
నూజివీడు: ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 2024–25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు ఈ నెల 22 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ నేతృత్వంలో కౌన్సెలింగ్ జరగనుంది.
ఈ నెల 22, 23 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లోను, 24, 25 తేదీల్లో ఒంగోలు ట్రిపుల్ ఐటీకి ఎంపికైన అభ్యర్థులకు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలోను, 26, 27 తేదీల్లో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి ఎంపికైన అభ్యర్థులకు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ జరగనుంది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment