'మహానేత ఆశయాలను వైఎస్ జగన్ నెరవేరుస్తారు'
విశాఖపట్నం: పేద ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తారని విశాఖపట్నం లోకసభ అభ్యర్ధి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. సింహాచలంలో నిర్వహించిన రోడ్ షోలో వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ రాష్ట్రానికి, విశాఖకు బీజేపీ, టీడీపీ ఒక్క ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చాయా? అంటూ ప్రశ్నించారు.
అన్నివర్గాలను ఆదుకోవడానికి వైఎస్ఆర్ చేసిన కృషి ఎనలేనదని విజయమ్మ అన్నారు. మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్‌ఆర్‌దేనని విజయమ్మ స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ, పెన్షన్లు లాంటి పథకాలు పేద ప్రజలకు మేలు చేశాయన్నారు. వైఎస్ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు మళ్లీ అమలు అయ్యేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజయమ్మ ప్రజలకు విజ్క్షప్తి చేశారు.