వేంపల్లె: ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత ప్రవేశాల కౌన్సెలింగ్ శనివారం ముగిసిందని ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కె.సంధ్యారాణి తెలిపారు. మొత్తం 1,086 మందికి గాను 904 మంది విద్యార్థులు మొదటి విడతలో ప్రవేశాలు పొందారని పేర్కొన్నారు. మిగిలిన 182 సీట్లు రెండవ విడతలో పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఈ నెల 24, 25వ తేదీల్లో ఇడుపులపాయలోని ఆర్‌కే వ్యాలీ క్యాంపస్‌లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ జరుగుతుందని తెలిపారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఆగస్ట్ మొదటి వారంలో తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment