క్రేజీ మల్టీ స్టారర్కు రెడీ అవుతున్నారు | nara rohit, naga shourya, sandeep kishan multi starer | Sakshi
Sakshi News home page

క్రేజీ మల్టీ స్టారర్కు రెడీ అవుతున్నారు

Published Wed, Nov 2 2016 1:41 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

క్రేజీ మల్టీ స్టారర్కు రెడీ అవుతున్నారు - Sakshi

క్రేజీ మల్టీ స్టారర్కు రెడీ అవుతున్నారు

యంగ్ జనరేషన్ హీరోలు ఈగోలను పక్కన పెట్టి మల్టీ స్టారర్ సినిమాలకు రెడీ అవుతున్నారు. అందుకే దర్శకులు కూడా క్రేజీ కాంబినేషన్లలో మల్టీ స్టారర్ సినిమాలు తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. అదే బాటలో భలేమంచి రోజు సినిమా ఫేం శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఓ ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.

ఇప్పటికే జ్యో అచ్యుతానంద సినిమాలో కలిసి నటించిన నారా రోహిత్, నాగశౌర్యలతో పాటు సందీప్ కిషన్లు హీరోలుగా ఓ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు ఎక్కువగా ఇద్దరు హీరోలు చేసిన మల్టీ స్టారర్ సినిమాలు మాత్రమే రాగా, శ్రీరాం ముగ్గరు హీరోలకు సరిపోయే ఇంట్రస్టింగ్ కథను సిద్దం చేశాడట. ఇప్పటికే కథ విన్న నారా రోహిత్, నాగశౌర్య, సందీప్ కిషన్లు ఈ ప్రాజెక్ట్కు అంగకరించారన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement