టాలీవుడ్ సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ రూ.80 కోట్లు ఖర్చు చేసిందని, ఆ డబ్బు తమకిస్తే 8 సినిమాలు తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా గురించి ప్రపంచమంతా మాట్లాడుతుంటే తెలుగువాళ్లై ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటని తమ్మారెడ్డిపై పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాట ఆస్కార్ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. హాలీవుడ్ పాటలను తలదన్ని నాటునాటు విజయకేతనం ఎగరవేసింది. తెలుగోడి ప్రతిభకు ఆస్కార్ పట్టం కట్టింది. దీంతో ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి యావత్ సినీ, రాజకీయ ప్రముఖులు నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ స్పందన కోసం నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. తాజాగా నాటునాటు పాటకు ఆస్కార్ రావడంపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఆయన ఏమన్నారంటే.. 'మన తెలుగు పాటకు ఆస్కార్ రావడం చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. నాకే కాదు, ప్రతి భారతీయుడు, సినిమాను ప్రేమించే వాళ్లకు ఇది గర్వకారణం. తెలుగు సంగీతాన్ని, తెలుగుదనాన్ని ఇప్పటికీ తమ సినిమాల్లో పొందుపరుస్తున్న అతికొద్దిమందిలో కీరవాణి, చంద్రబోస్ ఒకరు. వాళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన నాటునాటు పాటకు ఆస్కార్ రావడం చాలా అద్భుతమైన విషయం. ఈ సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్ టీంకి నా అభినందలు తెలియజేస్తున్నాను' అంటూ తమ్మారెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment