tammareddy bharadwaja
-
రిషబ్ శెట్టిలా పెద్ద హీరో కావాలి: తమ్మారెడ్డి భరద్వాజ
‘‘జాతర’ సినిమా ట్రైలర్ ఆసక్తిగా ఉంది. మంచి కథ ఉంటే.. హీరో, దర్శకుల గురించి ప్రేక్షకులు పట్టించుకోరు. కొత్తగా వచ్చిన సతీష్ హీరో, రైటర్, డైరెక్టర్ అయ్యాడు. రిషబ్ శెట్టిలా తను కూడా పెద్ద హీరో, పెద్ద దర్శకుడు కావాలి. అలాగే ‘జాతర’ చిత్రం ఘనవిజయం సాధించాలి’’ అని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సతీష్ బాబు రాటకొండ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘జాతర’. దీయా రాజ్ హీరోయిన్గా నటించారు. గల్లా మంజునాథ్ సమర్పణలో రాధాకృష్ణా రెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు శివ బాలాజీ మాట్లాడుతూ– ‘‘జాతర’ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘మంచి కథతో ఈ మూవీని చక్కగా తీశారాయన’’ అని శివ శంకర్ రెడ్డి చెప్పారు. ‘‘నటుడిగా, దర్శకుడిగా ఇది నా మొదటి సినిమా. మా చిత్రాన్ని ఆదరించాలి’’ అని సతీష్ బాబు రాటకొండ కోరారు. -
నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో లవ్ రెడ్డి మూవీ టీమ్ ఇంటర్వ్యూ
-
ఇండస్ట్రీలోని మహిళలకు ఆ ధైర్యం ఇవ్వలేకపోతున్నాం: తమ్మారెడ్డి భరద్వాజ
‘‘తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ 2018లో సెక్సువల్ హెరాస్మెంట్ రెడ్రెసెల్ ప్యానెల్ (లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్)ను ఆరంభించడం జరిగింది. మా దృష్టికి వచ్చిన ఫిర్యాదులను షరిష్కరించాం. పదిహేను రోజుల క్రితం ఓ కేసు మా దృష్టికి వచ్చింది. వారిద్దరి వ్యక్తిగత స్టేట్మెంట్స్ను తీసుకోవడం జరిగింది. కొన్ని ఆధారాల కోసం ఎదురు చూస్తున్నాం. అలాగే క్రిమినల్ కేసు కూడా నమోదు అయ్యిందన్న విషయం మా దృష్టికి వచ్చింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మా రిపోర్ట్‌ను కూడా సబ్మిట్ చేస్తాం’’ అని సెక్రటరీ, కన్వీనర్, నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ అన్నారు. ఇదిలా ఉంటే... కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ విషయం చర్చనీయాంశమైంది. సినిమా ఇండస్ట్రీలో మహిళల భద్రత గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ వివాదం తేలేవరకూ అతన్ని డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని, అసోసియేషన్ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఫెడరేషన్‌కు చె΄్పాం. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై ఇంటర్నల్ రిపోర్ట్ వచ్చాక నిర్ణ యిస్తాం. చాంబర్ కార్యాలయంలో ఓ కంప్లైట్ బాక్స్ ఉంది. ఎవరైనా ఫిర్యాదులు చేయవచ్చు. ఫోన్‌కాల్, మెయిల్, పోస్ట్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఇది ఎప్పట్నుంచో ఉంది. అలాగే ఇండస్ట్రీలో ఉమెన్ సపోర్ట్ టీమ్ కూడా ఉంది. ఈ విషయం కొంతమందికి తెలియకపోవచ్చు. ప్రస్తుత వివాదం ముగిసిపోగానే ఈ టీమ్ గురించి అన్ని అసోసియేషన్లకు అవగాహన కల్పిస్తాం’’ అని అన్నారు. లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ చైర్పర్సన్ ఝాన్సీ మాట్లాడుతూ– ‘‘శ్రీరెడ్డి ఇష్యూ తర్వాత ఓ కమిటీని ఫామ్ చేశాం. ఇతర ఇండస్ట్రీస్‌లో జరగుతున్న సెక్సువల్ హెరాస్మెంట్ ఇక్కడ కూడా జరుగుతోంది.ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు కొరియోగ్రాఫర్స్ మధ్య నెలకొన్న వివాదం ఇది. మేం ఇద్దరి స్టేట్మెంట్స్ను రికార్డ్ చేశాం. అయితే ఆమె స్టేట్మెంట్ రికార్డు చేసే సమయంలో తెలిసింది... కేసు చాలా సీరియస్ అని. లీగల్ సపోర్ట్ కూడా ఆ అమ్మాయికి అవసరం అని అర్థమైంది. మా పరిధిలో మేం చేయాల్సినది ఆమెకు చేశాం. బాధితురాలిగా చెప్పబడిన అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పట్నుంచే ఇండస్ట్రీలో పని చేస్తోంది. అయితే మైనర్‌గా ఇండస్ట్రీలో ఆమెకు చోటు కల్పించిన విధానం ్రపోటోకాల్ ప్రకారంగానే జరిగిందా? లేదా అనే విషయంపై కూడా ఎంక్వయిరీ జరుగుతోంది. మా ప్రస్తుత గైడ్‌లైన్స్ ప్రకారం 90 రోజుల్లో కేసును పరిష్కరించాలి. కానీ అంతకుముందే ముగించాలని మేం అనుకుంటున్నాం. ఎంక్వయిరీ తర్వాత మా రిపోర్ట్ చెబుతాం. ఎలాంటి చర్యలు తీసుకుంటామో చెబుతాం. ఇండస్ట్రీలోని వారంతా ఈ ఇష్యూపై బయటకు మాట్లడకపోయినా అంతర్గతంగా చర్చిస్తున్నారు. ఆమెకు సపోర్ట్‌గా ఉంటామని ఓ పెద్ద హీరో తన మేనేజర్‌తో చెప్పించారు. దర్శకులు– నిర్మాతలు స్పందిస్తున్నారు. ఇండస్ట్రీలో టాలెంట్‌కు వర్క్ ఉంటుంది. ఒకవేళ ఫేక్ కంప్లైట్స్ వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా ప్రత్యేక సెక్షన్ ఉంది. ఇండస్ట్రీలోని మహిళల రక్షణకు సంబంధించి ప్రభుత్వం తరఫు నుంచి సరైన గైడ్‌లైన్స్ లేవు. అలాగే ‘వాయిస్ ఆఫ్ ఉమెన్’ గురించి సమంతగారు సోషల్ మీడియాలో స్పందించారు. కానీ ‘వాయిస్ ఆఫ్ ఉమెన్’ అనేది ఇండస్ట్రీ నుంచి సెపరేట్ కాదు. దీనికి సంబంధించి ప్రభుత్వంతో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. బయటకు రాలేదు అంతే. సరైన సమయంలో పెద్దలు మాట్లాడతారు. అలాగే ఈ కేసుకు సంబంధించి బాధితురాలి ఫేస్‌ను మీడియా బయటపెట్టకూడదని కోరుతున్నాం’’ అని పేర్కొన్నారు.‘‘2013లో ఆసరా అని పెట్టి, కొన్ని కేసులను పరిష్కరించడం జరిగింది. 2018లో సరికొత్తగా ఈ ప్యానెల్ పెట్టాం. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నాం. కానీ ఇండస్ట్రీలో ఉన్న మహిళలకు ధైర్యం ఇవ్వలేకపోతున్నాం. ఫలానా చోటుకు వచ్చి మీ సమస్యలపై ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామని చెప్పలేకపోతున్నామని నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ తరహా కేసులు లేవని కాదు. జరుగుతున్నవి జరిగినా కానీ, చాలా కేసులు రావడం లేదని నా అభిప్రాయం. వచ్చినవరకు సాల్వ్ చేస్తున్నాం. సినిమాల్లో తనకు ఏదైనా అన్యాయం జరిగితే సపోర్ట్ చేసేందుకు ఇండస్ట్రీ ఉందనే ధైర్యం అమ్మాయిలకు రావాలి. ఆ ధైర్యం రావాలంటే కమిటీ ఉండాలి. వచ్చిన కేసులను మంచిగా సాల్వ్ చేయాలి. ప్రస్తుత కేసును సాల్వ్ చేయడానికి కొంత సమయం ఉంది. అలాగే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి యూనియన్‌కు ఓ కంప్లైట్ కమిటీ ఉండాలని సూచించాం. అలాగే మాకు కూడా డైరెక్ట్‌గా కంప్లైట్ చేయవచ్చు’’ అని ‘లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్’ అంతర్గత సభ్యులు, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో మైనర్లు ఎందుకు పని చేయాల్సి వచ్చిందన్న ప్రశ్నకు నిర్మాత వివేక్ కూచిభొట్ల స్పందిస్తూ– ‘‘చిన్నారులు డ్యాన్స్ చేయాల్సి అవసరం వచ్చినప్పుడు వారి తల్లిదండ్రుల అనుమతి తీసుకుంటాం. మేజర్ అయితే సభ్యత్వం ఇస్తాం’’ అని కమిటీ అంతర్గత సభ్యులు, నిర్మాత వివేక్ కూచిబొట్ల అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది, ‘పీఓఎస్‌హెచ్’ (ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్) ఎక్స్పర్ట్ కావ్య మండవ తదితరులు మాట్లాడారు. -
జానీ మాస్టర్ వివాదంపై ఫిలిం ఛాంబర్ ఏం చెబుతుందంటే..?
లైంగిక వేధింపుల ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు నమోదైంది. తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి జానీపై తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అయితే జానీ వివాదంపై తాజాగా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీడియా సమావేశం నిర్వహించింది. అందులో తమ్మారెడ్డి భరద్వాజ, ఝూన్సీ, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ పాల్గొన్నారు.జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేగింది. దీంతో ఫిలిం ఛాంబర్ కూడా రియాక్ట్ అయింది. జానీ మాస్టర్ మీద ఆరోపణలు రావడంతో ఈ వివాదం తేలే వరకు అతన్ని డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్‌ను ఇప్పటికే ఆదేశించామని ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ తెలిపారు.చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి యాంకర్,నటి ఝాన్సీ రియాక్ట్ అయ్యారు. 'మన ఇండస్ట్రీలో మహిళా రక్షణ కోసం సరైన గెడ్ లైన్స్ లేవు. నటి శ్రీ రెడ్డి ఇష్యూ తరువాత ఒక కమిటీ ఫామ్ అయింది. జానీ మాస్టర్ ఇష్యూ తెరపైకి వచ్చిన వెంటనే ఆ కమిటీ వారు పరిశీలిస్తున్నారు. ఈ వివాదంలో బాధితురాలు తొలుత తన వర్క్ పరంగా ఇబ్బంది అని ముందుకు వచ్చింది. కానీ, ఆ తర్వాత లైంగిక వేధింపులు కూడా ఉన్నాయని పేర్కొంది. ఆ అమ్మాయి స్టేట్మెంట్తో పాటు జానీ మాటలను కూడా కూడా రికార్డు చేశాం. అయితే, లైంగిక వేధింపులు అనేది వర్క్ ప్లేస్‌లో జరగలేదు. ఆ అమ్మాయి ఇప్పటకే లీగల్‌గా ముందుకు వెళ్తుంది. అయితే, మీడియా వారు బాధితురాలి ఫోటోలను రివీల్ చేయవద్దని కోరుతున్నా. విచారణ సాగుతుంది. 90రోజుల్లో దీనిపై పూర్తి క్లారిటీ వస్తుంది.' అని ఝాన్సీ తెలిపారు.తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. 'మొదట మీడియా వారి నుంచే జానీ మాస్టర్ వివాదం మా వద్దకు వచ్చింది. ఇండస్ట్రీలో ఇబ్బందులు పడే వారి కోసం 2013లో ఆసరా అని పెట్టి.. 2018లో సరికొత్తగా ప్యానల్ పేరుతో మార్చాం. ఇలా పేర్లు అయితే మార్చాం కానీ, ఒక మహిళకు దైర్యం ఇవ్వలేకపోతున్నాం. ఇండస్ట్రీలోని ప్రతి అమ్మాయికి ఆపద వస్తే తమకు సపోర్ట్ ఉందనే బరోసా కల్పించాలి. అందుకు తగ్గ కమిటీ నిర్ణయాలు ఉండాలి. కచ్చితంగా 90 రోజుల్లోనే జానీ మాస్టర్ కేసు పూర్తి అవుతుంది.కానీ, సినిమా ఇండస్ట్రీలో ప్రతి అమ్మాయికి రక్షణ కావాలి. ఛాంబర్ తరపున ప్రతి యూనియన్‌కు ఓ కంప్లైట్ కమిటీ పెట్టుకోవాలని ఈ సందర్భంగా సూచించనున్నాం. డాన్సర్ యూనియన్ వారు కూడా ఈ విషయంలో మాతో పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు.' అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. -
'స్వాతంత్య్రం' సాంగ్ లాంచ్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదగా స్వాతంత్రం మా స్వాతంత్ర్యం అనే పాటను విడుదల చేశారు. ప్రజానాట్యమండలి రూపకల్పనలో ఎం శేషగిరి రచించిన ఈ పాటను శ్రీనివాస్ నందుల సంగీత సారధ్యంలో లక్ష్మణ్ పూడి పాడారు. సాంగ్‌ను లాంచ్ చేసిన అనంతరం తమ్మారెడ్డి భరద్వాజ ఇలా మాట్లాడారు.సాంగ్ విడుదల సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. 'స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు అయ్యింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన దేశం ఆర్థికంగా, టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. కానీ నిరక్షరాస్యత, పేదరికంలో చాలా కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ పరిస్థితులు అన్నిటిని దృష్టిలో పెట్టుకుని లక్ష్మణ్ పూడి గారు స్వాతంత్ర్యం మీద చేసిన సాంగ్ అద్బుతంగా ఉంది.' అన్నారు. ప్రజానాట్యమండలి గాయకుడు లక్ష్మణ్ పూడి మాట్లాడుతూ.. 'నేను కారులో వెళుతున్నప్పుడు సిగ్నల్స్ దగ్గర భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న వారిని పలకరించాను. వారికి స్వాతంత్య్రం అంటే ఏమిటో తెలియదు. దేశం మీద ప్రేమతో ఇలాంటి నిరక్షరాస్యులను పాటతో మేల్కొల్పటానికి ఈ సాంగ్ చేయడం జరిగింది. సాంగ్ లాంచ్ చేసిన మా గురువు గారు భరద్వాజ్ గారికి కృతజ్ఞతలు' అని ఆయన అన్నారు. కార్యక్రమానికి సినిమా డైరెక్టర్ కర్రి బాలాజీ, వంశీ లక్ష్మణ్ పూడి తదితరులు హాజరయ్యారు. -
రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన సినీ పెద్దలు
-
ఈ సినిమా చూశాక కన్నీళ్లు ఆపుకోలేకపోయా: తమ్మారెడ్డి భరద్వాజ
కొత్త కథలు, డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఇప్పుడు ఆడియెన్స్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ ఉన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. అలాంటి ఓ డిఫరెంట్ కంటెంట్‌తో వచ్చిన సినిమానే మ్యూజిక్ షాప్ మూర్తి.. ఇప్పటికే థియేటర్ ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా తాజాగా ఓటీటీలో కూడా సందడి చేస్తుంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది.అజయ్ ఘోష్, చాందినీ చౌదరిలు ప్రముఖ పాత్రల్లో నటించిన ఈ సినిమాను థియేటర్లో చూసిన ప్రతీ ఒక్కరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. బరువెక్కిన గుండెతో థియేటర్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓటీటీలో విడుదలైన సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా ప్రతినిధుల సమక్షంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో దర్శకనిర్మాతలతో పాటు చిత్ర యూనిట్ పాల్గొంది.ఈ సందర్భంగా నటుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. 'ప్రతి మనిషి జీవితంలో జరిగే కథనే ఇది. ఎన్నో కష్టాలు దాటుకొని వచ్చిన తర్వాతే విజయం వరిస్తుంది. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు పేరు పేరునా కృతజ్ఞతలు. ఈ సినిమాలో నటించిన నటీనటులందరూ ఎంతో కో-ఆపరేటివ్ గా పని చేశారు. ఓ ఫ్యామిలీలా అందరం కలిసి ఈ సినిమాను రూపొందించాం. నన్ను తెలుగు తెరపై చూపించిన మొదటి దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ గారు ఈ సినిమా చూసి నాకు స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. ఈ సినిమా కథను నమ్మి డబ్బు పెట్టిన నిర్మాతలకు సెల్యూట్. శివ సినిమాను బాగా రూపొందించారు. ఈ సినిమాలోని చాలా సీన్స్ నా నిజ జీవితంలో జరిగినవే.' అని ఆయన అన్నారు.ముఖ్య అతిధిగా వచ్చిన దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్ చూశాక ఈ అజయ్ ఘోష్‌ని పెట్టి సినిమా తీసుకున్నారు. వీళ్ళ పని అయిపోనట్లే అనుకున్నా. కానీ, సినిమా చూశాక మతిపోయింది. చివరలో అయితే ఈ సినిమా సీన్స్ చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయా. ఈ సినిమాను చాలా డిఫరెంట్‌గా రూపొందించారు. కష్టాలు, కన్నీళ్లు కాదు మంచితనంతో కొట్టారు. సినిమా సక్సెస్ అయింది కానీ ఈ సినిమాతో వీళ్లకు డబ్బులు వచ్చాయని అయితే నేను నమ్మను. మంచి సినిమాను ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమాలకు మీడియా వాళ్ల సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది.' అని తమ్మారెడ్డి అన్నారు. -
వేరు కుంపట్లతో దాసరిగారి పేరు చెడగొట్టొద్దు: దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ
‘‘నరసింహారావుగారు (దర్శకుడు) మాట్లాడి, దాసరిగారి పేరిట రామ సత్యనారాయణ ఓ ఈవెంట్ చేశారు. రేపు మేం చేయబోతున్నాం అన్నారు. నేనేం అంటున్నానంటే... వచ్చే ఏడాది నుంచి సినిమా ఇండస్ట్రీ తరఫున దాసరిగారి జయంతిని అందరూ ఒక్కటై, ఒకే వేడుకలా జరుపుకునేలా ΄్లాన్ చేద్దాం. బయటివాళ్లు కావాలంటే ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు చేసుకుంటారు.ఇండస్ట్రీలో వేరు వేరు కుంపట్లు పెట్టి, గురువు (దాసరి నారాయణరావు) గారి పేరుని మనం చెడగొట్టొద్దు. గురువుగారి పేరును నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాం’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి (మే 4)ని ‘డైరెక్టర్స్ డే’గా తెలుగు పరిశ్రమ సెలబ్రేట్ చేసుకుంటోంది. తెలుగు దర్శకుల సంఘం ఆధ్వర్యంలో మే 4న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈ వేడుక జరగాల్సింది.కానీ ఎన్నికల సమయంలో ఇలాంటి పెద్ద ఈవెంట్ నిర్వహిస్తే లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని పోలీస్ శాఖ చెప్పిన నేపథ్యంలో ఈవెంట్ తేదీని ఈ నెల 19కి మార్చామని తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. ఈ వేడుక కొత్త తేదీ పోస్టర్‌ను తమ్మారెడ్డి భరద్వాజ, సి. కల్యాణ్, దామోదర ప్రసాద్ విడుదల చేశారు. ‘‘దేశవ్యాప్తంగా సినీ కార్మికుల సంక్షేమంలో టాలీవుడ్ నంబర్ వన్‌గా ఉందంటే కారణం దాసరిగారే’’ అన్నారు సి. కల్యాణ్.‘‘డైరెక్టర్స్ డే ఈవెంట్ సక్సెస్ కావడానికి శ్రమిస్తున్న యువ దర్శకులకు ధన్యవాదాలు’’ అన్నారు వీరశంకర్. ‘‘దాసరిగారి పేరిట రామసత్యనారాయణ ఈవెంట్ చేశారు. మే 5న మేం చేస్తున్నాం. దర్శకుల సంఘం చేయనున్న ఈవెంట్ కూడా సక్సెస్ కావాలి’’ అన్నారు రేలంగి నరసింహారావు. నిర్మాతలు దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, దర్శకులు ఎన్. శంకర్, సముద్ర, మెహర్ రమేష్, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, వశిష్ఠ, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని తదితరులు పాల్గొన్నారు. -
జర్నీ టు అయోధ్య
శ్రీరామ నవమిని పురస్కరించుకుని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ అధినేత వేణు దోనేపూడి ‘జర్నీ టు అయోధ్య’ (వర్కింగ్ టైటిల్) పేరుతో సినిమా ప్రకటించారు. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ‘విశ్వం’ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ బేనర్లో ‘జర్నీ టు అయోధ్య’ రెండో సినిమా. దర్శకుడు వీఎన్ ఆదిత్య ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ‘‘అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ్ర΄÷డక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే వీఎన్ ఆదిత్య నేతృత్వంలో అయోధ్య సహా పలు చోట్ల లొకేషన్స్ పరిశీలిస్తున్నారు. ఒక యంగ్ డైరెక్టర్ తెరకెక్కించనున్న ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి దర్శక– నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణ సారధ్యం వహిస్తున్నారు. -
దాసరి నారాయణరావు 77వ జయంతి వేడుకలకు ఏర్పాట్లు
దశాధిక రంగాల్లో అసాధారణ స్థాయిలో రాణించి, శతాధిక చిత్ర దర్శకునిగా... అనుపమాన దార్శకునిగా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆచంద్రతారార్కం నిలిచిపోయే పేరు ప్రఖ్యాతులు గడించిన దర్శక శిఖరం డాక్టర్ దాసరి నారాయణరావు 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఆయన ప్రియ శిష్యులు సన్నాహాలు చేస్తున్నారు. దాసరి బహుముఖ ప్రతిభను నేటి తరానికి గుర్తు చేస్తూ... వారిలో స్ఫూర్తిని నింపేందుకు "దర్శకరత్న డి.ఎన్. ఆర్.ఫిల్మ్ అవార్డ్స్" పేరిట తెలుగు సినిమా రంగానికి చెందిన వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచినవారికి పట్టం కట్టి, దాసరికి ఘన నివాళులు అర్పించనున్నారు. దర్శకరత్నతో సుదీర్ఘమైన అనుబంధం కలిగిన ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు - ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ అధ్యక్షకార్యదర్శులుగా ఇందుకోసం ఏర్పాటైన కమిటీలో ఆడిటర్ గా, ఆర్ధిక సలహాదారుగా దాసరితో ప్రత్యేక అనుబంధం కలిగిన బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ, ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు, ధీరజ అప్పాజీ సభ్యులుగా ఉన్నారు. హైదరాబాద్, శిల్పకళావేదికలో అత్యంత వైభవంగా మే 5న నిర్వహించనున్న ఈ వేడుక వివరాలు వెల్లడించేందుకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో "దర్శకరత్న డి.ఎన్. ఆర్.ఫిల్మ్ అవార్డ్స్" జ్యురీ మెంబర్స్ తమ్మారెడ్డి భరద్వాజ, రేలంగి నరసింహారావు, బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ, ప్రభు, అప్పాజీలతోపాటు... తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ... "దశాధిక రంగాల్లో రాణించిన దాసరికి నివాళులు అర్పిస్తూ... "అభినవ దర్శకరత్న, అభినయ రత్న, నిర్మాణరత్న, పంపిణీరత్న, ప్రదర్శనారత్న, కథారత్న, సంభాషణారత్న, గీతరత్న, పాత్రికేయరత్న, సేవారత్న" పురస్కారాలు ప్రదానం చేయనున్నాం. ఇతర అవార్డులను స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ సినిమాల నుంచి ఎంపిక చేయనున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించేందుకు నడుం కట్టిన సూర్యనారాయణ గారిని అభినందిస్తున్నాను" అన్నారు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ... "దాసరి లేని లోటు ఎప్పటికీ తీరనిది. ఈ అవార్డుల ఎంపిక అత్యంత పారదర్శకంగా, ప్రామాణికంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దాసరి భౌతికంగా దూరమై ఏడేళ్లు కావస్తున్నా ఆయనపై అపారమైన ప్రేమాభిమానాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బి.ఎస్.ఎన్. సూర్యనారాయణకు అభినందనలు" అన్నారు. బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ మాట్లాడుతూ... "దాసరి ప్రధమ జయంతిని ఘనంగా నిర్వహించాం. కరోన కారణంగా కంటిన్యూ చేయలేకపోయాయాం. ఇకపై ప్రతి ఏటా ఈ వేడుక నిర్వహిస్తాం" అన్నారు. టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ... "దురదృష్టవశాత్తూ మన రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అవార్డుల విషయంలో చిత్రపరిశ్రమను చిన్నచూపు చూస్తున్నాయి. అలక్ష్యం చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ గారు చొరవ తీసుకుని భారతదేశం గర్వించదగ్గ మహానుభావుడైన దాసరి పేరిట అవార్డ్స్ ఇస్తుండడం ఎంతైనా అభినందనీయం" అన్నారు. ప్రభు మాట్లాడుతూ... "చిత్ర పరిశ్రమలోని ప్రతి విభాగంలో అత్యద్భుత ప్రతిభ కనబరిచిన ఒకే ఒక్కడు దర్శకరత్న డాక్టర్ దాసరి. ఆయన స్మారకార్ధం నిర్వహిస్తున్న ఈ పురస్కారాల వేడుకకు యావత్ చిత్ర పరిశ్రమ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను" అన్నారు. ధీరజ అప్పాజీ మాట్లాడుతూ... "అవార్డ్స్ కమిటీలో చోటు దక్కించుకోవడం తనకు "లైఫ్ టైమ్ అచీవ్మెంట్"లాంటిదని పేర్కొన్నారు. -
అవినీతి బాబు చుట్టూ..రాజకీయమేంటి?
కులం పునాదులతో రాజకీయాలేంటి? ఎవరో కొందరు..ఎవరి కోసమో ఈ నాటకాలాడితే ఎలా? మాసిపోయిన ‘సెటిలర్స్’ గాయాన్ని గెలికి గెలికి... పుండుగా చేయడం న్యాయమా?.. ప్రముఖ సినీ దర్శకుడు, తెలుగు సినీ కార్మికుల నేతగా ప్రసిద్ధి చెందిన తమ్మారెడ్డి భరద్వాజ సంధించిన ప్రశ్నలివి. అవినీతి ఆరోపణల కేసులో అరెస్టయిన చంద్రబాబుకు కులం ప్రాతిపదికన సానుభూతి తెలిపే విధానం వల్ల జరిగే నష్టాన్ని ఆయన ప్రస్తావించారు. ఇదే అదనుగా అందరికీ ‘కమ్మ’ రంగు పులమడం సరికాదని తమ్మారెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. దివంగత ఎన్టీఆర్ కూడా టీడీపీని కేవలం ఒక సామాజికవర్గానికే పరిమితం చేయలేదని చెప్పారు. తికమక పెట్టే రాజకీయాలు..ఇబ్బందులు సృష్టించే నాయకులను ఈసారి ఎన్నికల్లో చూస్తున్నామనేది ఆయన భావన. తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తున్న పబ్లిక్ మూడ్ మొదలుకొని, మారుతున్న రాజకీయాలపై తమ్మారెడ్డి విస్పష్టమైన వైఖరిని వెల్లడించారు. ఆయనేమన్నారంటే....? పవన్ రాజకీయమేంటి? పవన్‌కల్యాణ్ రాజకీయం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతోనే ఉంటానంటాడు. బీజేపీని వదిలేస్తానంటాడు. తెలంగాణకు వచ్చి బీజేపీకి మద్దతిస్తాడు. కలిసి పోటీ అంటాడు. చంద్రబాబు జైలుకెళ్లిన తర్వాతే కదా... జనసేన, టీడీపీ పొత్తు బంధం బయటకొచ్చింది. చంద్రబాబు జైలు నుంచి రాగానే పవన్‌కే కృతజ్ఞతలు తెలిపారు. మరి ఇదేంటి? చంద్రబాబు పార్టీ వాళ్లేమో తెలంగాణలో కాంగ్రెస్ జెండా మోస్తామంటున్నారు. పవన్ మాత్రం బీజేపీ గొడుక్కిందకు వెళ్తానంటున్నాడు. విచిత్రం ఏమిటంటే తెలంగాణలో తన కేడర్ ఏ పార్టీ వైపు ఉండాలనేది చంద్రబాబు చెప్పడు. టీడీపీ అయినా జనసేన అయినా అంతా తానే అని చెప్పే పవన్ ఇంకా వ్యూహం ఖరారు చేయలేదు. పవన్, చంద్రబాబు ఎవరి మాట ఎవరు వింటారో గానీ... తెలంగాణ ఎన్నికల్లో ఒకే వ్యూహంతో వెళ్లగలరా? ఈ తరహా రాజకీయాలు కొంత గందరగోళపరుస్తున్నాయి. ఇక్కడ సెటిలర్స్ హ్యాపీ.. కానీ ఇప్పుడు ఆ నిరసనలేంటి? తెలంగాణ ఏర్పడిన రోజుల్లో స్థానికేతరుల్లో కొంత టెన్షన్ ఉన్నమాట నిజం. ఇప్పుడది లేదు. అంతా కలిసిపోయి ఉంటున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత కొంతమంది మళ్లీ ఈ విభజన రేఖ తెస్తున్నారు. సెటిలర్స్ పేరుతో ముందుకొస్తున్నారు. దీన్ని ఓ సామాజికవర్గం నెత్తికెత్తుకోవడం విశేషం. సెటిలర్స్ అనేది మాసిపోయిన గాయం. కొంతమంది కోసం ఈ గాయాన్ని రేపుతున్నారు. పుండులా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. సెటిలర్స్ పేరుతో చంద్రబాబు వ్యవహారంపై నిరసనలేంటి? సెటిలర్స్‌లో కమ్మవాళ్లే ఉన్నారా? అన్ని కులాల వాళ్లూ ఉన్నారని గుర్తించాలి. ఇది అందరి ప్రయోజనాలు దెబ్బతీస్తుందని తెలుసుకోవాలి. ‘చిత్రం’లోనూ మార్పులు రాజకీయాలపై సినిమా ప్రభావం కీలకం. రాజకీయాల నుంచే సినిమా వస్తుందా? సినిమా రాజకీయాలకు ప్రేరణ ఇస్తుందా? అనేది చెప్పలేం. కానీ ప్రజాజీవితాలకు దగ్గరగా ఉండే రాజకీయ సినిమాలను జనం ఆదరిస్తున్నారు. అంతే కాదు... కరుడుగట్టిన కాషాయం రంగుతో తీసిన సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. అంటే మార్పును ప్రజలు స్వాగతిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లోనూ అది కనిపిస్తోంది. రాష్ట్రం ఏర్పడ్డాక ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఇది గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ మాత్రమే. అలా అని నిరుద్యోగమూ పూర్తిగా పోలేదు. యువత ఆలోచనకు ఇదే కారణమైంది. రైతుబంధు ఇస్తున్నామని చెప్పే నేతలు... రూ.కోట్లు ఉన్నవాడికి కూడా ఇవ్వడం న్యాయమేనా? అనేక కష్టనష్టాలకోర్చే కౌలు రైతులకు ఇవ్వకపోవడం ధర్మమేనా? సామాజిక పరిస్థితుల నుంచే ప్రజాతీర్పు వస్తుంది. ఒకటి మాత్రం నిజం. గెలిచే వాళ్ల వైపే ప్రజలు ఉంటారు. అందుకే వామపక్షాలు ఉద్యమించే చరిత్ర ఉన్నా, ఓట్లు పొందలేకపోతున్నాయి. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ప్రజలిచ్చిన అధికారం రాచరికంగా భావించే నాయకులను ఓటు ఆ«యుధంతోనే ప్రజలు బుద్ధి చెప్పాలి. వాళ్ల కోరలు పీకి వేయాల్సిందే. అసలేంటీ వైఖరి? చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్మెంట్ అవినీతి ఆరోపణల కేసులో అరెస్టు అయ్యారు. దీన్ని కొంతమంది తమ సామాజికవర్గం చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు సత్య హరిశ్చంద్రుడని వాళ్ల నమ్మకం కావొచ్చు. అది కోర్టులో తేలాలి. కానీ ఆ కసి తెలంగాణ రాజకీయాలపైనా చూపించే ప్రయత్నమేంటి? ఒక సామాజికవర్గం మొత్తం గంపగుత్తగా ఓ పార్టీని సమర్థిస్తుందని ప్రచారం చేయడంలో అర్థమేంటి? టీడీపీ ఒక సామాజిక వర్గానిదేనా? అదే నిజమైతే ఎన్టీఆర్ 50 శాతం బీసీలకే టికెట్లు ఎందుకిచ్చా రు? అసలు కులం ప్రస్తావనేంటి? వాళ్లు చెప్పే కులమే అంత బలమైనది అయితే, 2014లో ఎందుకు తెలంగాణలో ఓడిపోయింది? ఇలా ప్రచారం చేయడంలో ఓ కుట్ర కనిపిస్తోంది. తెర వెనుక కీలకమైన వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చు. - వనం దుర్గాప్రసాద్ -
చిరంజీవి అలాంటి సినిమాలు చేస్తే బెటర్: స్టార్ ప్రొడ్యూసర్
మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యే 'భోళా శంకర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సాధారణ ప్రేక్షకులకే కాదు మెగా ఫ్యాన్స్‌కి కూడా ఇది నచ్చలేదు. దీంతో చిరుతో పాటు దర్శకుడు మెహర్ రమేశ్‌పైనా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.. చిరు రీమేక్స్‌పై కౌంటర్స్ వేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా వ్యాపారమైంది 'అప్పట్లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లకు పని తప్ప మరో ఆలోచన ఉండేది కాదు. ఇప్పటికీ అలాంటి వాళ్లు ఉన్నప్పటికీ.. దాన్ని వ్యాపారంగా చూసేవాళ్లు ఎక్కువైపోయారు. కథ చెప్పమని అడిగితే అప్పట్లో రైటర్స్ సూటిగా సుత్తిలేకుండా చెప్పేవారు. ఇప్పుడేమో 'ఓపెన్ చేస్తే' అని ఎలివేషన్స్ ఇస్తున్నారు. రైటర్స్ డైరెక్టర్స్ కావడం దీనికి కారణమై ఉండొచ్చు. ప్రేక్షకులకు పనికొచ్చే అంశం, అది కూడా నేచురల్‌గా ఉండాలి. ఇది పక్కనబెట్టి ఏదో చేస్తే సినిమాలు ఆడవు.' (ఇదీ చదవండి: చెల్లెలిగా కీర్తి సురేశ్.. చిరు-రజనీ ఇద్దరూ బలైపోయారు!) చిరు అలా చేయాలి 'ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, కృష్ణ, చిరంజీవి.. ఇలా హీరోలందరూ కెరీర్ మొదట్లో మెథడ్ యాక్టింగ్ చేసినట్లు ఉంటుంది. చిరునే తీసుకోండి. శుభలేఖ, స్వయంకృషి, రుద్రవీణ, విజేత లాంటి సినిమాలకే అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. అమిర్ 'దంగల్' లాంటి సినిమా చిరంజీవి చేసినా జనాలు చూస్తారు. భోళా శంకర్, గాడ్ ఫాదర్ లాంటివి చేసి డిసప్పాయింట్ కావడం కంటే నేచురల్ మూవీస్ చేస్తే బెటర్ అని నా అభిప్రాయం' చెప్పాలని ప్రయత్నించా 'అయితే ఇదే విషయాన్ని చిరంజీవితోనూ చెబుదామని ప్రయత్నించాను. కానీ ఎందుకో కుదరలేదు. ఒకప్పటి సినిమాల్లో చిరంజీవిని చూస్తే మన ఇంట్లో మనిషిలా కనిపించేవారు. ఇప్పుడు ఆ చిరంజీవి మళ్లీ కనిపిస్తే చూడాలని ఉంది. అలానే సినిమాలు ఆడుతాయి అనేది నా నమ్మకం' అని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు. ఈయనే కాదు చాలామంది అభిమానులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి చిరు రాబోయే సినిమాల విషయంలో ఏం చేస్తారో చూడాలి? (ఇదీ చదవండి: సర్జరీ.. చిరంజీవి ఆరోగ్యపరిస్థితి ఇప్పుడెలా ఉందంటే?) -
ఎలక్షన్స్ చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో తెలియడం లేదు: తమ్మారెడ్డి
-
TFCC Election: సంతోషపడాలో, సిగ్గు పడాలో తెలియట్లేదు..తమ్మారెడ్డి
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ)ఎన్నికలపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వాతావరణం చూస్తుంటే చాంబర్ ఎదిగిందని సంతోష పడాలో లేదా జనరల్ ఎలెక్షన్స్లాగా ఉందని సిగ్గుపడాలో తెలియట్లేదన్నారు. సభ్యులు దేనికి పోటీ పడుతున్నారో? ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియడం లేదన్నారు. ‘నేను కూడా చాలా ఎలెక్షన్స్ చూశాను.ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్‌గా కూడా గెలిచాను. కానీ ఇలాంటి వాతావరణం ఎప్పుడూ లేదు. ప్రస్తుతం ఎలెక్షన్స్ కాంపెయిన్ చూస్తుంటే భయమేస్తుంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని కోరుకుంటున్నాను’అని తమ్మారెడ్డి అన్నారు. కాగా, టీఎఫ్‌సీసీ ఎన్నికల పోలింగ్ వాడివేడిగా జరుగుతోంది. రెండేళ్లకు ఒక్కసారి జరిగే ఎన్నికల్లో ఈ సారి అధ్యక్ష బరిలో దిల్ రాజు, సీ. కల్యాణ్ పోటీ పడుతున్నారు. ఈ రోజు(జులై 30) ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిక్యూటివ్ సెక్టార్ ఇలా నాలుగు సెక్టార్లలోని సభ్యులు ఇందులో ఓటర్లుగా ఉంటారు. మొత్తం 1600 మంది సభ్యులు ఉన్నారు. దాదాపు 900 వరకు ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై, 6 గంటల తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు. -
అలా చేస్తే ఆర్ నారాయణమూర్తి ఇప్పటికీ నెంబర్ వన్ స్టార్‌గానే ఉండేవాడు
ఆర్ నారాయణ మూర్తి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికి తెలిసిందే. విప్లవ సినిమాలు తీస్తూ పీపుల్స్ స్టార్‌గా ఎదిగాడు. కేవలం సినిమాల్లో నటించడమే కాదు.. కథ, కథనం, దర్శకత్వం, సంగీతం, గానం, నిర్మాణం..ఇలా 24శాఖలను తన భూజన వేసుకొని సూపర్ హిట్ చిత్రాలను అందించగల సమర్థుడు. ఈ మధ్యకాలంలో ఆయనకు సరైన హిట్ పడలేదు కానీ, ఒకప్పుడు ఆయన సినిమాలు టాలీవుడ్లో సంచలనం సృష్టించాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అలాంటి గొప్ప నటుడిపై దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నమ్మిన సిద్దాంతం కోసం స్టార్‌డమ్‌ని, కోట్ల రూపాయలను వదులుకున్న ఏకైన నటుడు ఆర్ నారాయణమూర్తి అని ప్రశంసించారు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ‘తెలుగు సినిమాకు ఒక డిఫరెంట్ స్టేటస్ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఆర్ నారాయణమూర్తి. విప్లవాన్ని నమ్ముకొని.. విప్లవం కోసమే జీవితాన్ని అంకితం చేశాడు. తన కథలతో ప్రేక్షకుల ఆలోచనలు ప్రభావితం చేస్తూ, కొంతకాలం పాటు అతనే నెంబర్ వన్ స్టార్ అయ్యాడు కూడా. స్టార్ డమ్ వచ్చిన తరువాత కూడా తాను నమ్ముకున్న సిద్ధాంతాన్ని వదలకుండా అదే తరహా సినిమా చేస్తూ వచ్చాడు. సిద్దాంతం కోసం తన స్టార్ స్టేటస్‌ని వదులుకున్నాడు కానీ తన పంథా మార్చుకోలేదు. తన పంథా మార్చుకొని ఉంటే ఈ రోజుకి కూడా ఆర్ నారాయణమూర్తి నెంబర్ వన్ స్టార్‌గానే ఉండేవాడు. ‘మీ సిద్ధాంతం వదలకుండా మీరు సినిమా చేసే విధానం మార్చుకోండి’ అని నేను చాలాసార్లు చెప్పానుగానీ ఆయన వినిపించుకోలేదు. ఆయన ఏ సినిమా తీసినా అది విప్లవ పంథాలోనే ఉంటుంది. సూపర్ హిట్లు ఇచ్చాడు .. ఎంతో సంపాదించాడు. అయినా రోడ్లపై నడుచుకుంటూనే తిరుగుతూ ఉంటాడు. అంత సింపుల్ గా బ్రతికే మనిషిని గురించి ఎంత చెప్పినా సరిపోదు’ అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. -
'నాటునాటు'కు ఆస్కార్ రావడంపై స్పందించిన తమ్మారెడ్డి
-
తెలుగు సినిమాకు ఆస్కార్ రావడం గర్వంగా ఉంది: తమ్మారెడ్డి
టాలీవుడ్ సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ రూ.80 కోట్లు ఖర్చు చేసిందని, ఆ డబ్బు తమకిస్తే 8 సినిమాలు తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా గురించి ప్రపంచమంతా మాట్లాడుతుంటే తెలుగువాళ్లై ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటని తమ్మారెడ్డిపై పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాట ఆస్కార్ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. హాలీవుడ్ పాటలను తలదన్ని నాటునాటు విజయకేతనం ఎగరవేసింది. తెలుగోడి ప్రతిభకు ఆస్కార్ పట్టం కట్టింది. దీంతో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి యావత్ సినీ, రాజకీయ ప్రముఖులు నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ స్పందన కోసం నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. తాజాగా నాటునాటు పాటకు ఆస్కార్ రావడంపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఆయన ఏమన్నారంటే.. 'మన తెలుగు పాటకు ఆస్కార్ రావడం చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. నాకే కాదు, ప్రతి భారతీయుడు, సినిమాను ప్రేమించే వాళ్లకు ఇది గర్వకారణం. తెలుగు సంగీతాన్ని, తెలుగుదనాన్ని ఇప్పటికీ తమ సినిమాల్లో పొందుపరుస్తున్న అతికొద్దిమందిలో కీరవాణి, చంద్రబోస్ ఒకరు. వాళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన నాటునాటు పాటకు ఆస్కార్ రావడం చాలా అద్భుతమైన విషయం. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీంకి నా అభినందలు తెలియజేస్తున్నాను' అంటూ తమ్మారెడ్డి పేర్కొన్నారు. -
నేను నోరు విప్పితే.. మీరు ఎవరెవరి కాళ్లు పట్టుకున్నారో చెప్పనా?: తమ్మారెడ్డి
ఆర్ఆర్ఆర్ మూవీ వివాదంపై ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఆస్కార్ బరిలో నిలిచిన ఆర్ఆర్ఆర్ మూవీపై ఇటీవల ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల రవీంద్ర భారతిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ఆస్కార్ అవార్డు కోసం ట్రిపుల్ ఆర్ టీం రూ. 80 కోట్లు ఖర్చు చేసిందంటూ షాకింగ్ కామెంట్స్. దీంతో ఆయనపై సినీ ప్రముఖులతో పాటు నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. చదవండి: దిల్ రాజు కొడుకుని చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నాడో.. ఇక తనపై వస్తున్న నెగిటివిటీ చూసి తమ్మారెడ్డి నేరుగా స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఏ తప్పు చేయలేదని, క్షమాపణలు చెప్పనన్నారు. తాను చిన్న సినిమాలపై మూడు గంటలు మాట్లాడితే కేవలం ఓ క్లిప్పింగ్ ఆధారంగా విమర్శలు చేయడం సరికాదన్నారు. రాజమౌళిని చూసి ఈర్ష్యతో అలా అన్నానని కొందరు అంటున్నారని, ఆయన తనకు సమకాలీకుడు కాదంటూ కౌంటర్ ఇచ్చారు. రెండ్రోజుల కింద ‘ఆర్ఆర్ఆర్’ను ప్రశంసిస్తూ మాట్లాడానని.. దాని గురించి ఎవరూ పట్టించుకోలేదే? అని ప్రశ్నించారు. ‘నేను ఇండస్ట్రీకి వివరణ ఇచ్చుకోవాలి అనుకున్నా. కానీ ఇప్పుడు ఆ అవసరం నాకు లేదు. కానీ పెద్దవాళ్లు అందరు మాట్లాడాకా నేను దానికి సమాధానం కూడా చెప్పనక్కర్లేదు. అసలు వీడికేం లెక్కలు తెలుసంటున్నారు కొందరు. నాకు లెక్కలు తెలియనక్కర్లేదు. అయితే చాలా మంది అకౌంట్స్ నాకు తెలుసు. ఎవరెవరు ఏ అవార్డులు, పదవుల కోసం ఎవరెవరిని అడుక్కున్నారో, ఎవరెవరి కాళ్లు పట్టుకున్నారో అన్నీ నాకు తెలుసు. నేనెప్పుడూ వీటి గురించి మాట్లాడను. నేను మాట్లాడితే ఇండస్ట్రీ పరువు పోతుంది. ఇండస్ట్రీ నా తల్లి. ఇండస్ట్రీని గౌరవిస్తా. అందుకే ఈరోజుకీ సంయమనంగానే మాట్లాడుతున్నా’ అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. చదవండి: ఆర్ఆర్ఆర్పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నిర్మాతపై నెటిజన్ల ఆగ్రహం ‘కొందరు నన్ను అసభ్యంగా, నీచంగా తిడుతున్నారు. నాకు నీతిగా బతకడం, నిజం చెప్పడం తెలుసు. ఎక్కడైన నేను నిజాలు మాట్లాడగలను. మీరు ధైర్యంగా నిజం చెప్పగలరా? నన్ను ఇంతగా తిడుతూ విమర్శిస్తున్నా మీకు నన్ను అనే హక్కు ఉందా? గతంలో రాజమౌళిని అభినందిస్తూ మాట్లాడాను అది చూడలేదా? ఇప్పుడు ఎవరో ఏదో క్లిప్ పెట్టేసరికి మీకు తెలిసిందా? మూడు గంటల చిన్న సినిమా గురించి మాట్లాడాను. మీరు ఓ చిన్న సినిమా కోసం టైం కెటాయించగలరా? ఎప్పుడు ఎవరో ఒకరి కాళ్లు పట్టుకోవాలని, ఎంతసేపు వాళ్లకు వీళ్లకు మర్దన చేయాలా? అని చూసే మీరా నా గురించి మాట్లాడేది. నన్ను అనే హక్కు మీకుందా? ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే తిరిగి మొహం మీదే పడుతుంది’ అంటూ తమ్మారెడ్డి ఫైర్ అయ్యారు. -
దారుణమైన కామెంట్లు.. అసహ్యంగా, బాధగా ఉంది: తమ్మారెడ్డి
తెలుగు ఖ్యాతినే కాదు యావత్ భారతదేశ ఖ్యాతిని పెంచిన సినిమా ఆర్ఆర్ఆర్. వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఈ కళాఖండానికి వేల కోట్ల కలెక్షన్లు వచ్చిపడ్డాయి. ఈ సినిమా నుంచి నాటునాటు పాట ఆస్కార్ రేసులో పోటీపడుతున్న విషయం తెలిసిందే! ఆర్ఆర్ఆర్ టీమ్ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందంటూ అందరూ చప్పట్లు కొడుతుంటే ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాత్రం వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ట్రిపుల్ ఆర్ ఆస్కార్ బరిలో నిలిచేందుకు రూ.80 కోట్లు ఖర్చు పెట్టిందని, ఆ డబ్బు తనకిస్తే ఎనిమిది సినిమాలు తీసి ముఖాన కొడతానంటూ కామెంట్లు చేశాడు. ఆయన వ్యాఖ్యలపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సహా పలువురు సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వివాదంపై స్పందించాడు తమ్మారెడ్డి భరద్వాజ. 'నేను ఒక సెమినార్లో పాల్గొని అక్కడి యంగ్ డైరెక్టర్స్‌తో దాదాపు మూడు గంటలు మాట్లాడాను. అందులో ఒక నిమిషం క్లిప్ విని ఎవరెవరో రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం చిన్న సినిమాల గురించి మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్ బడ్జెట్‌పై మాట్లాడాను. దీనిపై కొందరు చాలా దారుణంగా కామెంట్లు చేయడం బాధ కలిగించింది. ఒకరేమో అకౌంట్స్ సమాచారం అడుగుతారు. మరొకరేమో బూతులు తిడుతున్నారు. చాలా బాధగా, అసభ్యంగా, అసహ్యంగా ఉంది. వాళ్ల సంస్కారం వాళ్లది, నా సంస్కారం నాది. నేనేమీ గుర్తింపు కోసం పాకులాడటం లేదు. బహుశా నన్ను టార్గెట్ చేసకుఉని వాళ్లు గుర్తింపు కోరుకుంటున్నారో తెలీదు. నేను కొన్ని రోజుల ముందు రాజమౌళిని అభినందిస్తూ వీడియో పోస్ట్ చేశాను. మరి అప్పుడు ఏ ఒక్కరూ మాట్లాడలేదే?' అని విమర్శించాడు. -
ఆర్ఆర్ఆర్పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నిర్మాతపై నెటిజన్ల ఆగ్రహం
టాలీవుడ్ సంచలనం ఆర్ఆర్ఆర్ మూవీపై సీనియర్ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇండిస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ మూవీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డు కోసం ఆర్ఆర్ఆర్ టీం రూ. 80 కోట్లు ఖర్చు చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై పలువురు టాలీవుడ్ సినీ దిగ్గజాలు, సినీ ప్రియులు అభ్యంతరం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: జేమ్స్ కెమెరూన్ డబ్బు తీసుకొని పొగుడుతున్నారా? లెక్కలున్నాయా?: కె. రాఘవేంద్రరావు సూటి ప్రశ్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్పందిస్తూ తమ్మారెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. మిత్రుడు భరద్వాజ్‌కి.. తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకు ప్రపంచవేదికలపై మొదటిసారి వస్తున్న పేరు చూసి గర్వపడాలి కానీ, రూ.80 కోట్ల ఖర్చు అని చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ లాంటి వారు డబ్బు తీసుకుని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా? అంటూ ట్వీట్ చేశారు. ఇక దర్శకేంద్రుడి మద్దతుగా నెటిజన్లు, ఆరఆర్ఆర్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ తమ్మారెడ్డి భరద్వాజ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘శత్రువులు ఎక్కడో ఉండరు మన పక్కనే తిరుగుతారు. 80 కోట్ల రూపాయలు ఉంటే పది సినిమాలు తీస్తారు సరే.. అందులో ఒకటైన ఆస్కార్‌కు వెళుతుందనే గ్యారంటీ ఇస్తారా? భరద్వాజ గారు’ అంటూ ఓ నెటిజన్ ఆయనకు కౌంటర్ ఇచ్చాడు. అలాగే మరో నెటిజన్ స్పందిస్తూ ‘విచిత్రమైన మనిషి, విచిత్రమైన కామెంట్స్’ అసహనం వ్యక్తి చేశాడు. చదవండి: ఆస్కార్ కోసం 'ఆర్ఆర్ఆర్' ఫ్లైట్ ఖర్చులతో పది సినిమాలు తీయొచ్చు : తమ్మారెడ్డి కాగా రీసెంట్గా రవింద్ర భారతీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘రూ.200 కోట్లు పెట్టి బాహుబలి తీశారు. ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ బడ్జెట్. ఆ తర్వాత రూ.600 కోట్లు ఖర్చు పెట్టి ఆర్ఆర్ఆర్ మూవీ తీశారు. ఇప్పుడు వచ్చే ఆస్కార్ కోసం రూ.80 కోట్లు పెట్టారు. ఆ డబ్బులు నాకు ఇస్తే 8 సినిమాలు తీసి వాళ్ల మొఖాన కొడతాను’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. Satruvulu ekkada undaru andi mana pakkane tirugutuntaru. 80crores unte 10 cinemalu teesukovachu correct ye. aah 10 cinemalu lo okatyna oscar vastundi aney gaurantee isthara bharadwaj garu. — Challapalli Anurag 🇮🇳 (@anurough) March 9, 2023 పాపం భరద్వాజులు గారు చల్లగా Attention తీసుకుని జారుకుందాం అనుకున్నారు కానీ తెలుగు జాతిని గర్వపడేలా చేసిన @RRRMovie & @ssrajamouli గారి మీద రాయి వేసి జారుకుందాం అని చుస్తే, తెలుగు వారు తెలుగు ప్రముఖుల గమ్ముగా వుంటారని భావించి నట్లు ఉన్నారు. — CMA Monesh (@Cmamonesh) March 9, 2023 -
RRR Movie: నీ దగ్గర లెక్కలున్నాయా భరద్వాజ్: కె. రాఘవేంద్రరావు ఫైర్
'ఆర్ఆర్ఆర్' సినిమా ఆస్కార్ బరిలో నిలిచేందుకు దాదాపు 80 కోట్లు ఖర్చు పెట్టిందని, అమెరికా వెళ్లేందుకు ఫ్లైట్లకు గానూ అంతగా ఖర్చు పెడుతున్నారంటూ తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అంతేకాక ఆ 80 కోట్లు తనకు ఇస్తే ఎనిమిది సినిమాలు తీసి మీ మొఖాన కొడతామంటూ తమ్మారెడ్డి చేసిన కామెంట్ నేపథ్యంలో తనపై నెటిజన్లతో పాటు పలువురు సినీ ప్రముకుల నుంచి సైతం విమర్శల వర్షం కురుస్తోంది. తాజాగా ఇదే విషయంపై దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు స్పందించారు. మిత్రుడు భరద్వాజకి అంటూ మొదలు పెట్టిన ఆయన తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి మొదటి సారి వస్తున్న పేరుని చూసి గర్వపడాలి, అంతేగాని 80 కోట్లు ఖర్చు చేశారు అనడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా..? హాలీవుడ్ దర్శకులు స్పీల్ బర్గ్, జేమ్స్ కెమెరూన్ వంటి వారు కూడా డబ్బు తీసుకొని 'ఆర్ఆర్ఆర్'చిత్రం గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా..? అంటూ తమ్మారెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం రాత్రి ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. pic.twitter.com/wy5FcWjs0W — Raghavendra Rao K (@Ragavendraraoba) March 9, 2023 -
ఆస్కార్ కోసం 'ఆర్ఆర్ఆర్' ఫ్లైట్ ఖర్చులతో పది సినిమాలు తీయొచ్చు : తమ్మారెడ్డి
ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ చిత్రం నుంచి ‘నాటు నాటు’ పాట నామినేట్ అయ్యింది. ప్రస్తుతం ఆస్కార్ వేడుకలు ఉండటంతో ఆర్ఆర్ఆర్ టీం అమెరికాలో సందడి చేస్తుంది. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను మరింత ప్రమోట్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ రావాలని ప్రతి తెలుగువాళ్ళతో పాటు భారతీయులంతా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సినీ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆర్ఆర్ఆర్ యూనిట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆస్కార్ అవార్డు కోసం ఆర్ఆర్ఆర్ టీం రూ. 80 కోట్లు ఖర్చు పెట్టింది. అదే డబ్బుతో మేం 8-10 సినిమాలు తీసి ముఖాన కొడతాం.కేవలం వారు ఫ్లైట్ టికెట్స్ కోసమే కోట్లు ఖర్చుపెడుతున్నారు. ఇవన్నీ మాట్లాడుకోవడం కూడా టైమ్ వేస్ట్ అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. తెలుగు సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతుంటే ఇలా మనవాళ్లే ఇలా మాట్లాడటం సిగ్గుచేటని దుయ్యబడుతున్నారు. -
ఆ సినిమా నా వల్లే పోయింది: తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రముఖ తెలుగు దర్శక-నిర్మాతల్లో తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. ఆయన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. అందులో రామ్మా చిలకమ్మా ఒకటి. ఇందులో సుమంత్, లయ జంటగా నటించిన ఈ సినిమా పరాజయం పాలైంది. దీనిపై తాజాగా ఆయన స్పందించారు. ఇటీవల ఓ యూట్యూబ్‌లో చానల్‌తో ముచ్చటించిన ఆయన తన సినిమాల ప్లాప్ గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తన దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమా పరాజయానికి తానే కారణమంటూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. చదవండి: సూపర్ స్టార్ కృష్ణ గురించి అప్పట్లో మహాకవి శ్రీశ్రీ ఏమన్నారో తెలుసా? రామ్మా చిలకమ్మాకు సుమంత్ బాగుంటాడని తీసుకుంటాడని తీసుకున్నా. నాగార్జునన కూడా పది ఫ్లాపుల తర్వాత సూపర్‌స్టార్ అయ్యాడు. అందువలనే ఈ సినిమాను సుమంత్‌తో చేయోచ్చని ట్రై చేసిన సినిమా అది’ అన్నారు. ఆ తర్వాత ‘‘రామ్మా చిలకమ్మా’.. ‘స్వర్ణముఖి’.. ‘ఉర్మిళ’’ ఈ మూడు సినిమాలు కూడా నా మనసుకు దగ్గరగా ఉన్నవే. కానీ ఈ సినిమాలేవి బాగా ఆడలేదు. కాకపోతే ఇప్పటికీ మళ్లీ తీయదగిన కథ వాటిలో ఉంది. ఇక ‘ఎంతబాగుందో’ సినిమా విషయానికి వస్తే.. ఆ సినిమాకి వక్కంతం వంశీ కథను అందించాడు. చదవండి: ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూసిన సూపర్ స్టార్ మంచి పాయింట్ ఉన్న కథ అది. ఆ సినిమా ఫ్లాప్ కావడంలో ఎవరి తప్పు లేదు. డైరెక్టర్‌గా నేను కాకుండా వేరే వారు ఉన్నట్టయితే ఇది మంచి సినిమా అయ్యుండేది. ఆ సినిమాను నేను మిస్ హ్యాండిల్ చేశాను. నా వల్లే సినిమా పోయిందని అనుకునే సినిమాల్లో అది ఒకటిగా చెబుతాను. మిగతా సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయో అడిగితే చెప్పలేను. కానీ, ఈ సినిమా మాత్రం నా మిస్ హ్యాండిలింగ్ వల్లనే పోయిందని ఒప్పుకుంటాను. ఇక ఇక్కడ సక్సెస్ వస్తే చేసిన తప్పులన్నీ దాంట్లో కొట్టుకుపోతాయి. ఫ్లాప్ వస్తే తప్పులను గురించి మాత్రమే మాట్లాడుకుంటారు’’ అంటూ చెప్పుకొచ్చారు. -
విశ్వక్ సేన్, అర్జున్ వివాదంపై స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా-యంగ్ హీరో విశ్వక్ సేన్ల వివాదం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. విశ్వక్ సేన్ షూటింగ్‌కు హాజరు కాకుండ ఇబ్బంది పెట్టాడంటూ అర్జున్ సర్జా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అర్జున్ ఆరోపణలపై విశ్వక్ స్పందిస్తూ.. తన అభిప్రాయాలకు ఎలాంటి ప్రాధాన్యత లేదని, ఈ సినిమా షూటింగ్ సమయంలో తన ప్రవర్తన బాలేదని ఒక్క లైట్ బాయ్ చెప్పిన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ వివాదంపై ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. చదవండి: కోలుకుంటున్న ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘సినిమా మొదలు పెట్టేముందు హీరోలు మనకు ఇష్టం ఉందా? లేదా? ఆ నిర్మాత ఇష్టమా? హీరోకు ఇష్టమా అన్నది లేదా పారితోషికం లాంటి వివిధ విషయాలను ముందే మాట్లాడుకోవాలి. సినిమా మొదలయ్యాక కాదు. సినిమా షూటింగ్ మొదలయ్యాక ఇలాంటి మాట్లాడుకోవడం ఎంతవరకు న్యాయం, ధర్మమో చూస్తే.. ఎన్టీ రామారావుగారు ఎవరి దర్శకత్వంలో చేసినా, ఆయన దర్శకుడు చెప్పినట్టుగా చేసేవారు. దర్శకుడికి సంబంధించిన విషయాల్లో ఆయన జోక్యం చేసుకునేవారు కాదు. ఇదే నిబద్ధతను నేను బాలకృష్ణగారిలో కూడా చూశాను. ఇచ్చిన కాల్షీట్ ప్రకారం బాలకృష్ణ సెట్లో ఉండేవారు. కానీ ఈ గొడవలో అర్జున్ గారు షూటింగు మొదలుపెట్టేశారు. విశ్వక్ సేన్ కొంతవరకూ చేశారు. ‘నాకు నచ్చని విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని గురించి మాట్లాడుకున్నాక మొదలెడదాం’ అని అన్నట్టుగా విశ్వక్ చెబుతున్నాడు’’ అన్నారు. ‘ఇక అర్జున్ విషయానికి వస్తే ఆయనకు దర్శకుడిగా కూడా మంచి అనుభవం ఉంది. చాలా సూపర్ హిట్లు ఇచ్చారు. ఆయన అవుట్ డేటెడ్ అనుకుంటే విశ్వక్ ముందుగానే మానుకోవలసింది. సినిమా ఒప్పుకున్నాక మాటలు బాగోలేదు .. పాటలు బాగోలేదు అంటే ఎలా? నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు ప్రతి విషయంలోను జోక్యం చేసుకుంటున్నారు. ఈ కారణంగానే ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కూడా. కొత్త నిర్మాతలు .. కొత్త దర్శకులు .. వివిధ రకాల కథలతో వస్తున్నారు. చదవండి: ‘బింబిసార’ బ్లాక్‌బస్టర్.. మరో వైవిధ్యమైన కథతో వస్తున్న కల్యాణ్ రామ్ కానీ హీరోలు చెప్పినట్టు చేయడం వలన ఆ సినిమాలన్నీ ఒకేరకంగా ఉంటున్నాయనేది నా ఉద్దేశం’ అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం ‘కొత్తగా వచ్చిన హీరోలంతా దర్శకుడి పనిలో జోక్యం చేసుకుంటున్నారు. ఫంక్షన్స్‌లో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రేక్షకులను ఇరిటేట్ చేస్తున్నారు. అర్జున్ గారు అన్నట్టుగా చాలామంది నిర్మాతలు ఇలాంటి హీరోల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. యంగ్ హీరోలంతా ఈ పద్ధతిని మార్చుకోవలసిన అవసరం ఉంది. విశ్వక్ సేన్ చేసిన పని అర్జున్ గారికి మాత్రమే కాదు. నిర్మాత అనే ప్రతి ఒక్కరికీ.. దర్శకుడు అనే ప్రతి ఒక్కరికీ కూడా అవమానమే’’ అంటూ తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక్క విశ్వక్ సేన్ మాత్రమే కాదు ప్రస్తుతం యంగ్ హీరోల వల్ల చాలామంది దర్శక-నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికైన తమ ధోరణి మార్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. -
లైగర్ వివాదం.. పూరీ డబ్బులివ్వాల్సిన పని లేదు: తమ్మారెడ్డి
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన లైగర్ సినిమా ఫ్లాప్ పూరీ జగన్నాథ్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే! భారీ స్థాయిలో నష్టాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ తమకు కొంత డబ్బు వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకు పూరీ ఒక నెల రోజులు గడువు కోరినప్పటికీ కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం పూరీ ఆఫీస్ ముందు ధర్నా చేసేందుకు రెడీ అయ్యారు. ఈ విషయం తెలిసిన పూరీ జగన్నాథ్ తన పరువు తీయాలని ప్రయత్నిస్తే ఒక్క పైసా ఇవ్వనని వార్నింగ్ ఇచ్చాడు. ఈమేరకు ఓ ఆడియోకాల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఈ వ్యవహారంపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించాడు. 'పూరీ జగన్నాథ్ డిస్ట్రిబ్యూటర్లకు తిరిగి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. లైగర్ హక్కులు కొనమని వాళ్ల ఇంటికి వెళ్లి అడిగాడా? లేదు కదా! కొనుక్కునేవాడిదే తప్పు. అంతకుముందు విజయ్ దేవరకొండ నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు అంత పెద్ద మొత్తానికి కొనడం ఎందుకు? నష్టాలు వచ్చాయని డబ్బులు డిమాండ్ చేయడం ఎందుకు? లాభాలొస్తాయని పెద్ద సినిమాలు కొన్నప్పుడు నష్టం వచ్చినా భరించాలి' అని చెప్పుకొచ్చాడు. చదవండి: సినిమా చూడమని ఇంటింటికీ వెళ్లి అడుక్కోవాలా? అమ్మ ఆరోగ్యానికి రిస్క్ అని తెలిసినా నాన్న లెక్కచేయలేదు: శ్రీదేవి కూతురు