Telugu cine workers
-
అలాంటివారికి మేమున్నాం అని చెప్పేందుకే ఈ వేడుక
‘తెలుగు పరిశ్రమలోని 24 శాఖలతో కలిసి మే డే ఉత్సవాలను నిర్వహించాలనుకుంటున్నాం. కరోనా టైమ్‌లో కార్మికులు ఇబ్బందులు పడ్డారు... సొంత ఊర్లకు వెళ్లిపోయారు. అలాంటి వారికి మేమున్నాం అని చెప్పేలా ఈ వేడుక చేస్తున్నాం. ఈ వేడుకలో చిరంజీవిగారు ముఖ్య అతిథిగా, ఆయనతో పాటు కిషన్ రెడ్డిగారు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌గారు, సబితా ఇంద్రారెడ్డిగారు, భట్టి విక్రమార్కగారు, ఏపీకి చెందిన పలువురు మంత్రులు కూడా పాల్గొంటారు’’ అని తెలుగు చలన చిత్ర కార్మికుల సంఘం అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని అన్నారు. మే 1న ఫిలిం ఫెడరేషన్ కార్మిక దినోత్సవ సంబరాలను జరపనున్నారు. గురువారం జరిగిన సమావేశంలో ఈ వేడుకలకు సంబంధించిన బ్రోచర్‌ని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ, ఈవెంట్ టీ షర్ట్స్‌ను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: అజయ్ దేవగణ్, సుదీప్‌ల ట్విటర్ వార్‌పై సోనూసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు -
‘అందుకు సీఎం సానుకూలంగా స్పందించారు’
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సిద్ధమయ్యారు. రెండు నెలల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్న 14 వేల మంది సినీ కార్మికులు, సినీ,టీవీ ఆర్టిస్టులకు మంత్రి తలసాని ఈ నెల 28న నిత్యావసరాలు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు సిద్దం చేసిన సరకులను మంత్రి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోస్ట్ ప్రొడక్షన్, షూటింగ్‌లు, థియేటర్ల ఓపెనింగ్‌లపై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. అనుమతులపై దశల వారీగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. -
సమ్మె విరమించిన సినీ కార్మికులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర కార్మికులు సమ్మె విరమించారు. నిర్మాతలతో శుక్రవారం జరిపిన చర్చలు సఫలం కావడంతో ఏడు రోజులుగా చేస్తున్న సమ్మె విరమించారు. రేపటి నుంచి మళ్లీ సినిమా షూటింగ్ ల్లో పాల్గొంటామని ఏ.పి. చలన చిత్ర కార్మికుల సమాఖ్య అధ్యక్షులు కొమర వెంకటేశ్ తెలిపారు. తమ డిమాండ్లు అంగీకరించినందుకు ఫిలిం ఛాంబర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఏడు రోజులుగా సినీ కార్మికులు సమ్మె చేస్తుండడంతో షూటింగ్ లో ఆగిపోయాయి. ఫలితంగా పలు సినిమాల విడుదల వాయిదాపడే అవకాశాలు కన్పిస్తున్నాయి.