రెండు వారాలకే రూ. 10 కోట్లా.. వివాదంలో నాగ శౌర్య సినిమా | Naga Shaurya New Movie Controversy Reaches Film Chamber | Sakshi
Sakshi News home page

రెండు వారాలకే రూ. 10 కోట్లా.. వివాదంలో నాగ శౌర్య సినిమా

Published Sun, Jul 21 2024 4:47 PM | Last Updated on Sun, Jul 21 2024 4:50 PM

Naga Shaurya New Movie Controversy Reaches Film Chamber

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య గతేడాది 'రంగబలి' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఆ సినిమా డిజాస్టర్‌ అయింది. ఇప్పుడు నారి నారి నడుమ మురారి, పోలీస్‌ వారి హెచ్చరిక వంటి చిత్రాలతో శౌర్య బిజీగా ఉన్నారు. అయితే,  చాలా కాలంగా మంచి హిట్‌ కోసం ఆయన ఎదురుచూస్తున్నాడు. సినిమాల పరంగా కాస్త ఇబ్బందుల్లోనే ఉన్నాడు. ఇలాంటి సమయంలో కన్నడ హీరో దర్శన్‌కు మద్ధతుగా శౌర్య నిలిచాడు. ఒక హత్య కేసులో అరెస్ట్‌ అయి జైల్లో ఉన్న వ్యక్తికి సపోర్ట్‌ చేయడం ఏంటి అని నెటిజన్లు ప్రశ్నించారు. తాజాగా ఆయన కొత్త సినిమా నిర్మాత నుంచి పలు ఇబ్బందులు ఎదురౌతున్నాయని ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్‌ అవుతుంది.

నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా డైరక్టర్‌కు ,నిర్మాతలకు మధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. నిర్మాత, దర్శకుడు ఇద్దరూ కొత్త వారు కావడంతో ఈ చిక్కులు వచ్చినట్లు సమాచారం. నాగశౌర్య సినిమాకు పెట్టుబడి పెట్టేందకు  ఓ ఎన్నారై ముందుకు వస్తే.. ఆయన ఈ ఫీల్డ్‌కు కొత్త వ్యక్తి కావడంతో సినిమా  షూటింగ్ మొదలవడానికి ముందే ప్రీ ప్రొడక్షన్ పేరుతో బాగా ఖర్చు పెట్టించేశారట. కేవలం రెండు వారాల షూటింగ్‌ కోసం ఏకంగా రూ.10 కోట్లు ఆ నిర్మాత ఖర్చు పెట్టాడట. దీంతో ఆయన భయపడిపోయి సినిమా ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడట. 

అయితే, సినిమా ఆగింది కాబట్టి వేరే నిర్మాతను నాగశౌర్య తీసుకొచ్చారట. కానీ, ఇప్పటి వరకు తాము పెట్టిన డబ్బు తిరిగిచ్చేసి సినిమాను నిర్మించాలని వారు పట్టుపడుతున్నారని సమాచారం. అందుకు వారు అంగీకరించకపోవడంతో ఈ పంచాయితీ ఫిలిం ఛాంబర్ వరకు వెళ్లిందని తెలుస్తోంది. అధికారికంగా వారి నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ నెట్టింట మాత్రం ఈ వార్త భారీగా వైరల్‌ అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement