
గువాహటి : బీజేపీ నేత, అస్సాం మంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.
ఆరోగ్యశాఖ మంత్రి అయిన బిస్వా బుధవారం నూతన ఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందించే కార్యక్రమానికి హాజరై ప్రసంగిస్తూ ... గత జన్మలో చేసిన పాపాల మూలంగానే మనుషులకు దీర్ఘకాలిక రోగాలు వస్తున్నాయంటూ.. కాన్సర్ వంటి రోగాల వెనుక, యాక్సిడెంట్‌లలో మనుషులు చనిపోవటానికి కూడా కర్మే కారణమంటూ చెప్పారు. దీనిపై హేతువాదులు, పాత్రికేయులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు బిస్వాపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
అయితే ఆ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలంటూ పల్లవి ఘోష్ అనే జర్నలిస్ట్ ఆయన్ని డిమాండ్ చేయగా.. బిస్వా వేదాంత ధోరణిలో వివరణ ఇచ్చుకున్నారు. పాపాని-కర్మకు మధ్య చాలా తేడా ఉంది. అది గుర్తించండి. రాజకీయాలు వస్తూ పోతూ ఉంటాయ్. కానీ, భవద్గీతలో ఏదైతే చెప్పబడిందో అదే శాశ్వతం. నేను దాన్నే పాటిస్తాను’’ అని బిస్వా సమాధానమిచ్చారు. తాను కేవలం ఉపాధ్యాయులకు ప్రేరణ కల్పించే ఉద్దేశంతోనే అలాంటి ఉపన్యాసం ఇచ్చానే తప్ప.. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పిదం లేదని ఆయన చెప్పుకొచ్చారు.
కాగా, ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత పి. చిదంబరం, కపిల్ సిబల్ ట్విట్టర్‌లో మండిపడ్డారు. అయితే వారికి కౌంటర్లు ఇస్తు బిస్వాని ట్విట్టర్‌లో వరుస ట్వీట్లు చేస్తూ వస్తున్నారు. తమిళ మానిల కాంగ్రెస్ నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరారంటూ చిదంబరాన్ని, రాహుల‘పిడి’ ట్వీట్‌ను తెరపైకి తెచ్చి బిస్వా వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment