![CM Jagan gives nod for 3 295 Posts For Universities Triple ITs - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/3/CM-Jagan-gives-nod-for-3-295-Posts.jpg.webp?itok=D7L5fH1W)
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లోని వర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో భారీ రిక్రూట్‌మెంట్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 3,295 పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్సిటీల్లో రెగ్యులర్ సిబ్బంది నియామకానికి ఆమోదం తెలిపింది జగన్ ప్రభుత్వం. నవంబర్ 15 నాటికి నియామక ప్రక్రియ మొత్తం పూర్తి కానుంది. ఈ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.
యూనివర్సిటీల్లో 2,635 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు
ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టులు
ఉన్నత విద్యాశాఖలో అత్యున్నత ప్రమాణాల కల్పనలో భాగంగా.. ఇప్పటికే ప్రపంచస్థాయి కరిక్యులమ్ ఏర్పాటు దిశగా సన్నాహాలు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖలో 51 వేల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment