ఎవరి మీద అయినా కోపం వస్తే వాళ్లను తిట్టాలి కానీ, నోరు ఉంది కదా ఏది పడితే అది వాగితే ఊరుకునే ప్రసక్తే లేదంటున్నారు సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్. బీజేపీ ఎంపీ చింతామణి మాలవీయ.. సినిమా వాళ్ల భార్యలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ్మారెడ్డి మాలవీయపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నోరు ఉంది కదా అని వాగితే తాట తీస్తా అంటూ తన అఫీషియల్ యూట్యూబ్ పేజీలో ఆయనో వీడియో సందేశం ఉంచారు. అందులో మాలవీయపై ఓ రేంజ్‌లోనే ధ్వజమెత్తారు. ఎవరి మీదైనా కోపం వస్తే.. వాళ్లను మాత్రమే తిట్టాలి.. అంతేకానీ సినిమా వాళ్ల మహిళను కించపరుస్తూ మాట్లాడటం దారుణమని ఆయన అన్నారు. గతంలో కమల్ హాసన్ వైవాహిక జీవితం గురించి కూడా మాట్లాడారని.. వివాహాలు, విడాకులు దేశంలో ఇప్పుడు సర్వసాధారణమైపోయాయన్న ఆయన... కొత్త మొగుళ్లు.. కొత్త పెళ్లాళ్లు వస్తున్నారని చెప్పారు. బీజేపీలో కూడా అలాంటి నేతలు ఉన్నారన్న ఆయన.. తనకు సంస్కారం ఉంది కాబట్టే వారి పేర్లు ప్రస్తావించనని చెప్పారు.
సినిమా వాళ్ల భార్యలు అంత తేరగా దొరికారా?
Published Fri, Nov 10 2017 6:25 PM | Last Updated on Thu, Mar 21 2024 11:25 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement