
సాక్షి, హనుమాన్‌జంక్షన్: కృష్ణా జిల్లాలోని హనుమాన్ జంక్షన్‌కు చెందిన వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావును వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబం అరుదైన కానుకతో గౌరవించింది. 1976 నుంచి వైఎస్సార్‌తో దుట్టాకు ఉన్న సాన్నిహిత్యాన్ని మరోమారు గుర్తు చేసుకుంటూ మహానేత సతీమణి వైఎస్ విజయమ్మ బహుమతిని పంపించారు. వైఎస్సార్ జ్ఞాపకంగా ఆయన ధరించిన దుస్తులను డాక్టర్ దుట్టాకు బహుమతిగా అందజేశారు. వైఎస్సార్ 70వ జయంతి సందర్భంగా ప్రాణమిత్రుడు వేసుకున్న వస్త్రాలను తన చేతితో తడుముతూ దుట్టా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్సార్ ఉన్నంతకాలం తమ స్నేహానికి ఎంతో విలువ ఇచ్చారని, ఆయన మరణానంతరం కూడా ఆ కుటుంబం తనకు ఎంతో గౌరవాన్ని ఇస్తోందని దుట్టా గుర్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment