హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర కార్మికులు సమ్మె విరమించారు. నిర్మాతలతో శుక్రవారం జరిపిన చర్చలు సఫలం కావడంతో ఏడు రోజులుగా చేస్తున్న సమ్మె విరమించారు. రేపటి నుంచి మళ్లీ సినిమా షూటింగ్ ల్లో పాల్గొంటామని ఏ.పి. చలన చిత్ర కార్మికుల సమాఖ్య అధ్యక్షులు కొమర వెంకటేశ్ తెలిపారు. తమ డిమాండ్లు అంగీకరించినందుకు ఫిలిం ఛాంబర్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఏడు రోజులుగా సినీ కార్మికులు సమ్మె చేస్తుండడంతో షూటింగ్ లో ఆగిపోయాయి. ఫలితంగా పలు సినిమాల విడుదల వాయిదాపడే అవకాశాలు కన్పిస్తున్నాయి.
సమ్మె విరమించిన సినీ కార్మికులు
Published Fri, Dec 5 2014 10:21 PM | Last Updated on Sat, Aug 11 2018 8:29 PM
Advertisement
Advertisement