derogatory comments
-
మహిళా జర్నలిస్ట్‌పై అసభ్య వ్యాఖ్యలు.. చిక్కుల్లో శివసేన షిండే వర్గం నేత
ముంబై: బద్లాపూర్‌లో చిన్నారులపై జరిగిన హత్యాచారాన్ని కవర్ చేస్తున్న ఓ మహిళా జర్నలిస్ట్‌పై శివసేన (షిండే) వర్గం నేత చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు వివాదాస్పదయ్యాయి. హత్యాచార ఘటనను కవర్ చేస్తున్న తనపై శివసేన (షిండే) వర్గం నేత వామన్ మాత్రే.. అసభ్య వ్యాఖ్యలు చేశారని స్థానిక టీవీలో పనిచేసే మహిళా జర్నలిస్టు తెలిపారు. ‘‘బాద్లాపూర్ మాజీ మేయర్ అయిన వామన్ మాత్రే నాపై చేసిన వ్యాఖ్యలు, ఆయన ప్రవర్తన ఆమోద యోగ్యం కాదు. ఆయన వ్యాఖ్యలు నాకు చాలా ఆగ్రహం కలిగించాయి. నేను నిజాల ఆధారంగానే హత్యాచార ఘటనను కవర్ చేశాను’’ అని మహిళా జర్నలిస్ట్ అన్నారు. అనంతరం వామన్ మాత్రే స్పందిసూ.. జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మహిళా జర్నలిస్ట్ శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గంతో కుమ్మక్కు అయ్యారని అన్నారు. ‘‘ఇది ఆ మహిళా జర్నలిస్ట్ చేస్తున్న ఒక స్టంట్. ఆమె నాకు చాలా రోజుల నుంచి తెలుసు. ఆమె శివసేన(యూబీటీ)కి అనుకూలంగా పనిచేస్తారు. మీరు ఈ సంఘటనను రెండుమూడు రోజులుగా కవర్ చేస్తున్నారు. బాలికలపై దాడి జరిగిందా? లేదా? అనే దాని గురించి సరైన సమాచారాన్ని నివేదించాలని అడిగాను. అంతేకాని, నేను ఆమెతో అసభ్యంగా మాట్లాడలేదు’’ అని అన్నారు.మరోవైపు.. వామన్ మాత్రే చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిచాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. మాత్రే వ్యాఖ్యలను ముంబై ప్రెస్ క్లబ్ ఖండించింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కోరింది. ప్రజల సెంటిమెంట్‌ను, పత్రికా గౌరవాన్ని ఇలా నిర్లక్ష్యం చేయడం ఆమోదయోగ్యం కాదని ఒక ప్రకటనలో పేర్కొంది. -
స్మృతి ఇరానీకి మద్దతుగా రాహుల్ గాంధీ ట్వీట్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. కేంద్రమాజీ మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీకి మద్దతుగా ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచడం చర్చనీయాంశంగా మారింది.2019 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లోనూ వీళ్ల మధ్య పోటీ ఉండొచ్చని భావించినప్పటికీ.. అనూహ్యంగా రాయ్‌బరేలీ నుంచి రాహుల్ పోటీ చేశారు. ఈ క్రమంలో స్మృతి ఇరానీ, రాహుల్‌ను ఎద్దేవా చేస్తూ కాంగ్రెస్‌పై కామెంట్లు చేశారు. అయితే కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కిషోరీ లాల్ శర్మ, స్మృతి ఇరానీని ఓడించారు.ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక.. తాజాగా స్మృతి ఇరానీని దూషిస్తూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తున్న సంగతి రాహుల్ గాంధీ దృష్టికి వచ్చింది. దీంతో ఆమెకు మద్దతుగా ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు.జీవితంలో గెలుపోటములు వస్తుంటాయి. అలాగని ఒకరిని కించపర్చడం, అవమానించడం సరికాదు. పైగా అది బలహీనత అవుతుందే తప్ప.. బలం అనిపించుకోదు. స్మృతి ఇరానీనో లేదంటే ఇతర నాయకుల్ని అవమానించడం, దుర్భాషలాడడంలాంటివి చేయొద్దని కోరుతున్నా అని రాహుల్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. Winning and losing happen in life. I urge everyone to refrain from using derogatory language and being nasty towards Smt. Smriti Irani or any other leader for that matter. Humiliating and insulting people is a sign of weakness, not strength.— Rahul Gandhi (@RahulGandhi) July 12, 2024 -
UK:మేయర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఎంపీ సస్పెండ్
లండన్: బ్రిటన్ అధికార కన్జర్వేటివ్ పార్టీ.. తన సొంతపార్టీ ఎంపీ, మాజీ డిప్యూటీ చైర్మన్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. లండన్ మేయర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ లీ అండర్సన్‌ను ప్రధానమంత్రి రిషి సునాక్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు శనివారం కన్జర్వేటివ్ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. లండన్ మేయర్ సాదిక్ ఖాన్‌పై ఇస్లామిస్టుల ప్రభావం ఉందని, వారి నియంత్రణలో ఆయన ఉన్నారని ఓ టీవీ ఇంటర్వ్యూలో ఎంపీ లీ అండర్సన్ అన్నారు. దీంతో అయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రధాన మంత్రి రిషి సునాక్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు జాత్యహంకార పూరితమైనవి అని వెంటనే క్షమాపణలు చేప్పాలని పెద్దఎత్తన డిమాండ్ చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పడానికి లీ అండర్సన్ నిరాకరించారు. ‘లండన్ మేయర్‌పై లీ ఆండర్సన్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపన చెప్పడానికి నిరాకరించారు. దీంతో పార్టీ చీఫ్ విప్.. ఆయన్ను ఎంపీ పదవిపై సప్పెన్షన్ విధించారు’ అని అధికార ప్రతినిధి టోరీ శాసనసభ్యుడు సైమన్ హార్ట్ తెలిపారు. ఇక.. ఇజ్రాయెల్ దేశం.. గాజాపై దాడులు చేయటం ప్రారంభించినప్పటి నుంచి బ్రిటన్‌లో ఇస్లాంపై ద్వేషం, యూదులపై వ్యతిరేకమైన సంఘటనలు చోటు చేసుకోవటం పెరిగినట్లు తెలుస్తోంది. -
మగవారూ... భాష జాగ్రత్త
గతంలో ఎం.ఎల్.ఏ అయిన ఒక పెద్ద హీరో స్త్రీల గురించి అసభ్యంగా మాట్లాడి అసెంబ్లీలో సంజాయిషీ ఇచ్చాడు. డెబ్బయి ఏళ్లు దాటిన ఒక సీనియర్ నటుడు నోరు పారేసుకుని పరువు పోగొట్టుకున్నాడు. పార్లమెంట్ సభ్యుడుగా ఉన్న మరో నటుడు స్త్రీల దుస్తుల గురించి సుద్దులు చెప్పి నిరసన ఎదుర్కొన్నాడు. ఇప్పుడు తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్. సెలబ్రిటీలుగా ఉన్నవారు ఎంతో బాధ్యతగా ఉండి యువతకు మార్గం చూపేలా ఉండాలి. వారు ఇలా తగలడితే స్త్రీలతో ఎలా వ్యవహరించాలో ఇంటినే బడిగా మార్చి తల్లిదండ్రులు నేర్పించాల్సి ఉంటుంది. అయితే ఇంటి ఆడవారికి తండ్రి, భర్త గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నారా అనేది ప్రశ్న. అతడో ప్రసిద్ధ నటుడు. ‘మా బ్లడ్డు వేరు మా బ్రీడు వేరు’ అంటుంటాడు. కాని ఒక సభలో అభిమానులను చూసి పూనకం వచ్చి స్త్రీల గురించి అశ్లీలమైన వ్యాఖ్యలు చేశాడు. వందల సినిమాల్లో తండ్రిగానో బాబాయిగానో వేసిన ఒక నటుడు ‘స్త్రీల మీద మీ అభిప్రాయం ఏమిటి?’ అని సభలో యాంకర్ అడిగితే పరమ రోతగా సమాధానం ఇచ్చాడు. ఇక నటుడుగా, రియల్టర్‌గా గుర్తింపు పొందిన మరో పెద్ద మనిషి పార్లమెంట్ మెంబర్ అయ్యాక పార్లమెంట్లో నిలబడి మరీ ‘స్త్రీల దుస్తుల వల్లే వారికి సమస్యలు వస్తున్నాయి’ అన్నాడు. స్త్రీలను ఏదో ఒకటి అనేయొచ్చు, అంటే వాళ్లు పడతారు, అనడానికే మేము పుట్టాము అనే చులకనభావం పురుష సమాజంలో నరనరాన జీర్ణించుకుని పోబట్టే ఈ ప్రతిఫలాలు. అదృష్టవశాత్తు ఇలాంటి వ్యాఖ్యలకు వెంటనే నిరసన పెల్లుబుకుతున్నా పురుషుల నోటి దురుసు తగ్గడం లేదు. తాజాగా తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల త్రిషతో ‘లియో’ సినిమాలో నటించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ‘ఆమె హీరోయిన్ అని తెలిశాక (గత సినిమాల్లో తాను చేసిన) బెడ్రూమ్ సీన్ ఉంటుందని ఆశపడ్డాను’ అని వ్యాఖ్యానించాడు. ‘ఇది సినిమా లాంగ్వేజ్’ అని మన్సూర్ అనుకుని ఉండొచ్చుగాని దానిలోని అశ్లీల ధ్వనికి త్రిష రియాక్ట్ అయ్యింది. ‘ఇతనితో ఇంకెప్పుడూ సినిమాల్లో నటించను’ అని చెప్పింది. ఆ తర్వాత చినికి చినికి గాలివానై ఇప్పుడు మన్సూర్ మీద కేసు బుక్ అయ్యేంతగా వెళ్లింది. మగవాళ్లు ‘సరదాగా మాట్లాడుతున్నామని’ అనుకుంటూ కూడా స్త్రీలను కించపరిచే వ్యాఖ్యలు చేస్తారు. సరదాగా కించపరచడం ఏమిటో... కించపరచడం ఎలాంటి సరదానో వీరే చెప్పాలి. ► ప్రసిద్ధులే దారి తప్పితే రాజకీయ నేతలు, సినిమా నటులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు... ఇలా సమాజంలో గుర్తింపు పొందినవారు స్త్రీల పట్ల మరింత గౌరవంతో మెలగుతూ ఆదర్శంగా నిలవాలి. కాని చాలాసార్లు రాజకీయ నాయకుల దగ్గరి నుంచి అన్ని రకాల ప్రముఖులు ఏదో ఒక సందర్భంలో చులకన మాటలు మాట్లాడుతూ కుసంస్కారాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉత్తరాదిలో మంత్రులు ‘మేం వేసిన రోడ్లు ఫలానా హీరోయిన్ బుగ్గల్లా ఉంటాయి’ అంటూ వదరుతుంటారు. సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ సినిమాలో కుస్తీ వీరుడిగా నటించి ‘ఈ సినిమాలో కుస్తీలు చేస్తే రేప్ జరిగినంత పనయ్యింది నాకు’ అని వ్యాఖ్యానించి మొట్టికాయలు తిన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఒక మాజీ మంత్రి ప్రస్తుత మంత్రిగా ఉన్న నటిపై దారుణమైన వ్యాఖ్యలు చేసి కోర్టు కేసును ఎదుర్కొనబోతున్నాడు. ► బాల్యం నుంచి భావజాల ప్రభావం ‘కుటుంబంలో తండ్రి (మగాడు) ముఖ్యం’ అనే భావన బాల్యం నుంచి పిల్లల్లో ఎక్కించడం ద్వారా పురుష సమాజం తన ఆధిక్యతను స్త్రీలపై ఆధిపత్యాన్ని కొనసాగించేలా చేస్తుంది. తండ్రిని ‘మీరు’ అని, తల్లిని ‘నువ్వు’ అని అనడంలో ప్రేమ, గౌరవం, దగ్గరితనం ఉన్నా ‘నువ్వు’ అనడం వల్ల ‘లెక్క చేయవలసిన పని లేదు’ అనే భావన కలిగితే కష్టం. తిట్లు, బూతులు అన్నీ స్త్రీలను అవమానించేవే. వాటిని విని, పలికి స్త్రీల పట్ల అలా మాట్లాడవచ్చు అనుకుంటారు మగవారు. ఇంట్లో చెల్లెని, అక్కని, తల్లిని తండ్రి అదుపు చేసే తీరు చూసి, తామూ బయట స్త్రీలను అలాగే అదుపు చేయవచ్చనుకుంటారు. ఫైటర్ జెట్స్‌ను స్త్రీలు నడుపుతున్న ఈ కాలంలో కూడా ‘మేమేమీ గాజులు తొడుక్కోలేదు’, ‘మూతి మీద మీసముంటే రా’లాంటి పౌరుష వచనాలను పురుషులు ఇంకా పలికేటంత వెనుకబాటుతనంలో ఉండటం విషాదకరం. శారీరక పరిమితులు ఉన్నంత మాత్రాన స్త్రీలు బలహీనులు, పురుషులు బలవంతులు కాబోరు. ► తల్లిదండ్రులూ జాగ్రత్త అబ్బాయిలను ఆడపిల్లలను గౌరవించేలా పెంచడం, టీనేజ్‌లో ఉన్న అబ్బాయిలకు సరైన కౌన్సెలింగ్ ఇవ్వడం ఇప్పటి తల్లిదండ్రుల తక్షణ కర్తవ్యం. చట్టాలు పకడ్బందీగా ఉన్న ప్రస్తుత రోజుల్లో తెలిసో తెలియకో అహంకారంతోనో పరుష వ్యాఖ్య, అసభ్య చేష్ట నేరుగా కాని సోషల్ మీడియాలోగాని చేస్తే వారు ప్రమాదంలో పడతారని హెచ్చరించాలి. చైతన్యం పెరిగింది. అబ్బాయిలూ భాష జాగ్రత్త. -
మెనోపాజ్‌పై బాస్ ఛీప్ కామెంట్లు..!
లండన్: మెనోపాజ్‌ను సాకుగా చూపుతూ సరిగా పని చేయడం లేదని కించపరిచే వ్యాఖ్యలు చేసిన బాస్ మీద కేసు పెట్టి రూ.37 లక్షల పరిహారం పొందిందో మహిళ. ఈ ఉదంతం స్కాట్లాండ్లో జరిగింది. కరెన్ ఫర్కార్సన్ అనే 49 ఏళ్ల మహిళ ఒక స్థానిక ఇంజనీరింగ్ సంస్థలో 1995 నుంచీ పని చేస్తోంది. మెనోపాజ్ దశ కారణంగా ఆందోళన, మెదడు ఉన్నట్టుండి మొద్దుబారడం వంటివాటి లక్షణాలతో బాధ పడుతున్నట్టు బాస్‌కు చెప్పింది. విపరీతంగా బహిష్టు స్రావం అవుతుండటం, బయట విపరీతంగా మంచు కురుస్తుండటంతో రెండు రోజులు ఇంటి నుంచి పని చేసింది. మర్నాడు ఆఫీస్‌కు వెళ్లగానే, ’పర్లేదే, వచ్చావు’ అంటూ బాస్ వ్యంగ్యంగా అన్నాడు. తన సమస్య గురించి మరోసారి వివరించినా, ’నొప్పులు, బాధలు అందరికీ ఉండేవే’అంటూ కొట్టిపారేశాడు. దాంతో ఆమె రాజీనామా చేసి కంపెనీపై కేసు పెట్టింది. తన వ్యాఖ్యల వెనుక దురుద్దేశం లేదన్న బాస్ వాదనను ట్రిబ్యునల్ కొట్టిపారేసింది. అతనిలో ఏ మాత్రమూ పశ్చాత్తాపం కనిపించడం లేదంటూ ఆక్షేపించి పరిహారం చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. -
పవన్ కల్యాణ్‌పై విజయవాడ సీపీకి ఫిర్యాదు
సాక్షి, కృష్ణా: వాలంటీర్లనుద్దేశించి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రం భగ్గుమంటోంది. ఇప్పటికే పవన్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయగా.. డీజీపీకి సైతం ఫిర్యాదు వెళ్లింది. ఇక ఇప్పుడు వైస్సార్సీపీ లీగల్ సెల్ విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. బుధవారం పలువురు వాలంటీర్లతో కలిసి వైఎస్సార్సీపీ లీగల్ సెల్‌కు చెందిన న్యాయవాదులు విజయవాడ సీపీలో పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పవన్‌ను పెద్ద ఎత్తున వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంగణమంతా మారుమోగింది. సాక్షితో న్యాయవాదులు.. వాలంటీర్ వ్యవస్థ లేకపోతే కరోనాలో మరింత ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే కుట్ర జరుగుతోంది. పవన్ కల్యాణ్ మాటలతో సభ్యసమాజంలో అలజడి రేగుతోంది. కానీ, ఆ మాటల్ని వాలంటీర్లు పట్టించుకోవద్దు. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. అసలు ఉమెన్ ట్రాఫికింగ్ గురించి పవన్ కల్యాణ్‌కు ఏ నిఘా సంస్థ చెప్పిందో వెల్లడించాలి. వాలంటీర్లకు పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి అని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ డిమాండ్ చేస్తోంది. ఇదీ చదవండి: పవన్‌ను చీల్చిచెండాడిన పోసాని -
Rashtrapatni Row: సోనియా జీ చర్యలు తీస్కోండి
సాక్షి, ఢిల్లీ: కేంద్రం వైఖరి పట్ల నిరసనల్లో భాగంగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశిస్తూ ‘రాష్ట్రపత్ని’ అని పేర్కొనడం ద్వారా కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ కామెంట్లపై భగ్గుమంటున్న బీజేపీ నేతలు.. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తున్నారు. తాజాగా.. అధిర్ రంజన్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోంది. అధిర్ రంజన్ చౌదరికి నోటీసులు జారీ చేసింది. తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని, వ్యాఖ్యల పట్ల లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఆగస్టు 3వ తేదీ ఉదయం 11.30 గంటలకు విచారణ ఉంటుందని తెలిపింది. అంతేకాదు, జాతీయ మహిళా కమిషన్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కూడా లేఖ రాసింది. ఈ వివాదంలో జోక్యం చేసుకోవాలని, అనుచిత వ్యాఖ్యలు చేసిన అధిర్ రంజన్ చౌదరిపై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ‘అధిర్ రంజన్‌వి దిగజారిన వ్యాఖ్యలే. ఆయన చేసినవి ముమ్మాటికీ సెక్సీయెస్ట్ కామెంట్లే. అవి ఆయన మైండ్‌సెట్‌ను ప్రతిబింబిస్తున్నాయని జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మ చెప్తున్నారు. అధిర్ రంజన్.. రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలి. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆయనపై చర్యలు తీసుకోవాలి’ రేఖా శర్మ కోరుతున్నారు. -
రాజ్యాంగంపై విమర్శలు: ఎట్టకేలకు మంత్రి సాజీ రాజీనామా
తిరువనంతపురం: భారత రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన.. కేరళ మత్స్యశాఖ మంత్రి సాజీ చెరియన్ తన పదవికి రాజీనామా చేశారు. భారత రాజ్యాంగాన్ని అవమానపరిచారంటూ ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసే ఉంటుంది. ఈ తరుణంలో రాజకీయ ఒత్తిళ్ల మేరకు.. బుధవారం సాయంత్రం కేబినెట్ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వీలైనంత మంది సాధారణ ప్రజలను దోచుకునేలా మన రాజ్యాంగాన్ని రాశారని సాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పాతానమిట్ట జిల్లాలో జరిగిన సీపీఎం సమావేశాల్లో మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. చెరియన్ కామెంట్లపై రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చెరియన్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ముఖ్యమంత్రి విజయన్ ను గవర్నర్ కోరారు. మరోవైపు తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో చెరియన్ దిద్దుబాటు చర్యలకు దిగారు. తాను రాజ్యాంగాన్ని దూషించలేదని చెప్పారు. తనకు రాజ్యాంగంపై ఎంతో గౌరవం ఉందని అన్నారు. పాలనా వ్యవస్థ సరిగా లేదని, ఆ కోణంలోనే తాను మాట్లాడానని వివరణ ఇచ్చారు. అంతేకాదు, తాను చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) ఈ వ్యవహారంపై అసెంబ్లీలో వాయిదా తీర్మానాన్ని స్వీకరించడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో రాజ్యాంగాన్ని, రాజ్యాంగ రూపకర్తలను చెరియన్ అవమానించారంటూ వ్యతిరేక నినాదాలు చేశాయి విపక్షాలు. ఈ క్రమంలో చర్చ జరగకుండానే.. స్పీకర్ ఎంబి రాజేష్ సభను వాయిదా వేశారు. ఈ చర్యపై నిరసన వ్యక్తం చేస్తూ.. స్పీకర్ కార్యాలయంలో విపక్షాలు నిరసన చేపట్టాయి. చెరియన్ పై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోకుంటే కోర్టుకు వెళతామని హెచ్చరించాయి. బీజేపీ లేఖ రాయడం, చివరకు సొంత పార్టీ నేతల ఒత్తిళ్ల మేరకు ఆయనే రాజీనామా చేశారు. -
రెండురోజులు జైళ్లోనే హీరో.. అనుచిత ట్వీట్ ఎఫెక్ట్
హిజాబ్ వ్యవహారంలో విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తిపైనే అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కన్నడ హీరో చేతన్ కుమార్ అహింసాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో బెయిల్ దొరక్కపోవడంతో.. రెండురోజులు జైల్లోనే గడపాల్సిన పరిస్థితి ఎదురైంది అతనికి. కన్నడనాట హిజాబ్ వివాదం నడుస్తుండగా.. నటుడు చేతన్ చేసిన ట్వీట్లు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ. సుమోటోగా పరిణగనలోకి తీసుకున్న పోలీసులు చర్యలు తీసుకున్నారు. మంగళవారం అరెస్ట్ చేసి లోకల్ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ‘‘హిజాబ్ పిటిషన్లపై విచారణ జరుపుతున్న హైకోర్టు న్యాయమూర్తి కృష్ణ దీక్షిత్ పైనే చేతన్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అతను బయటకు వస్తే మతపరమైన విద్వేషాన్ని రాజేస్తాడని, కాబట్టి.. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాలని ప్రాసెక్యూటర్ అభ్యర్థించారు. దీంతో జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు.. శుక్రవారానికి బెయిల్ పిటిషన్ పరిశీలిస్తామని తెలిపింది. చేతన్ చేసిన ట్వీట్‌గా వైరల్ అవుతోంది ఇదే అయితే తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని చేతన్ భార్య మేఘ ఆరోపిస్తోంది. చేతన్ అరెస్ట్ విషయంలో పోలీసులు అతిప్రదర్శించారన్నది ఆమె వాదన. ఎంతో మంది ట్వీట్లు చేస్తున్నారు. వాళ్లను వదిలేసి.. తన భర్తనే ఎందుకు అరెస్ట్ చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది ఆమె. నోటీసులు ఇవ్వకుండా, కుటుంబ సభ్యులకు చెప్పకుండా అదుపులోకి తీసుకోవడంపై మేఘ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా.. చేతన్ వ్యవహారం హిజాబ్ అంశంలో కొత్త వివాదానికి ఆజ్యం పోసేలా కనిపిస్తోంది. ఇప్పటికే బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష అరెస్ట్‌ను.. హిజాబ్‌కు ముడిపెట్టడం, ఆ ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించడం చూశాం. ఈ తరుణంలో చేతన్ మద్దతుదారులంటూ కొందరు శేషాద్రిపురం పోలీస్ స్టేషన్ బయట ఆందోళనచేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా, విదేశాల్లో చదువుకుని వచ్చిన చేతన్.. డజన్‌కి పైగా సినిమాల్లో నటించాడు. నటుడిగానే కాకుండా తన సహాయక కార్యక్రమాలతో కన్నడనాట క్రేజ్ సంపాదించుకున్నాడు. 2010లో మేఘ అనే అమ్మాయిని పెండ్లి చేసుకున్న చేతన్.. తన వివాహానికి వచ్చిన అతిథులకు రాజ్యాంగ ప్రతులను రిటర్న్ గిఫ్ట్‌గా అందించి వార్తల్లో నిలిచాడు. డజనుకుపైగా సినిమాల్లో నటించిన చేతన్.. తరచూ కన్నడ, దేశ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తుంటాడు కూడా. -
Kamal Haasan: కమల్‌కు కోర్టులో ఊరట
నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌కు మదురై కోర్టులో ఊరట లభించింది. కమలహాసన్ 2017లో ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహాభారతం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అది అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అంతేకాకుండా కమల్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నెల్లై జిల్లా పళైయూర్ గ్రామానికి చెందిన ఆదినాథ సుందరం అనే వ్యక్తి వల్లియూర్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆ పిటిషన్‌ను కొట్టి వేయాల్సిందిగా నటుడు కమలహాసన్ తరఫున మదురై హైకోర్టులో దాఖలు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణలో ఉంది. కాగా శుక్రవారం మరోసారి ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. దీంతో నటుడు కమలహాసన్ తరఫు న్యాయవాది హాజరై ఇలాంటి వివాదాస్పద సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన మాటలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కమలహాసన్పై కేసును కొట్టి వేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: 'నేను పార్టీ మారానా.. దమ్ముంటే నిరూపించండి' -
కర్ణాటకలో మరోసారి కలకలం
బెంగుళూరు : ఒక మతానికి వ్యతిరేకంగా పెట్టిన ఓ ఫేస్బుక్ పోస్టు వల్ల కర్ణాటకలో వారం రోజుల క్రితం జరిగిన హింసాకాండ మరువకముందే మళ్లీ అలాంటి ఘటనే చోటుచేసుకుంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. ఓ వాట్సాప్ గ్రూపులో శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన 20 ఏళ్ల ముస్లిం వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కర్ణాటకలో రాయచూర్‌లోని దేవదుర్గ ప్రాంతానికి చెందిన వ్యక్తి రాముడిని తీవ్రపదజాలంతో దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. అది కాస్తా వైరల్ కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. (డబ్బున్న యువతులే టార్గెట్) ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకముందే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని దేవదుర్గ పోలీసులు తెలిపారు. గతవారం ఓ వ్యక్తి ఫేస్బుక్లో షేర్ చేసిన ఓ పోస్టు బెంగళూరులో కల్లోలానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఇది కాస్తా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇంటిపై దాడికి ప్రేరేపించింది. ఈ క్రమంలో తీవ్ర స్థాయిలో అల్లర్లు చెలరేగగా రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులను అదుపులోకి తెచ్చే క్రమంలో కాల్పులు జరిపారు. ఈ హింసాకాండలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా సాధారణ పౌరులతో పాటు 60 మంది పోలీసులకు కూడా గాయాల పాలయ్యారు. (ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. చెలరేగిన హింస) -
కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఐదేళ్ల జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి నాంపల్లి కోర్టు శిక్ష విధించింది. ఈ కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. సోషల్ మీడియాలో ఒక వ్యక్తి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై పాతబస్తీ వాసి ఇబ్రహీం మాదన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇబ్రహీం ఫిర్యాదును వాళ్లు సీసీఎస్ పోలీసులకు బదిలీ చేశారు. దీనిపై స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఐపీ అడ్రస్ ఆధారంగా.. ఆ వ్యక్తిని భువనగిరి జిల్లాకు చెందిన ఆకుతోట రామకృష్ణగా గుర్తించారు. ఈ మేరకు ఆధారాలు సేకరించిన సీసీఎస్ పోలీసులు నిందితుడిని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు రామకృష్ణకు శిక్ష ఖరారు చేసింది. -
సోషల్ మీడియా కామెంట్.. జాబ్ ఫట్
దుబాయ్: శబరిమల వివాదం నేపథ్యంలో మహిళలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసినందుకు భారతీయుడొకరు సౌదీ అరేబియాలో ఉద్యోగం పోగొట్టుకున్నారు. కేరళకు చెందిన దీపక్ పవిత్రం.. రియాద్‌లోని లులు హైపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు. వయసుతో సంబంధం లేకుండా మహిళలందరికీ శబరిమల ఆలయంలోకి ప్రవేశంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో వివక్షాపూరితమైన, అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై తీవ్రంగా స్పందించిన యాజమాన్యం అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. ‘మతపరమైన విషయాల్లో కించపరిచే వ్యాఖ్యలు చేయడాన్ని అస్సలు సహించం. సోషల్ మీడియాను మా సిబ్బంది దుర్వినియోగం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామ’ని లులు గ్రూపు కమ్యూనికేషన్స్ అధికారి చీఫ్ వి నందకుమార్ తెలిపారు. అన్ని దేశాల సంస్కృతులను, మత విశ్వాసాలను గౌరవిస్తామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉద్యోగిపై కఠిన చర్య తీసుకున్నందుకు లులు గ్రూపు అధిపతి యూసుఫ్ అలీపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదే కారణంతో అంతకుముందు ఒమన్‌లో కేరళకు చెందిన మరో ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. కేరళ వరద బాధితులను అగౌరవపరిచే వ్యాఖ్యలు చేసినందుకు ఈ చర్య తీసుకుంది. అతడు క్షమాపణ చెప్పినప్పటికీ ఒప్పుకోలేదు. -
కేరళ వరదలు : కారుకూత, తగిన శాస్తి
వరద బీభత్సంతో కేరళ ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతుంటే, వారి అవసరాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఉద్యోగికి ఓ గల్ఫ్ కంపెనీ యాజమాన్యం తగిన బుద్ధి చెప్పింది. కనీస మానవత్వాన్ని మరిచి వ్యాఖ్యానించాడు. నోటికొచ్చినట్టుగా అనుచితంగా ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కంపెనీ అతగాడిని ఉద్యోగంనుంచి తొలగించింది. తప్పయిందంటూ ఆనక లెంపలేసుకున్నా..ఆ కంపెనీ కనికరించలేదు. అటు ఈ వ్యాఖ్యలు చేసింది కేరళకు చెందిన వ్యక్తే కావడం గమనార్హం. కేరళకు చెందిన రాహుల్ లులు గ్రూప్ కంపెనీ ఒమన్ బ్రాంచ్‌లో కేషియర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కేరళలో వరద బాధితులకు వలంటీర్లు సహాయం చేస్తుండడంపై రెండు రోజుల క్రితం ఫేస్బుక్లో ఆయనో పోస్ట్ పెట్టాడు. సహాయక శిబిరాల్లో ఎవరైనా సానిటరీ నేప్కిన్స్ కోసం అడిగితే, తాను మాత్రం వాటికి బదులుగా కండోమ్స్ అడుగుతానంటూ బాధితులను అవహేళన చేస్తూ మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలు వైరల్ అవడంతో రాహుల్ ఉద్యోగం చేస్తున్న సంస్థ స్పందించింది. తక్షణమే రాహుల్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. మద్యం మత్తులోఅలా మాట్లాడాను తప్పైపోయింది, క్షమించండంటూ నాలిక్కరుచుకున్నా.. కంపెనీ ఎంతమాత్రం ఉపేక్షించలేదు. రాహుల్‌కు తగిన శాస్తి చేసింది. కాగా కేరళ వరద బాధితుల పునరావాస కార్యక్రమాలకోసం విరాళమిచ్చిన గల్ఫ్ కంపెనీల్లో లులు గ్రూపు కంపెనీ కూడా ఉంది. కేరళకు చెందిన వ్యాపారవేత్త, లులు గ్రూపు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసుఫ్ అలీ 5కోట్ల రూపాయలును విరాళమిచ్చారు. అటు తమ ఆర్థిక వ్యవస్థ విజయంలో కేరళీయులది కీలక భాగమని, వారికి సహాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
దర్శక నిర్మాతపై శ్రీ రెడ్డి ఫిర్యాదు
కాస్టింగ్ కౌచ్‌పై పోరాటంతో వార్తల్లో నిలిచిన శ్రీ రెడ్డి అన్నంత పని చేసేశారు. తనపై తీవ్ర ఆరోపణలు చేసిన కోలీవుడ్ నటుడు, ప్రముఖ దర్శక నిర్మాత వారాహిపై ఆమె ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసిన తనను బెదిరించారంటూ చెన్నై పోలీసు కమిషనర్‌లో శుక్రవారం ఓ ఫిర్యాదు లేఖను ఆమె అందజేశారు. ‘సినిమాల్లో అవకాశాలు ఇస్తానని నమ్మించి లైంగిక కోర్కెలు తీర్చుకుంటున్న వారి బండారాన్ని నేను బయటపెడుతున్నాను. అయితే గత 24వ తేదీన నటుడు, దర్శక, నిర్మాత వారాహి.. మీడియాలో సమావేశంలో వ్యభిచారిగా చిత్రీకరిస్తూ నా గురించి తప్పుగా మాట్లాడారు. నాకు ఫోన్ చేసి బెదిరించారు. ఇది నన్ను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. వారాహిపై లైంగిక వేధింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’’ అని ఫిర్యాదులో శ్రీ రెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మురగదాస్, లారెన్స్‌లపై ఆమె ఆరోపణలు చేయగా.. వారాహి మీడియా సమావేశం నిర్వహించి మరీ శ్రీ రెడ్డిపై వేశ్య కామెంట్లు చేశారు. దీనిపై సోషల్ మీడియా వేదికపై ఆమె హెచ్చరించారు కూడా. ఇక నటీమణులపై లైంగిక వేధింపుల గురించి నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీలకు ఫిర్యాదు చేయాలని ప్రయత్నించినా, వాళ్లు తనను పట్టించుకోలేదని శ్రీ రెడ్డి ఆరోపిస్తున్నారు. త్వరలో పూర్తిగా చెన్నైలో స్థిరపడే ఆలోచనలో ఉన్నట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. -
కత్తి మహేష్ వ్యాఖ్యలు క్షమించరానివి
-
జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు
-
జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు
లక్నో : సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదపై సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజామ్ ఖాన్ నోరు జారారు. తనను ఖిల్జీగా అభివర్ణిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ క్రమంలో ఆమెను ఓ డాన్సర్‌గా అభివర్ణించిన ఆయన ఆపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. శనివారం సాయంత్రం ఓ కార్యక్రమానికి హాజరైన మాట్లాడుతూ.. ‘పద్మావత్ చిత్రం వచ్చింది. ఖిల్జీ పాత్ర చెడ్డదని విన్నా. ఖల్జీ రాకముందే పద్మావతి ప్రాణ త్యాగం చేసింది. కానీ, ఇప్పుడు ఓ డాన్సర్ నాపై వ్యాఖ్యలు చేస్తోంది. మరి ఈ డాన్సర్ పాడే పాటను వినుకుంటూ కూర్చుంటే.. రాజకీయాలపై నేనెలా దృష్టిసారిగలను? అంటూ అజామ్ వ్యాఖ్యానించారు. కాగా, ‘పద్మావత్’ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను చూస్తే తనకు ఆజామ్ ఖాన్ గుర్తుకువచ్చాడని ఆమె పేర్కొన్న విషయం విదితమే. అజాం వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతోంది. అభ్యంతరకర వ్యాఖ్యలపై అజామ్ క్షమాపణలు చెప్పాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
మనోభావాలు దెబ్బతిన్నాయ్.. చిక్కుల్లో స్టార్లు!
