Jo Achyutananda
-
జ్యో అచ్యుతానంద కాంబినేషన్లో మరో సినిమా
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా.. చెప్పుకోదగ్గ హిట్స్ సాధించటంలో ఫెయిల్ అవుతూ వస్తున్న హీరో నారా రోహిత్. చాలా కాలంగా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నారా రోహిత్ కోరిక తీర్చిన సినిమా జ్యో అచ్యుతానంద. కమెడియన్ అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. నారా రోహిత్‌తో పాటు నాగశౌర్య మరో హీరోగా నటించిన జ్యో అచ్యుతనంద సెంటిమెంట్‌ను మరోసారి రిపీట్ చేస్తున్నాడు రోహిత్. ప్రస్తుతం నారా రోహిత్, 'కథలో రాజకుమారి' సినిమాలో నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు మహేష్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళీ భామ నమితా ప్రమోద్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో మరోసారి నారా రోహిత్, నాగశౌర్యలు కలిసి నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నాగశౌర్య చేస్తుంది అతిథి పాత్రేనట. ప్రస్తుతం రోహిత్, నాగశౌర్యల కాంబినేషన్లో రామోజీ ఫిలిం సిటీలో యాక్షన్ సీన్ చిత్రీకరణ జరుగుతోంది. త్వరలోనే చిత్రయూనిట్ సినిమా రిలీజ్ డేట్‌ను వెల్లడించనున్నారు. -
రైటింగ్, టేకింగ్ కొత్తగా ఉంటాయి
‘‘అచ్యుత్, ఆనంద్.. అన్నదమ్ములు. ఇద్దరికీ పెళ్లయింది. వీరి జీవితాల్లోకి జ్యో అనే అమ్మాయి ప్రవేశించిన తర్వాత ఏం జరిగిందనేది చిత్ర కథాంశం. ముక్కోణపు ప్రేమకథా చిత్రం కాదు’’ అన్నారు దర్శకుడు అవసరాల శ్రీనివాస్. నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా ముఖ్య తారలుగా అవసరాల దర్శకత్వం వహించిన చిత్రం ‘జ్యో అచ్యుతానంద’. వారాహి చలనచిత్రం పతాకంపై శ్రీమతి రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. అవసరాల మాట్లాడుతూ - ‘‘ఊహలు గుసగుసలాడే’ రొటీన్ చిత్రం. మళ్లీ అలాంటి చిత్రమే తీస్తే దర్శకుడిగా నాపై ఓ స్టాంప్ వేస్తారు. ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఈ ఐడియా వచ్చింది. రైటింగ్, టేకింగ్ పరంగా సినిమా కొత్తగా ఉంటుంది. అప్ కమింగ్ హీరోలు చాలామందికి ఈ కథ వినిపించా. ‘మల్టీస్టారర్ వద్దు, సోలో హీరో కథలుంటే చెప్పండి’ అన్నారు. రోహిత్ కథ వినగానే ఓకే చెప్పారు. స్క్రిప్ట్ దశలోనే శౌర్యను దృష్టిలో పెట్టుకున్నా. నాని చేసిన అతిథి పాత్ర ఏమిటనేది సస్పెన్స్. కల్యాణ్ రమణ సంగీతం చిత్రానికి ప్లస్ అయ్యింది. సాయి కొర్రపాటి గారితో రెండో చిత్రమిది. ఆయనతో మరో చిత్రం చేయాలనుకుంటున్నాను. మా వేవ్‌లెంగ్త్ అంత బాగా కుదిరింది. నా దర్శకత్వంలో నాని హీరోగా ఓ చిత్రం చేయాలి. రెండు ఐడియాలున్నాయి. ప్రస్తుతం ‘హంటర్’ రీమేక్‌లో హీరోగా నటిస్తున్నాను. బోల్డ్ చిత్రమైనా, అందులో ఎమోషన్ నచ్చింది’’ అన్నారు. -
'జ్యో అచ్యుతానంద' మూవీ స్టిల్స్
-
నన్ను ఇష్టపడతారు... అసహ్యించుకుంటారు!
అప్పుడు రెజీనా వయసు 90. మనవళ్లతో హాయిగా కాలక్షేపం చేస్తుంటారు. దాంతో పాటు ఓ సినిమా చూడమని వాళ్లకు చెబుతారు. అదే ‘జ్యో అచ్యుతానంద’. ఆమె అంత బాగా ఇష్టపడి చేసిన సినిమా ఇది. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా ముఖ్య తారలుగా సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో రెజీనా చెప్పిన ముచ్చట్లు... ఈ చిత్రంలో నేను డెంటల్ డాక్టర్ని. నా పేరు ‘జో’. మీ పక్కింట్లోనో, ఎదురింట్లోనో ఉండే అమ్మాయిలా ఉంటాను. ఈ మూవీలో నన్ను చూసినవాళ్లు నవ్వుతారు, బాధపడతారు, ఇష్టపడతారు, అసహ్యించుకుంటారు. ఇంత మంచి పాత్ర చేసే అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ అవసరాలకు, సాయి కొర్రపాటిగారికి కృతజ్ఞతలు. మొన్నీ మధ్యే పాటలు విడుదలయ్యాయి. కల్యాణి రమణ (కల్యాణి మాలిక్) అద్భుతమైన పాటలిచ్చారు. నాకు 90 ఏళ్లు వచ్చినా కూడా నేనీ సినిమాని మర్చిపోను. నా మనవళ్ళకు, మనవరాళ్లకు ‘జ్యో అచ్యుతానంద’ చూడమని చెప్తాను. అంతగా నా మనసుకు దగ్గరయిందీ కథ. ‘జో’గా నేను, అచ్యుత్‌గా నారా రోహిత్, ఆనంద్‌గా నాగశౌర్య నటించాం. ప్రధానంగా మా ముగ్గురి మధ్య నడిచే కథ ఇది. కథ విన్నప్పట్నుంచి ఎప్పుడెప్పుడు షూటింగ్ ఆరంభమవుతుందా? అని ఎదురు చూశా. షూటింగ్ పూర్తయ్యాక ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురు చూస్తున్నా. నేనే ఇంటర్వ్యూ ఇచ్చినా ‘మీకు, సాయిధరమ్ తేజ్‌కు బ్రేకప్ అయ్యిందా’ అని అడుగుతుంటారు. ‘‘మా ఇద్దరి మధ్య ఏదో ఉందని రాస్తారు. ఆ తర్వాత బ్రేకప్ అని రాస్తారు. కాసేపు రెజీనా పనైపోయింది అంటారు. ప్రస్తుతం తనకు సినిమాలు లేవు’’ అని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు రాసుకుంటారు. బాధగా ఉంటుంది. అయినా అందరికీ విడివిడిగా సమాధానం చెప్పలేను. చెప్పను కూడా. ప్రస్తుతం హిందీ చిత్రం ‘ఆంఖే-2’లో నటిస్తున్నా. అమితాబ్‌గారు, అనిల్ కపూర్, అర్షద్ వార్సీ, అర్జున్ రాంపాల్.. ఇలా భారీ తారాగణంతో ఈ చిత్రం ఉంటుంది. ఈ మధ్య ఫోటోషూట్ జరిగింది. ఇప్పటివరకూ అలాంటి భారీ ఫొటోషూట్‌లో నేను పాల్గొనలేదు. ఆ ఇమేజెస్ ఎప్పుడు బయటకు వస్తాయా? అని ఎదురుచూస్తున్నా. ఇది కాకుండా తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను. తెలుగులో చేసిన ‘జ్యో అచ్యుతానంద’తో పాటు, ‘శంకర’ కూడా రిలీజుకు రెడీగా ఉంది. హీరోలకైతే ఆ స్టార్ ఈ స్టార్ అని బిరుదులుంటాయి... మరి అనుష్క, సమంత, రకుల్ వంటి హీరోయిన్లకు? మీరైతే ఎలాంటి బిరుదు ఇస్తారు? అనే ప్రశ్న రెజీనా ముందుంచితే - ‘‘సమంతకు సూపర్‌స్టార్, అనుష్కకు తలైవా (నాయకుడు), రకుల్‌కి జిమ్ స్టార్, రాశీఖన్నాకి క్యూట్ స్టార్, నిత్యామీనన్‌కు నేషనల్ స్టార్....నాకేమో ఫన్ స్టార్ అని ఇస్తాను’’ అని సరదాగా అన్నారు. - శివ మల్లాల -
వాళ్లిద్దరూ అన్నదమ్ముల్లా కనిపిస్తున్నారు - రాజమౌళి
‘‘‘జ్యో అచ్యుతానంద’ ట్రైలర్ చూస్తుంటే కామెడీ రొమాంటిక్ మూవీ అని తెలుస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా శ్రీనివాస్ అవసరాల తెరకెక్కించాడు. ఈ చిత్రంలో అన్నదమ్ముల్లా నటించిన నాగశౌర్య, నారా రోహిత్ నిజంగానే అన్నదమ్ముల్లా కనిపిస్తున్నారు. రెజీనా బాగా నటించింది. కల్యాణి రమణ మంచి పాటలిచ్చారు. దర్శకునిపై నమ్మకంతో సినిమాలు తీసే నిర్మాత సాయి కొర్రపాటిగారు. ఈ చిత్రం విజయవంతమవుతుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. నాగశౌర్య, నారా రోహిత్, రెజీనా ప్రధాన పాత్రల్లో శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో సాయి శివాని సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన చిత్రం ‘జ్యో అచ్యుతానంద’. కల్యాణి రమణ స్వరపరచిన ఈ చిత్రం పాటలు, ట్రైలర్‌ను రాజమౌళి విడుదల చేశారు. శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రకథ నారా రోహిత్‌కు చెప్పాలనుకున్నప్పుడు ఆయన చేస్తారా? చేయరా? అనే సందేహం ఉండేది. కథ విన్నాక చేస్తానన్నారు. ఆనంద్ పాత్ర రాసుకునేటప్పుడే నాగశౌర్యనే అనుకున్నా. యువతరంతో పాటు అన్నివర్గాల వారికీ ఈ చిత్రం నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘జ్యో అచ్యుతానంద’ రీమేక్ రైట్స్ కోసం తమిళం, బాలీవుడ్లో చాలామంది పోటీ పడుతున్నారు. జీవితం అనే జర్నీలో సాయి కొర్రపాటిగారిని, శ్రీనివాస్ అవసరాలను కలుసుకునే మంచి అవకాశం వచ్చింది. నా తల్లిదండ్రుల తర్వాత నేను అంత గౌరవం ఇచ్చే వ్యక్తి సాయి కొర్రపాటిగారే’’ అని నాగశౌర్య చెప్పారు. నారా రోహిత్ మాట్లాడుతూ- ‘‘కథను నమ్మి చిత్రాలు తీసే నిర్మాత సాయి కొర్రపాటి. ఆయన బ్యానర్లో నేను చేసిన ‘రాజా చెయ్యి వేస్తే’ చిత్రం అనుకున్నంత సక్సెస్ కాలేదు. కానీ, ఈ చిత్రం మాత్రం హిట్టవుతుంది. శ్రీనివాస్ అవసరాల వల్లే ఈ సినిమా ఒప్పుకున్నా. ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉండే బంధాన్ని చక్కగా చూపించాం’’ అన్నారు. నాని, తమ్మారెడ్డి భరద్వాజ, ‘జెమినీ’ కిరణ్, విజయేంద్ర ప్రసాద్, ఎంఎం కీరవాణి, కల్యాణి రమణ, నందినీరెడ్డి, భాస్కరభట్ల, స్మిత తదితరులు పాల్గొన్నారు.