
రొమాంటిక్ కామెడీగా 'జో అచ్యుతానంద'
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు అవసరాల శ్రీనివాస్. తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించిన శ్రీని.. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా ‘జో అచ్యుతానంద’ అనే పేరుతో మరో రొమాంటిక్ కామెడీని అందించేందుకు రెడీ అవుతున్నాడు. నారా రోహిత్, నాగ శౌర్య హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. బుధవారం దీని టీజర్ విడుదలై సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది.
ఆగష్టు 21న ఆడియో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. కల్యాణ్ కోడూరి ఈ చిత్రానికి స్వరాలందించారు. ఇద్దరు అన్నదమ్ములు ఒకే అమ్మాయిని ప్రేమించడమన్న కాన్సెప్ట్తో రొమాంటిక్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో రెజీనా హీరోయిన్‌గా నటించారు. సెప్టెంబర్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.