జ్యో అచ్యుతానందపై రాజమౌళి రివ్యూ | Rajamouli review on Jyo Achyutananda | Sakshi
Sakshi News home page

జ్యో అచ్యుతానందపై రాజమౌళి రివ్యూ

Sep 9 2016 4:13 PM | Updated on Jul 14 2019 4:05 PM

జ్యో అచ్యుతానందపై రాజమౌళి రివ్యూ - Sakshi

జ్యో అచ్యుతానందపై రాజమౌళి రివ్యూ

తనకు నచ్చిన సినిమాలపై సోషల్ మీడియాలో స్పందించే దర్శక ధీరుడు రాజమౌళి, తాజాగా జ్యో అచ్యుతానందపై సినిమాపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ సినిమా రాజమౌళికి అత్యంత సన్నిహితులైన వారాహి...

తనకు నచ్చిన సినిమాలపై సోషల్ మీడియాలో స్పందించే దర్శక ధీరుడు రాజమౌళి, తాజాగా జ్యో అచ్యుతానందపై సినిమాపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ సినిమా రాజమౌళికి అత్యంత సన్నిహితులైన వారాహి చలన చిత్ర బ్యానర్ పై రూపొందటంతో రిలీజ్ రోజు తొలి షోనే చూసిన జక్కన సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల పేరు పేరునా ప్రశంసించాడు.

ఈ సినిమాపై సోషల్ మీడియాలో స్పందించిన రాజమౌళి, ' వారాహి చలన చిత్ర, అవసరాల శ్రీనివాస్, కళ్యాణ్ రమణల కాంబినేషన్ జ్యో అచ్యుతానంద సినిమాతో మరోసారి ఆకట్టుకుంది. సినిమాలో ఎక్కడా కావాలని ఇరికించిన సీన్స్ లేవు. సినిమా అంతా ఆరోగ్యకరమైన హాస్యం, గుండెలకు హత్తుకునే ఎమోషన్స్ అలరిస్తాయి. ముఖ్యంగా చివరి 10 నిమిషాలు కంట తడి పెట్టిస్తోంది.

నారా రోహిత్, నాగశౌర్యలు అన్నదమ్ములుగా బాగున్నారు. రెజీనా నటన తొలిసారిగా చూశా. ఎంతో నచ్చింది. వెంకట్ ఫోటోగ్రఫి సినిమాకు ప్లస్, చిన్న చిన్న డిటెయిలింగ్ విషయంలో కూడా ఆర్ట్ డైరెక్టర్ రమ జాగ్రత్తలు తీసుకున్నారు. 'చివరకు మిగిలేది' నవలను వయసైనట్టుగా చూపించటం ఓ ఉదాహరణ. అందరికీ శుభాకాంక్షలు'. అంటూ ట్వీట్ చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement