Triple IT
-
నేటి నుంచి ట్రిపుల్ ఐటీల్లో కౌన్సెలింగ్
నూజివీడు: ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 2024–25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు ఈ నెల 22 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ నేతృత్వంలో కౌన్సెలింగ్ జరగనుంది.ఈ నెల 22, 23 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లోను, 24, 25 తేదీల్లో ఒంగోలు ట్రిపుల్ ఐటీకి ఎంపికైన అభ్యర్థులకు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలోను, 26, 27 తేదీల్లో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి ఎంపికైన అభ్యర్థులకు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ జరగనుంది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. -
ట్రిపుల్ ఐటీలకు 53,863 దరఖాస్తులు
నూజివీడు: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకుగాను ఈనెల 25తో దరఖాస్తు స్వీకరణకు గడువు ముగిసింది. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 2024–25 అడ్మిషన్లకు సంబంధించి మొత్తం 53,863 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు బుధవారం తెలిపారు. నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కలిపి 4 వేల సీట్లతో పాటు ఈడబ్ల్యూఎస్ కింద మరో 400 సీట్లు కలిపి మొత్తం 4,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి రిజర్వేషన్‌ను అనుసరించి ట్రిపుల్ ఐటీల సీట్లను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రభుత్వ పాఠశాల నుంచి 34,154 మంది, ప్రైవేటు పాఠశాలల నుంచి 19,671 మంది ఉన్నారు. అలాగే బాలురు 23,006 మంది, బాలికలు 30,857 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో స్పెషల్ కేటగిరిలైన క్యాప్ నుంచి 3,495 మంది, ఎన్సీసీ నుంచి 2,129 మంది, దివ్యాంగులు 381 మంది, క్రీడా కోటాలో 1,389 మంది, స్కౌట్స్ అండ్ గైడ్ నుంచి 327 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో 28,573 మంది, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 21,559 మంది, తెలంగాణ నుంచి 3,693 మంది, రెండు తెలుగు రాష్ట్రాలను మినహాయించి ఇతర రాష్ట్రాలకు చెందిన 38 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 1 నుంచి ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన దరఖాస్తు చేసుకున్న ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు సంబంధించిన సరి్టఫికెట్ల వెరిఫికేషన్‌ను జూలై 1 నుంచి నిర్వహించనున్నారు. సైనికోద్యోగుల పిల్లలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను జూలై 1 నుంచి 3వ తేదీ వరకు, క్రీడా కోటా జూలై 3 నుంచి 6 వరకు, దివ్యాంగుల కోటా జూలై 3న, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా జూలై 2, 3 తేదీల్లో, ఎన్సీసీ కోటా జూలై 3 నుంచి 5 వరకు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించనున్నట్లు ట్రిపుల్ఐటీ అధికార వర్గాలు తెలిపాయి. అలాగే జూలై 11న ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. జూలై 22, 23 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ఐటీల్లో, 24, 25 తేదీల్లో ఒంగోలు ట్రిపుల్‌ఐటీలో, 26, 27 తేదీల్లో శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలో ఎంపికైన అభ్యర్థుల సరి్టఫికెట్లను పరిశీలన చేసి అడ్మిషన్లను కలి్పంచనున్నారు.ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల ప్రక్రియ కన్వినర్‌గా అమరేంద్ర వేంపల్లె: ఆర్జీయూకేటీ పరిధిలోని ఆయా ట్రిపుల్ ఐటీల్లో 2024–25 జరిగే అడ్మిషన్ల ప్రక్రియకు కన్వినర్‌గా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న అధ్యాపకుడు డాక్టర్ అమరేంద్ర కుమార్ సండ్రాను ఆర్జీయూకేటీ అధికారులు నియమించారు. గతంలో ఆయన ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌గా, ఎగ్జామ్స్ కంట్రోలర్‌గా, ఏఓగా పనిచేశారు. అడ్మిషన్ల ప్రక్రియను సమర్థంగా చేపడతానని అమరేంద్ర తెలిపారు. ఈయన నియామకంపై ట్రిపుల్ ఐటీ అధ్యాపకులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు. -
ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
నూజివీడు: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో 2024–25 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల బీటెక్ సమీకృత ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకుగాను వర్సిటీ ఈ నెల 6న నోటిఫికేషన్ వెలువరించింది. ఒక్కో సెంటర్లో 1,000 సీట్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో మరో 100 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సులో చేరేందుకు దరఖాస్తులను ఈ నెల 8 నుంచి జూన్ 25 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ప్రవేశాల్లో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీ–ఏకు 7 %, బీసీ–బీకి 10 %, బీసీ–సీకి 1%, బీసీ–డీకి 7%, బీసీ–ఈకి 4% చొప్పున రిజర్వేషన్ అమలు చేస్తారు. ప్రత్యేక సీట్ల కింద వికలాంగులకు 5%, సైనికోద్యోగుల పిల్లలకు 2%, ఎన్సీసీ విద్యార్థులకు 1%, స్పోర్ట్స్ కోటా కింద 0.5%, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా కింద 0.5% సీట్లను భర్తీ చేస్తారు. ప్రతి కేటగిరీలోనూ 33.33% సీట్లను సమాంతరంగా బాలికలకు కేటాయిస్తారు.ప్రవేశార్హతలు అభ్యర్థులు ప్రథమ ప్రయత్నంలోనే 2024లో ఎస్ఎస్సీ లేదా తత్సమాన పరీక్షలో రెగ్యులర్ విద్యార్థిగా ఉత్తీర్ణులై ఉండాలి.వయస్సు 31–12–2024 నాటికి 18 ఏళ్లు నిండకుండా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకైతే 21 ఏళ్లు నిండకుండా ఉండాలి. మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు ఇలా.. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు. నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ హైసూ్కళ్లు, మున్సిపల్ హైసూ్కళ్లలో చదివిన విద్యార్థులకు వారి మార్కులకు 4% డిప్రెవేషన్ స్కోర్‌ను అదనంగా కలుపుతారు. దీనిని సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురైన విద్యార్థులకు ఇచ్చే వెయిటేజీగా పేర్కొన్నారు. 85% సీట్లను స్థానికం గాను, మిగిలిన 15% సీట్లను మెరిట్ కోటాలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించారు. -
నేటి 'సీఎం'ను ఆనాడు రానివ్వనేలేదు!
ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ఐటీ అంటే రాష్ట్రవ్యాప్తంగా అందరికీ తెలిసిందే.. ఇక్కడ చదివే పిల్లల ఇబ్బందులు, ఆందోళనలు, నిరసనలు ఇలా ఎదో ఒక విషయంలో ట్రిపుల్ఐటీ ఎప్పుడు వార్తల్లో నిలిచేది. బాసరలో 2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ట్రిపుల్‌ఐటీని ప్రారంభించారు. కొన్నేళ్లుగా ఇక్కడి విద్యార్థులు సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేక సమస్యలు పరిష్కారం కాక ఇప్పటికీ అక్కడ చదివే విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ రహస్య క్యాంపస్‌గా మారింది. మీడియాకు, విద్యార్థి సంఘాలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, మేధావులకు ఎవరైనా సరే లోపలికి అనుమతించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు చదివే ఈ విశ్వవిద్యాలయంలో ఏమి జరుగుతుందోనని తెలియక పోషకులు ఆందోళనకు గురవుతున్నారు. మీడియాకు నో ఎంట్రీ 2022 ఆగస్టు 7న బాసర ట్రిపుల్ఐటీకి గవర్నర్ హోదాలో తొలిసారి వచ్చిన తమిళిసై పర్యటన కవరేజీకి వెళ్లిన మీడియాను అధికారులు అనుమతించ లేదు. ట్రిపుల్ఐటీ ప్రధాన ద్వారాన్ని మూసివేసి ఉంచారు. మీడియాతో పాటు ఉదయం వేళ ట్రిపుల్‌ఐటీలో పనిచేసే సిబ్బందిని కూడా అనుమతించ లేదు. గవర్నర్ బాసర ట్రిపుల్ఐటీ నుంచి నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీకి వెళ్లే సమయంలో ప్రధాన ద్వారం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడే మీడియాతో గవర్నర్ తమిళసై మాట్లాడారు. ఇప్పటికై నా మారేనా? నాటి ప్రభుత్వంలో బాసర ట్రిపుల్‌ఐటీలో ఆంక్షలపేరుతో ఎవరిని అనుమతించలేదు. డిసెంబర్ 7న తెలంగాణ సీఎంగా పదవీ ప్రమాణం స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డి ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చారు. ప్రజాభవన్‌గా మార్చి అక్కడే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో మాత్రం నేటికి పాత ఆంక్షలే కొనసాగిస్తున్నారు. విద్యార్థులకు సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా కల్పించడం లేదు. సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా బాసర ట్రిపుల్ ఐటీకి వచ్చి సమస్యలు తెలుసుకుని శాశ్వత పరిష్కారానికి మార్గం చూపుతారని ఇక్కడి విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తీరిక లేక.. విద్యార్థులకు ప్రతీరోజు క్రీడలు ఆడుకునేలా షెడ్యూల్ ఉంచాలి. ఉదయం నిద్రలేవగానే రాత్రి పడుకునే వరకు స్నానాలు, భోజనాలు, తరగతి గదులు వీటితోనే రోజు పూర్తి అవుతుంది. క్రీడల్లో ఉన్న విద్యార్థులు మానసిక ఒత్తిడికి కాస్త దూరమవుతారు. వారంలో ఒక్కరోజైన చెవులకు ఇంపైనా సంగీతం, వినోద కార్యక్రమాలు తిలకించే ఏర్పాట్లు చేయాలి. అవేవి ఇక్కడ జరగడం లేదు. విద్యార్థుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సైకాలజిస్టులతో కౌన్సెలింగ్‌లు ఇప్పిస్తూ మానసికస్థితిని తెలుసుకోవాలి. ఒంటరిగా ఉండే విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులను పిలిచి గతంలో ఎలా ఉండేవారు. ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారనే విషయాలను చర్చించాలి. ఇకనైనా విద్యార్థులపై శ్రద్ధ వహించాలని పలువురు కోరుతున్నారు. నేటి సీఎంకు అప్పట్లో నో ఎంట్రీ.. నేటి సీఎం రేవంత్‌రెడ్డికే అప్పట్లో బాసర ట్రిపుల్‌ఐటీలో అనుమతించలేదు. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు గోడ దూకివచ్చిన పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. మళ్లీ గేటుద్వారా బయటకు పంపించారు. ప్రస్తుతం ఆయన సీఎంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని విద్యార్థులు భావిస్తున్నారు. ఇవి చదవండి: పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు -
ట్రిపుల్ ఐటీ డీఎం అభివృద్ధికి కేంద్రం సహకారం
కర్నూలు కల్చరల్: ట్రిపుల్ ఐటీ డీఎం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవ్‌సిన్హ్ చౌహాన్ అన్నారు. భవిష్యత్తులో సాంకేతిక విద్యను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటే‹Ùతో కలిసి ఆయన బుధవారం కర్నూలు ట్రిపుల్ ఐటీ డీఎంను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 151 ఎకరాల్లో రూ.300 కోట్లపైగా నిధులతో ట్రిపుల్ ఐటీ డీఎంను నిరి్మస్తుందని తెలిపారు. ఇక్కడ అసంపూర్తి పనులను త్వరలో పూర్తి చేసేందుకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇప్పటికే 5జీ యూజ్ కేస్ ప్రయోగశాలను ఇచ్చామన్నారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ కర్నూలు ట్రిపుల్ ఐటీ డీఎంలో జరిగే రీసెర్స్ నాణ్యత ఐఐటీల కంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. వీరి వెంట కర్నూలు ట్రిపుల్ ఐటీ డీఎం డైరెక్టర్ ప్రొఫెసర్ సోమయాజులు తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కొత్త చైర్మన్‌గా ప్రొ.అశోక్
రాయదుర్గం (హైదరాబాద్): ట్రిపుల్ఐటీ హైదరాబాద్ నూతన చైర్మన్‌గా ప్రొఫెసర్ అశోక్ ఝన్‌ఝన్‌వాలా నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన పాలక మండలి ప్రత్యేక సమావేశంలో ఒక ప్రకటన చేశారు. 1998లో ఆరంభం నుంచి ట్రిపుల్ఐటీ హైదరాబాద్ చైర్మన్‌గా కొన సాగిన ప్రొఫెసర్ రాజ్‌రెడ్డి పదవీ విరమణ చేశారు. శుక్రవారం సాయంత్రం గచ్చిబౌలిలో ట్రిపుల్ఐటీ హైదరాబాద్ సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త చైర్మన్ అశోక్ ఝన్‌ఝన్‌వాలా, పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్ రాజ్‌రెడ్డి, డైరెక్టర్ ప్రొఫెసర్ పీజే నారాయణన్, ఇతర ప్రొఫెసర్లతో కలసి నూతనంగా రూపొందించిన సిల్వర్‌జూబ్లీ శిల్పాన్ని ఆవిష్కరించారు. ప్రొఫెసర్ అశోక్ ఝన్‌ఝన్ వాలా మాట్లాడుతూ ట్రిపుల్ఐటీ హైదరాబాద్‌ను జాతీయ, అంతర్జాతీ య స్థాయిలో మంచి గుర్తింపు పొందేలా తీర్చిదిద్దు తానని తెలిపారు. ప్రొఫెసర్ పీజే నారాయణన్ మీడియాతో మాట్లాడుతూ, ట్రిపుల్ఐటీ హైదరా బాద్.. దేశంలో నంబర్‌వన్ స్థానంలో ఉందన్నారు. -
ఏపీ వర్సిటీ, ట్రిపుల్ ఐటీల్లో భారీ రిక్రూట్మెంట్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లోని వర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో భారీ రిక్రూట్మెంట్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 3,295 పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్సిటీల్లో రెగ్యులర్ సిబ్బంది నియామకానికి ఆమోదం తెలిపింది జగన్ ప్రభుత్వం. నవంబర్ 15 నాటికి నియామక ప్రక్రియ మొత్తం పూర్తి కానుంది. ఈ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. యూనివర్సిటీల్లో 2,635 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టులు ఉన్నత విద్యాశాఖలో అత్యున్నత ప్రమాణాల కల్పనలో భాగంగా.. ఇప్పటికే ప్రపంచస్థాయి కరిక్యులమ్ ఏర్పాటు దిశగా సన్నాహాలు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖలో 51 వేల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసిన సంగతి తెలిసిందే. -
ముగిసిన ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్
వేంపల్లె: ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత ప్రవేశాల కౌన్సెలింగ్ శనివారం ముగిసిందని ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కె.సంధ్యారాణి తెలిపారు. మొత్తం 1,086 మందికి గాను 904 మంది విద్యార్థులు మొదటి విడతలో ప్రవేశాలు పొందారని పేర్కొన్నారు. మిగిలిన 182 సీట్లు రెండవ విడతలో పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఈ నెల 24, 25వ తేదీల్లో ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ క్యాంపస్‌లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ జరుగుతుందని తెలిపారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఆగస్ట్ మొదటి వారంలో తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. -
పట్టాభిషేకం..ఉప్పొంగిన ఉత్సాహం
రాయదుర్గం: గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ–హైదరాబాద్ 25వ వసంతంలోకి అడుగిడి..22వ స్నాతకోత్సవాన్ని శనివారం ఘనంగా జరుపుకొంది. శాంతిసరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో వివిధ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులున తల్లిదండ్రులు, చదువులు చెప్పిన గురువుల సమక్షంలో పట్టాలు అందుకోని అంతులేని ఆనందం వ్యక్తం చేశారు. దీంతో ప్రాంగణమంతా సందడి వాతావరణంలో మునిగింది. ఈ సందర్భంగా 519 మంది గ్రాడ్యుయేట్లకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఇక మొదటిసారిగా ఎంఎస్ బై రీసెర్చ్ అండ్ డుయల్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా పట్టాలు పొందారు. 25 మందికి పీహెచ్‌డీలు అందించారు. -
ముగిసిన నూజివీడు ట్రిపుల్ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్
నూజివీడు/వేంపల్లె: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో రెండు రోజులుగా నిర్వహిస్తోన్న ప్రవేశాల కౌన్సెలింగ్ శుక్రవారంతో ముగిసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థుల సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు. రెండో రోజు కౌన్సెలింగ్‌కు 540 మంది అభ్యర్థులకు కాల్‌లెటర్లు పంపించి పిలవగా అందులో 475 మంది హాజరయ్యారు. వారందరికీ సీట్లు కేటాయించారు. రెండు రోజుల్లో 1,085 మందికి గాను 956 మందికి అడ్మిషన్లు కల్పించారు. కౌన్సెలింగ్‌కు రాని అభ్యర్థులు ఇంటర్, పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరి ఉండొచ్చని ట్రిపుల్ఐటీ అధికారులు భావిస్తున్నారు. మరో 129 సీట్లు మిగిలిన నేపథ్యంలో 4 ట్రిపుల్ఐటీల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత రెండో జాబితాను ప్రకటించి కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తామని అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య గోపాలరాజు తెలిపారు. కౌన్సెలింగ్ ప్రక్రియను డైరెక్టర్ ఆచార్య జీవీఆర్ శ్రీనివాసరావు పరిశీలించారు. ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీలో 2023–24 విద్యా సంవత్సరానికి గాను ఆర్కేవ్యాలీ క్యాంపస్‌లో ఆరేళ్ల సమీకృత సాంకేతిక విద్యకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రారంభమైంది. టాప్‌లో నిలిచిన విద్యార్థులు కృష్ణా జిల్లా అవనిగడ్డ గ్రామానికి చెందిన ఆకుల ప్రేమ్‌సాయి, కడప జిల్లా సోములవారిపల్లె గ్రామానికి చెందిన శీల హరిణి, కడప జిల్లా గోపవరం గ్రామానికి చెందిన సోమల వెంకటరామ శరణ్య, నంద్యాల జిల్లా అవుకు గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ సమీర్, ప్రకాశం జిల్లా దొర్నాల గ్రామానికి చెందిన బండారు కార్తీక్‌లు ఆర్జీయూకేటీ చాన్స్‌లర్ కె.చెంచురెడ్డి, వైస్ చాన్స్‌లర్ విజయ్‌కుమార్‌ల చేతుల మీదుగా అడ్మిషన్ల పత్రాలను పొందారు. మొదటి రోజు 444మంది అడ్మిషన్లు పొందారు. -
ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు అర్హుల జాబితా విడుదల
సాక్షి, అమరావతి/నూజివీడు/వేంపల్లె: ట్రిపుల్ ఐటీల్లో అత్యున్నత ప్రమాణాలతో సాంకేతిక విద్యను అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో నూజివీడు, ఆర్కే వ్యాలీ(ఇడుపులపాయ), ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో ఉన్న 4,400 సీట్లకు ఈ ఏడాది 38,355 మంది దరఖాస్తు చేశారన్నారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల నుంచి 23,628(83శాతం) మంది, ప్రైవేటు పాఠశాలల నుంచి 14,727(17 శాతం) మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా కౌన్సెలింగ్‌కు ఎంపిక చేశామన్నారు. 2023–24 విద్యా సంవత్సరానికి ఆర్జీయూకేటీలో కౌన్సెలింగ్‌కు అర్హత సాధించినవారి జాబితాను గురువారం మంత్రి బొత్స విజయవాడలో విడుదల చేశారు. కౌన్సెలింగ్‌కు ఎంపికైన టాప్–20లో ప్రభుత్వ విద్యార్థులే ఉన్నారని వెల్లడించారు. పదో తరగతిలో 600కి 599 మార్కులు వచ్చిన విద్యార్థి సైతం ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడం గర్వకారణమన్నారు. కౌన్సెలింగ్‌కు ఎంపికైన జనరల్ విద్యార్థుల కటాఫ్ మార్కులు 583గా ఉన్నట్టు చెప్పారు. ట్రిపుల్ ఐటీల్లో ఇప్పటికే పీజీ కోర్సులను అందుబాటులోకి తెచ్చామని గుర్తుచేశారు. వచ్చే ఏడాది నుంచి పీహెచ్డీ కోర్సులనూ ప్రవేశ పెడుతున్నామని వెల్లడించారు. కాగా, ఈ నెల 20, 21 తేదీల్లో నూజివీడు క్యాంపస్‌లో, 21, 22 తేదీల్లో ఆర్కే వ్యాలీ (ఇడుపులపాయ)లో, ఒంగోలు క్యాంపస్‌కు సంబంధించి 24, 25 తేదీల్లో ఆర్కే వ్యాలీలో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. శ్రీకాకుళం క్యాంపస్‌లో 24, 25 తేదీల్లో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. మొత్తం అర్హుల్లో 3,345 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, 695 మంది ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులున్నారని చెప్పారు. ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభమవుతాయన్నారు. కార్య క్రమంలో చాన్సలర్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి, వైస్ చాన్స లర్ ప్రొఫెసర్ ఎం.విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
కళా వెంకటరావు సెల్ఫీ చాలెంజ్ చూసి నవ్వుకుంటున్న జనం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురంలో ఉన్న ట్రిపుల్ ఐటీ భవనాన్ని చూపిస్తూ టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు సెల్ఫీ సవాల్ విసిరారు. కానీ ఆ భవనాన్ని టీడీపీ హయాంలో నిర్మించలేదు. దీంతో ఆయన అభాసుపాలయ్యారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 21వ శతాబ్దపు గురుకులం కోసం రూ.18 కోట్లతో తొమ్మిది బ్లాక్‌ల భవనాన్ని నిర్మించారు. ని ర్మాణంలో ఉండగానే వైఎస్సార్ మరణంతో ఆయన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన కొణిజేటి రోశయ్య ప్రారంభించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ట్రిపుల్ ఐటీని ఇక్కడ ఏర్పాటు చేశారు. కొత్తగా భవనం నిర్మించకుండా వైఎస్సార్ నిర్మించిన భవనంలో ప్రారంభించారు. ఇక ట్రిపుల్ ఐటీ తమ గొప్పతనంగా టీడీపీ చెప్పుకుంటోంది. ట్రిపుల్ ఐటీ అనగానే గుర్తుకొచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సారే. ఆయన కలల విద్యా సంస్థ ట్రిపుల్ ఐటీ. ఆయన హయాంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశా రు. అందులో శ్రీకాకుళంలో కూడా ఏర్పాటు చేయా లని భావించారు. ఈ లోపు ఆయన మరణించడంతో ముందుకు సాగలేదు. టీడీపీ వచ్చాక ట్రిపుల్ ఐటీని వైఎస్సార్ నిర్మించిన భవనంలో ప్రారంభించింది. అది కూడా ఒక బ్యాచ్‌నే నడిపింది. దాంట్లో కూడా వైఎ స్సార్ నిర్మించిన భవనంలో 500మంది బాలికలతో, అద్దెకు తీసుకున్న మిత్రా ప్రైవేటు కళాశాలలో 500మంది బాలురుతో నడిపింది. వారి హయాంలో కొత్తగా ఒక్క భవనం కూడా నిర్మించలేదు. ఇవన్నీ మర్చిపోయి కళా ఇక్కడ సెల్ఫీ దిగడంతో ప్రజలే కాదు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా నవ్వుకుంటున్నారు. అన్నీ బొంకులే దాదాపు రూ.100 కోట్లతో టీడీపీ హయాంలో నిరుపేద విద్యార్థుల కోసం ఉన్నత విద్య అందించడమే లక్ష్యంగా ట్రిపుల్ ఐటీని తీసుకువచ్చామని కళా అవాస్తవాలను పోస్టు చేశారు. అయితే ఇక్కడే కళా పప్పు లో కాలేశారు. టీడీపీ హయాంలో కేవలం రూ.43 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. వారి హయాంలో భవన నిర్మాణం చేపట్టలేకపోయారు. అరకొర నిర్మాణాలు చేపట్టి గాలికొదిలేశారు. దీంతో టీడీపీ పాలన సాగిన 2017లో కేవలం ఒక బ్యాచ్‌ను మాత్ర మే నడపగలిగారు. పీయూసీ 1 బ్యాచ్‌ను వెయ్యి మంది( 500బాలికలు, 500బాలురు)తో ప్రారంభించారు. తర్వాత సంవత్సరం చేరే బ్యాచ్‌కు భవనాల్లేక నూజివీడు ట్రిపుల్ ఐటీకి ఇక్కడి విద్యార్థులను పంపించారు. ట్రిపుల్ ఐటీలో పీయూసీ 1, పీయూసీ 2, ఇంజినీరింగ్ 1, ఇంజినీరింగ్ 2, ఇంజినీరింగ్ 3, ఇంజినీరింగ్ 4 తరగతులుంటాయి. టీడీపీ హయాంలో కేవలం పీయూసీ 1 బ్యాచ్‌ను ప్రారంభించి, ఆ తర్వా త భవనాలు సమకూర్చలేక చేతులేత్తేసి తర్వాత సంవత్సరం పీయూసీ 1లో చేరే విద్యార్థులను నూజివీడుకు తరలించారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అరకొరగా జరిగిన నిర్మాణాలను పూర్తి చేశారు. దాదాపు 4వేల మంది విద్యార్థులకు సరిపడా జీప్లస్ 5 భవనా న్ని రూ. 131కోట్లతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించింది. దీంతో నాలుగు బ్యాచ్‌ల(పీయూసీ 1, పీయూసీ2, ఇంజినీరింగ్1, ఇంజినీరింగ్2)ను నడుపుతోంది. అంతటితో ఆగలేదు. 2024 నాటికి ఆరేళ్ల ఇంజినీరింగ్ కోర్సును విద్యార్థులు ఇక్కడే పూర్తి చేసే లా లక్ష్యం పెట్టుకుని రూ. 67కోట్లతో న్యూ అకాడమీ బ్లాక్‌ను ప్రస్తుతం నిర్మిస్తోంది. ఇది కాకుండా దాదా పు 6,600మందికి సరిపడా వసతి సౌకర్యాలను క ల్పించేందుకు రూ.133కోట్లతో నిర్మాణాలు చేపట్టేందుకు ఇటీవల బడ్జెట్లో నిధుల కేటాయింపు కూడా చేసింది. అభాసుపాలు వాస్తవాలన్నీ వదిలేసి ట్రిపుల్ ఐటీ ఏర్పాటు ఘనత మాదే అంటూ కళా ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అయితే నిజం తెలిసిన ప్రజలు కళా సెల్ఫీ చూసి అవాక్కయ్యారు. జిల్లా టీడీపీ శ్రేణులు సైతం కళా వేషాలు చూసి నవ్వుకుంటున్నారు. అనవసర సెల్ఫీ చాలెంజ్‌లతో అభాసుపాలవుతున్నామని బాధ పడుతున్నారు. రిమ్స్, బీఆర్‌ఏయూ, వంశధార ప్రాజెక్టు, నాడు–నేడు స్కూళ్లు, ఆర్బీకేలు, ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వంటి పనులు ఏమైనా టీడీపీ చేపట్టి ఉంటే చెప్పుకోవాలి గానీ ఇలా తమవి కాని భవనాల వద్ద సెల్ఫీలు దిగి రాజకీయాలు చేయడం సరికాదని జనమంటున్నారు. -
ట్రిపుల్ ఐటీలో హౌసెకీపింగ్ ఉద్యోగుల తొలగింపు వివాదం
-
ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది.. దరఖాస్తు చేసుకోండి ఇలా
సత్తెనపల్లి (పల్నాడు జిల్లా): రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ (ఆర్టీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో ఆరేళ్ల బీటెక్ సమీకృత ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశానికి ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైంది. ఒక్కో సెంటర్లో 1100 సీట్లు (ఈడబ్ల్యూఎస్ కింద వంద సీట్లు అదనం) అందుబాటులో ఉన్నాయి. గతనెల 30 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. చదవండి: అది ‘ఐ–టీడీపీ’ పనే పదో తరగతిలో మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. నూజివీడు, ఇడుపులపాయలోని సీట్లలో 85 శాతం సీట్లు స్థానికంగా, మిగిలిన 15 శాతం సీట్లను మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఈ–మెయిల్, మొబైల్‌కు సమాచారం ఇస్తారు. కౌన్సెలింగ్‌లో సమర్పించాల్సినవి కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించినప్పుడు ఇచ్చిన రశీదు, పదో తరగతి హాల్ టికెట్, మార్కులలిస్టు, రెసిడెన్స్ సర్టిఫికెట్, సంబంధిత రిజర్వేషన్ల ధ్రువీకరణపత్రాలు సమర్పించాలి. అర్హతలు ♦అభ్యర్థులు ప్రథమ ప్రయత్నం లోనే 2022లో ఎస్ఎస్సీ, తత్సమాన పరీక్షలో రెగ్యులర్ విద్యార్థిగా ఉత్తీర్ణులై ఉండాలి. ♦ఈ ఏడాది సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారూ రెగ్యులర్‌గానే ప్రభుత్వం ప్రకటించినందున వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఇలా.. ♦ ఏపీ ఆన్లైన్ సెంటర్ ద్వారా ఆర్జీయూకేటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ♦ ఓసీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ. 250, ఎస్సీ, ఎస్టీలు రూ. 150 చెల్లించాలి. ♦ రశీదును జాగ్రత్తగా పెట్టుకోవాలి, సర్వీసు చార్జి కింద ఆన్లైన్ సెంటర్‌కు అదనంగా రూ.25లు చెల్లించాలి. ఫీజుల వివరాలు ♦ రాష్ట్రంలోని పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ♦ ట్యూషన్ ఫీజు కింద పీయూసీ–1, పీయూసీ–2లకు ఏడాదికి రూ.45వేలు, ఇంజినీరింగ్ నాలుగు సంవత్సరాలకు ఏడాదికి రూ.50వేలు చొప్పున చెల్లించాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థులు చెల్లించాల్సిన అవసరం లేదు. ♦ ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ట్యూషన్ ఫీజు ఏడాదికి రూ.1.50 లక్షలు చెల్లించాలి ♦ ఎన్నారై, అంతర్జాతీయ విద్యార్థులు అయితే ఏడాదికి రూ.3 లక్షలు ట్యూషన్ ఫీజు చెల్లించాలి కోర్సులు పీయూసీ : గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఇంగ్లిషు, తెలుగు, ఐటీ, బయాలజీ సబ్జెక్టులు ఉంటాయి. ఇంజినీరింగ్ : కెమికల్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజినీరింగ్ (ఈ రెండు నూజివీడు, ఇడుపులపాయలో మాత్రమే ఉన్నాయి). సివిల్, సీఎస్ఈ, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్ బ్రాంచ్‌లు. గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఆన్లైన్ దరఖాస్తులకు గడువు : సెప్టెంబర్ 19 అర్హుల జాబితా విడుదల : సెప్టెంబర్ 29 కౌన్సెలింగ్ తేదీలు : అక్టోబరు 12 నుంచి 15 వరకు తరగతులు ప్రారంభం : అక్టోబరు 1 -
విషాదం: బాగా చదవలేక పోతున్నా.. అందుకే
నూజివీడు(కృష్ణా జిల్లా): స్థానిక ట్రిపుల్ ఐటీలో పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఈవూరి గౌరీష్(16) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లాలోని మండల కేంద్రమైన నగరం గ్రామానికి చెందిన గౌరీష్ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోని ఐ2 హాస్టల్ భవనం ఫస్ట్‌ఫ్లోర్‌లోని ఓ గదిలో ఉరివేసుకున్నాడు. ఆదివారం ఉదయం గౌరీష్‌కు అతని తల్లి ఫోన్ చేయగా స్పందించలేదు. సాయంత్రం మళ్లీ ఫోన్ చేసినా ఫలితంలేకపోవడంతో అతని స్నేహితులకు ఫోన్ చేసి మాట్లాడించమని చెప్పింది. చదవండి: వ్యభిచారం కేసులో టీడీపీ నేత అరెస్టు పరీక్షలు కావడంతో స్నేహితుల రూమ్‌లకు వెళ్లి చదువుకుంటూ ఉంటాడేమోనని రాత్రి 8.30 గంటల సమయంలో అన్ని రూమ్‌లను వెతుకుతుండగా ఒక గది తలుపులు తెరుచుకోలేదు. తలుపులను పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని గౌరీష్ కనిపించాడు. ఈ సమాచారం అందిన వెంటనే డీఎస్పీ బుక్కాపురం శ్రీనివాసులు, పట్టణ ఎస్ఐ తలారి రామకృష్ణ ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. తాను బాగా చదువలేకపోతున్నానని, అందుకే చనిపోతున్నట్లుగా గౌరీష్ సూసైడ్ లెటర్ రాశాడని ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పట్టణ ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేడు ఆర్జీయూకేటీ సెట్
నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న నాలుగు ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఆదివారం ఆర్జీయూకేటీ సెట్ నిర్వహిస్తున్నారు. ప్రవేశ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. మొత్తం 75,283 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని.. పరీక్ష నిర్వహణకు ఏపీలో 467, తెలంగాణలో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తామని.. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఫలితాలను అక్టోబర్ 4న మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేస్తారని పేర్కొన్నారు. కోవిడ్ వల్ల 10వ తరగతి పరీక్షలు జరగనందున.. ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీకి ఆర్జీయూకేటీ సెట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. దరఖాస్తు చేసిన మొత్తం అభ్యర్థుల్లో 40,555 మంది బాలురు, 34,728 మంది బాలికలున్నారని తెలిపారు. ట్రిపుల్ ఐటీల్లో ఇంక్యుబేషన్ సెంటర్లు.. వచ్చే ఏడాదిలోగా నూజివీడు, శ్రీకాకుళం, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ఆర్జీయూకేటీ చాన్సలర్ కేసీ రెడ్డి తెలిపారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అనేక కంపెనీల్లో ఉద్యోగాలు సాధించి.. మంచి ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. 2008–14 బ్యాచ్‌కు చెందిన జి.విద్యాధరి సివిల్ సర్వీసెస్‌లో 211వ ర్యాంకు, అలాగే 2012వ బ్యాచ్‌కు చెందిన చీమల శివగోపాల్‌రెడ్డి 263వ ర్యాంకు సాధించారని తెలిపారు. ఇడుపులపాయ, నూజివీడులో సోలార్ పవర్ ప్లాంట్లు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. వీటివల్ల ఏడాదికి రూ.కోటికి పైగా నిధులు ఆదా అవుతున్నాయని తెలిపారు. శ్రీకాకుళంలో కూడా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే అనలాగ్ డివైజెస్ కంపెనీ ఈ ఏడాది 50 మంది విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌కు ఎంపిక చేసుకుందని చెప్పారు. మెంటార్లను రెగ్యులర్ చేయడానికి అవకాశం లేదని.. 4 ట్రిపుల్ ఐటీల్లో 400 వరకు లెక్చరర్ పోస్టులున్నాయని, వారిని ఆ పోస్టుల్లో నియమిస్తామని తెలిపారు. సమావేశంలో ఆర్జీయూకేటీ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ కె.సామ్రాజ్యలక్ష్మి, సెట్ కన్వీనర్ డి.హరినారాయణ, నూజివీడు డైరెక్టర్ జి.వి.ఆర్.శ్రీనివాసరావు సెట్ కో–కనీ్వనర్ ఎస్.ఎస్.ఎస్.వి.గోపాలరాజు, ఏఓ భానుకిరణ్, డీన్ అకడమిక్స్ దువ్వూరి శ్రావణి పాల్గొన్నారు. -
26న ఆర్జీయూకేటీ సెట్–2021
నూజివీడు/సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం ఆర్జీయూకేటీ సెట్–2021ని ఈ నెల 26న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఏదైనా మండలం నుంచి 100 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లయితే అదే మండలంలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, తక్కువ వస్తే సమీపంలోని మండల కేంద్రంలోని సెంటర్‌ను కేటాయిస్తామని వెల్లడించారు. తెలంగాణలో 8 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్ష ఫలితాలను అక్టోబర్ 4న విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 74,403 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. 11 వరకు దరఖాస్తుకు అవకాశం ఆర్జీయూకేటీ సెట్–2021కి రూ.1,000 అపరాధ రుసుముతో ఈ నెల 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సెట్ కన్వీనర్ హరినారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ అప్లికేషన్ సవరణకు శనివారం (11వ తేదీ) వరకు అవకాశం కల్పించినట్టు చెప్పారు. ఇవీ చదవండి: ఏపీ: వైద్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అధిక డేటా.. మరింత వేగం -
కార్యాచరణ రూపొందించండి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ఇందులో భాగంగా పెద్ద ఎత్తున నాడు–నేడు కార్యక్రమం కొనసాగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. యూనివర్సిటీలలో అన్ని ప్రమాణాలు పెరగాలని, ఆమేరకు కార్యాచరణ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యపై సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులకు మేలు చేసేలా ప్రమాణాలు పెంచాలని, దేశంలో టాప్ టెన్‌లో రాష్ట్రంలోని యూనివర్సిటీలు నిలవాలని పేర్కొన్నారు. అదే విధంగా.. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)లో యూనివర్శిటీలను ఉన్నత స్థానానికి తీసుకెళ్లడంపై అధికారులతో చర్చించారు. కార్యాచరణ రూపొందించండి: సీఎం జగన్ జేఎన్టీయూ రెండు యూనివర్సిటీలు (కాకినాడ, అనంతపురం), ఆంధ్రా యూనివర్సిటీ, ఎస్వీ యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీతో పాటు, ట్రిపుల్ ఐటీలను ఇప్పడున్న పరిస్థితి నుంచి మెరుగైన పరిస్థితిలోకి తీసుకువెళ్లడంపై కార్యాచరణ రూపొందించండి. ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఎన్ని నిధులు అవసరమో చెప్పండి. కడపలో రానున్న ఆర్కిటెక్చర్ యూనివర్శిటీపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టండి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో ఏయూ ప్రస్తుతం 19వ స్థానంలోనూ, ఎస్వీ యూనివర్సిటీ 38వ స్థానంలోనూ ఉన్నాయి. రెండేళ్లలో వీటి స్థానాలు గణనీయంగా మెరుగుపడడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టండి. ప్రతిభావంతులను ఎంపిక చేయండి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో ఉత్తమ స్థానాల్లో ఉన్న యూనివర్సిటీలలో పద్ధతులను అధ్యయనం చేయండి. మౌలిక సదుపాయాలు, బోధనా పద్ధతులు, బోధనా సిబ్బంది తదితర అంశాల్లో తీసుకోవాల్సిన పద్దతులపై దృష్టి పెట్టండి. ప్రతిభ ఉన్న వారినే యూనివర్సిటీల్లో బోధనా సిబ్బందిగా నియమించాలి. ఇందుకు తగిన చర్యలు తీసుకోండి. రిక్రూట్మెంట్ కోసం పటిష్టమైన పద్దతులను రూపొందించండి విదేశీ వర్సిటీలతో భాగస్వామ్యం విదేశాల్లోని అత్యుత్తమ యూనివర్సిటీల పద్దతులను, విధానాలను కూడా అధ్యయనం చేసి వాటిని మన యూనిర్సిటీల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. వారి పాఠ్య ప్రణాళికలను ఇక్కడ అనుసంధానం చేసుకోవడంపైనా దృష్టి పెట్టాలి. బోధనతో పాటు, కోర్సులకు సంబంధించి విదేశీ వర్సిటీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోండి. ట్రిపుల్ ఐటీలపైనా సీఎం సమీక్ష ట్రిపుల్ ఐటీల్లో ప్రస్తుతం 22,946 మంది విద్యార్థులు ఉన్నారు. శ్రీకాకుళం, ఒంగోలులో ట్రిపుల్ ఐటీల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. గత ప్రభుత్వ హయాంలో ట్రిపుల్ ఐటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ట్రిపుల్ ఐటీలకు సంబంధించి రూ.180 కోట్లకు పైగా నిధులను మళ్లించారు. కాబట్టి వాటిని ప్రక్షాళన చేయాల్సి ఉంది. ఇప్పుడున్న మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. ఇందుకోసం కార్యాచరణ రూపొందించండి. ట్రిపుల్ ఐటీల్లో మంచి బిజినెస్ కోర్సులను ప్రవేశపెట్టడంపైనా దృష్టి పెట్టండి. ఈ కోర్సులు అత్యుత్తమంగా ఉండాలి.ఇంజినీరింగ్ కోర్సులు కూడా మంచి నైపుణ్యం ఉన్న మానవవనరులను అందించేలా చూడాలి వైద్య విద్య రాష్ట్రంలో ఇప్పటివరకూ 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. కొత్తగా మరో 16 మెడికల్ కాలేజీలను తీసుకువస్తున్నాం. మెడికల్ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగబోతోంది. ఆ కాలేజీలను మెరుగ్గా నిర్వహించడానికి చక్కటి విధానాలు పాటించాలి. ఆ కాలేజీల్లో 70 శాతం సీట్ల కన్వీనర్ కోటాలోనూ, మిగిలిన 30 శాతం సీట్లు పేమెంటు కోటాలో ఉండేలా ఆలోచన చేయండి. సీట్ల సంఖ్య పెరుగుతుండడంతో పేద విద్యార్థులకు మరిన్ని సీట్లు అందుబాటులోకి వస్తాయి. అంతే కాకుండా ప్రతి కాలేజీ కూడా స్వయం సమృద్ధితో నడుస్తుంది. దీంతో నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ వ్యవస్థలు బాగుండాలి విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ బాగు పడాలనే తపనతో వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. అందు కోసం పెద్ద ఎత్తున నాడు–నేడు కార్యక్రమం అమలు చేస్తున్నాం. ఈ సంస్థలన్నింటినీ అత్యుత్తమంగా నడుపుకునేలా చక్కటి విధానాలను తీసుకురావాలి. వీటన్నింటిపైనా అధికారులు మూడు, నాలుగు సార్లు సమావేశమై విధానాలు రూపొందించాలి. అదే విధంగా సంస్కరణలు తీసుకు రావాలి. ఆ మేరకు అవసరమైన బిల్లులను ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలి. ఇంకా గ్రామ సచివాలయాల సిబ్బందికి ఇచ్చే శిక్షణను ట్రిపుల్ ఐటీలతో కలిసి నిర్వహించాలి. ఉపాధ్యాయులకు శిక్షణ కార్యాక్రమాలను కూడా ట్రిపుల్ ఐటీలు నిర్వహించాలి అని సమీక్షా సమావేశంలో సీఎం జగన్ నిర్దేశించారు. కాగా, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్‌చంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (ఏపీఎస్సీహెచ్ఈ) ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, ఆర్జీయూకేటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ కెసి రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. (చదవండి: శ్యాం కలకడకు వైఎస్సార్సీపీ నివాళి) -
ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ: రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT-CET) ప్రవేశ పరీక్షలు శనివారం విడుదలయ్యాయి. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో టాప్ టెన్ ర్యాంకుల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులే నిలిచారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు లేని నేపథ్యంలో టెన్త్ సిలబస్ ఆధారంగానే ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించినట్లు తెలిపారు. 85,755 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. జనవరి 4 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్ అడ్మిషన్ కోసం ఆన్లైన్ ప్రాసెస్ ఏర్పాటు చేశామన్నారు. విద్య వ్యాపారం కాకూడదనే ఆన్లైన్ విధానం తెచ్చామని తెలిపిన మంత్రి.. మౌలిక వసతులు లేని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్‌జ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో చేరేందుకు కామన్ ఎంట్రన్స టెస్ట్ నవంబర్ 28న జరిగిన విషయం తెలిసిందే. ఫలితాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి -
ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష-2020 ఫలితాలు విడుదల
-
మంచి విద్య.. మెరుగైన ఉద్యోగం
సాక్షి, అమరావతి: విద్యార్థులు పాఠశాలల్లో చేరిన దగ్గర నుంచి ఉద్యోగాలు సంపాదించే స్థాయి వరకు తీసుకువెళ్లే విధంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఇది తనకు అత్యంత ప్రాధాన్యతా అంశమని స్పష్టం చేశారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రమాణాలు పెంచి వాటిని ఉద్యోగ కల్పన కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సీఎం సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్నత విద్య, దీన్ని బోధిస్తున్న సంస్థలు, ఎయిడెడ్ కాలేజీల్లో పరిస్థితులు తదితర అంశాలమీద అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల బలోపేతానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించారు. ప్రభుత్వ రంగ విద్యా వ్యవస్థ బలంగా లేకపోతే పేదలు, మధ్య తరగతి పిల్లలు చదువుకోలేరని, అందువల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థను బతికించుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస సదుపాయాలు ఉండాలని, నాణ్యమైన విద్య అందించాలన్నారు. గత ప్రభుత్వం కావాలనే ఈ రంగాన్ని నిర్వీర్యం చేసిందని వ్యాఖ్యానించారు యూనివర్సిటీల దశ, దిశ మార్చండి.. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలను దెబ్బతీశారని, ఫలితంగా ప్రైవేటు కాలేజీల్లో లక్షలాది రూపాయలు పోసి చదువుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఫీజులు భరించలేక విద్యార్థులు చదువులు మానుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీల దశ, దిశ మార్చాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆయా విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు, ప్రమాణాలు పెంచి వాటి ప్రతిష్టను ఇనుమడింపచేయాలని సీఎం గట్టిగా చెప్పారు. యూనివర్సిటీల్లో వీసీల నియామకంతో పాటు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాలను అధికారులు సమావేశంలో ముఖ్యమంత్రికి నివేదించారు. వీసీల నియామకానికి సంబంధించి సెర్చి కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. నెలరోజుల్లోగా పూర్తి పారదర్శక విధానంలో అర్హత, అనుభవం ఉన్న వారిని వీసీలుగా ఎంపిక చేయాలని పేర్కొన్నారు. అలాగే ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, ఇతర అధ్యాపక, సిబ్బంది పోస్టులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. భర్తీల విషయంలో అవినీతికి, పొరపాట్లకు తావివ్వకూడదని హెచ్చరించారు. అన్ని యూనివర్సిటీల న్యాక్ గ్రేడ్ పెరిగేలా తీర్చిదిద్దాలన్నారు. విద్యా వ్యవస్థను మెరుగుపరిచి విద్యార్థులకు తోడుగా ఉన్నామన్న సంకేతాలు పంపాలని అధికారులకు సూచించారు. ఫీజులను ప్రామాణీకరించాలి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అమలు తరువాత ఉన్నత విద్య చదివే వారి సంఖ్య గణనీయంగా పెరిగిన అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. కాలేజీల ఫీజులు, ఇస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంటు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని, దీన్ని పరిశీలించి ప్రామాణీకరించాలని (స్టాండర్డెజ్) ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఫీజుల నిర్ధారణ వాస్తవిక దృక్పథంతో ఉండాలని అభిప్రాయపడ్డారు. లేకుంటే పేద, మధ్యతరగతి పిల్లలు ఫీజులు భరించలేరన్నారు. ‘ఇంజనీరింగ్ చదివే విద్యార్థికి ఏటా రూ. 33 వేలు ఖర్చు అవుతుందని ప్రభుత్వమే నిర్ధారించి, ఆ మేరకు రీయింబర్స్‌మెంటును ఖరారు చేసింది. అదే సమయంలో కొన్ని కాలేజీలు ఏటా రూ. 70 వేల నుంచి రూ. 1 లక్ష వరకు కూడా ఫీజుల వసూలుకు మళ్లీ ప్రభుత్వమే అనుమతి ఇస్తోంది. ఈ పద్ధతి మారాలి. విద్య అన్నది వ్యాపారం కాదు. దాన్ని లాభార్జన రంగంగా చూడకూడదు. దేశంలో చట్టం కూడా అదే చెబుతోంది’ అని సీఎం పేర్కొన్నారు. ఫీజురీయింబర్స్‌మెంటు కింద కాలేజీలకు అందాల్సిన డబ్బులు కనీసం మూడు నెలలకోసారైనా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అప్పుడే ఆ కాలేజీలు కూడా సక్రమంగా నడుస్తాయని అక్కడ పనిచేస్తున్న వారికి సకాలానికి వేతనాలు అందుతాయని పేర్కొన్నారు. భూములు పొంది, సంస్థలు ఏర్పాటు చేయని వాటి వివరాలు సేకరణ.. రాజధాని ప్రాంతంలో ప్రైవేటు యూనివర్సిటీలకు ఇబ్బడిముబ్బడిగా భూములు కేటాయింపు అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. ఒక విధానం లేకుండా ఇష్టానుసారం గత ప్రభుత్వం భూములు కేటాయించిందని సీఎం వ్యాఖ్యానించారు. భూములు పొంది, సంస్థలను ఏర్పాటు చేయని వారి వివరాలను తయారుచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఒంగోలు, విజయనగరంలలో యూనివర్సిటీలు పెడతామంటూ ఎన్నికలకు ముందు హడావుడిగా జీవోలు ఇచ్చారని, కానీ వాటి నిర్మాణం, సిబ్బంది నియామకంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. మూడేళ్లలో వాటి ఏర్పాటు పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఉద్యోగ కల్పన కేంద్రాలుగా వర్సిటీలు, కాలేజీలు చదువు పూర్తిచేసుకుని బయటకు రాగానే ఉద్యోగం సంపాదించుకునేలా విద్యావ్యవస్థ ఉండాలని, వర్సిటీలు, కాలేజీల్లో ప్రమాణాలు పెంచి, వాటిని ఉద్యోగ కల్పన కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. ఈ దిశగా సిలబస్‌లో మార్పులు చేయాలని, సిలబస్‌ను మెరుగుపరచడానికి ఒక కమిటీని వేయాలని ఆదేశించారు. కొత్త సిలబస్ వచ్చే విద్యాసంవత్సరం అమల్లోకి రావాలని గడువు విధించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఖాళీలను భర్తీ చేసేముందు ప్రస్తుతం ఉన్న అవసరాలకు అనుగుణంగా వారి అర్హతలను నిర్ధారించాలని, ఏపీపీఎస్సీ నిర్దేశించుకున్న అర్హతలను ఒకసారి పరిశీలించాలని పేర్కొన్నారు. పార్లమెంటు నియోజకవర్గానికో వృత్తి నైపుణ్య కేంద్రం విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యం పెంచడానికి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో ఏ కోర్సులు పెట్టాలి, ఎలా అమలు చేయాలన్న ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. స్థానిక పరిశ్రమల ప్రతినిధులను ఇందులో భాగస్వామ్యం చేయాలని మార్గనిర్దేశం చేశారు. పరిశ్రమలకు అవసరమైన రీతిలో అభ్యర్థుల్లో నైపుణ్యాన్ని ఈ కేంద్రాల్లో నేర్పించాలని సూచించారు. అదే సమయంలో పాలిటెక్నిక్ కాలేజీల్లో కోర్సులను మెరుగుపరచాలన్నారు. విశాఖపట్నం జిల్లా అరకులో గిరిజన విశ్వవిద్యాలయాన్ని, మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. ఈ రెండు విద్యాసంస్థలను గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటుచేయడం సముచితమని అభిప్రాయపడ్డారు. రూ. 1,000 కోట్ల రూసా నిధులు కోల్పోయాం రూసా గ్రాంటు కింద కేంద్రం గత ఏడాది రూ. 67 కోట్లు మంజూరు చేయగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని విడుదల చేయకుండా వేరే ఖర్చులకు దారి మళ్లించిందని అధికారులు వివరించారు. రాష్ట్రంలో ఏయూ, ఎస్వీ వర్సిటీలు న్యాక్ ఏ ప్లస్ గుర్తింపు ఉన్నాయని, అవి 100 కోట్లు ఖర్చు చేసి ఉంటే రూసా కింద రూ. 1,000 కోట్లు అందేవని, దాన్ని రాష్ట్రం కోల్పోవాల్సి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ఇలా కావడం విచారకరమని, ఇలా చేస్తే విద్యాసంస్థలు ఎలా మెరుగుపడతాయని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. వర్సిటీలలో మౌలిక సదుపాయాలకు ఎంత కావాలన్నా కేపిటల్ గ్రాంటుగా తాము ఇస్తామని, మొత్తం అన్ని యూనివర్సిటీలు న్యాక్ ఏప్లస్ గ్రేడులోకి తీసుకురావాలని ఆదేశించారు. ట్రిపుల్ ఐటీ నిధులూ పక్కదారి ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్ ఐటీలను అధ్వానంగా మార్చారని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ట్రిపుల్ ఐటీలకు సంబంధించి రూ. 400 కోట్లు ఉంటే అందులో రూ. 260 కోట్లు గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని సీఎంకు అధికారులు తెలిపారు. ట్రిపుల్ ఐటీల భవనాల నిర్మాణానికి నిధులు లేకుండా పోయాయని, ప్రభుత్వ వైఫల్యం వల్ల వేలమంది విద్యార్థులను ప్రైవేటు భవనాల్లో ఉంచారని పేర్కొన్నారు. కాలేజీల అభివృద్ధిపై చర్చ సందర్భంగా జిల్లాకొక కాలేజీని రూ. 15 కోట్లతో అభివృద్ధి చేయిద్దామని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ పేర్కొన్నారు. కొన్ని కాలేజీలనే అభివృద్ధి చేసే బదులు మౌలికంగా ముందుగా అవసరమయ్యే మంచి నీరు, ఫర్నీచర్, ఫ్యానులు, బ్లాక్‌బోర్డులు, ప్రహరీలు, పెయింటింగ్‌లు తదితర 9 అంశాల్లో అన్ని కాలేజీలను మెరుగుపర్చాలని వైఎస్ జగన్ సూచించారు. స్కూళ్ల మాదిరిగానే కాలేజీల ప్రస్తుత ఫొటోలు తీసుకొని రెండేళ్లలో అభివృద్ధి చేసి చూపించాలన్నారు. వర్సిటీల పాలకమండళ్లను నెలరోజుల్లో పునర్నియమిస్తామని సీఎం తెలిపారు. 7వ పీఆర్సీకి సంబంధించి బకాయిలకు రూ. 340 కోట్లు అవసరమని అధికారులు పేర్కొనగా సీఎం ఇస్తామన్నారు. ట్రిపుల్ ఐటీలకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ సహకారం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉదాత్త ఆశయంతో ట్రిపుల్ ఐటీలను ఏర్పాటుచేస్తే వాటిని చేజేతులా నాశనం చేశారని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయంటూ పాదయాత్రలో తన వద్దకు వచ్చి విద్యార్థులు గోడుబెళ్లబోసుకున్నారని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో వెంటనే పనులు పూర్తిచేయాలని, ఒంగోలులో ట్రిపుల్ ఐటీ పనులు త్వరితంగా మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు. ట్రిపుల్ ఐటీల్లో చదివే విద్యార్థుల్లో 50 శాతం మందికి మాత్రమే ఉద్యోగావకాశాలు వస్తున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఈ పరిస్థితులు మారాలని సీఎం స్పష్టం చేశారు. ఇందుకు ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహకారం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ట్రిపుల్ ఐటీలలో తాగునీటి కొరత లేకుండా చూడాలన్నారు. సమీపంలోని రిజర్వాయర్ల నుంచి డైరెక్టుగా పైపులైనులు వేసి నీళ్లందించే ప్రయత్నాలు చేయాలన్నారు. ట్రిపుల్ ఐటీల్లో ఆత్మహత్య ఘటనలపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి జరగకుండా విద్యాశాఖ మంత్రి, అధికారులు ఆయా క్యాంపస్‌లను తరుచూ సందర్శించాలని ఆదేశించారు. -
జనవరి 8 నుంచి జేఈఈ మెయిన్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీ, జీఎఫ్టీఐలలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్ష తేదీల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మార్పులు చేసింది. జనవరి 6 నుంచి 20 వరకు నిర్వహించాల్సిన పరీక్షలను జనవరి 8 నుంచి 12 వరకు నిర్వహిస్తామని ఎన్టీఏ ప్రకటించింది. పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసిన విద్యార్థులు తక్కువగా ఉండటంతో ఈ మేరకు మార్పులు చేసినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 273 పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహించేలా ఇదివరకే షెడ్యూల్ జారీ చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి రెండు గంటల ముందునుంచే అనుమతిస్తారు. కచ్చితంగా గంట ముందుగా విద్యార్థులు కేంద్రంలోకి వెళ్లాల్సిందేనని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఇక హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏమైనా సమస్యలు ఉంటే తమను సంప్రదించాలని పేర్కొంది. ఇందుకోసం jeemain@inta@nic.in ఈ మెయిల్‌ను అందుబాటులోకి తెచ్చింది. హాల్‌టికెట్ లేకుండా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. -
బాసర ట్రిపుల్ ఐటీకి జాతీయస్థాయి అవార్డు
బాసర: బ్లాక్‌చైన్ సాంకేతిక పరిజ్ఞానంపై బాసర ట్రిపుల్ ఐటీకి జాతీయ అవార్డు వరించింది. రాజస్తాన్ ఎలేట్స్ టెక్నో ఆధ్వర్యంలో జైపూర్‌లో ఈనెల 24, 25వ తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజస్తాన్ ఉన్నత విద్య కమిషన్ కార్యదర్శి అశుతోష్ ఏటిపడేకర్ చేతుల మీదుగా బాసర ట్రిపుల్ ఐటీ అకడమిక్ డీన్ సాయినాథ్ ఈ అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, మణిపూర్, ఉత్తరాఖండ్, రాజస్తాన్ విద్యాశాఖ మంత్రులు, ఏఐసీటీఈ, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
పేరుకే ఒంగోలు.. ఇడుపులపాయలోనే పాఠాలు!
సాక్షి, కడప: ఒంగోలుకు ట్రిపుల్ ఐటీ మంజూరై మూడో విద్యా సంవత్సరం ప్రారంభమైనా.. ఇంకా వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోనే తరగతులు కొనసాగుతుండడం చంద్రబాబు ప్రభుత్వ ఉదాసీనతకు అద్దం పడుతోంది. ఇన్నాళ్లూ పట్టించుకోని ప్రభుత్వం..: ఎన్నికలకు ముందు హడావుడి చేస్తోంది..మూడేళ్లుగా నాన బెట్టి ఇప్పుడు తూతూ మంత్రంగా శంకుస్థాపనలకు శ్రీకారం చుడుతోంది. శంకుస్థాపన శిలాఫలకానికే మూడేళ్లు పడితే...భవన నిర్మాణాలకు ఇంకెన్నాళ్లు పడుతుందోనన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రకాశం జిల్లా పామురు మండల పరిధిలోని దూబగుంట్లలో 208.45 ఎకరాల స్థలాన్ని కేటాయించి..అదే స్థలంలో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి గంటా శంకుస్థాపన చేయడం పలువురి విమర్శలకు గురవుతోంది. 2016లో కొత్త ట్రిపుల్ ఐటీలు మంజూరు: తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చాక 2016లో శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల ఏర్పాటుకు పూనుకుంది. అనుకున్నదే తడువుగా తరగతులు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు తప్ప శాశ్వత పరిష్కారం దిశగా ఇప్పటివరకు అడుగులు వేయలేదు. పాత క్యాంపస్‌లోనే..: వేంపల్లె సమీపంలోని ఇడుపులపాయలోనే రెండు ట్రిపుల్ ఐటీల విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సొంత భవనాల్లో విద్యను అభ్యసిస్తుండగా..ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పాత క్యాంపస్‌లో ఉంటున్నారు. అక్కడ విద్యాబోధనతోపాటు హాస్టల్ వసతులు కల్పించారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించిన నేపథ్యంలో 2008లో తాత్కాలిక షెడ్లు వేసి ప్రారంభించారు. ప్రస్తుతం తాత్కాలిక షెడ్లలోనే పలు సమస్యల మధ్య ఒంగోలు విద్యార్థులు చదువును కొనసాగిస్తున్నారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీలో 3,254మంది విద్యార్థులు జిల్లాలోని ఇడుపులపాయలో ఏర్పాటు చేసిన ఒంగోలు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు 3,254 మంది విద్యను అభ్యసిస్తున్నారు. 2016, 2017, 2018 విద్యార్థులను కలుపుకుని దాదాపు 3,250 మందికి పైగా ఇడుపులపాయలోని ఒంగోలు ట్రిపుల్‌ఐటీలో చదువుకుంటున్నారు. ప్రతి ఏడాదికేడాదికి విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారికి సౌకర్యాలు కల్పించడం యాజమాన్యానికి కష్టంగా మారుతోంది. -
వినూత్న ఆవిష్కరణల కేంద్రంగా ఏపీ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/చీరాల: విద్యార్థులు లక్ష్యాన్ని ఛేదించి ఉన్నతస్థాయికి చేరుకుని ఆంధ్రప్రదేశ్‌ను వినూత్న ఆవిష్కరణల కేంద్రంగా ఆవిష్కరింపజేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లా పామూరు మండలం దూబగుంట వద్ద ఆయన అబ్దుల్ కలాం ట్రిపుల్ ఐటీ భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని చదివితే సాధించలేనిది లేదన్నారు. ఆర్థికలోటు ఉన్నా విద్యా రంగానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ట్రిపుల్ ఐటీతో పశ్చిమ ప్రకాశం అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అయిదు ట్రిపుల్ ఐటీలు నడుస్తున్నాయన్నారు. నాదెళ్ల సత్య, రాజారెడ్డిలాంటి ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. చేనేతల అభివృద్ధికి ప్రాధాన్యం ..: చేనేతల అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో జరిగిన చేనేత దినోత్సవ సభలో మాట్లాడారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా పందిళ్లపల్లిలో మగ్గాలు, చేనేత వస్త్రాల డిజైన్లు, రంగులు, రసాయనాల అద్దకం, అల్లు, రాట్నం పరిశీలించారు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకంలో భాగంగా యువతీ, యువకులతో నిరుద్యోగ భృతి ప్రకటనపై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. చేనేత కార్మికులు, బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను సీఎం సందర్శించారు. -
భవనంపై నుంచి దూకిన ట్రిపుల్ ఐటీ విద్యార్థి
సాక్షి, మచిలీపట్టణం: కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో ఉన్న ట్రిపుల్ ఐటీలో గురువారం ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గోపిచంద్ నాయక్ అనే విద్యార్థి భవనంపై నుంచి దూకాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గోపిచంద్ నాయక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన కౌశిక తల్లిదండ్రులు
-
వైఎస్ జగన్‌ను కలిసిన కౌశిక తల్లిదండ్రులు
సాక్షి, కర్నూలు : ఎస్ఎస్సీ బోర్డు నిర్లక్ష్యం వల్ల ట్రిపుల్ ఐటీలో సీటు కోల్పోయిన విద్యార్థిని కౌశిక తల్లిదండ్రులు మంగళవారం వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. జిల్లాలోని ఉయ్యాలవాడ మండలం అల్లూరుకు చెందిన కౌశిక ఏపీ మోడల్ స్కూల్లో 2017 సంవత్సరంలో 9.5 జీపీఏతో పదో తరగతి ఉత్తీర్ణత సాధించింది. రీ వెరిఫికేషన్‌లో హిందీలో మూడు మార్కులు పెరిగి, కౌశికకు 9.7కి జీపీఏ పెరిగింది. అయితే టెన్త్ బోర్డు సకాలంలో గ్రేడ్ మార్చకపోవడంతో ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ సీటు కోల్పోయింది. దీంతో తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను ఇవాళ కౌశిక పేరెంట్స్ శ్రీవాణి, విష్ణువర్థన్ రెడ్డి కలిసి, తమ ఆవేదన తెలిపారు. తన కుమార్తెకు ట్రిపుల్ ఐటీలో సీటు ఇప్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్ జగన్‌ను కోరారు. కౌశికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ఈ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని ఎంపీ అవినాష్‌రెడ్డితో చర్చించిన ఆయన, జిల్లా విద్యాశాఖ అధికారులతో మాట్లాడాలని సూచించారు. మా పాపకు సీటు కావాలి... కౌశిక తల్లి శ్రీవాణి మాట్లాడుతూ...‘వైఎస్ జగన్‌కు తమ గోడు చెప్పుకునేందుకు కర్నూలు జిల్లా, ఉయ్యాలవాడ మండలం అల్లూరు నుంచి ప్రజాసంకల్పయాత్రకు వచ్చాం. మా పాపకు ఎస్ఎస్సీలో 2017లో 9.5 పర్సంటేజ్ వచ్చింది. రీ వెరిఫికేషన్ పెట్టుకుంటే మూడు మార్కులు పెరిగినా గ్రేడ్ మాత్రం పెరగలేదు. మండల టాపర్ అయినా ఇంత అన్యాయం జరిగింది. వెంటనే ఇడుపులపాయకు వెళ్లి కలుస్తే అడ్మిషన్లు పూర్తయ్యాయి అని చెప్పారు. తరువాత తాడేపల్లిలో వీసీని కలిస్తే కమిషనర్ నుంచి లెటర్ తీసుకురమ్మన్నారు. కమిషనర్‌ను కలిస్తే లెటర్ ఇచ్చారు. కానీ ట్రిపుల్ ఐటీలో లెటర్ బేస్ చేసుకొని సీటు ఇవ్వలేమంటున్నారు. ఎస్ఎస్సీ బోర్డు నిర్లక్ష్యంతో మా పాప చదువుకు ఆటంకం కలిగింది. వైఎస్ జగన్‌ను కలవడంతో ఆయన మాకు భరోసా ఇచ్చారు. న్యాయం జరిగే విధంగా చూస్తానని ధైర్యం చెప్పారు. వైఎస్ జగన్‌ను కలిసిన తర్వాత నెత్తిమీద పెద్ద భారం దిగినట్లు అయింది. మాకు భరోసా లభించింది.’ అని అన్నారు. -
ఎందుకింత జాప్యం!
► ట్రిపుల్ ఐటీలో వారం కిందట జూనియర్లపై సీనియర్ల దాడి ► 22 మంది దాడి చేశారని ప్రకటించిన డైరెక్టర్ ► పోలీసులకు ఫిర్యాదు చేయని వైనం.. ► చర్యలు తీసుకోకుండా కమిటీ పేరుతో కాలయాపన ► ఆందోళన వ్యక్తంచేస్తున్న బాధిత విద్యార్థులు నూజివీడు : స్థానిక ట్రిపుల్ ఐటీలో జూనియర్ విద్యార్థులపై దాడి చేసిన సీనియర్లపై చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. దాడికి గురైన విద్యార్థుల్లో వేడి తగ్గే వరకు కాలయాపన చేసి, ఆ తర్వాత నామమాత్రపు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిటీ ఏర్పాటు, విచారణ పేరుతో సాగదీస్తుండటం ఇందుకు బలాన్నిస్తోంది. వాస్తవానికి ఈ వ్యవహారంపై మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ బి.లక్ష్మీకాంతం సీరియస్‌గా ఉన్నప్పటికీ... ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ మాత్రం వారం రోజులుగా చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రిపుల్ ఐటీ ఏఓ రమాకాంత్, డీన్(స్టూడెంట్ వెల్ఫేర్) నాగార్జునదేవి సంఘటన జరిగిన రెండో రోజు దాడి జరిగిందని ప్రకటించారు. జూనియర్లపై 20 నుంచి 30 మంది వరకు సీనియర్ విద్యార్థులు దాడి చేశారని తెలిపారు. డైరెక్టర్ ఆచార్య వీరంకి వెంకటదాసు మాత్రం ఈ ఘటనలో 22మంది సీనియర్లు పాల్గొన్నట్లు గుర్తించామని చెప్పారు. అయితే, దాడి చేసిన విద్యార్థులను గుర్తించి మూడు రోజులు గడిచినా, ఇంత వరకు చర్యలు తీసుకోకపోవడం, కనీసం పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. ఈ విషయంలో డైరెక్టర్ వ్యవహారంపై సిబ్బంది, విద్యార్థులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అసలు దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటారా... తమకు న్యాయం జరుగుతుందా... అని బాధిత విద్యార్థులు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. ఎప్పటికి నిర్ణయం తీసుకుంటారో...! ఈ ఘటనపై వివరాలు సేకరించి చర్యలు తీసుకునేందుకు ఏఓ రమాకాంత్ నేతృత్వంలో పది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటుచేశారు. దీనిలో అసిసెంట్ ప్రొఫెసర్లు, పోలీసు శాఖ కూడా నుంచి ఒకరు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఒకటో తేదీ నుంచి సమావేశమవడం, విద్యార్థులను విచారించడం మినహా ఇంత వరకు ఏం చర్యలు తీసుకోవాలని నిర్ణయించలేదు. కేవలం కాలయాపన చేసి ఈ వ్యవహారాన్ని మ మ.. అని ముగిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు రోజులుగా విచారణ పేరుతో కాలయాపన చేస్తుండగా, మరోవైపు ఈ కమిటీలో సోమవారం మరో ముగ్గురిని నియమించినట్లు సమాచారం. ఈ ముగ్గురులో కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రార్, నూజివీడుకు చెందిన ఓ న్యాయవాది, మరో ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాల ఏఓ ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం బటయటకు రావడంతో ప్రయివేటు వ్యక్తులను కమిటీలో ఎలా నియమిస్తారని సిబ్బంది ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. విచారణ చేసేది ఎవరు..? ఈ గొడవపై విచారణ చేయాల్సింది పోలీసులా, కమిటీలో ఉన్న అధ్యాపకులా... అనేది స్పష్టత కొరవడింది. అధ్యాపకులు అడిగితే తాము దాడి చేసినట్లు సీనియర్ విద్యార్థులు అంగీకరిస్తారా.. అనే అనుమానం వ్యక్తమవుతోంది. గొడవ జరిగినట్లు గుర్తించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే, వారు విచారించి చర్యలు తీసుకునేవారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు వ్యవహరించేవారు. ఈ విధంగా ట్రిపుల్ ఐటీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్ల భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని పలువురు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జాప్యం చేయడంలేదు విద్యార్థులపై చర్య తీసుకోవడంలో ఎలాంటి జాప్యం చేయడం లేదు. ఈ సంఘటనతో సంబంధం లేనివారిపై చర్యలు తీసుకోకూడదనే ఉద్దేశంతోనే కమిటీ అన్ని విషయాలు సేకరిస్తూ విచారణ చేస్తోంది. రెండు రోజుల్లో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. న్యాయసలహా కోసం కమిటీలోకి న్యాయవాదిని తీసుకున్నాం. – ఆచార్య వీరంకి వెంకటదాసు, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ -
జేఈఈ ప్రవేశాల రివైజ్డ్ షెడ్యూల్ జారీ
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐలలో ప్రవేశాలకు చేపడుతున్న కౌన్సెలింగ్‌కు సంబంధించి రివైజ్డ్ షెడ్యూల్‌ను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) బుధవారం ప్రకటించింది. ముందస్తు షెడ్యూలు ప్రకారం ఈ నెల 19 నాటికి ఏడు దశల కౌన్సెలింగ్ పూర్తి కావాల్సి ఉండగా, కోర్టు కేసు కారణంగా ఆలస్యమైంది. దీంతో ఈ నెల 22 వరకు కౌన్సెలింగ్ నిర్వహించేలా రివైజ్డ్ షెడ్యూల్‌ను జారీ చేసింది. సోమవారమే మూడో దశ సీట్లను కేటాయించింది. ఇదీ రివైజ్డ్ షెడ్యూలు.. 2017 జూలై 13న మధ్యాహ్నం ఒంటి గంట వరకు సీటు యాక్సె ప్టెన్స్/విత్‌డ్రా, సాయంత్రం 5 గంటలకు భర్తీ అయిన సీట్లు/ఖాళీల ప్రకటన, రాత్రి 8 గంటలకు నాలుగో దశ సీట్లు కేటాయింపు జూలై 14, 15 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు సీటు యాక్సెప్టెన్స్/విత్‌డ్రా జూలై 16న ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు/ ఖాళీల ప్రకటన, సాయంత్రం 5 గంటలకు ఐదో దశ సీట్లు కేటాయింపు. జూలై 17న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీటు యాక్సెప్టెన్స్/విత్‌డ్రా జూలై 18న ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు / ఖాళీల ప్రకటన, సాయంత్రం 5 గంటలకు ఆరో దశ సీట్లు కేటాయింపు జూలై 19, 20 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీటు యాక్సెప్టెన్స్, రిపోర్టింగ్ కేంద్రాల్లో విద్యార్థులు రిపోర్టు చేయడం. సీటు విత్‌డ్రాకు ఇదే చివరి అవకాశం. జూలై 21న ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు / ఖాళీల ప్రకటన, సాయంత్రం 5 గంటలకు ఏడో దశ సీట్లు కేటాయింపు. జూలై 22న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిపోర్టింగ్ కేంద్రాలకు వెళ్లి సీటు యాక్సెప్టెన్స్, రిపోర్టింగ్ (విత్‌డ్రా ఉండదు). -
19 నుంచి ఐఐటీల్లో తరగతులు!
ఒక్కో ఐఐటీలో ఒక్కోలా షెడ్యూలు ఎన్ఐటీల్లో 16 నుంచి తరగతులు సాక్షి, హైదరాబాద్: దేశ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో ఈ నెల 19 నుంచి తరగతులు ప్రారంభించేం దుకు ఐఐటీ కౌన్సిల్ నిర్ణయించింది. ఐఐటీల వారీగా తరగతుల ప్రారంభ తేదీలను ప్రకటిం చింది. ఐఐటీ ఢిల్లీలో ఈ నెల 19 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. ఆ తర్వాత ఒక్కో ఐఐటీలో ఒక్కో తేదీ ఖరారు చేసింది. ఎన్ఐటీల్లోనూ ఈనెల 16 నుంచి తరగతులు ప్రారంభించేం దుకు చర్యలు చేపట్టింది. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) మొదటి, రెండో దశ సీట్లను కేటాయించింది. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, జీఎఫ్‌టీఐల్లో మొత్తం 36,208 సీట్లతో పాటు సూపర్‌న్యూమరరీ కింద క్రియేట్ చేసిన 13 సీట్లు కలుపుకొని మొదటి దశ సీట్ల కేటాయింపును ప్రకటిం చింది. 107 సీట్లకు మినహా అన్నింటినీ విద్యార్థులకు కేటాయించింది. సీట్లు పొందిన వారిలో 29,415 మంది ఆయా విద్యాసంస్థల్లో చేరేం దు కు సీట్ యాక్సెప్టెన్స్‌కు ఒప్పుకొ న్నారు. మరో 6,799 సీట్లు మిగి లిపోగా రెండో దశ సీట్ల కేటా యింపును గురువారం ప్రకటిం చింది. ఇందులో ఎన్ని మిగులు తాయన్నది మరో నాలుగైదు రోజుల్లో తేలనుంది. సీట్లు పొం దిన విద్యార్థులకు ఐఐటీల్లో తరగతులను ప్రారంభించేందుకు షెడ్యూలును జారీ చేసింది. -
జూలై 20 నుంచి ఇంజనీరింగ్ తరగతులు!
కసరత్తు చేస్తున్న ఉన్నత విద్యా మండలి సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులకు తరగతులు ప్రారంభించేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. జూలై 20 నుంచి తరగతులను ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. బుధవారం కౌన్సెలింగ్‌లో పాల్గొని వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న 63,588 మంది విద్యార్థుల్లో 56,046 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించింది. వారిలో 7,542 మంది విద్యార్థులకు సీట్లు లభించలేదు. సీట్లు పొందిన విద్యార్థులు జూలై 7లోగా కాలేజీల్లో చేరనున్నారు. జూలై 20 తర్వాత చివరి దశ కౌన్సెలింగ్.. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాల ఆరో దశ కౌన్సెలింగ్ జూలై 29తో ముగియనుంది. నాల్గో దశ కౌన్సెలింగ్ నాటికి అంటే 20వ తేదీ తర్వాత రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ చివరి దశ కౌన్సెలింగ్ నిర్వహించాలని భావిస్తోంది. నేటి (శుక్రవారం) నుంచి ఈసెట్, వచ్చే నెల 6 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ఉన్నాయి. అలాగే ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్‌ను చూసే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొన్ని సెట్స్ కౌన్సెలింగ్‌ను వచ్చే నెల 14 నుంచి 19 వరకు చేపట్టేలా షెడ్యూల్ చేసుకుంది. వీటన్నింటి నేపథ్యంలో మొదటి దశ కౌన్సెలింగ్‌లో మిగిలిన 8,254 సీట్ల భర్తీకి వచ్చే నెల 20వ తేదీ తరువాత చివరి దశ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయానికి వచ్చింది. -
19 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
బాసర (ముథోల్) : బాసర (ట్రిపుల్ఐటీ)రాజీవ్‌గాంధీ నాలెడ్జ్ టెక్నాలజీ యూనివర్సిటీలో 2017–18 సంవత్సరానికి గాను ప్రవేశం కోసం ఎంపికైన విద్యార్థుల జాబితాను ఇన్చార్జి వీసీ డాక్టర్ ఎ.అశోక్‌కుమార్, డైరెక్టర్ సత్యనారాయణ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆరెళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుకు మొత్తం 19,071 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన వారు 6,619 మంది, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన వారు 9,241 మంది, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల నుంచి 3,211 మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన 15 మంది దరఖాస్తులు సమర్పించినట్లు పేర్కొన్నారు. ఇందులో ఎస్టీ విద్యార్థులు 3,696, ఎస్సీ విద్యార్థులు 2,303, బీసీ విద్యార్థులు 10,917, ఓసీ విద్యార్థులు 2155 మంది ఉన్నారు. కౌన్సెలింగ్ షెడ్యూల్.. ఎంపికైన విద్యార్థులకు ఈనెల 19నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. తొలిరోజున మొదటి 500 మంది విద్యార్థులకు, మరుసటి రోజు (ఈనెల 20న) 436 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ ఉంటుందని ఇన్చార్జి వీసీ పేర్కొన్నారు. వికలాంగుల, ఎన్సీసీ కోటా కౌన్సెలింగ్ 22న, స్పోర్ట్స్ కోటా కౌన్సెలింగ్ 24న, ఎన్నారై, ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు 27న కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. ఆయా తేదీలలో కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారికి తిరిగి 29న నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు రాకుంటే వారి స్థానంలో మిగతా వారిని (ఆన్లైన్ సీరియల్ పద్ధతి ప్రకారం) ఎంపిక చేసి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. 30న విద్యార్థులకు కళాశాల గదులు కేటాయింపు ఉంటుందని, జూలై 1 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాకు అత్యధిక సీట్లు.. జోగులాంబ గద్వాల్‌కు అత్యల్పం బాసర ట్రిపుల్‌ఐటీలో విద్యార్థుల ప్రవేశానికి గాను ఈ సారి పోటీ తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా విద్యార్థులు అత్యధికంగా 118 సీట్లు సాధించారు. రెండో స్థానంలో కరీంనగర్ (76), మూడో స్థానంలో సిద్దిపేట (62), నాలుగో స్థానంలో జగిత్యాల (57), తదుపరి స్థానాల్లో వరంగల్అర్బన్ (54), నల్గొండ (44), నిర్మల్ (9), చివరిస్థానంలో జోగులాంబ గద్వాల్ జిల్లా (2)నిలిచినట్లు అధ్యాపకులు పేర్కొన్నారు. -
పోటీకి వెళ్లేందుకు పైసల్లేవు
నాసా మెచ్చిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఆర్థిక కష్టాలు సాక్షి, హైదరాబాద్: ఎంతో కష్టపడ్డారు, నిరంతరం విద్యనభ్యసిస్తూ కొత్త ప్రయోగాలకు ప్రాణం పోశారు. ‘మరో గ్రహంపై మానవుడికి మనుగడ’ అంశంపై బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేసిన ప్రయోగాన్ని నాసా గుర్తించింది. ఈ నెల 25 నుంచి 29 వరకు అమెరికాలో జరిగే నాసా ఎయిమ్స్ స్పేస్ కాంటెస్టుకు రావాలని ఆ విద్యార్థులకు ఆహ్వానం కూడా పంపింది. కానీ ఏం ప్రయోజనం అక్కడికి వెళ్లి భారత్ తరుఫున నాడి వినిపించేందుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డు వచ్చాయి. చేసేదేమీ లేక ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తూ గురువారం సచివాలయానికి వచ్చారు. ఇక్కడా వారి ఆశ ఫలించలేదు, గంటల తరబడి సాయం చేసే మంత్రుల కోసం వేచి చూస్తూ నిరాశకు గురైయ్యారు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వెంకటేష్, విష్ణుప్రియ, రమ్యశ్రీ, ఆకాష్, ప్రణయ్. నాసా ఎయిమ్స్ నిర్వహించిన పోటీల్లో వీరంతా ద్వితీయ బహుమతిని పొందారు. వీరు చేసిన ప్రయోగాన్ని అక్కడ చూపించే క్షణం ఆసన్నమైయినప్పటికీ ఆర్థిక సాయం లేక బిక్కుబిక్కుమంటున్నారు. అమెరికా వెళ్లడానికి ఎంత అవసరం? : ఒక్కో విద్యార్థికి మూడున్నర లక్షల ఖర్చు అవుతుంది. ఈ నిధులు ప్రభుత్వానికి పెద్ద విషయం కాకపోవచ్చు. ఈ మాత్రం నిధులు ఇవ్వడానికి ఎందుకు తాత్సారం చూపుతుందో తెలియడం లేదు. రాష్ట్రం నుంచి నాసాకు విద్యార్థులు ఎంపిక కావటమే పెద్ద గౌరవం. ఇటువంటి వారిని ప్రోత్సహిస్తే తెలంగాణ కీర్తి, ప్రతిష్టలు ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం ఉంటుంది. -
ఈ ఏడాదైనా ప్రారంభమయ్యేనా?
ఎచ్చెర్ల క్యాంపస్: జిల్లాలో తప్పనిసరిగా ట్రిపుల్ ఐటీ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. రాష్ట్రంలోని కడప, నూజివీడు, శ్రీకాకుళం, ప్రకాశం ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో.. మౌలిక సదుపాయాలపై అధికారులు దృష్టిసారించారు. కాగా, ఈ ఏడాది జిల్లాలో ట్రిపుల్ ఐటీ తరగతుల నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 500 మందికి తరగతులు, వసతి ఎలా? గత ఏడాది రాష్ట్రంలో రెండు ట్రిపుల్ ఐటీలను ప్రభుత్వం శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో ప్రారంభించింది. ప్రకాశం జిల్లాలో ట్రిపుల్ ఐటీ తరగతులు వైఎస్సార్ జిల్లా (కడప)లో, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ తరగతులు కృష్ణా జిల్లా నూజివీడులో ప్రారంభించారు. శ్రీకాకుళానికి సంబంధించి ఎచ్చెర్ల సమీపంలోని 21వ శతాబ్ది గురుకుల భవనాలు, 47 ఎకరాలతో పాటు మరో 23 ఎకరాలు ట్రిపుల్ ఐటీ సంస్థకి అప్పగించింది. మరోపక్క నూజివీడులో వసతి ప్రధాన సమస్యగా మారింది. గత ఏడాది ప్రవేశాలు పొందిన 1,000 మంది విద్యార్థులకు తరగతులు అక్కడే నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది ప్రవేశాలు జరిగే 1,000 మందికి మాత్రం ఇక్కడే తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో జూలైలో ప్రవేశాలు, ఆగస్టులో తరగతులు ప్రారంభమవుతాయి. దీంతో వీటిని ఏవిధంగా నిర్వహించాలన్న అంశంపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీకి ప్రభుత్వం కేటాయించిన భవన సముదాయాల్లో 500 మందికి వసతి, తరగతులు నిర్వహించవచ్చు. మరో 500 మందికి వసతి, సౌకర్యం ఎలా కల్పిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోపక్క ఫ్యాకల్టీ, బోధనేతర సిబ్బందికి నివాసాలు వంటి సౌకర్యాలు కల్పించాలి. ప్రభుత్వ సంస్థల్లో నిర్వహణకు నో రాష్ట్ర ట్రిపుల్ ఐటీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ రామచంద్రరాజు, శ్రీకాకుళం డైరెక్టర్ పి.అప్పలనాయుడుతో కూడిన బృందం పలు అంశాలు పరిశీలిస్తోంది. బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ అధికారులతో బృంద సభ్యులు భేటీ అయ్యారు. 500 మందికి వసతి, తరగతుల నిర్వహణకు ఏడాది పాటు భవనాలు అవసరమని వివరించారు. ప్రస్తుతం వర్సిటీ వసతి గృహంలో ఒకరు ఉండాల్సిన గదిలో నలుగురు ఉంటున్నారని, తరగతి గదుల సమస్య కూడా ఉందని వర్సిటీ అధికారులు వివరించారు. ఇక్కడ తరగతుల నిర్వహణ, వసతికి అవకాశం లేదని స్పష్టంచేశారు. ఆర్మ్డ్ రిజర్వు కార్యాలయాన్ని పరిశీలించి, అక్కడి అధికారులతోనూ భేటీ అయ్యారు. తమ వద్ద సౌకర్యాలు కల్పన సాధ్యం కాదని అధికారులు తేల్చి చెప్పేశారు. దీంతో ఇక అద్దె భవనాలపై దృష్టిసారించారు. నిధుల మంజూరుపై సందేహాలు ప్రస్తుత ట్రిపుల్ ఐటీకి రెండు కిలోమీటర్ల దూరంలో చినరావుపల్లి వద్ద మిత్రా ఇంజనీరింగ్ కళాశాల ఉంది. మూతపడ్డ ఈ కళాశాలను లీజ్, అద్దెకు ఇచ్చేందుకు యాజమాన్యం సానుకూలంగా ఉంది. కానీ వసతి, తరగతుల నిర్వహణకు అనుకూలంగా తీర్చిదిద్దాలంటే మరమ్మతులు అవసరం. ఈ నేపథ్యంలో ప్రైవేట్ భవనాల మరమ్మతులకు ప్రభుత్వ నిధులు మంజూరు చేస్తుందా? లేదా? అన్నది అధికారుల సందేహం. మరోపక్క ప్రస్తుతం ట్రిపుల్ ఐటీలో ఇప్పటికిప్పుడు తాత్కాలిక ఏర్పాట్లు కూడా సాధ్యమయ్యే పరిస్థితి కనిపించటం లేదు. -
లెక్కల చిక్కులు!
♦ జేఈఈ మెయిన్ పరీక్షలో 15 వరకు క్లిష్ట ప్రశ్నలు ♦ కెమిస్ట్రీ కాస్త కఠినం.. సులభంగా ఫిజిక్స్ ♦ తగ్గనున్న కటాఫ్ మార్కులు! ♦ ఈనెల 18 నుంచి 22 వరకు వెబ్సైట్లో ‘కీ’ సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఇతర కేంద్ర ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్షలో విద్యార్థులకు లెక్కల తిప్పలు తప్పలేదు. ఎప్పుడూ ఫిజిక్స్‌లో టఫ్ ప్రశ్నలు ఇచ్చేవారు. ఈసారి ఫిజిక్స్ ఈజీగా ఇవ్వగా, మ్యాథమెటిక్స్ ఇబ్బంది పెట్టినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. మ్యాథమెటిక్స్‌లో మొత్తం 30 ప్రశ్నల్లో 8 ప్రశ్నలు అధిక సమయం తీసుకునేవే రావడంతో ఎక్కువ మంది విద్యార్థులు రాయలేకపోయారు. మరో 7 ప్రశ్నలు ఆలోచిస్తే తప్ప రాయలేని విధంగా ఇచ్చినట్లు సబ్జెక్టు నిపుణులు ఎంఎన్ రావు పేర్కొన్నారు. మిగిలిన 15 ప్రశ్నలు మాత్రమే కాస్త సులభంగా ఉండేవి వచ్చినట్లు వెల్లడించారు. గడిచిన రెండుమూడేళ్లలో జేఈఈ మెయిన్ మ్యాథమెటిక్స్ ప్రశ్నల్లో సులభ ప్రశ్నలు 20కి పైగా ఇచ్చేవారు. దీంతో సాధారణ విద్యార్థులు కూడా బాగా రాయగలిగే వారు. కానీ ఈసారి ప్రతిభావంతులు కూడా సమయం సరిపోక ఒకటీ రెండు ప్రశ్నలు రాయలేని పరిస్థితి. కెమిస్ట్రీలో కూడా.. మరోవైపు కెమిస్ట్రీలో కూడా కాస్త ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. మొత్తం 30 ప్రశ్నల్లో 6 ప్రశ్నలు టఫ్‌గా ఉన్నాయని, మిగతా ప్రశ్నలు సులభంగానే ఉన్నాయని పేర్కొంటున్నారు. గతానికి భిన్నంగా ఈసారి ఫిజిక్స్ సులభంగా వచ్చిందని సబ్జెక్టు నిపుణులు రామకృష్ణ తెలిపారు. అయితే మ్యాథమెటిక్స్‌లో ఎక్కువ సమయం తీసుకున్న విద్యార్థులు.. చివరల్లో సమయం సరిపోక ఫిజిక్స్‌లో అన్నింటికి సమాధానాలు గుర్తించలేకపోయారని చెప్పారు. దీంతో ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్ కటాఫ్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. గతేడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు జనరల్ కేటగిరీలో 100 మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా అర్హత సాధించగా, ఈసారి ఇంకా తగ్గే అవకాశం ఉందని, లేదంటే 100 మార్కుల వరకు ఉండవచ్చని చెబుతున్నారు. 95 శాతం విద్యార్థుల హాజరు.. రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష రాసేందుకు 69,467 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 95 శాతం మంది హాజరైనట్లు తెలిసింది. పరీక్ష హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో నిర్వహించారు. హైదరాబాద్ కేంద్రంలో 96 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు సమాచారం. వరంగల్, హన్మకొండలో 17 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా మొదటి పేపర్‌కు 97.5 శాతం, రెండో పేపర్‌కు 94 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మరోవైపు వెబ్సైట్లో ప్రాథమిక కీని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఆదివారమే అందుబాటులో ఉంచుతుందని విద్యార్థులు భావించారు. కాని ఈనెల 18 నుంచి 22 వరకు ‘కీ’ని వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని సీబీఎస్ఈ వెల్లడించింది. అలాగే ఆయా తేదీల్లోనే విద్యార్థుల ఓఎంఆర్ పత్రాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. 8, 9 తేదీల్లో ఆన్లైన్లో జేఈఈ మెయిన్ ఇక ఈనెల 8, 9 తేదీల్లో ఆన్లైన్లో జేఈఈ మెయిన్ పరీక్షను సీబీఎస్ఈ నిర్వహించనుంది. 27న ఫలితాలను వెల్ల డించనుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన 2.20 లక్షల మంది జాబితాను కూడా అదే రోజు ప్రకటించనుంది. ఈనెల 28 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఐఐటీ మద్రాసు ఆన్లైన్లో దరఖాస్తుల ను స్వీకరించనుంది. ఐఐటీల్లో ప్రవేశాల కు మే 21వ తేదీన జేఈఈ అడ్వాన్స్డ్ రాత పరీక్ష నిర్వహించనుంది. -
నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇం జినీరింగ్ ప్రథమ సంవత్సరం సివిల్ బ్రాంచి విద్యార్థిని అన్నారపు వీణ(18) గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసు కుంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురానికి చెందిన వీణ గురువారం ఉదయం తలనొప్పిగా ఉంద ని, తరగతులకు హాజరుకాలేనని స్నేహి తురాలు సంధ్యకి చెప్పిన హాస్టల్‌కి వెళ్లి పోయింది. తరగతుల అనంతరం వీణ రూంకి వెళ్లిన సంధ్యకు... వీణ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న సెక్యూరిటీ వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. వీణ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. -
ట్రిపుల్ ఐటీ విద్యార్థిని మృతి
సిద్దిపేట రూరల్/బాసర: పదిహేను రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన ట్రిపుల్ ఐటీ విద్యార్థిని శ్రీజ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధ వారం రాత్రి మరణించింది. సిద్ది పేటకు చెందిన రాజిరెడ్డి బాల్‌లక్ష్మిల కుమార్తె శ్రీజ(17) నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిఫుల్ ఐటీలో పీయూసీ చదువుతుంది. మానసిక వేదనతో శ్రీజ ఈ నెల 1న ట్రిపుల్ ఐటీలోనే ఆత్మహత్యాయ త్నానికి పాల్పడింది. హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా, 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి చనిపోయింది. కౌన్సెలింగే కారణం.. : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని శ్రీజను తోటి విద్యార్థుల సమక్షంలోనే కమిటీ సభ్యులు కౌన్సెలింగ్ నిర్వహించి మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై కళాశాలలోని బాత్ రూంలో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాగా యాజమాన్యం చర్యల కారణంగానే తమ కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని శ్రీజ నిమ్స్‌లో మృత్యువుతో పోరాడుతుండగానే ఈ నెల 7న శ్రీజ తల్లిదండ్రులు, బంధువులతో కలిసి కళాశాలలో ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపించి శ్రీజ ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ట్రిపుల్ ఐటీ తరగతులు
– జగన్నాథ గట్టులో నిర్మాణపు పనులను పరిశీలించిన కలెక్టర్ కర్నూలు(అగ్రికల్చర్): వచ్చే విద్యాసంవత్సరం నుంచి కర్నూలులోనే ట్రిపుల్ ఐటీ తరగతులు ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న అన్ని ట్రిపుల్ ఐటీల కంటే కర్నూలు ట్రిపుల్ ఐటీని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామన్నారు. మంగళవారం కర్నూలు శివారులోని జగన్నాథగట్టులో ట్రిపుల్ ఐటీ భవన నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. మరో రెండు నెలల్లో తరగతి గదులు, ల్యాబ్, పరిపాలనా భవనం తదితర పనులు పూర్తి చేస్తామని వివరించారు. వచ్చే విద్యా సంవత్సరంలో 100 మంది మహిళలకు, 150 మంది బాలురకు తరగతులు ప్రారంభిస్తామన్నారు. బహుళ అంతస్తుల భవన నిర్మాణపు పనులు జరుగుతున్నాయని వాటిల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి 2018 నుంచి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెస్తామన్నారు. కాంపౌడు వాల్ చుట్టూ మొక్కలు నాటి పెంచి పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలని ఇంజినీర్లను ఆదేశించారు. నిర్మాణపు పనులను మరింత వేగవంతం చేయాలని తెలిపారు. జగన్నాథగట్టులో పెద్దపెద్ద బండరాళ్లు ఉన్నాయని వాటిపై బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలంటే ఇబ్బందిగా ఉందని, 50 ఎకరాల భూమి కెటాయించాలని ఇంజినీరింగ్ అధికారి కోరగా తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట కర్నూలు తహసీల్దారు రమేష్, ట్రిపుల్ ఐటీ సీసీడబ్ల్యూ ఇంజినీర్లు ఉన్నారు. -
విద్యార్థుల 'ట్రిపుల్ ఐటీ' ఆశలు ఆవిరి
వేంపల్లె: ఆర్జేయూకేటీ యూనివర్సిటీ మొదట ఎంపికైన విద్యార్థుల జాబితాను వెబ్సైట్ నుంచి తీసివేసి తాజాగా ఆదివారం రెండవ జాబితా విడుదల చేయడంతో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ, నూజివీడు ట్రిపుల్ ఐటీ పరిధిలో వంద మందికిపైగా విద్యార్థుల ఆశలు ఆవిరయ్యాయి. ట్రిపుల్ ఐటీకి ఎంపికైన ఆనందంలో విద్యార్థులు ఉండగా తాజా జాబితాతో వారి నిశ్చేష్టులయ్యారు. మొదటి జాబితా విడుదల చేసిన అనంతరం మోడల్ స్కూళ్లల్లో చదివే విద్యార్థినులకు 0.4 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మొదట సీట్లు పొందిన విద్యార్థులు రెండో జాబితాలో పేర్లు గల్లంతైన విషయాన్ని చూసుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. సాయంత్రం ఓ జాబితా.. అర్ధరాత్రి మరోజాబితా..! వివరాల్లోకి వెళితే.. ఇడుపులపాయ ఆర్జీయూకేటీ పరిధిలోని కృష్ణా జిల్లా నూజివీడు, కడప జిల్లా ఇడుపులపాయ ఐఐటీల్లో సీట్లు పొందిన విద్యార్థుల జాబితాను శనివారం అధికారులు వెబ్సైట్లో ఉంచారు. అదేరోజు సాయంత్రం కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మోడల్స్కూల్లో చదివిన విద్యార్థులకు 0.4 మార్కులు యాడ్ చేయాలని జీవో వెలువడడంతో శనివారం అర్ధరాత్రి తర్వాత వెబ్సైట్లో రెండో జాబితాను విడుదల చేశారు. దీంతో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో 42 మంది విద్యార్థుల సీట్లు గల్లంతయ్యాయి. ఆర్జీకేయూటీ అధికారులు, ప్రభుత్వం ముందుచూపు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని.. ఇలాంటి చర్యలతో విద్యార్థులు తీవ్ర వేదనకు గురయ్యే అవకాశముందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. -
ట్రిపుల్ఐటీ పిలుస్తోంది
పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రతిభావంతులకు ట్రిపుల్ ఐటీ సువర్ణావకాశం. మధ్య తరగతి విద్యార్థులు ఆరేళ్ల సమీకృత బీటెక్ కోర్సులో చేరే అవకాశం ఇక్కడ లభిస్తుంది. దీనికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆన్లైన్ సోమవారం ప్రారంభమైంది. ఎంపికైన విద్యార్థులకు జూన్, జూలై నెలల్లో కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పించనున్నారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో నూజివీడు, ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ కేంద్రాల్లో రెండు దశల్లో ఈ కౌన్సెలింగ్ ఉంటుంది. సత్తెనపల్లి: జిల్లాలో ఈ ఏడాది 59,478 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 56,345 మంది విద్యార్థుల ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 579 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపి పదికి పది జీపీఏ సాధించారు. వీరితో పాటుగా ప్రతిభావంతులైన మిగిలిన గ్రేడ్లు సాధించిన విద్యార్థులు కూడా ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవచ్చు. దాని ప్రవేశానికి విద్యార్థుల అర్హతను బట్టి ఆన్లైన్ ద్వారా జూన్ 19వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎవరు అర్హులంటే.. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో ప్రతిభావంతులుగా నిలిచిన అన్ని పాఠశాలల విద్యార్థులు అర్హులే. ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో పది చదివిన విద్యార్థులకు 0.4 జీపీఏ అదనంగా కలిపి కౌన్సెలింగ్‌లో ప్రతిభ నిర్ధారిస్తారు. పదో తరగతి తత్సమానమైన పరీక్షల్లో రెగ్యులర్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన వారే అర్హులు. ఈ ఏడాది డిసెంబరు నాటికి 18 ఏళ్ల దాటని విద్యార్థులకు మాత్రమే అర్హత ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వయో పరిమితిలో 21 ఏళ్ల వరకు సడలింపు ఉంది. దరఖాస్తు చేయడమిలా.. ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించాలంటే ఓసీ, బీసీలు రూ. 150, ఎస్సీ, ఎస్టీలు రూ. 100 చెల్లించి ఏపీ ఆన్లైన్ ద్వారా మీసేవ కేంద్రాల నుంచి దరఖాస్తు చేసుకోవాలి. పదో తరగతి హాల్ టికెట్ నంబరు, నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్హత, నివాసం, కులం, పదో తరగతి ఉత్తీర్ణత, ఇతర కోటాలకు సంబంధించిన ఆయా ధ్రువీకరణ పత్రాలు జత చేయాలి. ఎంపిక విధానం పదో తరగతిలో విద్యార్థులు సాధించిన గ్రేడ్ల వారీగా ఎంపిక ఉంటుంది. ఒక వేళ ఎక్కువ మంది విద్యార్థులు ఒకే గ్రేడ్‌లో ఉత్తీర్ణత సాధించి పోటీ పడితే సబ్జెక్టుల వారీగా సాధించిన గ్రేడ్లను పరిగణనలోకి తీసుకుంటారు. అయినా పోటీ అనివార్యమైతే పుట్టిన తేదీ ప్రకారం వయసులో పెద్ద వారిని ఎంపిక చేస్తారు. నూజివీడు, ఇడుపులపాయ, ట్రిపుల్ ఐటీ సంస్థల్లో వెయ్యేసి చొప్పున సీట్లు ఉన్నాయి. వాటి ఆధారంగా వికలాంగులకు మూడు శాతం, సైనిక విభాగంలో రెండు శాతం, ఎన్సీసీ విభాగంలో ఒక శాతం, క్రీడా కోటాలో 0.5 శాతం చొప్పున సీట్లు కేటాయిస్తారు. మిగిలిన వాటిల్లో ఓపెన్ కేటగిరీ ద్వారా ప్రాంతాల వారీగా సీటిస్తారు. రుసుము చెల్లింపులు ఇలా రాష్ట్ర పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఏడాదికి రూ. 36 వేలు ఫీజు చెల్లించాలి. విద్యార్థులు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైతే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగుల పిల్లలు, రీయింబర్స్‌మెంట్‌కు అర్హత లేని విద్యార్థులు తప్పనిసరిగా రుసుము చెల్లించాలి. రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. వెయ్యి, ఎస్సీ, ఎస్టీలు అయితే రూ. 500 చెల్లించాలి. డిపాజిట్ కింద రూ. 2 వేలు చెల్లించాలి. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. వసతి సౌకర్యం ట్రిపుల్ ఐటీలో చేరిన విద్యార్థులకు వసతి, భోజన సదుపాయం, పుస్తకాలు, లాప్‌ట్యాప్, రెండు జతల యూనిఫాం, బూట్లు ఇస్తారు. ప్రభుత్వ రాయితీలను అనుసరించి ఇతర సౌకర్యాలు కల్పిస్తారు. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్ పరీక్షను ఈ నెల 3న నిర్వహించేందుకు సెంట్రల్ బోర్ట్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే పేపర్-1 (బీఈ/బీటెక్) పరీక్షకు, మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే పేపర్-2 (బీ ఆర్క్/ బీ ప్లానింగ్) పరీక్షకు విద్యార్థులు నిమిషం లేటైనా అనుమతించేది లేదని సీబీఎస్ఈ వెల్లడించింది. పరీక్షలను వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని, 59,731 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపింది. పేపర్-1 పరీక్షకు విద్యార్థులను ఉదయం 7 గంటల నుంచి, పేపర్-2 పరీక్షకు మధ్యాహ్నం 1:00 గంట నుంచి హాల్లోకి అనుమతిస్తామని వెల్లడించింది. విద్యార్థులకు అవసరమైన పెన్నులు, పెన్సిళ్లు పరీక్షా హాల్లోనే అందజేస్తారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. -
నాసాకు ట్రిపుల్ఐటీ విద్యార్థుల ఎంపిక
►ప్రాజెక్టుకు పారిజాతగా నామకరణం ►వెళ్లనున్న ముగ్గురు విద్యార్థుల బృందం ►ఆహ్వానం రావడమే తరువాయి ►ఇద్దరు ఈ కళాశాలకు చెందినవారే.. భైంసా/బాసర : చదువుల తల్లి సరస్వతీ నిలయమైన బాసరలోని ట్రిపుల్ఐటీకి చెందిన విద్యార్థులిద్దరు నాసాకు ఎంపికయ్యారు. ఏటా అంతరిక్షంలో మానవ మనుగడపై నాసా ప్రపంచవ్యాప్తంగా ఆలోచనలను తెలిపేందుకు విద్యార్థులను ఆహ్వానిస్తోంది. విద్యార్థులు తమ ఆలోచనలను కొరియర్, ఆన్లైన్లో పంపిస్తున్నారు. నాసా బృందం విద్యార్థుల ఆలోచనలను చూసి వారిని ఆహ్వానిస్తుంది. ఎంపికైన వారు నాసాకు వెళ్లి అక్కడ ప్రపంచ శాస్త్రవేత్తల ముందు అంతరిక్షంలో మానవ మనుగడపై తమ ఆలోచనలను వివరించాలి. వీటిపై పూర్తిస్థాయిలో శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు కూడా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే ఈసారి పలువురు విద్యార్థులను ఎంపిక చేశారు. నాలుగోసారి.. బాసర ట్రిపుల్‌ఐటీలో చదివే విద్యార్థులు ఇప్పటికి నాలుగుసార్లు నాసాకు ఎంపికయ్యారు. అమర్థ్య, ఇంద్రప్రస్తా, శ్రీచక్ర పేరిట తమ ఆలోచనలను వివరించారు. నాసా వేదికగా తాము పంపిన ప్రాజెక్టులను వివరించి శాస్త్రవేత్తల మెప్పు పొందారు. ఇప్పుడు పారిజాత.. ఇప్పటికే మూడు పర్యాయాలు నాసా వెళ్లిన బాసర విద్యార్థులు ఈ ఏడాది కూడా తమ ప్రాజెక్టుకు పారిజాతగా నామకరణం చేశారు. బాసర ట్రిపుల్‌ఐటీలో ఈ-1 చదివే తోల నిహారిక, ఈ-2 చదివే కోన్కటి ప్రశాంత్, కరీంనగర్లో పాలిటెక్నిక్ చదివే త్రిశూల్ ఈ ప్రాజెక్టును రూపొందించారు. బాసర ట్రిపుల్‌ఐటీలో ఫిజిక్స్ లెక్చరర్ రాకేశ్‌రోషన్ గైడ్‌గా వ్యవహరించారు. విద్యార్థుల ఆలోచనలకు పదునుపెట్టి ప్రాజెక్టును రూపొందించారు. ఎంపికైన విద్యార్థులు మే 18 నుంచి 22వ తేదీ వరకు అంతరిక్షంలో మానవమనుగడ అనే అంశంపై శాస్త్రవేత్తల సమక్షంలో నాసాకు వెళ్లి పారిజాత ప్రాజెక్టును వివరించనున్నారు. ఈ ఎంపికపై తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా నుంచి మరొకరు.. మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గ పరి ధిలో గల నంగునూరు మండలంలోని ఘన్పూర్ గ్రామానికి చెందిన ప్రశాంత్ బాసర ట్రిపుల్‌ఐటీలో ఈ-2 చదువుతున్నాడు. నంగునూరు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివిన ఈ విద్యార్థి బాసర ట్రిపుల్‌ఐటీలో సీటు వచ్చింది. తండ్రి ఎల్లయ్య, తల్లి మనమ్మ వ్యవసాయ పనులు చేస్తూ ముగ్గురు పిల్లలను చదివించారు. అందరిలో చిన్నవాడైన ప్రశాంత్ నాసాకు ఎంపికకావడంపై వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులోని అంశాలు ఇవే... బాసర ట్రిపుల్‌ఐటీలో ఉండే విద్యార్థులంతా రూరల్ నుంచి వచ్చిన యూత్ సభ్యులే. ఈ రూరల్ యూత్ నుంచి ఇప్పటికే పలువురు నాసాకు ఎంపికయ్యారు. పారిజాత పేరిట రూపొందిం చిన ఈ ప్రాజెక్టులో అంతరిక్షంలో మానవమనుగడపై విద్యార్థుల బృందం పలు విషయాలను సూచించింది. అంతరిక్షంలో ఎనర్జీ రీసైకిల్న్బిన్, రోబోల వినియోగం, భవన నిర్మాణాలు, భూమిమీద ఉన్న సౌకర్యాలను అంతరిక్షంలో టెక్నాలజీ సహాయంతో ఎలా రూపొందించాలో విద్యార్థులు వివరించనున్నారు. అయితే ఈ మేరకు వారికి ఆహ్వానం అందాల్సి ఉంది. ఎంపిక కావడం సంతోషంగా ఉంది మాది మెదక్ జిల్లా, నంగునూర్ మండలం గన్పూర్ గ్రామం. అమ్మ మణెమ్మ, నాన్న ఎల్లయ్య వ్యవసాయం చేస్తూ నన్ను చదివిస్తున్నారు. నాసాకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. - ప్రశాంత్, మెదక్ అమ్మ కష్టపడి చదివిస్తోంది మాది కరీంగనర్‌లోని మంకమ్మతోట. అమ్మ విజయ, నాన్న మురళి చనిపోయారు. మా అమ్మ టెలర్గా పని చేస్తూ నన్ను చదివిస్తోంది. దీంతో నేను నాసా ప్రాజెక్టులో మొదటి ర్యాంక్ సాధించాను. - నిహారిక, కరీంన గర్ -
పది నుంచే ట్రిపుల్ ఐటీ శిక్షణ
జిల్లాలో 10 జెడ్పీ హైస్కూళ్ల ఎంపిక 2,275 మంది విద్యార్థులకు శిక్షణ బి.కొత్తకోట: గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షకు సిద్ధం చేసేందుకు చర్యలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా జిల్లాలోని పది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు. అందులో చదువుతున్న 2,275 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరికి సంబంధిత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులే శిక్షణ ఇస్తారు. విధివిధానాలను పాఠశాలలకు పంపించారు. ఇంటర్ విద్య పూర్తయ్యాక త్రిబుల్ ఐటీ ప్రవేశ పరీక్ష రాస్తారు. గ్రామీణ విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యేందుకు, అర్హత సాధించేందుకు సరైన శిక్షణ, మార్గదర్శకం లేదు. ఈ మేరకు వారికి శిక్షణ ఇచ్చి ఇంటర్ తర్వాత పరీక్షలకు హాజరయ్యేలా కృషి చేస్తారు. ఆ పాఠశాలలు ఇవే.. జిల్లాలో బి.కొత్తకోట బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 139 మంది, కుప్పం బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 184 మంది, శాంతిపురం ఉన్నత పాఠశాలలో 244 మంది, రేణిగుంట బాలిక ఉన్నత పాఠశాలలో 133 మంది, సత్యవేడు బాలుర ఉన్నత పాఠశాలలో 227 మంది, నరహరిపేట ఉన్నత పాఠశాలలో 252 మంది, రంగంపేట ఉన్నత పాఠశాలలో 129 మంది, ముత్యాలరెడ్డిపల్లె ఉన్నత పాఠశాలలో 201 మంది, శ్రీకాళహస్తి బాలుర ఉన్నత పాఠశాలలో 665 మంది, తుమ్మింద ఉన్నత పాఠశాలలో 104 మంది విద్యార్థులను శిక్షణకు ఎంపిక చేశారు. స్థానిక ఉపాధ్యాయులతో శిక్షణ.. విద్యార్థులకు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులే శిక్షణ ఇస్తారు. ఈనెల 26న శిక్షణ కేంద్రాలను ప్రారంభిస్తారు. పాఠశాలల సమయం ముగిశాక విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో బోధించేందుకు సంబంధిత పాఠశాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. -
వెబ్‌లో జేఈఈ దరఖాస్తుల విధానం
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 3న నిర్వహించనున్న జేఈఈ మెయిన్‌కు వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభించనున్న ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియను జేఈఈ మెయిన్ వెబ్సైట్లో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పొందుపరించింది. అడ్మిషన్ నోటీసులో వివరాలను వెల్లడించింది. అభ్యర్థులు జాగ్రత్తగా వాటిని అనుసరిస్తూ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అభ్యర్థులు అనుసరించాల్సిన ప్రక్రియ * ముందుగా ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. అందులోని అంశాల ప్రకారం అన్ని అర్హతలు ఉన్నాయా లేదా చూసుకోవాలి. * ఆన్లైన్ దరఖాస్తుల ఫార్మాట్లోని అన్ని అంశాలను ముందుగా చూసుకోవాలి. అవసరమైన అన్ని డాక్యుమెంట్లు, సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవాలి. * స్కాన్ చేసిన ఫొటో కాపీలు, స్కాన్ చేసిన సంతకం కాపీ, ఎడమ చేతి బొటన వేలి ముద్రను స్కాన్ చేసిన కాపీలను జేపీఈజీ ఫార్మాట్లో అందుబాటులో ఉంచుకోవాలి. ఆ తరువాత ఆన్లైన్లో దరఖాస్తును పూర్తి చేయాలి. ఫొటో, సంతకం, ఎడమ చేతి బొటన వేలి ముద్ర కాపీలను అప్లోడ్ చేయాలి. * ఆ తరువాత పరీక్ష ఫీజును క్రెడిట్/డెబిట్ కార్డు ఉపయోగించి చెల్లించాలి. లేదా ఈ-చలానా జనరేట్ చేసుకొని, ఫీజు చెల్లించాక ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. * అక్నాలెడ్జ్ స్లిప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రతి విద్యార్థి తన మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని ఆన్లైన్ దరఖాస్తు ఫారంలో కచ్చితంగా పొందుపరుచాలి. -
25 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ
⇒ ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్‌ఐటీలకు ఉమ్మడి షెడ్యూల్ ⇒ తుది ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు ⇒ వచ్చే నెల 20 వరకు అడ్మిషన్లు పూర్తి ⇒ జూలై 16 నుంచే ఐఐటీల్లో తరగతులు ⇒ ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో 23 నుంచి ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్‌ఐటీలన్నింటికీ కలిపి ఈసారి ఉమ్మడిగా ప్రవేశాలను నిర్వహించేందుకు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ తగిన ఏర్పాట్లు చేసింది. తుది ర్యాంకు ఆధారంగా విద్యార్థి ఎంపిక చేసుకునే దాన్ని బట్టి ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో సీట్లను కేటాయించనుంది. ఈ మేరకు కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రకటిస్తూ ఉమ్మడి షెడ్యూల్‌ను సీట్ అలొకేషన్ అథారిటీ జారీ చేసింది. దీని ప్రకారం ఈ నెల 25 నుంచి వెబ్ ఆప్షన్లు మొదలుకానున్నాయి. వచ్చే నెల 20వ తేదీ వరకు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తవుతుంది. 23 నుంచి తరగతులు మొదలవుతాయి. కాగా, ఏ రాష్ట్రంలో ఎన్ఐటీ ఉంటే ఆ రాష్ట్ర బోర్డు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విద్యార్థులకు హోమ్‌స్టేట్ కోటా కింద 50 శాతం సీట్లను కేటాయించనున్నారు. ఐఐటీల్లో సీటు పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆల్ ఇండియా ర్యాంకుతోపాటు అర్హత పరీక్ష అయిన 12వ తరగతి/ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలో టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలి లేదా అర ్హత పరీక్షలో 75 శాతం(జనరల్, ఓబీసీ), ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు 70 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఈ రెండింటిలో ఏ ఒక్క నిబంధనకు అర్హత సాధిం చినా ఐఐటీలో చేరేందుకు అర్హులే. ఆ విద్యార్థి సాధించిన ర్యాంకు ఆధారంగా సీటు కేటాయింపు ఉంటుంది. 24న జేఈఈ మెయిన్ ర్యాంకులు ఎన్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ ర్యాంకులను ఈ నెల 24న సీబీఎస్ఈ వెల్లడించనుంది. దేశవ్యాప్తంగా గత ఏప్రిల్ 4న ఆఫ్‌లైన్‌లో, 10, 11 తేదీల్లో ఆన్లైన్లో జరిగిన పరీక్షల్లో విద్యార్థుల మార్కులను ఏప్రిల్ 27న ప్రకటించింది. ఈ పరీక్షలకు 13.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 1,19,850 మంది పరీక్ష రాశారు. ఇందులో తెలంగాణ నుంచి 66,596 మంది, ఏపీ నుంచి 53,254 మంది పరీక్షకు హాజరయ్యారు. జేఈఈ మెయిన్‌లో విద్యార్థులు సాధించిన స్కోర్‌కు 60 శాతం, ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చి ఆలిండియా ర్యాంకులను సీబీఎస్ఈ ఖరారు చేస్తుంది. సీట్ల వివరాలు ఐఐటీల్లో 10,006 సీట్లు, ఎన్ఐటీల్లో 17,390 సీట్లు, ట్రిపుల్ఐటీల్లో 2,228(చిత్తూరుకు 130, కర్నూలుకు 50 కలిపి) సీట్లు ఉన్నాయి. వీటితోపాటు కేంద్ర ఆర్థిక సహకారంతో కొనసాగే ప్రైవేటు సంస్థల్లో 3,741 సీట్లను కూడా ఈ ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ ద్వారా కేటాయిస్తారు. కాగా, ఎన్ఐటీ సీట్ల విషయంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఎన్ఐటీని పరిగణనలోకి తీసుకోలేదు. ప్రవేశాలకు ఉమ్మడి షెడ్యూల్ ⇒ జూన్ 25 నుంచి 29 వరకు: కాలేజీలను ఎంచుకునేందుకు విద్యార్థులకు వెబ్ ఆప్షన్లు ⇒ 28: విద్యార్థుల ఆప్షన్లను బట్టి మాక్ సీట్ అలొకేషన్ ⇒ 30: ఐఐటీ/ఎన్ఐటీల్లో సీట్ల కేటాయింపు ⇒ జూలై 1: మొదటి దశ సీట్ల కేటాయింపు ప్రకటన ⇒ 2 నుంచి 6 వరకు: విద్యార్థుల నుంచి అంగీకారం తీసుకోవడం. ⇒ 7: భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్లు ప్రకటన, రెండో దశ సీట్ల కేటాయింపు. ⇒ 8 నుంచి 11 వరకు: విద్యార్థుల అంగీకారం తీసుకోవడం. ⇒ 12: భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల వివరాలు ప్రకటన, మూడో దశ కౌన్సెలింగ్ ⇒ 13 నుంచి 15 వరకు: విద్యార్థుల అంగీకారం తీసుకోవడం. ⇒ 16: ఐఐటీ, ఐఎస్‌ఎంల్లో తరగతులు ప్రారంభం. ⇒ 16: భర్తీ అయిన, మిగిలిన సీట్ల వెల్లడి, నాలుగో దశ కౌన్సెలింగ్. ⇒ 17 నుంచి 20 వరకు: విద్యార్థుల నుంచి అంగీకారం తీసుకోవడం. ⇒ 23 నుంచి: ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీల్లో తరగతులు ప్రారంభం -
ఉమ్మడి ప్రవేశాలకు అందుబాటులో సీట్లు
- ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐటీలలో ఒకేసారి ప్రవేశాలు - ఇందుకు జాయింట్ అలొకేషన్ అథారిటీ ఏర్పాటు - ఏపీకి ప్రకటించని ఎన్ఐటీ సీట్ల వివరాలు సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐటీలు అన్నింటిలో ఒకేసారి ప్రవేశాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీని ఏర్పాటు చేసింది. దీని ఆధ్వర్యంలోనే ప్రవేశాలు చేపట్టనుంది. ఎన్ఐటీ సీట్ల విషయంలో అన్ని రాష్ట్రాలకు చెందిన సీట్ల వివరాలను అందుబాటులో ఉంచినా ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఎన్ఐటీని, అందులోని సీట్ల వివరాలను మాత్రం పొందుపరచలేదు. సీట్ల కేటాయింపు అథారిటీ ప్రకటించిన వివరాల ప్రకారం ఐఐటీల్లో 10,006 సీట్లు, ఎన్ఐటీల్లో 17,390 సీట్లు, ట్రిపుల్ఐటీల్లో 2,228 (చిత్తూరుకు 130, కర్నూలుకు 50 సీట్లు) సీట్లు ఉన్నట్లు పేర్కొంది. వీటితోపాటు కేంద్ర ఆర్థిక సహకారంతో కొనసాగే ప్రైవేటు సంస్థల్లో 3,741 సీట్లను ఈ ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు చేపట్టనుంది. ఇదీ ప్రవేశాల షెడ్యూలు జూన్ 18: జేఈఈ అడ్వాన్స్డ్ ఆలిండియా ర్యాంకుల ప్రకటన జూన్ 24: జేఈఈ మెయిన్ ఆలిండియా ర్యాంకులు జూన్ 25- 29: విద్యార్థులు కాలేజీలను ఎంచుకునేందుకు ఆప్షన్లు (ఛాయిస్). జూన్ 28: విద్యార్థుల చాయిస్‌ను బట్టి మాక్ సీట్ అలొకేషన్ ప్రదర్శన. జూన్ 30: ఐఐటీ/ఎన్ఐటీల్లో సీట్ల కేటాయింపు, పరిశీలన. జూలై 1: మొదటి దశ సీట్ల కేటాయింపు ప్రకటన. జూలై 2-6: విద్యార్థుల నుంచి అంగీకారం తీసుకోవడం. జూలై 7: భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల ప్రకటన. జూలై 7: రెండో దశ సీట్ల కేటాయింపు. జూలై 8-11: విద్యార్థుల అంగీకారం తీసుకోవడం. జూలై 12: భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల వివరాల ప్రకటన. జూలై 12: మూడో దశ సీట్లు కేటాయింపు. జూలై 13-15: విద్యార్థుల అంగీకారం తీసుకోవడం. జూలై 16: ఐఐటీల్లో తరగతులు ప్రారంభం. జూలై 16: భర్తీ అయిన, మిగిలిన సీట్ల వివరాలు ప్రకటన. జూలై 16: నాలుగో దశ సీట్ల కేటాయింపు జూలై 17-20: విద్యార్థుల నుంచి అంగీకారం తీసుకోవడం. 23 నుంచి: ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో తరగతులు ప్రారంభం. ఇవీ ఐఐటీల వారీగా తాజా సీట్లు.. భువనేశ్వర్ (180), ముంబై (903), మండీ (145), ఢిల్లీ (851), ఇండోర్ (120), ఖరగ్‌పూర్ (1341), హైదరాబాద్ (220), జోథ్‌పూర్ (120), కాన్పూర్ (853), చెన్నై (838), గాంధీనగర్ (150), పట్నా (200), రూర్కీ (1030), ధన్‌బాద్ (935), రోపార్ (130), వారణాసి(బీహెచ్‌యూ) (1090), గువాహటి (660), పలక్కడ్(120), తిరుపతి (120)- మొత్తం (10,006) -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్
* పేద విద్యార్థులకు సదవకాశం * దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం భైంసా : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక ట్రిపుల్ఐటీ బాసరలో ప్రవేశాల ప్రక్రియకు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. మన రాష్ట్రంలో మొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో గురువారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. పదో తరగతి ఉత్తీర్ణులైన పల్లె విద్యార్థులకు అత్యుత్తమ ఐటీ విద్యన ందించే లక్ష్యంతో ఆర్జేయూకేటీ ట్రిపుల్‌ఐటీలో విద్యార్థుల ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక బాసర ట్రిపుల్‌ఐటీలో 1000 సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించి గురువారం నుంచి జూన్ 19 వరకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని ఇప్పటికే యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు రాష్ట్రపతి, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 85 శాతం సీట్లు, 15శాతం అన్రిజర్డ్వ్ సీట్లను కేటాయించారు. దరఖాస్తు చేసుకునే విధానం... ట్రిపుల్‌ఐటీలో చేరాలనుకునే విద్యార్థులు ఆన్లైన్ ప్రక్రియలో ఆర్జీయూకేటీకి దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్ www.rgujt.inలో adm issions2015.rgukt.in ద్వారా అప్లికేషన్లను నమోదు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రతి వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. అందులోని కాలంలో అడిగే వివరాలు పూర్తి చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. బాసర ట్రిపుల్ఐటీ క్యాంపస్ పేరును నమోదు చేయాలి. అనంతరం ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తు ప్రింట్ తీసుకుని పదో తరగతి ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీలు, రూ.150 విలువ గల బ్యాంకు డిమాండ్ డ్రాఫ్ట్‌ను ఒరిజినల్ జత పరిచి, రిజిస్ట్రార్ ట్రిపుల్ఐటీ క్యాంపస్ గచ్చిబౌలి హైదరాబాద్ చిరునామాకు రిజిస్ట్రార్ ద్వారా లేదా స్పీడ్ పోస్టు ద్వారా పంపాలి. వెనుకబడిన విద్యార్థులు రూ.100 డిమాండ్ డ్రాఫ్ట్ జత చేస్తే సరిపోతుంది. జీపీఏ సమానంగా ఉంటే... దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జీపీఏ సమానంగా ఉంటే గ్రేడ్ పాయింట్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఒకేరకమైన పాయింట్లు ఉన్న వారు వేలల్లో ఉంటారు. అలాంటప్పుడు గణితంలో ఎక్కువ మార్కులు ఉన్నవారికి మొదటిప్రాధాన్యం ఇస్తారు. అక్కడ కూడా సమానంగా ఉంటే భౌతికశాస్త్రం.. అప్పు డూ సమానమైతే రసాయనశాస్త్రం చివరగా ఆంగ్లం మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. అప్పటికీ ఎక్కువ మంది సమానంగా ఉంటే పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ వయసు ఉన్న వారికి ప్రవేశం కల్పిస్తారు. ప్రవేశం తర్వాత... ట్రిపుల్‌ఐటీలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆరేళ్ల కోర్సు ఉంటుంది. మొదటి రెండేళ్లు ప్రీ యూనివర్సిటీ కోర్సు(పీయూసీ) ఉంటుంది. ఇది ఇంటర్మీడియట్‌తో సమానం. రెండేళ్ల కోర్సు తర్వాత ఇక్కడ చదివే విద్యార్థులకు అవకాశాలు వస్తే బయటకు వెళ్లిపోవచ్చు. వారికి పీయూసీ ఉత్తీర్ణత పత్రం ఇస్తారు. మిగిలిన నాలుగేళ్లు ఇంజినీరింగ్ విద్య ఉంటుంది. నాలుగేళ్ల బీటెక్ కోర్సును సెమిస్టార్ విధానం ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది. బీటెక్‌లో ఆర్జీయూకేటీ సివిల్, కెమికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఈసీఈ, ఎంఎంఈ కోర్సులు అందిస్తోంది. పీయూసీలో సాధించిన మార్కులే బీటెక్‌లో కోర్సుల కేటాయింపునకు కీలకం అవుతాయి. ట్రిపుల్‌ఐటీల ప్రధాన లక్ష్యం ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కావడంతో ఎక్కువ మంది విద్యార్థులు కోర్సు ఇక్కడే పూర్తిచేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. బోధన రుసుము.. గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఇంజినీరింగ్ విద్యను అందించే ఉద్దేశంతో ప్రారంభించిన ట్రిపుల్ఐటీల్లో కుటుంబ ఆదాయం రూ.లక్షలోపు ఉంటే ప్రభుత్వమే ఉచితంగా విద్యా, వసతి కల్పిస్తుంది. లక్షలోపు ఆదాయం ఉన్న విద్యార్థులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం రూ.3 వేలు కాషన్ డిపాజిట్ చెల్లించాలి. కోర్సు పూర్తయ్యాక అది విద్యార్థులకే తిరిగి ఇచ్చేస్తారు. లక్ష ఆదాయం దాటిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఏడాదికి రూ.36 వేలు బోధన రుసుము చెల్లించాలి. మేజర్‌తోపాటు మైనర్ సబ్జెక్టు... బీటెక్‌లో ప్రవేశించాక విద్యార్థులు ఆరు శాఖల్లో ఒక దానిని ప్రధాన(మేజర్) సబ్జెక్టుగా ఎంచుకుంటారు. దీంతోపాటు తప్పని సరిగా విద్యాంతర నైపుణ్యాలు పొందేందుకు మైనర్ సబ్జెక్టును ఎంచుకోవాలి. ఇందులో సంగీతం, నృత్యం, హ్యూమానిటిస్, గణితం, ఇంజినీరింగ్ సైన్స్ వంటి వాటిలో ఒకదానిని ఎంచుకోవచ్చు. మేజర్ డిగ్రీతోపాటు అదనంగా యూనివర్సిటీ మైనర్ డిగ్రీని విద్యార్థులకు ప్రదానం చేస్తుంది. ప్రవేశానికి అర్హతలు... పదో తరగతి లేదా దానికి సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. 2015 సంవత్సరంలో రెగ్యూలర్ విద్యార్థులుగా మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులు కావాలి. డిసెంబర్ 31, 2015 నాటికి 18 ఏళ్ల వయసు దాటకూడదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 21 సంవత్సరాల వరకు మినహాయింపు ఉంది. ఎంపిక ప్రక్రియ... ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివిన వారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వెనుకబాటు సూచి కింద 0.4 జీపీఏ అదనంగా కలుపుతారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివిన వారికి వెనుకబాటు సూచి పాయింట్లు ఉండవు. వచ్చిన దరఖాస్తుల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల వడపోతను ఆరంభిస్తారు. అనంతరం పదో తరగతి జీపీఏ ఆధారంగా రిజర్వేషన్లను పాటిస్తూ విద్యార్థులను ఎంపిక చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలోనూ అన్ని మండలాలకు ప్రాతినిధ్యం ఉండేలా అధికారులు ఎంపిక ప్రక్రియ చేపడుతారు. ఎంపికైన విద్యార్థులకు ఉత్తరాలు, సెల్‌ఫోన్ ద్వారా సమాచారం అందజేస్తారు. -
ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ట్రిపుల్ ఐటీల ప్రవేశానికి సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్జేయూకేటీ (రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక యూనివర్సిటీ వైస్ చాన్సులర్ సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు. హైదరాబాద్, బాసర, ఇడుపులపాయ, నూజివీడులో ప్రవేశాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.విద్యార్థులకు దరఖాస్తులు ఆన్లైన్లో లభ్యం అవుతాయి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూన్ 19వ తేదీ. రెండు రాష్ట్రాల్లో 85 శాతం స్థానికత, 15 శాతం ఓపెన్ కేటగిరి ద్వారా విద్యార్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. -
లభ్యం కాని ట్రిపుల్ఐటీ విద్యార్థి ఆచూకీ
రంగంలోకి రెండు పోలీసు బృందాలు నూజివీడు : నూజివీడు ట్రిపుల్ ఐటీ నుంచి వెళ్లిపోయిన ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి పువ్వల కిరణ్‌ప్రసాద్ ఆచూకి కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పట్టణ ఎస్సై బోనం ఆదిప్రసాద్ నేతృత్వంలో ఒక బృందం, స్థానిక సీసీఎస్ ఎస్సై భాస్కరరావు నేతృత్వంలో మరో బృందం పలు ప్రాంతాలకు వెళ్లి విద్యార్థి కోసం గాలిస్తున్నాయి. కిరణ్‌ప్రసాద్ తన ఫోన్‌ను ట్రిపుల్‌ఐటీలోనే వదిలివెళ్లడంతో అతని ఆచూకీ కోసం పోలీసులు కష్టపడాల్సి వస్తోంది. విజయవాడతో పాటు విద్యార్థి స్వగ్రామం కలిదిండి మండలం మూలలంకకు కూడా పోలీసులు వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి వెళ్లిపోయి రెండు రోజులైనా ఆచూకి లభ్యం కాకపోవడంతో అతని మిత్రులు, తల్లిదండ్రులు, బంధువుల ఫోన్లపై నిఘా ఉంచారు. ఒకవేళ ఎక్కడి నుంచైనా వారికి కిరణ్‌ప్రసాద్ ఫోన్ చేస్తే ముందు ఏ ప్రాంతంలో ఉన్నాడనేది తెలుస్తుందనే ఉద్ధేశ్యంతో ఈ దిశగా నిఘా ఉంచారు. ఫేస్బుక్ ఎక్కౌంట్లు, తను వదిలివెళ్లిన ఫోన్లోని వాట్సప్‌లో ఉన్న ఫోన్ నెంబర్లను కూడా పరిశీలిస్తున్నారు. ఫోన్‌ను వదిలివెళ్లిన నేపథ్యంలో ఇలా ఎందుకు చేశాడనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ట్రిపుల్‌ఐటీలో నిర్వహించిన ఆందోళనలలో తనవంతు పాత్ర పోషించిన నేపథ్యంలో యాజమాన్యం ఏమైనా చర్య తీసుకుంటుందేమోననే భయంతో ఈ విధంగా చేశాడా అని కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల ఆందోళన నిరుపేద కుటుంబానికి చెందిన కిరణ్‌ప్రసాద్ ట్రిపుల్ఐటీ నుంచి వెళ్లిపోవడంతో అతని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రెండు రోజులుగా స్థానిక పట్టణ పోలీసుస్టేషన్ వద్దకు వచ్చి తమ కుమారుడి ఆచూకి ఏమైనా లభ్యమైందా అని పోలీసులను ప్రాధేయపడుతున్నారు. కూలిపనులు చేసుకునే తాము తమ కుమారుడు ఇంజినీరింగ్ చదువుకుంటున్నాడంటే ఎంతో ఆనందపడ్డామని, ఇంతలో ఇలా జరగడమేమిటని కన్నీటిపర్వంతమవుతున్నారు. వీరితో పాటు తమ్ముడు కూడా ఆవేదన చెందుతున్నాడు. ఎక్కడున్నా తల్లి ఆరోగ్యం సరిగా లేనందున వెంటనే ఇంటికి వచ్చేయాలని తండ్రి దుర్గారావు, తమ్ముడు రాజ్‌కుమార్ ప్రాధేయపడుతున్నారు. -
గేట్లో ఏపీ విద్యార్థి టాప్
వైఎస్సార్ జిల్లాకు చెందిన చంద్రకాంత్‌రెడ్డికి మొదటి ర్యాంక్ బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థి ప్రశాంత్‌కి 65వ ర్యాంక్ సాక్షి, హైదరాబాద్/ఆర్మూర్, రాయచోటి: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)-2015 ఫలితాల్లో జాతీయ స్థాయిలో వైఎస్సార్ జిల్లా రాయచోటికి చెందిన విద్యార్థి చంద్రకాంత్‌రెడ్డి జియో ఫిజిక్స్ విభాగంలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. అతని తల్లిదండ్రులు రాణెమ్మ, మునిరెడ్డి ఇద్దరూ ఉపాధ్యాయులే. ఇక గురువారం విడుదలైన ఈ ఫలితాల్లో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి ప్రశాంత్ ఈసీఈ విభాగంలో జాతీయ స్థాయిలో 65వ ర్యాంకు సాధించాడు. ప్రశాంత్ 100 మార్కులకుగాను 69 మార్కులు పొందాడు. ఇతనితోపాటు మరో 30 మంది ట్రిపుల్ఐటీ విద్యార్థులు ర్యాంకులు సాధించినట్లు తెలిసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన శ్రీనితిన్ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో 132వ ర్యాంకు సాధించాడు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన శ్రీనితిన్ 67.27 శాతం, 832 మార్కులతో ఈ ర్యాంకు సాధించారు. దేశవ్యాప్తంగా జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వరకు పలు తేదీల్లో నిర్వహించిన గేట్ పరీక్షలకు తెలంగాణ నుంచి 30 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు ఫలితాల స్కోర్ కార్డులను 27 నుంచి 29 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఐఐటీ కాన్పూర్ ప్రకటించింది. -
ట్రిపుల్ ఐటీలో రూ.10 కోట్లతో ఇండోర్ స్టేడియం
వేంపల్లె : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో రూ.10 కోట్లతో ఇండోర్ స్టేడియాన్ని నిర్మిస్తున్నట్లు ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సత్యనారాయణ వెల్లడించారు. 14వ తేదీనుంచి 16వ తేదీవరకు ట్రిపుల్ ఐటీలో నిర్వహించనున్న టెక్ ఫెస్టివల్‌పై బుధవారం డెరైక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ఏవో విశ్వనాథరెడ్డి, ఎఫ్‌వో కె.ఎల్.ఎన్.రెడ్డి, స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రభాకర్‌రెడ్డిలతో చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులు తమ సమస్యలు తీర్చమని కోరడం మంచిదే కానీ.. సమంజసం కానీ డిమాండ్లను తీర్చాలని పట్టుబట్టడం సరికాదన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం తాము అన్నివిధాలా కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా వారి సమస్యలను తెలుసుకునేందుకు శాంతి కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కమిటీలో డెరైక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ఏఎస్పీ అన్బురాజన్, సీఐ మహేశ్వరరెడ్డి, ఏవో విశ్వనాథరెడ్డి, వివిధ విభాగాలకు చెందిన అధ్యాపకులు ఉంటారన్నారు. నెలకొకసారి సమావేశమై ఇక్కడి సమస్యలను తమకు తెలియజేసే విధంగా ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రస్తుతం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో రూ. 90 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. డిజిటల్ లైబ్రరీ, ల్యాబొరేటరీలు, ఇండోర్ స్టేడియం ఇందులో ఉన్నాయన్నారు. యూనిఫాం కోసం టెండర్లు పిలిచామన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకానికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. అన్ని ట్రిపుల్ ఐటీల్లో వైఫై సౌకర్యం కల్పించాలనిన సీఎం చెప్పారన్నారు. రూ.10 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఇండోర్ స్టేడియంలో వాలీబాల్, షటిల్, బాస్కెట్ బాల్, యోగా సెంటర్ ఉంటాయన్నారు. రూ. 60 లక్షలతో వాషింగ్ మిషన్‌ను కొనుగోలు చేశామన్నారు. తాగునీటి సౌకర్యం బాగుందన్నారు. అవసరం ఉన్న చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగులకు బయో మెట్రిక్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. టెక్ ఫెస్టివల్‌కు మంత్రి ఘంటా రారు.. ఈనెల 14వ తేదీనుంచి 16వ తేదీవరకు ట్రిపుల్ ఐటీలో జరగనున్న టెక్ ఫెస్టివల్‌కు సాంకేతిక విద్యా శాఖ మంత్రి ఘంటా శ్రీనివాసరావు రావడం లేదని వైస్ చాన్సలర్ సత్యనారాయణ తెలిపారు. అనివార్య కారణాలవల్ల ఆయన పర్యటన వాయిదా పడిందన్నారు. టెక్ ఫెస్టివల్‌కు సంబంధించి వలంటీర్లతో ఆయన మాట్లాడారు. షెడ్యూల్‌ను పరిశీలించారు. అనంతరం పీ2 విద్యార్థుల తరగతి గదిలోకి వెళ్లి బోధన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. సమస్యల గురించి ఆరా తీశారు. ట్రిపుల్ ఐటీలో చదివిన విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని.. సక్రమంగా చదువుకొని భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. -
బడ్జెట్ పైనే.. పట్టాల ఆశలు
‘ఈటెల'బడ్జెట్ నిధులు జిల్లాకు వచ్చేనా..! ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌పై జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నా రు. బడ్జెట్ కేటాయింపుల్లో వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం దక్కుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా అసంపూర్తిగా నిలిచిన సాగునీటి ప్రాజెక్టులు, చదువుల తల్లి కొలువైన బాసరలోని ట్రిపుల్ఐటీ వంటి రంగాలకు నిధుల కేటాయింపుల్లో పెద్దపీట వేయాలని కోరుతున్నారు. జిల్లాకు ఏకైక దిక్కై న రిమ్స్ వైద్యాసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని జిల్లా వాసులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రధాన అంశాలపై కథనం.. - సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ల్లాలో మూడు భారీ నీటి పారుదల ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పేరున్న ప్రాణహిత-చేవెళ్ల, శ్రీపాద ఎల్లంపల్లి, గూడెం ఎత్తిపోతల పథకం వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతోంది. ఇందులో ఎల్లంపల్లి ప్రాజెక్టు పనులు దాదాపు 95 శాతం పూర్తి కాగా, గూడెం ఎత్తిపోతల పథకాల పనులు కూడా వివిధ దశల్లో ఉన్నాయి. కేసీఆర్ సర్కారు ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే ఆయకట్టుకు సాగునీరందే అవకాశాలున్నాయి. ఈ మేరకు బడ్జెట్లో కేటాయింపులు చేపట్టాలని జిల్లా వాసులు పేర్కొంటున్నారు. మధ్యతరహా ప్రాజెక్టులు.. కొమురంభీమ్, పెద్దవాగు డైవర్షన్ పథకం, గొల్లవాగు, నీల్వాయి, ర్యాలీవాగు వంటి మధ్యతరహా ప్రాజెక్టుల పనులు కూడా నిలిచిపోయాయి. వీటి నిర్మాణం పూర్తిచేస్తే వాటి కింద ఉన్న సుమారు రెండు లక్షలకు పైగా బీడు భూములు సాగులోకి వస్తాయి. కేటాయింపుల్లో ఈ పనులకు ప్రాధాన్యమిస్తే ఆయకట్టు రైతులకు లబ్ధి చేకూరనుంది. స్వర్ణ, సాత్నాల, గడ్డెన్నవాగు, మత్తడివాగు వంటి ప్రాజెక్టుల నిర్వహణకు కూడా నిధులు కేటాయించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. పెన్‌గంగపై చిగురిస్తున్న ఆశలు.. మహరాష్ట్ర-తెలంగాణ అంతర రాష్ట్ర ప్రాజెక్టు పెన్‌గంగపై ఆయకట్టు రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేసీఆర్ సర్కారు ఈ ప్రాజెక్టు నిర్మాణం దిశగా అడుగులు వేస్తుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ స్వయంగా మహారాష్ట్ర ముఖ్యమంతి ఫడణవీస్‌తో జరిపిన చర్చల్లో పెన్‌గంగ ప్రాజెక్టు కూడా ప్రధాన అంశం. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. బాసర ట్రిపుల్ ఐటీకి.. గ్రామీణ ప్రాంతాల్లో విద్యనభ్యసించే నిరుపేద విద్యార్థులకు ఉన్నత సాంకేతిక విద్యను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో బాసర వద్ద ఏర్పాటు చేసిన ట్రిపుల్ఐటీ సమస్యలకు నిలయంగా మారింది. ఏళ్లు గడుస్తున్నా శాశ్వత భవనాల నిర్మాణం పూర్తికావడం లేదు. అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. అరకొర సిబ్బందితో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏటా బడ్జెట్ కేటాయింపులు కనీసం నిర్వహణకు కూడా సరిపోవడం లేదు. దీంతో ఈ ఉన్నత విద్యా సంస్థ అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. విద్యార్థులు సమస్యలతో కాలం వెళ్లదీయూల్సి వస్తోంది. ఈ ఏడాది కేటాయింపులపై ట్రిపుల్ఐటీ విద్యార్థులు కోటి ఆశలు పెట్టుకున్నారు. రిమ్స్ అభివృద్ధికి.. నిరుపేదలకు ఏకైక దిక్కయిన ఆదిలాబాద్ రిమ్స్ (రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్)లో వైద్యం అందని ద్రాక్షగా మారింది. వైద్యుల, పరికరాల కొరత, పారిశుధ్య లోపం, అరకొర వసతులు వెరసి రోగుల పాలిట శాపంగా మారాయి. అత్యవసర సమయాల్లో రెఫర్ ఒక్కటే మార్గమైంది. రిమ్స్‌కు మొత్తం 155 వైద్య పోస్టులు మంజూరైతే ఇందులో కేవలం 45 మంది వైద్యులే పనిచేస్తున్నారంటే ఇక్కడ అందుతున్న వైద్యం తీరును ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రమాదాల్లో గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందించే ట్రామకేర్ సెంటర్ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. సెంటర్ ఆక్సిజన్ ప్లాన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం దాదాపు రూ.కోటి నిధులు మంజూరైనా పనులు పూర్తి కాలేదు. స్ట్రెచర్లు, వీల్చైర్లు, సెలైన్ స్టాండ్లు లేకపోవడంతో రోగిని బంధువులే చేతులపై ఎత్తుకొని తీసుకెళ్తున్నారు. ఈ రిమ్స్ అభివృద్ధి దిశగా కేటాయింపులు ఉండేలా చూడాలని జిల్లా వాసులు కోరుతున్నారు. -
అట్టుడికిన ట్రిపుల్ ఐటీ
వేంపల్లె : ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన తార స్థాయికి చేరింది. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. ఆర్డీఓ, వీసీ, మంత్రి ఘంటా శ్రీనివాసరావు రంగంలోకి దిగి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా, గతంలో ఇలాంటి హామీలెన్నో ఇచ్చారని విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తక్షణమే తమ డిమాండ్ల పరిష్కారానికి ఉపక్రమిస్తేనే ఆందోళన విరమిస్తామంటున్నారు. సోమవారం ప్రారంభమైన ఆందోళన మంగళవారం రాత్రి పొద్దుపోయేదాకా కొనసాగింది. తన వద్దకు చర్చలకు వస్తే సరి.. లేదంటే ఇంటికి పంపుతామని వీసీ హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే.. ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో అవినీతి రాజ్యమేలుతోందని, తమ అభ్యున్నతి కోసం కృషి చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను నీరు గారుస్తున్నారని, తమ సమస్యలు పట్టించుకునే వారే లేరని సోమవారం విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వీరన్నగట్టుపల్లె క్రాస్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. ట్రిపుల్ ఐటీ అధికారుల చర్చలు సఫలం కాకపోవడంతో మంగళవారం కూడా ఆందోళన కొనసాగింది. కలెక్టర్ ఆదేశాల మేరకు జమ్మలమడుగు ఆర్డీవో వినాయకం ఇక్కడికి చేరుకొని విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు విషయాలను ఆయన దృష్టికి తెచ్చారు. ట్రిపుల్ ఐటీలో అడ్మినిస్ట్రేషన్ అధికారులంతా అవినీతికి పాల్పడుతున్నారని, విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని వాపోయారు. క్యాంటిన్ నుంచి ఫ్యాన్సీ స్టోర్ ఏర్పాటు చేసేవరకు భారీగా కమీషన్లు తీసుకుంటున్నారని. మరికొంత మంది అధికారులకు వాటిలో భాగస్వామ్యం ఉందని చెప్పారు. అందువల్ల వస్తువులను అధిక రేట్లకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఐడెంటిటి కార్డులు, ఇతర అవసరాల కోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.వెయ్యి వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇతర యూనివర్సిటీలకు రూ.50 కోట్ల నిధులు వస్తే.. ట్రిపుల్ ఐటీలకు వందల కోట్లు నిధులు మంజూరవుతున్నా.. ఇక్కడి అధికారులు నాణ్యమైన విద్య అందించకుండా స్వాహా చేస్తున్నారని ధ్వజమెత్తారు. డిమాండ్ల పరిష్కారం కోసం రెండు రోజులుగా ధర్నా చేస్తున్నా.. ట్రిపుల్ ఐటీ అధికారులు వేణుగోపాల్‌రెడ్డి, ఏవో విశ్వనాథరెడ్డి, కె.ఎల్.ఎన్.రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి ఇక్కడికి వచ్చి సమస్య అడిగిన పాపానపోలేదని తెలిపారు. మెస్ నుంచి భోజనం వస్తుంటే అడ్డుకునేందుకు కొందరు అధికారులు ప్రయత్నించారంటే విద్యార్థులపై వారికి ఎంత కసి ఉందో స్పష్టమవుతోందన్నా రు. నాలుగేళ్ల నుంచి యూనిఫాం ఇవ్వడంలేద, ఒకే జతతో కళాశాలకు వెళుతున్నామని చెప్పారు. తాగు నీరు, క్లీనింగ్, లైటింగ్, సరైన భోజనం లేక ఎన్నిమార్లుర విన్నవించినా ఫలితం లేదన్నారు. వారి సమస్యలు విన్న ఆర్డీవో వినాయకం విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వీసీ సత్యనారాయణ స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించబోమని రోడ్డుపై బైఠాయించారు. విద్యార్థులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి ఘంటా.. విద్యా శాఖ మంత్రి ఘంటా శ్రీనివాసరావు ఇక్కడ ఆందోళన చేస్తున్న విద్యార్థులతో మంగళవారం ఉదయం ఫోన్లో మాట్లాడారు. శాసనమండలి డిప్యూటీ చెర్మైన్ సతీష్‌రెడ్డి జోక్యం చేసుకొని మంత్రి ఘంటా శ్రీనివాసరావుతో ఫోన్లో మాట్లాడించారు. తాను ఈ నెల 15 ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి వస్తానని, అప్పుడు సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరిస్తేనే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు తేల్చి చెప్పారు. విద్యార్థులతో ఏఎస్పీ అన్బురాజన్ చర్చలు పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్ మంగళవారం సాయంత్రం విద్యార్థులతో చర్చలు జరిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులు రోడ్డుపై ధర్నాకు దిగడం మంచిది కాదన్నారు. సమస్యలు పరిష్కారమయ్యేలా తానూ కృషి చేస్తానని చెప్పారు. గతంలో చాలా మంది అధికారులు ఇలానే చెప్పారని విద్యార్థులు ఆందోళనను కొనసాగించారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకొనేందుకు వీసీ ట్రిపుల్ ఐటీకి వచ్చారని.. అక్కడికి వెళ్లి సమస్యలు విన్నవించుకోవాలని అధికారులు తెలుపగా, వీసీ ఇక్కడికే రావాలని పట్టుబట్టారు. కాగా, విద్యార్థుల ఆందోళనకు వివిధ పార్టీలు, విద్యార్థి సంఘాల నేతలు మద్దతుగా నిలిచారు. వైఎస్ఆర్ సీపీకి చెందిన ఎంపీపీ రవికుమార్‌రెడ్డి, మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, అయ్యవారిపల్లె రామగంగిరెడ్డి, టోపివల్లి, గండి దేవస్థాన మాజీ చెర్మైన్ కావలి విజయ్‌కుమార్, మాజీ ఉప సర్పంచ్ చలపతి, కేకే, టీడీపీ నాయకులు భాస్కర్‌రెడ్డి, బీజెపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు బ్రహ్మం తదితరులు విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. కాగా, ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను వైఎస్ఆర్సీపీ అధినేత, శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని వేంపల్లె మండలాధ్యక్షుడు రవికుమార్‌రెడ్డి, మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు క్యాంపస్‌లోకి రావాలి : వీసీ సత్యనారాయణ ట్రిపుల్ ఐటీ విద్యార్థుల డిమాండ్లు సమంజసంగా లేవని, వారి ఆరోపణలు అర్థరహితంగా ఉన్నాయని ఆర్జీకేయూటీ వైస్ చాన్సలర్ సత్యనారాయణ పేర్కొన్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఆయన ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. డెరైక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ఏవో విశ్వనాథరెడ్డి, ఎఫ్‌వో కె.ఎల్.ఎన్.రెడ్డి, ఓఎస్డీ ప్రభాకర్‌రెడ్డిలతో ఆందోళనలకు గల కారణాలను తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులు కొందరు అధికారులను సస్పెండ్ చేయాలని చెప్పడం సరికాదన్నారు. అసలు ఈ విషయం వారికి సంబంధం లేదన్నారు. ఆర్జీకేయూటీ యూనివర్శిటీ నుంచి టెండర్ల పక్రియ ద్వారా అన్ని పనులు జరుగుతాయని.. ఇక్కడ ఉన్న అధికారులకు సంబంధమే ఉండదన్నారు. అలాంటప్పుడు అవినీతికి ఎలా పాల్పడుతారన్నారు. రాత్రి 10 గంటల్లోపు విద్యార్థులు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోకి రాకపోతే ఇంటికి పంపుతామన్నారు. ఇప్పటికే తల్లిదండ్రులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం పంపినట్లు తెలిపారు. విద్యార్థులు క్యాంపస్‌లోకి వచ్చి సమస్యలు తనదృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. 15వ తేదీన క్యాంపస్ ఇంటర్వ్యూలు ఉన్నాయని.. అందుకు సమాయత్తమవకుండా ఇలా ఆందోళనలకు దిగడం మంచిది కాదన్నారు. మెస్‌కు సంబంధించి రాద్ధాంతం చేస్తున్నారని, ఒక్కో విద్యార్థికి రూ.75 చెల్లిస్తున్నామని చెప్పారు. ఇందులో 15 శాతం మెస్ నిర్వాహకులు టాక్స్ చెల్లించాల్సి ఉందన్నారు. అయినప్పటికి సక్రమంగా భోజనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక్కడ సమస్యలు లేకపోయినా, కొంత మంది అధ్యాపకులు విద్యార్థుల వెనుక ఉండి నడిపిస్తున్నట్లు తెలిసిందన్నారు. బాసర, నూజివీడు ట్రిపుల్ ఐటీలకంటే నీటి సౌకర్యం ఇక్కడ బాగుందని చెప్పారు. గతంలో వైస్‌చాన్సలర్‌గా ఉన్న రాజ్‌కుమార్ ఇక్కడ జరుగుతున్న ఆందోళనకు నలుగురు అధ్యాపకులే కారణమని గుర్తించినట్లు తెలిపారు. ఈ ఆందోళనకు కూడా వారే కారణమని తెలుసుకున్నామని, విద్యార్థులు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోకి వచ్చేలా వారే చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. త్వరలో అధ్యాపకులను నియమిస్తామని, యూనిఫాం కూడా అందజేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా వీసీ తమ వద్దకు వచ్చి తమ సమస్యలు విని పరిష్కారానికి హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. పులివెందుల ఏఎస్పీ నేతృత్వంలో రూరల్ సీఐ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జమ్మలమడుగు డీఎస్పీ సర్కార్, సీఐ మురళి, ఎస్ఐలు హాసం, ప్రదీప్‌నాయుడు బందోబస్తు నిర్వహిస్తున్నారు. క్యాంపస్‌కు వెళ్లిన విద్యార్థులు వీసీ హెచ్చరిక నేపథ్యంలో మంగళవారం రాత్రి 10 గంటలకు విద్యార్థినులు క్యాంపస్‌కు వెళ్లిపోయారు. 11.15గంటలకు విద్యార్థులు సైతం ట్రిపుల్ ఐటీ ప్రాంగణానికి చేరుకున్నారు. వారితో వీసీ, ఏఎస్పీ చర్చలు జరుపుతున్నారు. కాగా రెండు రోజులపాటు ఆందోళనలో పాల్గొనడంతో ఓ విద్యార్థిని అస్వస్థతకు గురైంది. ఆమెకు ట్రిపుల్ ఐటీలో ప్రాథమిక చికిత్స అనంతరం అంబులెన్స్‌లో మెరుగైన వైద్యం కోసం కడపకు తరలించారు. -
కర్నూలుకు వరాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లాలోనే ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇప్పటికే ట్రిపుల్ ఐటీ కోసం అవసరమైన భవనాలను కూడా చూశామని, వచ్చే జూన్ నుంచి తరగతులు ప్రారంభించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ట్రిపుల్ ఐటీ పక్కనే ఉర్దూ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కర్నూలులో ఆగస్టు 15వ తేదీన నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇచ్చిన మాటను తప్పే అలవాటు తనకు లేదన్నారు. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో సామాజిక సాధికారిత మిషన్‌ను ప్రారంభ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు ఆయన సామాజిక సాధికారిత మిషన్ అమలులో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ప్రసూతి, శిశు మరణాలు ఇతర జిల్లాలతో పోల్చుకుంటే కర్నూలు జిల్లాలోనే అధికంగా ఉన్నాయన్నారు. అదేవిధంగా 0-14 సంవత్సరాలున్న పిల్లల్లో 13 శాతం మంది పాఠశాలలకు వెళ్లడం లేదన్నారు. అందువల్లే కర్నూలులో సామాజిక సాధికారిత మిషన్ ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. కర్నూలును మెగా సిటీగా అభివృద్ధి చేస్తానని ప్రకటించిన సీఎం.. జిల్లాలో ఈ ఏడాది రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. అనేక దేవాలయాలు ఉన్న జిల్లాలో మెగా టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేయడంతో పాటు రాజధానికి కర్నూలు నుంచి ఆరు లేదా నాలుగు లైన్ల రహదారి నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించామన్నారు. జిల్లాలో 30 వేల ఎకరాల్లో మెగా ఇండస్ట్రీయల్ హబ్ ఏర్పాటు కానుందని ప్రకటించారు. 11 లక్షల ఎకరాలకు సాగునీరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాదిలో గాలేరు నగరి, హంద్రీ నీవా, గోరుకల్లు రిజర్వాయర్‌తో పాటు గురు రాఘవేంద్ర ప్రాజెక్టులను పూర్తి చేసి రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. అంతేకాకుండా అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా జిల్లాలో 10 లక్షల నుంచి 11 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. అవసరమైతే కాల్వలపై పడుకుంటానని, అధికారులను అప్రమత్తం చేసి పనులు చేయిస్తానన్నారు. పారిశ్రామికీకరణ దిశలో... అనేక రంగాల్లో ఇతర జిల్లాలతో పోలిస్తే కర్నూలు జిల్లా వెనుకబడి ఉందని సీఎం అన్నారు. అందువల్ల జిల్లాలో ఇప్పటికే సేకరించిన 30 వేల ఎకరాల్లో భారీగా పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలను పెంచాలని ప్రణాళిక రచించామన్నారు. ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాల వాళ్లే కర్నూలుకు వచ్చే పరిస్థితి కల్పిస్తామన్నారు. నెడ్‌క్యాప్ ద్వారా 10 వేల ఎకరాల్లో 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఇప్పటికే టెండర్లు పిలిచామన్నారు. 3 వేల ఎకరాల్లో డీఆర్డీవో యూనిటుతో పాటు వేయి ఎకరాల్లో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (ఎన్ఎఫ్సీ) ఏర్పాటు కానుందన్నారు. మరో 10 వేల ఎకరాల్లో సెయింట్ గోబెన్, జైన్ ఫుడ్ ప్రాసెసింగ్‌తో పాటు పలు సంస్థలు తమ యూనిట్లను ఏర్పాటు చేస్తాయని, కొలిమిగుండ్ల వద్ద సిమెంటు హబ్ ఏర్పాటు కానుందన్నారు. ఓర్వకల్లు వద్ద విమానాశ్రయ ఏర్పాటుకు ఇప్పటికే 3 వేల ఎకరాలు కేటాయించామన్నారు. రెండో దశ రుణమాఫీని కూడా త్వరలో అమలు చేస్తామన్నారు. హామీలన్నీ అమలవుతాయి : డిప్యూటీ సీఎం కేఈ జిల్లాకు సీఎం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలవుతున్నాయని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. చంద్రబాబుపై తమకు ఈ నమ్మకం ఉందన్నారు. ఎన్టీఆర్ హయాంలో ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీఎంకు విన్నవించారు. ఇంకో 10 నుంచి 15 ఏళ్ల వరకూ టీడీపీనే అధికారంలో ఉంటుందన్న నమ్మకం తమకు ఉందన్నారు. ఆకాశంలో చంద్రుడు 12 గంటలు ఉంటే.. మా చంద్రబాబు ప్రజల కోసం 24 గంటల పాటు శ్రమిస్తున్నారని కొనియాడారు. రాజధాని పోయిందన్న బాధ జిల్లా వాసుల్లో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రావెల కిషోర్‌బాబు, కామినేని శ్రీనివాస్, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరిత, ఎస్వీ మోహన్ రెడ్డి, ఐజయ్య, మణిగాంధీలతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్ రెడ్డి, జయనాగేశ్వరరెడ్డి, కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, జేసీ హరికిరణ్, ఎస్పీ ఆకే రవికృష్ణ, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, మాజీ మంత్రులు టీజీ వెంకటేష్, కేఈ ప్రభాకర్, ఫరూక్, శిల్పా మోహన్ రెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, పార్టీ నేతలు శిల్పా చక్రపాణి రెడ్డి, గుడిసె కృష్ణమ్మ, గంగుల ప్రభాకర్ రెడ్డి, ఇరిగెల రాంపుల్లా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ట్రబుల్ ఐటీ
వేంపల్లె : ట్రిపుల్ ఐటీలు ట్రబుల్లో పడనున్నాయి. వీటిని యూనివ ర్శిటీ పరిధిలో లేకుండా చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పట్టణ విద్యార్థులకు దీటుగా గ్రామీణ విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్యను అందించాలన్న ఉద్ధేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ట్రిపుల్ ఐటీలను నెలకొల్పారు. ఆర్జీయూకేటీ (రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ నాలెడ్జి టెక్నాలజీ) పరిధిలో రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయ, కృష్ణా జిల్లా నూజివీడు, అదిలాబాద్‌లోని బాసర ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేశారు. అమెరికాలో ఉన్న సిలికాన్ ర్యాలీ తరహాలో ఇక్కడ కూడా వీటిని అభివృద్ధి పరిచేందుకు ఆర్కీ వ్యాలీ పేరుతో శ్రీకారం చుట్టారు. వైఎస్ మరణానంతరం విద్యార్థుల సంఖ్య తగ్గడం.. నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం వీటి నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంది. అధికారుల మధ్య విభేదాలు, ప్రభుత్వం తీరు వీటికి శాపంగా మారాయి. యూనివర్శిటీని రద్దు చేసి ఏదో ఒక దాంట్లో కలిపి చేతులు దులుపుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. 2008లో ప్రారంభం : 2008 ఆగస్ట్‌లో ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ట్రిపుల్ ఐటీనుంచి 2వేలమందిని పదవ తరగతిలో మార్కుల ఆధారంగా ఎంపిక చేసేవారు. 80శాతం మంది గ్రామీణ విద్యార్థులకే ఇందులో అవకాశం కల్పించేలా చేశారు. వైఎస్ మరణం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య హయాంలో 2010లో 2వేల నుంచి 1000కి విద్యార్థుల సంఖ్యను కుదించారు. అంతేకాకుండా రిజర్వేషన్లలో కూడా మార్పు తెచ్చారు. పేరుకే అటానమస్.. : రాష్ట్ర విభజన తర్వాత ట్రిపుల్ ఐటీల నిర్వహణకు సంబంధించి వారికి వారే నిర్వహించుకోవాలని స్వయం ప్రతిపత్తి (అటానమస్)గా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇంతవరకు ఈ అటానమస్ అమలులోకి నోచుకోని పరిస్థితి. గతంలో యూనివర్శిటీనుంచి నిధులు రావాల్సి ఉండగా.. ఏ ట్రిపుల్ ఐటీకి చెందిన బడ్జెట్‌ను వారు వాడుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క ట్రిపుల్ ఐటీకి రూ. 100కోట్లనుంచి రూ. 200కోట్ల వరకు నిధులు అవసరమవుతున్నాయి. త్వరలోనే నిర్ణయం ప్రస్తుత ప్రభుత్వం ఆర్జీయూకేటీ యూనివర్శిటీ ని విలీనం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యూనివర్శిటీని రద్దు చేసి జవహర్లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్శిటీ(జేఎన్టీయూ)లోగానీ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ తరహాలోగానీ నిర్వహించాలనే తర్జనభర్జన జరుగుతోంది. ఇదే జరిగితే విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ తరహాలో 50శాతం ఉచితంగా సీట్లను కేటాయించి.. మరో 50శాతం పేమెంటు సీట్లుగా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధానం గ్రామీణ విద్యార్థులకు శాపంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ గవర్నింగ్ సమావేశంలో నిర్ణయం : జనవరి 9వ తేదీన యూనివర్శిటీలో జీసీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వీటి భవిత్యంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యూనివర్శిటీ విషయమై ఇప్పటికే చాన్సలర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి చంద్రబాబుతో భేటీ అయిన విషయం తెలిసిందే. వచ్చేనెల 17వ తేదీ నాటికి వైస్‌చాన్సలర్ రాజ్‌కుమార్ పదవీ కాలం ముగియనుంది. ఆ తర్వాత వైస్ చాన్సలర్‌గా వేరే వ్యక్తికి అవకాశం ఇస్తారా.. ఆయననే కొనసాగిస్తారన్నది తెలియరావడం లేదు. జనవరి 18వ తేదీన చాన్సలర్ రాజిరెడ్డి అమెరికాకు వెళ్లనున్నారు. అంతలోపే వీటిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుకు సత్వర చర్యలు
అధికారులకు సీఎం ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, నిట్, సెంట్రల్ వర్సిటీ తదితర విద్యాసంస్థల ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం మధ్యాహ్నం సచివాలయంలోని తన చాంబర్లో ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు అంశంపై మంత్రి గంటా శ్రీనివాసరావు, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నీలం సహానీ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర, కార్యదర్శి గిరిధర్ తదితరులతో సమావేశమై సమీక్షించారు. సెంట్రల్ వర్సిటీ కోసం అనంతపురం, లేపాక్షి, హిందూపురంలలోని స్థలాలను, గిరిజన విశ్వవిద్యాలయం కోసం విశాఖ జిల్లా సబ్బవరంలోని స్థలాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. ఇప్పటికే ఐఐటీ కోసం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక గ్రామాన్ని, ఐఐఎస్ఈఆర్ కోసం ఇదే మండలంలోని పంగూరు గ్రామాన్ని, ఐఐఎం కోసం విశాఖ జిల్లా ఆనందపురం గంభీరం గ్రామాన్ని ఎంపికచేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. జాతీయ విద్యా సంస్థల కోసం రూ. 1,000 కోట్ల నుంచి రూ. 1,500 కోట్ల వరకు వ్యయమవుతుందని చెప్పారు. -
ట్రిపుల్ ఐటీలో మళ్లీ ధర్నా
విద్యార్థులతో డీఎస్పీ, సీఐ, డెరైక్టర్ల చర్చలు వేంపల్లె(ఇడుపులపాయ): ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో శనివారం పోలీసు పహారా నిర్వహించారు. శుక్రవారం తమను అనవసరంగా భద్రతా సిబ్బంది, సెక్యూరిటీ ఇన్‌ఛార్జి సీఐ రసూల్ కొట్టారని, మహిళా సెక్యూరిటీ గార్డుల నుంచి వేధింపులు ఉన్నాయని విద్యార్థులు ధర్నాకు దిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో దిగి వచ్చిన అధికారులు సీఐ రసూల్ క్షమాపణతోపాటు హెచ్ఆర్టీ చిన్నారెడ్డి, ఇద్దరు మహిళా సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేస్తున్నట్లు డెరైక్టర్ ప్రకటించారు. 11డిమాండ్లను విద్యార్థులు పరిష్కరించాలని కోరగా, దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి భోజనం విరామం తర్వాత మళ్లీ విద్యార్థులు ధర్నాకు దిగారు. హెచ్ఆర్టీ చిన్నారెడ్డి ఎట్టి పరిస్థితులలోనూ క్షమాపణ చెప్పి తీరాలని భీష్మించుకు కూర్చున్నారు. విషయాన్ని తెలుసుకున్న పులివెందుల డీఎస్పీ హరినాథబాబు, పులివెందుల రూరల్ సీఐ మహేశ్వరరెడ్డి, డెరైక్టర్ వేణుగోపాల్‌రెడ్డి వారితో చర్చలు జరిపి, ఆందోళనను విరమించేలా చేశారు. శనివారం కూడా విద్యార్థులు ధర్నాకు దిగుతారని సంకేతాలు రావడంతో పోలీసు పహారా చేపట్టారు. డీఎస్పీ హరినాథబాబు, రూరల్ సీఐ మహేశ్వరరెడ్డిలతోపాటు 5మంది ఎస్ఐలు, 50మంది పోలీసులు క్యాంపస్‌లో పహారా నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు పోలీసులు అక్కడే ఉన్నారు. హెచ్ఆర్టీ చిన్నారెడ్డిని సస్పెండ్ చేసినట్లు డెరైక్టర్ చెబుతున్నారని, క్యాంపస్‌లోకి ఒకవేళ వచ్చిన తర్వాత పునరాలోచిస్తామని వివరించారు. అంతేకాక మొండి వైఖరిని విడనాడి ట్రిపుల్ ఐటీలో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని డీఎస్పీ హరినాథబాబు సూచించారు. దీంతో ప్రస్తుతం అక్కడ సమస్య సద్దుమణిగినట్లు తెలుస్తోంది. -
డెరైక్టర్ డౌన్..డౌన్
వేంపల్లె(ఇడుపులపాయ) : ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు శుక్రవారం రాత్రి రోడ్డెక్కారు. తమను అన్నివిధాలా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. డెరైక్టర్, సెక్యూరిటీ సీఐని తొలగించాలని నినాదాలు చేశారు. ఈనెల 16వ తేదీన ఈ-1 క్యాంపస్‌లోని సెకండ్ ఫ్లోర్లో కొంతమంది విద్యార్థులు ఐఐటీ ఫ్యాకల్టీ అధ్యాపకురాలిపై కామెంట్ చేశారు. దీంతో ఆమె డెరైక్టర్ వేణుగోపాల్‌రెడ్డికి, సీఐ రసూల్, ఓఎస్డీ ప్రభాకర్‌రెడ్డిలకు ఫిర్యాదు చేశారు. మీరు పట్టించుకోకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న విద్యార్థులను గుర్తించి ఒక గదిలోకి పిలిపించుకుని కామెంట్ చేసిన వ్యక్తులు ఎవరు అని ఒత్తిడి తెచ్చారు. ఇద్దరు ముందుకు రావడం.. వారిపై చర్యలు తీసుకోవడమేకాకుండా చితకబాదినటు తెలుస్తోంది. తాము ఐఐటీ అధ్యాపకురాలు అనుకోలేదని.. స్టూడెంటు అనుకుని అలా వ్యవహరించామని విద్యార్థులు తెలియజేసినట్లు సమాచారం . అదే రోజున ఈ-4 విద్యార్థులు ఓ మెస్‌లో జన్మదిన వేడుకల సందర్భంగా అక్కడికి వెళ్లి రాత్రి 11గంటలవరకు అక్కడే ఉండటంతో మెస్ నిర్వాహకులు సెక్యూరిటీ సిబ్బందికి తెలియజేశారు. దీంతో అక్కడికి వెళ్లిన సెక్యూరిటీ సిబ్బంది ఇంత సమయం వరకు ఎందుకు ఉన్నారని ప్రశ్నించడంతో వారిపై తిరగబడినట్లు తెలిసింది. దీంతో అక్కడ వారిని కూడా సెక్యూరిటీ సిబ్బంది చితకబాదినట్లు తెలిసింది. ఈ రెండు సంఘటనలపై విద్యార్థులు దాదాపు 2వేలమంది శుక్రవారం సాయంత్రం రోడ్డుపైకి వచ్చి బైఠాయించారు. అనవసరపు సాకులు చెప్పి తమపై నిందలు వేస్తున్నారని.. విద్యార్థులంటేనే గౌరవం లేదని ఆరోపించారు. ఈ రెండు సంఘటనలు ఏకకాలంలో జరిగాయి. శుక్రవారం వరకు పరీక్షలు ఉండటంతో అంతవరకు ఓపిక పట్టి.. అదే రోజు సాయంత్రం విద్యార్థులు ధర్నాకు దిగారు. సమస్యలు తీర్చకపోతే ధర్నాను కొనసాగిస్తామని విద్యార్థులు తెగేసి చెప్పారు. డెరైక్టర్ వేణుగోపాల్‌రెడ్డి విద్యార్థులతో పొద్దుపోయేదాకా మాట్లాడారు. కానీ చర్చలు కొలిక్కి రాలేదు. డెరైక్టర్ ఏమంటున్నారంటే.. : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో క్రమశిక్షణతో కూడిన విద్యనందించాలన్నదే తన తపన అని.. అందులో భాగంగా విద్యార్థులు క్రమశిక్షణ తప్పినప్పుడు కొన్ని చర్యలు తీసుకోక తప్పదని ఇన్‌ఛార్జి డెరైక్టర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులను చితకబాదిన మాట అవాస్తవమని తెలిపారు. రెండు సంఘటనలు జరిగాయని తమ దృష్టికి రావడంతో సంబంధిత విద్యార్థులను కార్యాలయంలోకి పిలిపించి గట్టిగా మందలించామన్నారు. సీఐ క్షమాపణతో సమసిన వివాదం విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు ట్రిపుల్ ఐటీ అధికారులు దిగి వచ్చారు. విద్యార్థుల సమస్యలను డెరైక్టర్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు చర్చించారు. తిరునాథ్ అనే విద్యార్థిని కొట్టినందుకు సెక్యూరిటీ ఇన్‌ఛార్జి, సీఐ రసూల్ క్షమాపణ చెప్పారు. విద్యార్థినిలను అనుచితంగా మాట్లాడిన హెచ్ఆర్టీ చిన్నారెడ్డి, మహిళా సెక్యూరిటీ గార్డులు ఉమా, ఫాతిమాలను సస్పెండ్ చేస్తున్నట్లు ట్రిపుల్ ఐటీ ఇన్‌ఛార్జి డెరైక్టర్ వేణుగోపాల్‌రెడ్డి విద్యార్థుల ముందు ప్రకటించారు. అలాగే పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని హామీఇచ్చారు. క్యాంపస్‌లో లైట్లు, ఇతర సమస్యలన్నింటినీ త్వరలో పరిష్కరిస్తామన్నారు. విద్యార్థులు ధర్నా చేస్తున్న విషయం తెలుసుకుని వేంపల్లె ఎస్ఐ హాసం, ఆర్కే వ్యాలీ ఎస్ఐ ప్రదీప్‌నాయుడు, పోలీసులు అక్కడికి చేరుకుని బందోబస్తు నిర్వహించారు. మాట మార్చిన డెరైక్టర్ : ట్రిపుల్ ఐటీ డైర్టర్ వ్యవహార శైలిపై విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నారు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడంలేదని.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో మొదట తమ తప్పేమి లేదని.. విద్యార్థుల బాగు కోసమే మందలించామని చెప్పుకొచ్చిన డెరైక్టర్.. ఏ ఒక్క విద్యార్థిని కొట్టలేదని మీడియాకు తెలిపారు. తర్వాత అర్ధగంటకే విద్యార్థుల ముందు బహిరంగంగా తప్పు జరిగినందుకు హెచ్ఆర్టీ, మహిళా సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేశామని ఇన్‌ఛార్జి సెక్యూరిటీ అధికారితో క్షమాపణ చెప్పిస్తామని చెప్పడం గమనార్హం. -
ఉత్తమ ఫలితాలకు వేదిక ట్రిపుల్ ఐటీ
నూజివీడు : ట్రిపుల్ ఐటీల తొలి బ్యాచ్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ ఆచార్య ఆర్వీ రాజకుమార్ పేర్కొన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీలలో అమలవుతున్న విద్యావిధానం దేశ వ్యాప్తంగా ఏ విద్యాసంస్థల్లోనూ లేదన్నారు. ఈ సంస్థను స్థాపించడమే ఒక గొప్ప అధ్యాయమన్నారు. తొలి బ్యాచ్ నుంచి మూడు క్యాంపస్‌లకు చెందిన 5,800 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 5,360మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. వీరిలో 33శాతం మంది డిస్టింక్షన్లో ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. మొత్తం 98శాతం మంది డిస్టింక్షన్, ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని వివరించారు. వీరిలో 1,304మంది మైనర్ డిగ్రీలు పొందారన్నారు. వీరిలో వంద మందికి పైగా గాత్రం, కూచిపూడి, మృదంగం, తెలుగులలో మైనర్ డిగ్రీలు అందుకున్నారని తెలిపారు. ఇంజినీరింగ్ విద్యతోపాటు మైనర్ డిగ్రీలు అందజేస్తున్న ఏకైక యూనివర్సిటీ ఆర్జీయూకేటీ మాత్రమేనని పేర్కొన్నారు. సాఫ్ట్వేర్, ఇంజినీరింగ్ ఆధారిత సంస్థలో ఉద్యోగావకాశాలు లభించేలా ట్రిపుల్ ఐటీ విద్యావిధానం ఉంటుందని చెప్పారు. దీనివల్ల విద్యార్థులు ఆ రెండు రంగాలతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ట్రిపుల్ ఐటీల్లోని విద్యావిధానం గురించి ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారని, వచ్చే నెలలో ప్రజెంటేషన్ ఇస్తామని వీసీ చెప్పారు. రూ.350కోట్లు కేటాయింపు ఈ విద్యా సంవత్సరానికి మూడు ట్రిపుల్ ఐటీల నిర్వహణ కోసం గతేడాది మాదిరిగానే రూ.350 కోట్లు ప్రభుత్వం కేటాయించినట్లు ఆయన చెప్పారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ నిర్వహణకు మరో వంద ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. వంద ఎకరాలు సేకరిస్తే గ్రంథాలయం, ఆట స్థలాలు, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ తదితర సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రాంగణ ఎంపికలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటికే టెక్ మహీంద్రా కంపెనీ ప్రాంగణ ఎంపికలు నిర్వహించగా, 170 మంది ఎంపికయ్యారని వివరించారు. ఒక్క పర్మినెంట్ ఉద్యోగి కూడా లేకుండా 21వేల మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలలో విద్యనభ్యసిస్తున్నారని, ఈ నేపథ్యంలో శాశ్వత ఉద్యోగులను నియమించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్ల నియామకాలను చేపట్టినప్పటికీ కొన్ని ఆరోపణల నేపథ్యంలో నిలిచిపోయాయన్నారు. అప్పట్లో వచ్చిన ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఈ సమావేశంలో నూజివీడు ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి డెరైక్టర్ కోసూరి హనుమంతరావు, ఇన్చార్జి పరిపాలనాధికారి పరిమి రామనర్శింహం, ఇన్చార్జి ఫైనాన్స్ అధికారి జి.రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఐటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నూజివీడు : నూజివీడు ట్రిపుల్ ఐటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. కమిటీ చైర్మన్ అయిన ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ ఆర్వీ రాజ్‌కుమార్ అధ్యక్షతన సభ్యులు ఇన్చార్జి డెరైక్టర్ కోసూరి హనుమంతరావు, ఇన్చార్జి పరిపాలనాధికారి పరిమి రామనరిసింహం, ఆర్జీయూకేటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ సత్యనారాయణ, హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ సీఈటీఎల్ఎస్ డెరైక్టర్ వెంకటేశ్వర్లు ఈ సమావేశంలో పాల్గొని పలు విషయాలపై చర్చించారు. ట్రిపుల్ ఐటీలకు స్వయంప్రతిపత్తి కల్పించిన తరువాత ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరగడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. క్వార్టర్సులు కేటాయించాలని మెంటార్ల వినతి అద్దెల భారం పెరిగిన నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఖాళీగా ఉన్న క్వార్టర్సులను తమకు కేటాయించాలని కోరుతూ మెంటార్ల సంఘం నాయకుడు నూకేష్ గురువారం వైస్ చాన్సలర్ ఆచార్య ఆర్వీ రాజకుమార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. నెలకు రూ.5వేలు పెట్టి అద్దెకు ఉండాల్సి వస్తోందని, ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో దాదాపు 40 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని తమకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మెంటార్ల సంఘ నాయకులు సలీంబాబు, మరియారాణి తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీకి కొత్త కళ
రూ.39కోట్లతో అభివృద్ధి పనులు నూజివీడు : నూజివీడు ట్రిపుల్ ఐటీ కొత్తకళ సంతరించుకుంటోంది. క్యాంపస్‌లోని రోడ్లన్నింటినీ సిమెంట్ రహదారులుగా అభివృద్ధి చేయడంతోపాటు పలు భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 2నెలలుగా ముమ్మరంగా పనులు సాగుతున్నాయి. ఆరేళ్లుగా కంకరరోడ్లకే పరిమితమైన రోడ్లు ఎట్టకేలకు సిమెంట్‌రోడ్లుగా రూపుదిద్దుకుంటున్నాయి. రెండేళ్ల క్రితమే రోడ్ల అభివృద్ధితో పాటు క్యాంటీన్ భవనం, వాషింగ్‌మెషీన్ల ఏర్పాటుకు భవనం, అధునాతన గ్రంథాలయ భవనం, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ల నిర్మాణానికి ఆర్జీయూకేటీ రూ.39కోట్లు కేటాయించింది. అయితే ఈ పనులను చేపట్టడంలో జాప్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు జులై నెలలో ఈ పనులను ప్రారంభించారు. దీనిలో భాగంగా ట్రిపుల్ఐటీ ఆవరణలో ఉన్న 3కిలోమీటర్ల కంకర రహదారులన్నింటినీ సిమెంట్‌రోడ్లుగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50శాతం వరకు పనులు పూర్తయ్యాయి. అలాగే క్యాంటీన్ నిర్మాణం పనులు ప్రారంభమై పిల్లర్ల దశకు చేరుకున్నాయి. ఇంకా గ్రంథాలయ భవన నిర్మాణ పనులు, వాషింగ్‌మెషీన్ల ఏర్పాటుకు అవసరమైన భవనం నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. అలాగే విద్యార్థులు వ్యాయామం, యోగా, చదరంగం వంటి ఆటలతో పాటు డ్యాన్స్ సాధన చేసేందుకు గానూ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ భవనం పనులను ప్రారంభించాల్సి ఉంది. ఇవన్నీ కూడా పూర్తయినట్లయితే నూజివీడు ట్రిపుల్ఐటీకి నూతన శోభ చేకూరనుంది. -
ఇంత మోసమా..!
►వైఎస్ జగన్ ఎదుట బాబుకు శాపనార్థాలు పెట్టిన డ్వాక్రా మహిళలు ►వేల్పులలో పత్తి పంటను పరిశీలించిన జగన్ ►పండుటాకులకు ఆప్యాయ పలకరింపు ►రేషన్ డీలర్లను అన్యాయంగా తొలగిస్తే ఊరుకోమని హెచ్చరిక ►ప్రతిపక్షనేతతో జిల్లా అధ్యక్షుడు, కడప ఎమ్మెల్యే, మేయర్ చర్చలు ►పులివెందులలో అమ్మవారిని దర్శించుకున్న వైఎస్ జగన్ ►రెండు రోజుల పర్యటన విజయవంతం కడప సాక్షి/పులివెందుల/టౌన్/వేముల : ‘ఎన్నికల ప్రచారంలో డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానన్నారు... అధికారంలోకి వచ్చిన తర్వాత వంచిస్తున్నాడు.. బ్యాంకోళ్లేమో వడ్డీకి వడ్డీ రాబడుతున్నారు.. నాలుగు నెలల కంతు ఒకేసారి కడితే మొత్తమంతా వడ్డీకే సరిపోయింది.. అసలుకు ఎక్కడ నుంచి తెచ్చి కట్టాలో తెలియడం లేదు.. చంద్రబాబు ఇంత మోసగాడని తెలియదు’.. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుట డ్వాక్రా మహిళలు అన్న మాటలు ఇవి. హామీలు ఇచ్చి విస్మరించడం కాదు.. ఇచ్చి నెరవేర్చేవాడే నాయకుడు అని జగన్ వారికి స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం వేముల మండలంలోని వేల్పుల గ్రామంలో డ్వాక్రా మహిళలను వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరిస్తూ... కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలంతా చంద్రబాబు పాలనను ఎండగడుతూ తమకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని.. అప్పటివరకు ఎవరు రుణాలను చెల్లించవద్దని కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేశారంటూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. పండుటాకులకు పలకరింపు.. : ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. వైఎస్ జగన్ కోసం వందల సంఖ్యలో కూర్చొన్న అవ్వ.. తాతలను వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు. వృద్ధులను చూసిన వైఎస్ జగన్ వారి వద్దకు నేరుగా వెళ్లి బుగ్గలు నిమురుతూ అవ్వా అంటూ ఆప్యాయంగా వారిని దగ్గరకు తీసుకున్నారు. వారు కూడా వైఎస్ జగన్‌తో తమ కష్టనష్టాలను వెల్లబోసుకున్నారు. వైఎస్ఆర్ హయాం నుంచి పింఛన్ వస్తోందని.. అనర్హుల పేరుతో తమ పింఛన్లను తొలగించేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. ట్రిపుల్ ఐటీలో ఎలెక్ట్రిషియన్లకు జీతాలు పెంచండి రాష్ట్రంలోని మూడు ట్రిపుల్ ఐటీలలో పనిచేస్తున్న ఎలక్ట్రిషియన్లు, ఫ్లంబర్స్ జీతాలు పెంచాలని వైఎస్ జగన్‌రెడ్డి ఓఎస్డీని ఆదేశించారు. ఇడుపులపాయలోని ట్రిపుల్‌ఐటీలో పనిచేస్తున్న కొంతమంది ఎలక్ట్రిషియన్లు, ఫ్లంబర్లు వచ్చి పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిశారు. ట్రిపుల్ ఐటీలో ఆరంభం నుంచి పనిచేస్తున్న తమకు సంబంధించి ఇప్పటివరకు రూ. 7,100లు జీతం ఇస్తున్నారని.. జేఎన్టీయూ, యోగి వేమన యూనివర్శిటీల పరిధిలోని ఇదే సిబ్బందికి రూ. 10,900లు ఇస్తున్నారని వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన ట్రిపుల్ ఐటీల ఓఎస్డీ నితిన్‌తో టెలిఫోన్లో చర్చించారు. వైఎస్ జగన్‌ను కలిసిన విద్యుత్ ఉద్యోగులు ఆర్టీపీపీలో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులతోపాటు ఏపీ విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ను కలిశారు. క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిసిన ఆర్టీపీపీ ఉద్యోగులు వేతన సవరణ వెంటనే చేసేలా రాష్ట్ర ప్రభుత్వంతోపాటు యాజమాన్యంపై ఒత్తిడి తీసుకరావాలని కోరారు. ఉద్యోగుల వేతన సవరణ చట్టాన్ని తెలంగాణాలో చేపట్టారని.. ఏపీలో ఇంకా చేపట్టలేదని పేర్కొనగా. అసెంబ్లీలో చర్చిస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు. వైఎస్ జగన్‌ను కలిసిన పలువురు నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం క్యాంపు కార్యాలయంలో పలువురు నేతలు కలిశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, ఆయన సోదరుడు ఆకేపాటి మురళీధర్‌రెడ్డి, జిల్లా మేయర్ సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి తదితరులు కలిసి చర్చించారు. ఈ సందర్భంగా అనేక రాజకీయ అంశాలపై వారు చర్చించుకున్నారు. బెంజిమన్ కుటుంబానికి పరామర్శ : పులివెందులలోని బాకరాపురంలో నివసిస్తున్న బెంజిమన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బెంజిమన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడంతోపాటు కుటుంబానికి అండగా ఉంటానని భరోసాను ఇచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న వైఎస్ జగన్ పులివెందులలోని అమ్మవారిశాలలో దసరా ఉత్సవాలను పురష్కరించుకుని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌రెడ్డి తొలిరోజు వాసవీ కన్యకపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. వైఎస్ జగన్ ఆలయం వద్దకు రాగానే పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న వైఎస్ జగన్ సమీపంలోనే మీనాక్షి అలంకారంలో ఉన్న అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువుతోపాటు అద్దాల మండపాన్ని ై సందర్శించారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైఎస్ జగన్‌ను ఆర్యవైశ్యులు శాలువాలతో సన్మానించారు. రెండు రోజుల పర్యటన విజయవంతం ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌రెడ్డి రెండు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. రెండు రోజులు వివిధ కార్యక్రమాలలో బిజీ బిజీగా గడిపిన వైఎస్ జగన్‌రెడ్డి గురువారం రాత్రి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరి హైదరాబాద్‌కు వెళ్లారు. పంటలను పరిశీలించిన ప్రతిపక్షనేత వేల్పుల గ్రామ సమీపంలోని భూమయ్యగారిపల్లె క్రాస్ వద్ద రైతు విశ్వనాథరెడ్డి సాగు చేసి వాడు దశలో ఉన్న పత్తి పంటను వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సాయంత్రం పరిశీలించారు. వర్షాభావంతో పంట ఎదుగుదలలేక.. నడుముల ఎత్తు ఉండాల్సిన పత్తి పంట కేవలం జానెడు ఎత్తు మాత్రమే ఉండటం చూసి వైఎస్ జగన్ చలించిపోయారు. అక్కడే అరటి గెల పట్టుకున్న రైతుతోపాటు విశ్వనాథరెడ్డితో కూడా వైఎస్ జగన్ మాట్లాడారు. ఏడీ జమ్మన్న, ఏవో చెన్నారెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి రాఘవేంద్రారెడ్డిని అడిగి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. వేముల మండల పరిశీలకుడు వేల్పుల రాము, ఎంపీపీ ఉషారాణి, సర్పంచ్ పార్వతమ్మ, మాజీ జెడ్పీటీసీ రాజారెడ్డి, వేల్పుల సింగిల్‌విండో అధ్యక్షుడు శివశంకర్‌రెడ్డి, బయపురెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేషన్ డీలర్లను అన్యాయంగా తొలగిస్తే ఊరుకోం వినియోగదారులకు సంబంధించి సక్రమంగా సరుకులు అందజేస్తున్నా.. చిన్న చిన్న కారణాలు చూపి రేషన్ డీలర్లను తొలగించేలా చూస్తే ఊరుకునేది లేదని వైఎస్ జగన్‌రెడ్డి అధికారులను హెచ్చరించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో చక్రాయపేట మండల కన్వీనర్ బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో రేషన్ డీలర్లు వచ్చి వైఎస్ జగన్‌ను కలిసి సమస్యను విన్నవించారు. దీంతో స్పందించిన వైఎస్ జగన్ పేదలకు రేషన్‌ను సక్రమంగా అందిస్తున్నా.. కుంటి సాకులతో ఇబ్బం దులు పెట్టాలని చూస్తే.. బాగుండదని హెచ్చరించారు. ఈ విషయంలో న్యాయ పోరాటం చేయడానికి కూడా వెనుకాడమని తేల్చి చెప్పారు. -
ట్రిపుల్ ఐటీకి కృష్ణా జలాలు
త్వరలోనే సరఫరా తీరనున్న నీటి కష్టాలు రోజుకు 15లక్షల లీటర్లు నూజివీడు : ట్రిపుల్ ఐటీ ఎదుర్కొంటున్న నీటి కష్టాలకు తెరపడనుంది. 7వేల మంది విద్యార్థులతో పాటు మరో వెయ్యి మంది సిబ్బంది పనిచేస్తున్న నూజివీడు ట్రిపుల్ఐటీకి త్వరలోనే కృష్ణా జలాలు రానున్నాయి. నూజివీడు పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడానికి ఉద్దేశించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో మంజూరు చేసిన రూ.66కోట్లతో నిర్మించిన కృష్ణా జలాల పథకం పనులు పూర్తయ్యాయి. ఈ పథకం నుంచి ట్రిపుల్ఐటీకి మంచినీళ్లు కావాలని ఆర్జీయూకేటీ అధికారులు అడిగిన నేపథ్యంలో రోజుకు 15లక్షల లీటర్ల నీటిని ఇవ్వడానికి మున్సిపల్ పాలకవర్గం అంగీకరించింది. రోజుకు 1.30కోట్ల లీటర్ల నీటిని అందజేసే సామర్థ్యం ఉన్న కృష్ణాజలాల పథకం నుంచి నూజివీడు పట్టణానికి రోజుకు 70లక్షల లీటర్ల నీరు సరిపోతుంది. రాబోయే 30ఏళ్ల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మంజూరు చేసిన పథకం కావడంతో ప్రస్తుతం దాదాపు 50లక్షల లీటర్ల కృష్ణా జలాలు అదనంగా వస్తున్న నేపథ్యంలో ట్రిపుల్ఐటీ వద్ద నుంచి కొంతమేరకు నిర్వహణ ఖర్చులు తీసుకుని కృష్ణాజలాలను అందించాలని పాలకవర్గం నిర్ణయించింది. దీనిలో భాగంగా వెయ్యి లీటర్లకు రూ.36 చొప్పున 183రోజులకు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 98.82లక్షలు చెల్లించడానికి ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులు అంగీకరించారు. అలాగే మున్సిపాలిటీ విధించనున్న నెలవారీ నీటి పన్ను ఇవ్వడానికి సైతం ఆమోదం లభించింది. కృష్ణాజలాల ఫిల్టర్ ఫ్లాంట్ నుంచి ట్రిపుల్‌ఐటీలోకి పైప్‌లైన్ నిర్మాణం పూర్తి కావడంతో ఇటీవల ట్రయల్ రన్ పూర్తిచేశారు. 3బోర్లున్నా నీటి కొరతే.... నూజివీడు ట్రిపుల్‌ఐటీలో 13బోర్లద్వారా మోటర్లతో నీటిని తోడుతున్నప్పటికీ రోజుకు నాలుగు గంటల కంటే ఎక్కువ సేపు నీటిని ఇచ్చే పరిస్థితి లేదు. ఏడాది పొడవునా మోటర్లతో నీటిని తోడడం వల్ల బోర్లలో నీటిమట్టం సైతం ఏడాదికేడాదికి పడిపోతోంది. వేసవికాలం వస్తే నీటి ఎద్దడి మరింత పెరుగుతోంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఒక్కొక్కసారి విద్యుత్‌కోత సమయంలో బయటి నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి వస్తోంది. ఒకవైపు కరెంటు బిల్లులకు లక్షలాది రూపాయలు చెల్లిస్తున్నా బోర్లలో నీరులేక నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తున్నందున కృష్ణాజలాలను సరఫరా చేయాల్సిందిగా పూర్వడెరైక్టర్ ఇబ్రహీంఖాన్ మున్సిపల్ అధికారులను కలసి అడగడంతో వారు వెంటనే అంగీకరించారు. అన్ని పనులు పూర్తయిన నేపథ్యంలో అక్టోబర్ ఒకటి తరువాత ఎప్పుడైనా ట్రిపుల్ఐటీకి కృష్ణాజలాల సరఫరా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. దీంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న నీటి సమస్యకు శాశ్వతంగా తెరపడనుంది. -
ట్రిపుల్ ఐటీలకు అటానమస్
వేంపల్లె : రాష్ట్రంలోని మూడు ట్రిపుల్ ఐటీలకు అటానమస్ (స్వయంప్రతిపత్తి) కల్పించినట్లు చాన్సలర్ అడ్వయిజర్ వై.కృష్ణారెడ్డి తెలిపారు. మూడు ట్రిపుల్ ఐటీలను సమానంగా అభివృద్ధిపరచాలన్నదే ప్రధాన లక్ష్యమని తెలిపారు. సోమవారం ఆయన ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో విలేకరులతో మాట్లాడారు. ఆగస్ట్ 16వ తేదీనుంచే ట్రిపుల్ ఐటీలకు స్వయంప్రతిపత్తి కల్పించినట్లు తెలిపారు. కృష్ణాజిల్లాలోని నూజివీడు, కడప జిల్లాలోని ఇడుపులపాయ, తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలు ఆర్జీయూకేటీ పరిధిలో ఉండేవన్నారు. ఆగస్ట్ 4వ తేదీన హైదరాబాద్‌లోని ఆర్జీయూకేటీ ప్రధాన కార్యాలయంలో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ట్రిపుల్ ఐటీలకు స్వయంప్రతిపత్తి కల్పించేందుకు చాన్సలర్ రాజిరెడ్డి, వైస్ చాన్సలర్ రాజ్‌కుమార్, రిజిష్ట్రార్ సోమయ్య నేతృత్వంలో సమావేశం జరిగిందన్నారు. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆగస్ట్ 16వ తేదీనుంచి ట్రిపుల్ ఐటీలకు స్వయంప్రతిపత్తి కల్పించినట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. గతంలో ఏ చిన్న వస్తువు కొనుగోలు చేసినా యూనివర్శిటీ అనుమతి తీసుకుని అక్కడ బిల్లు పాసైన తర్వాతనే మొత్తం వచ్చేదన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి ఉండదన్నారు. పర్యవేక్షణ యూనివర్శిటీ పరిధిలో ఉన్నప్పటికి ఆయా ట్రిపుల్ ఐటీలే స్వయంగా నడుస్తాయన్నారు. ఇందుకు సంబంధించి మూడు కమిటీలు ఉంటాయన్నారు. అడ్మినిస్ట్రేటివ్, అకడమిక్, ఫైనాన్షియల్ అటానమీలు ఉంటాయన్నారు. ఇందుకోసం అధికారులను కూడా నియమించారన్నారు. ఇన్‌ఛార్జి డెరైక్టర్‌గా వేణుగోపాల్‌రెడ్డి, ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా కె.ఎల్.ఎన్.రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా విశ్వనాథరెడ్డి, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్‌గా ప్రభాకర్‌రెడ్డి, ఎన్ఎస్ఎస్ కో.ఆర్డినేటర్‌గా డి.వి.రావులను నియమించినట్లు తెలిపారు. మొదటి స్నాతకోత్సవంలో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి 13బంగారు పతకాలు రాగా నూజివీడుకు ఒకటి వచ్చిందన్నారు. బాసర ట్రిపుల్ ఐటీకి ఒక్క బంగారు పతకం కూడా రాలేదన్నారు. ఫీజులు చెల్లించని విద్యార్థులకు కాన్వకేషన్ ఇవ్వడంలేదన్నారు. ప్రభుత్వం నుంచే కాకుండా వారు చెల్లించాల్సిన ఫీజులను చెల్లించకపోవడంవల్లే కాన్వకేషన్ ఇవ్వడంలేదన్నారు. ఇడుపులపాయలో నో డ్యూస్ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాతనే హైదరాబాద్‌లో కాన్వకేషన్ సర్టిఫికెట్ పొందాలన్నారు. -
విద్యార్థి ఆత్మహత్యతో కలకలం
ఫోన్ మాయంపై వాదులాడుకున్న విద్యార్థులు హత్యేనంటున్న కుటుంబ సభ్యులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు నూజివీడు : నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న ఎంఎంఈ బ్రాంచికి చెందిన వికలాంగ విద్యార్థి వెంట్రపాటి శ్రీకాంత్ ప్రసన్నకుమార్ ఆత్మహ త్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృ ష్టించింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.30 గంటల సమయంలో ఐ-2 బ్లాక్‌లోని హాస్టల్ భవనం నాలుగో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు కింద పడిన శబ్దానికి విద్యార్థులు లేచి కిందకు వెళ్లి చూడగా రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నాడు. దీంతో అతడిని క్యాంపస్‌లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ట్రిపుల్ఐటీ అంబులెన్స్‌లో ఏరియా ఆస్పత్రికి తరలిం చారు. అక్కడ వైద్యులు పరీక్షించి, చనిపోయాడని చెప్పారు. ఈ విషయాన్ని వెంటనే విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి తెలిపారు. వారు అందించిన సమాచారంతో ఇన్చార్జి డెరైక్టర్ కోసూరి హనుమంతరావు ఏవో పరిమి రామనరసింహం, పీఆర్వో వీరబాబుతో కలసి ఏరియా ఆస్పత్రికి వచ్చారు. శ్రీకాంత్ తండ్రి శ్రీ హరిబాబుకు ట్రిపుల్ఐటీ పీఆర్వో వీరబాబు ఫోన్ చేసి, ‘మీ కుమారుడికి సీరియస్‌గా ఉంది’ అని సమాచారమిచ్చారు. ఆస్పత్రి నుంచి సమాచారం రావడంతో పట్టణ ఎస్సై బోనం ఆదిప్రసాద్ సిబ్బందితో వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం హాస్టల్‌కు వెళ్లి ఘటనాస్థలిని పరిశీలించారు. మృతుడి రూమ్మేట్లనుంచి స్టేట్మెంట్లు నమోదు చేశారు. శ్రీకాంత్ స్వ గ్రామం పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు. పేద కుటుంబానికి చెందిన ఇతడు వికలాంగుల కోటాలో ట్రిపుల్ఐటీకి ఎంపికయ్యాడు. తండ్రి శ్రీహరిబాబు లారీ డ్రైవర్‌గా పనిచేస్తుంటారు. రాత్రి 11.30 గంటల వరకు వాదన శ్రీకాంత్‌కు స్నేహితుడైన ప్రవీణ్ అనే విద్యార్థికి చెందిన ఫోన్ రెండురోజుల క్రితం పోయింది. గతంలో సెల్ఫోన్లను తస్కరించిన సంఘటనలకు పాల్పడిన నేపథ్యంలో శ్రీకాంత్‌పై అతడికి అనుమానం కలిగింది. తాజా ఘటనపై వారి ద్దరితో పాటు మరికొంతమంది విద్యార్థుల మధ్య హాస్టల్రూంలో రాత్రి 11.30 గంటల వ రకు వాదన జరిగింది. ఈ విషయాన్ని ప్రవీణ్ 11గంటల సమయంలో శ్రీకాంత్ తండ్రికి ఫోన్‌చేసి తెలిపాడు. దానికి ఆయన రేపు వాళ్ల అమ్మను పంపిస్తానని, గొడవ పడవద్దని కూడా చెప్పినట్లు విద్యార్థులు తెలుపుతున్నారు. ఈ విషయం కేర్‌టేకర్ దృష్టికి కూడా వెళ్లగా, ఆ యన కూడా రేపు దాని గురించి మాట్లాడదామ ని, పడుకోమని తెలపడంతో విద్యార్థులు నిద్రపోయారు. తరువాత 1.30 గంటల సమయం లో ఆత్మహత్య ఘటన జరిగింది. పెళ్లైన పదేళ్లకు పుట్టాడు హరిబాబు, సుశీలకు పెళ్లైన పదేళ్లకు పుట్టిన శ్రీకాంత్‌ను అల్లారుముద్దుగా పెంచుకున్నామ ని, ట్రిపుల్‌ఐటీలో సీటు వస్తే ప్రయోజకుడవుతాడని భావించామని, ఇలా శవాన్ని తీసుకెళ్లా ల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదని మృతుడి మేనమామ, బాబాయి, తాత వాపోయారు. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తల్లి సుశీల కన్నీరుమున్నీరైంది. ప్రస్తుతం విధి నిర్వహణలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఉన్న మృతుడి తండ్రి శ్రీహరిబాబుకు ఈ విషయం తెలియడంతో హుటాహుటిన నూజివీడు బయలుదేరాడని బంధువులు తెలిపారు. ఘటనాస్థలిని పరిశీలించిన సబ్‌కలెక్టర్ ఈ ఘటన గురించి తెలిసిన ఇన్చార్జి సబ్ కలెక్టర్ ఎన్.రమేష్‌కుమార్ ట్రిపుల్ ఐటీకి వచ్చి హాస్టల్ భవనాన్ని పరిశీలించారు. ఇన్చార్జి డెరైక్టర్ కె. హనుమంతరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహశీల్దార్ షేక్ ఇంతియాజ్‌పాషా, ఎస్సై బి.ఆదిప్రసాద్ ఉన్నారు. డీఎస్పీ జె.సీతారామస్వామి కూడా ఘటనాస్థలిని పరిశీలించారు. కుటుంబ సభ్యు ల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. విద్యార్థులే కొట్టి చంపారు : మృతుడి బంధువుల ఆరోపణ శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, విద్యార్థులే కావాలని కొట్టి చంపారని ఆరోపించారు. ఏదైనా జరిగితే డెరైక్టర్ దృష్టికి గానీ, బాధ్యత కలిగిన అధికారి దృష్టికి గానీ విషయాన్ని తీసుకెళ్లాల్సి ఉందన్నారు. ఇలా ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. బిల్డింగ్‌పైన ఐదు అడుగుల ఎత్తు ఉన్న పిట్టగోడను శ్రీకాంత్ ఎక్కలేడని, హత్యచేసి మాయ చే యాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఇంత చిన్న విషయానికే ఆత్మహత్య చేసుకుంటారా? అని శ్రీకాంత్ బంధువులు ప్రశ్నిస్తున్నారు. -
ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి డెరైక్టర్‌గా హనుమంతరావు
చాన్సలర్‌కు సలహాదారుగా ఇబ్రహీంఖాన్ నూజివీడు : ట్రిపుల్ ఐటీ ఇన్‌ఛార్జి డెరైక్టర్‌గా ఆచార్య కోసూరి హనుమంతరావు శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఆర్జీయూకేటీ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి ట్రిపుల్ ఐటీలను ఏర్పాటుచేసిన ఆరేళ్ల తరువాత పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా నూజివీడు ట్రిపుల్ ఐటీలోనే ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా, పరీక్షల విభాగం సమన్వయకర్తగా పనిచేస్తున్న హనుమంతరావును ఇన్‌ఛార్జి డెరైక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బాధ్యతలను ప్రస్తుత డెరైక్టర్ ఇబ్రహీంఖాన్ నుంచి స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను అందించేందుకు కృషిచేస్తానన్నారు. ఛాన్సలర్ సలహాదారుగా ఇబ్రహీంఖాన్ ఆరేళ్లపాటు నూజివీడు ట్రిపుల్ ఐటీ వ్యవస్థాపక డెరైక్టర్‌గా పనిచేసిన ఇబ్రహీంఖాన్‌ను ఛాన్సలర్‌కు సలహాదారుగా నియమిస్తూ ఆర్జీయూకేటీ కులపతి ప్రొఫెసర్ డీ రాజ్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అంతేగాకుండా బాసర ట్రిపుల్ ఐటీ ఎగ్జిక్యూటీవ్ కమిటీ (ఈసీ) సభ్యులుగానూ నియమితులయ్యారు. సలహాదారుగా ఇబ్రహీంఖాన్ ప్రతి నెలా మూడు ట్రిపుల్ ఐటీలను సందర్శించనున్నారు. -
రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయని ప్రభుత్వం
రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయని ప్రభుత్వం ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్న ఆర్జీయూకేటీ ఆందోళనలో ట్రిపుల్ ఐటీ తొలి బ్యాచ్ విద్యార్థులు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఉద్యోగాలు దూరమవుతాయని ఆవేదన నూజివీడు : పేద ఇంట పుట్టినా సాంకేతిక ఉన్నత విద్యను అందిపుచ్చుకున్నామన్న ఆనందం ట్రిపుల్ ఐటీ విద్యార్థుల్లో ఆవిరవుతోంది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో ఆందోళన నానాటికీ రెట్టింపవుతోంది. ఆరేళ్ల కిందట ఏర్పాటుచేసిన ట్రిపుల్ ఐటీల్లో చేరిన తొలి బ్యాచ్‌కు చెందిన రెండు వేల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పూర్తిచేశారు. ఈ బ్యాచ్‌కు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రూ.5కోట్లను ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదు. కోర్సు పూర్తయినా ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని ట్రిపుల్ ఐటీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఐదేళ్ల బకాయిలు కూడా చెల్లించాలని సూచిస్తున్నారు. దీంతో పేద కుటుంబాలకు చెందిన తాము రూ.40 వేల నుంచి రూ.80వేల వరకు చెల్లించలేమని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సర్టిఫికెట్ల ఇవ్వకపోతే క్యాంపస్ సెలక్షన్స్‌లో వచ్చిన ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. రూ.45వేల నుంచి రూ.84వేల వరకు భారం ట్రిపుల్ఐటీలలో ఆరు సంవత్సరాల కోర్సు పూర్తిచేసిన వారు వివిధ కేటగిరీల ప్రకారం ఈ ఏడాది ఫీజుతో కలిపి రూ.45వేల నుంచి రూ.84వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ4 విద్యార్థులకు ప్రభుత్వం ఏడాదికి రూ.40వేలు చొప్పున ఫీజు రీయింబర్స్మెంట్ కింద చెల్లిస్తోంది. ఈ మొత్తం ఇప్పటి వరకు రాలేదు. దీంతో ఒక్కో విద్యార్థి ఆ 40వేల రూపాయలు, బకాయిలు కలిపి లెక్కిస్తే బీసీ విద్యార్థులు రూ.51,800, ఎస్సీ విద్యార్థులు రూ.45వేలు, ఓసీ విద్యార్థులు రూ.84వేలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ రావాల్సి వారు 1,825 మంది ఉన్నారు. వారిలో ఎస్సీ వర్గానికి చెందిన 283 మంది విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వచ్చాయి. మిగిలిన 1,542 మందికి సంబంధించిన రూ.5కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తం తాము చెల్లించలేమని విద్యార్థులు వాపోతున్నారు. ఏటా మే, జూన్ నెలల్లోనే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేసేవారు. ఈసారి మాత్రం ఆగస్టు మొదటి వారం పూర్తయినా నిధులు విడుదల చేయలేదు. సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంపై విమర్శలు రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ) వీసీ ఆర్వీ రాజకుమార్ తీసుకుంటున్న నిర్ణయాలు తొలి నుంచి వివాదాస్పదమవుతూనే ఉన్నాయి. మెంటార్ల విషయంలోనూ, ఐఐటీలకు వెళ్లి ఇతర రాష్ట్రాల వారిని తీసుకొచ్చి లెక్చరర్లుగా నియమించడం, మెంటార్లను, లెక్చరర్లను వేర్వేరుగా చూడటంపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా కోర్సు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పేద పిల్లలకు ఉన్నత విద్యను అందించాలనే సదాశయంతో ఏర్పడిన ఆర్జీయూకేటీ ఈ విధంగా విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం ఆడటం తగదని మండిపడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీచేసి అనంతరం నిధుల విడుదలకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.మహేష్ కోరారు. -
భవిష్యత్తు ట్రిపుల్ ఐటీలదే
-
భవిష్యత్తు ట్రిపుల్ ఐటీలదే: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తు ఐఐటీలది కాదని, ట్రిపుల్ ఐటీలదేనని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చెప్పారు. నాణ్యమైన విద్యనందించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) తరహా యూనివర్శిటీలను ప్రోత్సహించాలని సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఆర్జీయూకేటీ మొదటి స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి నరసింహన్ ముఖ్య అతిథిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ, నూజివీడు, బాసర ట్రిపుల్ ఐటీలలో 2008లో ఆరేళ్ల సమీకృత విద్యా విధానంలో ప్రవేశం పొంది ఈ ఏడాది విద్యాభ్యాసాన్ని పూర్తిచేసుకున్న విద్యార్థులు ఈ స్నాతకోత్సవంలో పట్టాలు అందుకున్నారు. బీటెక్, ఎంటెక్‌లలో విజేతలుగా నిలిచిన పలువురికి గవర్నర్, సీఎంలు మెడల్స్ అందించారు. ఫీజు ఇన్సెంటివ్‌ల కోసమే కళాశాలలను నడపడం సరికాదని గవర్నర్ అన్నారు. ఇన్సెంటివ్‌లు అందకపోతే కళాశాలలు మూసివేస్తామని యాజమాన్యాలు హెచ్చరించడాన్ని గవర్నర్ తప్పుపట్టారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలైన కేసీఆర్, చంద్రబాబులు మిషన్, విజన్, లీడర్షిప్ ఉన్న వ్యక్తులని కొనియాడారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ 2020 నాటికి యువత అధిక శాతం ఉండే దేశాల్లో భారత్ అగ్రగామిగా నిలుస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్జీయూకేటీ చాన్సలర్ ప్రొఫెసర్ రాజ్‌రెడ్డి, వైస్ చాన్సలర్ ఆర్వీ రాజ్‌కుమార్ పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్ ప్రారంభం
తొలిరోజు 498 మందికి అడ్మిషన్లు పూర్తి పెండింగ్‌లో ఇద్దరి అడ్మిషన్లు 21 మంది గైర్హాజరు నూజివీడు : స్థానిక ట్రిపుల్ ఐటీలో పీయూసీ ప్రథమ సంవత్సరానికి నిర్వహించిన ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. రాష్ట్రంలోని మూడు ట్రిపుల్ ఐటీలకు కలిపి 2,807 మందిని ఎంపిక చేశారు. వారిలో నూజివీడు ట్రిపుల్ ఐటీకి 936 మందిని కేటాయించారు. తొలిరోజు 525 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ కౌన్సెలింగ్ ప్రశాంతంగా కొనసా గింది. విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించి, ఫీజులు వసూలుచేశారు. ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ ఇబ్రహీం ఖాన్, ఓఎస్డీ రామకృష్ణారెడ్డి, పీఆర్వో వీరబాబు పర్యవేక్షణలో ఎలాంటి అవాంతరాలు లేకుండా కౌన్సెలింగ్ జరిగింది. సీనియర్ ప్రొఫెసర్లు పరిమి రామ నర్సింహం, హనుమంతరావు ఈ ప్రక్రియకు సహకరించారు. అకడమిక్ కన్సల్టెంట్ రాజగోపాల్‌రెడ్డి, అసిస్టెంట్ చెన్నారెడ్డి కౌన్సెలింగ్ హాలులో ఉండి సర్టిఫికెట్ల పరిశీలనలో సిబ్బందికి ఎదురైన సందేహాలను నివృత్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులధృవీకరణ పత్రాలను ఎస్సీ, బీసీ, ఎస్టీ సంక్షేమ అధికారులు పరిశీలించి నిర్ధారించారు. తొలిరోజు కౌన్సిలింగ్లో 498 మందికి ప్రవేశాలను ఖరారు చేశారు. ఇద్దరి ప్రవేశాలను ప్రవేశాలను పెండింగ్‌లో ఉంచారు. 21మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం 12కౌంటర్లు ఏర్పాటు చేసి 80మంది సిబ్బందిని నియమించారు. 30 మంది ఎన్సీసీ విద్యార్థులు కూడా సేవలందించారు. తాగునీరు, ప్రథమ చికిత్స కౌంటర్లు, ఎన్సీసీ క్యాడెట్ల సేవలు అందుబాటులో ఉండటంతో అంతా సజావుగా సాగింది. విద్యార్థులకు ఉచిత భోజన సదుపాయం కల్పించారు. మిగిలిన విద్యార్థులకు గురువారం కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఉదయం ఎనిమిది గంటలకే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పెండింగ్ వివరాలు ఆంధ్రా రీజియన్‌కు చెందిన కె.రమ్యను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ కింద ఎంపికచేశారు. దీంతో ఆమె అడ్మిషన్‌ను పెండింగ్‌లో ఉంచారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దుడ్డు మౌనిక 4వ తరగతి నుంచి 10వ తరగతి లోపు ఇతర రాష్ట్రాల్లో మూడేళ్లు చదువుకుంది. ఏడేళ్లు ఒకే ప్రాంతంలో చదివితేనే లోకల్‌గా పరిగణిస్తున్న నేపథ్యంలో ఆమె అడ్మిషన్‌ను కూడా పెండింగ్‌లో ఉంచారు. -
నిట్‌లో కౌన్సెలింగ్ సందడి
నేటితో ముగియనున్న మొదటి విడత ఒక్క రోజే 399 మంది రిపోర్టింగ్ నిట్‌క్యాంపస్ : దేశంలోని వివిధ నిట్లు, ట్రిపుల్ ఐటీలు, ఐఐటీ, వరంగల్ నిట్‌లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశం కోసం సీట్ అలాట్మెంట్ రిపోర్టింగ్‌కు వచ్చిన విద్యార్థులతో సందడి మొదలైంది. వేరే రాష్ట్రాలు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు, వారు తల్లిదండ్రులతో హాజరయ్యారు. దీంతో సందడి నెలకొంది. వీరంతా నిట్‌లోని ఆడిటోరియంలో రిపోర్టు చేశారు. ఆడిటోరియంలో విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. బుధవారం ఒక్కరోజే సుమారు 399 మంది రిపోర్టింగ్‌కు హాజరయ్యారు. మొదటి విడుత రిపోర్టింగ్ గురువారంతో ముగియనుందని నిట్ అకడమిక్ డీన్ డీవీఎల్‌ఎన్ సోమయాజులు తెలిపారు. డీన్ సోమయాజులు, నిట్ ఎంబీఏ విభాగం అధిపతి రవీందర్‌రెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్ ఆనందకిషోర్‌లు రిపోర్టింగ్ సెంటర్లో సర్టిఫికెట్లను పరిశీలించారు. ఇంప్రూవ్మెంట్ మార్కులను పరిగణనలోకి తీసుకోవాలి జేఈఈలో వచ్చిన మార్కులు, ఇంటర్మీడియెట్‌లో వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకుని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) జేఈఈ ర్యాంకులను ప్రకటించింది. జేఈఈలో వచ్చిన మార్కులు, ఇంటర్మీడియెట్‌లో వచ్చిన మార్కుల నిష్పత్తి ఆధారంగా ర్యాంకులను నిర్ధారించారు. ఆ ర్యాంకుల ఆధారంగా ఐఐటీ, ఐఐఐటీ, నిట్, ఇతర ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థులకు సెంట్రల్ సీట్ అలాట్మెంట్ బోర్డు (సీఎస్ఏబీ) ద్వారా సీటు అలాట్మెంట్ చేస్తారు. అయితే కొన్ని రోజుల క్రితం ఇంటర్మీడియెట్ ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఇందులో కొంతమందికి గతంలో కన్న ఎక్కువ మార్కులు వచ్చాయి. ఈ మార్కులను పరిగణలోకి తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు నిట్ అకడమిక్ అధికారులను కోరారు. -
ప్చ్.. ట్రిపుల్ ఐటీ
ఫలితాలు అంతంతే 69శాతమేఉత్తీర్ణత కొంపముంచిన గణితం పల్లెలోని పేద విద్యార్థులకు సైతం ప్రతిభావంతమైన విద్యనందించాలనే మహోన్నతాశయంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి స్థాపించిన ట్రిపుల్‌ఐటీల ప్రతిష్ట మసకబారిపోతోంది. ఫలితాలు రానురాను నిరాశాజనకంగా మరింత దిగజారిపోతున్నాయి. నూజివీడు : ఎంతో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సర ఫలితాల శాతం తగ్గిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన సెమిస్టర్ పరీక్షల ఫలితాలను బుధవారం ట్రిపుల్ఐటీ డెరైక్టర్ ఇబ్రహీంఖాన్ ప్రకటించారు. ఈ ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం కేవలం 69.2శాతంగా మాత్రమే ఉంది. అయితే మొదటి సెమిస్టర్ ఫలితాలతో చూస్తే ఉత్తీర్ణతాశాతం కొద్దిగా మెరుగైనట్టున్నా అనుకున్నంతస్థాయిలో మాత్రం ఫలితాలు రాలేదని ప్రొఫెసర్లు చెబుతున్నారు. పదోతరగతిలో మండలస్థాయిలో ప్రథమస్థానాల్లో నిలిచిన విద్యార్థులను ఎంపికచేసి, వారిని 24గంటలు తమ దగ్గరే ఉంచుకుని, ఐఐటీల్లో అత్యంత ప్రతిభ కనబరరిచిన వారిని ప్రొఫెసర్లుగా నియమించి విద్యాబోధన చేస్తున్నప్పటికీ ఫలితాలు మాత్రం సాధారణ ఇంజినీరింగ్గు కళాశాలల కంటే ఘోరంగా వస్తున్నాయి. 958మంది ఇంజినీరింగ్ ప్రథమసంవత్సర విద్యార్థులు ఏప్రిల్ నెలలో సెమిస్టర్ పరీక్షలు రాయగా వీరిలో 663మంది మాత్రమే ఉత్తీర్ణులవ్వగా, 295మంది తప్పారు. వీరిలో అత్యధికంగా 162మంది విద్యార్థులు గణితం-2లో తప్పారు. తరువాత స్థానాల్లో ఎలక్ట్రికల్ టెక్నాలజీలో 132మంది, భౌతికశాస్త్రంలో 80 మంది తప్పారు. తప్పిన 295 మందిలో ఒక సబ్జెక్టు తప్పిన విద్యార్థులు 165మంది, రెండు సబ్జెక్టులు తప్పినవారు 75మంది, మూడు సబ్జెక్టులు తప్పిన వారు 41 మంది, 4సబ్జెక్టులు తప్పిన వారు 13మంది, 6సబ్జెక్టులు తప్పిన వారు ఒకరు ఉన్నారు. సబ్జెక్టులు తప్పిన వారందరికీ ఈ నెలాఖరులో రెమీడియల్ పరీక్షలు నిర్వహించనున్నారు. లోపం ఎక్కడ... గత నాలుగేళ్లుగా ఇంజినీరింగు ప్రథమ సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ మెకానిక్స్, ఎలక్ట్రికల్ టెక్నాలజీ సబ్జెక్టులలోనే ఎక్కువ మంది తప్పుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందనే దానిపై యూనివర్సిటీ అధికారులు దృష్టిసారించి లోపాలు సరిచేసుకోకపోవడం వల్లనే ప్రతి సెమిస్టర్‌లోనూ విద్యార్థులకు గండంగా మారింది. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన లెక్చరర్ల బోధన విద్యార్థులకు అర్థంకాక తప్పుతున్నామని విద్యార్థుల అభిప్రాయం. మరికొంతమంది ఫ్యాకల్టీలు, లెక్చరర్లు రెగ్యులర్‌గా క్లాసులకు రారని తెలుస్తుంది. ఇకనుంచైనా ఉన్న లోపాలను సవరించుకుంటే మంచిఫలితాలు వచ్చి ట్రిపుల్‌ఐటీల ప్రతిష్ట మసకభారకుండా ఉంటుందని మేధావులు పేర్కొంటున్నారు. -
జాతీయ విద్యాసంస్థల ఊసేదీ?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతిలో జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుపై ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు సహా రాష్ట్ర మంత్రులు చేసిన హడావుడి అంతా ఒట్టిదేనని తేలిపోయింది. కేంద్రం జాతీయ విద్యా సంస్థలను మంజూరు చేయకనే 11 విద్యా సంస్థలను మంజూరు చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు స్ఫూర్తితో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మరో అడుగు ముందుకేశారు. విశాఖపట్నంలో గిరిజన, పెట్రో కెమికల్ విశ్వవిద్యాలయం, ట్రిపుల్ ఐటీ, ఐఐఎం, గుంటూరు-విజయవాడ మధ్య ప్రాంతంలో ఎన్ఐటీ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ), ఎయిమ్స్(ఆల్ ఇండియా మెడికల్ సైన్సస్), వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎన్ఐడీ(జాతీయ విపత్తు నివారణ సంస్థ), తిరుపతిలో ఐఐటీ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ), సెంట్రల్ యూనివర్సిటీ, ఐఐఎస్ఈఆర్(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్) క్యాంపస్‌లు ఏర్పాటుచేస్తామని జూన్ 18న విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ విద్యా సంస్థల ఏర్పాటుకు మూడు ప్రాంతాల్లోనూ కనిష్టంగా వెయ్యి ఎకరాల భూమిని గుర్తించాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు-విజయవాడలను ఎడ్యుకేషన్ హబ్‌లుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. లాసెట్ ఫలితాలు విడుదల చేసేందుకు జూన్ 22న తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటికీ వచ్చిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అదే అంశాన్ని పునరుద్ఘాటించారు. కానీ.. ఆ సంస్థల ఏర్పాటుపై ప్రధాని నరేంద్రమోడీగానీ, కేంద్ర మానవవనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీగానీ ఎక్కడా అధికారికంగా ప్రకటించిన దాఖలాలు లేవు. పోనీ.. ఆ 11 విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా రాష్ట్రంలో క్యాంపస్‌లు ఏర్పాటుచేస్తామని ప్రకటించలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఐఐటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎన్ఐటీ, ఎయిమ్స్, పెట్రో కెమికల్ యూనివర్సిటీ, గిరిజన విశ్వవిద్యాలయం, సెంట్రల్ వర్సిటీ ఏర్పాటు చేస్తామని మాత్రమే అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. అంటే.. పునర్వ్యవస్థీకరణ బిల్లులో కూడా ఎన్ఐటీ, ఐఐఎస్ఈఆర్, ట్రిపుల్ ఐటీలు లేనట్లు స్పష్టమవుతోంది. జాతీయ విద్యా సంస్థల ఏర్పాటు ప్రక్రియ మొత్తం కేంద్ర మానవవనరులశాఖ పరిధిలో ఉంటుంది. ఆ శాఖ ఇప్పటిదాకా జాతీయ విద్యాసంస్థల ఏర్పాటుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. గురువారం 2014-15 బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ రాష్ట్రంలో ఎయిమ్స్, ఐఐటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం నెలకొల్పుతున్నట్లు ప్రకటించారు. ఆ మూడు సంస్థల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తున్నట్లు స్పష్టీకరించారు. అంటే.. సీఎం చంద్రబాబు, మంత్రి గంటా ప్రకటించినట్లుగా 11 జాతీయ విద్యా సంస్థలు మంజూరు కానట్లు స్పష్టమవుతోంది. పోనీ.. బడ్జెట్లో మంజూరు చేసిన ఎయిమ్స్, ఐఐటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలను రాష్ట్రంలో ఏ ప్రాంతంలో నెలకొల్పుతామన్న అంశాన్ని సైతం కేంద్రం స్పష్టంగా చెప్పలేదు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. కేంద్రం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడకుండానే రాష్ట్రంలో 11 జాతీయ విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించినట్లు స్పష్టమవుతోంది. ఇదే అదునుగా తీసుకున్న గంటా శ్రీనివాసరావు ఏ ఏ సంస్థను ఎక్కడ నెలకొల్పేది కూడా ప్రకటించేశారు. రియల్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం లేనిది ఉన్నట్లు చూపిందనే విమర్శలు సర్వత్రా వ్యక్తవుతున్నాయి. రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ఎయిమ్స్, ఐఐటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తిరుపతికి ఏవి కేటాయిస్తున్నారో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. -
సరస్వతీపుత్రిక ఆర్థిక పోరాటం
లక్ష్మీకటాక్షం లేని జయలక్ష్మి ఆమెది చదువు కోసం ఆరాటం. కానీ లక్ష్మీ కటాక్షమే లేదు. సర్కారు బడిలో చదువుకున్నా టెన్త్‌లో అత్యున్నత ప్రతిభచూపి ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన జయలక్ష్మికి ఇప్పుడు పై చదువు పరీక్షగా మారింది. కుటుంబం గడవడమే కష్టమైన పరిస్థితుల్లో ఉన్నత చదువు ఎలాగో ఆమెకు దిక్కుతోచడం లేదు. ఆదుకునే హస్తం ఉంటే చదువు కోవాలన్నది ఆమె కోరిక. కొత్తకోట(రావికమతం) : ఆమె పేరులోనే విజయం ఉన్నా లక్ష్మీ కటాక్షం మాత్రం లేదు. చదువులో సత్తాచాటినా ఆర్థిక పరిస్థితులు ఆమె ముందరి కాళ్లకు బంధం అవుతున్నాయి. ఇది కొత్తకోట గ్రామానికి చెందిన ఉండా జయలక్ష్మి దీనగాథ. కటిక పేదరికం...పైగా తండ్రికి పక్షవాతం. కుటుంబం గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఇక ఆమె చదువుసాగడం ఎలా. పదోతరగతితో 9.8 పాయింట్లు సాధించిన జయలక్ష్మి నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధిం చింది. ఆర్థిక పరిస్థితి అనుకూలించక పోవడంతో ‘పైచదువులు మనకెందుకులే తల్లీ’ అంటూ కుటుంబ సభ్యులు చెబుతుం టే ఆమె కన్నీటిపర్యంతమవుతోంది. ఉండాకొండబాబు, సత్యవతి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. తండ్రి మంచంపట్టగా తల్లి సంపాదనే వారికి ఆధారం. ఊర్లోనే ప్రభుత్వ పాఠశాల ఉండడంతో పదో తరగతి వరకు గడిచిపోయింది. ఓ వైపు అరకొర ఆదాయం, మరోవైపు తండ్రికి వైద్యంతో ప్రస్తుతం కుటుం బం గడవడమే కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఆమె పై చదువు ప్రశ్నార్థకంగా మారింది. ఓ వైపు పాఠశాల ప్ర ధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు ఉన్నత చదువులు చదివించాలని సూ చిస్తున్నారు. జయలక్ష్మికి మంచి భవిష్యత్తు ఉందని చెబుతున్నా ఎలా సర్ధుకుపోవాలో అర్థంకాక ఆ పేద తల్లి తల్లడిల్లిపోతోంది. దాతలెవరైనా సాయం చేస్తే తప్ప జయలక్ష్మి చదువు కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు. ఏదైనా ఆపన్న హస్తం చేయూతనిస్తుందేమోనని ఆ కుటుంబం ఎదురు చూస్తోంది. -
ట్రిపుల్‌ఐటీని మరింత అభివృద్ధి చేయాలి
నూజివీడు: ట్రిపుల్‌ఐటీని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు అన్నారు. ఆర్జీయూకేటీ ఓఎస్డీ నితిన్‌రెడ్డి శుక్రవారం నూజివీడు ట్రిపుల్ఐటీ క్యాంపస్‌ను సందర్శించారు. ఆయన స్థానిక ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌అప్పారావుతో కలసి క్యాంపస్ అంతా కలియతిరిగారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ క్యాంపస్‌లోని రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు విద్యాపరంగా మరిన్ని కోర్సులు ప్రవేశపెట్టాలని కోరారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటైతే భవిష్యత్తులో నూజివీడు పట్టణానికి రాష్ట్రంలోనే ప్రాముఖ్యత ఏర్పడుతుందని, మరిన్ని విద్యాసంస్థలు వచ్చే అవకాశం ఉందన్నారు. అకడమిక్ బిల్డింగ్స్, సెంట్రల్‌లైబ్రరీ , సెమినార్ హాల్ తదితర బిల్డింగ్‌లను నిర్మించాలని, అన్ని ఆటలకు అనువుగా క్రీడా మైదానాలను అభివృద్ధిపరచాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నూజివీడుకు ఇచ్చిన వరం ట్రిపుల్ఐటీ అని, దీని అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతామని చెప్పారు. ట్రిపుల్ఐటీకి కావాల్సిన మరో వంద ఎకరాల భూమిని కేటాయిస్తూ గత ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నెలలో ఉత్తర్వులు జారీ చేసిందని, త్వరితగతిన రెవెన్యూ అధికారులు భూమిని సేకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్థలాల కొరత ఎక్కువగా ఉన్నందున ప్రాంగణంలో ఉన్న కొండమీద ఉన్న కూడా పాలనా సంబంధిత భవనాలను నిర్మించుకోవచ్చన్నారు. నితిన్‌రెడ్డి మాట్లాడుతూ.. ట్రిపుల్ఐటీలోని రోడ్లన్నింటినీ సీసీ రోడ్లుగా అభివృద్ధి చేస్తున్నామని, జూలై 3న నిర్మాణం ప్రారంభించి రెండునెలల్లో పూర్తిచేస్తామన్నారు. ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్(ఇండియా)లిమిటెడ్ సంస్థకు ఈ బాధ్యత అప్పగించినట్లు తెలిపారు. స్టూడెంట్ యాక్టివిటీ స్పోర్ట్స్ సెంటర్, గ్రంథాలయ భవన నిర్మాణాలను కూడా చేపడతామని వెల్లడించారు. స్థానిక ఓఎస్డీ జీ రామకృష్ణారెడ్డి, ఈపీఎల్ జనరల్మేనేజర్ టీవీ నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ నాయకులు పల్లెర్లమూడి అభినేష్, పల్లె రవీంద్రరెడ్డి పాల్గొన్నారు. -
ఐఐటికీ.. నూజివీడే అనుకూలం...
అందుబాటులో అనువైన స్థలం ప్రముఖుల రాకపోకలకు అనుకూలం నూజివీడు : సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో ట్రిపుల్ ఐటీని సొంత చేసుకుని గుర్తింపు తెచ్చుకున్న నూజివీడు ప్రాంతం నూతన నవ్యాంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానున్న ఐఐటీకీ అనుకూలమని ప్రముఖులు పేర్కొంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో 11జాతీయ విద్యాసంస్థలను నెలకొల్పుతామని కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నూజివీడు ప్రాంతంలో వేలాది ఎకరాల భూములు అందుబాటులో ఉన్నందున ఐఐటీ ఏర్పాటుకు నూజివీడు ప్రాంతం అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. విభజన అనంతరం రాష్ట్రంలో నూతన రాజధాని ఏర్పాటు కోసం, జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో నూజివీడులోనే ఐఐటీని ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే ఇక్కడ ట్రిపుల్ఐటీ నిర్వహిస్తుండటంతో పాటు నూజివీడు ప్రాంతంలో వేలాది ఎకరాల అటవీభూములు, దేవాదాయ భూములు అందుబాటులో ఉన్నాయి. ఐఐటీ ఏర్పాటు చేయాలంటే కనీసం 3వందల ఎకరాల భూమి కావాలి. ఇంత భూమి జిల్లాలో నూజివీడు ప్రాంతంలోనే ఉండటంతో పాటు ఒక్కరైతును కూడా ఇబ్బంది పెట్టకుండా భూములను సేకరించడానికి ఇక్కడ అవకాశముంది. ఐఐటీ ఏర్పాటు చేసినట్లయితే నిత్యం దేశ వ్యాప్తంగానే కాకుండా, విదేశాల నుంచి సైతం ప్రపంచస్థాయి విద్యావేత్తలు, సైంటిస్టులు రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. నూజివీడు నుంచి గన్నవరం విమానాశ్రయం కేవలం 30కిలోమీటర్ల దూరంలోనే ఉంది. గతంలో 2007లో రాష్ట్రానికి ఐఐటీ మంజూరైనపుడు బాసరలో ఏర్పాటు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి కేంద్రానికి నివేదిక పంపారు. దీంతో కేంద్రం నుంచి వచ్చిన హైపవర్ కమిటీ బాసర పరిసర ప్రాంతాలను సందర్శించి అక్కడి స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసి విమానాశ్రయం లేదని, అదే హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేస్తే ఐఐటీలకు వచ్చిపోయే విద్యావేత్తలకు, సైంటిస్టులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నివేదికను ఇవ్వడంతో చివరకు ఐఐటీని మెదక్ జిల్లా సంగారెడ్డి సమీపంలోని కంది వద్ద 576ఎకరాల్లో నెలకొల్పారు. విభజనానంతరం ఆంధ్రప్రదేశ్‌లోనూ ఐఐటీని ఏర్పాటు చేయనున్నందున 30కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయం ఉండటం, 20కిలోమీటర్ల దూరంలో చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి ఉండటం , విజయవాడ-గుంటూరు రాజధాని అయితే రాజధానికి కేవలం 40కిలోమీటర్ల దూరంలోరనే ఉండటం కూడా కలిసొచ్చే అంశమేనని ఈ ప్రాంత మేధావులు, రాజకీయ పక్షాల నాయకులు, ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. పారిశ్రామిక అభివృద్ధికి టెక్నాలజీని అనుసంధానం చేసుకోవడానికి ఐఐటీలు ఎంతో అవసరమైన నేపథ్యంలో నూజివీడులో ఐఐటీ ఏర్పాటు మంచిదేనే అభిప్రాయాన్ని సర్వత్రా వ్యక్తం చేస్తున్నారు. -
ట్రిపుల్ఐటీకి 35,877 దరఖాస్తులు
పెరుగుతున్న ఆదరణ గతేడాది కంటే 2వేలు అధికంగా దరఖాస్తులు మొత్తం సీట్లు మూడువేలు సీటొస్తే ఆరేళ్లవరకూ అన్నీఫ్రీయే నూజివీడు : ట్రిపుల్‌ఐటీలో అందిస్తున్న ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ కోర్సులో చేరడానికిగాను 35,877 దరఖాస్తులు అంది నట్లు ట్రిపుల్ఐటీ వర్గాలు తెలిపాయి. గతేడాది కంటే రెండువేల దరఖాస్తులు అధికంగా రావడం గమనార్హం. రాష్ట్రంలోని నూజివీడు, బాసర, కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఉన్న ట్రిపుల్ఐటీలలో ఒక్కొక్క దానిలో వెయ్యి సీట్ల చొప్పున మొత్తం మూడువేల సీట్లు ఉన్నాయి. ఈ కోర్సులో చేరడానికి గాను దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఆర్జీయూకేటీ అధికారులు గత నెల 24న నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈనెల 16వరకు ఆన్లైన్లో అప్లికేషన్లు పంపడానికి గడువు విధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ట్రిపుల్‌ఐటీలో సీటు కోసం భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్లో పంపిన దరఖాస్తుల ప్రింట్అవుట్లను ఈనెల 21 సాయంత్రం 5గంటల లోపు ఆర్జీయూకేటీకి అందాలి. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులలో సక్రమంగా ఉన్నవి ఎన్ని, ఇన్వేలిడ్ దరఖాస్తులు ఏమైనా ఉన్నాయా అనే అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ట్రిపులఐటీలోని ఆరు సంవత్సరాల ఇంజినీరింగ్ కోర్సులో భాగంగా మొదటి రెండు సంవత్సరాల పీయూసీ, తరువాత నాలుగు సంవత్సరాలు ఇంజినీరింగు విద్యను బోధించారు. వచ్చిన దరఖాస్తుల నుంచి సెలక్షన్ జాబితాను జులై 7న ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులు ప్రకటించనున్నారు. జులై 23, 24వతేదీలలో కౌన్సెలింగ్ నిర్వహించి 28నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. ట్రిపుల్ ఐటీలపై ఆసక్తి ఎందుకంటే ఏడాదికేడాది ట్రిపుల్‌ఐటీలపై విద్యార్థులలోను,వారి తల్లిదండ్రులలోను ఆసక్తి పెరుగుతుండడంతో ఏటా దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది. గతేడాది 32వేల దరఖాస్తులు రాగా, అంతకుముందు 28వేలువచ్చాయి. ఈ ఏడాది 35వేలు దాటాయి. ట్రిపుల్‌ఐటీలో సీటు లభిస్తే ఆరేళ్లపాటు ఎలాంటి ఫీజులు చెల్లించకుండా నాణ్యమైన ఇంజినీరింగ్ విద్యను పూర్తిచేయవచ్చు. అంతేగాకుండా పీయూసీ నుంచే ఏసీ తరగతి గదులుతోపాటు విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు సైతం ఇస్తారు. భోజన, వసతి సదుపాయాలతో పాటు డ్యూయల్ డిగ్రీలు, మైనర్కోర్సులు సైతం ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇవేగాక విద్యార్థులకు సంగీతం, నృత్యం, యోగాలలో కూడా ప్రతి రోజూ శిక్షణ ఇస్తుంటారు. ఇన్ని అవకాశాలు వేరే ఎక్కడా లేని నేపథ్యంలో ట్రిపుల్‌ఐటీలపై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది. -
ట్రిపుల్ ఐటీలతో పల్లె ప్రతిభకు నగిషీలు!
విద్యార్థుల్లో దాగున్న ప్రతిభను సానపడితే అద్భుతాలు సృష్టించగలరు! కెరీర్‌ను అత్యున్నతంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు దేశ ప్రగతిలో భాగస్వాములు కాగలరు! ఈ ఆశయంతో ఏర్పాటైనవే ట్రిపుల్ ఐటీలు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగావకాశాలు పొందడం ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకే సొంతమన్న మాటల్ని తిరగరాస్తున్నారు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు. ఉన్నత వేతనాలతో జాబ్ ఆఫర్లను చేజిక్కించుకుంటున్నారు. ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో స్పెషల్ ఫోకస్.. ప్రతిభావంతులైన పేద, గ్రామీణ విద్యార్థులు పదో తరగతితోనే సమున్నత కెరీర్‌కు మార్గం వేసుకునే దిశగా నెలకొల్పినవే ఏపీ ట్రిపుల్ ఐటీలు. ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా కేవలం పదో తరగతిలో చూపిన ప్రతిభ ఆధారంగా రెండేళ్ల ఇంటర్మీడియెట్‌కు సమానమైన పీయూసీ, ఆ తర్వాత నాలుగేళ్ల బీటెక్ కోర్సును నామమాత్రపు ఫీజుతో అందించి.. పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మార్గం వేయడమే ట్రిపుల్ ఐటీల ముఖ్య ఉద్దేశం. విద్యార్థుల ఎంపిక విధానం ప్రస్తుతం ఆర్జీయూకేటీ పరిధిలో ఏపీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లు మూడు ఉన్నాయి. అవి.. ఆర్.కె.వ్యాలీ (ఇడుపులపాయ-వైఎస్ఆర్ జిల్లా), నూజివీడు (కృష్ణా జిల్లా), బాసర (ఆదిలాబాద్ జిల్లా). ఒక్కో క్యాంపస్‌లో వెయ్యి చొప్పున మొత్తం మూడు వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులకు నిబంధనల మేరకు నిర్దిష్ట సంఖ్యలో సీట్లను రిజర్వ్ చేస్తారు. అంతేకాకుండా 5 శాతం అదనపు సీట్లను ఇతర రాష్ట్రాల్లోని విద్యార్థులకు, గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న భారతీయుల పిల్లలకు, అంతర్జాతీయ విద్యార్థులకు కేటాయిస్తున్నారు. అలాంటి అభ్యర్థులు పదో తరగతి తత్సమాన కోర్సులో కనీసం 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. అంతేకాకుండా వార్షిక ఫీజు రూ.1.36 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. లోకల్, అన్ రిజర్వ్డ్ గతంలో రాష్ట్ర స్థాయిలో అన్ని మండలాల్లోని టాపర్లను మాత్రమే ఎంపిక చేస్తుండేవారు. కానీ, హైకోర్టు ఆదేశాల మేరకు పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అందరికీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు.ఈ క్రమంలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లను స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్లుగా పరిగణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న యూనివర్సిటీ రీజియన్ విధానాన్నే ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్లుగా విభజించి.. ఒక్కో యూనివర్సిటీ రీజియన్‌కు 42:36:22 నిష్పత్తిలో సీట్లు కేటాయిస్తున్నారు. 85 శాతం సీట్లను సంబంధిత యూనివర్సిటీ రీజియన్ లోకల్ విద్యార్థులకు, 15 శాతం సీట్లను ఓపెన్ కాంపిటీషన్లో అన్ రిజర్వ్డ్ కేటగిరీలో భర్తీ చేస్తున్నారు. ‘ప్రభుత్వ’ విద్యార్థులకు డిప్రవేషన్ స్కోర్ ప్రభుత్వ పాఠశాలలతో పోల్చితే పదో తరగతిలో ప్రైవేటు విద్యార్థులకే అధిక మార్కులు వస్తున్నాయి. దీంతో ట్రిపుల్ ఐటీల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆశించినంతగా అవకాశం లభించట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాఠశాలల (మున్సిపల్, జెడ్పీపీ, గురుకుల సహా) విద్యార్థులకు వారు పొందిన మార్కులకు అదనంగా 0.4 జీపీఏ కలిపి మెరిట్ జాబితా రూపొందిస్తున్నారు. ఈ డిప్రవేషన్ విషయంలో ఎలాంటి రిజర్వేషన్ నిబంధనలు లేవు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన అన్ని సామాజిక వర్గాల వారికి డిప్రవేషన్ స్కోర్ విధానం అమలు చేస్తున్నారు. మెరిట్ జాబితా రూపకల్పన మెరిట్ జాబితా రూపొందించే విషయంలో ప్రథమంగా పరిగణనలోకి తీసుకునే అంశం- విద్యార్థి పొందిన జీపీఏ, రిజర్వేషన్ కేటగిరీ. ఒకవేళ ఒకరి కంటే ఎక్కువ మంది విద్యార్థులకు జీపీఏ స్కోర్ సమానంగా ఉంటే.. కొన్ని ప్రాథమ్యాల ఆధారంగా వారిని ఎంపిక చేస్తున్నారు. అవి.. తొలుత మ్యాథమెటిక్స్‌లో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థి.. ఇందులోనూ మార్కులు సమానంగా ఉంటే ఫిజిక్స్‌లో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థి .. అది కూడా సమానంగా ఉంటే కెమిస్ట్రీలో అత్యధిక మార్కులు, ఆ తర్వాత ఇంగ్లిష్‌లో అత్యధిక మార్కులు ఇలా అన్ని సబ్జెక్టుల్లోనూ సమానంగా ఉంటే.. వయసును పరిగణనలోకి తీసుకుని ఎక్కువ వయసున్న అభ్యర్థికి అవకాశం కల్పిస్తున్నారు. ఆర్థిక చేయూత ఏపీ ట్రిపుల్ ఐటీల ప్రధాన లక్ష్యం.. పేద విద్యార్థులకు చక్కటి భవితను అందించడం. ప్రతిభావంతులైన ఏ విద్యార్థి కూడా అవకాశం కోల్పోకూడదనే ఉద్దేశంతో ఆర్థిక చేయూత కూడా అందిస్తున్నారు. సామాజిక వర్గ నేపథ్యంతో సంబంధం లేకుండా.. కుటుంబ వార్షికాదాయం రూ. లక్షలోపు ఉంటే.. ఎలాంటి ట్యూషన్ ఫీజు చెల్లించక్కర్లేదు. కేవలం రూ. 3వేలు కాషన్ డిపాజిట్ చెలిస్తే సరిపోతుంది. ఇది కూడా కోర్సు పూర్తయ్యాక తిరిగి ఇచ్చేస్తున్నారు. కుటుంబ వార్షికాదాయం రూ.లక్ష దాటిన విద్యార్థులు ఏడాదికి రూ. 36 వేల ట్యూషన్ ఫీజు చెల్లించాలి. కేవలం ట్యూషన్ ఫీజునే వసూలు చేస్తున్నారు. మిగతా అన్ని సదుపాయాలు (వసతి, భోజనం తదితర) ఉచితంగా అందిస్తున్నారు. కోర్సు స్వరూపం ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్‌గా పేర్కొంటున్న కోర్సు స్వరూపం రెండు రకాలు. అవి.. ప్రీ యూనివర్సిటీ సర్టిఫికెట్.. బీటెక్. కోర్సు మొదటి రెండేళ్లు ఇంటర్మీడియెట్‌కు సమానమైన ప్రీ యూనివర్సిటీ కోర్సు బోధన సాగుతుంది. ఇందులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్‌సెన్సైస్(ఎంపీసీ, బైపీసీకి సమానం)వంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. రెండేళ్లు పూర్తి చేసుకుని వేరే అవకాశం వచ్చి బయటకి వెళతామనే విద్యార్థులకు పీయూసీ సర్టిఫికెట్ ఇస్తారు. పీయూసీ తర్వాత మూడో ఏడాది నుంచి నాలుగేళ్ల బీటెక్ కోర్సు మొదలవుతుంది. ప్రస్తుతం ఆరు బ్రాంచ్‌లు (సివిల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, మెకానికల్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ సైన్స్) అందుబాటులో ఉన్నాయి. ఒక మేజర్, ఒక మైనర్ మూడో ఏడాది నుంచి ప్రారంభమయ్యే బీటెక్ కోర్సులో.. అందుబాటులో ఉన్న ఆరు బ్రాంచ్‌లలో ఒక బ్రాంచ్‌ను మేజర్ సబ్జెక్ట్‌గా ఎంచుకోవాలి. దీంతోపాటు ఇంటర్-డిసిప్లినరీ స్కిల్స్ అలవడాలనే లక్ష్యంతో మరో సబ్జెక్ట్‌ను మైనర్ సబ్జెక్ట్‌గా ఎంచుకోవాలనే నిబంధన విధించారు. ఈ క్రమంలో ఇంజనీరింగ్, సెన్సైస్, మేనేజ్మెంట్, హ్యుమానిటీస్, క్లాసికల్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ వంటి సబ్జెక్టులను మైనర్ సబ్జెక్టులుగా అందిస్తున్నారు. విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్ట్‌ను మైనర్ సబ్జెక్ట్‌గా ఎంచుకోవచ్చు. ఈ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్న ఏకైక యూనివర్సిటీ ఇదే. దీనివల్ల విద్యార్థికి ఇంటర్-డిసిప్లినరీ స్కిల్స్ లభిస్తాయి. ఫలితంగా కోర్ బ్రాంచ్‌లోనే కాకుండా.. ఇతర విభాగాల్లోనూ అవకాశాలు పొందొచ్చు. ఉదాహరణకు మెకానికల్‌ను మేజర్‌గా.. ఎలక్ట్రానిక్స్‌ను మైనర్‌గా ఎంచుకున్న విద్యార్థి మెకానికల్‌తోపాటు మెకట్రానిక్స్లోనూ రాణిస్తారు. ఇంటర్న్‌షిప్.. కంపల్సరీ ఏపీ ట్రిపుల్ ఐటీల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో మరో ప్రత్యేకత ఇంటర్న్‌షిప్. దీన్ని కరిక్యులంలో అంతర్భాగంగా రూపొందించారు. బీటెక్ మూడో ఏడాది పూర్తయ్యాక వేసవి సెలవుల సమయంలో రెండు, మూడు నెలల వ్యవధిలో ఈ ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు వైజాగ్ స్టీల్ ప్లాంట్, బీఎస్ఎన్ఎల్, ట్రాన్స్‌కో, జెన్కో, సీఎస్ఐఆర్ ల్యాబ్స్, ప్రభుత్వ నీటి పారుదల శాఖ తదితర అనేక సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. ప్రముఖ సంస్థల ఫ్యాకల్టీతో గెస్ట్ లెక్చర్స్ విద్యార్థులకు ఇక్కడి స్థానిక బోధన సిబ్బంది ఇచ్చే శిక్షణతోపాటు దేశంలోనే ప్రముఖ ఇన్స్టిట్యూట్లుగా పేరుగడించిన ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర దేశాల్లోని ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లకు చెందిన ఫ్యాకల్టీతో గెస్ట్ లెక్చర్స్ సదుపాయం కల్పిస్తున్నారు. ఇలా.. అన్ని విధాలుగా నిరంతర లెర్నింగ్ విధానాన్ని అమలు చేస్తూ.. విద్యార్థులు అకడెమిక్ స్కిల్స్ పెంపొందించుకునేలా కృషి చేస్తున్నారు. అన్ని నియంత్రణ సంస్థల గుర్తింపు ఆర్జీయూకేటీ అందిస్తున్న ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుకు ప్రభుత్వ గుర్తింపుతోపాటు ఏఐసీటీఈ, యూజీసీ వంటి నియంత్రణ సంస్థల గుర్తింపు కూడా లభించింది. అంతేకాకుండా ఆరేళ్ల కోర్సులో మొదటి రెండేళ్లు ప్రీ యూనివర్సిటీ కోర్సు పేరుతో బోధించే కోర్సుకు కూడా ఇంటర్మీడియెట్‌కు సమానమైన గుర్తింపును ఇంటర్ బోర్డ్ ఇచ్చింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: మే 21, 2014. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 16, 2014 (రాత్రి 8 గంటల వరకు). {పింట్ అవుట్ తీసుకున్న దరఖాస్తు అందజేయడానికి చివరి తేదీ: జూన్ 21, 2014 (సాయంత్రం ఐదు గంటల వరకు). కౌన్సెలింగ్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: జూలై 7, 2014. కౌన్సెలింగ్: జూలై 23, 24, 2014. తరగతుల ప్రారంభం: జూలై 28, 2014 వివరాలకు వెబ్సైట్: www.rgukt.in ఉత్తమ బోధనా సిబ్బందితో నాణ్యమైన విద్య ఇప్పుడు అన్ని వసతులూ ఉన్న కాలేజీలో నచ్చిన బ్రాంచ్‌లో సీటు పొందాలంటే హై ప్రొఫైల్ కోచింగ్ తప్పనిసరిగా ఉండాలన్న భావన ఉంది. ఇలాంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ఇంజనీరింగ్ విద్యకు దూరం చేస్తోంది. ఈ తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత ఇంజనీరింగ్ విద్యను అందించాలన్న గొప్ప ఆశయంతో ట్రిపుల్ ఐటీలను నెలకొల్పారు. ఎలాంటి ఎంట్రన్స్‌లు లేకుండా పదో తరగతిలో చూపిన జీపీఏతో ప్రవేశాలు కల్పిస్తున్నాం. ట్రిపుల్ ఐటీల్లో బోధనా సిబ్బంది నియామకం విషయంలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్నాం. దేశ వ్యాప్తంగా పర్యటించి ఐఐటీ వంటి ఉన్నత విద్యా సంస్థల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్లు నిర్వహించి ఫ్యాకల్టీని తీసుకుంటున్నాం. ఐఐటీ స్థాయి సౌకర్యాలు, ల్యాబ్‌లు, కరిక్యులం.. ట్రిపుల్ ఐటీల ప్రత్యేకత. వీడియో లెక్చర్స్, పుస్తక పఠనం, సమస్యా పరిష్కార నైపుణ్యాల పెంపుదలకు ప్రత్యేక విధానాలు, చేయడం ద్వారా నేర్చుకునే (లెర్నింగ్ బై డూయింగ్) బోధనా పద్ధతులు వంటివన్నీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులను మెరికలుగా తీర్చిదిద్దేవే. - ప్రొఫెసర్ ఆర్.వి.రాజకుమార్, వైస్ ఛాన్సలర్, ఆర్జీయూకేటీ. -
ప్రవేశానికి వేళాయె!
ట్రిపుల్‌ఐటీలో ప్రవేశానికి నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ఆన్లైన్ దరఖాస్తుల గడువు జూన్ 16 పోస్టల్ దరఖాస్తులకు జూన్ 21 జూలై 23, 24 తేదీల్లో కౌన్సెలింగ్ జూలై 28 నుంచి తరగతులు గ్రామీణ విద్యార్థులకు పెద్దపీట నూజివీడు, న్యూస్‌లైన్ : ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం బుధవారం ప్రారంభం కానుంది. రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ(ఆర్కే వ్యాలీ), బాసర ట్రిపుల్ ఐటీలలో 2014-15 విద్యాసంవత్సర ప్రవేశాలకు విశ్వవిద్యాలయ కులపతి రాజ్‌కుమార్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో దరఖాస్తుల స్వీకరణకు రంగం సిద్ధమైంది. ఆరు సంవత్సరాల సమీకృత బీటెక్ డిగ్రీ కోర్సుకు సంబంధించి మొదటి సంవత్సరంలో చేరేందుకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పదోతరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు జూన్ 16 (రాత్రి 8 గంటల వరకు) ఆఖరు తేదీ కాగా, ముద్రిత దరఖాస్తులను జూన్ 21వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు విశ్వవిద్యాలయానికి పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు అయిన రూ.150 చెల్లించినట్లుగా తెలిపే బ్యాంక్ చలానా గాని, ఏపీ ఆన్లైన్ రసీదు గాని జతచేయాలి. పదోతరగతికి సంబంధించిన మార్కుల జాబితాను, హాల్‌టికెట్లను కూడా జతచేసి పంపాలి. దరఖాస్తు చేసుకున్నవారిలో ఎంపిక చేసిన జాబితాను జూలై ఎనిమిదిన ప్రకటిస్తారు. జూలై 23, 24 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. 27న వెయిటింగ్ జాబితాలో వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, జూలై 28 నుంచి తరగతులు ప్రారంభిస్తారు. సీట్ల కేటాయింపు జరిగేదిలా... రాష్ట్రంలోని మూడు ట్రిపుల్ ఐటీలకు కేటాయించిన మూడువేల సీట్లలో రెండు శాతం మాజీ సైనిక ఉద్యోగుల (కాప్) పిల్లలకు కేటాయిస్తారు. వికలాంగులకు మూడు శాతం, ఎన్సీసీ కోటా కింద ఒక శాతం, స్పోర్ట్స్ కోటా కింద 0.05 శాతం చొప్పున కేటాయించనున్నారు. నాలుగు కేటగిరీలకు కలిపి మొత్తం 195 సీట్లు పోగా మిగిలిన 2,805 సీట్లలో ఓపెన్ కేటగిరీ కింద 15 శాతం అంటే 421 సీట్లు కేటాయిస్తారు. మిగిలిన 2,384 సీట్లలో ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంతానికి 1001 (42 శాతం) సీట్లు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతానికి 858 (36 శాతం) సీట్లు, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ ప్రాంతానికి 525 (22 శాతం) సీట్లు కేటాయించారు. -
ప్రజల మనసుల్లో విజయుప్రస్థానం
‘మాట తప్పను.. మడమ తిప్పను’... మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సిద్ధాంతమిది. ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ కూడా అదే ఆచరించి చూపారు. వారంలో సోమ, మంగళ, బుధవారాలు ప్రజలకు అందుబాటులో ఉంటానని పులివెందుల ఉప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు. మిగిలిన రోజుల్లోనూ ప్రజలతో వుమేకవుయ్యూరు. ప్రజా సంక్షేవూనికి పాటుపడటంలో వైఎస్ కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని, అంకిత భావం.. చిత్తశుద్ధితో పనిచేస్తుందని మరోసారి నిరూపించారు. ప్రస్తుతం విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె ‘విజయం’... విశాఖ పురోభివృద్ధికి బాటలు వేస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. విజయభేరి మోగించాలని ఉవ్విళ్లూరుతున్నారు. - న్యూస్‌లైన్, పులివెందుల - విజయమ్మ రాకతో విశాఖ పురోభివృద్ధి తధ్యం - విశాఖ లోక్‌సభ నియోజకవర్గ ఓటర్ల విశ్వాసం - విజయ ఢంకా మోగించాలని ఆకాంక్ష ఆకట్టుకునే ప్రసంగం... ఆమె సొంతం వైఎస్ విజయమ్మ ప్రసంగంలో సహజత్వం ఉంటుంది. జనం భాషలో అద్భుతంగా వూట్లాడతారు. 2012 మార్చి 12న పులివెందులలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం, 2011 డిసెంబర్ 6న శాసనసభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా, 2011 జూలై 8, 9 తేదీల్లో ఇడుపులపాయలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశాల్లో వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు హోదాలో విజయమ్మ ప్రసంగం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. సమస్యలపై అధికారులకు 32 వేలకు పైగా ఉత్తరాలు పులివెందులలోని కార్యాలయంలో విజయువ్ము ఈ వుూడేళ్లలో 1.41 లక్షల మంది సవుస్యలను విన్నారు. వాటి పరిష్కారం కోసం 32 వేలకు పైగా ఉత్తరాలను అధికారులకు రాశారు. వురికొన్ని సమస్యలను అప్పటికప్పుడే ఫోన్లో తెలియుజేసి పరిష్కరించారు. పులివెందుల నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాలప్రజల సవుస్యల పరిష్కారానికి కూడా కృషి చేశారు. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామాల్లోనూ పర్యటించారు. కొన్ని గ్రావూలకు రెండు, మూడుసార్లు కూడా వెళ్లారు. మొత్తం 535 కార్యక్రమాలలో ఆమె పాల్గొన్నారు. ఈ వూడేళ్లలో దాదాపు 480 రోజులు పులివెందులలోనే గడిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అదనపు తరగతి గదులు, మినరల్ వాటర్ ప్లాంటు, అంగన్వాడీ భవనాలు, పంచాయతీ కార్యాలయాలు... ఇలా అనేక ప్రారంభోత్సవాల్లో విజయమ్మ పాల్గొన్నారు. వుహిళలకు పావలా వడ్డీ, విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ చేపట్టారు. వేముల, సింహాద్రిపురం, లింగాల, తొండూరు మండలాల్లో ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు పరిహారం పంపిణీ చేశారు. వందలాది పెళ్లిళ్లకు హాజరై.. నూతన దంపతులను ఆశీర్వదించారు. గృహ ప్రవేశాలు, ఇతర కార్యాలకు ప్రజలు పిలిచిన వెంటనే వెళ్లారు. ఎక్కడైనా ప్రవూదాలు జరిగితే వెంటనే స్పందిస్తుంటారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స కోసం కృషి చేస్తుంటారు. అందువల్లే విజయువ్మును తవు కుటుంబ సభ్యురాలిగా భావిస్తుంటావుని పులివెందుల నియోజకవర్గ ప్రజలు చెబుతారు. విజయమ్మ చొరవతో 755 ట్రాన్స్ఫార్మర్లు మంజూరు నియోజకవర్గంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కొరత తీవ్రంగా ఉండేది. విజయువ్ము ప్రత్యేక చొరవ చూపి ట్రాన్స్‌కో సీఎండీ, కలెక్టర్, ఇతర అధికారులతో మాట్లాడి 755 ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేరుుంచారు. దీంతో రైతులు హారుగా పంటలు పండించుకోగలుగుతున్నారు. కష్టాల్లో ఉన్నా.. ప్రజలను మరవలేదు వైఎస్ కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా విజయువ్ము పులివెందుల ప్రజల సంక్షేవూన్ని విస్మరించలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీబీఐ అక్రమంగా అరెస్టు చేయుడంతో ఉప ఎన్నికలలో విజయమ్మ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి వచ్చింది. అప్పుడు కూడా పులివెందుల ప్రజలను వురవలేదు. ఒకవైపు కొడుకు జైల్లో ఉన్న బాధను దిగమింగుకుంటూనే..వురోవైపు పులివెందుల ప్రజల కష్టసుఖాలలో పాలు పంచుకున్నారు. రైతుల సంక్షేవుంపై దృష్టి అన్నదాతల సంక్షేవుంపై విజయువ్ము ప్రత్యేక దృష్టి పెట్టారు. పులివెందుల నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు వీలుగా చేపట్టిన ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వస్తున్నారు. చిత్రావతి ప్రాజెక్టుతో పాటు లింగాల కుడికాలువ, గండికోట, పైడిపాలెం, సీబీఆర్ ఎత్తిపోతల పైపులైన్ పనులు తదితర ప్రాజెక్టులను ఆమె పరిశీలించారు. సూక్ష్మనీటి సేద్యం పనుల పురోగతిపైనా దృష్టి పెట్టారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ)కు నీటిని సక్రవుంగా విడుదల చేయుకపోవడంతో 2011 డిసెంబర్ 20న చిత్రావతి ప్రాజెక్టు వద్ద దీక్ష చేపట్టారు. అధికారులు దిగొచ్చి.. సవుస్య పరిష్కరించే దాకా దీక్ష కొనసాగించారు. పులివెందుల మునిసిపాలిటీకి తాగునీటి విషయమై కూడా అధికారులతో పలుమార్లు చర్చించారు. 2012లో తీవ్ర వర్షాభావం వల్ల చీనీచెట్లు ఎండిపోరునప్పుడు, పెనుగాలులతో లింగాల, చక్రాయపేట మండలాల్లో అరటి, మామిడి తోటలు దెబ్బతిన్నప్పుడు విజయువ్ము యుద్ధప్రాతిపదికన స్పందించారు. క్షేత్రస్థారులో పంటల నష్టాన్ని పరిశీలించడమే కాకుండా రైతులకు నష్టపరిహారం కోసం అధికారులకు, ప్రభుత్వానికి పదుల సంఖ్యలో లేఖలు రాశారు. స్వయుంగానూ విన్నవించారు. 2012లో జూన్‌లో వర్షాలు అధికంగా కురిసి తొండూరు, ఎర్రిపల్లె, పాలూరు తదితర చెరువు కట్టలు తెగిపోయూరుు. వాటికి దగ్గరుండి మరమ్మతులు చేయించారు. మందుల కొనుగోలుకు వేతనం విరాళం పులివెందుల, వేంపల్లెలోని ఆస్పత్రి అభివద్ధి కమిటీ సమావేశాలకు ప్రతిసారి హాజరవుతున్న ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఆ ఆస్పత్రుల్లో మందుల కొరత తీర్చేందుకు తనకు నెలనెలా వచ్చే వేతనాన్ని అందజేస్తున్నారు. గతంలో పులివెందుల ఏరియా ఆస్పత్రిలో డెంగీ కిట్లు లేకపోవడంతో తన వేతనంతో కొనుగోలు చేసి అందించారు. నియోజకవర్గంలోని పీహెచ్‌సీల్లో మందుల కొనుగోలుకు కూడా సాయుం చేస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళన రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విజయమ్మ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. అనేక ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొన్నారు. 2012లో చీనీ రైతుల సవుస్యలు, కరెంటు కోతలు, చార్జీలపై ఉద్యమించారు. పులివెందుల నియోజకవర్గంలోని యూసీఐఎల్, ట్రిపుల్ ఐటీ, ఎర్రగుంట్ల సమీపంలోని ఆర్టీపీపీ, ఇందిరా క్రాంతి పథకం ఉద్యోగులు, కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేశారు.