‘తెలుగు పరిశ్రమలోని 24 శాఖలతో కలిసి మే డే ఉత్సవాలను నిర్వహించాలనుకుంటున్నాం. కరోనా టైమ్‌లో కార్మికులు ఇబ్బందులు పడ్డారు... సొంత ఊర్లకు వెళ్లిపోయారు. అలాంటి వారికి మేమున్నాం అని చెప్పేలా ఈ వేడుక చేస్తున్నాం. ఈ వేడుకలో చిరంజీవిగారు ముఖ్య అతిథిగా, ఆయనతో పాటు కిషన్ రెడ్డిగారు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌గారు, సబితా ఇంద్రారెడ్డిగారు, భట్టి విక్రమార్కగారు, ఏపీకి చెందిన పలువురు మంత్రులు కూడా పాల్గొంటారు’’ అని తెలుగు చలన చిత్ర కార్మికుల సంఘం అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని అన్నారు.
మే 1న ఫిలిం ఫెడరేషన్ కార్మిక దినోత్సవ సంబరాలను జరపనున్నారు. గురువారం జరిగిన సమావేశంలో ఈ వేడుకలకు సంబంధించిన బ్రోచర్‌ని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ, ఈవెంట్ టీ షర్ట్స్‌ను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు.
చదవండి: అజయ్ దేవగణ్, సుదీప్‌ల ట్విటర్ వార్‌పై సోనూసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment