రెండు రాష్ట్రాల్లోనూ వైఎస్ ముద్ర ఉండాలి:తమ్మారెడ్డి
‘రాష్ర్ట విభజనతో తెలుగు జాతి రెండు ముక్కలు కాలేదు.. రెండు రాష్ట్రాలుగా విడిపోయిందంతే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి నవతరం ముందుకు రావాలి.. ఈ రెండు రాష్ట్రాల్లోనూ మహా నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముద్ర ఉండాలి..
గరికిపాటి ఉమాకాంత్
‘‘రాష్ర్ట విభజనతో తెలుగు జాతి రెండు ముక్కలు కాలేదు.. రెండు రాష్ట్రాలుగా విడిపోయిందంతే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి నవతరం ముందుకు రావాలి.. ఈ రెండు రాష్ట్రాల్లోనూ మహా నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముద్ర ఉండాలి.. తాత్కాలిక ప్రయోజనాల కోసం కాకుండా దీర్ఘకాలిక అవసరాల కోసమే అభివృద్ధి సాగాలి.. అప్పుడే రెండు రాష్ట్రాలూ భారతదేశానికే తలమానికంగా నిలుస్తాయి..’’ అని తెలుగు సినీపరిశ్రమ దిగ్గజం తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయపడ్డారు. కొత్త ఆంధ్రప్రదేశ్ వికాసం, నవ తెలంగాణ నిర్మాణం యువతరం వల్లనే సాధ్యమన్నారు. సాక్షి ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మనోభావాలు ఇవి...
ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ అన్న భేదం లేకుండా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. ఇది నేను ఇప్పుడు చెబుతున్నమాట కాదు.. గత ఎన్నికల సందర్భంలోనూ ఇదే విషయం కుండబద్దలు కొట్టినట్టు చెప్పా. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. బాధ్యతాయుతమైన పౌరుడిగా, సినీదర్శకుడిగా నా నిశ్చితాభిప్రాయమదే. రెండు రూపాయలకే కిలో బియ్యం, ఆరోగ్యశ్రీ, 108, 104, పెన్షన్లు ఇలా ఎన్నో పథకాలతో ఆయన జనానికి దగ్గరయ్యారు. ఎన్టీఆర్ తర్వాత ప్రజలతో మమేకమైంది వైఎస్సారే. కార్పొరేట్ ఆస్పత్రుల వైపు కన్నెత్తయినా చూడలేని పేదలకు ఆ ఆస్పత్రుల్లోనే ఉచిత వైద్యం అందించిన రియల్ లీడర్ వైఎస్. విద్య, వైద్యం, గృహనిర్మాణం, రవాణారంగం... సినీపరిశ్రమతో సహా ఇలా అన్ని రంగాలూ ఆయన హయాంలో అభివృద్ధి చెందాయి. అయితే ఆయన మరణానంతరం సంక్షేమ పథకాలన్నీ గాడి తప్పాయి. పరిపాలన అస్తవ్యస్తమైంది. మళ్లీ అవన్నీ గాడిన పడాలంటే ఇరు రాష్ట్రాలకూ సమర్థ నాయకత్వం కావాలి. రెండుచోట్లా రాజకీయాల్లోకి కొత్తనీరు రావాలి. నవతరానికే పట్టం కట్టాలి.
ప్రాంతీయ విద్వేషాలు పోవాలి
రాష్ట్ర విభజన అనివార్యమైంది కాబట్టి ఇక నుంచైనా ప్రాంతీయ విద్వేషాలు పోవాలి. సామాజిక అసమానతలు తొలగాలి. రెండు ప్రాంతాలూ అభివృద్ధిపై దృష్టి సారించాలి. ఉన్న వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలి.
హైదరాబాద్‌లా సీమాంధ్ర రాజధాని వద్దు
వాస్తవానికి హైదరాబాద్‌లో జరి గింది అవివేకమైన అభివృద్ధే. ఇంకా నగరం పక్కాగా వృద్ధి సాధించాలి. నూతన ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఏ ప్రాంతమైనా ఫరవాలేదు. తాగునీరు, ట్రాఫిక్, డ్రైనేజీ వ్యవస్థలు ప్రణాళికాబద్ధంగా ఉండాలి. అభివృద్ధి నిచ్చెనమెట్ల మాదిరి కాదు.. అన్ని వర్గాలకూ సంక్షేమఫలాలు అందాలంటే అభివృద్ధి సమాంతరంగా సాగాలి. నిచ్చెనమెట్ల(వర్టికల్) అభివృద్ధితో సంపన్నవర్గాలే బాగుపడతాయి..
పదేళ్లపాటు ఎందుకు
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్లు ఎందుకుండాలి. రెండుమూడేళ్లలోనే కొత్త రాజధాని
నిర్మించగల శక్తితో సీమాంధ్రులు ముందుకెళ్లాలి. విభజన మన ప్రాంత అభివృద్ధికి వచ్చిన అవకాశంగా భావించి నూతన నగరాల నిర్మాణానికి అందరూ నడుం బిగించాలి.
సినీ పరిశ్రమకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కళ్లు
రాష్ట్ర విభజనతో తెలుగు సినిమా రంగానికి ఉజ్వల భవిష్యత్తు రానుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో సినీరంగం తరలిపోతుందన్న తప్పుడు ప్రచారాలను అందరూ ఖండించాలి. తెలుగు సినీ కార్మికుల్లో 60 శాతం మంది తెలంగాణ వారే. ఇప్పుడు నిర్మాణ రంగంలోనూ పెరుగుతారు. ఇక సినీ స్టూడియోల ఉనికి ఏమైపోతుందన్న అనుమానాలూ పోవాలి. వాస్తవానికి ఇప్పుడు స్టూడియాల్లో షూటింగ్ చేసుకునే సినిమాలెన్ని? చిన్న సినిమాలైతే ఔట్‌డోర్‌లు. పెద్ద సినిమాలైతే మలేషియా, బ్యాంకాక్‌లు... స్టూడియోలు టీవీ షూటింగ్‌లకు పరిమితమై చానాళ్లైంది. కాబట్టి స్టూడియోలకు వచ్చిన ముప్పేమీ లేదు.
ఏ ప్రభుత్వం రాయితీలు ఎక్కువిస్తే అక్కడ అభివృద్ధి
రెండు రాష్ట్రాల్లోనూ ఏ ప్రభుత్వం సినీ పరిశ్రమకు రాయితీలు ఎక్కువిస్తుందో అక్కడే అభివృద్ధి సాధిస్తుందని చెప్పాలి. వాస్తవానికి కొత్త ఆంధ్రప్రదేశ్‌లోనే సినిమా రంగం మరింత అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. అక్కడ కొత్తగా నిర్మించే రాజధాని, అభివృద్ధి నేపథ్యంలో సినిమా హాళ్ల సంఖ్య, సినిమా నిర్మాణాల సంఖ్య పెరుగుతుంది. తద్వారా కొత్తగా వచ్చే కళాకారులకు మరిన్ని అవకాశాలు వస్తాయి. 40 ఏళ్ల కిందట హైదరాబాద్‌లో సారథి స్టూడియోస్ నిర్మించినపుడు నైజాం నుంచి వచ్చే ఆదాయం చాలా స్వల్పం. ఇప్పుడు తెలుగు సినిమాకి వచ్చే ఆదాయంలో నైజాం వాటా 45శాతం. అంటే అభివృద్ధి ఎలా పరుగులెత్తిందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ కూడా అంతే వేగంగా సినీరంగం వృద్ధి సాధిస్తుంది. అప్పుడు ముంబై, చెన్నెల నుంచి ఫైటర్లు, ఇతరత్రా కళాకారులను ఫ్లైట్లలో, ఏసీ రైళ్లలో దిగుమతి చేసుకునే భారం తప్పి మన వాళ్లకే అవకాశాలు దక్కుతాయి. రెండు రాష్ట్రాల్లో సినీరంగ అభివృద్ధితో తెలుగు సినిమా బాక్సాఫీస్‌ను అందని ద్రాక్షలా ఊరిస్తున్న వందకోట్ల ట్రేడ్ మార్క్ మరో రెండేళ్లలోపే సునాయాసంగా సాధించగలం.
పచ్చని సంసారం మొత్తం మణికొండలోనే తీసా
తెలంగాణలో ఎన్నో అందమైన లొకేషన్లు ఉన్నా ఇప్పటివరకూ ఎవరూ దృష్టిపెట్టలేదనే చెప్పాలి. ఇక నుంచైనా నిర్మాతలు దృష్టి పెట్టాలి. ఇరవై ఏళ్ల కిందట సూపర్‌స్టార్ కృష్ణతో నేను నిర్మించిన హిట్ సినిమా పచ్చని సంసారం షూటింగ్ మొత్తం మణికొండలోనే సాగింది. పచ్చనిపొలాల మధ్య తీసిన ఆ సినిమా సన్నివేశాలు చూసి అప్పట్లో చాలామంది గోదావరి జిల్లాల్లో తీశారేమోనని అనుకున్నారు.
నిర్మించగల శక్తితో సీమాంధ్రులు ముందుకెళ్లాలి. విభజన మన ప్రాంత అభివృద్ధికి వచ్చిన అవకాశంగా భావించి నూతన నగరాల నిర్మాణానికి అందరూ నడుం బిగించాలి.
సినీ పరిశ్రమకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కళ్లు
రాష్ట్ర విభజనతో తెలుగు సినిమా రంగానికి ఉజ్వల భవిష్యత్తు రానుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో సినీరంగం తరలిపోతుందన్న తప్పుడు ప్రచారాలను అందరూ ఖండించాలి. తెలు గు సినీ కార్మికుల్లో 60 శాతం మంది తెలంగాణ వారే. ఇప్పుడు నిర్మాణ రంగంలోనూ పెరుగుతారు. ఇక సినీ స్టూడియోల ఉనికి ఏమైపోతుందన్న అనుమానాలూ పోవాలి. వాస్తవానికి ఇప్పుడు స్టూడియాల్లో షూటింగ్ చేసుకునే సినిమాలెన్ని? చిన్న సినిమాలైతే ఔట్‌డోర్‌లు. పెద్ద సినిమాలైతే మలేషియా, బ్యాంకాక్‌లు... స్టూడియోలు టీవీ షూటింగ్‌లకు పరి మితమై చానాళ్లైంది. కాబట్టి స్టూడియోలకు వచ్చిన ముప్పేమీ లేదు.
ఏ ప్రభుత్వం రాయితీలు ఎక్కువిస్తే అక్కడ అభివృద్ధి
రెండు రాష్ట్రాల్లోనూ ఏ ప్రభుత్వం సినీ పరిశ్రమకు రాయితీలు ఎక్కువిస్తుందో అక్కడే అభివృద్ధి సాధిస్తుందని చెప్పాలి. వాస్తవానికి కొత్త ఆంధ్రప్రదేశ్‌లోనే సినిమా రంగం మరింత అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. అక్కడ కొత్తగా నిర్మించే రాజధాని, అభివృద్ధి నేపథ్యంలో సినిమా హాళ్ల సంఖ్య, సినిమా నిర్మాణాల సంఖ్య పెరుగుతుంది. తద్వారా కొత్తగా వచ్చే కళాకారులకు మరిన్ని అవకాశాలు వస్తాయి. 40 ఏళ్ల కిందట హైదరాబాద్‌లో సారథి స్టూడియోస్ నిర్మించినపుడు నైజాం నుంచి వచ్చే ఆదాయం చాలా స్వల్పం. ఇప్పుడు తెలుగు సినిమాకి వచ్చే ఆదాయంలో నైజాం వాటా 45శాతం. అంటే అభివృద్ధి ఎలా పరుగులెత్తిందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ కూడా అంతే వేగంగా సినీరంగం వృద్ధి సాధిస్తుంది. అప్పుడు ముంబై, చెన్నెల నుంచి ఫైటర్లు, ఇతరత్రా కళాకారులను ఫ్లైట్లలో, ఏసీ రైళ్లలో దిగుమతి చేసుకునే భారం తప్పి మన వాళ్లకే అవకాశాలు దక్కుతాయి. రెండు రాష్ట్రాల్లో సినీరంగ అభివృద్ధితో తెలుగు సినిమా బాక్సాఫీస్‌ను అందని ద్రాక్షలా ఊరిస్తున్న వందకోట్ల ట్రేడ్ మార్క్ మరో రెండేళ్లలోపే సునాయాసంగా సాధించగలం.
తెలంగాణలోనూ మంచి లొకేషన్లు..
తెలంగాణలో ఎన్నో అందమైన లొకేషన్లు ఉన్నా ఇప్పటివరకూ ఎవరూ దృష్టిపెట్టలేదనే చెప్పాలి. ఇక నుంచైనా నిర్మాతలు దృష్టి పెట్టాలి. ఇరవై ఏళ్ల కిందట సూపర్‌స్టార్ కృష్ణతో నేను నిర్మించిన హిట్ సినిమా పచ్చని సంసారం షూటింగ్ మొత్తం మణికొండలోనే సాగింది. పచ్చనిపొలాల మధ్య తీసిన ఆ సినిమా సన్నివేశాలు చూసి అప్పట్లో చాలామంది గోదావరి జిల్లాల్లో తీశారేమోనని అనుకున్నారు.
ఎక్కడ అభివృద్ధి
ఓ నాయకుడు హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని పదే పదే చెప్పుకుంటున్నాడు. ఎక్కడ జరిగింది అసలైన అభివృద్ధి? వందల ఏళ్ల కిందటి పాతబస్తీ, సికింద్రాబాద్‌లే కాదు తాను అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న హైటెక్‌సిటీ ఏరియాలోనే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. విపరీతమైన ట్రాఫిక్, అస్తవ్యస్తమైన డ్రైనేజీలతో అక్కడి జనం రోజూ నరకం చూస్తున్నారు. ప్రచారం కోసం హడావుడి చేస్తే ఇలానే ఉంటుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంస్కరణల పుణ్యమాని పదిహేనేళ్ల కిందట ఐటీ రంగం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విస్తరించింది. మారుమూల బీహార్, ఒడిశా రాష్ట్రాల్లోనూ ఐటీ బూమ్ ఉంది. మన రాష్ట్రానికి వచ్చేసరికి హైదరాబాద్‌కే పరిమితమైంది... కానీ దీన్ని కూడా ఒకాయన తన వల్లే ఐటీ రంగం వృద్ధి చెందిందని చెప్పుకుంటున్నాడు.