Naga sowrya
-
రెండు వారాలకే రూ. 10 కోట్లా.. వివాదంలో నాగ శౌర్య సినిమా
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య గతేడాది 'రంగబలి' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇప్పుడు నారి నారి నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక వంటి చిత్రాలతో శౌర్య బిజీగా ఉన్నారు. అయితే, చాలా కాలంగా మంచి హిట్ కోసం ఆయన ఎదురుచూస్తున్నాడు. సినిమాల పరంగా కాస్త ఇబ్బందుల్లోనే ఉన్నాడు. ఇలాంటి సమయంలో కన్నడ హీరో దర్శన్‌కు మద్ధతుగా శౌర్య నిలిచాడు. ఒక హత్య కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న వ్యక్తికి సపోర్ట్ చేయడం ఏంటి అని నెటిజన్లు ప్రశ్నించారు. తాజాగా ఆయన కొత్త సినిమా నిర్మాత నుంచి పలు ఇబ్బందులు ఎదురౌతున్నాయని ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్ అవుతుంది.నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా డైరక్టర్‌కు ,నిర్మాతలకు మధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. నిర్మాత, దర్శకుడు ఇద్దరూ కొత్త వారు కావడంతో ఈ చిక్కులు వచ్చినట్లు సమాచారం. నాగశౌర్య సినిమాకు పెట్టుబడి పెట్టేందకు ఓ ఎన్నారై ముందుకు వస్తే.. ఆయన ఈ ఫీల్డ్‌కు కొత్త వ్యక్తి కావడంతో సినిమా షూటింగ్ మొదలవడానికి ముందే ప్రీ ప్రొడక్షన్ పేరుతో బాగా ఖర్చు పెట్టించేశారట. కేవలం రెండు వారాల షూటింగ్ కోసం ఏకంగా రూ.10 కోట్లు ఆ నిర్మాత ఖర్చు పెట్టాడట. దీంతో ఆయన భయపడిపోయి సినిమా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. అయితే, సినిమా ఆగింది కాబట్టి వేరే నిర్మాతను నాగశౌర్య తీసుకొచ్చారట. కానీ, ఇప్పటి వరకు తాము పెట్టిన డబ్బు తిరిగిచ్చేసి సినిమాను నిర్మించాలని వారు పట్టుపడుతున్నారని సమాచారం. అందుకు వారు అంగీకరించకపోవడంతో ఈ పంచాయితీ ఫిలిం ఛాంబర్ వరకు వెళ్లిందని తెలుస్తోంది. అధికారికంగా వారి నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ నెట్టింట మాత్రం ఈ వార్త భారీగా వైరల్ అవుతుంది. -
రొమాంటిక్ కామెడీగా 'జో అచ్యుతానంద'
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు అవసరాల శ్రీనివాస్. తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించిన శ్రీని.. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా ‘జో అచ్యుతానంద’ అనే పేరుతో మరో రొమాంటిక్ కామెడీని అందించేందుకు రెడీ అవుతున్నాడు. నారా రోహిత్, నాగ శౌర్య హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. బుధవారం దీని టీజర్ విడుదలై సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. ఆగష్టు 21న ఆడియో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. కల్యాణ్ కోడూరి ఈ చిత్రానికి స్వరాలందించారు. ఇద్దరు అన్నదమ్ములు ఒకే అమ్మాయిని ప్రేమించడమన్న కాన్సెప్ట్‌తో రొమాంటిక్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో రెజీనా హీరోయిన్గా నటించారు. సెప్టెంబర్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. -
రొమాంటిక్ కామెడీగా 'జ్యో అచ్యుతానంద'
-
ప్రశాంత నగరం..
దేశంలో నివసించేందుకు అనువైన నగరాల్లో హైదరాబాద్‌ను మించింది మరొకటి లేదు. ఇక్కడ ఉన్నందుకు ఎంతో గర్విస్తుంటా. నాకు ఈ సిటీ ఎన్నో ఇచ్చింది. ఆ జ్ఞాపకాలు ఎన్నటికీ మరచిపోలేనివి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సిటీ... భిన్న ప్రాంతాలు, సంస్కృతుల ప్రజలకు ఆశ్రయమిచ్చింది. అందరూ ఎంతో సఖ్యతతో ఉండడం చాలా నచ్చింది. చిన్నప్పటి నుంచీ ఇక్కడే పెరిగా. ఐమాక్స్ బిగ్ స్క్రీన్‌పై సినిమా చూడ్డమన్నా, చార్మినార్‌ను చూడ్డమన్నా భలే ఇష్టం. ఇక్కడి బిర్యానీ, హలీం రుచులు ప్రపంచ ప్రజల మనసు దోచాయి. నెక్లెస్ రోడ్డులో తిరుగుతుంటే ఆ ప్రశాంతతే వేరు. - నాగశౌర్య