జూన్ 30న 'కథలో రాజకుమారి' | Nara rohit Kathalo rajakumari Release date | Sakshi
Sakshi News home page

జూన్ 30న 'కథలో రాజకుమారి'

Published Sun, May 28 2017 12:51 PM | Last Updated on Wed, Aug 29 2018 3:53 PM

జూన్ 30న 'కథలో రాజకుమారి' - Sakshi

జూన్ 30న 'కథలో రాజకుమారి'

డిఫరెంట్ మూవీస్తో ఆకట్టుకుంటున్న నారా రోహిత్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా కథలో రాజకుమారి. మహేష్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అరకు ప్రాంతంలో  వేసిన భారీ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.. మేస్ట్రొ ఇళయరాజా రెండు పాటలకు సంగీతమందించగా.. 'కృష్ణగాడి వీరప్రేమగాధ' ఫేం విశాల్ చంద్రశేఖర్ మరో ఐదు పాటలకు మ్యూజిక్ చేశాడు. త్వరలో ఈ సినిమా ఆడియోను అరన్ మ్యూజిక్  ద్వారా మర్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.

ఇంత వరకు చేయని డిఫరెంట్ క్యారెక్టర్లో నారా రోహిత్ నటిస్తుండగా మరో యంగ్ హీరో నాగశౌర్య ప్రత్యేక పాత్రలో అలరించనున్నాడు. వీరి ఇద్దరి మధ్య జరిగే సన్నివేశాలు సినిమాకే హైలెట్ అంటున్నారు చిత్రయూనిట్. నమిత ప్రమోద్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో కోటా శ్రీనివాసరావు, పరుచూరి వెంకటేశ్వర రావు, అవసరాల శ్రీనివాస్, మురళీమొహన్, అజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, హీరోయిన్ నందిత ఒక కీలక పాత్రలో కనిపించనుంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 30న సినిమాలను రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఆరోహి సినిమా, అరన్ మీడియ వర్క్స్, శ్రీహాస్ ఎంటెర్టైన్మెంట్స్, సుధాకర్ ఇంపెక్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement