జ్యో అచ్యుతానంద కాంబినేషన్లో మరో సినిమా | Jo Achyutananda combination repeats again | Sakshi
Sakshi News home page

జ్యో అచ్యుతానంద కాంబినేషన్లో మరో సినిమా

Published Sat, Nov 26 2016 3:44 PM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM

జ్యో అచ్యుతానంద కాంబినేషన్లో మరో సినిమా

జ్యో అచ్యుతానంద కాంబినేషన్లో మరో సినిమా

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా.. చెప్పుకోదగ్గ హిట్స్ సాధించటంలో ఫెయిల్ అవుతూ వస్తున్న హీరో నారా రోహిత్. చాలా కాలంగా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నారా రోహిత్ కోరిక తీర్చిన సినిమా జ్యో అచ్యుతానంద. కమెడియన్ అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. నారా రోహిత్తో పాటు నాగశౌర్య మరో హీరోగా నటించిన జ్యో అచ్యుతనంద సెంటిమెంట్ను మరోసారి రిపీట్ చేస్తున్నాడు రోహిత్.

ప్రస్తుతం నారా రోహిత్, 'కథలో రాజకుమారి' సినిమాలో నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు మహేష్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళీ భామ నమితా ప్రమోద్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో మరోసారి నారా రోహిత్, నాగశౌర్యలు కలిసి నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నాగశౌర్య చేస్తుంది అతిథి పాత్రేనట. ప్రస్తుతం రోహిత్, నాగశౌర్యల కాంబినేషన్లో రామోజీ ఫిలిం సిటీలో యాక్షన్ సీన్ చిత్రీకరణ జరుగుతోంది. త్వరలోనే చిత్రయూనిట్ సినిమా రిలీజ్ డేట్ను వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement