ట్యాగ్‌ను జోడించారు.
దీనిపై అస్సోం సీఎం హిమంత బిస్వా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పోస్ట్‌లు పెట్టిన కాంగ్రెస్ ఎంపీ ప్రద్యుత్ బోర్దోలోయ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, పూర్తిగా నిరాధారమైనవి అంటూ కొట్టి పారేశారు.
‘అస్సాం ప్రభుత్వం ఎంఎస్ బ్రైట్ స్టార్ ఇన్వెస్ట్‌మెంట్స్ మధ్య క్విడ్ ప్రోకో జరిగిందంటూ చేస్తున్న ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అస్సాం ప్రభుత్వానికి ఈ సంస్థతో ఎటువంటి వ్యాపార ఒప‍్పందాలు లేవు. ప్రగ్జ్యోతిష్‌పూర్ మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పేర్కొన్న ఎంఓయు దాతృత్వ విరాళం మాత్రమేనని, దీని పనులు వేగంగా జరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో ప్రజలకు అంకితం చేస్తామని సీఎం బిస్వా శర్మ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment