ప్రజల మనసుల్లో విజయుప్రస్థానం
‘మాట తప్పను.. మడమ తిప్పను’... మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సిద్ధాంతమిది. ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ కూడా అదే ఆచరించి చూపారు. వారంలో సోమ, మంగళ, బుధవారాలు ప్రజలకు అందుబాటులో ఉంటానని పులివెందుల ఉప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు. మిగిలిన రోజుల్లోనూ ప్రజలతో వుమేకవుయ్యూరు.
ప్రజా సంక్షేవూనికి పాటుపడటంలో వైఎస్ కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని, అంకిత భావం.. చిత్తశుద్ధితో పనిచేస్తుందని మరోసారి నిరూపించారు. ప్రస్తుతం విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె ‘విజయం’... విశాఖ పురోభివృద్ధికి బాటలు వేస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. విజయభేరి మోగించాలని ఉవ్విళ్లూరుతున్నారు. - న్యూస్‌లైన్, పులివెందుల
- విజయమ్మ రాకతో విశాఖ పురోభివృద్ధి తధ్యం
- విశాఖ లోక్‌సభ నియోజకవర్గ ఓటర్ల విశ్వాసం
- విజయ ఢంకా మోగించాలని ఆకాంక్ష
ఆకట్టుకునే ప్రసంగం... ఆమె సొంతం
వైఎస్ విజయమ్మ ప్రసంగంలో సహజత్వం ఉంటుంది. జనం భాషలో అద్భుతంగా వూట్లాడతారు. 2012 మార్చి 12న పులివెందులలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం, 2011 డిసెంబర్ 6న శాసనసభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా, 2011 జూలై 8, 9 తేదీల్లో ఇడుపులపాయలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశాల్లో వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు హోదాలో విజయమ్మ ప్రసంగం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది.
సమస్యలపై అధికారులకు 32 వేలకు పైగా ఉత్తరాలు
పులివెందులలోని కార్యాలయంలో విజయువ్ము ఈ వుూడేళ్లలో 1.41 లక్షల మంది సవుస్యలను విన్నారు. వాటి పరిష్కారం కోసం 32 వేలకు పైగా ఉత్తరాలను అధికారులకు రాశారు. వురికొన్ని సమస్యలను అప్పటికప్పుడే ఫోన్‌లో తెలియుజేసి పరిష్కరించారు. పులివెందుల నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాలప్రజల సవుస్యల పరిష్కారానికి కూడా కృషి చేశారు. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామాల్లోనూ పర్యటించారు. కొన్ని గ్రావూలకు రెండు, మూడుసార్లు కూడా వెళ్లారు. మొత్తం 535 కార్యక్రమాలలో ఆమె పాల్గొన్నారు.
ఈ వూడేళ్లలో దాదాపు 480 రోజులు పులివెందులలోనే గడిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అదనపు తరగతి గదులు, మినరల్ వాటర్ ప్లాంటు, అంగన్‌వాడీ భవనాలు, పంచాయతీ కార్యాలయాలు... ఇలా అనేక ప్రారంభోత్సవాల్లో విజయమ్మ పాల్గొన్నారు. వుహిళలకు పావలా వడ్డీ, విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ చేపట్టారు. వేముల, సింహాద్రిపురం, లింగాల, తొండూరు మండలాల్లో ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు పరిహారం పంపిణీ చేశారు.
వందలాది పెళ్లిళ్లకు హాజరై.. నూతన దంపతులను ఆశీర్వదించారు. గృహ ప్రవేశాలు, ఇతర కార్యాలకు ప్రజలు పిలిచిన వెంటనే వెళ్లారు. ఎక్కడైనా ప్రవూదాలు జరిగితే వెంటనే స్పందిస్తుంటారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స కోసం కృషి చేస్తుంటారు. అందువల్లే విజయువ్మును తవు కుటుంబ సభ్యురాలిగా భావిస్తుంటావుని పులివెందుల నియోజకవర్గ ప్రజలు చెబుతారు.
విజయమ్మ చొరవతో 755 ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు
నియోజకవర్గంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల కొరత తీవ్రంగా ఉండేది. విజయువ్ము ప్రత్యేక చొరవ చూపి ట్రాన్స్‌కో సీఎండీ, కలెక్టర్, ఇతర అధికారులతో మాట్లాడి 755 ట్రాన్స్‌ఫార్మర్లను మంజూరు చేరుుంచారు. దీంతో రైతులు హారుగా పంటలు పండించుకోగలుగుతున్నారు.
కష్టాల్లో ఉన్నా.. ప్రజలను మరవలేదు
వైఎస్ కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా విజయువ్ము పులివెందుల ప్రజల సంక్షేవూన్ని విస్మరించలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ అక్రమంగా అరెస్టు చేయుడంతో ఉప ఎన్నికలలో విజయమ్మ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి వచ్చింది. అప్పుడు కూడా పులివెందుల ప్రజలను వురవలేదు. ఒకవైపు కొడుకు జైల్లో ఉన్న బాధను దిగమింగుకుంటూనే..వురోవైపు పులివెందుల ప్రజల కష్టసుఖాలలో పాలు పంచుకున్నారు.
రైతుల సంక్షేవుంపై దృష్టి
అన్నదాతల సంక్షేవుంపై విజయువ్ము ప్రత్యేక దృష్టి పెట్టారు. పులివెందుల నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు వీలుగా చేపట్టిన ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వస్తున్నారు. చిత్రావతి ప్రాజెక్టుతో పాటు లింగాల కుడికాలువ, గండికోట, పైడిపాలెం, సీబీఆర్ ఎత్తిపోతల పైపులైన్ పనులు తదితర ప్రాజెక్టులను ఆమె పరిశీలించారు. సూక్ష్మనీటి సేద్యం పనుల పురోగతిపైనా దృష్టి పెట్టారు.
పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ)కు నీటిని సక్రవుంగా విడుదల చేయుకపోవడంతో 2011 డిసెంబర్ 20న చిత్రావతి ప్రాజెక్టు వద్ద దీక్ష చేపట్టారు. అధికారులు దిగొచ్చి.. సవుస్య పరిష్కరించే దాకా దీక్ష కొనసాగించారు. పులివెందుల మునిసిపాలిటీకి తాగునీటి విషయమై కూడా అధికారులతో పలుమార్లు చర్చించారు.
2012లో తీవ్ర వర్షాభావం వల్ల చీనీచెట్లు ఎండిపోరునప్పుడు, పెనుగాలులతో లింగాల, చక్రాయపేట మండలాల్లో అరటి, మామిడి తోటలు దెబ్బతిన్నప్పుడు విజయువ్ము యుద్ధప్రాతిపదికన స్పందించారు. క్షేత్రస్థారులో పంటల నష్టాన్ని పరిశీలించడమే కాకుండా రైతులకు నష్టపరిహారం కోసం అధికారులకు, ప్రభుత్వానికి పదుల సంఖ్యలో లేఖలు రాశారు. స్వయుంగానూ విన్నవించారు. 2012లో జూన్‌లో వర్షాలు అధికంగా కురిసి తొండూరు, ఎర్రిపల్లె, పాలూరు తదితర చెరువు కట్టలు తెగిపోయూరుు. వాటికి దగ్గరుండి మరమ్మతులు చేయించారు.
మందుల కొనుగోలుకు వేతనం విరాళం
పులివెందుల, వేంపల్లెలోని ఆస్పత్రి అభివద్ధి కమిటీ సమావేశాలకు ప్రతిసారి హాజరవుతున్న ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఆ ఆస్పత్రుల్లో మందుల కొరత తీర్చేందుకు తనకు నెలనెలా వచ్చే వేతనాన్ని అందజేస్తున్నారు. గతంలో పులివెందుల ఏరియా ఆస్పత్రిలో డెంగీ కిట్లు లేకపోవడంతో తన వేతనంతో కొనుగోలు చేసి అందించారు. నియోజకవర్గంలోని పీహెచ్‌సీల్లో మందుల కొనుగోలుకు కూడా సాయుం చేస్తున్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళన
రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విజయమ్మ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. అనేక ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొన్నారు. 2012లో చీనీ రైతుల సవుస్యలు, కరెంటు కోతలు, చార్జీలపై ఉద్యమించారు. పులివెందుల నియోజకవర్గంలోని యూసీఐఎల్, ట్రిపుల్ ఐటీ, ఎర్రగుంట్ల సమీపంలోని ఆర్‌టీపీపీ, ఇందిరా క్రాంతి పథకం ఉద్యోగులు, కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేశారు.