
నేను ప్రేమలో పడ్డా!
ప్రేమ గొప్పదనాన్ని తెలిపే కథతో సప్తవర్ణ క్రియేషన్స్‌పై సుజన్ నిర్మించిన చిత్రం ‘ఐయామ్ ఇన్ లవ్’. కిరణ్, ప్రియాంక జంటగా చంద్రశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం లోగో, ప్రచార చిత్రం ఆవిష్కరణ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ్ లోగోను, అనిల్ సుంకర ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించారు. ఇదొక అందమైన ప్రేమకథా చిత్రమనీ, చక్రవర్తి ఫొటోగ్రఫీ, కేకే ప్రదీప్ స్వరపరచిన పాటలు అదనపు ఆకర్షణగా నిలుస్తాయని దర్శకుడు తెలిపారు.
కిరణ్ మాట్లాడుతూ -‘‘స్క్రీన్‌ప్లే ప్రాధాన్యంగా సాగే చిత్రం ఇది. నటనకు అవకాశం ఉన్న పాత్ర చేశాను. వినోద ప్రధానంగా సాగే సినిమా’’ అని చెప్పారు. సుజన్ మాట్లాడుతూ -‘‘ప్రేక్షకులకు ఓ మంచి చిత్రం ఇవ్వాలనే సదాశయంతో చేశాం. క్లీన్ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీతో రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాలవారూ చూసే విధంగా ఉంటుంది. త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ వేడుకలో రఘుబాబు, ప్రదీప్, చక్రవర్తి పాల్గొన్నారు.