ఊహించని క్లైమాక్స్ ఉంటుందట | Interesting climax for 'Jyo Achyutananda' | Sakshi
Sakshi News home page

ఊహించని క్లైమాక్స్ ఉంటుందట

Published Fri, Aug 26 2016 8:00 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

ఊహించని క్లైమాక్స్ ఉంటుందట

ఊహించని క్లైమాక్స్ ఉంటుందట

'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో దర్శకుడిగా మారిన నటుడు అవసరాల శ్రీనివాస్. కొంత గ్యాప్ తరువాత 'జ్యో అచ్యుతానంద'  పేరుతో ఓ ట్రైయాంగిల్ లవ్ స్టోరీని తెరకెక్కించాడు. జ్యో, అచ్యుత్, ఆనంద్ల ప్రేమకథే ఈ 'జ్యో అచ్యుతానంద'.  నారా రోహిత్, రెజీనా, నాగ శౌర్యలు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.

ఆ ఇద్దరు హీరోల్లో ఆమె మనసు ఎవరు గెలుచుకుంటారనేదే ప్రశ్న. అయితే ఈ సినిమాకు క్లైమాక్సే ప్రాణం అనే టాక్ వినిపిస్తోంది. ప్రేక్షకులు ఊహించని విధంగా ముగింపు ఉంటుందని, కచ్చితంగా థ్రిల్కు గురవుతారని చిత్ర యూనిట్ చెబుతున్న మాట. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందట. వారాహి చలన చిత్ర బ్యానర్ఫై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రానికి కళ్యాణ రమణ సంగీతం అందించారు. ఈ సినిమా సెప్టెంబరులో విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement