సెప్టెంబర్ 15న 'కథలో రాజకుమారి' | Kathalo Rajakumari release on Sep 15 | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 15న 'కథలో రాజకుమారి'

Published Mon, Sep 11 2017 1:23 PM | Last Updated on Wed, Aug 29 2018 3:53 PM

సెప్టెంబర్ 15న 'కథలో రాజకుమారి' - Sakshi

సెప్టెంబర్ 15న 'కథలో రాజకుమారి'

నారా రోహిత్‌, నాగశౌర్య, నమితా ప్రమోద్‌, నందిత ప్రధాన పాత్రలలో మహేష్‌ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కథలో రాజకుమారి. రాజేష్‌ వర్మ సిరువూరి సమర్పణలో సౌందర్య నర్రా, ప్రశాంతి, బీరం సుధాకర్‌రెడ్డి, కృష్ణవిజరులు ఈసినిమాను నిర్మిస్తున్నారు. సెన్సార్ సహా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'పరిణతి చెందిన ఓ జంట మధ్య జరిగే భావోద్వేగాలతో కూడుకున్న ప్రేమకథా చిత్రమిది. సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ పొందింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తయిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్  15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement