సాక్షి, అమరావతి : జనసేనాని పవన్ కల్యాణ్ మరోసారి ప్రత్యేక హోదా అంశంపై స్పందించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాయటం.. దానికి ప్రతిగా చంద్రబాబు వివరణ ఇవ్వటం వంటి పరిణామాలను పరిశీలించిన పవన్.. ప్రత్యేక హోదా ఈ రెండు పార్టీల వల్ల సాధ్యం కాదన్నది స్పష్టమైందని చెబుతున్నారు.
‘అమిత్ షా లేఖ ద్వారా బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వదని తేలిపోయింది. రాష్ట్రానికి కోట్లాది సాయం ఇచ్చామని పాడినపాటే అమిత్ షా మళ్లీ పాడగా.. ఎప్పటిలాగే కేంద్రం మోసం చేసిందంటూ చంద్రబాబు చెబుతున్నారు. ప్రజలను మభ్య పెట్టేందుకు ఒకరిపై ఒకరు నిందలేసుకుంటున్నారు. ఇంకా ఎంత కాలం ఈ దాగుడు మూతలు?. ప్రత్యేక హోదా కోసం టీడీపీ పోరాడదని, సాధించే స్థితిలో ఏ మాత్రం లేదని ప్రజలు అర్థం చేసుకున్నారు. విసిగిపోయిన ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టే పరిస్థితులను కల్పించకండి ’ అని ఓ ప్రెస్ నోట్‌లో పవన్ పేర్కొన్నారు.
ఇప్పటిదాకా అందిన నిధుల అధికారిక లెక్కలపై కమిటీ వేయటమో.. లేక జనసేన చొరవతో ఏర్పాటైన జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ అధ్యయనంలో వెల్లడైన విషయాలను పరిగణలోకి తీసుకుని కేంద్రాన్ని నిలదీయొచ్చుగా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని పవన్ సూటిగా ప్రశ్నించారు. బీజేపీ, తెలుగుదేశం పార్టీల కారణంగా ఏపీలో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితిపై త్వరలో వామపక్ష నాయకులతో జనసేన పార్టీ చర్చిస్తుందని.. ఆ తర్వాత ఏం చేయాలన్న దానిపై లోక్‌సత్తా జయప్రకాశ్ వంటి అనుభవజ్ఞులతో, మేధావులతో సమాలోచనలు జరుపుతామని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
ప్రత్యేక హోదా పై వామపక్షాలతో సమావేశం - @PawanKalyan pic.twitter.com/EdyKGP28tn
— JanaSena Party (@JanaSenaParty) 24 March 2018
Comments
Please login to add a commentAdd a comment