పవన్ క్లారిటీ అడగడంలో అర్ధం లేదు: నిర్మాత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా పవన్‌కళ్యాణ్ కోరుతున్నారో? లేదో? తనకు అర్ధం కావడం లేదని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గురువారం అన్నారు. ప్రత్యేక హోదా కోసం పవన్ పిలుపునిస్తున్నా.. దాన్ని ఫాలోఅప్ చేయడం లేదని అభిప్రాయపడ్డారు. పవన్ అదే పనిగా బీజేపీ, టీడీపీ నేతలను క్లారిటీ ఇవ్వాలని అడగడంలో అర్ధం లేదని అన్నారు. ప్రత్యేకహోదాపై వాళ్లు ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశారని చెప్పారు.