సాక్షి, సినిమా : బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, నటి శిల్పా శెట్టిలు వివాదంలో చిక్కుకున్నారు. ఓ టీవీ షోలో ఓ కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయటంతో వారిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు వాల్మీకి కమ్యూనిటీ పెద్దలు ఫిర్యాదులు చేయగా.. షెడ్యూల్డ్ తెగల జాతీయ కమీషన్ నోటీసులు జారీచేసింది. వారంలోపు వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రసార శాఖ, ఢిల్లీ-ముంబై పోలీస్ కమీషనర్లను కమీషన్ ఆదేశించింది. టైగర్ జిందాహై చిత్ర ప్రమోషన్లో భాగంగా సల్మాన్.. శిల్పా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన డాన్స్ గురించి ప్రస్తావించిన సల్మాన్ ‘భాంగీ’ అనే పదాన్ని ఉపయోగించాడు. ఆ వెంటనే శిల్ప కూడా అదే పదాన్ని వాడారు. ఆ పదం తమ తెగను కించపరిచేలా ఉందంటూ వాల్మీకి తెగ సభ్యులు కొందరు ఆందోళన చేపట్టారు. ఆగ్రాలో వాల్మీకి సమాజ్ యాక్షన్ కమిటీ ఢిల్లీ ప్రదేశ్ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిద్దరూ క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే నేడు విడుదల కాబోయే సల్మాన్ టైగర్ జిందాహై చిత్రాన్ని అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. -
బ్రేకింగ్... మణిశంకర్ అయ్యర్‌కు కాంగ్రెస్ షాక్
-
బ్రేకింగ్... మణిశంకర్ అయ్యర్‌కు కాంగ్రెస్ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణి శంకర్ అయ్యర్ కు కాంగ్రెస్ పార్టీ భారీ షాక్ ఇచ్చింది. ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కాసేపటి క్రితం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని సస్పెండ్ చేయటంతోపాటు, ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన ‘నీచ్ ఆద్మీ’ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బీజేపీ కీలక నేతలు ఒక్కోక్కరుగా మణిశంకర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కూడా. పార్టీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చేస్తోందని ప్రశ్నించారు. చివరకు ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించటంతో దిగొచ్చిన మణిశంకర్ అయ్యర్ కూడా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. 2014 లో నరేంద్ర మోదీని ‘చాయ్‌వాలా’ అంటూ హేళన చేసిన ఆయన తాజాగా మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ ఆశయాలకు వాస్తవ రూపం తేవడానికి జవహర్లాల్ నెహ్రూ కృషి చేశారని, అటువంటి కుటుంబంపై ప్రధాని మోదీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఆయన నీచుడు, సభ్యత లేనివాడు అంటూ పలు వ్యాఖ్యలు చేశారు. -
తేజ్ ప్రతాప్ చేసిన వ్యాఖ్యలు ఇవే...
-
లాలూ కొడుకుపై కోటి నజరానా
పట్న : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పై బీజేపీ నేత ఒకరు నజరానా ప్రకటించారు. తేజ్ చెంప పగలకొట్టిన వారికి కోటి రూపాయలు ఇస్తానని అనిల్ సాహ్ని శుక్రవారం ఓ ప్రకటన జారీచేశారు. తేజ్ ఈ మధ్య బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ(బీజేపీ) పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఆయన అక్రమాలను బయటపెడతానని.. ప్రజల ముందే చెంప పగలకొడతానని చెప్పాడు. ఈ నేపథ్యంలో పట్నా బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ అయిన సాహ్ని ఈ కొత్త ఆఫర్ ప్రకటించాడు. ‘‘మోదీపై దాడి చేస్తానని తేజ్ చెప్పాడు.. అంతకంటే ముందే ఎవరైతే తేజ్‌పైనే దాడి చేస్తారో వారికి కోటి రూపాయలు బహుమతిగా ఇస్తాం’’ అని ప్రకటించాడు. అంతేకాదు తేజ్ చేత క్షమాపణలు చెప్పేదాకా లాలూ ఇంటి ముందు ధర్నా చేపడతామని హెచ్చరించాడు. సాహ్ని వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం గరంగరంగా ఉంది. ఆయన ప్రకటనతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని.. ఇప్పటికే వివరణ కోరామని... అది సహేతుకంగా లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమని పేర్కొంది. లాలూ తన కొడుకులను అదుపులో పెట్టుకోవాలని సూచించింది కూడా. కాగా, ఔరంగాబాద్‌లో తేజ్ ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ... డిసెంబర్ 3న జరగబోయే సుశీల్ కొడుకు ఉత్కర్ష్ పెళ్లి ఆహ్వానం తనకు అందిందని.. ఒకవేళ తాను అక్కడికి వెళ్తే మాత్రం రచ్చ చేయటం ఖాయమని హెచ్చరికలు చేశాడు. -
కాన్సర్-కర్మ వ్యాఖ్యలు.. పొంతన లేని వివరణ
గువాహటి : బీజేపీ నేత, అస్సాం మంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆరోగ్యశాఖ మంత్రి అయిన బిస్వా బుధవారం నూతన ఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందించే కార్యక్రమానికి హాజరై ప్రసంగిస్తూ ... గత జన్మలో చేసిన పాపాల మూలంగానే మనుషులకు దీర్ఘకాలిక రోగాలు వస్తున్నాయంటూ.. కాన్సర్ వంటి రోగాల వెనుక, యాక్సిడెంట్లలో మనుషులు చనిపోవటానికి కూడా కర్మే కారణమంటూ చెప్పారు. దీనిపై హేతువాదులు, పాత్రికేయులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు బిస్వాపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే ఆ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలంటూ పల్లవి ఘోష్ అనే జర్నలిస్ట్ ఆయన్ని డిమాండ్ చేయగా.. బిస్వా వేదాంత ధోరణిలో వివరణ ఇచ్చుకున్నారు. పాపాని-కర్మకు మధ్య చాలా తేడా ఉంది. అది గుర్తించండి. రాజకీయాలు వస్తూ పోతూ ఉంటాయ్. కానీ, భవద్గీతలో ఏదైతే చెప్పబడిందో అదే శాశ్వతం. నేను దాన్నే పాటిస్తాను’’ అని బిస్వా సమాధానమిచ్చారు. తాను కేవలం ఉపాధ్యాయులకు ప్రేరణ కల్పించే ఉద్దేశంతోనే అలాంటి ఉపన్యాసం ఇచ్చానే తప్ప.. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పిదం లేదని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత పి. చిదంబరం, కపిల్ సిబల్ ట్విట్టర్లో మండిపడ్డారు. అయితే వారికి కౌంటర్లు ఇస్తు బిస్వాని ట్విట్టర్లో వరుస ట్వీట్లు చేస్తూ వస్తున్నారు. తమిళ మానిల కాంగ్రెస్ నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరారంటూ చిదంబరాన్ని, రాహుల‘పిడి’ ట్వీట్‌ను తెరపైకి తెచ్చి బిస్వా వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. -
సినిమా వాళ్ల భార్యలు అంత తేరగా దొరికారా?
సాక్షి, హైదరాబాద్ : ఎవరి మీద అయినా కోపం వస్తే వాళ్లను తిట్టాలి కానీ, నోరు ఉంది కదా ఏది పడితే అది వాగితే ఊరుకునే ప్రసక్తే లేదంటున్నారు సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్. బీజేపీ ఎంపీ చింతామణి మాలవీయ.. సినిమా వాళ్ల భార్యలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ్మారెడ్డి మాలవీయపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నోరు ఉంది కదా అని వాగితే తాట తీస్తా అంటూ తన అఫీషియల్ యూట్యూబ్ పేజీలో ఆయనో వీడియో సందేశం ఉంచారు. అందులో మాలవీయపై ఓ రేంజ్‌లోనే ధ్వజమెత్తారు. ఎవరి మీదైనా కోపం వస్తే.. వాళ్లను మాత్రమే తిట్టాలి.. అంతేకానీ సినిమా వాళ్ల మహిళను కించపరుస్తూ మాట్లాడటం దారుణమని ఆయన అన్నారు. గతంలో కమల్ హాసన్ వైవాహిక జీవితం గురించి కూడా మాట్లాడారని.. వివాహాలు, విడాకులు దేశంలో ఇప్పుడు సర్వసాధారణమైపోయాయన్న ఆయన... కొత్త మొగుళ్లు.. కొత్త పెళ్లాళ్లు వస్తున్నారని చెప్పారు. బీజేపీలో కూడా అలాంటి నేతలు ఉన్నారన్న ఆయన.. తనకు సంస్కారం ఉంది కాబట్టే వారి పేర్లు ప్రస్తావించనని చెప్పారు. ‘‘ఇలాంటి వ్యాఖ్యలు క్షమించరాని నేరమని.. ఖండించకుండా ఊరుకోవటం కూడా చాలా కష్టం అన్నారు. సినిమా వాళ్ల భార్యలు ఊరికే దొరికారా? ఏమిటతని ఉద్దేశ్యం? నోటి కొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోవాలా? సమాజంపై ప్రభావం చూసే సినిమాను, వాళ్ల కుటుంబ సభ్యుల చులకనగా మాట్లాడే హక్కు అతనికేక్కడిది?’’ అని తమ్మారెడ్డి ప్రశ్నించారు. కోపం వస్తే చెప్పుతో కొడతామని మాలవీయ అన్నారని... అలాంటి పరిస్థితి వస్తే, మేము కూడా చెప్పు తీసుకుని కొట్టే పరిస్థితి వస్తుందని తమ్మారెడ్డి వారించారు. చేతిలో ప్రభుత్వం ఉందని.. ఏది పడితే అది చెయ్యొచ్చని అనుకుంటే సహించే ప్రసక్తే లేదన్నారు. అలాంటి పరిస్థితి వస్తే... సినిమా పరిశ్రమ అంతా ఏకమైతే ఎలా ఉంటుందో మీకూ తెలీదు. చూపించాల్సిన పరిస్థితి వస్తే చూపిస్తాం ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. "సినిమా తీసే వాళ్ల కుటుంబాల్లో మహిళలు ప్రతిరోజూ భర్తలను మార్చేస్తుంటారు. దుష్ట మనస్తత్వాలతో నన్ను చికాకు పెట్టే దర్శకులను చెప్పుతో కొడతాను..’ అంటూ ఉజ్జయిని ఎంపీ చింతామణి మాలవీయ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
సినిమా వాళ్ల భార్యలు అంత తేరగా దొరికారా?
-
మోదీపై వ్యాఖ్యలతో అసెంబ్లీలో దుమారం!
లక్నో: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఉత్తరప్రదేశ్ సీనియర్ మంత్రి ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర అసెంబ్లీలో పెద్ద దుమారం రేపింది. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై సోమవారం సభలో చర్చిస్తుండగా శాసనసభ వ్యవహారాల మంత్రి ఆజంఖాన్ మాట్లాడుతూ ప్రధాని మోదీపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. 'మన దేశ బాద్షా తన తల్లిని వెంట ఉంచుకోరు, కానీ శత్రువు తల్లికి కానుకలు ఇస్తారు. భార్యను వదిలేసిన ఆయన 'బేటీ బచావో' (కూతుళ్లను కాపాడండి) అంటూ పేర్కొనడం విడ్డూరం' అని పేర్కొన్నారు. 2014లో తన ప్రమాణ స్వీకార వేడుకకు వచ్చిన పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అమ్మకు మోదీ శాలువను కానుకగా ఇచ్చారు. ఆ తర్వాత షరీఫ్ తల్లికి చీరను ఓసారి మోదీ పంపించారు. అయితే, ఆజంఖాన్ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను డిమాండ్ చేస్తూ వెల్‌లోకి ఆందోళన చేపట్టారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ అంశాన్ని పరిశీలిస్తానని స్పీకర్ మాతాప్రసాద్ పాండే హామీ ఇచ్చినా బీజేపీ సభ్యులు వినకపోవడంతో సభను 20 నిమిషాల పాటు వాయిదా వేశారు.